------------------------------------
అంశం : వేదాలు
ప్రశ్నిస్తున్నవారు : Ram
------------------------------------
మీ పేరు
|
Ram
|
ఈమెయిల్
|
deleted
|
ప్రశ్న
|
నావి రెండు సంబంధిత ప్రశ్నలు: 1. వేదాల్లో జాతి/వర్ణం/కులం గురించి యేమి వ్రాయబడినది? 2. అలా వ్రాసిన చోట ఈ జాతి/వర్ణం/కులం మిగతావాటి కంటే గొప్పది అని ఎక్కడైనా వ్రాయబడినదా?
|
ప్రశ్న గురించి
|
ఈ మధ్య నేను ఒక వీడియోలో ఒక అతను అన్న మాటలు విని ఈ ప్రశ్నలు మీకు పంపిస్తున్నాను.
ఆయన అన్న దాని ప్రకారం 'ఆయన భారతదేశంలో ఆరేళ్ళు వుండి గమనించింది యేమిటంటే, వేదాలలో వ్రాయబడినందువల్లనే జాతి/వర్ణ భేదాలు వచ్చాయి ' అని.
ఆవేశపూరితమైన చర్చలకు తావివ్వకుండా ప్రశ్నకు సంబంధించిన సమాధానాలకోసమే నేను ఈ ప్రశ్న మీకు పంపిస్తున్నాను.
|
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
కులం పుట్టడానికి కారణం శ్రమ విభజన. కులం ఉన్నా, లేకపోయినా ఒక కాంట్రాక్టర్ కూలీ పని చేసేదాన్ని పెళ్ళి చేసుకోవడం జరగదు.
ReplyDelete"జరగదు" అని కుండ బద్దలు కొట్టకండి. సినిమాల్లో జరుగుతోంది ... ఒకప్పటి సినిమాల్లో కాదు గానీ "వెరైటీ", "డిఫరెంట్" అంటూ గత పాతిక ఏళ్ళుగా వస్తున్న పనికిమాలిన ప్రేమ చూపించడం సినిమాల్లో జరుగుతోంది. ఏదో సినిమాలో శ్రీమంతుల కూతురు మునిసిపాలిటీ చెత్త లారీ డ్రైవరు గారి కొడుకుని ప్రేమిస్తున్నట్లు చూపించారు. పైగా ఆ డ్రైవరు పాత్ర వేసినది ఒక పాప్యులర్, సీనియర్ కారెక్టర్ నటుడు. స్వయానా రచయిత, కవి కూడా. అయినా అటువంటి పాత్ర వెయ్యడం అతని సామాజిక బాధ్యతారాహిత్యం చూపించడంలా? మరో సినిమాలో గుడుంబా అతను సిరిగలవారి అమ్మాయిని ప్రేమించడం. పోనీ "ఘనమైన" స్టార్లు ఏమన్నా నయమా అంటే అదీ లేదు ..... ఒక సినిమాలో తన పెళ్ళిచూపులకు వెళ్ళి, అమ్మాయితో మాట్లాడాలని అంటూ హాలు పక్కనున్న గదిలోకి తీసుకెు వెళ్ళి, ఆ అమ్మాయి వేరే ఎవర్నో (వీధి చివర ఎస్.టీ.డి. బూత్ లో పనిచేస్తున్నవాడిని) ప్రేమిస్తున్నట్లు చెబితే (టీవీ ఏంకర్ల పరిభాషలో "రివీల్" చేస్తే), ఆ గదికి వెనకవైపునున్న ద్వారంలో నుండి అతన్ని పిలిపించి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసేస్తాడు దండల మార్పిడితో. పైగా ప్రేమ పవిత్రత , ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడడం లాంటి అర్థం లేని సమర్థింపు చేసుకుంటాడు. ఘనత వహించిన 'నక్షత్రం' కదా ... మరి తన కొడుక్కి అటువంటి సంబంధం తీసుకొచ్చి చెయ్యలేదే?. వాళ్ళ లాభాల కోసం వాళ్ళు సినిమాల్లో చూపిస్తున్న బాధ్యత లేని వెర్రిమొర్రి వేషాలు సమాజం మీద / యువత మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆ మాత్రం తెలియదా? ఒక నిజ జీవిత ఉదాహరణ ... నా సహోద్యోగి కూతురు, విద్యాధికురాలు వెళ్ళి వాళ్ళ వీధి చివరనున్న ఐస్-క్రీమ్ షాపులో పనిచేస్తున్నవాడిని ప్రేమించాను, పెళ్ళి చేస్తారా లేదా అంటూ పట్టుబట్టింది. గత్యతరం లేక చేశారు. తరువాత వాళ్ళిద్దరూ విడిపోయారు. ఇంకేం జరుగుతుంది? చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇటువంటి వాతావరణంలో మీరన్నట్లు కాంట్రాక్టర్ ఒక కూలి పని చేసే అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం అసాధ్యమేమీ కాదు అని నా అభిప్రాయం.
ReplyDeleteసవరణ:-
ReplyDelete// మరి తన కొడుక్కి అటువంటి సంబంధం తీసుకొచ్చి చెయ్యలేదే? //
"కొడుక్కి" బదులు "కూతురుకి" అని చదువుకోవాలని మనవి.
సినిమా వేరు, నిజ జీవితం వేరు. నిజ జీవితంలో జరిగినవే నేను ఇప్పుడు చెపుతాను. 1997లో (నాకు 14 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు) ఒక 17 ఏళ్ళ అమ్మాయిని ప్రేమించాను. ఆమె నన్ను కాదని తనకి కాలేజ్‌లో పరిచయమైన ఒక బ్రాహ్మణుణ్ణి పెళ్ళి చేసుకుంది. అతనికి కూడా ఉద్యోగం లేదు. నాకైతే ఆస్తి ఉంది కానీ అతని ఆస్తిని అతని తండ్రి అమ్ముకున్నాడు. ఇప్పుడు నాకు వ్యవసాయం ఉంది కానీ అతనికి ఏమీ లేదు. అతను మామగారి సంపాదన తిని బతుకుతున్నాడు. అతను తెలివిగా తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించి తనకి పిల్లల్ని పెంచే ఖర్చు లేకుండా చూసుకున్నాడు. నేను బ్యాంక్ ఆఫీసర్ల కొడుకుని. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపిస్తే పది మంది నవ్వుతారు అని నమ్మేవాళ్ళ మధ్య పుట్టి పెరిగిన గతం నాది. నాకు ఆస్తి అయితే ఉంది కానీ అతనికి ఉన్న తెలివి నాకు లేదు. అందుకే నాకు దక్కాల్సిన అమ్మాయి అతనికి వెళ్ళిపోయింది.
ReplyDeleteనాకు తెలిసిన ఇంకో నిరుద్యోగికి కూడా పెళ్ళయ్యింది. అది పెద్దలు కుదిర్చిన పెళ్ళే. అబ్బాయి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. అమ్మాయివాళ్ళ అన్నయ్య జె.సి.బి. డ్రైవర్. ఆ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం తప్పకుండా వస్తుందనుకుని ఆ అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్ళి చేసారు. ఆమెకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లల్ని మొదట ప్రైవేట్ స్కూల్‌లో వేసారు. ఖర్చు తడిసి మోపెడయిపోయి ఆమె భర్త ఆ పిల్లలని ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలలోకి మార్చాడు. దాంతో ఇంట్లో గొడవ జరిగి ఆమె తన భర్తని వదిలేసింది, ఆ అబ్బాయి తల్లి అతని తండ్రిని వదిలేసింది. ఇండియాలో తాపీ మేస్త్రి కొడుకు నుంచి తహసీల్దార్ కొడుకు వరకు ప్రతివాడికీ ప్రభుత్వ ఉద్యోగమే కావాలి కానీ ప్రభుత్వ స్కూల్‌లో చదువు వద్దు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వద్దు. అదేమీ తెలివైన పోకడ కాదు. సంసారం చెయ్యడానికి మాత్రం తెలివి ముఖ్యం.
