ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టని, ఎప్పటికీ హిట్ సాంగ్ కదా ఇది!




ఈ పాటని ఎన్నిసార్లు విని ఉంటానో నాకే తెలీదు. పల్లెల్లో హిందువులలో ఎక్కడ పెళ్లి జరిగినా నేటికీ నాకు తెలిసినంత వరకూ ఈ పాట లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదనుకుంటాను. ఎన్నిసార్లు విన్నా ఈ పాట బోర్ కొట్టినట్లనిపించదు. మిగతా పాటల్లో ఎంత నచ్చినా కొన్నాళ్లకు ఎంతో కొంతైనా మొనాటినీ వచ్చేస్తుంది. ఈ పాటకెందుకో అలా అనిపించదు నాకు. ఎందుకో వివరించేంత శక్తి లేదు. సాహిత్యమా? సంగీతమా? గానమా? ఏది కారణమో తెలీదు. చిత్రీకరణ అనడానికి ఆ సినిమాను అంత ఇష్టంగా చూసింది కాదు. ఈ పాటపై వివరాలు వ్రాద్దామని గూగులిస్తే చాలా వివరాలున్నాయి. వికీపీడియాలోనూ ఓ పేజీ ఉన్నది ఆ లింకు ఇస్తున్నాను. మీరు ఇక్కడ నొక్కి చూడండి. 

పాట వివరాలు వికీపీడియానుండి సేకరించినవి :
  • 'సీతారాముల కళ్యాణం చూతము రారండీ' పాట ఒక సంగీతభరితమైన తెలుగు సినిమా పాట. దీనిని సీతారామ కళ్యాణం (1961) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించారు. దీనిని గాలిపెంచల నరసింహారావు స్వరపరచగా, మధురగాయని పి.సుశీల బృందం గానం చేశారు. ఈ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. ఇది ఇప్పటికి శ్రీరామనవమి నాడు మరియు హిందువుల పెళ్ళి కార్యక్రమాలలో వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటను రామునిగా నటించిన హరనాథ్ మరియు సీతగా నటించిన గీతాంజలి పై చిత్రీకరించారు.
  • "సీతాకళ్యాణ వైభోగము" అని త్యాగయ్య రచించిన ఉత్సవ సాంప్రదాయ కీర్తన స్ఫూర్తితో సముద్రాల సీనియర్ ఈ పాటను రచించారు.
  • శ్రీరాముడు పుట్టి, పెరిగిన పిదప విశ్వామిత్రుని యాగాన్ని సంరక్షించి ఆ తర్వాత సీతా స్వయంవరంలో గురువాజ్ఞ శిరసావహించి పాల్గొంటాడు. శివదనుర్భంగం చేసిన పిదప సీతారాముల కళ్యాణం లోకంలోని జనుల హర్షాతిశయంగా మిథిలాపురిలో జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ పాటను అద్భుతంగా చూపించారు. సీతారాములను వధూవరులుగా అలంకరించే తీరును, పెళ్లిమండపంలో వివిధ కళ్యాణ ఘట్టాలను ఎంతో సహజంగా, కళాత్మకంగా చిత్రించారు.
సీతా రాముల కళ్యాణము చూతము రారండీ
శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండి — [ మ్యూసిక్ ]

చూచు వారులకు చూడ ముచ్చటగా, పుణ్య పురుషులకు దన్య భాగ్యమట
[చూచు వారులకు చూడ ముచ్చటగా, పుణ్య పురుషులకు దన్య భాగ్యమట] —  [ కోరస్ ]

భక్తి యుక్తులకి ముక్తి ప్రథమట..ఆ.ఆ.ఆ.ఆ.....
భక్తి యుక్తులకి ముక్తి ప్రదమట, సురులును మునులను చూడ వచ్చునట
కళ్యాణము చూతము రారండి... — [ మ్యూసిక్ ]

