- పల్లా కొండలరావు
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.comమీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
ఆంధ్ర: పచ్చ మూకల అరాచకానికి ప్రజలు అంతం పలికారు. ప్రజలు జగన్ నుంచి కోరుకునేది హుందాతనం, నిజాయితీ, నిరాడంబరత. ఏవో అద్భుతాలు చేయనక్కరలేదు.
ReplyDeleteతెలంగాణా: కేసీఆర్ ఒంటెత్తు పోకడలు తగ్గించుకొని ప్రతిపక్షాన్ని గౌరవిస్తే మంచిది. అనైతికంగా ఇతర పార్టీలు ఎన్నికైన ప్రజాప్రతినిధులను లాక్కుంటే బాబు కు జరిగిన శాస్తి జరుగుతుంది.
good suggestions.
Deleteకాంగ్రెస్ అవినీతిని అరికడతానన్న మోదీ చాలా హుందాగా, నిజాయితీగా, నిరాబండరంగా ఉంటారు. దేశమే అప్పుల్లో కూరుకుపోయింది.
ReplyDeleteజయలలిత కూడా ఒకే రకం చీరలు కడుతూ హుందాగా, నిజాయితీగా, నిరాబండరంగా ఉంటుంది. ఆవిడకి కూడా ప్రజలు పట్టం కట్టారు. జైలులో గడపవలసి వచ్చింది.
సినిమా వాళ్లకు భారత ప్రజలు సినిమా చూపించారు. ఇడియట్ బాక్సును నమ్ముకున్న పార్టీలు ఇడియట్టులా మిగిలారు. జనంలో తిరిగిన నాయకులు జననేతలుగా నిలిచారు.
ReplyDeleteమన దేశంలో లెఫ్ట్ శకం ఇక ముగిసినట్టే. అలాగే నెహ్రూ వాదం అంతానికి ఆరంభ ఘడియలు వచ్చేసాయి.
అమరీందర్, సిద్దరామయ్య, సచిన్, సింధియా వగైరాలు ఇంకా ముణుగుతున్న పడవలో కొనసాగే బదులు మమత/జగన్ మాదిరి రిస్కు తీసుకొని సొంత జండాతో రంగంలో దిగితే వచ్చే ఐదేళ్ళలో ఎదగవచ్చు.
ఏందీ మమత లాగానా ? మోదీ చెంపమీద కొడతానన్నందుకు చెంపపగలగొట్టారు బెంగాల్ బాబులు.
Deleteజైలుకెళ్ళవలసి వస్తుందని జగనుడు ముందే చేతులెత్తేసాడు.మంత్రివర్గం ఏర్పాటుచేయడానికి మూణ్ణెళ్ళు తీసుకునేటోళ్ళు పీక్స్ నధింగ్ !
బెంగాల్ దీదీ ఓట్ల శాతం స్వల్పంగానే అయినా (2%) పెరిగింది. సీపీఎం & కాంగ్రెస్ ఓట్లు దారుణంగా పడిపోయి కమలానికి బదిలీ కావడం వల్లనే భాజపా ఎదిగింది.
Deleteమహారాష్ట్రలో సేమ్ సీన్ రిపీట్. కాంగ్రెస్ ఓట్లు గణనీయంగా తగ్గాయి కానీ శరద్ పవార్ ఓటు బ్యాంకు పదిలంగానే ఉంది.
అమరీందర్, సిద్దరామయ్య, సచిన్, సింధియా లాంటి వాళ్ళకు అంత సీన్ ఉంటే రాహుల్ అవకాశం ఇస్తానంటున్నారుగా వాడుకోవచ్చుగా ?
ReplyDeleteమీరో ప్రపంచ మేధావి... ప్రశాంత్ కిషోర్ తర్వాత మీరే, చక్రం తిప్పండి !
>>>>నెహ్రూ వాదం అంతానికి ఆరంభ ఘడియలు వచ్చేసాయి.>>>>
ReplyDeleteనెహ్రూవాదం అంతమయిన రోజున వారసత్వ రాజకీయాలు కూడా అంతమయిపోతాయి. కేటీఆర్ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటాడా ?
ఇకపై దేశంలో అంబేడ్కర్/లోహియా భావజాలాలు మాత్రమే కాషాయానికి ధీటుగా నిలబడతాయి.
ReplyDeleteJai Bhim!
అంబేడ్కర్/లోహియా భావజాలాలు ....కన్‌హయ్యా కుమార్ ఏడకి పోయినాడు. అంబేడ్కర్ బావజాలం అంటే దళిత భావజాలమా ?
