చర్చాంశం - తెలుగు వర్ణమాల
చర్చాంశాన్ని పంపిన వారు - పల్లా కొండల రావు.
తెలుగులో ఌ,ౡ అనే అచ్చులతో ఏమైనా పదాలు ఉన్నాయా!?
- తెలుగు భాషకు అక్షరాలు 56.
- ఇందులో ఌ,ౡ అనే రెండు అచ్చులు ప్రస్తుతం వాడుకలో లేవు.
- అసలు ఎప్పుడైనా వీటిని వాడారా?
- మీలో ఎవరికైనా ఈ అక్షరాలతో ఏమైనా పదాలున్నట్లు తెలుసా?
- తెలిసినవారు దయచేసి మీ అభిప్రాయాలను ఆధారాలతో సహా వివరించగలరని విజ్ఞప్తి.
- పల్లెప్రపంచం విజన్ లో తెలుగు భాషాభివృద్ధికి కృషిలో భాగంగా ఈ ప్రశ్నను ఉంచడం జరిగిందని మనవి.
*Re-published
"ఌ"ని సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చిన పదాల్లో వాడేవాళ్ళు. ఉదాహరణకి "కప్తం". "ౡ"ని మాత్రం తెలుగులో ఎన్నడూ వాడలేదు.
ReplyDeleteప్రవీణ్ గారు, క్లుప్తం కు ల వత్తు సరిపోతుంది కదా? ఌ వత్తు వాడే వారా?
Deletehttps://www.dropbox.com/s/v5wlek4c1f8hzuw/PaperArtist_2014-11-27_13-35-54.jpeg
ReplyDeleteప్రవీణ్ గారు, ఈ ఇమేజ్ ఏమిటి కాస్త వివరిస్తారా? క కు ఌ వత్తు ఉన్నదిక్కడ. అయితే నాకు అర్ధం కాలేదండి. మరింత వివరంగా చెప్పగలరా?
Deleteనేను "క"కి మాత్రమే "ఌ" ఉపయోగించాను.
Deleteక కి ఌ ఉపయోగించారు అది క్లు అవుతుందా మరి? అలా క ౡ లు కలిపి క్లు (ఎలా వ్రాయాలో తెలీక ఈ క్లు ఉంచుతున్నాను) అవుతుందా? అలా ఏమైనా పదాలు తెలుగులో ఉన్నవా? మీకు తెలుసా?
Deleteఈ అక్షరాలున్నది ప్రాచీన గ్రంథాలను పదిలపరచటానికి. వీటి ఉచ్చారణ చేసే చోట వీటిని వాడేయవచ్చు.
ReplyDeleteనాలిక చివర భాగం పై దతపంక్తి మూలాన్ని అంటకుండా ఒకవేళ ళూ అనే శబ్దం చేసే పదాలుంటే అక్కడ ఈ అక్షరాన్ని వాడేయండి.
ఈ అక్షరం కనిపించే సందర్భాలు - పాణిని అష్టాధ్యాయిలో - పుషాదిద్యుతాద్య్ౣదితః పరస్మైపదేషు.
ఇంకా అథర్వణ వేదంలోని మూల బీజాక్షరాలలోనూ ఈ అక్షరం కన్పడవచ్చు.
వ్రాతలో లుప్తమయినంత మాత్రాన మానేసామని చెప్పలేము. పలికేప్పుడు పలుకుతూనే ఉంటాము.
రహ్మానుద్దీన్ గారు,
Deleteవివరణకు ధన్యవాదములు.
< ఈ అక్షరాలున్నది ప్రాచీన గ్రంధాలను పదిల పరచడానికి > ఈ వాక్యం కొంచెం కంఫ్యూజన్ గా ఉన్ననూ,
ప్రాచీన గ్రంధాలలో ఈ అక్షరాలను ఉపయోగించే ఉంటారనే గదా మీరు చెప్పేది. అయితే ఈ అక్షరాలతో పదాలున్నాయన్నమాట. ప్రాచీన కాలంలో వాడినప్పుడు ఇప్పుడు వాటిని పదిలపరచడానికి మాత్రమే వాడాలి అని మాత్రమే ఎందుకనుకోవాలి?
తెలుగు భాషలో ఌ.ౡ లను ఏ సందర్భంలో ఏ ఉచ్చారణలో ఎలా వాడాలని నియమం ఉన్నదో తెలిపినా వాటి వాడకాన్ని ఇప్పుడూ ప్రయోగించవచ్చుకదా?