ఎవరి అభిప్రాయాలు వారివి కాబట్టి ఈ చర్చని పొడిగించే ఉద్దేశం నాకు లేదు కానీ మొదట్లో నేను చెప్పదల్చుకున్నది స్పష్టం చెయ్యలేకపోయానేమోననిపించి ఈ జవాబు వ్రాస్తున్నాను.
ReplyDelete// "సినిమా వేరు, నిజ జీవితం వేరు. నిజ జీవితంలో జరిగినవే నేను ఇప్పుడు చెపుతాను." // అన్నారు మీరు. నేను చెప్పినవీ నిజ జీవితంలో జరిగినవే. మరి కొన్ని సంఘటనలు కూడా చెప్పగలను. నా పాయింటేమిటంటే ... ఎంత వేరనుకున్నా ఈ కాలపు సినిమాల అవకతవక వెర్రిమొర్రి బాధ్యతారాహిత్య కథలతో ఇప్పటి యువత బాగా ప్రభావితం అవుతున్నారు, సినిమా కథల్ని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు, ఆలోచన లేని పనులు చేసి తమ జీవితాలను భ్రష్టు పట్టించుకుంటున్నారు, వాళ్ళకి సపోర్టుగా ప్రక్కనొక తొట్టిగాంగ్ ... అని. వీటికి సినిమావారిదే బాధ్యత అంటాను. అఫ్కోర్స్ సినిమావారేమీ వచ్చి ఆదుకోరు లెండి. మహా అయితే రాజకీయలక్ష్యాలున్న నటులు వెళ్ళి పరామర్శించి, ఫొటోలు దిగుతారు, పేపర్లలో టీవీలో చూపించుకుంటారు, బాధితులకు అంతకు మించి ఒరిగేదేమీ ఉండదు. కాబట్టి ప్రజలే సంయమనం పాటించడం అలవాటు చేసుకోవాలి.
ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వోద్యోగాల గురించీ కాదు నా పాయింట్. కాంట్రాక్టరు - కూలీపిల్ల (ఇదేదో సినిమా టైటిల్గా బాగుండేట్లుందే 🙂) అని మీరన్నదాని మీద మాత్రమే నా మొదటి వ్యాఖ్య వ్రాశాను. కూతుర్ని నిరుద్యోగికిచ్చి పెళ్ళి చేస్తే ఆ తల్లిదండ్రులదే తప్పు ... ముఖ్యంగా అరేంజిడ్ మారేజెస్లో. నేను ఉదహరించిన మొదటి రెండు సినిమాల్లోనూ హీరోలు పోరంబోకులే. అటువంటివా సమాజానికి కావలసినది?
నిరుద్యోగిని పెళ్ళి చేసుకోవడంలో తప్పు లేదు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయినంతమాత్రాన కొడుక్కి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని నమ్మడమే తప్పు. ఆ అమ్మాయివాళ్ళ అన్నయ్య జె.సి.బి. డ్రైవర్. పల్లెటూరిలో జె.సి.బి. నడిపేవాడికి వచ్చేది రోజుకి రెండు వందలే. వాళ్ళు చేసేదే బ్లూ కాలర్ ఉద్యోగం. వాళ్ళ అమ్మాయికి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు మొగుడిగా దొరకడం గొప్పే. కరణం కొడుకు కరణం అవ్వడం, మంత్రి కొడుకు మంత్రి అవ్వడం కుల వ్యవస్థలో సాధ్యమే కానీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు ప్రభుత్వ ఉద్యోగే అవ్వడం ప్రజాస్వామ్యంలో సాధ్యమా?
ReplyDeleteఅసలు ప్రశ్నకు సంబంధించి వేదాలలో ఏమి వ్రాశారన్నముఖ్యమైన అంశానికి సంబంధించిన సమాచారం తెలిసినవారు సమాధానం చెపితే బాగుంటుంది.
ReplyDeleteవేదాల్లో కుల బీజాలు ఉన్నాయని కొందరు అంటారు, లేవని మరికొందరు అంటారు. హిందువుల్లో 99% మంది మత గ్రంథాలు చదవరు. వేదాల్లో ఏముందో వాళ్ళకి తెలియదు. ఈ చర్చ ఎంతకీ తెగదు. అయితే ఒక ప్రశ్న మాత్రం అడగగలను. "ఒక ముస్లిం హిందూ మతంలోకి మారితే ఏ కులంవాళ్ళు అతన్ని చేర్చుకుంటారు?" ఇది సీరియస్ ప్రశ్నే. "ఈ రోజుల్లో కులాలు లేవు" అని వాదించేవాళ్ళు కూడా దానికి సమాధానం చెప్పలేక దాటవేస్తారు.
ReplyDelete< "ఈ రోజుల్లో కులాలు లేవు" అని వాదించేవాళ్ళు కూడా దానికి సమాధానం చెప్పలేక దాటవేస్తారు. >
Deleteఅందరి తరపునా.. మీరే సమాధానం చెపితే ఎలా?
"ఒక ముస్లిం హిందూ మతంలోకి మారితే ఏ కులంవాళ్ళు అతన్ని చేర్చుకుంటారు?"
Deleteప్రవీణ్ గారు, మీరు వేసిన ప్రశ్నకి మీ సమాధానం యేమిటో తెలుసుకోవాలని వుంది.
రాజ్యాంగం ప్రకారమైతే ఒక ముస్లిం హిందూ మతంలోకి మారడం తప్పు కాదు. ఒక ముస్లిం హిందువుగా మారితే అతన్ని ఏ కులంవాళ్ళు చేర్చుకుంటారు అనే ప్రశ్నకి మాత్రం హిందువులే సమాధానం చెప్పాలి. కులం పేరు చెప్పుకోకపోతే పెళ్ళి సంబంధం దొరికే పరిస్థితి హిందూ సమాజంలో లేదు.
Deleteహిందూ సమాజంలో..... వేదంలోనూ.... సంస్కరణలకు.... మెరుగైనదానికి...... అవకాశం, కలుపుకుని పురోగమించే అవకాశం, చరిత్ర ఉందన్న వాదన కూడా ఉంది. దీని గురించి బాగా తెలిసినవారు చెపితే బాగుంటుంది.
Deleteఏ ఆర్ రెహమాన్ మతం మార్చుకున్నారు. ముస్లింలో కూడా షియాలు, సున్నీలు వేరు వేరు గా ఉన్నారు.క్రిస్టియన్ లలో కేధలిక్ లు ప్రొటెస్టంట్లు వేరుగా ఉన్నారు. మతం మార్చుకునేవారు తీసుకునే నిర్ణయాలను మొత్తం సమాజం ఎలా నిర్ణయిస్తుంది ? ఎవరికివారు ఏ కులంలో,మతంలో చేరాలో నిర్ణయించుకుంటారు. హిందూమతంలోకి వస్తానన్నా, పోతానన్నా ఆపేవారు ఎవరూ లేరు.అందరూ అందరినీ ఆహ్వానిస్తారు.
