నాకు నచ్చిన పాటలలో "తోడికోడళ్లు" సినిమాలో ఆత్రేయ వ్రాసిన కారులో షికారు కెళ్లే పాల బుగ్గల చిన్నదానా.. పాట ఒకటి.



సినిమా :       తోడికోడళ్లు (1957)
రచన :          ఆచార్య ఆత్రేయ
సంగీతం :      మాష్టర్ వేణు
దర్శకత్వం :   ఆదుర్తి సుబ్బారావు
***   ***   *** 
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
బుగ్గ మీదా గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
బుగ్గ మీదా గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా...

నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే....
నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో...

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు....

చలువరాతి మేడలోనా కులుకుతావే కుర్రదానా...
చలువరాతి మేడలోనా కులుకుతావే కుర్రదానా
మేడ గట్టిన చలువా రాయి ఎలా వచ్చెనో చెప్పగలవా...

కడుపు కాలే కష్టజీవులు వొడలు విరిచి గనులు తొలిచీ
కడుపు కాలే కష్టజీవులు వొడలు విరిచి గనులు తొలిచి
చెమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు ..తెలుసుకో

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు

గాలిలోనా తేలిపోయే చీర గట్టిన చిన్నాదానా...
గాలిలోనా తేలిపోయే చీర గట్టిన చిన్నాదానా
జిలుగువెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా

చిరుగుపాతల బరువూ బ్రతుకుల నేతగాళ్ళే నేసినారూ
చిరుగుపాతల బరువూ బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింకా తెలుసుకో

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు

***     ***     ***  

ఆత్రేయ గారికి రోజూ సాయంకాలం మెరీనా బీచ్ కి వెళ్ళే అలవాటుండేదట. అక్కడికీ రోజూ సాయంత్రం కాలక్షేపానికి చల్లగాలి కోసం వచ్చే క్వీన్ మేరీస్ కాలేజ్ లో చదువుకునే ధనవంతులైన అమ్మాయిలని చూసి స్పందించి ఆత్రేయ రాసుకున్న పాట అది.

తోడికోడళ్లు సినిమాలో కథానాయకుడు ఆదర్శ భావాలున్న యువకుడు. అతనికో ఇంట్రడక్షన్ సాంగ్ అని అనుకున్పపుడు ఆత్రేయ తాను వ్రాసుకున్న ఈ పాటను చూపగా  దుక్కిపాటి మధుసూధనరావు గారు బాగుందని ఈ సినిమాలో పెట్టించారట.

ఆ విధంగా 'తోడికోడళ్లు' సినిమాలో అక్కినేని మీద ఈ పాట చిత్రీకరించారు. గాన గంధర్వుడు ఘంటసాల పాడిన ఈ పాట ఎప్పటికీ అర్ధవంతమైన హిట్ సాంగ్స్‌లో ఒకటని చెప్పవచ్చు.

"ఈ పాటను ఆత్రేయ వ్రాశారు" అని హెడింగ్ ఎందుకు పెట్టానంటే చాలాసార్లు ఈ పాటని శ్రీశ్రీ వ్రాశారని పొరపాటుపడేవాడిని. అదే విధంగా మనసున మనసై బ్రతుకున బ్రతుకై పాటని ఆత్రేయ వ్రాశారని అనుకుంటుండేవాడిని. అనుకోవడమే కాదు వాదించి దెబ్బతిన్నాను కూడా :))

మనసు అనగానే ఆత్రేయ , శ్రమైక జీవనం అనగానే శ్రీ శ్రీ గుర్తుకు రావడం సహజమే. అయితే ఈ రెండు పాటలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటాయి. కారులో షికారుకెల్లే పాటను ఆత్రేయ వ్రాయగా, మనసున మనసై అనే డాక్టర్ చక్రవర్తి లోని పాటను శ్రీ శ్రీ వ్రాశారు. రెండింటినీ ఘనటసాల పాడగా అక్కినేని పై చిత్రీకరించడం విశేషమనే చెప్పాలి.

