తెలుగువాళ్ళలో చాలా మంది "ర" & "ఱ"లని ఒకేలా పలుకుతుంటారు. సంస్కృతంలో "ఱ" ఉండదు, ఇంగ్లిష్‌లో కూడా "ఱ" ఉండదు. సంస్కృత, ఇంగ్లిష్ ప్రభావాల వల్ల మనలో చాలా మంది "ఱ" ఎలా పలకాలో మర్చిపోయారు. "ఱ" ధ్వని కొంత వరకు కంఠ్య ధ్వనిలా ఉంటుంది. ఫ్రెంచ్ భాషలో "r" పలకగలిగితే తెలుగులో "ఱ" కూడా పలకగలం. తమిళులు ద్విరుక్తాక్షరం పలికేటప్పుడు "ఱ"ని "ట్ర"లాగ పలుకుతారు, నాసిక్యం పక్కన పలికేటప్పుడు దాన్ని "డ్ర"లాగ పలుకుతారు. ఉదాహరణకి వాళ్ళు ఒణ్ఱు (ఒకటి)ని ఒణ్డ్రు అని పలుకుతారు, పణ్ఱి (పంది)ని పణ్డ్రి అని పలుకుతారు. కాకతీయుల రాజధానికి ఒకప్పుడు ఓఱుగల్లు అని పేరు ఉండేది. ఓఱు అంటే ఒకటి, గల్లు అంటే శిల. ఓఱుగల్లు అంటే ఏకశిల. క్రమంగా అది ఒరుగల్లు, వరంగల్‌లుగా మారింది. తెలుగులో ఇలా చాలా పదాల్లో "ఱ"ని "ర"గా మార్చేసాం.
- By Praveen Kumar Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
ReplyDelete>> మీకు "ఱ" పలకడం వచ్చా ?
వచ్చు ! బండి ర !
జిలేబి
జిలేబి గారు తమాషాకి చెప్పినా లోతైన భావంతోనే చెప్పారు!
Deleteనా ఉద్దేశంలో "బండిర" అని పలుకుతూ చిన్నప్పుడు నేర్చుకుని దాన్ని "బండిర" గానే వదిలేస్తున్నాం. మిగతా అన్ని అవసరాలకూ "ర"ని మాత్రమే వాడుతున్నాం.
చిన్నప్పుడు "బండిర" అని ఎందుకు నేర్పిస్తారూ అంటే, దాన్ని సరిగ్గా ("ర" కన్నా భిన్నంగా) పలకడం మాష్టారికే రాదు. నేర్పించడం అంతకన్నా చేతకాదు కాబట్టి. లేకపోయుంటే అన్ని అక్షరాల మాదిరిగా అక్షర శబ్దాన్నే పేరుగా వాడే వారు. అళా, ఇణ్యా, ఇణీ, అణా, బండిరా ఇవన్నీ అలా తెచ్చుకున్న కష్టాలే అని నా అభిప్రాయం.
"ఞ, ణ, న, మ" మొదటి నుంచి ద్రవిడ భాషల్లో ఉన్నాయి. "నేను"ని మలయాళీయులు ఇప్పటికీ "ఞాన్" అనే అంటారు. "ఱ" మాత్రం మొదట్లో "ద" రూపంలో ఉండేది. అందుకే తమిళులు "పణ్ఱి" అని పలికినా తెలుగువాళ్ళు "పంది" అనే పలకడం జరుగుతోంది.
Deleteతెలుగువాళ్ళలో చాలా మందికి "ఱ" పలకడం రాదు కనుక తెలుగు ద్వారా తమిళం నేర్పించేవాడు మీకు "ట్ర" లేదా "డ్ర" పలకాలని సూచిస్తాడు. "కఱ్ఱుకొళ్ళు" అనే పదాన్ని మీకు "కట్రుకొళ్ళు" అనే పలకాలని చెపుతాడు కానీ "కర్రుకొళ్ళు" అని పలకాలని చెప్పడు. "ఱ" ఉపయోగించే చోట "ర" ఉపయోగిస్తే తమిళులు మిమ్మల్ని విచిత్రంగానే చూస్తారు.
Delete"ల"ని తమిళులు గుండుళగరం అన్నా దాన్ని "ల"గానే పలుకుతారు తప్ప "ళ"గా పలకరు. మన తెలుగువాళ్ళే రెండు భిన్న ధ్వనులని homophonesగా చూస్తారు.
Delete"ఱ" ఒకప్పుడు ద్రవిడ భాషల్లో లేదు. పందిని తమిళులు "పణ్ఱి" అన్నా అది తెలుగులో తిరిగి తన పాత pronunciation రూపమైన "పంది"గానే ఉంది.
