కొంత మంది రంగనాయకమ్మ గారికి ఓ ప్రశ్న అడిగారు "IT ఉద్యోగులు కూడా కార్మికులే కదా, మరి సాఫ్త్‌వేర్ ఇంజనీర్లు కూడా కమ్యూనిజమ్‌ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?" అని. దానికి నేను వివరంగా సమాధానం చెప్పగలను.
మన దేశంలోని IT కంపెనీలు చాలా వరకు consultancy సంస్థలు. అవి సామ్రాజ్యవాద దేశాల నుంచి వచ్చే off-shore projectsతో బతికే సంస్థలు. సామ్రాజ్యవాద దేశాలతో పోలిస్తే ఇందియా ఆర్థికంగా చాలా వెనుకబడిన దేశం. ఇక్కడ labour cost తక్కువగా ఉంటుంది కనుక సామ్రాజ్యవాద దేశాలకి చెందిన కంపెనీలు ఇక్కడి IT కంపెనీలకి software వ్రాయించే పనిని అప్పగిస్తాయి. మన దేశం ఆర్థికంగా ఎంత వెనుకబడి ఉంటే సామ్రాజ్యవాదులకి అంత cheap labour దొరుకుతుంది. మన దేశంలోని IT కంపెనీలన్నీ మన దేశ వెనుకబాటుతనం వల్ల లాభం పొందేవి.
ఈ నిజాలు సాఫ్త్‌వేర్ ఇంజనీర్లకి తెలుసా? వాళ్ళలో కొంత మందికి తెలిసి ఉండొచ్చు, కొంత మందికి తెలియకపోవచ్చు. మన దేశ కరెన్సీ విలువ తక్కువగా ఉండడం వల్లే మనకి off-shore projects వస్తున్నాయని ప్రచారం చేసి దేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతల గురించి జనానికి తెలియకుండా చేసే పెట్టుబడిదారీ పత్రికలు ఉన్నాయి. కేవలం కరెన్సీ విలువ తగ్గడం వల్ల off-shore projects రావు. కరెన్సీ విలువ తగ్గితే ధరలు పెరిగుతాయి. కేవలం IT పరిశ్రమ కోసం కరెన్సీ విలువని కృత్రిమంగా తగ్గిస్తే ITతో సంబంధం లేని చాలా పరిశ్రమలు నష్టపోతాయి. ఉదాహరణకి విదేశాల నుంచి దిగుమతి అయ్యే జిప్సం ధరలు పెరిగితే జిప్సం కాంప్లెక్స్ ఎరువులు తయారు చేసే పరిశ్రమలు మూతపడగలవు. ఆ ఎరువుల కంపెనీలు మూతపడకుండా ధరలు పెంచేసి ఎరువులు అమ్ముకున్నా, అవి కొనలేక రైతులు ఆత్మహత్యలు చేసుకోవచ్చు. ముందూవెనుకా చూడకుండా కరెన్సీ విలువని కృత్రిమంగా తగ్గిస్తే ఇలాంటివి చాలా జరుగుతాయి.
పల్లెటూరిలో కూలీ పని చేసుకునేవాని కొడుకు కంటే మాజీ మునసబ్ మనవడు ఆర్థికంగా చాలా ముందున్నవాడు అయ్యుంటాడు. మాజీ మునసబ్ మనవడు చదువుకుని హైదరాబాద్‌లో సాఫ్త్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడగలడు కానీ కూలీ పని చేసుకునేవాని కొడుక్కి చదువుకోవడానికి అతని ఆర్థిక పరిస్థితి సహకరించదు. IT కంపెనీలో ఉద్యోగం దొరికినవాడు తనకి white collar ఉద్యోగం దొరికింది కదా అని సంతోషిస్తాడు కానీ తమ కంటే ఆర్థికంగా వెనుకబడి ఉండిపోయినవాళ్ళ గురించి పట్టించుకోడు. IT కంపెనీలు ఆర్థిక అసమానతల వల్లే లాభాలు అర్జిస్తున్నాయని తెలిసినా, తన జీవితం చాలా మంది పల్లెటూరివాళ్ళ జీవితాల కంటే మెరుగ్గా ఉందని సంతృప్తిపడతాడు. కూలీవాళ్ళ పిల్లలు IT ఉద్యోగుల పిల్లలతో పోటీ పడి వాళ్ళ అవకాశాలు లాక్కోలేరు అనే నమ్మకం కూడా IT ఉద్యోగులకి ఉంటుంది.
రష్యాలో స్తాలిన్ ప్రైవేత్ ఆస్తిని రద్దు చేసాడు. 1940లో రష్యాలో ఒక్క నిరుద్యోగి కూడా లేడు. రష్యా అప్పట్లో ఆర్థికంగా అంత అభివృద్ధి చెందింది. అక్కడ మేనేజర్ల వ్యవస్థని రద్దు చెయ్యలేదు కానీ అక్కడ మేనేజర్ కొడుకు మేనేజరే అవుతాడని లేదు. మేనేజర్ కొడుకు కార్మికుడు అవ్వొచ్చు, కార్మికుని కొడుకి మేనేజర్ అవ్వొచ్చు. అందువల్ల పెట్టుబడిదారీ వర్గంవాళ్ళు మేనేజర్ వ్యవస్థని కూడా అంగీకరించలేక రష్యాలో సోషలిజం పూర్తిగా కూలిపోయేంత వరకు కుట్రలు చేసారు. మన దేశంలో నెహ్రూ ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టాడు. ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలో మేనేజర్ కొడుక్కి ఏ గుమాస్తా ఉద్యోగమో దొరకొచ్చు కానీ మేనేజర్ ఉద్యోగమే దొరుకుతుందని లేదు. IT ఉద్యోగుల పిల్లలతో పల్లెటూరివాళ్ళు పోటీ పడలేరు కనుక తన కొడుక్కి కూడా IT ఉద్యోగమే వస్తుందనే నమ్మకం ఒక సాఫ్త్‌వేర్ ఇంజనీర్‌కి ఉంటుంది కానీ తన కొడుక్కి కూడా మేనేజర్ ఉద్యోగమే వస్తుందనే నమ్మకం ఒక ప్రభుత్వ రంగ సంస్థలోని మేనేజర్‌కి ఉండదు. IT ఉద్యోగులు తమకి IT ఉద్యోగం ఒక safety vault (దొంగలు పగలగొట్టలేని ఇనుప బీరువ) అనుకోవడం వల్లే వాళ్ళు గ్లోబలైజేషన్‌ని సమర్థిస్తూ సోషలిజమ్‌ని వ్యతిరేకిస్తున్నారు. అయినా IT రంగం వాళ్ళు అనుకున్నంత భద్రం కాదు. నాకు తెలిసినవాళ్ళ పిల్లలు పూణేలో ఇరవై వేల రూపాయల జీతానికి IT కంపెనీల్లో పని చేస్తున్నారు. ఉన్న ఊర్లోనే అంత కంటే ఎక్కువ సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి.
- ప్రవీణ్ కుమార్
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
//ఈ నిజాలు సాఫ్త్‌వేర్ ఇంజనీర్లకి తెలుసా? వాళ్ళలో కొంత మందికి తెలిసి ఉండొచ్చు, కొంత మందికి తెలియకపోవచ్చు. //
ReplyDeleteప్రపంచములో ఈ విషయం తెలీని సాఫ్టువేరోళ్ళు ఎవరూ ఉండరు. సాఫ్టు వేరోళ్ళు కమ్యూనిజాన్ని వ్యతిరేకించడానికి కారణం ఇవేవీ తెలీక కాదు. వారికి మరికొన్ని విషయాలు కూడా తెలిసు కాబట్టి. 24గంటలు నెట్ అందుబాటులో ఉండడం, లోకాన్ని చూడడానికి వారికి ఎక్కువ అవకాశాలు ఉండడం, దానికితోడు వాల్లు పక్కా కార్పొరేట్ కల్చరుకు అలవాటు పడడం కారణం కావచ్చు.
తెలియనివాళ్ళు ఉన్నారు. మా తమ్ముడి స్నేహితుడే కరెన్సీ విలువ గురించి తెలిసితెలియనివి మాట్లాడడం చూసాను. మన దేశంలో ఎగుమతుల విలువ కంటే దిగుమతుల విలువ ఎక్కువగా ఉండడం వల్లే మన కరెన్సీ విలువ తక్కువగా ఉంది. IT కంపెనీల కోసం కృత్రిమంగా కరెన్సీ విలువని తగ్గిస్తే చమురు లాంటి దిగుమతుల ధరలన్నీ పెరుగుతాయి.
ReplyDelete>>> ఈట్ ఉద్యోగులకి కమ్యూనిజంపై వ్యతిరేకత ఎందుకు ఉంది?
ReplyDeleteనేనడుగుతున్నాను, అసలు ఈ దేశంలో కమ్యూనిజం పైన ఎవరికి సానుకూలత వుంది?
గత ఎన్నికల్లో CPI(M) వోట్ల శాతం 3.25. ఇక CPI లెక్కలోనే లేదు. కనీసం 31% మందికి సానుకూలత వుంటే ఈ దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడి వుండేది. మీరు IT వారికి అని కాకుండా మొత్తానికి విశ్లేషణ చేసుకుంటే మంచిది.
పాయింటే :-)
Deleteవర్గ పోరాటం కాకుండా వర్గ సహకారాన్ని నమ్ముకునే CPI, CPMల గురించి అడిగితే ఆ రెండు పార్తీలనీ వ్యతిరేకించే నేను సమాధానం చెప్పను.
Deleteఒక విషయం మాత్రం చెపుతాను. కేరళలోని పల్లెటూరిలో లఒకరీ ద్రైవర్‌గా పని చేసేవానికి బెంగళూరు IT కంపెనీల కోసం కమ్యూనిజమ్‌ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉండదు. కమ్యూనిజం గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా దోపిడీ, దోపిడీ అంటూ మాత్రమే అరిచేవాళ్ళకి కమ్యూనిజమ్‌పై వ్యతిరేకత లేనివాళ్ళు కూడా వోత్ వెయ్యరు.
ఇందియాలో ఒక లిబర్తేరియన్ పార్తీ పెడితే పెట్టుబడిదారుల్లో కూడా ఎక్కువ మంది దానికి వోత్‌లు వెయ్యరు. వాళ్ళు లైసెన్సుల కోసం గానీ contractల కోసం గానీ కాంగ్రెస్‌నో, భాజపానో నమ్ముకుని ఉంటారు. ఒకడికి సహాయం చేస్తే అతను మనకి తిరిగి సహాయం చేస్తాడనే నమ్మకం లేకే కదా చాలా మంది ఇతరులకి సహాయం చెయ్యరు. Ayn Rand రచనలు చదివే మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. రాజకీయ పార్తీలకి వోత్‌లు వేసేవాళ్ళు అనుకునేది కూడా అదే.
@ శ్రీకాంత్ చారి garu, good point. 68 పార్టీలుగా చీలి ఒకరిపై ఒకరు ఇతరులకు అసహ్యం కలిగేలా ఈసడించుకునే కమ్యూనిస్టులు వారి సిద్ధాంతాలను ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పగలగడం ముందు నేర్చుకుంటే ఎవరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్ధమవుతుంది. చెప్పడమే తప్ప వినడం, రివ్యూ చేసుకోవడం భారత కమ్యూనిస్టులకు నచ్చని పదాలు.
Deleteప్రవీణ్ గారు, వర్గ పోరాటం చేస్తున్న ఒక్క కమ్యూనిస్టు పార్టీని మన దేశంలో చూపగలరా?
Delete>>> ఇందియాలో ఒక లిబర్తేరియన్ పార్తీ పెడితే పెట్టుబడిదారుల్లో కూడా ఎక్కువ మంది దానికి వోత్‌లు వెయ్యరు. వాళ్ళు లైసెన్సుల కోసం గానీ contractల కోసం గానీ కాంగ్రెస్‌నో, భాజపానో నమ్ముకుని ఉంటారు. ఒకడికి సహాయం చేస్తే అతను మనకి తిరిగి సహాయం చేస్తాడనే నమ్మకం లేకే కదా చాలా మంది ఇతరులకి సహాయం చెయ్యరు.
Deleteనేను అయాన్ రాండునే కాదు, కారళ్ మార్క్సుని కూడా చదివాను. నా సంగతటుంచితే, మీర్రాసిన వాక్యాల సారమేమిటో అయాన్ రాండుకే గాదు, కారళ్ మార్క్సుకు కూడా అర్థం కాదనుకుంటా!
>>> ఇందియాలో ఒక లిబర్తేరియన్ పార్తీ పెడితే పెట్టుబడిదారుల్లో కూడా ఎక్కువ మంది దానికి వోత్‌లు వెయ్యరు.
పెట్టుబడిదార్ల వోట్లు ఎవరిక్కావాలి? నేనడుగుతున్నది 96.75% మంది ప్రజల వోట్ల గురించి.
>>> వాళ్ళు లైసెన్సుల కోసం గానీ చొంత్రచ్త్ల కోసం గానీ కాంగ్రెస్‌నో, భాజపానో నమ్ముకుని ఉంటారు
>>> ఒకడికి సహాయం చేస్తే అతను మనకి తిరిగి సహాయం చేస్తాడనే నమ్మకం లేకే కదా చాలా మంది ఇతరులకి సహాయం చెయ్యరు.
వాళ్ళు BJPనో, కాంగ్రెస్ నో నమ్ముకుంటారని మీరే చెపుతున్నారు. ఆ వేంటనే నమ్మకం లేకే ఇతరులకు సహాయం చేయరని కూడా చెపుతున్నారు? కొంపదీసి "ఇతరుల" మీదే నమ్మకం లేదా? ఎందుకు "ఇతరుల" మీద నమ్మకం లేదు? మీరు చెప్పే ఆ "ఇతరులు" కమ్యూనిస్టులే అయితే ప్రజలకెందుకు వారిమీద నమ్మకం లేదు? ఎందుకు కాంగ్రెస్ BJPల మీద వారికి నమ్మకం వుంది?
చారి, కాంగ్రెస్ & భాజపాలు అనుభవజ్ఞులైన వ్యాపారులు. నీకు ఎంత అపనమ్మకం ఉన్నా వస్తువులు కొనడానికి దుకాణానికే కదా వెళ్తావు. పెట్టుబడిదారులకి అవసరమైనవి స్థిరమైన పాలన అందించే కాంగ్రెస్ & భాజపాలే కానీ అధికారంలోకి వస్తుందో, రాదో తెలియని లిబర్తేరియన్ పార్తీ కాదు కదా.
Delete2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఎందుకు గెలవలేదు? కాంగ్రెస్ ఓడిపోతే ఇందిరమ్మ ఇళ్ళ పథకం ఆగిపోతుందనే భయంతో చిరంజీవి గారి కులస్తులు కూడా కాంగ్రెస్‌కి వోత్‌లు వెయ్యబట్టే కదా.
2004కి ముందు చంద్రబాబు నాయుడు కేవలం roadలు వెడల్పు చేసాడనే చంద్రబాబుని పొగుడుతూ కాంగ్రెస్, కమ్యూనిస్త్‌లని తిట్టినవాళ్ళని కూడా చూసాను.
ప్రతివాడూ ఏదో ఒక లెక్క వేసుకుంటాడు.
>>> ప్రతివాడూ ఏదో ఒక లెక్క వేసుకుంటాడు.
Deleteఅవును. మీరు 1% కూడా లేని IT వారి గురించి, పెట్టుబడిదారుల గురించి కాక 96.75% ప్రజలు ఎందుకు కమ్యూనిస్టులకు ఓటు వెయ్యడం లేదు అన్న విషయం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అదే నేను మొదటి నుంచి చెప్తున్నా.
లక్షకి పైగా జనాభా ఉన్న ఒక పట్టణంలో మార్క్సిజం చదివినవాణ్ణి ఒక్కణ్ణే చూసిన విషయం నేను ఇందాకే ఓ వ్యాఖ్యలో వ్రాసాను.
Deleteఅంటే మీరు చెప్పేది.
Deleteప్రజలు మార్క్సిజం చదివితే గానీ వారికి దానిపై సానుకూలత రాదు. ఇంకో విధంగా చెప్పాలంటే మార్క్సిజం చదవనంత వరకు వారికి దానిపై వ్యతిరేకత వుంటుంది. అందుకనే వారు వోట్లు వేయడం లేదు.
మరి IT వారు కూడా ఆ ప్రజల్లోకే వస్తారు కదా? వారిని ప్రత్యేకంగా ఎందుకు లాగవలసి వచ్చింది?