ReplyDeleteకన్నయ్య బాబుది ఎర్ర పార్టీ
Deleteటీడీపీలో ఎందరో ప్రతిభావంతులు & జనానికి చేరువగా పనిచేసే యువనాయకులు ఉన్నారు (ఉ. ధూళిపాళ నరేంద్ర). అలాగే పార్టీ కోసం ఎంతో కృషి చేసిన సీనియర్లకు (ఉ. గోరంట్ల బుచ్చయ్య చౌదరి) కూడా కొదవ లేదు.
ReplyDeleteకింజరాపు కుటుంబం ఇంతటి వ్యతిరేకతలో సైతం మూడు సీట్లు గెలుచుకోగలిగింది. అలాగే చినరాజప్ప, పయ్యావుల, గద్దె రామమోహన్, ఏలూరి వంటి వారు కూడా. ఇటువంటి వారికి తగు గౌరవం ఇచ్చి పార్టీ వదలకుండా కాపాడుకోవడం ప్రస్తుత సంక్షోభంలో చాలా కీలకం.
తమతమ వ్యాపారాల కోసం పార్టీని వాడుకున్న "దొంగల ముఠా"కు, ప్రచార కండూతితో టీవీలలో చెలరేగిపోయే "పబ్లిసిటీ పిచోళ్ళ"కు, టెక్నాలజీ మాయలో పడిపోయి జనాన్ని విస్మరించే "రెయిన్ గన్ బాచీ"కి ప్రాధాన్యత తగ్గిస్తే పార్టీ ఆటోమేటిక్కుగా పుంజుకుంటుంది.
లోకేష్ బాబు స్వతహాగా మంచివాడే కానీ కష్టం తెలీకుండా ఎదిగాడు. ఆయనకు కర్నూలు లాంటి టఫ్ జిల్లాలో పార్టీని పునరుద్దరించే బాధ్యతలు అప్పగించి వచ్చే ఎన్నికల వరకు మళ్ళీ పట్నానికి రావొద్దని అర్దరేస్తే రాటు తేలుతాడు. 2024 నాటికి స్వయంకృషితో డెప్యూటీ సీఎం స్థాయికి ఎదిగితే పార్టీకి ఇరవై ఏళ్ల ప్రణాళిక పడ్డట్టే.
- తమతమ వ్యాపారాల కోసం పార్టీని వాడుకున్న "దొంగల ముఠా"కు, ప్రచార కండూతితో టీవీలలో చెలరేగిపోయే "పబ్లిసిటీ పిచోళ్ళ"కు, టెక్నాలజీ మాయలో పడిపోయి జనాన్ని విస్మరించే "రెయిన్ గన్ బాచీ"కి ప్రాధాన్యత తగ్గిస్తే పార్టీ ఆటోమేటిక్కుగా పుంజుకుంటుంది. -
Deleteబాబు అలా మారగలడా? ఇంతక్రితం ఓడినా పార్టీ పటిష్టతకు ఆయన ఎంచుకున్నది పెట్టుబడిదారుల సావాసమే. ఇప్పటికైనా మీరు సూచించినవి పాటిస్తారా? అన్నది అనుమానమే. బాబు మైండ్ సెట్ మారాలి. మీడియా మేనేజ్ చేయడం, డబ్బుతో సెటిల్ చేయడం, హైటెక్ పోకడలు, స్వంత డబ్బాలు మాని కార్యకర్తల నుండి నిజమైన అభిప్రాయాలు రాబట్టుకోగలిగితే టీ.డీ.పీ మనుగడ సాగిస్తుంది.
This comment has been removed by the author.
Deleteఅటు తిప్పి ఇటు తిప్పి "పెట్టుబడిదారుల సావాసం" అంటూ సొంత ఇజాన్ని ఇరికించే ప్రయత్నమే ఇక్కడ కూడా. మధ్యలో పెట్టుబడిదారులు ఏం చేశారో! పెట్టుబడిదారుల సహవాసం చేస్తున్న మోడీ చక్కగా గెలవలేదా ఏమిటి?
Deleteనేను మా నాన్నగారి అనారోగ్యం వలన 2015 లో విజయవాడ వెళ్ళవలసి వచ్చింది. అపుడు అమరావతిలో ఒకరు 200 గజాలు 10 లక్షలకు అమ్ముతామని అన్నారు. అప్పట్లో ఎకరం రెండు కోట్లు ఉంది. అప్పటికి ఇంకా రాజధాని మొదలేపెట్టలేదు. ఇపుడు ఎంత ఉంటుందో ఊహించుకోండి.(మేము కొనలేదు)
Deleteరాజధాని పూర్తవకముందే భూములకు రెక్కలొస్తే అది చంద్రబాబు గారి క్రెడిట్ అయితే దానిని వక్రీకరించి పెట్టుబడిదారులు అంటూ మాట్లాడుతున్నారు.