Deleteఐతే.. హిందూమతంలోకి మారిన ఒక ముస్లీము... తాను కావాలనుకుంటే... బ్రాహ్మణ కులం తీసుకోవొచ్చంటారు..
Deleteకులం అనేది పుట్టుకతో వచ్చేది. ఒక కులంలో కొత్తగా చేరేవాళ్ళని ఎలా చేర్చుకుంటారు?
Deleteనాకు అర్ధమైన రెండు ముక్కలు ఇక్కడ వ్రాస్తున్నాను. తప్పులుంటే మన్నించి యెక్కడ తప్పు చేశానో/వ్రాశానో తెలుపగలరు.
ReplyDeleteరుగ్వేదం లోని పురుష సూక్తం కింది విధంగా ప్రారంభమవుతుంది:
సహస్ర’శీర్షా పురు’షః | సహస్రాక్షః సహస్ర’పాత్ |
స భూమిం’ విశ్వతో’ వృత్వా | అత్య’తిష్ఠద్దశాంగుళమ్ ||
పురుష సూక్తం పురుషుడు/భగవంతుడు మరియు ప్రకృతి గురించి, సృష్టి ఆవిర్భావం గురించి, మనుషుల/మానవుల గురించి వ్రాయబడినది (పురుషుడి గురించి అంటే స్త్రీ లేకుండా అని కాదు).
మన వాడుక భాషలో సహస్రం అంటే వేయి (1000). ఇక్కడ నిగూఢార్ధం లెక్కలేనన్ని అని. పురుషుడు లెక్కలేనన్ని తలలు, కళ్ళు, పాదాలు గలవాడు (అంటే ఆ దేవుడే ఈ సమస్త మానవాళి నందు, ప్రతి మనిషిలోను వ్యాప్తమై వున్నాడు అని అర్ధం), మనుషుల వూహకు/అవగాహనకు అందని వాడు అని.
బ్రాహ్మణో”உస్య ముఖ’మాసీత్ | బాహూ రా’జన్యః’ కృతః |
ఊరూ తద’స్య యద్వైశ్యః’ | పద్భ్యాగ్‍మ్ శూద్రో అ’జాయతః ||
రుగ్వేదంలో పై శ్లోకం యొక్క తాత్పర్యం చూస్తే - ఆయన/భగవంతుడి ముఖము/నోటి నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి రాజులు/వీరులు/క్షత్రియులు, వూరువుల/తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు వచ్చినట్టు వ్రాయబడినది. ఎక్కడా కూడా ఒకరు యెక్కువ ఒకరు తక్కువ అని వ్రాయలేదు.
మరి ఎక్కువ తక్కువలని ఎవరు స్రుష్టించారు?
DeleteThis comment has been removed by a blog administrator.
Delete
Deleteఅబ్బే మీకు తెలీనిది కాదనుకోండి రావు గారు ఇన్నేళ్ళుగా బ్లాగ్ లోకం లో వున్నారు .అయినా అడిగేరు కాబట్టి ఏదో ఉడతా భక్తిగా నావంతు సాయంగా చెబ్తున్నా నండి బామ్మలండి బామ్మలు .
మనుషుల సృష్టి అని నా అభిప్రాయం.
Deleteఒక మానవ దేహంలో పాదాల కన్నా తలే గొప్ప అని అనుకోవడం మూర్ఖత్వం. పెద్దలకు విజ్ఞులకు గురువులకు పాదాభివందనం చేస్తాముగానీ శిరోభివందనం (శ్యామలీయం మాస్టారు, సంధి సరిలేకపోతే మన్నించి సరిజేయగలరు) చేయము.
మీ అభిప్రాయం కరెక్టే అయితే మంచిదే. కానీ, అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, వేరు వేరు స్థానాలనుండి జనియించుటకు వేదాలలో కారణాలేమి చెప్పారు? భగవంతుడు లేదా దైవం లేదా ప్రక్రుతి ద్రుష్టిలో అసమానతలుంటాయా? ఉంటే అవి ఖచ్చితంగా మానవ స్రుష్టే. మేధావుల కుట్రే.
Deleteమరి ఎక్కువ తక్కువలని ఎవరు స్రుష్టించారు?
Deleteవ్యాసుడు భగవద్గీతలో లో వ్రాసారు. మనం చేసిన కర్మని బట్టి మన పుట్టుక ఉంటుందని వ్రాసారు. చలం స్త్రీలకు స్వాతంత్ర్యం కావాలని వ్రాసాడు.స్వాతంత్ర్యం ఉంటే లేచిపోవచ్చు కాబట్టి స్వాతంత్ర్యం కావాలని వ్రాసాడు. వాల్మీకి స్త్రీలు సీతలాగా ఉండాలి అని వ్రాసారు.సీతలాగా ఉంటే ఎవడైనా ఆటాడుకోవచ్చు కాబట్టి సీతలాగా బుద్ధిగా ఉండాలి.
మానవ పరిణామ క్రమంలో పుస్తకాలు ప్రభావం చూపుతాయి కనుక ఎవరో ఒకరు ప్రభావితం చేస్తూనే ఉంటారు. శూద్రుల గొప్పతనం తెలిపేందుకు ఎవరూ వ్రాయలేదు కాబట్టి శూద్రులు తక్కువవారిగా చూడబడుతున్నారు.
ప్రస్థుత యుగం సర్వీసెస్ మీద ఆధారపడి నడుస్తోంది. నిరుద్యోగి అయినా ఆదుకోడానికి ప్రభుత్వాలున్నాయి.అందరికీ రిజర్వేషన్ ఇచ్చేస్తే కులం ఎవరూ పట్టించుకోరు.
భార్య అవసరం లేదు, భర్త అవసరం లేదు, కుటుంబం అవసరం లేదు.అన్నీ ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. ఇపుడు ఆన్లైన్ దేవుడు చెప్పేది మనం వినాలి.పని చేసేవాడే శూద్రుడు.ఆన్ లైన్ దేవుడు మాత్రం ఖచ్చితంగా శూద్రుడే !
సమాజాన్ని భగవత్స్వరూపంగానూ , ఆసమాజ ఙ్ఞాన స్వరూపాలు బ్రామ్మలుగానూ , శౌర్య స్వరూపాలు క్షత్రియులుగానూ , సంపద స్వరూపాలు వైశ్యులుగానూ , దాస్య స్వరూపాలు శూద్రులుగానూ ప్రతిభావింపజేయడమూ ,
ReplyDeleteఆవిథమైన పనులు ఆయా వర్ణాలకు నియోగించడమూ - దీనినే వివక్ష అంటారు . ఇందులోనే ఎక్కువ తక్కువలు కన్పిస్తున్నవి . భగవంతుని సమదృష్టికిది విరోధం . కాబట్టి దీన్ని ప్రతిపాదించి అమలుపరచింది కుట్రదారులైన మేథావి వర్గం .
//దాస్య స్వరూపాలు శూద్రులుగానూ//
Deleteశూద్రులు దాస్య స్వరూపాలు అని యెక్కడ వ్రాయబడినదో సెలవివ్వగలరు.
శిరోవందనం అంటే చాలు .