మీకేమైనా వీటిని ఏ ఉచ్చారణ సందర్భంగా వాడాలన్న నియమం తెలిస్తే చెప్పగలరు. పదాల ఉదాహరణ ఇవ్వగలిగితే మరింత సౌకర్యంగా ఉంటుంది.
అలాంటప్పుడు ఇవి వాడకంలో ఎందుకు లేకుండా పోయాయి?
http://www.ubcsanskrit.ca/lesson1/devan%C4%81gar%C4%AB.html
Delete"ఌ" అనేది దంత్యం. అది "ల"ని పోలి ఉంటుంది కానీ "ళ"ని కాదు.
కొండలరావుగారూ, లిపి అన్నది కూడా కాలక్రమేణా మార్పులకు చేర్పులకు లోనవుతుంది. అది సహజం. డిజిటలైజేషన్ రోజులు ఇవి. ప్రాచీన శాశనాలూ, లిఖిత లేదా ముద్రిత గ్రంథాలూ తీసుకొని వాటిని డిజిటలిజ్ చేయాలంటే వాటిలో వాడబడిన అక్షరాలన్నీ కూడా మనకు అందుబాటులో ఉండాలి మనం వాడే ఫాంట్‌లో. లేకపోతే ఇబ్బందే. అలా కొన్ని అక్షరాలు లేవని మార్చి డిజిటలిజ్ చేస్తే యథామాతృకలు కావు కాబట్టి వాటి మూలస్వరూపాన్ని నిక్షిప్తం చేయలేదు కాబట్టి ఆ డిజిటలిజ్ చేసిన రూపాలకి ప్రామాణ్యత ఉండదు. ఒకప్పుడు ర వత్తను అక్షరం ప్రక్కన నాకారప్పోల్లు వంటి గుర్తుతో సూచించే వారు. కన్నడంలో ఇప్పటికీ అలా ఉంది, తెలుగులో లేకపోయినా. అలాగే కొన్ని కొన్ని అక్షరాలు ప్రాచీనశాసనాలలో ఉన్నా ఇప్పుడు వాడుకలో లేవు. కాని వాటినీ మన ఫాంట్ సపోర్ట్ చేయకతప్పదు డిజిటలిజేషన్ కోసం. మనకు నచ్చనివి అన్నీ తీసిపారేస్తాం అనటం పాతపడ్డ్ ప్రతీదీ కాలగర్భంలో కలిపేస్తాం అనటమే. అందుచేత యూనికోడ్ ఫాంట్ లో పాత కొత్త అక్షరాలు అన్నీ ఉంటాయి. కొన్నికొన్ని మీరు నేడు వాడదలుచుకోకపోతే వాడకండి - ఇబ్బంది లేదు - కాని ఆ అక్షరాలు ఉండటం అనవసరం అనకండి అని విన్నపం. భాషకు సంస్కృతికి చివరికి జాతికి నష్తం అపారం.
Deleteఆ అక్షరాలు వాడడం అనవసరం అని నేనెందుకు అంటాను మాష్టారు?
Deleteనేను తెలుగు పై ప్రేమ ఉన్నవాడిని. తెలుసుకోవడానికి ఒకింత తేల్చుకోవడానికి మాత్రమే ఇక్కడ ప్రశ్నలుంచుతున్నాను.
మీవంటి వారు కూడా ఆ ప్రశ్నల ఉద్దేశాన్ని సరిగా అర్ధం చేసుకోకపొతే కాస్త ఇబ్బంది కలుగుతుందని నా అభిప్రాయం.
నేనడిగింది మళ్లీ మీకు విన్నవిస్తాను లేదా పైన రెహ్మాన్ గారికి సమాధానంగానూ నా ప్రశ్నను మరోసారి వివరంగా పాజిటివ్ గా చూస్తేనూ మీకు అవగతమవుతుందని నా విజ్ఞప్తి.
1) నేనడగదలచుకున్నది తెలుసుకోవడానికి మాత్రమే
2) నేను తెలుసుకోవాలనుకున్నది ఌ , ౡ లనే అచ్చులతో మన భాషలో ఏవైనా పదాలున్నాయా?
3) మా తెలుగు మాష్టార్ని ఎప్పుడో ఈ ప్రశ్న వేస్తే నాకైతే తగలలేదు. ఉండనిదే అవెందుకు వర్ణమాలలో ఉంటాయన్నారు. ఆయన సమాధానంలో వెటకారం లేదు. కానీ నాకు సమాధానం లేదు.