విశాఖపట్నంలో మార్క్సిస్త్‌నని చెప్పుకునే ఒకతను మార్క్సిజంకి విరుద్ధంగా తెలంగాణాపై విషం చిమ్ముతూ ఫేస్‌బుక్‌లో నలమోతు & పరకాల గుంపుతో కలిసాడు. మార్క్సిజం చదివితే సరిపోదు, ఆచరణ ముఖ్యం.
Deleteకెనదాలో ఉండే నా స్నేహితురాలు IT ఉద్యోగే. ఆమె సెల్‌ఫోన్‌లలో వాడే సాఫ్త్‌వేర్ తయారు చేస్తుంది. ఆమె చెప్పిన తరువాతే నాకు వైజాగ్‌లో ప్రజాశక్తి బుక్‌హౌస్ అద్రెస్ తెలిసింది. ఆమె ఎన్నడూ ఒక ప్రాంతంపై విషం చిమ్మలేదు, పైగా తెలంగాణాకి ఎప్పుడూ అనుకూలంగానే ఉంది. నేను ఇప్పుడు వైజాగ్ పబ్లిక్ లైబ్రరీలో మార్క్సిస్త్ సాహిత్యం చదువుతున్నాను తప్ప ప్రజాశక్తికి వెళ్ళడం లేదు. ప్రజాశక్తిలో దాస్ కేపితల్ తెలుగు అనువాదం దొరకదు కానీ వైజాగ్ పబ్లిక్ లైబ్రరీలో దాని హిందీ అనువాదం కూడా దొరుకుతుంది.
పోలీస్ అధికారుల్లో కూడా మార్క్సిజం చదివినవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు పాలకవర్గం తయారు చేసిన చట్టాలకి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోలేరు కదా.
>>ప్రజలు మార్క్సిజం చదివితే గానీ వారికి దానిపై సానుకూలత రాదు.
Deleteans:నిజమే కదా!చదవకుండా ఒకదాన్ని గురించి యేమీ తెలుసుకోకుండా దానిపట్ల అనుకూలత/ప్రతికూలత యెలా వస్తాయి?
నిజమే. చదవకుండా అనుకూలత, ప్రతికూలత గానీ ఉండవు. కాని కొన్ని జనాంతికంగా ఉండే భావాలతో (ఉదా: కమ్యూనిజం వల్ల స్వంత ఆస్తి పోతుంది, నిరంకుశత్వం వస్తుంది, అందులో చాలా వారకు నిజమే :) ) వ్యతిరేకత మాత్రం వుండే అవకాశం వుంది.
Deleteప్రవీణ్ జనం కమ్యూనిజం చదవరు కాబట్టి వోట్లు వేయరు అంటున్నాడు. నేను అదే విషయం అందరితో పాటు IT వారికీ వర్తిస్తుంది కాదా, వారు ప్రత్యేకంగా వ్యతిరేకించడమేమిటీ అని అడుగుతున్నాను.
నా కెనదా స్నేహితురాలు IT ఉద్యోగే అని నేను చెప్పాను కదా. ఆమే నాకు గురువులా సైద్ధాంతిక విషయాలు నేర్పింది.
Deleteఏడాదికి యాభై వేలు సంపాదించే ఒక పల్లెటూరివాని కొడుకు స్కాలర్షిప్ డబ్బులతో చదువుకుని నెలకి యాభై వేలు సంపాదించే IT ఉద్యోగంలో చేరితే అతను తాను పెట్టుబడిదారీ వ్యవస్థ వల్లే ఈ స్థితికి వచ్చాననుకుంటాడు. పెట్టుబడి పుట్టుకా, పరిణామాలూ అతను ఆలోచించడు. ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇలాగే "పాలకవర్గం వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను" అనుకుని పాలకవర్గాన్ని సమర్థిస్తాడు.
ఒక ప్రభుత్వ అధికారి మార్క్సిజం చదివినా అతను పాలకవర్గం తయారు చేసిన చట్టాల్ని మాత్రమే అమలు చెయ్యగలడు, సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం అతనికి ఉండదు. ఒక factory మేనేజర్ మార్క్సిజం చదివినా కార్మికులు సమ్మె చేసినప్పుడు అతను పోలీసుల్ని పిలిచి factory చుట్టూ కాపలా పెట్టిస్తాడు. చైతన్యం (awareness) కంటే ఆచరణ (practice) ముఖ్యం.
మార్క్సిజం అనేది ఇష్ట ప్రకారం చదివేది కానీ ఒకరి బలవంతం వల్ల చదివేది కాదు. స్కూల్ పుస్తకాల్ని పిల్లల చేత బలవంతంగా చదివిస్తారు కాబట్టే కదా స్కూల్ పుస్తకాల్లో వ్రాసిన నీతుల్ని ఎవరూ ఆచరించరు. మార్క్సిజంని బలవంతంగా చదివిస్తే అది కూడా స్కూల్ పుస్తకాల చదువులాగ తయారవుతుంది. అందుకే మార్క్సిజం చదవడం ఇష్టం లేనివాళ్ళకి అది చదవమని నేను బలవంతం చెయ్యను. పెట్టుబడి యొక్క పుట్టుక, పరిణామం లాంటి వాటి గురించి మాత్రం అవసరమైనప్పుడు చెప్పాల్సిందే.
స్వంత ఆస్థి పోతుంది అనే భావన దూరం చేస్తే కమ్యూనిజం మంచిదే కదా ? ఉదా : ప్రస్తుత కాలంలో ఒక మనిషి ఎటువంటి మోసం చేయకుండా ఈజీగా 100కోట్లు సంపాదించాడనుకోండి,ఆ తరువాత సంపాదించినదంతా ప్రభుత్వానికి అప్పగించాలి లేదా ట్రస్ట్ ద్వారా సేవ చేయాలని రూల్ పెడితే నియంతృత్వమేనా ? ఒక మనిషి బ్రతకడానికి ఎంత సరిపోతుంది అన్నది నిర్ణయించడం కష్టం కనుక కమ్యూనిజాన్ని వ్యతిరేకించవచ్చు కానీ ఒక కోటి సంపాదించిన తరువాత ఎన్ని కోట్లు సంపాదించినా ఒకటే !
Deleteగ్రీక్ భాషలో కమ్యూనిస్ అంటే ఉమ్మడి శ్రమ. ఉమ్మడి శ్రమలో సొంత ఆస్తిని అనుమతించరు కదా. ఒక సినిమా నటుడు కోటి రూపాయలు పారితోషికం తీసుకున్నాడు. తాను ఎవరినీ దోచుకోలేదు, నిర్మాత ఇచ్చింది తీసుకున్నానని అతను అంటాడు. మరి నిర్మాతకి ఆ కోటి రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? తాను restaurants నడిపి అది సంపాదించానని ఆ నిర్మాత చెప్పాడు. అతని restaurantsలో పని చేసేవాళ్ళందరూ పేదవాళ్ళుగానే ఉన్నారు కానీ కేవలం management చేసినందుకు అతను కోట్లు సంపాదించి సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగాడు. అతను సంపాదించిన అదనపు విలువలోంచే హీరోలకి పారితోషికాలు వస్తాయి. కానీ తాము తీసుకునేదంతా దోపిడీ సొమ్మని ఆలోచించేంత సమయం హీరోలకి ఉంటుందా?
Deleteమీ కెనడా స్నేహితురాలు IT ఉద్యోగి, అంతేకాక కమ్యూనిస్టు, ఆపైన మీ గురువు అని మీరే చెప్తున్నారు. మళ్ళీ "IT ఉద్యోగులకి కమ్యూనిజంపై వ్యతిరేకత ఎందుకు ఉంది?" అని ప్రశ్న అడగడంలో ఉద్దేశం ఏమిటి? ఇది మీ వ్యాఖ్యను మీరే ఖండించుకున్నట్టు లేదా?
Deleteఆవిడ తండ్రి కమ్యూనిస్త్ పార్తీ కార్యకర్త, ఆవిడ తల్లి మహిళా సంఘం నాయకురాలు. అదీ ఆవిడ చిన్నప్పుడు పుట్టి పెరిగిన వాతావరణం. అందుకే ఆవిడకి IT ఉద్యోగం వచ్చినా ఆవిడకి కమ్యూనిజంపై వ్యతిరేకత కలగలేదు. అందరు పుట్టి పెరిగిన వాతావరణం ఒకేలా ఉండదు. నా తల్లితండ్రులు ఇద్దరూ కమ్యూనిజంని వ్యతిరేకించేవాళ్ళు. నేను కేవలం పుస్తకాలు చదివి కమ్యూనిజం గురించి తెలుసుకున్నవాణ్ణి. నేను కమ్యూనిజంకి ప్రతికూలమైన పరిస్థితిలో పుట్టి పెరిగినవాణ్ణి. నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చి ఉంటే నేను కూడా పాలకవర్గానికి అనుకూలునిగా మారేవాణ్ణేమో!
Deleteఏఅడుగురు భార్యలు, నలభై రెండు మంది ఉంపుడుగత్తెలు ఉన్న ఒస్మాన్ అలీ ఖాన్ కింద పని చేసిన జాగీర్దార్లకి, తమ గడీల్లో పని చేసే స్త్రీల రొమ్ములు పిండి పాలు వస్తాయో, రావో పరీక్షించడం తప్పుగా అనిపించలేదు. భావజాలం అనేది సమాజం నుంచి పుడుతుంది కానీ శూన్యం నుంచి పుట్టదు కదా.
మీరు ఉదాహరించిన ఒక్క IT ఉద్యోగి కమ్యూనిస్టు వాతావరణంలో పెరగడం వల్ల కమ్యూనిజాన్ని వ్యతిరేకించలేదు. అంతే కాక మీ నిర్వచనం ప్రకారం కమ్యూనిజాన్ని చదివితేనే సానుకూలత వస్తుంది. అటువంటప్పుడు మీ నిర్వచనం ప్రకారమే ఏ కమ్యూనిజాన్ని చదవని IT ఉద్యోగులైనా Non IT ఉద్యోగులైనా కమ్యూనిజాన్ని సమర్థించే అవకాశం లేదు. అవునా? అటువంటప్పుడు IT ఉద్యోగులను ప్రత్యేకించి ఎందుకు ఎత్తిచూపవలసి వచ్చింది?
Deleteఆర్థిక అసమానతల వల్ల లాభపడిన IT ఉద్యోగులకి ఆర్థిక అసమానతలపై వ్యతిరేకత తక్కువే ఉంటుంది. నెలకి ఇరవై వేలు సంపాదించే రైల్వే ఉద్యోగి కంటే నెలకి లక్ష రూపాయలు సంపాదించే TCS ఉద్యోగికి ఆర్థిక అసమానతలపై వ్యతిరేకత తక్కువ ఉండదా?
Deleteరామోజీ రావు మార్క్సిజం చదివితే అతను తన దగ్గర ఉన్న కోట్ల ఆస్తుల్ని జాతీయం చెయ్యడానికి ఒప్పుకుంటాడా? అదే నిజమైతే పెట్టుబడిదారీ వ్యవస్థ శాంతియుతంగా కూలిపోతుంది. కేవలం మార్క్సిజం చదవడం వల్లో, చదవకపోవడం వల్లో దానిపై అనుకూలత లేదా వ్యతిరేకత ఉంటుందని ఎవరూ అనరు.
Ayn Rand తన పన్నెండో ఏట సోషలిస్త్ రెవల్యూషనరీ పార్తీ నాయకుడు అలెక్సాందర్ కెరెన్స్కీ అభిమాని. సోవియత్ సమాఖ్యలో ప్రైవేత్ ఆస్తిని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడే ఆమె రష్యా వదిలి అమెరికాలో స్థిరపడింది. ఆమె తండ్రి ఒక ధనిక వ్యాపారి కనుకనే ఆమె ప్రైవేత్ ఆస్తిలోనే స్వేచ్ఛ ఉంటుందని నమ్మింది. రామోజీరావు అయితే, ఇందియాలో సోషలిస్త్ విప్లవం వస్తే, అతను కొన్ని రోజులకే ఇందియా వదిలి అమెరికాకి వెళ్ళిపోతాడు. అతను మార్క్సిజం చదివాడా, లేదా అనే దానితో ఇక్కడ సంబంధం ఉండదు.
కమ్యూనిజంని వ్యతిరేకించేవాళ్ళని చూస్తే నాకు భయం వెయ్యదు. మార్పు అనేది వైరుధ్యం ఉన్నప్పుడే వస్తుంది కానీ సామరస్యం ఉన్నప్పుడు కాదు. IT ఉద్యోగుల కంటే రామోజీరావు లాంటివాళ్ళకి కమ్యూనిజంపై చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. IT ఉద్యోగులు తాము పల్లెటూరివాళ్ళ కంటే ఆర్థికంగా చాలా ముందున్నాం అనుకుని పెట్టుబడిదారీ వ్యవస్థని నమ్ముతారు. రామోజీరావు లాంటివాళ్ళైతే పెట్టుబడి లేకుండా బతకలేరు.
>>> నెలకి ఇరవై వేలు సంపాదించే రైల్వే ఉద్యోగి కంటే నెలకి లక్ష రూపాయలు సంపాదించే TCS ఉద్యోగికి ఆర్థిక అసమానతలపై వ్యతిరేకత తక్కువ ఉండదా?
Deleteనెలకు 10000 సంపాదించే IT ఉద్యోగులు కూడా ఉన్నారని మీకు తెలుసా? వారు కమ్యూనిజాన్ని సమర్థిస్తున్నారా?
>>> 50% పైగా BPLకంటే క్రింద వున్న పేదలు కమ్యూనిజాన్ని ఎందుకు సమర్థించడం లేదు?
ఏ విధంగా చూసినా మీరు IT వారికే గురిపెట్టి వాదన చేయడం సమర్థనీయంగా లేదు.
ఏ ఇతర రంగం కన్నా ఎక్కువగా పెట్టుబడిదారీ మోనోపలీని వ్యతిరేకించింది, పెట్టుబడిదారులను హద్దులో వుంచిందీ IT లోని అసంఖ్యాక ప్రోగ్రామర్లేనన్న విషయం మీకు తెలుసా?
వారు బ్రతుకుదెరువు కోసం దినమంతా పనిచేసి, ఓపెన్ సోర్స్ ఇనీషియేటివ్ ఉద్యమంలో పాల్గొని రాత్రుళ్ళు మేలుకొని పని చేసి తయారు చేసిన ఉచిత సాఫ్ట్‌వేర్ల నెన్నింటినో మీరు ఈరోజు ఫ్రీగా వాడుతున్నారు.
లినక్స్ ఉచితంగా మార్కెట్ లోకి రాకపోయుండుంటే ఈరోజు విండోస్ ధర లక్ష దాటి వుండేది.
ఆండ్రాయిడ్ ఉచితంగా రాకపోయుంటే ఐఫోన్ ధర రెండు లక్షలు ఉండుండేది. ఐదువేలకే స్మార్ట్ ఫోను అందుబాటులో వుండేదే కాదు.
ఫైర్‌ఫాక్స్ రాకపోయి వుంటే మీరు రోజూ వాడే బ్రౌజర్ కూడా కొనాల్సిన పరిస్థితి వుండేది.
Java, PHP, python లాంటి ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రాకపోతే ఈ నాడు సాఫ్ట్‌వేర్ రంగం మొత్తం మైక్రోసాఫ్ట్ లాంటి అతికొన్ని గుత్తాధిపత్య సంస్థల కింద నలిగి వుండేది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో...
మిత్రులు శ్రీకాంత్ చారిగారు వ్యక్తపరచిన పై అభిప్రాయాలతో 100% ఏకీభవిస్తున్నాను. నావీ ఇవే అభిప్రాయాలు. విషయాలను చాలా చక్కగా వ్యక్తీకరించినందుకు వారికి నా అభినందనలు.
Delete>>>>"IT ఉద్యోగులు కూడా కార్మికులే కదా, మరి సాఫ్త్‌వేర్ ఇంజనీర్లు కూడా కమ్యూనిజమ్‌ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?" <<<<
DeleteIT ఉద్యోగులు కార్మికులు కాదు మేధో శ్రామికులు. IT ఉద్యోగులందరూ కమ్యూనిజాన్ని వ్యతిరేకించడం లేదు.
>>> మీ నిర్వచనం ప్రకారమే ఏ కమ్యూనిజాన్ని చదవని IT ఉద్యోగులైనా Non IT ఉద్యోగులైనా కమ్యూనిజాన్ని సమర్థించే అవకాశం లేదు. అవునా? అటువంటప్పుడు IT ఉద్యోగులను ప్రత్యేకించి ఎందుకు ఎత్తిచూపవలసి వచ్చింది?<<
గ్లోబలైజేషన్ వల్ల లాభపడింది వాళ్ళు కాబట్టి,కమ్యూనిజం వస్తే నష్టపోయేది వారు కాబట్టి,ఈజీ మనీకి అలవాటుపడితే బొజ్జ పెరిగిపోయి కమ్యూనిజమే బెటర్ అనుకునేవాళ్ళు కనపడితే ప్రవీణ్ తన అభిప్రాయాన్ని మార్చుకుంటారేమో !