Deleteశూద్రులను పై మూడు వర్ణాలూ తమకు దాస్యం చేయడానికే వాడుకున్నారు . ఇది చరిత్ర . మేథస్సు ,
శౌర్యం , సంపద అట్టడుగు వర్ణానికి అందనీక పోవడం
ఇక్కడ కుట్ర .
ఇక పాదాలకన్నా తలే మిన్న . ఈవిషయం తల ఉన్న వాడికెవడికైనా విదితం . అందితే తల , అందకపోతే కాళ్ళు అనే సామెత ఉండనే ఉంది . మేథావులు తల అందనీరు . కాళ్ళే పట్టించు కుంటారు .
< శూద్రులను పై మూడు వర్ణాలూ తమకు దాస్యం చేయడానికే వాడుకున్నారు . ఇది చరిత్ర . > 100% true.
Deleteశూద్రుడు మేధావి కాకూడదా ? మేధావి ఒక్క ఉన్నత వర్ణంలోనే పుట్టినట్లు ఎక్కడా వ్రాసిలేదు. రాజు లేదా ప్రభుత్వంలో శూద్రులున్నా మేధావులు కాకపోవడం వల్ల ఈ చర్చలు ఇంకా జరుగుతున్నాయి.
Deleteమీరే పై కమెంటులో భగవద్గీతను గురించి చెప్పారు కదా?
Deleteమేధోతనం అంటే జ్నానం ( శ్యామలీయం గారూ వత్తు పడడం లేదు) పరిస్తితులని బట్టి కొంత.... పుట్టుకని బట్టి కొంత ఉంటాయి. అలాగే బుద్ధి కూడా...... బుద్ధి లేని జ్నానం, జ్నానం లేని బుద్ధి రెండూ ప్రమాదమే.
Deleteమనకిష్టం వచ్చినట్లు మనం అన్వయించుకోవడం వల్ల జరిగినపరిణామం అది. ఉత్తమ గుణం కలవాడిని బ్రాహ్మణుడు అని వ్రాసారు కానీ బ్రాహ్మణులు అందరూ మేధావులూ, ఉత్తములు అని అర్ధం కాదు. సప్తపది సినిమాలో సోమయాజులు గారు చెప్పినట్లు గుణాన్ని బట్టి బ్రాహ్మణుడు కానీ కులాన్ని బట్టి బ్రాహ్మణుడు కారు అని బల్లగుద్ది మరీ చెప్పారు. మనకు నచ్చిందే మనం వింటాం మనం చదువుతాం. మేధావి మాత్రం మేధస్సుతో ఆలోచిస్తాడు. మేధావులందరికీ నా పాదాభివందనాలు.
Deleteఉత్తమ గుణములు కలవాడిని ఉత్తముడు అంటే చాలదా? బ్రాహ్మణుడికి పుట్టిన దుర్మార్గుడిని బ్రాహ్మణుడిగా భావించకూడదని వ్రాశారా? పండితులు అందరి యెడల సమద్రుష్టి కలిగి ఉండాలన్నారు. గీతైనా.... వేదమైనా.... ఏదైనా మనుషులు వ్రాసిందే తప్ప స్వయంభువులు కావు. ఇదంతా జీవులలో ప్రక్రతి మనిషికి ఇచ్చిన ఆలోచన- భాష - శ్రమ ద్వారనే సాధ్యమయింది. మంచిని స్వీకరించి చెడుని త్యజించడమే చేయాల్సింది. అదే పోరాటం. అదే సంస్కరణ. అదే సంస్క్రతి కావాలి.
Deleteఒక పని చేయాలంటే మనకు బుద్ధి పుట్టాలి. పని చేసేటపుడు తప్పు జరిగితే జ్ఞానం వస్తుంది.ఒప్పు జరిగితే మేధావి అంటారు. ఒక పని చేయాలన్నా, జ్ఞానం రావాలన్నా, మేధావి కావాలన్నా శూద్రుడై ఉండాలి. శూద్రుడుగా పుట్టడానికీ, బ్రతకడానికీ ఎవరూ ఇష్టపడకపోతే చరిత్రే ఉండదు.
Deleteపని చేసేవాడికే కాదు.... ఖాళీగా ఉండి గమనించిన వాడికే ఎక్కువ జ్ఞానం కలిగే అవకాశం ఉంది. ఖాళీ సమయం అన్నది ఆలోచించడానికి, గమనించడానికీ.... పనికి వస్తుంది. అయితే అది ఏ పక్షం అన్నది ఆ జ్ఞానం పొందిన వ్యక్తి బుద్ధిని బట్టి ఉంటోందని నా అభిప్రాయం.
Deleteఙ్ఞానార్జన పుట్టుకతోనే సాధ్యపడదు . సాధన సంపత్తీ , గురువూ , అతని అనుగ్రహమూ దొరికితేనే పూర్వం మేథావి కాగలిగేది . శూద్రుడికి ఆ అవకాశం దొరకకుండా పై మూడు వర్ణాలూ జాగ్రత్తపడ్డాయి .
Deleteఇప్పుడాబాధ లేదు . శూద్రులలోనే ఎక్కువమంది సమాజానికి పనికివచ్చే మేల్తరమైన మేథావి వర్గం తయ్యారవుతూ ఉంది .
మేము ఙ్ఞానానికి అధిపతులమని ప్రతిభావించిన ఆనాటి
కుహనా మేథావి వర్గం - జ్యోతిష్యం , జాతక చక్రాలు , వాస్తు , మంత్ర తంత్రాలు , సంఖ్యలు, క్షుద్రపూజలు మొదలైన అసత్యాల వలయాలను సృష్టిస్తూ
సమాజాన్ని మోసం చేసి , మోసంద్వారానే పొట్టపోసుకుంటున్నారు . వీళ్ళ బారినుండి నాదేశం ఎప్పుడు బైటపడుతుందో ?
ఙ్ఞానార్జన ..... విషయంలో మీ వాదనను నేను వ్యతిరేకించడం లేదు. కానీ.... ఙ్ఞానం పొందడంలో, నేర్చుకోవడంలో పుట్టుకతో వచ్చే లక్షణాలు కూడా తప్పకుండా ప్రభావితం చేస్తాయి. సాధన సంపత్తీ , గురువూ , అతని అనుగ్రహమూ దొరికినప్పటికీ శిష్యులందరూ సమానులు కారు. అంటే సమానంగా ఙ్ఞానం పొందడం సాధ్యం కాదు. ఎక్కువ తక్కువలుంటాయి. దీనర్ధం పుట్టుకని బట్టి ఙ్ఞానం నిర్ధారించాలని మాత్రం కాదు.
Deleteఙ్ఞానార్జన పుట్టుకతోనే సాధ్యపడదు - అని నేను చెప్పిన మాటలోనే మీ భావన ఇమిడి ఉంది . తల్లిదండ్రుల ద్వారా పిల్లలలో నైపుణ్యాల ఆనుపానులు లీలామాత్రంగా పుట్టుకతోనే ఏర్పడతాయి నిస్సందేహంగా . కానీ , పరిస్థితులనుకూలిస్తేనే విత్తనం మొలకెత్తేది .
Deleteఅనుకూలించకపోతే , ఆ నైపుణ్యాలు మరుగున పడిపోతాయి మరి .