4) సమాధానం రాబట్టుకోవాలనుకోవడం తప్పని ఇందులో తగు తెలిసినవారితోనే చర్చించాలనే నియమ నిబంధనలు అవసరం లేదనే అనుకుంటున్నాను.
5) పోనీ మీలో తెలిసినవారెవరైననూ ఇప్పటివరకూ ఆ అక్షరాలతో మన భాషలో ఎక్కడైనా ఏమైనా పదాలున్నట్లు చెప్పలేదు. ఒకవేళ మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఎన్నో ఏళ్లుగా తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్నకు సమాధానం లభిస్తుంది.
6) మన భాషలో ఆ అచ్చులతో ఉచ్చారణ నియమం ఉండి ఉంటే అది వాడకంలో గ్రంధాలలో సైతం ఎందుకు లేకుండా పోతున్నది?
7) నిజంగా ఆ అచ్చులతో ఉచ్చారణా నియమం ఉంటే మనమైనా ప్రయత్నించి కొనసాగించాలన్నదే నా అభిమతం కూడా.
8) నాకు లేని అభిమతాన్ని మీరు ఊహించి విమర్శించడం తప్పు కాదా?
9) దయ చేసి నా ఉద్దేశం మీరు పాజిటివ్ గా అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే తెలుగు భాషపై చదువుకునే రోజులనుండీ నాకు ప్రేమ ఉన్నది. బ్లాగు లోకంలో అలా ఉన్నవారికి వెతుకుతుంటే మొదటగా కనిపించినది మీరు. అప్పుడప్పుడు వీవెన్ గారు, రెహ్మానుద్దీన్ గారి లాంటి వారు కనిపిస్తుంటారు. మీరే ఎక్కువగా అందరికీ తప్పులు దిద్దేలా ప్రయత్నిస్తున్నారు కూడా. అలాంటి మీరే ఒక్కోసారి ఇల్ల మిగతావారిని తప్పుగా అర్ధం చేసుకోవద్దని మనవి.
చాలా భాషలకు (ఉ. ఆంగ్లం & అరబ్బీ) ప్రాచీన & ఆధునిక అని రెండు రూపాలు ఉంటాయి. దురదృష్టం కొద్దీ తమిళం తప్ప ఇతర భారత భాషలకు ఆధునిక రూపం రాలేదు.
Deleteమార్పులు అనేవి సహజంగా వచ్చినంత వరకు సంస్కరనలని స్వీకరించాలి తప్ప బాధ పడరాదు.
Tamil speakera still tend to pronounce "P" instead of "B" even in English. You need not praise Tamils.
DeleteTamil speakera still tend to pronounce "P" instead of "B" even in English. You need not praise Tamils.
DeleteArabic also does not have ప while English is missing ళ & ణ. The fact remains these languages have gone through significant changes resulting in a modern version.
DeleteI don't think that Arabic phonology has changed. Arabic speakers still use pharyngeal and epiglottal sounds which are not found in English.
Deleteఌ ౡ లతో ఏవైనా పదాలు ఉన్నాయా అన్నది సరైన ప్రశ్న కాదు. ఌ ౡ లు ఎంతవరకు అవసరం అన్నది వేసుకోవలసిన ప్రశ్న.
ReplyDeleteముందుగా ఌ ౡ, ఋ, ౠ అన్నవి హల్లులు కావు, అచ్చులు. వాటికి సమాన ధ్వనులైన ల, ర లు హల్లులుగా వున్నాయి. ఆధునిక తెలుగులో దాదాపు అన్ని అవసరాలకూ ర, ల లు సరిపోతున్నపుడు మిగతావి అనవసరమైన బరువు కింద మిగిలిపోయాయి.
కౢప్తము అని వ్రాసే బదులు క్లుప్తము అని భేషుగ్గా రాయవచ్చు.
కౄరుడు అని రాసే బదులు క్రూరుడు అని రాయవచ్చు.
ఋగ్వేదము అని రాసే బదులు రుగ్వేదము అని రాయవచ్చు.
నా ఉద్దేశం ప్రకారం, కౢప్తము అన్నా, క్లుప్తము అన్నా అర్థం మారనంత వరకు శబ్దం లో మార్పు లేనంత వరకు రెండు రకాల అక్షరాలు ఉండడం వల్ల సందిగ్దత పెరగడం తప్ప ఉపయోగం వుండదు. భాషను ఆధునీకరించాలంటే ఇటువంటి స్వీయబరువును తగ్గించక తప్పదు.