@చారి, పరమ్‌జిత్ సింగ్ అనే ప్రొఫెసర్ The Naxalite Movement in Punjab అనే పుస్తకం వ్రాసారు. పేదలు విప్లవోద్యమం వైపు రాకపోవడానికి కారణాలు కూడా అందులో వ్రాసారు. పూర్వ జన్మలో పాపం చేసినవాళ్ళే దళితులుగా పుడతారనే నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉన్న దళితుడు విప్లవం సాధించి తనని తాను విముక్తుణ్ణి చెయ్యాలనుకుంటాడా? గాంధేయవాదం పేరు చెప్పి ప్రజలు విప్లవోద్యమం వైపు వెళ్ళకుండా నిరోధించడానికీ, ఆ పేరు చెప్పుకోకుండా విప్లవాన్ని అణచి వేసే ప్రయత్నం చెయ్యడానికీ మధ్య కూడా తేడా ఉందని ఆ రచయిత అంటారు. కులం, కర్మవాదం లాంటి అభివృద్ధి నిరోధక నమ్మకాలని నమ్మేవాళ్ళలో పేదలు ఉండరని ఎక్కడా లేదు కదా.
Deleteనెలకి పది వేలు సంపాదించే IT ఉద్యోగులు కూడా ఉన్నారని నాకు తెలుసు. గ్లోబలైజేషన్ వల్ల అందరికీ IT ఉద్యోగాలు వస్తాయనే ప్రచారాన్ని నమ్మి దిగ్రీ కాలేజ్‌లని మూసేసి మరీ ఇంజనీరింగ్ కాలేజ్‌లు కట్టారు. ఇంజనీరింగ్ కాలేజ్‌ల నుంచి ఏటా రెండు లక్షల మంది చదువు పూర్తి చేసుకుని వస్తోంటే నిరుద్యోగుల సంఖ్య ఎక్కువై, దానికి proportionగా IT కంపెనీల సంఖ్య తక్కువై, labourకి demand తగ్గి, వాళ్ళ జీతాలు తగ్గవా?
IT కంపెనీలన్నీ హైదరాబాద్, బెంగళూరు, పూణే, గుర్‌గావ్ (దిల్లీ) లాంటి మహానగరాల్లోనే కార్యాలయాలు పెట్టాయి. సిమెంత్, ఉక్కు కర్మాగారాలనైతే ఏ రైల్వే లైన్ పక్కన ఉన్న పల్లెటూరి దగ్గరో పెట్టొచ్చు. వాటిలో పని చెయ్యడానికి పెద్ద శిక్షణ అవసరం లేని కార్మికులు సరిపోతారు, వాళ్ళని దగ్గరలోని గ్రామాల నుంచి తెచ్చుకోవచ్చు. కానీ TCSవాళ్ళు ఆముదాలవలసలో కార్యాలయం పెడితే ఏమవుతుంది? ఆముదాలవలస జనాభా నలభై వేలు అయితే అక్కడ పెట్టిన కార్యాలయంలో పని చెయ్యడానికి వచ్చే రెండు వేల మంది skilled professionalsకి అద్దెకి దొరకడానికి అక్కడ ఎన్ని ఇళ్ళు ఖాళీగా దొరుకుతాయి? పైగా TCS ప్రతినిధులు ఆముదాలవలసలో రాత్రి పూట రెండు వందల రూపాయలకి cheap lodgeలో ఉండలేరు. వాళ్ళకి ఐదు నక్షత్రాల హొతెల్స్ ఉన్న హైదరాబాద్ లాంటి నగరాలు కావాలి? అందుకే IT పరిశ్రమ కొన్ని నగరాలకే పరిమితమైంది. తత్ఫలితంగా IT ఉద్యోగుల సంఖ్య జనాభాలో 1% కూడా చేరలేదు, ఈ విషయాలు నాకు తెలియనివి కాదు.
శ్యామలీయం గారు,
Deleteధన్యవాదాలు.
ప్రవీణ్ గారు,
Deleteపుస్తకాలు చదవడం కన్నా ముఖ్యమైనది అందులోని సారాన్ని గ్రహించడం.
ఇప్పటివరకూ మీరే చెప్పిన విషయాలు ఇలా వున్నాయి.
పేదలు విప్లవోద్యమం వైపు రారు.
రామోజీ విప్లవోద్యమం వైపు రాడు.
పెట్టుబడి దారులు విప్లవోద్యమం వైపు రారు.
IT వారు విప్లవోద్యమం వైపు రారు.
మరి ఎవరు విప్లవోద్యమం వైపు వస్తున్నారు? నాకు తెలిసి 3.25% మించి ఎవరూ లేరు.
మల్లీ అడుగుతున్నాను. దయచేసి ఈ సారి సూటిగా జవాబు చెప్పండి.
ఈ విషయంలోకి IT వారినే ప్రత్యేకించి ఎందుకు లాగవలసి వచ్చింది?
పేదవాడు కులం, కర్మవాదం (fatalism) లాంటి వాటి వల్ల కమ్యూనిజం వైపు రాడు. అంతే కానీ కమ్యూనిజం వల్ల అతనికేమీ నష్టం లేదు. అతనికి విముక్తిని ఇవ్వగలిగేది కమ్యూనిజమే.
DeleteIT ఉద్యోగి అయితే TCS ఇచ్చే లక్ష రూపాయల జీతం కోసం పెట్టుబడిదారీ వ్యవస్థని నమ్ముకుంటాడు. అతను కులం, కర్మవాదం లాంటి వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. అతను చనిపోయిన తరువాత రాబోయే స్వర్గసుఖాల కోసం భూమి మీది సుఖాలనే త్యజించే స్థాయిలో ఉండడు.
ముస్లింలు స్వర్గాన్ని జన్నత్ అంటారు. జన్నా అంటే వనం. ఎడారివాసులకి పూలతోట కూడా స్వర్గమే కానీ పూలతోటలో పని చేసే వనమాలికి మాత్రం అది స్వర్గం కాదు కదా. AC కార్యాలయాల్లో రోజూ స్వర్గాన్ని పొందే సాఫ్త్‌వేర్ ఇంజనీర్లు ఎక్కడో స్వర్గాన్ని వెతుక్కుంటారా?
నమ్మకాలు అనేవి ఆర్థికంగా ఉన్నవాణ్ణి కంటే లేనివాణ్ణే ఎక్కువ ప్రభావితం చేస్తాయి.
>AC కార్యాలయాల్లో రోజూ స్వర్గాన్ని పొందే సాఫ్త్‌వేర్ ఇంజనీర్లు ఎక్కడో స్వర్గాన్ని వెతుక్కుంటారా?
Deleteకార్యాలయాల్లో ఏ.సీ, సదుపాయం ముఖ్యంగా కంప్యూటర్లు వగైరా పరికరాలు సరిగా పనిచేయటానికి తప్పని సరి కాబట్టే. అంతే కాని ఉద్యోగులకు ఏదో స్వర్గసుఖాలు అందించటానికి కాదు!
ATM కూడా AC లేకుండా పని చెయ్యదు. కానీ నెలకి ఆరు వేలు జీతంతో బతికే సెక్యూరితీ గార్ద్ కంప్యూతర్‌లోని ఒక విందోలో ప్రోగ్రాం వ్రాస్తూ మరో విందోలో ఫేస్‌బుక్ చేస్తూ ఎంజాయ్ చెయ్యలేడు కదా.
Deleteనేను కంప్యూతర్ నేర్చుకునే రోజుల్లో అయితే మాకు ఆ సౌకర్యం లేదనుకోండి. అప్పట్లో మేము MS DOSలోని Turbo C compilerలో ప్రోగ్రాం వ్రాసేవాళ్ళం. అప్పట్లో ఇంతర్నెత్ చేస్తె గంటకి 60 రూపాయలు బిల్ కాలేది కనుక బాస్‌లు ఉద్యోగులకి ఇంతర్నెత్ ఇచ్చేవాళ్ళు కాదు, modemని LANకి షేర్ చేసే సౌకర్యం ఉన్నా కూడా.
>>> అతనికి విముక్తిని ఇవ్వగలిగేది కమ్యూనిజమే.
Deleteఅని మీరంటే సరిపోదు కదా. వాడు నమ్మాలి కదా? కాని వాడు నమ్మడం లేదు కదా?
అదే పని (నమ్మక పోవడం) IT వాడు కూడా చేస్తున్నాడు. తేడా ఏముంది?
రెండు విభిన్న వర్గాల వారూ ఈ విషయం మీద ఒక్క తాటిపై ఉన్నారంటేనే అందులో నమ్మకూడనిదేదో ఉందని అర్థం కావడం లేదూ?
>>> IT ఉద్యోగి అయితే TCS ఇచ్చే లక్ష రూపాయల జీతం కోసం పెట్టుబడిదారీ వ్యవస్థని నమ్ముకుంటాడు.
10000 తీసుకుని పనిచేసే వాడు ఉన్నాడని ఇప్పుడే ఒప్ప్కున్నారు కదా. మళ్ళీ లక్ష అంటున్నారెందుకూ? లక్ష తీసుకునేవారు ఏ కంపెనీలో నైనా 10 - 15% కూడా వుండరు. పోనీ లక్ష తీసుకునేవాడు పెట్టుబడిదారీ వ్యవస్థని నమ్ముకుంటే 10000 తీసుకునే వాడు ఏ వ్యవస్థని నమ్ముకుంటాడు? చెప్పగలరా?
>>> ఆఛ్ కార్యాలయాల్లో రోజూ స్వర్గాన్ని పొందే సాఫ్త్‌వేర్ ఇంజనీర్లు ఎక్కడో స్వర్గాన్ని వెతుక్కుంటారా?
ఇతరులు ఎందుకు వెతుక్కోవడం లేదు?
మళ్ళీ అడుగుతున్నాను. అందరూ చేసేదే IT వాడూ చేస్తున్నపుడు వాడిని ప్రత్యేకించి చూడవలసిన అవసరం ఏమిటి?
నమ్మకానికి , నిజానికి తేడా ఉంటుంది శ్రీకాంత్ చారి గారు. ఎక్కువమంది నమ్మినంత మాత్రాన నిజం అబద్దం కాదు కదా?
Deleteవర్గ వైరుధ్యాల సంగతి కన్వీనియంత్‌గా మర్చిపోతే ఎలా? మేధోశ్రమ చేసేవాళ్ళలోనే నెలకి లక్ష రూపాయలు జీతం తీసుకునే IT ఉద్యోగి, నెలకి ఇరవై వేలు సంపాదించే రైల్వే ఉద్యోగి వేరువేరు సామాజిక హోదాలు కలిగి ఉంటారు. అలాంటప్పుడు IT ఉద్యోగి భావజాలమూ, పల్లెటూరి దళితుని భావజాలమూ ఒకటిగా ఉండే అవకాశమే లేదు.
Deleteపల్లెటూరి దళితుడు పెట్టుబడిదారీ వ్యవస్థలోనే తనకి వ్యక్తిస్వేచ్ఛ ఉంటుందని నమ్మి కమ్యూనిజంని వ్యతిరేకించడం ఎక్కడా జరగదు. అతను అజ్ఞానం వల్ల కమ్యూనిజంని వ్యతిరేకించడం మాత్రం జరగొచ్చు.
బోడిగుండుని మోకాలి పక్కన చేరిస్తే ఎలా ఉంటుందో, IT ఉద్యోగి భావజాలం & పల్లెటూరి దళితుని భావజాలం ఒకేలా ఉంటాయని వాదించడం అలాగే ఉంటుంది.
కొండలరావు గారు,
Delete>>> నమ్మకానికి , నిజానికి తేడా ఉంటుంది శ్రీకాంత్ చారి గారు. ఎక్కువమంది నమ్మినంత మాత్రాన నిజం అబద్దం కాదు కదా?
ఋజువులు లేకుండా ఇది నిజం అని చెప్పే అర్హత ఎవరికుంది?
>విండోలో ప్రోగ్రాం వ్రాస్తూ మరో విండోలో ఫేస్‌బుక్ చేస్తూ ఎంజాయ్ చెయ్యలేడు కదా.
Deleteఅలా ఎవరైనా చేస్తే అది అనైతికం. అందుచేత ఆ మాట సంబంధిత విషయం కాదు. ఒక program గురించి పనిచేసే సమయంలో పరిసరాలస్పృహకూడా ఉండని సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. అలవోకగా చేసే పని కాదు programming. అలా ఎవరైనా అనుకుంటే పొరబడుతున్నట్లే! ఆఫీసుల్లో facebook వాడకాలవంటివి తప్పు - ప్రమాదకరమూ కూడా.
కులం కట్టుబాట్లని నమ్మేవాడు తనకి స్వేచ్ఛ అవసరం లేదు అని నమ్మినంతమాత్రాన స్వేచ్ఛ అబద్దమైపోదు.
Deleteప్రవీణ్ గారు,
Delete>>> వర్గ వైరుధ్యాల సంగతి కన్వీనియంత్‌గా మర్చిపోతే ఎలా? మేధోశ్రమ చేసేవాళ్ళలోనే నెలకి లక్ష రూపాయలు జీతం తీసుకునే ఈట్ ఉద్యోగి, నెలకి ఇరవై వేలు సంపాదించే రైల్వే ఉద్యోగి వేరువేరు సామాజిక హోదాలు కలిగి ఉంటారు.
IT ఉద్యోగి సంగతి సరే. మరి ఇరవై వేలు సంపాదించే రైల్వే ఉద్యోగి కమ్యూనిజాన్ని ఎందుకు నమ్మడం లేదు?
>>> బోడిగుండుని మోకాలి పక్కన చేరిస్తే ఎలా ఉంటుందో, ఈట్ ఉద్యోగి భావజాలం & పల్లెటూరి దళితుని భావజాలం ఒకేలా ఉంటాయని వాదించడం అలాగే ఉంటుంది.
నేనంటున్నా మీరు IT ఉద్యోగికీ కమ్యూనిజానికీ లంకె పెట్టడం బోడిగుండుకీ మోకాలికీ లంకె పెట్టినట్టుందని. పల్లెటూరి దళితుని సంగతి వదిలెయ్యండి. దేశంలో IT ఉద్యోగులు ఒక శాతం, పల్లెటూరి దళితులు 15% అనుకుంటే ... 3.25% కమ్యూనిస్టులతో కలిపి మిగతా 80.75% మాంది ఎందుకు నమ్మడం లేదు. నేను మొదటి నుండి అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి, దాటవేయకుండా.
< ఋజువులు లేకుండా ఇది నిజం అని చెప్పే అర్హత ఎవరికుంది? >
Deleteడెఫినెట్ గా ఋజువులు చూపాల్సిందే. అయితే కొన్ని ఋజువులను అర్ధం చేసుకోవడానికి సమయం పడుతుంది. అర్ధమయ్యేలా చెప్పగలిగే వారిపై ఆ బాధ్యత ఎక్కువగా ఉంటుంది.
తెలంగాణా వస్తే తెలంగాణా ప్రజలకు మంచిది అని ఏ ఋజువులను చూపి ఉద్యమం చేశారు? కమ్యూనిజం కూడా అలాంటిదే. కమ్యూనిజం పిడివాదం అయితే కాదు. కమ్యూనిస్టులమని ఫోజు పెట్టే పిడివాదులు ఉన్నారు. కమ్యూనిజం లో లోపాలను ప్రత్యామ్నయాలు చూపి విమర్శించాలి.
వ్యక్తిగత ఆస్తి అనేది ఎందుకు రద్దు కావాలనేది కమ్యూనిస్టులకు స్పష్టంగానే తెలుసు. కానీ వ్యక్తిగత ఆస్తి అనేది మానవ పరిణామ క్రమంలో ఏర్పాటు చేసుకున్నదే తప్ప సహజాతమైన అంశం కాదని మీకూ తెలుసు.
కేవలం ఐ.టి ఉద్యోగులో మరో వర్గం వారో కమ్యూనిస్టులని వ్యతిరేకిస్తారని అసలైన శ్రామికులు జై బోలో అంటారనే వాదనలు నేను అంగీకరించను. శ్రామికి వర్గం తరతరాల మకిలతో ఉన్నపుడు వారికి చైతన్యం కల్పించకుండా గ్రంధాలు చదివి, గ్రంధాలు వ్రాసి ఉపయోగం లేదు.