రామోజీ ఫిలిం సిటీ కి దగ్గరలో (2016) మా బంధువు 3 లక్షలకు ఒక ఎకరం కొన్నారు అది ఇప్పుడు 10 లక్షలు అయింది. ఇది కూడా రాజధానే కదా ? ఇక్కడ పెట్టుబడిదారులు లేరా ?
భూమి విలువ పెరగడానికి చంద్రబాబు గారు కారణం అయితే సోంబేరి జనాలకి కుళ్ళుపుట్టి బినామీలు అంటూ వాగే వాగుడే కానీ చంద్రబాబుగారిని బాధ్యుడిని చేయడమంటే ఆయన చెప్పినట్లు "మీ భవిష్యత్తు ఆయన బాధ్యతే !"
ఇంతకుముందు ఎవరో ఆంధ్రాని అరుణాచల్ ప్రదేశ్ తో పోల్చారు. వాళ్ళకి ప్రత్యేక హోదా ఉంది మనకు లేదు అన్నారు. మనకి ప్రత్యేక హోదా లేకపోయినా భూముల రిజిస్ట్రేషన్ ఆదాయాలు ఎక్కువ అని తెలుసు. మనకి ఎక్కువ ఆదాయం వస్తే కేంద్రానికీ వెళుతుంది. మన ఆదాయం లో మనకి రావలిసిన వాటా ఇవ్వకుండా మనకి రావలిసిన ప్యాకేజీ ఇవ్వకుండా మన చేతుల్తో మన కళ్ళే పొడిచేసి చంద్రబాబుగారిని బలిపశువుని చేసి నిలబెట్టారు.మీరంతా మేధావులే కదా నేను చెప్పినదాంట్లో ఎక్కడ తప్పు ఉందో చెప్పండి. చంద్రబాబుగారిని నమ్మకపోయినా జయ ప్రకాశ్ నారాయణ గారినైనా నమ్మాలి కదా ? ఆయన ఒక కమిటీ వేసి మరీ చెప్పారు కదా ?
Delete"జయ ప్రకాశ్ నారాయణ గారినైనా నమ్మాలి కదా"
Deleteలోకచెత్తా జయప్రకాష్ నారాయణ్ 0% క్రెడిబిలిటీ, 100% హాట్ గాస్. ఇంతకంటే చంద్రబాబు బెటర్: ముని శాపం ఉన్నా ఒక్కోసారి నిజం చెబుతాడు.
చంద్రబాబు గారికి ఆంధ్రా,తెలంగాణా రెండు కళ్ళు అనేవారు.
Deleteఆ రెండు కళ్ళను పొడిచేసిన తెలుగువారికి ఈ పాట అంకితం.
https://www.youtube.com/watch?v=-0dcJUHYyXk&list=RD-0dcJUHYyXk&start_radio=1
https://www.youtube.com/watch?v=9ewenGRGTEA
Delete- అటు తిప్పి ఇటు తిప్పి "పెట్టుబడిదారుల సావాసం" అంటూ సొంత ఇజాన్ని ఇరికించే ప్రయత్నమే ఇక్కడ కూడా. మధ్యలో పెట్టుబడిదారులు ఏం చేశారో! పెట్టుబడిదారుల సహవాసం చేస్తున్న మోడీ చక్కగా గెలవలేదా ఏమిటి? -
Deleteపార్టీని సరుకుగా భావించి పెట్టుబడి పెట్టి జనంలో పలుకుబడి లేకున్నా నాయకుడిగా అవతారం ఎత్తి పార్టీని ఉపయోగించుకుని తిరిగి లాభం పొందుతారు. వారు పెట్టుబడిదారులు. పెట్టుబడిదారులందరూ అలాగే ఉంటారని కాదు.పెట్టుబడితో సంబంధం లేకుండా నిత్యం ప్రజలలో ఉంటారు కొందరు నేతలు. ఎన్.టీ.ఆర్ నాయకత్వంలోని పార్టీకి, బాబు నాయకత్వంలోని పార్టీకి అదే తేడా.
డబ్బుతో మీడియాను, వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం.... ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ బాకాలు బాదుకోవడం మాని జనం మధ్య ఉంటే తెలుగుదేశం రాణిస్తుంది.
