సహాయం అవసరం లేని ప్రపంచం కోసం కృషి చేద్దాం! సహాయం అవసరం లేని ప్రపంచం కోసం కృషి చేద్దాం! - పల్లె ప్రపంచం అధ్యక్షులు పల్లా కొండల రావు సహాయం అవసరం లేని సమాజం కోసం అందరూ కలసికట్టుగా కృషి చేయాలని పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు తెలిపారు. సోమవారం చిరునోముల ఉన్నత పాఠశాలలో దృష్టిలోపం ఉన్న బాలికలకు పల్లె ప్రపంచం ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో కళ్ళజోళ్ళ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో కొండల రావు మాట్లాడుతూ పిల్లలకు చిన్నతనం నుండే పోషకాహరంపై అవగాహన కల్పించాలన్నారు. విద్యార్ధులలో శాస్త్రీయ ధృక్పథం పెంపొందించేందుకు, సామాజిక అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రకృతి జీవన విధానాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరించడం ద్వారా పిల్లలకు సరయిన, సమతుల ఆహారాన్ని అందించవచ్చన్నారు.ప్రభుత్వ పాఠశాలలలో చదివిన విద్యార్ధులే సామాజిక బాధ్యతతో , మానసిక స్థైర్యంతో ఎదుగుతున్నారన్నారు. ప్రభుత్వ విద్యను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉన్నదన్నారు. పేదరికం ఉండి మరొకరు సహాయం అందించాల్సిన అవసరం లేని సమాజం కోసం పల్లె ప్రపంచం కృషి చేస్తుందని తెలిపారు. ఈ సభలో 14 మంది విద్యార్ధులకు 7000 విలువ జేసే కళ్లజోళ్లను పంపిణీ చేశారు. సభలో చిరునోముల గ్రామ సర్పంచ్ శాఖమూరి రాజశేఖర్, ఫౌండేషన్ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, ఉపాధ్యక్షులు యడ్లపల్లి నరసిమ్హా రావు, సభ్యులు చలమల అజయ్ కుమార్, సురభి వెంకటేశ్వర రావు, జన విజ్ఞానవేదిక జిల్లా ఉపాధ్యక్షులు సీతారామారావు, పాఠశాల ఉపాద్యయినీ, ఉపాధాయులు, విద్యార్దులు పాల్గొన్నారు. News Clippings 29-12-2015 andhra bhumi 29-12-2015 andhrjyothy 29-12-2015 eenadu 29-12-2015 namaste telangana 29-12-2015 navatelangana ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి సహాయం అవసరం లేని ప్రపంచం కోసం కృషి చేద్దాం! సహాయం అవసరం లేని ప్రపంచం కోసం కృషి చేద్దాం! - పల్లె ప్రపంచం అధ్యక్షులు పల్లా కొండల రావు ... Read more »