బాలచందర్ (1930-2014)
చిరంజీవి సినిమాలలో నాకు నచ్చిన వాటిలో 1) రుద్రవీణ 2) విజేత బాగా గుర్తున్నాయి. అందులో రుద్రవీణ చాలా బాగా నచ్చుతుంది. ప్రముఖ దర్శకుడు బాలచందర్ మృతి వార్త విన్నప్పుడు నాకీ పాటను గురించి వ్రాయాలనిపించింది. ఈ చిత్రానికి కే. బాల చందర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో 'నమ్మకు నమ్మకు ఈ రేయినీ' పాటతో పాటు 'తరలిరాద తనే వసంతం', 'చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది' పాటలు కూడా బాగుంటాయి. మిగతా పాటలూ బాగుంటాయి. నమ్మకు నమ్మకు ఈ రేయినీ పాట సాహిత్యం, బాలు పాడిన తీరు బాగుంటాయి. రవి కిరణం కనపడితే తెలియును తేడా ఏదో అంటూ ఆశావాదం వినిపిస్తూనే, పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా ఏ హాయి రాదోయి నీ వైపు అంటూ అందరి బాగుతోటే మన బాగు ఉంటుందన్న ఆశయాన్నీ వినిపిస్తాడు. "ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో పుడమిని చూడని కన్నూ నడపదు ముందుకు నిన్నూ నిరసన చూపకు నువ్వు ఏ నాటికీ... " ఈ వాక్యం చాలు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పడానికి. ఈ పాటలోని అంశాలన్నీ పాత పాటలెన్నింటిలోనో చెప్పినా సీతారామశాస్త్రి చెప్పిన తీరు కొత్తగా ఉన్నట్లనిపిస్తుంది. ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టనీ ఎప్పుడూ ఆలోచింపజేసేదిగా ఉండే ఈ పాట నాకు చాలా బాగా నచ్చుతుంది. బాలు పాడిన తీరు ముఖ్యంగా పాట మధ్యలో సరిగమలు పలికించిన తీరు .... అలా పలకడంలో బాలూకి బాలూయే సాటి అంటే అతిశయోక్తి కాదేమో! మీరూ ఈ పాటను మరోసారి విని మీ అభిప్రాయం చెప్తారని ఆశిస్తున్నాను.
చిత్రం : రుద్రవీణ (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : యస్ పి బాలసుబ్రమణ్యం.
చీకటమ్మ సీకటీ ముచ్చటైన సీకటీ
ఎచ్చనైన ఊసులెన్నొ రెచ్చగొట్టు సీ..కటీ..
నిన్ను నన్ను రమ్మందీ కన్నుగొట్టి సీకటి
ముద్దుగా ఇద్దరికీ ఒద్దికైన సీకటీ..
పొద్దుపొడుపే లేని సీకటే ఉండిపోనీ...
మనమధ్య రానీక లోకాన్ని నిద్దరోనీ...
రాయే రాయే రామసిలకా సద్దుకుపోయే సీకటెనకా...
నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి, మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి, మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
వెన్నలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకూ
రవి కిరణం కనబడితె తెలియును తేడాలన్ని
నమ్మకు నమ్మకు, అరె నమ్మకు నమ్మకు నువ్వూ నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మా..యని
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్నూ నడపదు ముందుకు నిన్నూ
నిరసన చూపకు నువ్వు ఏ నాటికీ...
పక్క వారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
పక్క వారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
ఏ హాయి రాదోయి నీ వైపు మరువకు అది
నమ్మకు నమ్మకు, అరె నమ్మకు నమ్మకు ఆహ నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మా..యని
శీతాకాలంలో ఏ కొయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
శీతాకాలంలో ఏ కొయిలై..నా రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక
ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
ఆనాడు వాసంత గీతాలు పలుకును కద
మ
గసమ
దమద
నిదని
మమ మమ గస
మమ మమ దమ
దద దద నిద
నిని నిని
సగసని సని
దనిదమ దమ
నిసని దసని
దనిద మసగ
నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు ఆహా నమ్మకు నమ్మకు ఈ రేయిని
అహ కమ్ముకు వచ్చిన ఈ మా..యని
కన్నులు మూసి, మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి, మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మా..యని.
- పల్లా కొండల రావు
*** *** ***
మీరూ మీకు నచ్చిన పాట గురించి వ్రాయాలనుకుంటే
ఇక్కడ నొక్కండి.
*** *** ***
*Republished