Deleteటిడిపీ వాల్లు గ్రౌండ్ రియాలిటీ మర్చిపోయి, తాము చేసిందంతా జనాలు మెచ్చేసుకుంటున్నారనీ, మన హైటెక్కు పాలనకు జనాలు జేజేలు కొడుతున్నారనీ భ్రమల్లో బ్రతక్కుండా ఉండి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు. సగటు కార్యకర్త, గ్రౌండు రియాలిటీకి దగ్గరగా ఉన్న వ్యక్తులు చాలా మందే హెచ్చరించారు టి.డి.పీని, వాటిని పెడచెవిన పెట్టిన ఫలితమే ఇప్పుడీ పరాభవం. మనం ఏంచేసినా ఆహా, ఓహో అనే బ్యాచ్చి పక్కనుంటే జరిగే ఘోరాలు ఇవి. ఇప్పటికైనా మొహం మీద కొట్టినట్టు నిష్పాక్షికంగ అభిప్రాయాలు చెప్పేవాల్లను ఎంకరేజ్ చేయడం పార్టీకి మంచిది.
ReplyDeleteమొన్న జూనియర్ తారక రాముడు.. ఇక మీదట, బాధ్యతలు నేను తీసుకుంటానని ఎంటీయార్ ఘాట్ వద్ద శపధం చేశారట. ఆయన ఎంటీయార్ ఘాట్ వరకే పరిమితమయితే మంచిది. టి.డి.పీకి సినిమా గ్లామర్ ప్రస్తుతం ఉపయోగపడదు. జనాలు సినిమా స్టార్ల మాటలకు బొక్కా బోర్లా పడడం మానేశారు. అనవసరంగా బాగున్న కెరీరును చెడగొట్టుకున్నట్టు అవుతుంది ఆయన.
ఇప్పుడు కావలసింది, కష్టపడి పనిచేసి, జనాలతో మమేకం అవ్వగల నాయకులు, కాస్త యువ రక్తం ఉన్నవారు కావాలి. అర్జంటుగా ఆపని మీదుంటే, భవిశ్యత్తు ఉంటుంది. లేదంటే 2024 = 2019.
ప్రశాంత్ కిశోర్ మాయాజాలంలో సామాజిక వర్గాలన్నీ పడిపోయాయి. ఇదే ప్రశాంత్ కిషోర్ ని ఇప్పటికిప్పుడు మీరు పెట్టుకున్నా మీక్కూడా విజయం సాధించిపెడతాడు. నోట్ల రద్దు జీ ఎస్ టీ వల్ల పెట్టుబడిదారులు నష్టపోయిందే ఎక్కువ. సామాన్యులకు అర్ధం అవడానికి సమయం పడుతుంది మీలాంటి మేధావులకు ఎందుకు అర్ధం కావడం లేదనేదే నా బాధ !
Deleteప్రశాంత్ కిషోర్ కన్సల్టెన్సీ తీసుకున్న యూపీ కే చోక్రే గతి ఏమైంది? ఒకతను బువాజీ కొంగు పట్టుకోవడం పుణ్యమా అంటూ చావు తప్పి కన్ను లొట్టబోయాడు. ఇంకోతను వాయనాడు కెళ్ళి వాయి ముచ్చుకున్నాడు.
Delete- ప్రశాంత్ కిశోర్ మాయాజాలం - ఇది 2014లో ఏమైంది?
Deleteతనను తాను, తన పార్టీని సమీక్షించుకోలేని, ఆయన తప్ప ఇంకో నేతను తయారుచేయలేని జయప్రకాశ్ నారాయణ ఇతరుల గెలుపోటములను గురించి తెగ దంచేయడం భలే సరదాగా ఉంటుంది.
Deleteహహహ. ఈ లెక్కన ఎన్నికల గురించి మాట్లాడడానికి మీకేం అర్హత ఉందొ నాకు అర్థం కావట్లేదు!!
Deleteనా అర్హత గురించి ఆలోచించడం మానేస్తే పాయె..... సింపుల్ సొల్యూషన్!
Deleteఅంతకంటే సింపులెస్ట్ సొల్యూషన్. ఈ బ్లాగు మూసేస్తే పాయె!
Delete>>>>తనను తాను, తన పార్టీని సమీక్షించుకోలేని, ఆయన తప్ప ఇంకో నేతను తయారుచేయలేని జయప్రకాశ్ నారాయణ ఇతరుల గెలుపోటములను గురించి తెగ దంచేయడం భలే సరదాగా ఉంటుంది.>>>
Deleteగాడ్(గ్రాండ్) ఫాదర్ కానీ డబ్బుకానీ లేకపోతే రాజకీయాల్లో ఎవరూ ఏమీ చేయలేరు. చంద్రబాబుగారు నచ్చకపోతే పవన్ కళ్యాణ్(డబ్బు పంచలేదు కాబట్టి) ని గెలిపించవచ్చు లేదా నోటాకి ఓటువేయవచ్చు. ఒక ప్రిజనర్ ని ముఖ్యమంత్రిని చేయడం ఏమిటీ ?