పరమ్‌జిత్ సింగ్ గారు వ్రాసిన The Naxalite Movement in Punjab పుస్తకంలో దాని సమాధానం వివరంగా ఉంది. ఆ పుస్తకం మొత్తాన్నీ ఇక్కడ వ్రాసే సమయం నాకు లేదు కానీ ఒక విషయం మాత్రం ఇక్కడ వ్రాస్తున్నాను. పంజాబ్ జనాభాలో 33% మంది దళితులైతే 1970లలో అక్కడ విప్లవోద్యమంలో పని చేసినవాళ్ళలో మాత్రం ఎక్కువ మంది అగ్రకులస్తులు, ముఖ్యంగా జాట్ సిఖ్ కులం నుంచి వచ్చినవాళ్ళు. పోలీసులు సేకరించిన 70 మంది విప్లవకారుల వివరాల ప్రకారం వాళ్ళలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులస్తులు కూడా ఉన్నారు, ఒక ముస్లిం కూడా ఉన్నాడు. లెక్కలు మారినంతమాత్రాన మౌలికాంశాలు మారవు.
Deleteకొండలరావు గారు,
Delete>>> తెలంగాణా వస్తే తెలంగాణా ప్రజలకు మంచిది అని ఏ ఋజువులను చూపి ఉద్యమం చేశారు?
పొరపాటు. తెలంగాణా ప్రజలు సమైక్య రాష్ట్రంలో తమకు నష్టం జరుగుతుందని ఋజువైన తర్వాతే ఉద్యమంలో మమేకమయ్యారు.
కమ్యూనిజంలోని భావాలు ఉదాత్తంగా కనిపిస్తాయి. కాని అలా కనిపించే లేడితోలు వెనుక భయంకరమైన నియంతృత్వం వుంటుందని రష్యా, చైనా ప్రయోగాలు ఋజువు చేశాయి.
నాకు తెలిసి వ్యక్తిస్వేఛ్ఛకు భంగం కలగకుండా కమ్యూనిజాన్ని వ్యస్తీకృతం చేయవచ్చని నిరూపించే ప్రణాలిక ఇంతవరకూ ఎవరూ రుపొందించలేక పోయారు. అలా ఎవరైనా సైధ్ధాంతికంగానైనా సరే, నిరూపించ గలిగితే పరిశీలించడానికి ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు.
ప్రవీణ్ గారు,
Delete>>> పరమ్‌జిత్ సింగ్ గారు వ్రాసిన The Naxalite Movement in Punjab పుస్తకంలో ...
మీరు ఆ పుస్తకం మొత్తం ఇక్కడ తిరగ రాసినా చదివే ఓపికా, సమయం నాకు లేదు. కాని ఆ పుస్తకంలో IT ఇద్యోగులకు కమ్యూనిజం పై "ప్రత్యేకమైన" వ్యతిరేకత వుంటుందని ఆయన రాశాడనుకోను. మీరు ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడం లేదు. పోనీ మీ 70% జాట్ల లెక్క తీసుకున్నా, IT ఉద్యోగులు 1% కూడా వుండరుగా? మిగతా 69% మంది సంగతేంటి? అది చెప్పమంటే పుస్తకాల పేర్లు చెప్పడమెందుకు?
మావో బతికి ఉన్నప్పుడు చైనాలో మహిళా కార్మికులు పిల్లలకి పాలు ఇచ్చుకోవడానికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేసేవాళ్ళు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆ సౌకర్యం గురించి ఆలోచిస్తారా? Factoryలని జాతీయం చెయ్యడానికి పెట్టుబడిదారులు ఒప్పుకోరు కాబట్టే విప్లవం వచ్చిన తరువాత వాటిని బలవంతంగా జాతీయం చేస్తారు. అంతే కానీ పెట్టుబడిదారులకి దిబెంచర్‌లు ఇచ్చి, వాళ్ళు స్వచ్ఛందంగా తమ factoryలని ప్రభుత్వానికి అప్పగించేలా చెయ్యడం విప్లవ సంప్రదాయం కాదు.
Delete1970లో ఇందియాలోఅ IT కంపెనీలు లేవు, పంజాబ్‌లో అవి ఇప్పటికీ ఉంటాయనుకోను. పంజాబ్‌లో పోలీస్ అధికారులు తమ సర్వీస్‌లో సంపాదించిన డబ్బుతో వ్యవసాయ భూములు కొనేవాళ్ళనీ, దానికి విప్లవకారులు అడ్డు కనుక పంజాబ్ పోలీస్ అధికారులు విప్లవకారుల విషయంలో క్రూరంగా వ్యవహరించేవాళ్ళు. కొంత మంది దిగువ స్థాయి పోలీస్ ఉద్యోగుల్ని ప్రభావితం చెయ్యడానికి విప్లవకారులు ప్రయత్నించారు కానీ విప్లవం రాకపోతే విద్రోహులకి మద్దతు ఇచ్చినందుకు తమ ఉద్యోగాలు పోతాయని భావించి దిగువ స్థాయి పోలీస్ ఉద్యోగులు కూడా పాలకవర్గం పక్షానే పని చేసారు. Counter-revolutionary tendency not only depends on the volume of property, but also on opportunity.
Deleteతెలంగాణాకు నష్టం జరుగుతుందని ప్రజలు మమేకమయ్యారు......................... ఇది కరెక్ట్ కాదు. రాజశేఖరరెడ్డి ఉన్నపుడు టి.ఆర్.ఎస్ కు వచ్చిన ఓటింగ్ , సీట్ల సంఖ్య ఎంత? తెలంగాణా ఇస్తామన్నాక టి.ఆర్.ఎస్ కు వచ్చిన ఓటింగ్ , సీట్లు ఎన్ని? ప్రజలు అంతా ఏ ఉద్యమంలోకి రారు. గోపి లు ఎక్కువగా ఉంటారు. ప్రజలు సీమాంధ్ర పాలకులను నమ్మినంతగా తెలంగాణా ఉద్యమాన్ని నమ్మలేదన్నది నగ్న సత్యం. దీనర్ధం తెలంగాణా ఉద్యమం చేపట్టడం తప్పని కాదు కదా?
Deleteపెట్టుబడిదారీ వ్యవస్థ ప్రజలందరికీ సంస్కృతి పరంగా , మానవ సంబంధాల పరంగా అన్నింటా నాశనం చేస్తుంది కనుకనే దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఎంత సమయం అన్నది వేరు విషయం. తెలంగాణా కూడా వెంటనే రాలేదు. ఇపుడొచ్చిన పద్ధతి కూడా ఉద్యమాల వల్ల అని నేను భావించడం లేదు.
భావాలు ఉదాత్తంగా కనిపిస్తే సిద్ధాంతం రైటనే కదా? రష్యా - చైనాలో భయంకరంగా కనిపించిన నియంతృత్వం నుండి పాఠాలు తీసుకోవాలి తప్ప భావాలనే తప్పు పట్టకూడదు కదా? భావాలే తప్పైతే కూడా తప్పని సరిగా వాటినీ సమీక్షించుకోవలసిందే.
< నాకు తెలిసి వ్యక్తిస్వేఛ్ఛకు భంగం కలగకుండా కమ్యూనిజాన్ని వ్యస్తీకృతం చేయవచ్చని నిరూపించే ప్రణాలిక ఇంతవరకూ ఎవరూ రుపొందించలేక పోయారు. అలా ఎవరైనా సైధ్ధాంతికంగానైనా సరే, నిరూపించ గలిగితే పరిశీలించడానికి ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. >
ఈ వాక్యాలతో 100% ఏకీభవిస్తున్నాను. నా అభిప్రాయమూ అదే.
>>> రాజశేఖరరెడ్డి ఉన్నపుడు టి.ఆర్.ఎస్ కు వచ్చిన ఓటింగ్
Deleteరాజశేఖర్ రెడ్డి 2004లో చంద్రబాబు 2009లో తెలంగాణా మేమే ఇస్తామని ప్రకటించిన సంగతి మీరు మరిచిపోతున్నారు. వారి మనస్సుల్లో ఏముందనేది వేరు సంగతి. ప్రజల్లో ఆకాంక్ష లేకపోతే వారు TRSతో తిరగాల్సిన అవసరం లేదు. 2004 తర్వాత తెలంగాణాలో ఒక్క సమైక్యవాది కూదా గెలవలేదన్న సంగతి మీరు గుర్తించాలి. అయితే అదంతా వేరే చర్చ.
ప్రజాబలం లేకపోతే మరో వెయ్యేళ్ళకు కూడా తెలంగాణా వచ్చేది కాదు. అదే ప్రజాబలం వుంటే కమ్యూనిజం కూడా వస్తుంది. మనగలుగుతుందా, లేదా అన్నది వేరే ప్రశ్న.
ఇక్కడ నా అభ్యంతరం కేవలం IT వారే వ్యతిరేకిస్తున్నారు అన్నట్టుగా వున్న ప్రవీణ్ వాదన. అందరిలో ఉన్నట్టే సిద్ధాంత రీత్యా వ్యతిరేకించేవారు, అనుకూలించే వారు ITలోనూ వుంటారు.
>>> భావాలు ఉదాత్తంగా కనిపిస్తే సిద్ధాంతం రైటనే కదా?
అవసరం లేదు. వాటి ఆచరణ కూడా అంతే ఉదాత్తంగా వుండాలి. ఉదాహరణకు రాజశేఖర్ రెడ్డి పెట్టిన స్కీములు ఉదాత్తంగానే కనిపిస్తాయి. కాని వాటి అమలులో జరిగిన లక్ష కోట్ల వ్యవహారం అందరికీ తెలిసిందే.
నేను పరిశోధించకుండా ఏదీ మాట్లాడను. ఇందియా ఆర్థికంగా అభివృద్ధి చెంది ఇక్కడ చీప్ లేబర్ దొరకడం కష్టమైతే మన దేశానికి off-shore projects రాకుండా అవి ఇందియా కంటే వెనుకబడిన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకి వెళ్ళిపోతాయి. ఈ విషయం తెలిసిన IT ఉద్యోగులు స్వదేశీ పెట్టుబడిని కూడా వ్యతిరేకిస్తారు. సామ్రాజ్యవాద దేశాలవాళ్ళు outsourcing చేసేదే చీప్ లేబర్ కోసం. ఇందియాలో చీప్ లేబర్ ఉంటేనే ఇక్కడి IT కంపెనీలకి projects వస్తాయి. ఇందియా ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఇక్కడ చీప్ లేబర్ దొరక్క IT కంపెనీలు మూతపడతాయని తెలిసిన IT ఉద్యోగులు దేశీయ పెట్టుబడినే ఒప్పుకోరు, అటువంటప్పుడు కమ్యూనిజంని ఎలా ఒప్పుకుంటారు?
Deleteరైల్వెలకి సరుకు రవాణా ద్వారానే ఎక్కువ లాభం వస్తోంది. రైల్వే ఉద్యోగులు అయితే దేశీయ పెట్టుబడిని ఒప్పుకుంటారు, దేశీయ పరిశ్రమలు పెరిగితేనే సరుకు రవాణా పెరుగుతుంది కాబట్టి. ఒక్క గూద్స్ రైలు నడిపితే రైల్వేలకి లక్షలు లాభం, వందల గూద్స్ రైళ్ళు నడిపితే కోట్ల లాభం. IT ఉద్యోగులు నెలకి 230 రూపాయలు పెట్టి కొనే MMTS season tickets వల్ల రైల్వేలకి ఏమీ రాదు కాబట్టి IT పరిశ్రమని నమ్ముకోవాల్సిన అవసరం రైల్వేలకి గానీ, దాని ఉద్యోగులకి గానీ ఉండదు.
రైల్వే ఉద్యోగి కమ్యూనిజంని ఒప్పుకుంటాడా అనే విషయానికి వద్దాం. కమ్యూనిజంలో డబ్బు ఉండదు. డబ్బు లేనప్పుడు tickets అమ్మే గుమాస్తాలు, TTEలు అవసరం ఉండరు. అప్పుడు ఆ గుమాస్తాలూ, TTEలకి వేరే పని అప్పగించాల్సి వస్తుంది. రైలులో ఫ్యాన్ పాడైతే రిపైర్ చేసే తెక్నీషియన్ పనిని TTEకి నేర్పించారనుకుందాం. "నేను ఇంతకాలం తెల్ల చొక్కా వేసుకుని tickets checking చేసాను. ఫ్యాన్‌లూ, బల్బులూ రిపైర్ చేసే పని నేను చెయ్యను" అని అతను అనడానికి అవ్వదు. ఒక రకం శ్రమ గౌరవాన్ని ఇస్తుందనీ, ఇంకో రకం శ్రమ అవమానంగా ఉంటుందనీ అనుకునేవాళ్ళు ఉంటారు కానీ క్రమంగా ఈ శ్రమల మధ్య తేడాలు తగ్గించి అవి మాయమయ్యేంత వరకు విరామం లేకుండా ప్రయత్నించాలి.
సోవియత్ సమాఖ్య ఉన్న రోజుల్లో ప్రపంచంలో 33% జనాభా ఎర్ర జెండా ప్రభుత్వాల పాలనలో ఉండేదు. 66% జనాభా ఇంకా పెట్టుబడిదారీ, భూస్వామ్య ప్రభుత్వాల పాలనలో ఉండడం వల్లే ఖ్రుష్చేవ్, బ్రెఝ్నేవ్ లాంటివాళ్ళు నెమ్మదిగా రష్యాలో పెట్టుబడిని పునరుద్ధరించగలిగారు. స్తాలిన్ ఒక దేశంలో సోషలిజం సాధ్యమే అంటూ వేరే దేశాల్లోని పోరాటాలకి మద్దతు ఇవ్వలేదు. పశ్చిమ దేశాలు రష్యాపై దాడి చెయ్యకుండా ఉండేందుకు తూర్పు యూరోప్‌లో విప్లవ ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యించాడు కానీ వేరే దేశాల్లోని పోరాటాల గురించి స్తాలిన్ పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యమే రష్యా కొంప ముంచింది.
>>> ఇందియా ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఇక్కడ చీప్ లేబర్ దొరక్క ఈట్ కంపెనీలు మూతపడతాయని తెలిసిన ఈట్ ఉద్యోగులు
Deleteఇవన్నీ మీరు చేస్తున్న ఊహాగానాలు. వాటిని మీరు పరిశోధన అనుకుంటున్నారు.
ఇండియా అభివృద్ధి చెందితే ఇండియాలోనే కొత్త ప్రాజెక్టులకు డిమాండు వుంటుంది. అప్పుడు అవుట్ సోర్సింగుతో పనిలేదుగా?
పైన నేను ఉదాహరించిన ఒఫెన్ సోర్స్ రెవల్యూషన్ ని మీరు కన్వీనియెంటుగా దాటవేస్తున్నారు. సోర్సు ఎంత గోప్యంగా వుంటే IT ఉద్యోగికి అంత లాభం. ఎంత బహిర్గతం అయితే అంత మార్కెత్ పోతుంది. మీ లాజిక్ ప్రకారం తనకు నష్టం ఉండే ప్రతిదాన్నీ గుడ్డిగా వ్యతిరేకించే వాడైతే కష్టపడి ఓపెన్ సోర్సు సాఫ్ట్‌వేర్లు ఎందుకు తయారు చేసినట్టు? అదీ లాభాపేక్ష లేకుండా?
Open Source Software is used by home users. Corporations always rely on paid software. I used Ubuntu, Open Suse, Open Solaris and Centos. None of them supported my printer and modem. I had to use LAN cable to access Internet on those systems.
Delete>>> Open Source Software is used by home users.
Deleteఇది శుద్ధ తప్పు. ఎందుకో కారణం కూడా మీరే చెప్పారు. (None of them supported my printer and modem. -Praveen) వాస్తవానికి అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, యాహూ లాంటి అనేక దిగ్గజాలు లినక్స్ సర్వర్లు, GCC, జావా, పైథాన్, PHP వంటి ఓపెన్ సోర్స్ లాంగ్వేజెస్ వాడుతున్నాయి. సాంసంగ్, ELGI, సోనీ వంటి మొబైల్ దిగ్గజాలు ఓపెన్‌సోర్స్ ఆండ్రాయిడ్ OS వాడుతున్నాయి.
అయినా ఇక్కడ ప్రశ్న ఇంట్లో వాడుతున్నారా, ఆఫీసులోనా అన్నది కాదు. ఎవరు వాడినా దానివల్ల పెట్టుబడిదారునికి దెబ్బే. ఎందుకంటే మార్కెట్ తగ్గిపోతుంది కాబట్టి. మీ లెక్క ప్రకారం పెట్టుబడి దారునికి మార్కెట్ తగ్గితే IT వాడికి భయం (అందుకనే కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తాడు - ప్రవీణ్). అటువంటప్పుడు కష్టపడి IT వాడు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ తాయారు చేసి IT తెలియని వారందరికీ ఫ్రీగా పందేరం చేయవలసి వచ్చింది? దానికి చెప్పండి జవాబు.