ReplyDeleteశతధా సహస్రధా,సహస్రధా లక్షధా,లక్షధా కోటిధా అని అరిభీకరంగా దుస్టసమాసాల్ని నలిపేసిన నం.తా.రా కి జ్ఞ పలకదం రాదు?నేను మొదటిసారి దా.వీ.శూ చాలా చిన్నప్పుడు చ్హొసి సల్యుడికి హితబోధ చేసే డవిలాగులో "కృతజ్ఞత","కృతఘ్నత" రెండూ ఒక్కలాగే విని కృతఘ్నతే పుణ్యమూ కృతఘ్నతే పాపమూనా అని నిర్ఘాంత పోయా!తర్వాత సినిమా పత్రికల్లో సహాయ దర్శకుడొకరు సరిదిద్దబోతే "మేమూ అదే అంటున్నాంగా బ్రదర్?" అనేసరికి పిల్లి ముందు యెలకలా నోర్మూసుకున్నాడని చదివాను,యేం చెప్తాం?కొన్ని మాటలూ అక్షరాలూ పలకాలంటే సాధనా,సత్తువా,శ్రధ్ధా,సబూరి లాంటివి వుండాలేమో?!
ReplyDeleteఒడియాలో సున్నా ఉన్నప్పటికీ వాళ్ళు అంజలి పేరు "అఞ్జలి" అనే వ్రాస్తారు. మన తెలుగులోనే నాసిక్యం ఉపయోగించాల్సిన చోట్ల సున్నా అలవాటుగా పెట్టడం కనిపిస్తోంది. అందుకే తెలుగువాళ్ళలో చాలా మంది "ఞ"ని "న"గా పలకడం జరుగుతోంది.
ReplyDeleteశతధా సహస్రధా,సహస్రధా లక్షధా,లక్షధా కోటిధా అని అరిభీకరంగా దుస్టసమాసాల్ని నలిపేసిన నం.తా.రా కి జ్ఞ పలకదం రాదు?నేను మొదటిసారి దా.వీ.శూ చాలా చిన్నప్పుడు చ్హొసి సల్యుడికి హితబోధ చేసే డవిలాగులో "కృతజ్ఞత","కృతఘ్నత" రెండూ ఒక్కలాగే విని కృతఘ్నతే పుణ్యమూ కృతఘ్నతే పాపమూనా అని నిర్ఘాంత పోయా!తర్వాత సినిమా పత్రికల్లో సహాయ దర్శకుడొకరు సరిదిద్దబోతే "మేమూ అదే అంటున్నాంగా బ్రదర్?" అనేసరికి పిల్లి ముందు యెలకలా నోర్మూసుకున్నాడని చదివాను,యేం చెప్తాం?కొన్ని మాటలూ అక్షరాలూ పలకాలంటే సాధనా,సత్తువా,శ్రధ్ధా,సబూరి లాంటివి వుండాలేమో?!
ReplyDeletehttps://db.tt/tJTJ5xWJ
ReplyDeleteఒకప్పుడు తెలుగులో "ఱ" ఇలా వ్రాసేవాళ్ళు.
నల్లగొండ జిల్లాలో "కొండ్రపోల్" అనే గ్రామం ఉంది. తమిళంలో "కుణ్ఱం" అంటే కొండ. ఆ ఊరి పేరు అప్పట్లో "కుణ్ఱప్రోలు" అయ్యుంటుంది. అది ఇప్పటికీ పూర్తి తెలుగు నామంగా రూపాంతరం చెందలేదు. అందుకే అది "కొండప్రోలు" లేదా "కొండపోలు" కాకుండా "కొండ్రపోల్" అయ్యింది.
ReplyDelete>>> అందుకే తమిళులు "పణ్ఱి" అని పలికినా తెలుగువాళ్ళు "పంది" అనే పలకడం జరుగుతోంది.
ReplyDelete>>> చాలా మందికి "ఱ" పలకడం రాదు కనుక తెలుగు ద్వారా తమిళం నేర్పించేవాడు మీకు "ట్ర" లేదా "డ్ర" పలకాలని సూచిస్తాడు.
>>> పందిని తమిళులు "పణ్ఱి" అన్నా అది తెలుగులో తిరిగి తన పాత ప్రొనుంచీతిఒన్ రూపమైన "పంది"గానే ఉంది.
>>> "కుణ్ఱప్రోలు" ... "కొండ్రపోల్" అయ్యింది.
ప్రవీణ్ శ్రమకోర్చి సేకరించిన పై విషయాల వల్ల ఏమి తెలుస్తోంది?
1. మన తెలుగు వారికి ప్రవీణ్ లాంటి ఒకరిద్దరికి తప్ప ఱ సరిగా పలకడం రాదని!
2. ఱ పలక లేక పోతే సందర్భాన్ని శుభ్రంగా ట్ర గానో డ్ర గానో (చివరికి ర గానో) పలుక్కునే వెసులుబాటు కలదని.