నేనే జగన్ ప్లేస్ లో ఉంటే ఒక ముఖ్యమంత్రి కావలిసిన వ్యక్తిని 18 నెలలు జైలులో పెట్టిన పాపానికి న్యాయస్థానంపై 100 కోట్ల పరువు నష్టపరిహారం వేస్తా !
హిమాయత్ నగర్ హిమ్మత్వాలా, గగన్ మహల్ గల్లీ చిన్నోడు, మన గంగాపురం కిషన్ రెడ్డి గారికి అభినందనలు.
ReplyDeleteప్రశాంత్ కిశోర్ మాయాజాలం - ఇది 2014లో ఏమైంది?
ReplyDeleteప్రశాంత్ కిషోర్ వల్లనే 2014 లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికిపుడు అసదుద్దీన్ గారు అవకాశం ఇచ్చినా ఆయనను కూడా ప్రధానిని చేయగల సమర్ధులు. ఆయనని పూర్తిగా నమ్మి స్వేచ్చనివ్వాలి...అంతే !
ప్రధాని పదవి కావాలా హిందూత్వ కావాలా అని అడిగితే ప్రధాని పదవే కావాలి అని మోడీ గారు చెప్పారు. ఏ మనిషికైనా క్లారిటీ ఉంటే సాధించలేనిది ఉండదు.
అసదుద్దీన్ గారు మైనారిటీ సంక్షేమాన్ని అడిగారు కనుక ఎదగలేకపోతున్నారు.
ప్రశాంత్ కిషోర్ బ్రహ్మాండమయిన వ్యూహకర్తనిన్నూ, 2014 మోడీ & 2019 జగన్ గెలుపుకు ఆయనే కారణమనిన్నూ కాస్సేపు వాదన కోసం అనుకుందాం. అంతటి ఉద్దండపిండం సలహాలు తీసుకున్నా యూపీ ఎన్నికలలో బొక్కిబోర్లా పడ్డ యూపీకే చో(బ)క్రా ఎంతటి పప్పుసుద్ద అయిఉండాలి? శ్రీకృష్ణుడు దిశానిర్దేశన చేసినా ఉత్తర కుమారుడు కురుక్షేత్ర యుద్ధం గెలిచే వాడు కాదు, అందుకు అర్జునుడే కావాలి.
ReplyDeleteఉత్తరకుమారుడిని యుద్ధం గెలిచేట్టు చేయకపోతే "శ్రీకృష్ణుడు" దేవుడేంటి ?
Deleteప్రగల్భాలు నా దగ్గర సాగవు, ఒళ్ళు దగ్గరబెట్టుకుని మాట్లాడండి.
తప్పు చే(వ్రా)సావు గొట్టిముక్కలా ? దేవసేన స్టైల్ లో ...
ఉత్తర కుమారుడికి తోడు ఉత్తర కుమారి వచ్చినా వాయి మూడింది తప్ప ఇతరత్రా గిట్టుబాటు కాలేదు. ఇక అభిమన్యుడు వస్తాడేమో!
Deleteదేవసేన యుద్ధాలు & రాజమౌళి గ్రాఫిక్కులు ఎన్ని టేకులు తీస్తే వస్తాయి ఎవరికీ తెలీదు? మళ్ళీ ఐదేళ్లకు ఆల్ ఇండియా షెడ్యూల్ వస్తుంది అప్పటివరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లేడపుడు శ్రీకృష్ణుడి గురించి మాట్లాడకూడదు.
Deleteసుమ్మ వళ్ళరాదు ....వాయిమూడు.
తన రాజీనామా లేఖను భద్రంగా దాచమని సెక్రెటరీకి (వాణిశ్రీ అనుకునేరు, నాగభైరవ మహాశయుడు) ఇస్తే అతగాడు తాను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు తన అనుమతి లేకుండా ఆ లేఖను గవర్నరుకు ఇచ్చాడని రామారావు కోర్టులో సాక్ష్యం చెప్పాడు. రామారావు మగతలో ఉండి నోటమాట పెగలని సమయంలో ఆ ఉత్తరాన్ని గవర్నరుకు ఇవ్వమని రామారావు తనకొక్కడికే అర్ధం అయ్యే సైగలతో చెప్పాడని సదరు సెక్రెటరీ న్యాయస్థానం ముందు నమ్మబలికాడు. ఇదండీ "వెన్నుపోటులో వెన్నుపోటు" ఉదంతం.