ఇక , ఙ్ఞానార్జన అసమానతలు వ్యక్తిగత ఆసక్తులనుబట్టి
ప్రభావితమౌతవి . ఇది , ఉపాధ్యాయుడుగా నేను గమనించిన అంశం . నిఘా పెట్టని పిల్లలు కాస్త నిదానంగానూ , నిఘాగల పిల్లలు చురుకుగానూ కనుపిస్తారు . పిల్లల ఆరోగ్య స్థితిగతులు కూడా ఈ వషయంలో ప్రభావం చూపడం గమనించాను .
< పరిస్థితులనుకూలిస్తేనే విత్తనం మొలకెత్తేది .
Deleteఅనుకూలించకపోతే , ఆ నైపుణ్యాలు మరుగున పడిపోతాయి మరి . >
true sir.
పుట్టుకతోనే శూద్రులు ఒక రకమైన ఆత్మన్యూన్యతతో పెరుగుతున్నారు. మనం తక్కువ అనే భావం తల్లిదండ్రులే నేర్పిస్తున్నారు. సమాజం ఎపుడూ ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పదు. మనకు మనమే నిర్ణయించేసుకుని బాధపడిపోతాం. అబ్దుల్ కలాం గారిని ముస్లిం గా ఎవరైనా ద్వేషించగలరా ? జేసుదాసుగారిని క్రిస్టియన్ గా ఎవరైనా ద్వేషించగలరా ?
Deleteవీళ్ళిద్దరికీ అసంతృప్తి లేదా ? తన అసంతృప్తిని ఎవరో ఒకరిని బాధ్యులుగా చేసి తమని తక్కువగా చూస్తున్నారు అని తెలంగాణా వాదులు కూడా బాధపడిపోయిన సందర్భాలు ఉన్నాయి.
ఎవరిని వారు ప్రేమించుకోమనే అందరిలోనూ దేవుడున్నాడు అని కూడా చెప్పారు. శూద్ర దేవుడు ఉండడా ? బ్రాహ్మణ దేవుళ్ళు శూద్రులను రానీయలేదు కాబట్టి శూద్రులు బ్రాహ్మణులని తిడుతున్నారు.
నీహారిక గారు, న్యూనతలూ ఆత్మన్యూనతలూ అవసరం లేదండీ. సూతపౌరాణికుడు భ్రాహ్మణుడు కాకపోయినా ఆయనకు బ్రహ్మస్థానం ఇచ్చి నిఖిలమునిగణమూ ఆయననుండి పురణేతిహాసాలను ఆలకించలేదా? బ్రాహ్మణదేవుళ్ళూ శూద్రదేవుళ్ళూ ఏమిటండీ? దేవుడికీ కులమా? సరే ప్రసక్తి వచ్చింది కాబట్టి చూదాం. దేవుడు వామనావతారంలో బ్రాహ్మణవటువు. రాముడిగా కృష్ణుడిగా ఆయన క్షత్రియుడే మరి. పరశురాముడు క్షాత్రధర్నాన్నీ అవలంబించిన బ్రాహ్మణుడు. అంతేకాదు హరి వరాహంగా కూడా జనించలేదా? క్షత్రియులైన రామకృష్ణులను బ్రాహ్మణులు ఆరాధించటం లేదా? భగవంతుడీ నామరూపాత్మకమైన జగత్తులోనికి ఏరూపంలో వస్తేనేమి నరుడైనప్పుడు ఏకులంలో పుడితేనేమి? క్షేత్రకారణంగా విదురమహాశయుడు శూద్రుడే ఐనా అయనకు మహాభారతేతిహాసంలో అగౌరవం ఏమన్నా ఉన్నదా?
Deleteశ్యామలీయం గారు,
Deleteమీకు శూద్రదేవుడు అని అంటే నచ్చలేదు. దేవుడికి కులం లేదు కానీ అందరిలోనూ దేవుడున్నపుడు శూద్రుడిలో దేవుడుండడా ?
బ్రహ్మ, విష్ణువు, రాముడు తదితరులు హిందూ (బ్రాహ్మణ దేవతలు కాదు, తేడా గమనించాలి) ఇంకోవైపు దేవతలని పోచమ్మ, ఎల్లమ్మ, గండిమైసమ్మ తదితరులు శూద్రదేవతలని ప్రొఫెసర్ కంచా ఐలయ్య వాదన.
Deleteనేను హిందువును ఎట్లయిత (Why I am not a Hindu అనే తర్జుమా సరికాకపోవొచ్చు) నుండి కొన్ని పంక్తులు:
"Even a Brahmin family might talk about Pochamma, Maisamma or Ellamma, but not with the same respect as they would about Brahma, Vishnu, Maheswara. For them Pochamma and Maisamma are 'Sudra' Goddesses and supposed to be powerful but in bad, negative ways. A Pochamma according to them does not demand the respect that Lakshmi or Saraswathi do, because Lakshmi and Saraswathi are supposed to be ideal wives of ideal husbands, whereas no one knows who Pochamma's husband is, any more than they can name Maisamma's husband. This is the reason why even if a Brahmin invokes the name of Pochamma when there is smallpox in his house, it is only in a derogatory way"
ఐలయ్య వాదన తప్పో ఒప్పో అన్న చర్చ ప్రస్తుతానికి వదిలేద్దాం.
Mistake in above, reposting corrected comment: Jai
Deleteబ్రహ్మ, విష్ణువు, రాముడు తదితరులు హిందూ దేవతలని (బ్రాహ్మణ దేవతలు కాదు, తేడా గమనించాలి); ఇంకోవైపు పోచమ్మ, ఎల్లమ్మ, గండిమైసమ్మ తదితరులు శూద్రదేవతలని ప్రొఫెసర్ కంచా ఐలయ్య వాదన.
నేను హిందువును ఎట్లయిత (Why I am not a Hindu అనే తర్జుమా సరికాకపోవొచ్చు) నుండి కొన్ని పంక్తులు:
"Even a Brahmin family might talk about Pochamma, Maisamma or Ellamma, but not with the same respect as they would about Brahma, Vishnu, Maheswara. For them Pochamma and Maisamma are 'Sudra' Goddesses and supposed to be powerful but in bad, negative ways. A Pochamma according to them does not demand the respect that Lakshmi or Saraswathi do, because Lakshmi and Saraswathi are supposed to be ideal wives of ideal husbands, whereas no one knows who Pochamma's husband is, any more than they can name Maisamma's husband. This is the reason why even if a Brahmin invokes the name of Pochamma when there is smallpox in his house, it is only in a derogatory way"
ఐలయ్య వాదన తప్పో ఒప్పో అన్న చర్చ ప్రస్తుతానికి వదిలేద్దాం.
సమాజాన్ని భగవత్స్వరూపంగానూ , ఆసమాజ ఙ్ఞాన స్వరూపాలు బ్రామ్మలుగానూ , శౌర్య స్వరూపాలు క్షత్రియులుగానూ , సంపద స్వరూపాలు వైశ్యులుగానూ , దాస్య స్వరూపాలు శూద్రులుగానూ ప్రతిభావింపజేయడమూ తప్పదనుకుంటే దానికి పుట్టుక కారణం కాకూడదు. అందరూ అన్ని పనులూ చేయగలిగేలా..... చేసుకునేలా...... అన్నీ అవసరమైన కార్యములుగా చూపబడాలి. నేర్పబడాలి. అలా చేయగలిగిన..... లేదా ప్రయత్నించడమే దైవత్వం.