ఇంత చారిత్రిక నేపథ్యమూ, వెసులుబాటూ ఉన్న తరవాత, కష్టపడి, శీర్శాసనాలు వేసి ఱ పలకటం అవసరమా? అని ప్రశ్నించుకోవాలి.
కానీ ఎంతైనా తమిళంలో నువ్వు "కఱ్ఱుకొళ్ళు"ని "కర్రుకొళ్ళు" అనలేవు కదా. అలా అంటే "వీడు ఇలా మాట్లాడుతున్నాడేమిటి" అని జనం అనుకుంటారు.
Deleteప్రవీణ్,
Deleteతమిళం వారు ఏం పలుకుతారు, ఏం రాసుకుంటారు అన్నది చూసి తెలుగు భాష వారికి పూర్తిగా అనవసరం. తెలుగు వారి పలుకుబడికి ఏవి అవసరమో, లేదా అనవసరమో అని మాత్రమే చూడాలి. పైన మీరే చెప్పిన ప్రకారం ఱ తెలుగులో ఎవరూ పలకలేకపోవటమే కాదు, కనీసం వాడరని స్పష్టంగా తెలుస్తూనే వుంది. ఈ విషయంపై ఇక వాదన అనవసరం.
"F"ని "Ph"లాగ పలికేవాళ్ళు ఇంగ్లిష్ ఉపాధ్యాయులు అవ్వగా లేనిది "ఱ"ని "ర"లాగ పలికేవాళ్ళు తెలుగు ఉపాధ్యాయిలు అవ్వడం కూడా విచిత్రం కాదు. చదువుల వల్ల యాస మారదనిపిస్తే ఏడాదికి 36,000 రూపాయలు కట్టి పిల్లల్ని పాఠశాలలకి పంపించడం ఎందుకు?
Deleteతమిళులు "ఱ" ఉపయోగించే చోట్ల తెలుగువాళ్ళు "డ, ద, ర"లు ఉపయోగిస్తారు, అరుదుగా "ట" ఉపయోగిస్తారు. నాకు phonetics తెలుసు కాబట్టే కదా ఈ విషయం అర్థమైంది. "ఱ" సంస్కృతంలో ఉండదు కనుక ఇప్పుడు సంస్కృతం కలిపిన తెలుగు మాట్లాడే మనం అది పలకలేకపోవడం జరుగుతోంది. నిజాం కాలంలో అయితే ఉర్దూ మీదియం చదువులే తప్ప సంస్కృతం కూడా లేదు. అందుకే తెలంగాణలో చాలా మంది "ళ" కూడా పలకలేరు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన కిరణ్ కుమార్ రెడ్డి "కళ"ని "కల" అనడానికి కారణం ఇదే.
ReplyDelete
ReplyDeleteఆహా ! బండి 'ర' చక్రం బాగా తిరుగు తున్నట్టు ఉన్నదే ! కడుపు నిండి పోయింది ఇన్ని కా 'మింటులు' చదివి !
మరిన్ని మోర్ కా మెంతులు, అక్షింతలు వస్తాయని ఆశిస్తో !!
చీర్స్
జిలేబి
అసలు వాస్తవం ఇక్కడి వ్యాఖ్యాతల అభిప్రాయానికి పూర్తిభిన్నం. నిజానికి బండిఱా ఉచ్చారణ ఒక్కటే ప్రజల నాలుకల మీద జీవించి ఉంది. మామూలు ర ఉచ్చారణే మర్చిపోయారు. అంటే అందఱమూ వాస్తవంగా పలుకుతున్నది బండిఱానే. కానీ వ్రాతలో సంస్కృత ర వ్రాస్తున్నాం. ఈ మామూలు (సంస్కృత) రకారాన్ని ఇంగ్లీషులో మాదిరి పలికీ పలకనట్టు పలకాలి. ఇలాంటి అస్పష్ట రేఫోచ్చారణ మనకి ఇంగ్లీషులో పదాంతాల్లో ఎక్కువ వినపడుతుంది. ఉదాహరణకి:- ఫాద* మద* బ్రద* etc. ఇహపోతే మన తెలుగు బండిఱా ఉచ్చారణకీ తమిళ ற் యొక్క ఉచ్చారణకీ సంబంధమే లేదు. ఇది దాని సమానార్థకం కాదు. అది పూర్తిగా వేఱే అక్షరం.
ReplyDeleteఅంటే ప్రవీణ్ నిన్నటినుంచీ చెప్తున్న బండి"రాధ్ధాంతం" మొత్తం తప్పేనన్న మాట!
DeleteBritish Englishలో "R" ఒక తాలవ్య ధ్వని (నాలుక మధ్య భాగాన్ని అంగిలి వైపు నొక్కి పలికేది). సంస్కృతంలోని "ర" American English యాసల్లోని "R" మాదిరి ఉంటుంది.
Delete