<< ఌ ౡ లతో ఏవైనా పదాలు ఉన్నాయా అన్నది సరైన ప్రశ్న కాదు. >>
Deleteఎందుకు కాదు? మన భాషలో ఆ అచ్చులతో ఏమైనా ఉపయోగం ఉండి ఉన్నదా? ఉంటే దానిని ఎందుకు కొనాసాగించ కూడదు? ఇది ఈ ప్రశ్న గోల్. కనుక ప్రశ్నలో తప్పుందని నేననుకోవడం లేదు.
ఇక మీరడిగిన ప్రశ్న ఌ,ౡ లు ఎంతమేరకు అవసరం? అవసరం లేదని తేల్చితే తప్పకుండా మన అక్షరమాలలో 2 అక్షరాలు తగ్గించుకునే శాస్త్రీయత అనవచ్చు.
కానీ దానికి మీరిచ్చిన ఉదాహరణలు తప్పు. ఋ , ౠ ల తో వచ్చే ఉచ్చారణకూ ర లతో వచ్చే ఉచ్చారణకు తేడా ఉన్నది ఋగ్వేదం సరైనది. రుగ్వేదం తప్పు పలకడం అవుతుంది. కనుక ఋ ౠ ల అవసరం ఉన్నదనే నా అభిప్రాయం.
కానీ నేను 7వ తరగతినుండి తేల్చుకుందామనుకుంటున్న విషయం లో ఇంతవరకూ సమాధానం రావడం లేదు. ఌ,ౡ లతో ఏమైనా పదాలు ఉన్నాయా? వాటి వివరం ఉంటే చెప్పండి.
మనకు తెలీకుండానే వాటితో అవసరం లేదని ఎలా చెప్పగలం. ౙల్లెడ అని వ్రాసేదానికీ జల్లెడ అని వ్రాసేదానికి ఉచ్చారణతో సహా తేడా ఉన్నది. ఆ సౌకర్యం మన భాషలో ఉన్నది. ఇంగ్లీషులో అయితే లేదనుకుంటున్నాను. ఇతర భాషల సంగతి తెలీదు.
సకారణం లేకనే అక్షరాలు వర్ధిల్లుతుంటే అనుకోవచ్చు. కానీ అక్షరాలకి ఉచ్చారణ్ రీత్యా అవసరం ఉండి ఉన్నప్పుడు వాటిని తొలగించుకోవలసిన అవసరం లేదు.
అవసరమైన ప్రతీ చోటా వాటి ప్రాధాన్యతని వివరిస్తూ పోవడం, అవసరమైన ప్రతీ చోటా తెలుగు పదాలను సృష్టించుకుంటూ పోవడం చేస్తే తెలుగు వర్ధిల్లుతుంది. దానిని పండితులే చేయాల్సిన అవసరం లేదు.
కందుకూరి(?), గురజాడ వంటివారు వచన కవిత్వం మొదలెట్టేవరకూ మన తెలుగు తెలివంతా పద్యాలలోనే ఉండేదట. ఈ తెగులును వారు దుమ్ము దులిపారు కదా? కుక్క పిల్లా - సబ్బు బిళ్ళా కాదేదీ కవితకనర్హం అని శ్రీ శ్రీ అన్నదీ అందుకే.
భాష ప్రయోజన భావ ప్రకటనకే అయినప్పుడు అది పద్యంలోనో అర్ధంకాని పదాల గందరగోళంగానో ఉండాలనే వీరి పైత్యం ప్రమాదకరమే. అసలా పైత్యం కూడా తెలుగుని తెలుగువారికి దూరం చేస్తున్నదని నా ఆరోపణ.
ఇదే సందర్భంలో భాషలో వ్యాకరణాన్ని , భాషలో నియమాలను తారుమారు చేయకూడదు. వాటి పునాదుల ఆధారంగా తెలుగును మరింత సరళతరం చేయాలి. పద్యాల పేరుతో పండితులకి మాత్రమే చేరువగా ఉంచిన సాహిత్యాన్ని గురజాడ వంటివారు క్రిందికి తెచ్చి సాధించిన ఫలితాల అనుభవం తో మరింత మేలు తెలుగుకు జరగాలనేదే నా తాపత్రయం.
ఌ ౡ ల గురించి ప్రస్తావిస్తున్నారు.