***   ***   ***   
మీరూ మీకు నచ్చిన పాట గురించి వ్రాయాలనుకుంటే kondalarao.palla@gmail.com కు పంపించగలరు.
***   ***   *** 
- పల్లా కొండల రావు
*Republished

Post a Comment

  1. మంచిపాటను గుర్తుచేసారు. ధన్యవాదాలు. నేను కొన్నాళ్ళు ఈపాటను శ్రీ శ్రీ గారు వ్రాసారని భావించేదాన్ని. చరణాలు అలా అనిపిస్తాయ్. చాలా కాలానికితెలిసింది. ఆత్రేయగారి రచన అని. మీరుచెప్పిన పాటవెనుక కధే నాన్న చెప్పేవారు. అసలు ఈ సినిమానే చాలా బాగుంటుంది.ఉమ్మడికుటుంబంలో ఉత్పన్నమయ్యే చిన్న చిన్న మనస్పర్ధలు,అపోహలు,ప్రేమలు..ఇక వాటికి అంతు అనేది వుండదు అలాంటి ఘట్టాలు చాలా ఉంటాయ్ ఈ సినిమాలో. ఇక ఎస్వీఅర్ గారి నటన చెప్పవలసినదేముంది. అద్భుతం.కన్నాంభ గారి నటన అమోఘం. మంచిచినిమా గుర్తుకుతెచ్చారు. చాన్నాళ్ళైనది చూసి.ఒకసారి మళ్ళీ చూడాలి. ఉంటాను.

    ReplyDelete
    Replies
    1. కామెంటుకు ధన్యవాదములు లక్ష్మీ'స్ మయూఖ గారు. అందుకే వాటిని ఆపాతమధురాలు అంటున్నారు కదండీ. ఈ పాట ఎలా పుట్టిందనేది నేను నెట్ లో వెతికి తెలుసుకున్నానండీ. ఎవరి బ్లాగో గుర్తులేదు. ఆ వివరం కూడా ఇచ్చి వారికి ధన్యవాదాలు చెపితే బాగుండేది.

      Delete
  2. తొలిచరణంలో అసలున్నది "పసిడి చానా" అనుకుంటా. కావ్యభాషలో "చాన" అంటే స్త్రీ.

    ReplyDelete
    Replies
    1. అవునండీ. ఇదే అనుమానం నాకు వచ్చింది. ఎన్ని సార్లు విన్నా నాకూ చానా లాగే వినిపిస్తుంది. నేను అడిగినవారూ దానా అనే అంటున్నారు. కాదని నాకు అనిపిస్తూనే ఉంది. నెట్ లో లిరిక్స్ కోసం వెతికితే అన్నిచోట్లా 'దానా' అనే ఉన్నది. అలాగే కాపీ చేశాను. చానా అనేదే సరైనది. కానీ చానా అంటే స్త్రీ అని మీరు చెప్పేవరకూ తెలీదు. జాణ తెలుసు. మరి ఈ చాన, జాణ నుండి వచ్చినదేనా? వీలు చూసుకుని మరోసారి విని సరి చేస్తాను. వివరణకు ధన్యవాదములు ది ఆంధ్రా హ్యూమనిస్ట్ గారు.

      Delete

  3. ’చానా’ అన్నదే సరయినది చాన అనగా స్త్రీ అని అర్ధం దానా అనిపొరపడిఉంటారు. పలికినవారు కూడా దానిని స్పష్టంగా చానా అని పలకలేదు, అదీ అనుమానానికి కారణం.

    ReplyDelete
    Replies
    1. గురువుగారి (ఘంటసాల) ఉచ్చారణసామర్థ్యం మీద నెపం వెయ్యలేం. ఆ పాట రికార్డయ్యి 57 ఏళ్ళయింది. ఆ రికార్డు ఇప్పటి శ్రవణసాధనాల్లో పూర్తిస్పష్టతతో రాకపోవచ్చు. అదీ గాక ఆనాటి రికార్డింగ్ సాధనాల సామర్థ్యం అంతమాత్రమే అనుకోవాలి.

      Delete

    2. నేను చానా అనుకున్నా మీకేమైనా అభ్యంతరమా!

      Delete
    3. రికార్డింగులో చానా అని స్పష్టంగానే వినిపిస్తుందండీ.

      Delete


  4. చా నో దా నో ఏదో ఒకటి బిరీన తేల్చండి !! మరీ టెన్షన్ ఎక్కువై పోతోంది !

    దాచాల్సిందేదో ఆ కాలం లో దాచేరు . దాచాల్సింది తప్పించి మిగిలిన వన్నీ ఈ కాలం లో దోచేస్తున్నారు !
    జిలేబి

    ReplyDelete
  5. "చానా"యే కరెక్టని నా మాట.ఎందుకంటే,"పసిడి చానా!" అనేది "ఓ బంగారు రంగులో మెరిసిపోయే ఆడపిల్లా!" అని ఒక ఆడపిల్లని పిలిచే పదం."పసిడి దానా" అని చెట్టునో పుట్టనో పిలవడానికి ఉపయోగిస్తారు.

