నాకు నచ్చిన పాటలలో "రంగుల రాట్నం" సినిమాలో భుజంగరాయ శర్మ గారు రాసిన కధా సూచనాత్మైన "కలిమి మిగలదు లేమి నిలవదు" అనే పాట ఒకటి.
ఈయన్నే కధా శివ బ్రహ్మం అని కూడా అంటారట! కధేదైనా వుందా? అని అడిగీతే చాలు వరస పెట్టి వినిపించే వారట? అందులో బాగున్న వాటిని నిర్మాతలు తీసుకుంటారు.
ఇందులో వున్న విశేష మేమిటంటే మన చుట్టూ మామూలుగా జరిగి పోయే సన్నివేశాలు, అదీ మళ్ళీ మళ్ళీ జరుగుతున్న అతి చిన్న విషయాల్ని తాత్వికంగా చెప్పటం! అంతకు ముందు అలాంటి సన్నివేశాలు యెన్ని చూసినా ఈ పాట విన్నాక మళ్ళీ మనకెదురైనప్పుడు ఆ అనుభూతి కొత్తగా వుంటుంది! చాలా చిన్న మాటల్లో యెంతో అర్ధం వుంటుంది? సినిమాల్లో కొంచెం ఫిలసాఫికల్ పాట అనగానే నీరసంగా మంద్రంగా, గంభీరంగా వుండే ట్యూను కదతారు సహజంగా! మనం వినే సినిమా వేదాంతం నిండిన పాటలు దాదాపు అలానే వుంటాయి. కానీ, ఈ పాట అశ్వగతిలో కదం తొక్కుతుంది. హుషారుగా వుండే పాటల్లాగా వేగం యెక్కువ.
ఎందుకంటే కవి ఇక్కడ కష్టాలూ కన్నీళ్ళూ వున్నా కూడదీసుకుని ధైర్యంగా ముందుకు కదిలించే విషయాలు చెప్పడం వల్ల ట్యూను కూడా దానికి తగ్గట్టుగా ఉండి మన చుట్టూ ఒక అధ్భుతమయిన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది వింటున్నప్పుడు.
ముఖ్యంగా :
ముఖ్యంగా :
"యేనుగు పైని నవాబు
గుర్రము పైని షరాబు
గాడిద పైని గరీబు
నడిచే దారుల గమ్యమొక్కతే
నడిపేవానికి అందరొక్కటే"
అనే లైన్లు నాకు మనస్సులో ముద్ర పడిపోయాయి.
- సూరానేని హరి బాబు.
*** *** ***
రచన : భుజంగరాయ శర్మ
గానం : ఘంటసాల బృందం
పల్లవి
ఆఆఆఆఆఆఆ
కలిమి నిలవదు లేమి మిగలదు
కలకాలం ఒక రీతి గడవదు
కలిమి నిలవదు లేమి మిగలదు
కలకాలం ఒక రీతి గడవదు
నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా
వాడిన బ్రతుకే పచ్చగిల్లదా
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
చరణం 1
ఆఆఆఆఆఆఆఆఆఆఆఅ
ఏనుగుపైని నవాబు పల్లకిలోని షరాబు
గుఱ్ఱము మీది జనాబు గాడిదపైని గరీబు
నడిచే దారుల గమ్యమొక్కటే
ఆఆఆఆఆఆఆఆఆఆఆఅ
నడిచే దారుల గమ్యమొక్కటే
నడిపే వానికి అందరొక్కటే
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
చరణం 2
ఆఆఆఆఆఆఆఆఆఆఆఅ
కోరిక ఒకటి జనించు తీరక ఎడద దహించు
కోరనిదేదో దేదో వచ్చు శాంతి సుఖాలను తెచ్చు
ఏది శాపమో ఏది వరమ్మో..ఓఓఓ..