ReplyDeleteపరవస్తు చిన్నయసూరిగారు బాలవ్యాకరణం అని వ్రాసారు తెలుగుకోసం. దాని అర్థం ఆ ప్రకారం అప్పటినుండి తెలుగు అలా ప్రవర్తించాలి అని కాదు. అప్పటికి తెలుగులో వాడుకలు ఆ విధంగా కనిపిస్తున్నాయి అని.
ఆ బాలవ్యాకరణ యొక్క సంజ్ఞాపరిఛ్ఛేదంలో నాలుగవ సూత్రం ఇలా ఉంది:
"ఋ ౠ ఌ ౡ విసర్గ ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ ఙ్ ఞ్ శ ష" లు సంస్కృతసమంబులను గూడి తెలుఁగున వ్యవహరింపంబడు.
కౢప్తము అనే మాటను చిన్నయసూరిగారు ఈ సూత్రానికి ఉదాహరణల్లో ఇచ్చారు.
ౡ అనే ఏకాక్షరశబ్దానికి తెలుగులో ప్రవేశం లేదు.
వత్తు అక్షరాలేవీ అచ్చతెలుగులో లేవు. అవి ఉన్న సభ,రథము, ఆజ్ఞ వంటి పదాలన్నీ సంస్కృతంలోంచి తెచ్చుకున్నవే. అలాగే దుఃఖము వంటి విసర్గ కల పదాలూ సంస్కృతంలోనివే.
కొన్ని కొన్ని అపవాదాలూ (exceptions ) ఉన్నాయి. ఠేవ అనేది సంస్కృతపదం కాదు తెలుగుమాటే.
గమనిక: ఈ సందర్భంగా నేను మరింత చర్చలోనికి దిగదలచుకోలేదు. నా మాటలు నచ్చకపోయినా అసలు చిన్నయసూరి నచ్చకపోయినా ఒక నమస్కారం. ఈ వ్యాఖ్య ఉన్న విషయం చెప్పటానికి ఉద్దేశించినదే కాని ఎవరినీ ఒప్పించాలనో నొప్పించాలనో చేసినది కాదు.
రుషి , ఋషి ఈ రెండింటి మధ్య ఉఛ్చారణ రీత్యా ఉన్న తేడా తెలుసు. అలాగే " మహ+ఋషి=మహర్షి " గుణసంధి అనుకుంటాను. అదీ తెలుసు. కానీ ఌ తో పదం తెలీదు. ఇప్పుడు మీరు చెప్పినదీ , నిన్న ప్రవీణ్ చెప్పినదీ అయిన కౢప్తము(కాపీ చేశాను. నాకు టైప్ చేయడం రావడం లేదు) మనం వాడే క్లుప్తము లలో ఉచ్చారణ రీత్యా తేడాలున్నవా? తెలుపగలరు.
Deleteవత్తు అక్షరాలు తెలుగులో లేవనేదీ ఇప్పుడు తెలుసుకోవడమే. అయితే అవి లేకుండా కంటే ఉంటేనే బాగుంటుంది కదా? కనుక అవసరం రీత్యా ఇక్కడ మన భాష కొన్ని అక్షరాలను కలుపుకుని మెరుగైనదన్నమాట.
కొన్ని అపవాదులూ నిజమే. చాలా ఉన్నాయి. ఆదివారం ఈనాడులో ఇవి వస్తుంటాయి. అయితే వీటిలోనూ తప్పులు సూచిస్తున్నారనే విమర్శ ఉన్నది. నిజం నిర్ధారించే శక్తి నాకు లేదు భాషా పరంగా.