దుర్జనకోటిని దర్పమదంతగా ..సజ్జన కోటి ని సంరక్షింపగా
[దుర్జనకోటిని దర్పమదంతగా ..సజ్జన కోటి ని సంరక్షింపగా] — [ కోరస్ ]

దరణీ జాతిని స్థావన చేయగా..ఆ.ఆ.ఆ.ఆ.....
దరణీ జాతిని స్థావన చేయగా... నరుడై పుట్టిన పురుషోత్తముని
కళ్యాణము చూతము రారండి.. — [ మ్యూసిక్ ]

దశరథ రాజు సుతుడై వెలసి... కౌశికు యాగము రక్షణ చేసి..
[దశరథ రాజు సుతుడై వెలసి...కౌశికు యాగము రక్షణ చేసి] — [ కోరస్ ]

జనకుని సభ లో హరి విల్లుని విరిచి..ఆ.ఆ.ఆ.ఆ.....
జనకుని సభ లో హరి విల్లుని విరిచి, జానకి మనసు గెలిచిన రాముని
కళ్యాణము చూతము రారండి..శ్రీ సీతారాముల కళ్యాణం చుతము రారండి  — [ మ్యూసిక్ ]

సీత రాముల కళ్యాణం చూతము రారండీ
శ్రీ సీత రాముల కళ్యాణం  చూతము రారండి  — [ మ్యూసిక్ ]

సిరి కళ్యాణపు బొట్టును పెట్టి...
బొట్టును పెట్టి —  [ కోరస్ ]
మణి బాసికమును నుదుటన గట్టి
నుదుటన గట్టి — [ కోరస్ ]
పారాణిని పాదాలకు పెట్టి..ఆ.ఆ.ఆ.ఆ.....
పారాణిని పదాలకు పెట్టి..పెళ్లి కూతురై వెలసిన సీత..
కళ్యాణము చుతము రారండి..శ్రీ సీతారాముల కళ్యాణం చుతము రారండి — [ మ్యూసిక్ ]

సంపగి నూనెను కురులను దువ్వి
కురులను దువ్వి — [ కోరస్ ]
ఒంపుగ కాపురి నామము గీసి
నామము గీసి — [ కోరస్ ]
చంపగ వాసి చుక్కను పెట్టీ..ఆ.ఆ.ఆ.ఆ.....
చంపగ వాసి చుక్కను పెట్టీ...పెండ్లీ .. కొడుకై వెలసిన రాముని..
కళ్యాణము చుతము రారండి..శ్రీ సీతారాముల కళ్యాణం చుతము రారండి  [ మ్యూసిక్ ]

జానకి దోసిట కెంపుల త్రోవై
కెంపుల త్రోవై — [ కోరస్ ]
రాముని దోసిట నీలపు రాసై
నీలపు రాసై — [ కోరస్ ]
ఆణిముత్యములు తలంబ్రాలుగా..ఆ.ఆ.ఆ.ఆ.....
ఆణిముత్యములు తలంబ్రాలుగా...శిరమున వెలసిన సీతారాముల..
కళ్యాణము చుతము రారండి..శ్రీ సీతారాముల కళ్యాణం చుతము రారండి  — [ మ్యూసిక్ ]

ఇక్కడ పాట వాక్యాల పక్కన మ్యూసిక్ కోరస్ అని ఇచ్చినవాటిలో కూడా ఆ పాట గొప్పదనం ఇమిడి ఉంది. ఆ మ్యూసిక్ + కోరస్ కూడా చాలా చాలా బాగుంటాయి అంటే సరిపోదు. మీరూ ఓసారి ... సారీ..... మరోసారి విని ఈపాటపై మీ అభిప్రాయం చెప్పండి. 
***   ***   *** 
- పల్లా కొండల రావు,
31-03-2012.

Post a Comment

  1. 100% ఒప్పుకుంటారు.చక్కని పాటని గుర్తుచేసినందుకు నెనర్లు

    ReplyDelete
    Replies
    1. దన్యవాదములు వసంతం.నెట్ గారు.