Centosని వెబ్ సర్వర్లలో వాడుతారని నాకు తెలుసు. Centosని develop చేసేవానికి విరాళాలు రాకపోతే అతను మొదట developmentని నిలిపివేసి తరువాత technical supportని కూడా నిలిపివేస్తాడు.
Deleteమీకు తెలియని అనేక రకాల ఫ్రీ సాఫ్ట్‌వేర్లు ఉన్నాయి. వాటన్నిటినీ విరాళాలకు ఆశపడి చెయ్యరు. మీరు తప్పించుకుంటే లాభం లేదు. "తనకు లాభం లేని ప్రతిదాన్నీ వ్యతిరేకించేట్టయితే కష్టపడి IT వాడు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ తాయారు చేసి ఈట్ తెలియని వారందరికీ ఫ్రీగా పందేరం చేయవలసి వచ్చింది?" మీరు దీనికి జవాబు చెప్పవలసిందే.
Deleteటి.ఆర్.ఎస్ సంగతి గారెలబుట్టలో పడ్డ సామెత చందమే. సరే ఆ సంగతి వదిలేస్తే ప్రవీణ్ ఐ.టీ రంగం వారి కమ్యూనిజం వ్యతిరేకత అంశంపై మీ వాదనను నేను ఖండించలేదు.
Deleteనేను చెప్పేది నమ్మకం వేరు నిజం వేరు. స్కీములు వేరు సిద్ధాంతం వేరు.
వ్యక్తిగత ఆస్టి అనేది అనేక అనర్ధాలకు కారణమని కమ్యూనిజం చెప్తుంది. దానిని రద్దు చేయకుండా సమాజంలో సంపూర్ణంగా రుగ్మతలు తొలగవనేది ఆ సిద్ధాంతం వాదన. దీనిని కొందరు అంగీకరిస్తారు. కొందరు వ్యతిరేకిస్తారు. అయితే ప్రజలలో ఈ సిద్దాంతం పట్ల నమ్మకం కలిగించడం అనేది కాదు చేయాల్సింది. ప్రజలందరికీ సిద్దాంతం అర్ధం కాదు. వారు ఆచరణనే చూస్తారు. దానిలో కమ్యూనిస్టులు ఫెయిల్ అయ్యారు. సిద్దాంతమే ఫెయిల్ అయిందని నేను అనుకోవడం లేదు. ఎప్పటికైనా వ్యక్తిగత ఆస్టిలేని సమాజం రావాలనే డిమాండ్ ని నేను సమర్ధిస్తాను. ఎందుకంటే మనిషి సహజంగా సమిష్టితత్వాన్నే కోరుకుంటాడు. వ్యక్తిగత ఆస్తి అనేది మనిషి ఏర్పరచుకున్నదే తప్ప సహజాతం కాదు. తప్పనిసరి కూడా కాదు.
Chari, You need to convince banks to use Linux instead of Windows, before arguing here. The business volume of paid software is very higher than that of donations raised by Open Source developers. Even I tried to develop an application on Android for no donation.
Delete@Praveen:
DeleteWindows is usually bundled with the computer itself in effect selling nearly for free.
GOI is actively supporting open source
PS: Just for info please. I am personally not a fan of the open source route
బ్యాంక్‌లో computerisation contract తీసుకున్న కంపెనీవాళ్ళు సాఫ్త్‌వేర్‌ని ఇన్స్తాల్ చేస్తారు. భద్రతా కారణాలూ & తెక్నికల్ సపోర్త్ కోసం వాళ్ళు paid softwareనే ఇన్స్తాల్ చేస్తారు.
Deleteనేను శ్రీకాకుళంలో ఇంతర్నెత్ కేఫ్ నడిపే రోజుల్లో విశాఖపట్నానికి చెందిన సంజయ్ జైన్ అనే మార్వాడీ దగ్గర కంప్యూతర్లు కొన్నాను. వాడు అన్ని కంప్యూతర్లలోనూ పైరసీ సాఫ్త్‌వేర్ ఇన్స్తాల్ చెయ్యడం వల్ల సాఫ్త్‌వేర్ పోతే అప్పుడు నేను లినక్స్ ప్రయోగాలు చేసుకున్నాను. అలా నేను లినక్స్ నిపుణుణ్ణి అయ్యాను.
>>> You need to convince banks to use Linux instead of Windows
DeleteLoL, I don't need to convince any one. They are already using it!
Banks:
Commercial Bank of China
IDBI Bank/
Banco do Brasil
Union Bank of California
Financial Institutions:
Merrill Lynch
New York Stock Exchange
Scientific Institutions:
CERN
NASA
Enough or need more? I can give 100s of instances where OSS is being used on mission critical applications.
IDBI uses Windows only. I am a customer of IDBI and watched their systems in branches.
DeletePraveen,
DeleteYou seem argue just for the sake of argument. Can you prove the link I gave is wrong? Do you want to claim you are more aware of IDBI than its IT Head? If one branch in your Vizag uses windows machine on the clerk's desk, you want to apply that to whole IDBI?
Speaking to CXOtoday, Sanjay Sharma, Head-IT, IDBI Bank, said, The fact that Linux support is difficult to find, is nothing short of a myth. The Oracle initiative has removed many apprehensions, and the move should be followed by other vendors as well. Today, Linux has revolutionized our setup, especially on the mission critical application front.
You are clearly loosing your argument.
First you have failed to prove IT people oppose communism
Secondly you have failed to prove Open Source is useless.
The Phone in your packet is powered by opensource Android for which you have paid not even a dime. Android is powered by Java which is again is opensource. Java again is powered by Linux which is also opensource. You are using all these for free without giving anything in return. And you want to ridicule Opensource!!
And all these things are given you by IT guys, and you want to ridicule them!!
I visited IDBI branches at Siripuram, Seetammadhara, Srikakulam, Parvatipuram and Rayagada. I have seen only Windows on their desktops. Vaarta uses Macintosh and Namaste Telangana uses Windows. No corporation uses open sources.
DeletePraveen,
DeleteDon't make foolish arguments. IDBI banking servers are not installed at your Siripuram or Seetammadhara. What you see there are mere clients. They can be anything based on the decision of local manager. Naturally they will be windows desktops as most of clerks doesn't know using linux. But the core banking applications lies on the servers, not in the boxes you see on the desks of bank clerks. If you can read the link I gave, the bank IT Head clearly told...
Oracle Financials and HRMS run on Linux AS 2.1, Sendmail is based on Red Hat Linux 8.0 and our IVR phone banking solution is powered by Slackware Linux 8.0 and a PostgreSQL 7.0 DBMS.
These are all server side technologies which are opensource.
Why do you make such a cheap arguments for defending your false assumptions on Open source technologies.
Why are you sticking to just IDBI? Are you conceding to all my other examples on opensource usability?
బ్యాంక్‌లో ఉద్యోగం చెయ్యడానికి NIIT లేదా APTechలు ఇచ్చే certificates అవసరం లేదు. CBSకి లినక్స్‌లో client-side support ఉంటే విందోస్ రానివానికి కూడా లినక్స్ నేర్పించి అతని చేత బ్యాంక్ పనులు చెయ్యించొచ్చు. మా అమ్మగారు పని చేసే ఆంధ్రా బ్యాంక్‌లోనూ, IDBIలోనూ DDలు ప్రింత్ చెయ్యడానికి dot matrix printer వాడుతారు. లినక్స్‌లో dot matrix printersకి driver software దొరక్కపోతే ఆ బ్యాంక్‌లవాళ్ళు DDలు ఇష్యూ చెయ్యలేరు. ఈ విషయాలు బ్యాంక్‌లవాళ్ళకి తెలియకపోయినా, ఆ బ్యాంక్‌ల computerisation contract తీసుకున్న కంపెనీలకైనా తెలిసే ఉంటాయి.
Deleteసర్వర్లలో ఎక్కువ మంది లినక్సే వాడుతారు. కానీ clientని అనేక పనులకి వాడుతారు కనుక అందులో లినక్స్ వాడితే అనేక సమస్యలు వస్తాయి.
కమ్యూనిజం గురించి అర్ధమయ్యేలాగా చెప్పగలిగే కమ్యూనిస్టు పార్టీ ఏది ఉన్నదో చెప్పండి ప్రవీణ్.
ReplyDeleteకొండలరావు గారూ,
Deleteకమ్యూనిజం గురించి పుంఖాలకి పుంఖాలు పుస్తకాలు వ్రాసినవారు ఉన్నారు.ఇవేవీ మన జీవితాలను ప్రభావితం చెయ్యలేవు.ఒక మనిషి(స్త్రీ అయినా పురుషుడైనా సరే) ఆదర్శవంతంగా కమ్యూనిష్టుగా జీవితంలో ఎదిగి చూపిస్తే ప్రజలు నమ్ముతారు.బిల్ గేట్స్ ప్రపంచంలోనే ధనవంతుడు,అందరూ అతనిని ఆరాధిస్తారు కానీ అనుసరించలేరు.ఒక సాధారణ తెలివిగల సామాన్యుడైనా కమ్యూనిజాన్ని(ఏ ఇజం అయినా) అనుసరించగలిగితే అదే ఆదర్శప్రాయమవుతుంది.
నీహారిక గారు, వ్యక్తులు ఆదర్శంగా జీవించినవాళ్ళు పుచ్చలపల్లి సుందరయ్య లాంటివారు నేటికీ చాలామంది ఉన్నారు. కమ్యూనిస్టులే కాదు బి.జె.పి, కాంగ్రెస్ తో సహా ఇతర పార్టీలలో కూడా ఉన్నారు. వ్యక్తుల ఆదర్శాలు వేరు సిద్ద్దాంతం వేరు కదా?
Deleteవ్యక్తుల ఆదర్శాలు వేరు సిద్ద్దాంతం వేరు కదా?
Deleteప్రజల ఆలోచనల్లోనుండి సిద్ధాంతాలు పుట్టుకొస్తాయి.వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు సిద్ధాంతాలు ఉంటాయి.ఒక సిద్ధాంతాన్ని కులమత బేధాలు లేకుండా ఆచరించి చూపించినవారినే ఆదర్శపురుషుడంటారు.అయితే ఒక సిద్ధాంతం ఒక యుగంలో అనుసరించారు కాబట్టి ప్రతి యుగంలోనూ అదే సిద్ధాంతం అనుసరించడం సాధ్యపడదు.మార్పులు చేసుకోవాలి.
సిద్దాంతం ఎపుడూ సాపేక్షమే. అది నిరంతరం మారుతూ పురోగమిస్తూ ఉంటుంది. పాతది లేకుండా కొత్తది ఉండదు. కొత్తది కొంత కాలానికి పాతబడి దాని ఆధారంగా మరో కొత్తది తయారవుతుంది. అయితే కొత్తదెపు/డు పురోగామిగా ఉండాలి తప్ప తిరోగామిగా కాదు నీహారిక గారు.
Deleteకొండలరావు గారు, 1970లో పంజాబ్‌లో పోలీసులు CPI(ML) కార్యకర్తలని అరెస్త్ చేసినప్పుడు, పోలీస్ ఉద్యోగుల్లో దిగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చినవాళ్ళని ప్రభావితం చెయ్యడానికి CPI(ML) కార్యకర్తలు ప్రయత్నించారు. దేశంలో విప్లవం రాకపోతే విద్రోహులకి సహాయం చేసినందుకు తమ ఉద్యోగాలు పోతాయనే భయంతో చాలా మంది పోలీస్ ఉద్యోగులు విప్లవకారులని అణచివెయ్యడానికే ప్రిఫరెన్స్ ఇచ్చారు. పోలీస్ ఉద్యోగుల్నే ప్రభావితం చెయ్యాలనుకున్నవాళ్ళు ప్రజలకి మాత్రం కమ్యూనిజం అంటే ఏమిటో చెప్పకుండా ఉంటారా?
ReplyDelete@చారి, CPM గురించైతే నన్ను అడగక్కరలేదు. ఎవరూ వోత్ వెయ్యని జై సమైక్యాంధ్ర పార్తీతో పొత్తు పెట్టుకుని ఉన్న వోత్‌లు కూడా పోగొట్టుకున్న పార్తీ అది.
మరి చెపితే ప్రజలకు ఎందుకు ఎక్కడం లేదు. 68 ముక్కలుగా ఎందుకు చీలారు? సిద్ధాంతం ఇన్ని ముక్కలుగా అర్ధం అవుతుందా? పార్టీలే ఇన్ని రకాలుగా అర్ధం చేసుకుని చీలిపోతుంటే ప్రజలెలా నమ్ముతారండీ? మిమ్ములనే తీసుకుంటే కె.సి.ఆర్ నైనా పొగుడుతారు తప్ప సి.పి.ఐ, సి.పి.ఎం ల మీద ఒంటికాలిమీద లేస్తారు. అలా లేవడమే వర్గపోరాటమనుకున్నట్లుగా. ఇక ప్రజలని ఏమి ప్రభావితం చెయగలరు చెప్పండి.
Deletehttp://pustakam.net/?p=737
Deleteఉద్యమము ఉపులో ఉన్న సమయంలో, దేశంలో 5 ఏళ్ళలో విప్లవం వచ్చేస్తుందనుకుని, హీరోలైపోదామని విప్లవ పార్తీల్లో చేరి, ఆ తరువాత పార్తీ నుంచి బయటకి వచ్చేసినవాళ్ళు ఉన్నారు. మరి పార్తీని చీల్చినవాళ్ళు ఉండడంవిచిత్రమా?
ఇప్పటికీ తాము మాత్రమే హీరోలమనుకునే పవిత్ర కమ్యూనిస్టులు, ఇతరులంతా వర్గ సహకారం చేసేవారు, దొంగలు అంటూ కూసేవాళ్లు చివరకు తాము ఏమి చేస్తున్నారో, ఏమి సాధించారో సమీక్షించుకుంటున్నారా? ఇలాగే ప్రజలకు అర్ధం కాకుండా కార్యక్రమాలు సాగితే ఇంకా చీలికలు పెరుగుతాయే తప్ప విప్లవం రాదు. సిద్ధాంతం సరిగా ఉంటే చాలదు. అది భారతీయతకు దగ్గరగా ఆచరణలో ప్రజలకు అర్ధమయ్యేలా ముఖ్యంగా వారు నమ్మేలా ఉండాలి. సిద్ధాంతాన్ని నమూనాగా తీసుకోవచ్చు గానీ ఆచరణను మక్కీకి మక్కీగా కాపీ కొడతామనడం కొట్టాల్సిందేనని దబాయించడం మూర్ఖత్వమే అవుతుంది.
Deleteకమ్యూనిజం అంటే నిర్వచనం చెప్పండి శ్రీకాంత్ చారి గారూ !
ReplyDeleteనాకు తెలిసి అందరికీ కమ్యూనిష్టులంటే సరిపడదు గానీ కమ్యూనిజం పట్ల సానుకూలత ఉంది(ఉండాలి).బద్దకస్థులు,సోమరిపోతులకు మాత్రమే కమ్యూనిజం అంటే సరిపడదు.
నీహారిక గారు,
Deleteనేనెందుకు చెప్పాలి నిర్వచనం? నేనేమీ ప్రచారం చేయడం లేదే? నేనడిగింది ఒక చిన్న ప్రశ్న.
"అసలు ఈ దేశంలో కమ్యూనిజం పైన ఎవరికి సానుకూలత వుంది? దేశం మొత్తం మీద 3.25% వోట్లు వచ్చినపుడు కేవలం IT ఉద్యోగులు మాత్రమే కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పడమేమిటి?"
ఓట్ల శాతాన్ని బట్టి ఫలానా వారికి సానుకూలత ఉందని చెప్పలేం.పోరాటాలకు కమ్యూనిష్టులు ముందు నిలుస్తారు,ఓట్లుగా మార్చుకోలేరు.లోక్ సత్తా పై ఐ టీ పరిశ్రమ కు బోలెడంత సానుకూలత ఉంది,అవి ఓట్లుగా మార్చుకోలేరు,3 శాతం ఓట్లు నోటాకి కూడా వచ్చాయి కానీ ప్రజలలో నోటా ని వాడుకోవడం ఎలా అన్నది కూడా తెలియదు. నేను చెప్పేది ఏమిటంటే ఒక పార్టీ మీద సానుకూలత ఓట్లు తెప్పించలేవు,అలా తెప్పించగలిగితే కే సీ ఆర్ సీ ఎం అయ్యే చాన్సే ఉండేది కాదు.