ఇకపోతే ఈ గమనిక అందులో నమస్కారం ఎందుకు సర్? ఇది ఏ విధంగానూ సంస్కారం కాదు గదా? ఎవరికో నచ్చకపోతే శ్యామలీయం, చిన్నయసూరి గారల గొప్పతనం మసకబారుతుందా? మీరిలా వ్యాఖ్యానించడం ఖచ్చితంగా మీరు నొచ్చుకుని ఇతరులను నొప్పించడమే అవుతుంది. క్షమించాలి మీకు చెప్పేటంతటివాడిని కాకున్నా నేను చెప్పేది తప్పయినా బాగున్నదానిని బాగున్నదన్నట్లే బాగాలేని దానిని బాగాలేదని అనాలని నేనే గతంలో ఓ పోస్టు వ్రాశాను. ఆ మేరకు ఇప్పుడు అప్పుడప్పుడు మీరు నేను వ్యాఖ్యలకు దూరమవుతాననడం బాగాలేదు గనక బాగాలేదనే చెప్పదలచుకున్నాను. ఇలా చెప్పడం మీ మీద గౌరవం + అభిమానాన్ని ఏ మాత్రం తగ్గించదనే అనుకుంటున్నాను. మీమీద ప్రేమ + అభిమానం మీ అభిప్రాయాలన్నింటితో నేను ఏకీభవిస్తేనే ఉన్నట్లు కాదని మిమ్ములను కావాలని కిచపరిస్తేనో ఎద్దేవా చేస్తేనొ తప్పని అనుకుంటున్నాను. మీతో సహా ఎవరిని తెలుసుకొవడానికి ప్రశ్నించినా తప్ప కాదనే అనుకుంటున్నాను. మీరు ఇలా గమనిక పెట్టడం అలగడం క్రిందకు ఓ రకమైన డిఫెన్స్ బెదిరింపు క్రిందకు వస్తుందని అది సరయినది కాదని అనదలచుకున్నాను. మీకు బెదిరించాలనే ఉద్దేశం లేదనీ తెలుసు. నాపై కొన్ని బ్లాగూలలో ఎంత దారుణంగా వ్రాస్తున్నారో మీరే నాకు సూచించారు. మరి నేనేమి చేశాను జై గారి కామెంటుతో పునరాలోచనలో పడి పల్లె ప్రపంచాన్ని పునరుద్ధరించాను గదా?
దయచేసి మీరు మీకు తెలిసిన జ్ఞానాన్ని మాలాంటి వారికి నేర్పాలని విజ్ఞప్తి. ఈ 2 రోజులనుండి తెలుగు భాషకు సంబంధించినవి మీనుండి నేర్చుకున్నవి ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరో ఏదో అన్నారని ఎక్కువగా బాధ పడడం తప్పు. ఆ తప్పు వల్ల మాలాంటివాళ్లం చాలామేరకు నష్టపోవలసి వస్తుంది. ఇప్పుడెలా అయితే వివరణగా చెప్పారో అవసరమైన ప్రతీ చోటా ఇలాగే మీ అభిప్రాయాలు చెప్పాలని నా డిమాండ్.
ఎవరూ ఏమి అనరనే గారెంటీ మాత్రం లేదండీ. దానికి పరిష్కారమూ సంపూర్ణంగా లేదు.
అపవాదులు కాదండి అపవాదాలు (exceptions).
Deleteనేను నొచ్చుకున్న మాట వాస్తవమే. దాపరికం ఏమీ లేదు అందులో. నేను నొచ్చుకున్నది శ్రీకాంత్ చారిగారు చేసిన దూషణలకు కొంత ఐతే వాటికి మౌనంగా బ్లాగుమిత్రులు అంగీకారం తెలుపటం దానికి మరికొన్ని రెట్లు.
నేనేదోజ్ఞానినన్న భ్రమ నాకెప్పుడూ లేదు. నా అభిప్రాయాలను పంచుకోవటానికి ఎల్లప్పుడూ సిధ్ధమే కాని దూషణాపూర్వకవాతారణాన్ని అమోదించ లేను. ప్తతిదూషణలు చేసేంత అజ్ఞానినీ కాను.
మీరు ప్రస్తావింఛారు కాబట్టి అదే నేపధ్యంలో మరొక మాట కూడా గుర్తుచేస్తున్నాను. ఆ బ్లాగులో దూషణలకు శ్రీకాంత్ చారిగారినీ గురిచేసారు. అదీప్రాస్తావించి దానికీ నిరసన తెలియచేసాను. ఐతే చారిగారి ఎ-మెయిల్ ఐడీ నా దగ్గర లేదు కాబట్టి తెలిస్తే మీరో జైగారో వారికి నా అభిప్రాయాన్ని తెలుపవలసిందిగా కోరాను. నాకు అప్పుడూ ఎప్పుడూ అందరూ సమానమే.
నా అభిప్రాయాలను చెప్పటం వేరు - వాటిపై నిరంతర చర్చలకు సిధ్ధపడటం వేరు. రెండవది నాకు సాధ్యపడదు.