      Delete
  2. ముఖ్యంగా నోస్టాల్‌జియా (ఈ ఆంగ్ల పదానికి తెలుగు పద ఉద్యమకారులు ఇంకా తెలుగు మాట "వండలేదు" అందుకు వారికి కృతజ్ఞతలు). అంతకు మించి చక్కటి సంగీతం, పాడిన పధ్ధతి, పదాడంబరం చూపించని చాలా సహజమైన సాహిత్యం. నాకు మటుకు, చిన్నప్పుడు మా ఇంటిదగ్గర వేసిన శ్రీరామ నవమి పందిరి లో ఈ పాట, ఆ పందిరి లోకి వెళ్ళగానే గుబాళించే కొత్త తాటాకు వాసనలే గుర్తుకు వస్తాయి.

    ReplyDelete
    Replies
    1. మితృలు శివరామప్రసాదు కప్పగంతు గారికి ,
      నోస్టాలిజియా అంటే తెలీదండీ. విశ్లేషణకు కామెంట్ కు ధన్యవాదాలు.ఈ రోజు ఉదయం మా వూరు వెళ్లి గుడి దగ్గరకు వెళ్లాను. పందిరిలో మీ కామెంట్-మీరు గుర్తుకు వచ్చారు. ( 1- 4 -2012 )

      Delete
  3. కొండల రావుగారు. నోస్టాల్‌జియా అంటే పూర్వపు విషయాలమీద అమితమైన మక్కువ. చిన్నప్పుడు చదివిన ఒక కథ మళ్ళి నాలుగైదు దశాబ్దాల తరువాత చూస్తే, పాత రోజుల జ్ఞాపకాలు తీవ్రంగా అలుముకుంటాయి.. అలా ఆ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవటమే నోస్టాల్‌జియా.దీన్నే సెంటిమెంటాలిటీ అనికూడా అనుకోవచ్చనుకుంటాను.

    ReplyDelete
  4. మీ పొస్త్ చాల బావుంది ఎప్పుదు ఇలనె మంచి పొస్త్స్ వెస్తు ఉందంది ..
    మాతొ పంచుకున్నందుకు సంతొషం ..

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు More Entertainment గారు. ఇలాంటి మరిన్ని పాటలు మనమంతా కలిపి ఒక్కచోట చేర్చితే బాగుంటుందనుకుంటున్నాను.

      Delete
  5. అమ్మానాన్నల పెళ్లి ముచ్చట్ల కబుర్లు పిల్లలకి ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనే ఉంటుంది కదండీ. సీతారాములు ఈ లోకానికే తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ పెళ్లి కబుర్లని ఇంత చక్కగా చెప్పిన పాట ఇంత హిట్ అయ్యి ఇన్నేళ్ళయినా నిత్యనూతనంగా ఉండటంలో ఆశ్చర్యమేముంది?

    ReplyDelete
    Replies
    1. స్పందనకు ధన్యవాదాలు సత్యం గారూ ! మంచి సాహిత్యం _ సంగీతం కలబోతతో అద్భుతమైన చిత్రీకరణతో కనులవిందుగా ఉన్నందునే ఈ పాట అంతగా హిట్ అయింది. అప్పటి పాటలలో ఎక్కొడో ఒకటి చెత్తగా ఉంటే ఇప్పటిపాటలలో ఎక్కడో ఒకటి మంచిది ఉంటున్నది.

      Delete
  6. చాలా చాలా మంచి పాట...Thanks for sharing..

    ReplyDelete
    Replies
    1. స్పందనకు ధన్యవాదాలు 'సాయి' గారు.

      Delete
  7. మంచిపాటను గుర్తుచేశారు. చాలా బాగుంది కొండలరావు గారు.

    ReplyDelete
    Replies
    1. కామెంట్ కు ధన్యవాదములు కిషోర్ వర్మ గారు. చాలా రోజులయింది సర్ మీ కామెంట్ చూసి. బాగున్నారా?

