భాష పుట్టి , ముందు ప్రజల పలుకు బడుల
వృధ్ధి చెంది నాక పధ్ధ తెరిగి
భాష పుట్టి , ముందు ప్రజల పలుకు బడుల
వృధ్ధి చెంది నాక పధ్ధ తెరిగి
భాషలోని మార్పు వ్వాకరణము జెప్పు
వ్యాకరణము గాదు _ భాష ముందు .
గ్రాంధికమ్ము వీడి గ్రామీణ తెలుగులో
వ్రాసి , తియ్యదనము వండి వార్చి
తర తరాలు తెలుగు తలయెత్తుకొని నిల్వ
తెలుగు భాష కొరకు దీక్ష గొనుడు !
ఘనుల మన్న బ్రమల జనహిత మెరుగని
పండితులకు తెలుగు పలుకు బళ్ళు
విన నసాధువులుగ గనుపించ నికనెట్లు
తెలుగు వృధ్ధి యగునొ ? తెలియరాదు .
వాడుక పద యొరవడిలో
వేడుక గలదన్న నిజము వెలిగి బుధులలో
గాఢముగా నిండినచో
నాడు గదా ! తెలుగు భాష నాట్యాలాడున్
సభలు బెట్టి తెలుగు విభవమ్ము భూషించి
తెలుగు నుధ్ధరించు ధిషణు లార !
ప్రజల పలుకు బడుల గ్రామ్యాలని హసించు
తీరు మార్చు కొనుడు , తెలుగు వెలుగు .
వృధ్ధి చెంది నాక పధ్ధ తెరిగి
భాష పుట్టి , ముందు ప్రజల పలుకు బడుల
వృధ్ధి చెంది నాక పధ్ధ తెరిగి
భాషలోని మార్పు వ్వాకరణము జెప్పు
వ్యాకరణము గాదు _ భాష ముందు .
గ్రాంధికమ్ము వీడి గ్రామీణ తెలుగులో
వ్రాసి , తియ్యదనము వండి వార్చి
తర తరాలు తెలుగు తలయెత్తుకొని నిల్వ
తెలుగు భాష కొరకు దీక్ష గొనుడు !
ఘనుల మన్న బ్రమల జనహిత మెరుగని
పండితులకు తెలుగు పలుకు బళ్ళు
విన నసాధువులుగ గనుపించ నికనెట్లు
తెలుగు వృధ్ధి యగునొ ? తెలియరాదు .
వాడుక పద యొరవడిలో
వేడుక గలదన్న నిజము వెలిగి బుధులలో
గాఢముగా నిండినచో
నాడు గదా ! తెలుగు భాష నాట్యాలాడున్
సభలు బెట్టి తెలుగు విభవమ్ము భూషించి
తెలుగు నుధ్ధరించు ధిషణు లార !
ప్రజల పలుకు బడుల గ్రామ్యాలని హసించు
తీరు మార్చు కొనుడు , తెలుగు వెలుగు .
- వెంకట రాజా రావు లక్కాకుల.
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.