    అలా తనని చెట్టునో పుట్టనో పిల్చినట్టు పిలిచి అవమానించే హీరోని ఏ హీరోయినూ ప్రేమించదు - డౌటొస్తే నీహారికనీ జిలేబినీ అడగండి!

    ReplyDelete
    Replies
    1. ఈ పాటలో హీరో కారులో షికారుకెళ్ళే వారిగురించి తిడుతూ పాడుతున్నాడు కనుక పసిడి దానా అనే అన్నాడు. నాలాంటి పామర జనాలకు చాన అంటే అర్ధం కాదు కాబట్టి చిన్నదానా లాగా పసిడిదానాయే కరెక్ట్...మీరు "చాన" అని పాడుకున్నా మాకేమీ అభ్యంతరం ఉండదు.

      Delete
    2. మొత్తానికి ఈ రాముడి ఫ్యానుకి బెండు తీసి శూర్పణఖ ఫ్యాను అనిపించుకున్నారు!

      Delete
    3. శూర్పణఖ కూడా రాముడి ఫ్యానే !
      శూర్పణఖ అన్న రావణుడు అని కూడా మర్చిపోకండి.

      Delete
    4. ఎలా మర్చిపోతాను చెప్పండి!ఓకే జంటలో చెల్లెలు మొగుడికి లైనేస్తే అన్న పెళ్ళానికి లైనేశాడు - ఇద్దరూ ఇద్దరే!జవహర్ లాల్ గురించి కూడా ఇదే మాట చెప్తారు ఎడ్వినా దంపతు లిద్దరి తోనూ సంబంధం ఉన్నట్టు.

      Delete
    5. రాముడి ఫ్యాన్స్ కి కూడా అనుమానపు జబ్బు ఉందని మీరు ౠజువు చేస్తున్నారు.

      Delete
  6. "మేడ గట్టిన *చలువా రాయి* ఎలా వచ్చెనో చెప్పగలవా
    కడుపు కాలే కష్టజీవులు వొడలు విరిచి *గనులు* తొలిచీ"

    నాకు తెలిసి చలువరాయి (marble) క్వారీ (quarry) చేస్తారు మైనింగ్ కాదు. "గనులు" పదంలో క్వారీ అర్ధం కూడా వస్తుందా పండితులే చెప్పాలి.

    అఫ్ట్రారాల్ సినిమా పాట, అందునా "ఎర్ర" సాహిత్యం కనుక ఏమి రాసినా ఫరవాలేదంటే నాకూ ఒకే. ఉ. హీరోయిన్ చీర అందాన్ని వర్ణించే పాటల చిత్రీకరణలో ఆవిడ పాశ్చాత్య దుస్తులు వేసుకోవడం మనకు మామూలే.

    ReplyDelete
    Replies
    1. ఇది ఎర్రసాహిత్యం అని ఎందుకంటున్నారు? జై జీ

      Delete
    2. జైగారి గురించి మీరు సరిగా అవగాహన చేసుకోవాలంటే "ఎర్రసాహిత్యం" వంటి పదాలు వాడడాన్నిబట్టి అర్ధం చేసుకోవాలి.

      Delete
    3. నీహారిక గారూ, జై గారి గురించి నాకో అవగాహన ఉంది. నేనడిగేది ఈ పాట సాహిత్యాన్ని ఎర్రసాహిత్యం అని ఎందుకంటున్నారు? అని. ఇది వ్రాసింది మనసుకవి ఆత్రేయ గారు కదా?

      Delete
    4. పాట రాసింది ఎవరు కాదు దీని భావం & పరమార్ధం ఏమిటన్నది చూస్తే ఇది "ఎర్ర" పాటే.

      కాస్త వివరణ ఇవ్వదలిచాను. సాహిత్యం ఏదయినా రచయిత భావజాలానికి అనుగుణం కావడం సర్వసాధారణం కాకపొతే భావం, అక్షరం & వస్తువు సమపాళ్ళుగా ఉంటే అందం పెరుగుతుంది.

      ఉ. "పాలిచ్చే గోవులకు పసుపూ కుంకం" పల్లెజీవనానికి అద్దం కడుతూ అంతర్లీనంగా ఆధ్యాత్మికత చాటుతుంది. అదే రకంగా "పల్లెటూరి పిల్లగాడా పసులు కాసే మొనగాడా" పాటలో జీతగాళ్ల బతుకు వెతలు కొట్టొచ్చినట్టు అగుపించి తిరుగుబాటు ధోరణి తెర వెనుక నుండి వస్తుంది.