      Delete
    2. బాగున్నాను సర్. ధన్యవాదాలు.

      Delete
  8. కోరస్ అద్భుతం. సూపర్ సింగర్ series 5 or 7 లొనొ పాడారు. కొత్త వాయిద్య పరికరాలతొ చాల బాగా వచ్చింది.

    ReplyDelete
    Replies
    1. స్పందనకు ధన్యవాదములు పైడి నాయుడు గవిడి గారు.

      Delete
  9. ఏ మనిషి జీవితంలోనైనా ముఖ్య సందర్భం పెళ్ళి. ఆ వేడుకకి సంబంధించి ఇంతకన్నా మంచి పాట లేదు. కాబట్టే ప్రజలు ఈ పాటకి ఇంతగా కనెక్ట్ అయ్యారు.

    ReplyDelete
    Replies
    1. స్పందనకు ధన్యవాదములు bonagiri గారు.

      Delete
  10. అవును సార్ ! తెలుగువారి వివాహాలలో ఇప్పటికీ విన్పించే పాత ఇది .. మంచి పాటను పరిచయం చేసారు

    ReplyDelete
    Replies
    1. స్పందనకు ధన్యవాదములు శ్రీనివాస్ క గారు.

      Delete
  11. సంగీతంచ సాహిత్యంచ సరస్వతీస్తనద్వయం
    ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతం.

    ReplyDelete
    Replies
    1. అర్ధం కాలేదు. కానీ, శ్యామలీయం వారు చెప్పారు గనుక ఇదేదో మంచి వాక్యమై ఉంటుంది తప్పక :))

      Delete
    2. సంగీతమూ సాహిత్యమూ అనే రెండూ సరస్వతీఅమ్మవారి స్తనాలు. అంటే లోకంలోని సమస్తమైన సంగీతమూ సాహీత్యమూ కూడా అమ్మవారి స్తనప్రసాదమే అని అర్థం. వాటి విశేషం ఏమిటంటే ఒకటి ఆపాతమధురమైనది - అంటే అమ్మవారి అనుగ్రహం నుండి లభిస్తూనే అది అత్యంత మైన మాధుర్యాన్ని అందిస్తున్నది - అది సంగీతం గురించి అని అర్థం అవుతూనే ఉంది కదా! శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణీః అన్నారు. అనగా ఈ ప్రపంచంలోనికి ఇప్పుడే వచ్చి ఇంకా ఏమీ తెలియని శిశువులూ, అంతగా మనోవికాసం అన్నది లేని పశువులూ కూడా సంగీతాన్ని ఆనందించటం చూస్తున్నాం సృష్టిలో. చివరకు సంగీతానికి పాములవంటి నిమ్నస్థితిలో ఉన్న జీవులూ ఆనందిస్తున్నాయి. అదండి అంది వస్తూన్నే మాధుర్యాన్ని సంగీతం కురిపిస్తుందీ అని చెప్పటంలో విషయం. ఇక రెండవది సాహిత్యం. అది కూడా అమృతమే. ఐతే సాహిత్యం అనే రూపంగా అమ్మవారి అనుగ్రహంతో లభించిన అమృతం మనం అలోచించి తెలుసుకున్న కొలదీ మనకు అనుభవంలోనికి వస్తుంది. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఇది.

      ఏ ఒక్కటైనా సరే మహదానందామృతాన్ని ఇస్తుందే. అలాంటప్పుడు మంచి సాహిత్యమూ మంచి సంగీతమూ కూడా ఒకేసారి అందినప్పుడు అది మరింతగా అలరిస్తుంది అని చెప్పటం ఈ శ్లోకం ప్రస్తావించటంలో నా ఉద్దేశం.

      Delete
    3. బాగుంది. మీ వివరణకు ధన్యవాదములు.

      Delete
  12. గాలిపెంచల నరసింహారావు కాదండీ గాలి పెంచల నరసింహారావు ఆయన పేరు.ఇంటిపేరు గాలి అనే.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top