----------------------------------
అంశం - 'వితండవాదం' పదం అర్ధం తెలుసుకోవడం
పదం పంపిన వారు - పల్లా కొండల రావు
----------------------------------
వితండ వాదం అని మనం నిత్యం వాడేది విమర్శన ధోరణిలో. అసలు ఈ పదం అర్ధం మాత్రం అది కాదని, ఒక వాదనలో ఎదుటివారు వాదనలో తప్పు ఉంటే మన వివరణ ఇవ్వకముందే , ముందు ఆ వాదనలో తప్పుని ఎత్తి చూపడం వితండం అని ఒక మిత్రుడు చెప్పారు. దీనికి సంబంధించి మరింత లేదా సరైన వివరణ కోసం ఇక్కడ ఈ పదాన్ని తెలుగు-వెలుగు శీర్షికలో ఉంచడం జరిగింది. తెలిసిన వారు వివరింపగలరని విజ్ఞప్తి.
వితండవాదం అనే పదానికి సరైన వివరణ ఏమిటి?
సాధారణంగా మనం ఈ పదాన్ని సరైన అర్ధంలోనే వాడుతున్నామా?
-----------------------------------------------------
*Re-published
వితండం అంటే ఏనుగు. వితండవాదం అంటే ఏనుగులా అరవడం. బోడిగుండుకి మోకాలితో ముడి పెడుతూ మాట్లాడేవాళ్ళు ఏనుగులా అరుస్తారు కనుక దానికి వితండవాదం అని పేరు వచ్చింది.
ReplyDeleteమనం సాధారణంగా అలా అనుకుని వితండం అంటే బోడిగుండుకు మోకాలుకు లింకు పెట్టి అడ్డదిడ్డంగా వాదించడం అనుకుంటున్నాము. ఆ అర్ధంలోనే ఆ పద ప్రయోగం చేస్తున్నాము. కానీ ప్రశ్నోపనిషత్ లో వాదములలో మూడు రకాలలో వితండం అనేది ఒక పద్ధతి. ఇద్దరి మధ్య సంవాదం జరుగుతున్నపుడు. ఒక వ్యక్తి వాదన ప్రతిపాదనలోనే తప్పు ఉందనుకోండి. అవతలి వ్యక్తి వాదనలో తన సమాధానం చెప్పకముందు ఇవతలి వ్యక్తి వాద ప్రతిపాదనలోని లోపాన్ని ఎత్తి చూపడం ను వితండం అంటారు. అంటే ఇది అడ్డదిడ్డమైన వాదన కాదు. వాదన సందర్భంగా ప్రతిపాదనలోని తప్పులను అడ్డుకోవడం అన్నమాటు. నాకు పూర్తిగా తెలీదు. నిన్ననే ఒకరు చెప్పారు బాగా తెలిసినవారు ఉదాహరణలతో వివరించగలరని ఆశిస్తున్నాను.
Deleteదానికి ఏనుగు పేరు పెట్టారు కనుక జనం దాన్ని ఏనుగు రోదన లాంటి వాదన అనుకునే అవకాశమే ఎక్కువ.
ReplyDelete