ఈ పాటని ఎన్నిసార్లు విని ఉంటానో నాకే తెలీదు. పల్లెల్లో హిందువులలో ఎక్కడ పెళ్లి జరిగినా నేటికీ నాకు తెలిసినంత వరకూ ఈ పాట లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదనుకుంటాను. ఎన్నిసార్లు విన్నా ఈ పాట బోర్ కొట్టినట్లనిపించదు. మిగతా పాటల్లో ఎంత నచ్చినా కొన్నాళ్లకు ఎంతో కొంతైనా మొనాటినీ వచ్చేస్తుంది. ఈ పాటకెందుకో అలా అనిపించదు నాకు. ఎందుకో వివరించేంత శక్తి లేదు. సాహిత్యమా? సంగీతమా? గానమా? ఏది కారణమో తెలీదు. చిత్రీకరణ అనడానికి ఆ సినిమాను అంత ఇష్టంగా చూసింది కాదు. ఈ పాటపై వివరాలు వ్రాద్దామని గూగులిస్తే చాలా వివరాలున్నాయి. వికీపీడియాలోనూ ఓ పేజీ ఉన్నది ఆ లింకు ఇస్తున్నాను. మీరు ఇక్కడ నొక్కి చూడండి.
పాట వివరాలు వికీపీడియానుండి సేకరించినవి :
- 'సీతారాముల కళ్యాణం చూతము రారండీ' పాట ఒక సంగీతభరితమైన తెలుగు సినిమా పాట. దీనిని సీతారామ కళ్యాణం (1961) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించారు. దీనిని గాలిపెంచల నరసింహారావు స్వరపరచగా, మధురగాయని పి.సుశీల బృందం గానం చేశారు. ఈ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. ఇది ఇప్పటికి శ్రీరామనవమి నాడు మరియు హిందువుల పెళ్ళి కార్యక్రమాలలో వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటను రామునిగా నటించిన హరనాథ్ మరియు సీతగా నటించిన గీతాంజలి పై చిత్రీకరించారు.
- "సీతాకళ్యాణ వైభోగము" అని త్యాగయ్య రచించిన ఉత్సవ సాంప్రదాయ కీర్తన స్ఫూర్తితో సముద్రాల సీనియర్ ఈ పాటను రచించారు.
- శ్రీరాముడు పుట్టి, పెరిగిన పిదప విశ్వామిత్రుని యాగాన్ని సంరక్షించి ఆ తర్వాత సీతా స్వయంవరంలో గురువాజ్ఞ శిరసావహించి పాల్గొంటాడు. శివదనుర్భంగం చేసిన పిదప సీతారాముల కళ్యాణం లోకంలోని జనుల హర్షాతిశయంగా మిథిలాపురిలో జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ పాటను అద్భుతంగా చూపించారు. సీతారాములను వధూవరులుగా అలంకరించే తీరును, పెళ్లిమండపంలో వివిధ కళ్యాణ ఘట్టాలను ఎంతో సహజంగా, కళాత్మకంగా చిత్రించారు.
సీతా రాముల కళ్యాణము చూతము రారండీ
శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండి — [ మ్యూసిక్ ]
చూచు వారులకు చూడ ముచ్చటగా, పుణ్య పురుషులకు దన్య భాగ్యమట
[చూచు వారులకు చూడ ముచ్చటగా, పుణ్య పురుషులకు దన్య భాగ్యమట] — [ కోరస్ ]
భక్తి యుక్తులకి ముక్తి ప్రథమట..ఆ.ఆ.ఆ.ఆ.....
భక్తి యుక్తులకి ముక్తి ప్రదమట, సురులును మునులను చూడ వచ్చునట
కళ్యాణము చూతము రారండి... — [ మ్యూసిక్ ]
దుర్జనకోటిని దర్పమదంతగా ..సజ్జన కోటి ని సంరక్షింపగా
[దుర్జనకోటిని దర్పమదంతగా ..సజ్జన కోటి ని సంరక్షింపగా] — [ కోరస్ ]
దరణీ జాతిని స్థావన చేయగా..ఆ.ఆ.ఆ.ఆ.....
దరణీ జాతిని స్థావన చేయగా... నరుడై పుట్టిన పురుషోత్తముని
కళ్యాణము చూతము రారండి.. — [ మ్యూసిక్ ]
దశరథ రాజు సుతుడై వెలసి... కౌశికు యాగము రక్షణ చేసి..
[దశరథ రాజు సుతుడై వెలసి...కౌశికు యాగము రక్షణ చేసి] — [ కోరస్ ]
జనకుని సభ లో హరి విల్లుని విరిచి..ఆ.ఆ.ఆ.ఆ.....
జనకుని సభ లో హరి విల్లుని విరిచి, జానకి మనసు గెలిచిన రాముని
కళ్యాణము చూతము రారండి..శ్రీ సీతారాముల కళ్యాణం చుతము రారండి — [ మ్యూసిక్ ]
సీత రాముల కళ్యాణం చూతము రారండీ
శ్రీ సీత రాముల కళ్యాణం చూతము రారండి — [ మ్యూసిక్ ]
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి...
బొట్టును పెట్టి — [ కోరస్ ]
మణి బాసికమును నుదుటన గట్టి
నుదుటన గట్టి — [ కోరస్ ]
పారాణిని పాదాలకు పెట్టి..ఆ.ఆ.ఆ.ఆ.....
పారాణిని పదాలకు పెట్టి..పెళ్లి కూతురై వెలసిన సీత..
కళ్యాణము చుతము రారండి..శ్రీ సీతారాముల కళ్యాణం చుతము రారండి — [ మ్యూసిక్ ]
సంపగి నూనెను కురులను దువ్వి
కురులను దువ్వి — [ కోరస్ ]
ఒంపుగ కాపురి నామము గీసి
నామము గీసి — [ కోరస్ ]
చంపగ వాసి చుక్కను పెట్టీ..ఆ.ఆ.ఆ.ఆ.....
చంపగ వాసి చుక్కను పెట్టీ...పెండ్లీ .. కొడుకై వెలసిన రాముని..
కళ్యాణము చుతము రారండి..శ్రీ సీతారాముల కళ్యాణం చుతము రారండి — [ మ్యూసిక్ ]
జానకి దోసిట కెంపుల త్రోవై
కెంపుల త్రోవై — [ కోరస్ ]
రాముని దోసిట నీలపు రాసై
నీలపు రాసై — [ కోరస్ ]
ఆణిముత్యములు తలంబ్రాలుగా..ఆ.ఆ.ఆ.ఆ.....
ఆణిముత్యములు తలంబ్రాలుగా...శిరమున వెలసిన సీతారాముల..
కళ్యాణము చుతము రారండి..శ్రీ సీతారాముల కళ్యాణం చుతము రారండి — [ మ్యూసిక్ ]
ఇక్కడ పాట వాక్యాల పక్కన మ్యూసిక్ కోరస్ అని ఇచ్చినవాటిలో కూడా ఆ పాట గొప్పదనం ఇమిడి ఉంది. ఆ మ్యూసిక్ + కోరస్ కూడా చాలా చాలా బాగుంటాయి అంటే సరిపోదు. మీరూ ఓసారి ... సారీ..... మరోసారి విని ఈపాటపై మీ అభిప్రాయం చెప్పండి.
*** *** ***
- పల్లా కొండల రావు,
31-03-2012.