ReplyDelete"ఎవడు త్రవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు. ఇకనైనా మీరు వాస్తవాలను తెలియచేయండి కానీ చంద్రబాబుగారిదే సరి అయినది అని తీర్పులివ్వకండి. ఎవరు ఎలాంటివారో ప్రజలే స్వయంగా తెలుసుకునేవరకూ మీరు సంయమనంతో వ్రాస్తే రాష్ట్రానికి మంచిది"
ReplyDeleteచంద్రబాబుగారిదే సరి అయినది అని నేను ఎక్కడ చెప్పానో చెప్పండి ?
Deleteఎవరు గెలుస్తారు అని అడిగితే చంద్రబాబుగారు గెలుస్తారు అని చెప్పాను. ఉన్న ముగ్గురిలో చంద్రబాబుగారు బెటర్ అని చెప్పాను.
మళ్ళీ అదే చెబుతున్నా ..నేను తీర్పు చెపితే ఎవడు విని ఓటేసాడు ?
నిజామాబాద్ ఉత్తర కుమారి వాయి మూడింది అని మీరే చెప్పారు.
నిజామాబాద్ ఉత్తర కుమారికి తోడు పిప్పళ్ళ బస్తాలాంటి అభిమన్యుడు రావాలా ?
ReplyDeleteహరీష్ రావుని ప్రక్కకి పెట్టడం వల్లే తెలంగాణా ఓడిపోయిందా ? నేనిచ్చిన వీడియోలో ఏం చెప్పారో చూసారా ? వీళ్ళు నలుగురూ తప్పితే తెలంగాణాలో మరో దిక్కులేదా ?
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteఐదేళ్ళ వరకూ జగన్ జైలుకెళ్ళకుండా మీరు ఆపుతారా ? వై ఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే వర్షం వచ్చింది అని నమ్మినోళ్ళు గుట్టలో శవం ఆనవాలు కూడా దొరకదని నమ్మాలి కదా ?
ReplyDeleteనీహారిక గారూ,
ReplyDeleteనేను వీడియోలు చూడను. అసలే ఈ మధ్య టీవీ చానెళ్లు/యూట్యూబ్ పుణ్యమా అంటూ బోలెడంతమంది "విశ్లేషకులు" తయారయ్యాయి (నన్నూ కొన్ని సార్లు ఈ టీవీ డిబేటులకు పిలిచారు నేను వెళ్ళలేదు). ఆధారాలతో సహా రాసిన వ్యాసాలను ఆయా మూలాలను పరిశీలించాకే స్వీకరిస్తాను.
అభిప్రాయాలు ఎవరికీ వారివే. వాస్తవాలు మాత్రం కొంత పరిశోధన చేస్తే తెలుస్తాయి. ఉ. నాకు వికీపీడియా కంటే ఎన్నికల సంఘం ఒరిజినల్ లెక్కలు చూడడం బెటరనిపిస్తుంది. సెన్సస్ లెక్కలలో గుళ్ల సంఖ్య ఉందని నమ్మితే అది మీ విజ్ఞతకే వదిలేస్తాను.
నేనెప్పుడూ సంయమనంతోనే రాస్తాను. హరిబాబు ఇక్కడ లేనప్పుడు ఆయన గురించి నేను రాయడం సరికాదు.
నాకు ఎవరు గెలిచినా ఓడినా ఒక్కటే. ఎవరు ఎందుకు గెలుస్తారు లేదా ఓడుతారన్న విషయంపైనే నా ఆసక్తి. I focus on understanding why & what, not who. I have no preferences.
"రైతుదే తెలంగాణము రైతుదే" అన్న దాశరధి మాటలను రుజువు చేసిన ఘనత నిజామాబాదు ప్రజలదే. Hats off to these brave dryland peasants!
1998 లోక్సభ ఎన్నికలలో బీజేపీకి తెలంగాణాలో 26.3% ఓట్లు వచ్చాయి. పొత్తుల మాయలో పడి తగ్గారు కానీ ఎప్పటికయినా మళ్ళీ ఎదుగుతారు. 2014 & 2018 అసెంబ్లీ ఎన్నికలలో కూడా తప్పిదాల వలన ముణిగారు తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు 19% వచ్చింది, అసెంబ్లీ మీద 12% అదనం. తెరాస నుండి ~ 6%, కాంగ్రెస్ నుంచి ~4%, ఇతర చిల్లర పార్టీల ~2% కోసేసారు. ఇంకో 10-15% పెరిగి 30+% వస్తే ఇక treshold దొరికినట్టే. Just for your info, I am an atheist & not a RSS guy.
తెరాసను జనం సాగనంపే రోజులు వస్తాయి, అప్పుడు హరీష్ రావు కూడా ఆపలేడు. షరతు ఒక్కటే: తెలంగాణా జనమే పూనుకోవాలి, పచ్చమీడియా ఈ పని చేయలేదు పైగా బెడిసికొడుతుంది.