Deleteనీహారిక గారు, కమ్యూనిస్టులుకు ఓటింగ్ పై గుడ్డి నమ్మకం ఉండదు. ఓటింగ్ ని బూటకపు ప్రజాస్వామ్యంగా వారు చూస్తారు. వారిలో కొందరు అసలు ఓటింగ్ ని బహిష్కరిస్తున్నారు. కొందరేమో ప్రజలు విశ్వసిస్తున్నారు కనుక, పార్లమెంటు ద్వారా , చట్టాల ద్వారా కూడా అపుడపుడయినా , కొన్ని సందర్భాలలో అయినా ప్రజలకు కొన్ని మేళ్లు జరుగుతున్నాయి కనుక ముఖ్యంగా ప్రజలు ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తున్నందున దానిని కూడా వర్గ పోరాట సాధనంగా ఉపయోగించుకుని ఎన్నికలలో పాల్గొంటున్నారు. ఎన్నికలలో పాల్గొంటేనే తప్పని మూర్ఖంగా వాదించడం అంటే ప్రజలకు దూరంగా జరగడమే. ఎన్నికల ద్వారానే ప్రజల చైతన్యం పెంచగలం అనుకుంటే భ్రమ మాత్రమే. ఇవి రెండూ సమాజానికి మేలు చేయవు. సమాజంలో ఐ.టి వారి భాగం ఎంత? వారిలో సమాజం పట్ల బాధ్యతగా ఆలోచించేవారెందరు? ఐ.టి అనేది ఉత్పాదక రంగం కాదు. కేవలం సేవారంగం. ఐ.టి వారు వ్యతిరేకించినా , అనుకూలించినా కమ్యూనిజానికి ఒరిగేదేమీ ఉండదు. ప్రత్యేకించి ఐ.టి రంగపై గురిపెట్టి వాదించడం , వెనుకకు తీసుకోని మొండివాదన చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ప్రజలందరినీ కమ్యూనిజం ప్రభావితం చేయడమంటే అంత తేలిక కాదు. అసాధ్యమూ కాదు. ఉదాహరణకు ప్రజలంతా బట్టలు ధరించడం అనేది నేడు కామన్సెన్స్ ..... మరి ఆదిమానవుడి స్టేజ్ నాటి సంగతి. బట్టలు ధరించడం అనే ఒక అంశం సభ్యత అనే ఒక నోడల్ పాయింట్ గా రావడానికి చాలా పరిణామం జరిగింది. భూమి గుండ్రంగా ఉన్నదన్నందుకు శాస్త్రవేత్తలను చంపేశారు. కానీ భూమి గుండ్రంగా ఉన్నదనే నిజాన్ని దాచగలిగారా? సైన్స్ డెవలప్ అయ్యాక కూడా పంచాంగాలు ప్రభ వెలుగుతూనే ఉంది. పంచాంగం భూమి చంద్రుడి చుట్టూ తిరుగుతుందనే లెక్కల ప్రకారం వ్రాస్తారని విన్నాను. అంతెందుకు శ్రీహరికోటలో అంతరిక్ష ప్రయోగాలను పూజలు చేసి ప్రారంభిస్తున్నారు కదా? డేనికైనా ఓ అంశాం నోడల్ పాయింట్ కు రావాలంటే అనేక అనుభవాలు - ఆలోచనలు - సంఘర్షణలు ...... తరువాతనే అంతిమ ఫలితం వస్తుంది.
Deleteచారి, ఇందియాలో ఎక్కువ మంది పరిశ్రమల్లో పని చేసేవాళ్ళు కాదు, చెయ్యాలనుకుంటున్నవాళ్ళు కూడా కాదు. వాళ్ళు బి.ఎ. చదివి ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే చెయ్యాలనుకుంటున్నవాళ్ళు. అందుకే ఇందియాలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. చదువునే పెట్టుబడి అనుకునేవాళ్ళకి వర్గ వైరుధ్యం గురించి ఏమి తెలుస్తుంది? వైరుధ్యం ఉన్నప్పుడే మార్పు వస్తుంది కానీ సామరస్యం ఉన్నప్పుడు మార్పు వస్తుందా? నువ్వు 3.25% మంది గురించి మాట్లాడుతున్నావు. నేను లక్షకి పైగా జనాభా ఉన్న శ్రీకాకుళం పట్టణంలో మార్క్సిజం చదివినవాణ్ణి ఒక్కణ్ణే చూసాను. అతను కూడా లైబ్రరీలో పుస్తకాలు చదివినవాడే కానీ విశాలాంధ్ర, ప్రజాశక్తిలకి వెళ్ళేవాడు కాదు. అక్కడ CPI, CPMలకి వోత్ వేసేవాడైతే ఒక్కడు కూడా కనిపించడు. అయినా నేను విప్లవం ఎప్పటికైనా వస్తుందని నమ్ముతున్నాను.
ReplyDeleteజైగారూ, మీరు "Windows is usually bundled with the computer itself in effect selling nearly for free." అన్నప్పుడు పొరబడ్డారని నా అభిప్రాయం. ఎవరికీ ఏదీ ఉచితంగా ఇవ్వరు వ్యాపారులు. మీరు కొన్న computer ఖరీదులో Windows O/S ఖరీదు కలిసే ఉంది. విడిగా కన్నా bulk sales చవక కాబట్టి కొంత విడి ఖరీదు కన్నా చవకగా మీకు చేరవచ్చునేమో కాని ఉచితంగా కాదు. Linux O/S వస్తుతః ఉచితం. మీరు download చేసుకొని వాడుకోవచ్చును. లేదా shopkeeper మీకోసం install చేసి ఇవ్వవచ్చును. Redhat వంటి సంస్థలు buldle చెసి ఇచ్చే Linux versionsలో సదుపాయం అల్లా corporate companies కోరుకొనే support మాత్రమే. అందుచేత ఖరీదు వెచ్చించి Redhat వంతివి కొనుగోలు చేయాలి. మీరు Ubuntu కాని centos కాని download చేసుకోవచ్చును. ఐతే మీకు ఎప్పటి కప్పుడు upgrades ఉచితంగానే వచ్చినా మీకోసం వేగంగా bug-fixing చేసి support చేసే సదుపాయం ఒకటే దొరకదు - అది కావాలనే companies అన్నీ Redhat వంటి Linux Distributions సౌకర్యం అనుకునేది. ఇక Windows దగ్గరకు వస్తే అది ఇప్పుడు upgrades అన్నీ free అంటోంది కానీ ఇన్నాళ్ళూ వాటిమీద జనం ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు పడిపోతున్న తన market share నిలబెట్టుకుందుకే కొన్ని మెట్లు దిగింది. Applications serversలో హెచ్చు భాగం ప్రస్తుతం Linux మీదనే run అవుతాయి. ప్రస్తుతానికి Windows O/S ఉపయోగం అల్లా Laptops మీద client applications కోసం మాత్రమే అన్నట్లుంది. అదీ పోయే లాగానే ఉంది. పరిస్థితి. మొన్నటి Windows 8 versions ఒక disaster. కొత్త Windows 10 మీద companies పెద్దగ ఆసక్తి చూపటం లేదు - జనానికీ ఆసక్తి లేదు. Open Source అనేది ఏదో బాధ్యతలేని వ్యవహారం కాదు - సామాజిక బాధ్యతతో volunteer contributions తో experts సమయమూ శ్రమా వెచ్చించి అందరికీ అందిస్తున్న ఉపకరణాలు. వీటిని వాడటం వలన MS వాడిని లక్షలూ కోట్లూ అనవసరంగా GOI ధారపోయటం తగ్గించవచ్చును. అందుచేత మరీ వ్యతిరేకించవలసినది ఏమీ లేదు. నా వ్యతిరేకత నాదే మీకాట్టే తెలియదు అని మీరు కాని మరొకరు కాని అనుకుంటే దానికి నేను జవాబు చెప్పలేను. ఇది కేవలం విషయం clarify చేదామని వ్రాసాను. నచ్చకపోతే వదిలెయ్యండి.
ReplyDeleteమీరు చెప్పింది కరేక్తేనండీ. నేను తొందరలో పూర్తిగా ఆలోచించకుండా రాయడం వలన పొరపాటు దొర్లింది. తప్పు సవరించి నందుకు థాంక్స్.
Deleteఇకపోతే ఓపెన్ సోర్స్ హాబీ ప్రోగ్రామర్లకు మంచిదే కానీ వాణిజ్య సాఫ్ట్వేర్ ప్రాడక్టుల నిర్మాణానికి కాదని నా ఉద్దేశ్యం. My belief is based on competitive aspects, not engineering principles.
నేను "రమణీయం" పుస్తకాన్ని Ubuntuలోనే ఏదో DTP softwareలో DTP చేసాను. అది ప్రింతింగ్ ప్రెస్‌వాడి కంప్యూతర్‌లో ఓపెన్ అవ్వకపోతే ఆ ప్రెస్‌లో పని చేసే అమ్మాయి చేత మళ్ళీ DTP చెయ్యించాల్సి వచ్చింది. ఈ సమస్యల వల్ల కూడా ఎక్కువ మంది విందోస్ వాడుతారు.
ReplyDeleteISP serversలో Redhat Linuxనే వాడుతారు కానీ Ubuntu వాడరు.
ప్రవీణ్,
Deleteకమ్యూనిస్టులు చెపుతుంటారే, మిగతా ప్రపంచం మొత్తం క్యాపిటలిజం వుండడం వల్ల రష్యాలో, చైనాలో నిలదొక్కుకోలేదని. మీరు అర్థం చేసుకోగలిగితే లినక్సూ అంతే. ప్రింటర్ పని చేయించడానికి తగు డ్రైవర్ ఉంటే చాలు. దాంట్లో విండోస్ గొప్పదనం ఏమీ లేదు. ప్రింటర్లు, స్కానర్లు వగైరా పెట్టుబడిదార్లే తయారీ చేస్తారు. వారికి లినక్సు మీద మోజేం వుండదు. అందుకని వారు లినక్సు డ్రైవర్లను తయారు చేయరు. ఓపెన్ సోర్స్ డెవలపర్లు తయారు చేసినా... వాటిని డవున్లోడ్ చేసుకుని ఉపయోగించేంత తెలివి, ఓపిక సాధారణ జనానికుండదు.
సర్వర్ల రంగంలో లికక్సే రారాజు. డెస్క్‌టాపుల్లో కూడా లినక్స్ బహుళ వ్యాప్తిలోకి వచ్చినట్టయితే చచ్చినట్టు దానిక్కే డ్రైవర్లు తయారుచేస్తారు హార్డ్వేర్ తయారీదార్లు. అటువంటి రోజు వస్తే అప్పుడు ప్రింటర్ లినక్సులో పనిచేస్తుంది, విండోస్‌లో చేయక పోనూ వచ్చు. అంతా డ్రైవర్ల మాయ!
ప్రవీణ్,
Deleteమీhighly limited knowledgeని, irrelevant observationsని బాగా generalize చేస్తున్నారు! ఇదంత ఉచితంగా లేదు. శ్రీకాంత్ చారిగారు చెప్పినట్లు మీరు మంకుపట్టుతో వాదిస్తున్నారే కాని నిజమైన technical expertise ఏమీ మీకు లేదని స్పష్టం అవుతోంది. దయచెసి ఇంక వదిలెయ్యండి. మీకేదో కొద్ది పరిజ్ఞానం ఉండి ఉందేమో. అది సమకాలీనం కాక, మీకు పరిజ్ఞానం తగినంత లేక, మీ వాదన మరింత నేలవిడచిన సాముగా ఉందని ఎందుకు అర్థం చేసుకోరు? నిజం చెప్పాలంటే మీ వాదనలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ మాట ITరంగ నిపుణుడిగా చెబుతున్నాను! సరే మీరు నాదే పైచేయి అంటుంటే అది కేవలం మాకు వినోదప్రదర్శనగానే ఉంటుంది. ఇకపై మీ యిష్టం.
శ్రీకాంత్ చారిగారూ,
ప్రవీణ్‍తో ఈ విషయంలో ఇంకా చర్చించటం కేవలం వ్యాఖ్యల సంఖ్యను పెంచేందుకు తప్ప ఎందుకూ పనికిరాదు కాబట్టి మీరూ ఇంక వదిలేస్తే బాగుంటుందేమో ఆలోచించమని నా అభ్యర్థన. ఐనా ఈ line of discussion అనేది ప్రథానచర్చా విషయానికి ఏమీ సంబంధం లేకుండా చాలా దూరంగా తిరుగుతోందనీ నా అభిప్రాయం.
D-Link Modem అనుకుంటాను, దానికి ఓపెన్ సోర్స్ దెవెలపర్ తయారు చేసిన ద్రైవర్ సాఫ్త్‌వేర్‌ని దౌన్‌లోద్ చేసుకుని వాడినట్టు నాకు గుర్తుంది. నా దగ్గర ఉన్న లేజర్ ప్రింతర్‌కి ఒక లినక్స్‌లో ద్రైవర్ దొరికింది, మిగితా లినక్స్‌లలో ద్రైవర్ దొరకలేదు. పుస్తకాలు చదివి లినక్స్ నేర్చుకున్నవాని కంటే స్వయంగా లినక్స్ వాడినవానికే ఇవ్వన్నీ బాగా అర్థమవుతాయి.
Deleteఇంకో విషయం వ్రాయడం మర్చిపోయాను. ఆ modem లినక్స్‌లో dialup networkకి పని చేసింది కానీ faxకి పని చెయ్యలేదు. ADSL router + LAN cable ద్వారా Internet కనెక్త్ అయితే ఇక dialup network ఎవడు వాడుతాడు? బ్యాంక్ మేనేజర్‌లకీ, పోలీస్ ఇన్స్పెక్తర్‌లకీ fax కూడా అవసరమే. బ్యాంక్‌లో లినక్స్ ఇన్స్తాల్ చేస్తే ఆ లినక్స్ వర్షన్ ఏ ప్రింతర్లని సపోర్త్ చేస్తుందో ఆ ప్రింతర్లనే కొనాల్సి వస్తుంది. అందుకే బ్యాంక్‌లలో లినక్స్ వాడరు. బ్రాంచ్ మేనేజర్ కంప్యూతర్‌లో అయితే సిసి కెమెరా ద్రైవర్లని కూడా ఇన్స్తాల్ చెయ్యాలి. లినక్స్‌లో అది కూడా సాధ్యం కాదు. బ్యాంక్‌లూ, పోలీస్ స్తేషన్‌లూ లాంటి వాటికి లినక్స్ పనికి రాదు కనుకనే అది పాప్యులర్ అవ్వలేదు.
Deleteచారి, సోవియత్ సమాఖ్య కూలిపోవడానికి కారణం అప్పట్లో 67% ప్రపంచ జనాభా పెట్టుబడిదారీ, భూస్వామ్య ప్రభుత్వాల కింద ఉండడం ఒక్కటే కాదు. స్తాలిన్ రష్యాని 80% పారిశ్రామీకరించినా రష్యాలోని కొన్ని ప్రాంతాలు వ్యవసాయంపై భారీగా ఆధారపడ్డాయి. అయినా స్తాలిన్ పట్టు వదలకుండా అమెరికాతో పోటీ పడి వ్యవసాయ ఉత్పత్తులని విదేశాలకి ఎగుమతి చేసాడు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో రష్యా అమెరికాని జయించింది. 1940లో ప్రపంచంలోని 40% వ్యవసాయ రాబడి రష్యా నుంచే వచ్చేది. ఇలా సామ్రాజ్యవాదులతో పోటీ పడడం కూడా సామ్రాజ్యవాదమేనని రంగనాయకమ్మ గారు ఓ చోట వ్రాసారు. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలు రష్యన్ వ్యవసాయ క్షేత్రాలపై దాడులు చెయ్యడం వల్ల రష్యన్ వ్యవసాయ ఎగుమతుల volume 20%కి పడిపోయింది. అప్పటి నుంచే రష్యా ఆర్థిక క్షీణత మొదలైంది. నాజీలని ఓడించిన వీరునిగా నాకు స్తాలిన్ అంటే అభిమానమే. కానీ ప్రపంచ మార్కెత్‌ల మీదకి ఎగుమతుల్ని తోసి డబ్బుల వర్షం కురిపించుకోవడం ఒక సామ్రాజ్యవాద ప్రవృత్తే అవుతుంది. స్తాలిన్ తన సొంత దేశంలో ప్రైవేత్ ఆస్తిని రద్దు చేసాడు కానీ ఎగుమతులని పెంచి డబ్బులు రాబట్టుకోవడం అనే సామ్రాజ్యవాద ప్రవృత్తిని అతను కూడా పాటించాడు. అదే ఖ్రుష్చేవ్, భ్రెఝ్నేవ్‌ల సోషల్ సామ్రాజ్యవాదానికి బీజం అయ్యింది. ఇక గోర్బచేవ్ కేవలం ప్రైవేత్ ఆస్తి కోసం గ్లాస్నోస్త్ పేరుతో రష్యాలో కమ్యూనిస్త్ వ్యతిరేక ప్రచారాన్ని అనుమతించాడు. ఫలితంగా అక్కడ సోషలిస్త్ ప్రభుత్వం కుప్పకూలింది. CPM మేతావి తెలకపల్లి రవికి ఈ నిజాలన్నీ తెలుసు. కానీ అతను ఇవి మాట్లాడకుండా భాజపా, కాంగ్రెస్, మతతత్వం, సెక్యులరిజం లాంటి కబుర్లు చెపుతుంటాడు.