ReplyDeleteఆ దిశగా మార్పు క్రమానుగతంగా జరుగుతూనే ఉంది .
Deleteకుట్రదారుల ప్రవచనాల నెవరూ ఇప్పుడు విశ్వసించడంలేదు . మీ అభిప్రాయం దైవత్వ భావనను
అంది పుచ్చుకుంది .
(h)
Delete. . . మేధోతనం అంటే జ్నానం ( శ్యామలీయం గారూ వత్తు పడడం లేదు) . . .
ReplyDeleteమేధోతనం అన్న మాట ఉంటుందనుకోను. మేధ అన్నది సరైనపదం, అది చాలు. జ్ఞానం అనటానికి కొందలరావు గారికి వచ్చిన ఇబ్బంది యేమిటో తెలియటం లేదు. మీ తెలుగుఉపకరణం బాగుండకపోతే ప్రముఖ్ IME వాడండి.
pl send IME link sir.
ReplyDeleteప్రముఖ్ IME లింక్ https://www.vishalon.net/pramukhime/windows
Deletetq Syamaleeyam garu.
Deleteమేధ, మేధోతనం రెండూ విన్నాను. తప్పొప్పులు నాకు తెలియవు. మొత్తం మీద జ్నానం (వత్తు సరిచేసి) ఉన్నవ్యక్తి అని అనుకోండి.
ReplyDeleteమేధోతనం అన్నమాట మీడీయాసృష్టి కావచ్చును!
Deleteకావచ్చు.
Deleteఅస్సలు దేవుడు సృష్టించాలి.. అంతేగానీ.. తల కాయ నుంచీ, పొట్టనుంచీ, తొడలనుంచీ, కాళ్ళనుంచీ సృష్టించడమేమిటి?? ఆమాత్రం తలకాయలేనొడు దేవుడెలా అవుతాడు?
Deleteఏ గ్రంధమైనా.. బ్రాహ్మణులని ఎలా రక్షించాలీ.. వాల్లని ఎలా చూసుకోవాలీ.. వాల్లు చెప్పిన మాట వినకపోతే.. ఇతరులని ఎలా శిక్షించాలి.. అని చెప్పి దానికి "శిష్ట రక్షణ.. దుష్ట శిక్షణ" అని పేరు పెట్టడం తప్ప.. మామూలు జనాలకోసం దేవుడు పుట్టిన దాఖలాలెక్కడ?
చేసే పనులబట్టి కులాలు పుట్టాయి అని వాదించే వాళ్ళు.. ఇప్పుడు నేను వేదం చదివితే.. నన్ను బ్రాహ్మడు అంటుందా.. వ్యాపారం చేస్తే నన్ను వైశ్యుడంటుందా?? అస్సలు రాజులే లేని ఈ కాలంలో క్షత్రియ కులమేంటి? వెలమలు ఏం చేసేవారని వారికి ఆ కులమొచ్చింది?
< అస్సలు దేవుడు సృష్టించాలి.. అంతేగానీ.. తల కాయ నుంచీ, పొట్టనుంచీ, తొడలనుంచీ, కాళ్ళనుంచీ సృష్టించడమేమిటి?? ఆమాత్రం తలకాయలేనొడు దేవుడెలా అవుతాడు? >
Deletegood.
< ఏ గ్రంధమైనా.. బ్రాహ్మణులని ఎలా రక్షించాలీ.. వాల్లని ఎలా చూసుకోవాలీ.. వాల్లు చెప్పిన మాట వినకపోతే.. ఇతరులని ఎలా శిక్షించాలి.. అని చెప్పి దానికి "శిష్ట రక్షణ.. దుష్ట శిక్షణ" అని పేరు పెట్టడం తప్ప.. మామూలు జనాలకోసం దేవుడు పుట్టిన దాఖలాలెక్కడ? >
Deleteఇందులో పాక్షికంగా మాత్రమే సత్యం ఉందన్నది నా అభిప్రాయం.
ఆవేశపూరితమైన చర్చల్లోనికి చొరబడే ఉద్దేశం లేదు. దైవనిందవలన ఎవరికైనా సంతృప్తిలభిస్తే వారికి తగినవైరఫలం వారు పొందగలరు, దానికేమి. ఉన్నతమైన భావనలను వ్యక్తీకరించే అనేక సందర్భాల్లో మార్మికత తప్పకుండా ఉంటుంది. దాని అవసరమూ ప్రయోజనమూ దానివి. ఆమార్మికతను అవగాహన చేసుకొని సత్యదర్శనం చేయగలిగిన వాళ్ళకు లభించే అంతరార్థం, సాధారణంగా ముక్కస్యముక్కార్థః అనుకొనే తొందరపాటుకల వాళ్ళకు దొరకదు. నిజానికి దుష్టశిక్షణ పేరుతో జరిగేదీ శిష్టరక్షణయే. ఉదాహరణకు శాపోపహతులైన విష్ణుభక్తులు జయవిజయులే రావణకుంభకర్ణులు. వారికి ఆయా దురుపాధులనుండి విముక్తి కలిగించటం కోసం రామావతారమెత్తి భగవంతుడు స్వయంగా అష్టకష్టాలు పడటం వెనుక మనం భగవత్కృపనే చూడాలి. ఇంకా విస్తారంగా వ్రాయటమూ వాదించటమూ వీలుపడదు. నామాటలు ఆమోదించేవారికీ వాటిలో తప్పులుపట్టే వారికీ కూడా వందనం చేస్తూ విరమిస్తున్నాను.
Delete>>శాపోపహతులైన విష్ణుభక్తులు జయవిజయులే రావణకుంభకర్ణులు
Deleteనేను చెప్పినదాన్లో అదికూడా ఉంది శ్యామలీయంగారూ! మామూలు ప్రజలకోసం ఏ అవతారం లేదు.
< దైవనిందవలన ఎవరికైనా సంతృప్తిలభిస్తే.... >
Deleteచర్చకూ.... నిందకూ.... తేడా ఉంది సర్. నిందించడం వలన సంత్రుప్తిపడడం వలన సాధించేదేమీలేదు. తప్పులను తెలుసుకోవడానికీ... సరిజేసుకోవడానికీ...... మెరుగైన ప్రత్యామ్నయం సాధించడానికీ..... ఏ విషయంలోనైనా చర్చ అవసరమే. కాకుంటే వివిధ కారణాల రీత్యా చర్చల సందర్భంలో ఎవరి భావజాలాలకు అనుగుణంగా ఆయా వ్యక్తులు భావోద్వేగాలు ప్రదర్శించడాన్ని సంయమనంతో అర్ధం చేసుకోవలసి ఉంటుంది.
This comment has been removed by a blog administrator.