హరీష్ రావు, కేటీఆర్, కవిత ఎవరయినా సరే జనం కోసం నిలబడ్డప్పుడు ఉంటారు, మానేసిన రోజున ఇంటికి పంపిస్తారు.
http://naakaburulu.blogspot.com/2019/05/blog-post_29.html?showComment=1559210192461#c7209634282608785385
ఇక జగన్ గురించి. చంద్రబాబు గెలవాలని కోరుకున్న వాళ్ళు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిందన్నట్టు ప్రవర్తించారు. చంద్రబాబు ఒక్కడే కొంతవరకు వస్తున్న పరాభవాన్ని గుర్తించాడు కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది.
జగన్ (లేదా వాద్రా) జైలుకు వెళ్తాడా అన్నది నా ఉద్దేశ్యంలో అనవసర ప్రశ్న. లాలూ ప్రసాద్ పాతికేళ్ళు తప్పించుకున్నాడు. చంద్రబాబు స్టేల మీద స్టేలు తెచ్చకున్నాడు. సుబ్రహ్మణ్యం స్వామి ఎంత యాగీ చేసినా ఒక్క కేసులో శిక్ష పడలేదు.
ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇచ్చినా యూపీ అసెంబ్లీ ఎన్నికలలో రాహుల్ గాంధీ ఎందుకు ఓడిపోయాడు? నాకు జవాబు చెప్పనక్కరలేదు కానీ ఈ ప్రశ్న మీరే ఆలోచించండి.
టార్గెట్ రీచ్ కానీ ప్రతి సేల్సుమాన్ ఎదో ఒక నెపం చెప్తాడు (ఉ. కస్టమర్లు నాణ్యత గుర్తించని వెధవలు). ఆడలేక మద్దెలోడు.
- తెరాసను జనం సాగనంపే రోజులు వస్తాయి, అప్పుడు హరీష్ రావు కూడా ఆపలేడు. షరతు ఒక్కటే: తెలంగాణా జనమే పూనుకోవాలి, పచ్చమీడియా ఈ పని చేయలేదు పైగా బెడిసికొడుతుంది.
Deleteహరీష్ రావు, కేటీఆర్, కవిత ఎవరయినా సరే జనం కోసం నిలబడ్డప్పుడు ఉంటారు, మానేసిన రోజున ఇంటికి పంపిస్తారు. -
good words. waiting for that good day sir.
- పచ్చమీడియా ఈ పని చేయలేదు పైగా బెడిసికొడుతుంది. -
Deleteవామ్మో పచ్చమీడియా కంటే గారడీగాడే బోల్డు నయం.
దాదాపు రెండు దశాబ్దాల నుండి ఎన్నికలు & ఉప ఎన్నికలు ఎన్నెన్నో జరిగాయి. తెరాస ఎన్నో సార్లు ఎగిసింది, పడింది కూడా. వీటన్నిటిలో ఒకటే కామన్ పాయింట్: తెలంగాణా వైపు నిలబడ్డప్పుడు *మాత్రమే* గెలిచారు.
Deleteమొన్న ప్రొఫెసర్ కోదండరాం బీజేపీతో జట్టు కట్టుండుంటే బాగుండేది. ఇప్పుడు చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకోలేరు!
-తెలంగాణా వైపు నిలబడ్డప్పుడు *మాత్రమే* గెలిచారు.-
Deleteతెలంగాణ వైపు నిలబడితే మంచిదే. ఆ సూచనలు కనబడడం లేదు. కోదండరాం సర్ వాయిస్ సరిపోవడం లేదనిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో తెరాస పదింట ఒకటే సీటు గెలిచింది. పార్టీలో అంతర్గత కుమ్ములాట తారాస్థాయిలో ఉంది. ఫిరాయింపుదారులపై ఊళ్లలో రాళ్లదాడులు జరిగాయి. పొంగులేటినే కాక తుమ్మలను పక్కబెట్టి నిన్నటికి నిన్న కండువా కప్పుకున్న పక్కా "కాంట్రాక్ట్ పక్షి"కి ఎంపీ టికెట్ ఇచ్చారు.
Deleteఇంకోపక్క పోడు భూముల గురించి కోయలలో తీవ్ర అసంతృప్తి. ప్రతిపాదిత నూతన భూ-పంపిణీ చట్టంపై రెవెన్యూ ఉద్యోగులే కాదు అనుభవదారులు కూడా ఆందోళనలో ఉన్నారు.