నేను ఆయన బ్లాగులో ఆ పోస్టుకు కామెంటు ఉంచానండి. మీ గురించి అలా ప్రస్తావించడంపై ఎందుకో అది పబ్లిష్ కాలేదు. ఎవరూ సపోర్ట్ చేయరనుకోవద్దు. శ్రీకాంత్ చారి గారు కూడా స్వయం పరిశీలన చేసుకునే వ్యక్తే నాకు తెలిసి. మీరు ఏమి వింత అనేసరి ఆయన బాధ పడ్డారు మీరు కూడా ఓసారి ఆ పోస్టులోని కామెంట్లన్నీ మరోసారి చదవండి. అప్పటికీ మీరు బాధపడితే అర్ధం ఉంటుంది. మీకు తెలుగు భాషపై ఉన్న మమకారంతో చేసిన కామెంటుకు శ్రీకాంత్ చారి గారు కూడా నొచ్చుకున్నారు. అయితే ఆయనలా పోస్టు వ్రాయడం బాగాలేదు. అదే విషయాన్ని ఆ పోస్టుకే కామెంటుగా చెప్పాను. పబ్లిష్ కాకపోవడం నా పరిధిలోనిది కాదు. అదే సందర్భంలో పండితులే చర్చించాలన్నదానిలో నా అభిప్రాయం వేరు. ఆ విషయంలో శ్రీకాంత్ చారి గారి అభిప్రాయంతొనే నేను కొంతమేరకు ఏకీభవిస్తాను. ఏదైనా తెలుగు భాషను అభివృద్ధిపరచడానికే మీరు , నేను, శ్రీకాంత్ చారి తపన పడుతున్నామనే నాకనిపిస్తోంది. మిగతా భావోద్వేగాలవల్ల పెద్దగా ప్రయోజనం లేదు శాశ్వతమూ కాదు గనుక పట్టించుకోవలసిన పనిలేదు. పట్టించుకుంటే పని పాడవుతుంది. మనసూ పాడవుతుంది.
Deleteఅవును శ్రీకాంత్ చారి గారిపై దూషణలను నాకు గుర్తు చేశారు. కానీ మీరూ అక్కడే ఖండించలేదు గదా? మీరు వాటిని సహించరని తెలుసు. ఆ ఉద్దేశమూ స్వభావమూ మీది కాదని నాకు తెలుసు. కానీ పరిస్తితులూ పరిమితులగురించే మీకు గుర్తు చేస్తున్నాను. మీ టపా వల్లనే ప్రజ మూతపడ్డదని నాకొకరు మెయిల్ చేశారు. తరువాత మీ బ్లాగులో కామెంట్ చూసి ఇంకొకరు పశ్చాత్తాపపడి మెయిల్ చేశారు.
మీరు కావాలని ఎవరినీ గాయపరచరు. కానీ మీరూ భావొద్వేగాలకు లోనయిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణా పై ఓ పోస్టే తప్పుగా ఉంచారు. తరువాత తెలుసుకున్నారు. కానీ మీగురించి తెలిసినవారెవరూ శ్యామలీయంగారు కావాలని చేశారని అనుకోరు. కేవలం భావోద్వేగాలలో ఆవేశపడేదానికీ కావాలని పనిగట్టుకుని విషం చిమ్మేదానికీ తేడా ఉన్నది. శ్రీకాంత్ చారి గారు ఎట్టిపరిస్తితులలోనూ రెండో రకం కాదు. నాకు స్వీయ అనుభవం ఉన్నది.
ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నది తెలుగు ఫోనాలజీ కాదు, సంస్కృత ఫోనాలజీ. ఒకప్పుడు తెలుగులో "ర" ధ్వని లేదు, "ఱ" ధ్వని ఉండేది. "చెఱువు" అనేది తెలుగు పదం కనుక అందులో "ఱ" ఉపయోగించేవాళ్ళు. "ఊరు" అనేది "పురం" అనే సంస్కృత పదం నుంచి వచ్చినది కనుక అందులో "ర" ఉపయోగించేవాళ్ళు. ఇంగ్లిష్‌లో "R" ధ్వని సంస్కృతంలోని "ర" ధ్వనిని పోలి ఉంటుంది కానీ తెలుగులోని "ఱ" ధ్వనిని కాదు. అందువల్ల తెలుగులోని ఇంగ్లిష్ పదాల్లో "ర" ఉపయోగిస్తారు కానీ "ఱ" కాదు. తెలుగుపై సంస్కృతం, ఇంగ్లిష్‌ల ప్రభావాలు పెరగడం వల్ల మనం ఇప్పుడు "ఱ" ఉపయోగించాల్సిన చోట కూడా "ర" ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకి ఇప్పుడు అందరూ "బఱ్ఱె"ని "బర్రె" అనే అంటున్నారు.
