నాకు నచ్చే మరో పాటతో వచ్చేసాను. ఈ పాటంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇందులోని సాహిత్యం చాలా హృద్యంగా, ప్రతీ మనిషిని కదిలిస్తుంది. బంధాలు, అనుబంధాలను ప్రతిబింబించే ఈ పాటను మీతొ పంచుకోవాలనిపించింది.
చిత్రం : ఉయ్యాల జంపాల ( 1965 )
గాయకులు : మంగళంపల్లి బాలమురళీ కృష్ణ
రచన : కొసరాజు
సంగీతం : పెండ్యాల
*** *** ***
ఏటిలోని కెరటాలు ఏరు విడచి పోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
ఊరువిడచి వాడ విడచి యెంత దూరమేగినా
సొంత ఊరు ఐనవారు అంతరాన ఉందురోయ్ అంతరాన ఉందురోయ్
ఏటిలోని కెరటాలు ఏరువిడచి పోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
తెంచుకున్న కొలదిపెరుగు తీయని అనుభందమూ
గాయపడిన హృదయాలను ఙాపకాలే అతుకునోయ్ ఙాపకాలె అతుకునోయ్
ఏటిలోని కెరటాలు ఏరు విడచిపోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదూ
కనులనీరు హిందితే మనసు తేలికవునులే
తనకూ తన్వారికీ ఎడబాటే లేదులే
ఏటిలోని కెరటాలు ఏరు విడచిపోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు,ఎక్కడికీ పోదూ.
మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటాను. నచ్చిన వాళ్ళు మీ మీ స్పందనలు తెలియ చేయగలరు. మళ్ళీ మరో మంచి ఆ పాత మధురంతో కలుస్తా!
మీ,
మల్లంపల్లి స్వరాజ్యలక్ష్మి.
*** *** ***
మీరూ మీకు నచ్చిన పాట గురించి వ్రాయాలనుకుంటే kondalarao.palla@gmail.com కు పంపించగలరు.
*** *** ***
*Republishe
*Republishe
కనుల నీరు చిందితే మనసు తేలికౌనులే......ఆయ్యో ఏడవమన్నాడడీ కవిగారు కూడా.... మంచి పాటా సాహిత్యం.
ReplyDelete< ఏటిలోని కెరటాలు ఏరు విడచి పోవు
ReplyDeleteఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
ఊరువిడచి వాడ విడచి యెంత దూరమేగినా
సొంత ఊరు ఐనవారు అంతరాన ఉందురోయ్ అంతరాన ఉందురోయ్ >
అవును కదా! బాగుందండీ సాహిత్యం.
దీన్ని పూర్తిగా పాటల బ్లాగ్‌గా మార్చేస్తున్నారా?
ReplyDeleteలేదు. రీఫ్రేమింగ్ చేస్తున్నాను ప్రవీణ్ గారు.
ReplyDelete