నిర్వివాద నాయకుడు మల్లు భట్టి విక్రమార్క గారిని మొట్టమొదటి దళిత ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చి గౌరవించింది.
ఏ కోణంలో చూసినా ఖమ్మం ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీయే గెలవాలి. తెరాస అనూహ్యంగా కరీంనగర్ ఓడడమే కాదు ఖమ్మం గెలవడం కూడా "జనతా జనార్దన్" లీలగానే చెప్పాలి.
స్టాక్ మార్కెట్టులానే ఎన్నికల పండుగలో కూడా మాక్రో లెవెల్లో ఓవరాల్ ట్రెండ్ పట్టుకోవడం సాధ్యమే (సులువేనేమో కూడా) కానీ మైక్రో లెవెల్లో కౌంటర్ ట్రెండ్స్ గుర్తించడం క్లిష్టతరం.
ఎన్నికలు ముగిసి ఈ వారం ఓట్ల లెక్కింపుకు రాబోయే జడ్పీ ఫలితాలలో కనీసం 10/32 గెలువగలిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ నిలదొక్కుకుంటుంది. పట్టణ ప్రాంత ఓటర్ల మద్దతు ఉండడం మూలాన బీజేపీపై ఇవి అంతగా ప్రభావం చూపవు. తెరాస 25/32 గెలిస్తే మాత్రం రాబోయే రోజులలో తెరాస-బీజేపీ నేరుపోటీగా మారే అవకాశాలు మెండు.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది. నాయకత్వ లోపం ప్రధానకారణం. భట్టి విక్రమార్క అతని అన్న రవి అండతో టికెట్ తెచ్చుకోవడం మినహా పార్టీకి, ప్రజలకు చేసిందేమీ లేదు. చంద్రబాబుతో పొత్తు భట్టి పుణ్యమే. మధిరలో అతని గెలుపుకు, ఆర్ధికంగా తనకు మాత్రమే అది ఉపయోగపడింది. కాంగ్రెస్ కు దెబ్బ, కోదండరాం కు నైతిక దెబ్బ తగిలింది. నిర్వివాదం అంటే టీఽఅర్.ఎస్ తోనా? అయితే మీరన్నది నిజమే.
Deleteతుమ్మల నోటిదూల, అతని అహంభావం లేకుంటే శ్రీనివాసరెడ్డి సహకరించకున్నా గెలిచేవాడు. ఓడినా అతని అహంభావం మారలేడు. కాంట్రాక్టు పక్షికి టికెట్ ఇప్పించుకుందే తుమ్మల. తుమ్మలను పక్కనబెట్టే దమ్ము కే.సీ.యార్ కు లేదా అతని కొడుక్కి లేదు.
రేణుక ప్రచారం సరిగా చేయకపోవడం, డబ్బు తీయకపోవడం, కాంగ్రెస్ లో కుమ్ములాటలు, గెలిచినా టీఽఅర్.ఎస్ కు అమ్ముడు పోకుండా ఉంటారన్న నమ్మకం కోల్పోవడం వల్ల ఓడింది. ఈ సీటులో రేవంత్ రెడ్డిని నిలబెడితే భారీ మెజారిటీతో గెలిచేవాడు. కాంగ్రెస్ లో వారే ఆ పని జరుగకుండా టీఽఅర్.ఎస్ గెలుపుకు సహకారం అందించారు.
టీఽఅర్.ఎస్ కి అమ్ముడుబోయిన ఎం.ఎల్.ఏ ల పై కాంగ్రెస్ క్యాడర్ స్వచ్చందంగా తిరగబడ్డారు.
కాంట్రాక్టు వత్తిడులు లేకుంటే శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లేదా బి.జె.పీ లోకి జంప్ అయ్యే అవకాశాలే ఎక్కువ. శ్రీనివాసరెడ్డి లేకుంటే ఖమ్మ్మం లో టీఽఅర్.ఎస్ కు భవిష్గ్యత్తు ఉండదు.
మీరు రెండు రకాలుగా మాట్లాడుతున్నారని గమనించుకున్నారా ? ఇపుడు గెలిచినవారి గురించి మాట్లాడుతున్నాం. ఓడిపోయినవారు ఎందుకు ఓడిపోయారో అది వేరే టాపిక్. మీరు విశ్లేషణ చేసిన ప్రతిసారీ గెలవరు కదా ?
ReplyDeleteప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు రాహుల్ వినలేదని కొందరి వాదన !
ఒకప్పుడు ఇందిర, NTR, YSR ఇప్పుడు మోది, KCR, జగన్. వీళ్ళని ఎవరూ ఓడించలేరు, తప్పులు చేసి వాళ్లంతట వాళ్లే ఓడిపోవాలి.
ReplyDelete