      సిద్ధాంత రాద్ధాంతాలు ఎప్పుడూ ఉండేవే. రాస్తున్న సబ్జెక్ట్ మీద కూడా దృష్టి పెట్టాలన్నది నా పాయింటు. పుస్తకాలు & భావుకత నుండి వచ్చే ideology ని జీవితంతో ధృవీకరించుకున్న కవుల treatment వేరే లెవెలులో ఉంటుంది.

      Delete
    5. "పాలిచ్చే గోవులకు పసుపూ కుంకం" పల్లెజీవనానికి అద్దం కడుతుంది కానీ, "పల్లెటూరి పిల్లగాడా పసులు కాసే మొనగాడా" పాటలో జీతగాళ్ల బతుకు వెతలు కొట్టొచ్చినట్టు అగుపించి తిరుగుబాటు ధోరణి తెరవెనుక నుండి కనపడడం అంటే మనం చూసే ద్రుష్టిలోనే లోపం ఉండొచ్చుగా..... ఇవి రెండూ ఒకే సమయంలోని, ప్రాంతంలోని ద్రుశ్యాలు కావా? అపుడు అక్షరం, వస్తువు ఒక్కొక్కరు ఒక్కో వైపు మద్దతుగా నిలిచారనే చెప్పాలి కదా.

      Delete
  7. జై గారూ, quarry పదానికి తెలుగు అర్థం అవధరించండి 👇.
    ==============================
    (Ref : ఆంధ్ర భారతి 🙂)
    ==============================
    quarrypermalink
    Quarry : బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852 Report an error about this Word-Meaning
    n. s.
    కత్తెరరాళ్ళు తవ్వి యెత్తే గని, నల్ల రాళ్ళ గని.

    ==============================
    Quarry : శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1972 Report an error about this Word-Meaning
    n.
    1. వేఁటజంతువు, the object of the chase, a beast hunted, game, prey;
    2. వేఁటాడి ౘంపిన జంతువు-జంతువు మాంసము, a heap of game killed;
    3. ఱాళ్లగని, a place where stones are dug from the earth, a stonepit.
    vt.
    ఱాళ్లగనిలో నుండి త్రవ్వియెత్తు; dig or take from a q.
    =====================================

    ఇక మీరన్నట్లు “ఏమి రాసినా ఫరవాలేదు” అని ఆ కాలపు సినిమా పాటల రచయితలు కూడా భావించారనడానికి దాఖలాలు లేవండి. వారు పదాలను తూకంగానే వాడేవారు. ఉదాహరణకు .... పాత “మల్లీశ్వరి” చిత్రానికి పాటలు వ్రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక పాటలో ఒక చోట సరైన పదం కుదరడం లేదని నెలరోజుల బాటు ఆలోచించి చివరికి పాట పూర్తి చేసారని .... నేనొక పత్రికలోనో / పుస్తకంలోనే చదివినట్లు గుర్తు. మీరన్న “ఎర్ర” సాహిత్యం వ్రాసిన శ్రీశ్రీ గారు (బైదివే, ఈ పాట ఆయన వ్రాయలేదు) కూడా సరైన పదాలే వాడారని నా అభిప్రాయం.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట వారికి థాంక్స్. తెలుగు భాష మీద పట్టు & పాయింటు విడమర్చే ఓపిక రెంటిలో మీకు మీరే సాటి.

      ఈ పాట రచయిత ఆత్రేయ గారని నాకూ తెలుసు కాకపొతే ఇది శ్రీశ్రీ "తరహా" గీతం.

      దేవులపల్లి లాంటి కవుల పదప్రయోగం గురించి మీరన్నది నూటికి నూరు పాళ్ళు నిజం. దాశరధి కూడా అలాగే mot juste కోసం ప్రయాస పడే వారని విన్నాను.

      శ్రీశ్రీ తనకు అంత పట్టింపు లేదని "సతుల్ హితుల్ సుతుల్ పోనీ" గురించిన చర్చలో చెప్పినట్టు గుర్తు. గద్దర్ (ఆయన మంచి కవి కూడా) తాను అడపాతడపా ప్రాస కోసం కాంప్రమైస్ అయినట్టు బహిరంగంగానే అన్నాడు.

      Delete
    2. విన్నకోట వారి వివరణకు ధన్యవాదములు.

      Delete
  8. పక్కింటివాళ్ల కబుర్లని కూడా చెవులు రిక్కించి విని పట్టెయ్యగలిగిన ప్రజ్ఞ ఆడవాళ్లకే సొంతం!కాబట్టి నీహారిక చెప్పిన "దానా" యే కరెక్టని ఒప్పుకోక తప్పదు.

    ReplyDelete
  9. HAPPY NEW YEAR TO "PRAJA" AND KONDALA RAO GARU!

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top