ఆఆఆఆఆఆఆఆఆఆఆఅ
ఏది శాపమో ఏది వరమ్మో
తెలిసీ తెలియక అలమటించుటే
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
చరణం 3
త్యాగమొకరిది ఫలితమొకరిది
అమ్మప్రాణమా ఇద్దరిదీ
వ్యధలూ బాధలు కష్టగాధలు
చివరికి కంచికి వెళ్ళే కధలే
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
బ్రతుకే రంగుల రాట్నము
చరణం 4
ఆఆఆఆఆఆఆఆ
ఆగదు వలపు ఆగదు వగపు
ఆరదు జీవనమాగదు
ఎవరు కులికినా ఎవరు కుమిలినా
ఆగదు కాలం ఆగదు
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
బ్రతుకే రంగుల రాట్నము
ఆఆఆఆఆఆఆఆ
కలిమి నిలవదు లేమి మిగలదు
కలకాలం ఒక రీతి గడవదు
నవ్విన కళ్ళే చెమ్మగిల్లును
వాడిన బ్రతుకే పచ్చగిల్లును
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
చరణం 5
ఆఆఆఆఆఆఆఆఆ
ఇరుగింటిలోన ఖేదం పొరుగింటిలో ప్రమోదం
రాలినపువ్వుల రెండు పూచే గుత్తులు మూడూ
ఒకరి కనులలో చీకటిరేయి
ఇరువురి మనసుల వెన్నెలహాయి
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
బ్రతుకే రంగుల రాట్నము
బ్రతుకే రంగుల రాట్నము
*** *** ***
మీరూ మీకు నచ్చిన పాట గురించి వ్రాయాలనుకుంటే kondalarao.palla@gmail.com కు పంపించగలరు.
*** *** ***
*Re-published
*** *** ***
*Re-published
అవునూ,నేను సదాశివబ్రహ్మం గారు రాసారనుకుని ఆ పరిచయ వాక్యాలు రాసాను.మీరు ప్రచురించిన వీవరాల్లో "భుజంగరాయసర్మ" గరని వుంది.నేను పొరపాటు పడ్దానా?లేక కవులకి కలం పేర్లూ,వాడుక పేర్లూ వుంతాయిగా,ఇద్దరూ ఒక్కరేనా!నాకు వోపిక లేక మొత్తం సాహిత్యం అనతా ఇవ్వలేదు.మీరు సాహిత్యం కూడా పూర్తిగా ఇచ్చారు - బాగుంది!
ReplyDeleteహరి బాబు గారు, ఈ పాటకు మీరు పంపిన మేటర్ కు అదనంగా కావలసినవి జత చేద్దామనే ఉద్దేశంతో నెట్‌లో వెతికితే ఈ పాట ఉన్న అన్ని చోట్లా రచయితగా భుజంగరాయశర్మ గారి పేరే ఉన్నది. మీరన్నట్లు కలం పేరు ఉండి ఉంటే నిర్ధారించి చెపితే లేదా తెలిసినవారెవరైనా చెప్పినా ఆ విషయమూ జత చేస్తే సరిపోతుంది.
Deleteok!
Deleteఆ పాటలోని తత్వ చింతన అశావాదం. ఏదీ నిలిచిపోదు, కలిమీ ఉండిపోదు, లేమీ ఉండిపోదు, కడకు నీవే ఉండిపోవు సుమా, అంతా కాలంతోపాటుదే, ఎప్పుడేది వస్తే దానినే అనుభవించు, బాధా పడిపోకు, గర్వమూ పడకు అనే సమ భావన..... ఇంతటి గొప్ప ప్రబోధాత్మక గీతాలు నేడు విందామన్నా దొరికేలా లేవు....కాదు లేవంతే
ReplyDeleteచాలా మంచి పాటను ఙప్తికి తెచ్చారు హరిబాబు గారు. ధన్యవాదాలు. సాహిత్యం విపులంగా చదువుతుంటే నాకు తెలియకుండానే నా కంట్లో నీళ్ళు వచ్చాయ్.ఎందుకో తెలియదు. శర్మగారు వ్రాసినట్లు నేడు ఇలాంటి సాహిత్యం దొరకటం బహు కష్టంలెండి. కాకుంటే అడపా దడపా సీతారామ శాస్త్రి వంటి వారి ద్వారా మొన్న "ఒనమాలు"సినిమాలో "పిల్లలూ బాగున్నారా,ఎమర్రా ఏమయ్యార్రా" వంటి పాటల ద్వారా కొంత లోటు తీరుతుంది.
ReplyDelete