Deleteలెనిన్, స్తాలిన్‌లకి అనేక సమస్యలు ఎదురయ్యేవి. లెనిన్ కాలంలో రష్యాలో కొంత కాలం డబ్బుని కూడా రద్దు చేసే చెయ్యడం జరిగింది. అది సాధ్యం కాక లెనిన్ ప్రైవేత్ ఆస్తిని మాత్రమే రద్దు చెయ్యాలనుకున్నాడు. లెనిన్ పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ప్రైవేత్ ఆస్తిని రద్దు చేస్తే స్తాలిన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రైవేత్ ఆస్తిని రద్దు చేసాడు. రష్యాలో డబ్బు వాడుకలోనే ఉండడం వల్ల కార్మికుల కంటే మేనేజర్లకి ఎక్కువ జీతాలు అందడం లాంటి విధానాలు కొనసాగి అక్కడ కూడా వర్గాలు కూడా వర్గాలు ఉనికిలో ఉండేవి. సోవియత్ సమాఖ్య కూలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటిరెండిటిని జెనెరలైజ్ చెయ్యలేము.
Deleteశ్యామలీయం గారు,
ReplyDeleteExcellent responses… ఇక్కడ మీరు అందించిన సమాచారం, మీ analytical and methodical approach to bringing clarity to the subject, మీరు cite చేసిన ఉదాహరణలు అన్నీ కూడా. I am totally with you in calling out Praveen’s obvious ignorance and his hilarious and childish attempts to come across as a know-it-all guy. And, you are totally justified in advising శ్రీకాంత్ చారి not to engage Praveen any longer. Kudos!
Now, if I may ask you…
You don’t seem to hold yourself accountable to the same level of rational, clinical, logical and methodical scrutiny of questions/issues related to ఆచారము, భక్తి, విశ్వాసము మరియు మతము. Why?
I am genuinely interested in understanding. I respect your choice, if you chose to not respond to my question.
(కొండలరావు గారు: ఎక్కువ భాగం ఇంగ్లీష్ లో రాసినందుకు, కొంత off-topic వెళ్ళినందుకు క్షమించాలి)
Edge గారు, కేవలం నాకు ఇంగ్లీషు రాని కారణంగా మాత్రమే తెలుగులో వ్యాఖ్యానించమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటి మీ వ్యాఖ్య కూడా నాకు కొంతమేరకు అర్ధం అవుతుంది. మీరు చెప్పినది వాదనలో పాటించాల్సిన పద్దతికి సంబంధించి శ్యామలీయం గారితో సహా అందరికీ అన్నివేళలా పనికి వచ్చేదిగా ఉంటుందనుకుంటాను. ఒకవేళ నేను తప్పుగా అర్ధం చేసుకుంటే శ్యామలీయం గారు క్షమించాలి. ప్రజ లో కామెంట్ చేసే మిత్రులందరూ దయచేసి తెలుగులోనే వ్యాఖ్యానించాలని విజ్ఞప్తి.
DeleteEdge గారి ప్రశ్న: You don’t seem to hold yourself accountable to the same level of rational, clinical, logical and methodical scrutiny of questions/issues related to ఆచారము, భక్తి, విశ్వాసము మరియు మతము. Why?
Deleteనా సమాధానం. కొన్ని విషయాలలో తార్కికంగా కొన్ని విషయాలలో మూర్ఖంగా ఉన్నానని అనుకోవద్దు దయచేసి. నా విశ్వాసాలు నావి. వాటికి నా కారణాలు నావి. కాని ధార్మికవిషయాలలో విస్తారమైన చర్చలకు సిధ్ధంగా ఉండాలంటే, 1. అంత సమయం వెచ్చించగలిగి ఉండాలి. నాకు వృత్తిపరమైన కారణాల వలన కుదరదు. 2. అంత ఆసక్తి కలిగి ఉండాలి. నేనేమీ పందితుడనో జ్ఞానినో అన్న భ్రమ ఎప్పుడూ లేదు కాబట్టి వాదనలపట్ల ఆసక్తీ లేదు. 3. ప్రమాణసారస్యం లేనిచోట వాదన కూడా సమంజసం కాకపోవటం వలన మీరు చూపే ప్రమాణాలపై మీరు చేసేవాదనను కాకా ఆయా ప్రమాణాల విశ్వసనీయతను ప్రశ్నించటానికి రంధ్రాన్వేషణలు చేసేవారితో వాదనలు చేయటం అసాధ్యం అనుచితం కూడా. ఇలాంటి కారణాలు మరికొన్నీ ఉన్నాయి కాబట్టి ధార్మికవిషయాలలో చర్చలకు ఆసక్తి చూపటం లేదు. Techinical విషయంగా నడిచిన పై ఉదంతంలో కూడా నేను చర్చను సాగతీయటాన్ని వ్యతిరేకించటం గమనించగలరు.
మీ ప్రశ్నకు ధన్యవాదాలు.
కొండలరావుగారూ, ఒక్క ఆంగ్లపదమూ రాకుండా కూడా వ్రాయగలను. కేవలం సాంకేతిక విషయం కాబట్టి కొందరి సౌకర్యంకోసం కొంత ఆంగ్లపదవినియోగం జరిగింది. క్షంతవ్యుడిని.
Deleteకొండలరావుగారూ, వాదన ఎక్కడ ఎలా ఎంతవరకూ చేయాలీ వంటి విషయాలలో నాకు కొంతైనా అవగాహన ఉందని మీకు సరిగా నమ్మకం లేదని అర్థం చేసుకున్నాను. ఇబ్బంది లేదు. మీ అభిప్రాయాలు మీవి. వాదనలో పాటించాల్సిన పద్దతులు నాకు సరిగా తెలియనప్పుడు నా మాటలు మీ ఉన్నతమైన పోర్టల్‍కు అప్పుడప్పుడు అంత ఉచితంగా అనిపించకపోవటం అర్థం చేసుకోదగ్గదే! ధన్యవాదాలు.
Deleteఈ చర్చ అంతా పూర్తిగా చదవలేదు కానీ, Windows అనే దాన్ని పెట్టుబడి దారి వ్యవస్థకీ, Linux కమ్యూనిజానికి ఆపాదిస్తున్నట్లున్నారు ఇక్కడ. (నాకు అర్థమయ్యింది ఇది).
ReplyDeleteఆపోలిక తప్పు. Linux కూడా పెట్టుబడి దారుడిదే.
Linux అంతా ఫ్రీ కాదు. Linux "బాబు" అనగఆ UNIX ఫ్రీ కాదు. UNIX బాగా కాస్ట్‌లీ. Linuxలోనే "Red Hat Linux" డబ్బులు చెల్లించాల్సిందే. మీరు Ubuntu, Fedora, SUSE లు చూసి అదే Linux అనుకోకండి, అన్ని చోట్లా అదే ఉపయోగిస్తారు అనై అనుకోకండి.
Solaris, AIX, HP-UX ఇవన్నీ ఫ్రీ కాదు. బోలెడు డబ్బులు పెట్టాలి. Solaris ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిలో బెస్ట్ అని చెబుతూ ఉంటారు. అది కూడా ప్రొప్రైటరీనే.
కొన్ని కొన్ని OSలైతే పర్సనల్ యూజ్ కి ఫ్రీగానే ఇస్తాయి. కమర్షియల్ ఉపయోగాలకి డబ్బులు గుంజుతాయి.
కాబట్టి లైనక్స్ అని మీరు దేన్ని భావిస్తున్నారో ముందు తేల్చుకోండి.
ఇంకో విషయం, ఇలా ఫ్రీగా ఇచ్చేవి ఉండగా డబ్బులు పెట్టి ఎందుకు కొంటున్నారు అని మీకు డవుటు రావచ్చు. లైనక్స్ కన్నా యూనిక్స్ చాలా మంచి OS. అదే నిజం. సపోర్టు దొరుకుతుంది.
కొంత మంది Linux తో పోలిస్తే FreeBSDని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే, దాని లైసెన్సింగ్ అలాంటిది. దాన్ని మనం, ఫ్రీ గా ఉపయోగించుకుని, అప్ప్లికేషన్లు డెవలప్ చేసుకుని, మనం కావాలంటే వాటిని ఫ్రీగా ఓపన్ సోర్స్‌గా ఇవ్వచ్చు లెదా .. closed సోర్సుగా, కమర్షియలుగా వాడుకోవచ్చు.
యాండ్రాయిడ్ ఓపన్ సోర్సే, ఫ్రీనే కానీ, దాన్ని ఉపయోగించి చేసే అప్లికేషన్లు ఫ్రీగా ఉండాల్సిన అవసరం లేదు. కమర్షియలుగా వడుకోవచ్చు.
ఓపన్ సోర్స్, ఫ్రీ వేర్ సాఫ్టు వేర్లకి కొన్ని లిమిట్సున్నాయి. ముఖ్యంగా ఏదన్నా సమస్య వస్తే వాటికి సపోర్టు దొరకడం కష్టం. మాకు పేద్ద కమ్యూనిటీ ఉంది ... మీ సమసయ చిటికెలో సాల్వ్ అవుతుంది అని కబుర్లు చెబుతారే కానీ, అంత సీన్ లేదు అని చెప్పవచ్చు. ఒకవేల ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోయినా మనం ఎవ్వరినీ అడిగే హక్కు మనకు పెద్దగా ఉండదు.
లైనక్స్ కమ్యూనిజం కాదు. Linux is freedom. అందుకే అది వర్ధిల్లుతోంది. తేడా ఏమిటంట్ దాన్ని ఉపయోగించుకొని మనం డబ్బులు సంపాదించొచ్చు. అలా కాకుండా లైనక్స్.. ఫ్రీ, నువ్వు దాన్ని ఉపయోగించి ఏమి చేసినా ఫ్రీ అని చెప్పండి. అప్పుడు తెలుస్తుంది అసలు విషయం.
>Linux కూడా పెట్టుబడి దారుడిదే.
DeleteపొరపాటుLinus Torvalds అనే ఆయన Linux వెనుక ఉన్న శక్తి. ఆయన Unix అనేది proprietary software అవటాన్ని వ్యతిరేకించి Linux అనేది ఒక ఉద్యమంలా ముందుకు తెచ్చారు.
>లైనక్స్ కన్నా యూనిక్స్ చాలా మంచి OS. అదే నిజం. సపోర్టు దొరుకుతుంది.
ఇక్కడా ఒక పొరపాటు అవగాహన ఉంది. Unix చెడ్డది అని ఎవరూ అనలేదు. Support అనేది Linuxకు కూడా దొరుకుతుంది. Redhat అలాంటి distribution. ఈ రోజుల్లో మిగతా Unix flavors అన్నీ క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. Linux వాటి స్థానాన్ని తీసుకొంటోంది.
శ్యామళీయం గారూ,
DeleteWindowsను పెట్తుబడి దారుడిగానూ, Linuxను కమ్యూనిష్టుగానూ పోల్చిన పోలికను చూపించి దాన్ని వ్యతిరేకిస్తూ అన్న మాటలవి. లైనక్స్ పెట్టుబడి దారుడిదే అనడములో నేను ప్రస్తుతం దాన్ని వాడుకునే కంపెనీల గురించి చెప్పానండి. చాలా కంపెనీలు లైనక్స్ ప్లాట్ ఫాం కు షిఫ్ట్ అయ్యాయి. కానీ, వాటి ప్రాడక్టులు ఏవీ ఫ్రీ కాదు.
అందుకే లైనక్స్ కూడా పెట్టుబడి దారుడిదే అన్నాను. కానీ, లైనక్స్ కెర్నల్ లైనస్ టార్వాల్డ్స్ దే. దానికి ప్రస్తుతం చాలా మంది కంట్రిబ్యూట్ చేస్తున్నారు.
ఇక లైనక్సులో కూడా సపోర్టు రెడ్ హ్యాట్ వాడు అందిస్తున్నాడు. రెడ్ హ్యాట్ ఫ్రీ కాదు. డబ్బులు పెట్టాలి. ఉబుంటూ కూడా సపోర్ట్ దొరుకుతుంది. డబ్బులు పెట్టాలి. చాలా సర్వర్లు ప్రస్తుతం లైనక్సుకు షిఫ్ట్ అవుతున్నా, performance పరంగా మాత్రం ఇప్పటికె యూనిక్స్ దే పైచేయి. SolAris, AIX, HP-UX వంటితో (యూనిక్స్) పోలిస్తే , లైనక్స్ సర్వర్స్ performance తక్కువే, నాకు తెలిసినంత వరకూ.తక్కువేనని నా అభిప్రాయం. ఇంకా Unixని పూర్తిగా రీప్లేస్ చేసే స్థాయికి లైనక్స్ రాలేదు అనుకుంటా.
ఓపెన్ సోర్సు ఉద్యమం, కమ్యూనిజం ఒకటి కాదు అన్నది 100% కరెక్ట్.
Deleteకాని వీటి మధ్యన కొన్ని పోలికలున్న విషయం కాదనలేం.
కమ్యూనిజం సమాజంలోని మొత్తం సంపద అందరి ప్రజలకీ చెందాలని భావిస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే సమాజంలోని మొత్తం సంపదను అనుభవించే సమానంగా అనుభవించే స్వేఛ్ఛ అందరికీ వుండాలి అంటుంది.
ఓపెన్‌సోర్స్ ఇనిషియేటివ్ సాఫ్ట్‌వేర్‌ని ఫ్రీగా ఉపయోగించుకునే, అవసరాలకు తగువిధంగా మార్చుకునే స్వేఛ్ఛ సమాజంలోని అందరికీ వుండాలని కోరుకుంటుంది.
కొద్ది మంది పెట్టుబడిదారీ శక్తుల మధ్య సమాజ శ్రమ ఫలితాలు కేంద్రీకృతం కావడాన్ని వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు ఉద్యమం మొదలైంది.
కొన్ని బడా కంపెనీల పేటెంట్లలో ప్రోగ్రామర్‌ల శ్రమశక్తి ఫలితాలు ఇరుక్కుపోవడాన్ని వ్యతిరేకిస్తూ ఓపెన్ సోర్స్ ఉద్యమం మొదలైంది.
-*-
ఇక్కడ విచిత్రం ఏంటంటే ... కమ్యూనిజానికి వీరాభిమాని అయిన ప్రవీణ్ ఓపెన్ సోర్సును వ్యతిరేకిస్తూ గుత్త పెత్తందారీ పోకడలు పోయే మైక్రోసాఫ్ట్ విండోస్ ను, ఇతర కమర్షియల్ సాఫ్ట్‌వేర్‌ను సమర్థించడం!
శ్రీకాంత్ చారిగారి పై అభిప్రాయంతో 100% ఏకీభవిస్తున్నాను. నేనైతే ఇంత బాగా చెప్పలేనేమో ఈ మాటని!
Deleteపెట్టుబడిదారుడు ఎవడూ లాభం చూసుకోకుండా పని చెయ్యడు. నాకు హార్ద్‌వేర్ నేర్పించిన గురువు గారు సన్ సోలారిస్ నేర్చుకోవడానికి వెళ్తే అతనికి లక్ష రూపాయలు అడిగారు. ఆయన పని చేసే ప్రాంతం (కోనసీమ)లో ఎవరూ సోలారిస్ లాంటి ఖరీదైన OSలు వాడరు కనుక ఆయన వెనక్కి వచ్చారు.
Deleteనేను Ubuntu వర్షన్ అప్‌గ్రేద్ చేసేటప్పుడు దానిలో ఉన్న HP Laserjet driver పోయింది. ఓపెన్ సోర్స్ వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని తెలిసిన కంపెనీలు ఓపెన్ సోర్స్ వాడుతాయా? వాళ్ళకి నేను సలహా ఇవ్వను, నా కంటే తలపండినవాళ్ళు వాళ్ళ నిపుణుల బృందంలో ఉంటారు. వాళ్ళలో ఒక్కడైనా తన బాస్‌కి నిజం చెప్పడా?
శ్యామలీయంగా గారు,
Deleteనా వ్యాఖ్య నచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు.
ప్రవీణ్ గారు,
పదినిముషాలు కష్టపడి నెట్ లో వెదికి ప్రింటర్ డ్రైవర్ ఇన్‌స్టాల్ చేసు చేసుకునే ఓపిక లేనివారు ...