Deletehttps://scontent-a-fra.xx.fbcdn.net/hphotos-xpa1/v/t1.0-0/q83/s600x600/1508578_954240121270068_5864287194160205750_n.jpg?oh=83fdf317706bdae028e27a41393b6ee6&oe=55184C22
Deleteఅపవాదులు స్థానే అపవాదాలు అని సరిచేసుకుంటానండీ. ధన్యవాదములు.
Deletehttps://scontent-a-fra.xx.fbcdn.net/hphotos-xaf1/v/t1.0-0/q81/s600x600/1384210_954286351265445_5523509841448430054_n.jpg?oh=e489586806b9e581d450c45384d1ffb7&oe=5512937F
ReplyDeleteప్రవీణ్ గారు, మీరిచ్చిన రెండు లింకులలోనూ ఌ ౡ లకు సంబంధించిన సమాచారం లేదండీ. మీకేమైనా వీలుంటే ఆ వివరాలు దొరికితే ఎప్పుడైనా సరే ఇక్కడ వివరం ఇవ్వగలరు.
Deleteపాఠశాలలో మా తెలుగుమాష్టారు చెప్పారు.
Delete'తవఌకారము' కారము అనే పదం ఉన్నదని. దానిని 'ఌ' వినియోగానికి ఉదాహరణగా చెబుతారని. ఆ మాటకు అర్ధం నాకు గుర్తు లేదు.
Dental laterals (దంత్య పార్శ్వికాలు) అయిన "ఌ, ౡ & ల" మొదట్లో తెలుగులో లేవు, retroflex lateral approximant (మూర్ధన్య పార్శ్విక అంతస్థం) అయిన "ళ" మాత్రం ఉండేది. ఇప్పుడు సంస్కృతం, ఇంగ్లిష్‌ల ప్రభావం వల్ల చాలా మంది "ళ"ని "ల"గా పలుకుతున్నారు. "ఌ"ని సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చిన పదాల్లోనే వాడేవాళ్ళు కానీ native Telugu wordsలో ఎన్నడూ వాడలేదు.
Deleteఅలా సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన పదాలలో ఌ లేదా ౡ వాడబడిన ఒక పదం లేదా పదాలైనా చెప్పగలరా? ఇప్పటికిప్పుడు కాకున్నా మీరు సేకరించైనా చెప్పగలరేమో ప్రయత్నించండి ప్రవీణ్ గారు. సమాచారం ఇస్తున్నందుకు ధన్యవాదములు.
Deleteఅక్షరం అంటే క్షరం కానిది..... అంటే నశించనిది కదా..... మరి అక్షరాలు ఎలా నశించి పోతున్నాయి అండి.....ఏదో చిన్నవాడిని..... అడిగానని ఏమి అనుకోకండి...... [-(
ReplyDeleteఅది తెలుసుకుందామనేగదండీ ఈ తపనంతా :)) ఎవరికి తెలిసింది వారు శక్తిమేరకు చెప్తున్నారు. ఎప్పటికైనా సమాధానం వస్తుందని ఆశిద్దాం. మీ ప్రశ్నకు కూడా సమాధానం వస్తుందని ఆశిద్దాం.
Deleteఅక్షరం వేరు, ధ్వని వేరు. తెలుగువాళ్ళు "ళ"ని "ల"గా పలుకుతారు. తెలుగులో "ళ" అక్షరం ఉంది కానీ "ళ" ధ్వని లేదు.
ReplyDeleteప్రవీణ్ గారు, ధ్వని ని సూచించడానికి అక్షరం ఉపయోగపడదా? ఇంగ్లీషులో సిలబుల్స్ గందరగోళం కంటే తెలుగులో ఎక్కువ అక్షరాలు ఉండి ఆ లోటుని కొంతమేరకు తీరుస్తున్నాయని భావిస్తున్నాను. కాదంటారా?
Deleteతెలుగులో స్పెలింగ్ ఎలా ఉంటుందో, ప్రనన్సేషన్ కూడా అలాగే ఉంటుంది. తెలుగులో అక్షరాలు ఎక్కువగా ఉన్నా తెలుగు నేర్చుకోవడం సులభం. ఫోనాలజీ విషయానికి వస్తే, అరబ్ భాషలో ఉండే pharyngeal & epiglottal sounds తెలుగువాళ్ళూ పలకలేరు, ఇంగ్లిష్‌వాళ్ళు కూడా పలకలేరు. ఏ భాష ఫోనాలజీ దానికి ఉంటుంది.
Delete