Delete@Chiru DreamsJanuary 29, 2019 at 9:09:00 PM GMT+5:30
Deletequestion01:అస్సలు దేవుడు సృష్టించాలి.. అంతేగానీ.. తల కాయ నుంచీ, పొట్టనుంచీ, తొడలనుంచీ, కాళ్ళనుంచీ సృష్టించడమేమిటి?? ఆమాత్రం తలకాయలేనొడు దేవుడెలా అవుతాడు?
hari.S.babu
Answer01:"అసలు దేవుడు సృష్టించాలి" అంటున్నారు - మీ నాస్తికత్వం వదిలేసినట్టేనా?ఏ దేవుడు సృష్టించాలని మీ ఉద్దేశం?వేదంలోని పురుష సూక్తంలో ఉంటుంది ఈ శరీర భాగాలను వర్ణాలతో పోల్చుతున్న వివరణ.అది పోలిక మాత్రమే తప్ప అక్కడ దేవుడి తల నుంచి బ్రాహ్మణ వర్ణం పుట్టిందని చెప్పలేదు.వ్యక్తికి బహువచనం వ్యష్ఠి అనేది మీకూ తెలుస్య్ కదా!సమాజం అంటే ఏమిటి?అనేక మంది మనుషులు ఒక చోట కూడి అందరూ కలిసి చెయ్యాల్సిన ఆనెకమైన పనుల్లో ఎవరు ఏయే పనులు చేస్తే తక్కువ శ్రమతో ఎక్కువ సంపద పుడుతుందో ఆయా పనుల్ని విభజించుకుని ఎవరికి సౌకర్యంగా ఉండే పనుల్ని వారు చెయ్యటం - దీనినే శ్రమవిభజన అనటారు.అక్కడ ఉన్న వివరణ ప్రకారం అనేకమంది వ్యక్తుల చేత ఏర్పడిన సమాజాన్ని ఒక వ్యక్తి అనుకుంటే ఒక వ్యక్తికి తల చేసే పనులు చేసేవారిని బ్రాహ్మణులు అనీ భుజాలు చేసే పనుల్ని చేసేవారిని క్షత్రియులు అనీ అనడమే జరిగింది.ఇతర వేదశాస్య్=త్రాల్లోనూ అన్ని పురాణాల్లోనూ కనపడే వర్ణ వుభజనకి పురుష సూక్తం ఒక్కటే ప్రమాణం.అది శ్రమవిభజనని నిర్వచించేది తప్ప సృష్టి గురించి చెప్పేది కాదు.కాబట్టి అదెవుడు బ్రాహ్మణౌలి తన తల నుంచీ క్షత్రియుక్ని తన భుజాలనుంచీ సృష్టంచదని చెప్పటం తప్పు.
"తల కాయ నుంచీ, పొట్టనుంచీ, తొడలనుంచీ, కాళ్ళనుంచీ సృష్టించడమేమిటి" అని వేదం చెప్పనిదాన్ని వేదం చెప్పినట్టు బల్లగుద్ది చెప్పేసి దాన్ని వ్యతిరేకిస్తే ఇంక నేను చెప్పేది ఏముంది?నిజమే, తలకాయ నుంచీ పొట్టనుంచీ సృష్టుంచడానికి ఆస్లు దేవుడి తలకాయే కాదు ఆకారమే లేదు.ఉందా!అవ్యక్తం నుంచి వ్యక్తం, వ్యక్తం నుంచి మహత్తత్వం,మహత్తత్వం నుంచి భూతపంచకం,భూఅత్ పంచకం నుంచి 28 రకాల జాతులు ప్రభవించడం అనేది వేరే కధ.అది వర్ణాలకీ కులాలకీ సంబంధించినది కాదు.ఇక్కడ దాని గురించిన చర్చ అనవసరం.
Chiru DreamsJanuary 30, 2019 at 10:18:00 PM GMT+5:30
Delete>>శాపోపహతులైన విష్ణుభక్తులు జయవిజయులే రావణకుంభకర్ణులు
నేను చెప్పినదాన్లో అదికూడా ఉంది శ్యామలీయంగారూ! మామూలు ప్రజలకోసం ఏ అవతారం లేదు.
hari.S.babu
మామూలు ప్రజల కోసం ఏ అవతారమూ లేదని మీరెలా బల్ల గుద్ది చెప్తున్నారు?"హేతువాదులు" అని మీరు పెట్టుకున్న లేబుల్ ఉన్నవాళ్లు మాత్రమే మామూలు ప్రజలు అని నిర్ధారించినప్పుడు మాత్రమే మీ సూత్రీకరణ నిజం అవుతుంది?కాబట్టి మీరు వాడిన "మామూలు ప్రజలు" అనే క్యాటగిరీలోకి ఎవరెవరు వస్తారో లిస్టు ఇవ్వగలరా?
ఎందుకంటే, వేదం ప్రతి ఒక్కరి కోసం ఉద్దేశించబడిన శాస్త్రం.వేదంలోనే ఆ నిబంధన ఉంటుంది.తలనుంచి బ్రాహ్మలు పుట్టారు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు అనేది ఎంత అబద్ధమో వేదం బ్రాహ్మణులకు తప్ప ఇంకెవరికీ పఠనయోగ్యం కాదు అనడం కూడా అంతే తప్పు. సాక్ధాత్తూ వైదిక ఋషులలో స్త్రీలు కూడా కొన్ని సూక్తాలకి ద్రష్టలు అయ్యారు.నిషేధం ఉంటే వాళ్ళు ద్రష్టలు కావ్డం సాధ్యపదదు కదా!శూద్రులు వేదం చదివితే చెవుల్లో సీసం కరిగించి పొయ్యమనే సాహిత్యం కూడా సా.శ 15వ శతాబ్దం తర్వాత పుట్టిందే.దాదాపు సా.శ.15వ శతాబ్దం నుంచి భారతీయ సమాజం వైదిక ధర్మానికి దూరం అయ్యింది.దీనికి శంకరుని అద్వైతంతో విభేదించిన ద్వైతం,ద్వైతం ప్రభావం వల్ల హద్దులు దాటిన మూర్యార్చన ముఖ్యమైన కార్ణం.
సా.శ 1వ శతాబ్దపు శాతవాహన సామ్రాజ్యంలో కమ్మ కులస్థులు వేదం చదువి బ్రాహ్మణత్వం స్వీకరించారు.అగ్రకులాలే కాదు నిమన కులాల నుంచీ ఆఖరికి అతవీ జాతుల నుంచి కూడా షట్శాస్త్ర నిరతులూ యాజ్ఞికులూ తయారయ్యారని శాసనాల సాక్ష్యం కూడా ఉంది.
మత్స్యావతారం వేదాలను అపహరించిన సోమకుణ్ణి సమ్హరించడం కోసం ఆవిర్భవించితే ఆ వేదాల వల్ల ప్రయోజనం పొందాల్సిన వాళ్ళలో సామాన్య ప్రజలు కూడా ఉన్నారు.కదహని హేతుబద్ధతను అన్వయించి చూస్తే సోమకాసురుడు చేసింది అప్పటి వరకు అందరూ ప్రయోజనం పొందుతున్న వేదవిద్యను కొందరికే పరిమితం చేస్తే తిరిగి వేదవిద్యని అందరికీ అందించడం జరిగిందని అర్ధం అవుతుంది,అవునా?
మానవ రూపంలోని అవతారాలు కూడా దుర్మార్గులని సంహరిస్తే వాళ్ళ వల్ల కష్టాల పాలయిన సామాన్య ప్రజలకే కదా మేలు జరిగేది - మరి, దేవుడు బ్రాహ్మల్ని మాత్రమే రక్షిస్తాడు అంటే ఎలా?దీపావళికి బ్రాహ్మణులు మాత్రమే దీపాలు వెలిగించడం లేదు కదా!
అస్సలు దేవుడు సృష్టించాలి.. అంతేగానీ.. తల కాయ నుంచీ, పొట్టనుంచీ, తొడలనుంచీ, కాళ్ళనుంచీ సృష్టించడమేమిటి??
ReplyDeleteNow this is called cloning !
