మీకు "ఱ" పలకడం వచ్చా? తెలుగువాళ్ళలో చాలా మంది "ర" & "ఱ"లని ఒకేలా పలుకుతుంటారు. సంస్కృతంలో "ఱ" ఉండదు, ఇంగ్లిష్లో కూడా "ఱ" ఉండదు. సంస్కృత, ఇంగ్లిష్ ప్రభావాల వల్ల మనలో చాలా మంది "ఱ" ఎలా పలకాలో మర్చిపోయారు. "ఱ" ధ్వని కొంత వరకు కంఠ్య ధ్వనిలా ఉంటుంది. ఫ్రెంచ్ భాషలో "r" పలకగలిగితే తెలుగులో "ఱ" కూడా పలకగలం. తమిళులు ద్విరుక్తాక్షరం పలికేటప్పుడు "ఱ"ని "ట్ర"లాగ పలుకుతారు, నాసిక్యం పక్కన పలికేటప్పుడు దాన్ని "డ్ర"లాగ పలుకుతారు. ఉదాహరణకి వాళ్ళు ఒణ్ఱు (ఒకటి)ని ఒణ్డ్రు అని పలుకుతారు, పణ్ఱి (పంది)ని పణ్డ్రి అని పలుకుతారు. కాకతీయుల రాజధానికి ఒకప్పుడు ఓఱుగల్లు అని పేరు ఉండేది. ఓఱు అంటే ఒకటి, గల్లు అంటే శిల. ఓఱుగల్లు అంటే ఏకశిల. క్రమంగా అది ఒరుగల్లు, వరంగల్లుగా మారింది. తెలుగులో ఇలా చాలా పదాల్లో "ఱ"ని "ర"గా మార్చేసాం. - By Praveen Kumar మీకు "ఱ" పలకడం వచ్చా? తెలుగువాళ్ళలో చాలా మంది "ర" & "ఱ"లని ఒకేలా పలుకుతుంటారు. సంస్కృతంలో "ఱ" ఉండదు, ఇంగ్లిష్లో కూడా ... Read more »