Cloning is the process of producing genetically identical individuals of an organism either naturally or artificially. In nature, many organisms produce clones through asexual reproduction. Cloning in biotechnology refers to the process of creating clones of organisms or copies of cells or DNA fragments.
>>ఒక మానవ దేహంలో పాదాల కన్నా తలే గొప్ప అని అనుకోవడం మూర్ఖత్వం. పెద్దలకు విజ్ఞులకు గురువులకు పాదాభివందనం చేస్తాము
ReplyDeleteనీ శరీరంలో అత్యంత తక్కువస్థాయి ఐనటువంటి పాదాల కంటే.. నేను తక్కువవాడిని అని అర్ధం..
అందుకే షోలే సినిమాలో గబ్బర్ సింగ్ "వో సర్ యే ఫైర్" అని నొక్కి వొక్కాణిస్తాడు. తన దేహంలో అన్నటికన్నా గొప్పదయిన తలను అవతలి మనిషిలో అన్నటికన్నా తక్కువగా పరిగణించే పాదాల దగ్గర పెట్టడం అల్టిమేట్ దాసోహం (లేదా గౌరవం) అనడమే దీని ఉద్దేశ్యం.
Deleteమతం మారే స్వేచ్చలాగే.. కులం మార్చుకునే స్వేచ్చకూడా ఉండాలి. అప్పుడు ఉధ్యోగాలకోసమో, రిజర్వేషన్లకోసమో.. లేక పైకులాల్లోకి వెల్లాలనే ఆలోచనలతోనో, కులాంతర వివాహం కుదరదన్నప్పుడు.. కులం మార్చుకోనో.. అంతా కలిసిపోతారు..
Deleteమతం అనేది మనిషికి కొన్ని కారణాల రీత్యా అవసరమైనది. జీవన విధానంకు సంబంధించినది. ప్రపంచం ప్రత్యామ్నయం చైతన్యవంతంగా చూపగలిగినంతవరకూ అది మారుతూ, అభివ్రుద్ధికరమైన దిశలో పయనిస్తుంది. కులం అనేది దుర్మార్గుల అవసరాలకోసం మనుషులలో అంతరాలు స్రుష్టించడానికి స్రుష్టించబడినది. మీరు చెప్పిన పరిష్కారమూ ఓ మార్గమే. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలలో అంత సాహసం చేయగలిగే దమ్ము రాజకీయ పార్టీలకు రావాలి ముందుగా.
Deleteక్రిస్టియన్ లు బ్రాహ్మలను వివాహం చేసుకుంటే క్రిస్టియన్ లు అయిపోతారు. అర్జున్ రెడ్డి సినిమాలో "మధురమే ఈ క్షణమే" పాటను వ్రాసిన శ్రేష్ట ఒక బ్రాహ్మణ తల్లికి, క్రిస్టియన్ తండ్రికి పుట్టింది. తల్లిలాగా సాహిత్యంలో పాండిత్యం కలిగిఉన్నా, తండ్రిలాగా తనని తొక్కేస్తున్నారు అంటూ బాధపడిపోతుంది. Idreams లో ఆవిడ ఇంటర్వ్యూలు చూడండి. కులం మార్చుకోవడం అంటే వేరే కులం వాళ్ళని పెళ్ళిచేసుకోవడమే, కులం మారినంతమాత్రాన బుద్ధులు మారవు.
Deleteబుద్ధి ఏర్పడడం, మారడం అనేది మొత్తం ప్రక్రతిలోనే కీలకమైన, ప్రధానమైన అంశం. మానవ స్వభావంపై ఇప్పటికి జరిగిన అధ్యయనాలు పుట్టుక, పరిస్థితులు అనేవి బుద్ధికి సంబంధించి ప్రభావిత అంశాలుగా గుర్తించారు. ఈ పరిశోధనలు మరింతగా పురోగతి సాధించాల్సి ఉంది. పరిస్థితులను మనం మార్చుకోగలిగినవి. కనుక పరిస్తితులలో పురోగమనం కోసం ‘మనం’ గా పోరాడాల్సిందే. ‘నేను’ కు విలువ ఉన్నా అది సార్ధకం కావాలంటే ‘మనం’ వల్లనే సాధ్యం. అందుకే ‘నేను’ ‘మనం’లో ఒదిగడమే ‘జనవిజయం’.
Deleteకులం పేరు చెప్పుకోకుండా ఆర్థిక అసమానతలని సమర్థించడం కంటే కులం పేరుతో ఆ పని చెయ్యడం సులభం. కుల నిర్మూలన కోసం దిగువ కులాలే పోరాడాలి తప్ప అది బ్రాహ్మణ సంఘ సంస్కర్తల వల్ల జరిగే పని కాదు. 1970లు & 1980ల టైమ్‌లో తెలుగు సినిమాల్లో రేప్ సీన్‌లు ఎక్కువగా ఉండేవి. అప్పట్లో సెన్సార్ బోర్డ్‌లో మహిళా సభ్యులు లేరు. సెన్సార్ బోర్డ్‌లో మహిళా సభ్యులని నియమించడం ఈ మధ్య మొదలైంది. రేప్ సీన్‌లపై మహిళలకి ఉన్నంత అభ్యంతరం మగవాళ్ళకి ఉండదు అనేది ఎంత నిజమో, కులం కట్టుబాట్ల వల్ల దిగువ కులాలవాళ్ళకి ఉన్నంత నష్టం పై కులాలకి ఉండదనేది కూడా అంతే నిజం.
ReplyDelete@Niharika:"అర్జున్ రెడ్డి సినిమాలో "మధురమే ఈ క్షణమే" పాటను వ్రాసిన శ్రేష్ట ఒక బ్రాహ్మణ తల్లికి, క్రిస్టియన్ తండ్రికి పుట్టింది."
ReplyDeleteతల్లి కులం తీసుకుంటానంటే రాజ్యాగం ఒప్పుకుంటుదా? రాజ్యాగం ఒప్పుకున్నా.. బ్రాహ్మణులు, వారి సప్పోర్టర్స్ ఒప్పుకుంటారా?
ఇక వేదాల్లో కులాల గురించి.. "వేదాల్లో కులాలు లేవు.. వర్ణాలే వున్నాయి" అనే వారికి": అస్సలు కులం అనేది ఏ భాష? వేదాల్లో వున్న భాష ఏమిటి?.
అర్ధం అవ్వడానికి ఒక ఉదాహరణ చెబుతాను. కాలేజిలో వున్నప్పుడు, మేము లేపాక్షి టూర్ కు వెల్లాం. అక్కడున్న గైడ్ స్థల పురాణం గురించి చెబుతూ.."రెక్కలు తెగిన ఝఠాయువును చూసిన రాముడు.. 'లే పక్షీ' అన్నాడంట. అందుకే ఆ ఊరు లేపాక్షి అయ్యింది" అన్నాడు. అప్పుడు నేను "రాముడిది ఏభాష? ఝఠాయువుదే భాష? రాముడు తెలుగులో(తెలుగు మట్లాడడం వొస్తే).. మాట్లాడితే.. ఝఠాయువుకి ఎలా అర్ధమైంది? ఒకవేళ అర్ధమైనా.. ఆ మాట విని.. ఆ స్థలానికి ఆపేరు పెట్టిందెవరు?" అని అడిగాను. "తెలీదు సార్! అందరూ అనేదే మీకు చెప్పాను" అన్నాడు.