కమ్యూనిస్టు సమాజంలో క్యాబేజీ పులుసు కోసం 5 గంటలు క్యూలో ఎలా నుంచో గలరు? (Read: The Queue)
చెప్పుల షాపు వాడు (సారీ, ప్రభుత్వ చెప్పుల శాఖ కమిస్సార్) కేవలం కుడి కాలు చెప్పులే వున్నాయి, ఎడం కాలి చెప్పు రావాలంటే వారం వెయిట్ చెయ్యాలి అంటే ఎలా ఆగగలరు?
జిరాక్స్ అధికారి "మీ కాగితం సెన్సారు అధికారి వద్దకు వెళ్ళింది, క్లియరెన్సు వచ్చాక కాపీ, ఒరిజినలు ఇస్తాం" (రాకపోతే జైల్లోకి తోస్తాం) అంటే ఎదురు చూడగలరా? (ఈ విషయం USSRలో Medicine చదివిన వ్యక్తి స్వయంగా నాతో చెప్పాడు).
Endless Queues in USSR
Woman in Russia and Ukraine
Rationing in USSR
బహుషా మీరు కమ్యూనిజాన్ని చాలా అందంగా ఊహించుకుంటున్నారేమో. వాస్తవం అందుకు విరుద్ధంగా వుంటుంది.
రాబర్త్ కాంక్వెస్త్ ఉక్రెయిన్ కరువు పేరుతో చేసిన కమ్యూనిస్త్ వ్యతిరేక ప్రచారం ముందు ఈ క్యూ కథలు ఎంత? ఉక్రెయిన్ కరువు కథలు నేను 2005లోనే చదివాను, అయినా నేను భయపడలేదు. ఇలాంటివే అలెక్సాందర్ సోల్ఝెనిత్సిన్ వ్రాసిన చెరసాల కథలు కూడా. Fax పంపడానికి లినక్స్‌లో కుస్తీ పడలేనివాళ్ళు లెనిన్, స్తాలిన్‌లు నడిపిన కారావాస శిబిరాల్లో ఎలా బతుకుతారు అని అలెక్సాందర్ సోల్ఝెనిత్సిన్ శిష్యుడు అడిగినా నాకేమీ దడ పుట్టదు.
Deleteనువ్వు నీ సొంత కంపెనీ పెట్టుకుని లినక్స్ వాడితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. నేను నా ఇంతర్నెత్ కెఫెలో పని చేసిన అమ్మాయికి లినక్స్ ఇవ్వలేదు, నా దగ్గర ఉన్న ఏ లినక్స్ సిస్తమ్‌కీ ఇంక్‌జెత్ ప్రింతర్ ద్రైవర్ దొరకలేదు, ఆమె చేసే పనికి కలర్ ప్రింతింగ్ బేరాలే ఎక్కువగా వచ్చేవి. నీకు ఓపెన్ సోర్స్ మీద నమ్మకం ఉందని వేరేవాళ్ళు వ్యాపారాలు మానుకోరు.
నా సంగతి సరే, ఒక పోలీస్ ఆఫీసర్‌ని "నీ స్తేషన్‌లోని కంప్యూత్‌లో లినక్స్ ఇన్స్తాల్ చేస్తే fax పంపడానికి ఇంత సర్కస్ చేసే నువ్వు ఏ దావూద్ ఇబ్రాహీంనో పట్టుకోవడానికైతే ఎంత సర్కస్ చేస్తావు?" అని అడుగు. ఫ్రీ సాఫ్త్‌వేర్ కంటే సౌలభ్యం ముఖ్యం అని పోలీసులు ఎలా అనుకుంటారో, ఇతరులు కూడా అలాగే అనుకుంటారు.
Deleteబ్యాంక్‌లలో మెయిల్స్ పంపడానికి Outlookనే వాడుతారు. Outlookలో ఏదైనా సమస్య వస్తే అప్పుడు బ్యాంక్‌వారి అధీకృత నిపుణుణ్ణే పిలవాలి తప్ప ఇంకో mail client అందులో ఇన్స్తాల్ చేసే అధికారం ఉద్యోగికి ఉండదు. నా ఇంతర్నెత్ కెఫెలో ఉన్నవి నా సొంత కంప్యూతర్లు కాబట్టి నాకు ఒక mail clientలో సమస్య వస్తే అది తీసేసి ఇంకో mail client ఇన్స్తాల్ చేసుకునేవాణ్ణి. నాకు కలర్ ప్రింతింగ్ వల్లే డబ్బులు ఎక్కువ వచ్చేవి. లినక్స్‌ని నేను వెబ్‌దిజైనింగ్, FTP, మెయిల్ ఏక్సెస్‌లకి మాత్రమే వాడేవాణ్ణి.
దేనికైనా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఒక బ్యాంక్‌లో ఏ సాఫ్త్‌వేర్ వాడాలి అనేది ఆ బ్యాంక్ యొక్క computerisation contract తీసుకున్న కంపెనీవాళ్ళు నిర్ణయిస్తారు తప్ప ఆ బ్యాంక్ ఉద్యోగులో, అధికారులో కాదు. ఆ బ్యాంక్ యజమానులు తమ అవసరాలు ఏమిటో చెపితే ఆ అవసరాలకి అనుగుణంగా ఆ కంపెనీయే సాఫ్త్‌వేర్‌ని తయారు చేసి ఇస్తుంది తప్ప దాని యజమానులు కూడా తమకి తెలిసిన సొంత సాఫ్త్‌వేర్ ఇన్స్తాల్ చెయ్యాలనుకోరు.
Deleteరైలులో ఫ్యాన్ పాడైతే దాన్ని స్తేషన్‌లో ఆపి తెక్నీషియన్ చేత ఫ్యాన్ రిపైర్ చెయ్యిస్తారు తప్ప TTE" తనకి ఫ్యాన్ రిపైరింగ్ తెలుసు కదా అని అది చెయ్యడు. అలాగే రైలులో ticket లేకుండా తిరిగేవానికి TTE ఫైన్ వ్రాస్తాడు తప్ప రైల్వే పోలీస్ ఫైన్ వ్రాయడు. ఒక సంస్థలో ఒక ఉద్యోగి తనకి బాస్ అప్పగించిన పని మాత్రమే చేస్తాడు తప్ప సొంత ప్రయోగాలు చెయ్యడు. విందోస్ వచ్చిన తరువాత కూడా ఎ.పి.జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో Unix & C వాడేవాళ్ళు. అవి జపాన్ కంపెనీ తయారు చేసిన కంప్యూతర్‌లు, వాటిలో యూనిక్స్ తప్ప ఏదీ పని చెయ్యదు.
ప్రవీణ్ ఉవాచ> అవి జపాన్ కంపెనీ తయారు చేసిన కంప్యూతర్‌లు, వాటిలో యూనిక్స్ తప్ప ఏదీ పని చెయ్యదు.
Deleteఓహో.
నా ఇంతర్నెత్ కేఫ్‌లోని కంప్యూతర్‌లలో విందోస్ 2003 పని చేసింది కానీ NT ఇన్స్తాల్ కూడా అవ్వలేదు. NT ఇన్స్తాల్ చెయ్యడానికి ప్రయత్నిస్తేనే కంప్యూతర్ ఆగిపోయేది. దేనికైనా హార్ద్‌వేర్ సపోర్త్ ఉండాలి కదా.
Deleteజపాన్‌వాడు తాను తయారు చేసిన హార్ద్‌వేర్ కోసం తాను వ్రాయగలిగిన సాఫ్త్‌వేర్ వ్రాస్తాడు కానీ వేరే వాడు వ్రాసిన సాఫ్త్‌వేర్‌నే గుడ్డిగా ఇన్స్తాల్ చేస్తాడా?
MS DOSలో మౌస్ పని చెయ్యాలంటే mouse.com, mouse.sys అనే commands ఇన్స్తాల్ చెయ్యాలి. అప్పట్లో మౌస్ అమ్మే కంపెనీలవాళ్ళే అవి ఇన్స్తాల్ చెయ్యడానికి అవసరమైన ఫ్లాపీలు ఇచ్చేవాళ్ళు. లినక్స్‌లో మౌస్ automaticగా పని చేస్తుంది. కానీ కొన్ని రకాల BSD Unix distributionsలో కొన్ని కంపెనీల మౌస్‌లు ఇప్పటికీ పని చెయ్యవు. 5 ఏళ్ళు ఇంతర్నెత్ కెఫె నడిపిన నాకే అనుభవంలోకి వచ్చిన ఈ విషయాలు నా కంటే తలపండినవాళ్ళైన సాఫ్త్‌వేర్ కంపనీల యజమానులకి ఇంకా బాగా తెలిసి ఉండాలి.
ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకి ఇవి తెలియకపోవచ్చు. వాళ్ళకి పుస్తకాలలో వ్రాసినవి మాత్రమే తెలుస్తాయి. సాఫ్త్‌వేర్ కంపెనీ నడిపేవాళ్ళకి మాత్రం ఇవి తప్పకుండా తెలుస్తాయి.
ఒక ప్రైవేత్ బ్యాంక్ యజమాని తనకి అన్నీ తెలుసు అనుకుని తన బ్యాంక్‌లోని కంప్యూతర్లలో BSD ఇన్స్తాల్ చేస్తే అతను అందులో మౌస్‌లు ఇన్స్తాల్ చెయ్యడానికి కూడా సర్కస్‌లు చేస్తాడు. ఇలాంటి సమస్యలు రాకూడదనే పెట్టుబడిదారులు తమ సొంత నిర్ణయాలు తీసుకోకుండా నిపుణులని సంప్రదిస్తారు.
ఇక్కడ ఇంకో విషయం. ప్రవీన్ పైన లిబర్టేరియన్ పార్టీ పెడితే చాలా మంది వాటికి ఓటువేయరు అన్నాడు. నిజానికి ప్రస్తుతం BJPని మనం లిబర్టేరియన్ పార్టీ అనే అనుకోవాలి.
ReplyDeleteLiberal vs Libertarian.
Liberal = Liberty + Equality
Libertarian = Liberty only
ఇది డెఫినిషన్ల ప్రకారం. కానీ రఫ్ గా ప్రస్తుతం అవి ఎలా ఉన్నాయంటే ... లిబెరల్స్, ప్యూర్ కమ్యూనిజం రాదని తెలుసుకున్న కమ్యూనిస్టులు. కాబట్టి, వీల్లు క్యాపిటలిజములో బతుకుతూ. . వీలైనన్ని కమ్యూనిస్టు ప్రిన్సిపుల్సు రుద్దుతూ ఉంటారు.
అదే లిబర్టేరియన్లు .. పూర్తి క్యాపిటలిజం laise-fair model కుదరదని అర్థమయ్యి, కొద్దిగా కమ్యూనిజాన్ని (కనీసం ఆర్థిక విషయాలలో కాకుండా, మిగిలిన సామాజిక విషయాలలో) ఉపయోగించేవారు.
నాకు తెలిసినంత వరకూ ప్రస్తుతం BJP లిబర్టేరియన్ పార్టీ. CPI, CPM లిబరల్ పార్టీలు. కాంగ్రెసుకు ఏ పేరు పెట్టాలో నాకు అర్థం కావడం లేదు.
లిబర్తేరియన్‌లు పోలీస్ స్తేషన్‌లూ, కోర్త్‌లు లాంటివి మాత్రమే ప్రభుత్వం చేతుల్లో ఉండాలంటారు. భాజపా లిబర్తేరియన్ పార్తీ అయితే అది SBI, IDBI, భారతీయ రైల్వే లాంటివాటిని ప్రైవేతీకరించేది.
Deleteభాజపావాళ్ళు కేవలం కరెన్సీ విలువని కృత్రిమంగా తగ్గించి విదేశీ పెట్టుబడులని ఆహ్వానించే విధానాన్ని అనుసరిస్తున్నారనే నువ్వు భాజపాని లిబర్తేరియన్ పార్తీ అనుకుంటున్నావు కానీ నీకు Ayn Rand సాహిత్యం అర్థమైనట్టు లేదు. దుకాణంలో గుమాస్తా ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో అక్కాచెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసి తాము మాత్రం ఏమీ తీసుకోకుండా బతికే పరార్థపరులు ఎక్కువగా ఉన్న హిందూ సమాజంలో సాధారణ జనానికి Ayn Rand వ్యక్తి స్వేచ్ఛావాదం అర్థం కాదు కానీ బెంగళూరులో ఏదో IT ఉద్యోగం చేసే నువ్వు కూడా అది అర్థం చేసుకోలేకపోయావా?
Deleteమనిషికి వ్యక్తిగత హక్కులు తెలియాలి అనే విషయంలో మాత్రమే నేను Ayn Randని సమర్థిస్తాను. ఆమెలో ఉన్న anti-communist tendencyకి నేను వ్యతిరేకమే. వ్యక్తిగత హక్కులు తెలియకపోతే సామాజిక చైతన్యం కూడా కలగదు. అందుకే వ్యక్తిగత హక్కుల గురించి వ్రాసేవాడు పెట్టుబడిదారీ తత్వవేత్త అయినా నేను అతని రచనలు చదువుతాను.
శ్రీకాంతా చారి,
Deleteనరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరూ మగాళ్ళే అనే పోలికను నేను కాదన్ను. కాబట్టి, రాహుల్ గాంధీ కూడా నరేంద్ర మోడీలా సమర్ధుడు అని సాక్షంగా దాన్ని చూపిస్తానంటే నేను ఒప్పుకోను.
ఓపన్ సోర్స్ కి, కమ్యూనిజానికీ ఉన్న కామన్ పాయింట్ ఇది అంటే అభ్యంతరం చెప్పాల్సింది ఏమీలేదు. కానీ, ఓపన్ సోర్స్ విజయానికి ఆ కమ్యూనిష్టు ప్రిన్సిపులే కారణం అన్నా .. ఇక్కడ ఇది విజయం సాధించింది కాబట్టి కమ్యూనిజం కూడా అలానే విజయం సాధిస్తుంది అన్నా నేను ఒప్పుకోను :-)
ఇది ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తోందంటే ... కమ్యూనిష్టులు చేసిన ప్రచారం అలాంటిది. వెరైటీ ఏమిటంటే, కమ్యూనిష్టుల ఈ ప్రచారం దెబ్బకి ఓపన్ సోర్సును అభిమానించే వాల్లు ప్రత్యేకంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మేము కమ్యూనిష్టులం కాము, ఓపన్ సోర్స్ కమ్యూనిష్టు ప్రిన్సిపుల్ కాదు అని ..!
How to Misunderstand Free Software
Five misconceptions about free software, corrected.
http://www.getgnulinux.org/en/linux/misunderstanding_free_software/
Look at the 5th misconception
Free software is like communism ?
కమ్యూనిజం అంటే ప్రైవేత్ ఆస్తిని రద్దు చెయ్యడం. ఓపెన్ సోర్స్ పంపిణీదారుడు ఎవడూ తాను ప్రైవేత్ ఆస్తిని రద్దు చెయ్యాలనికోరుతున్నట్టు చెప్పుకోడు. అతను విరాళాలతో ప్రాజెక్త్ నడుపుతాడు, విరాళాలు రాకపోతే ప్రాజెక్త్ ఆపేస్తాడు.
Delete@Srikant M
Delete>>> కాబట్టి కమ్యూనిజం కూడా అలానే విజయం సాధిస్తుంది అన్నా నేను ఒప్పుకోను
నేను పైన రాసిన వ్యాఖ్యలన్నీ చదివితే నేనలా ఎక్కడైనా అన్నట్టు మీకనిపించిందా?
But open source succeeds in leading small professionals to do circus. One professional would do circus to install mouse on one BSD distribution and some other professional may dance to install LAN card on another BSD distribution.
Deleteఇదేమీ కొత్త చర్చ కాదు. 2008లోనే నేను వ్రాసాను "గ్లోబలైజేషన్ పేరుతో ఇందియా ఎంత అభివృద్ధి చెందిందని చెప్పుకున్నా ఇందియాలో ఎక్కువ మంది పైరసీ సాఫ్త్‌వేరే వాడుతారు" అని. అప్పటి నుంచే మన తెలుగు బ్లాగుల్లోని కెలుకుడు గ్యాంగ్‌కి నేనంటే ద్వేషం.
Deleteఇంజనీరింగ్ కాలేజ్‌లలో చదివేది కేవలం certificate కోసం. సొంత సాఫ్త్‌వేర్ కంపెనీ పెట్టుకోవడానికి certificate అవసరం లేదు, పుస్తకాలు చదివి పరిజ్ఞానం పొందితే చాలు. ఉద్యోగం కోసం మాత్రమే certificate అవసరం. నీకు certificate ఉన్నా, నీకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ తమకి తెలిసిన తెక్నాలజీలో నీకు మళ్ళీ training ఇస్తుంది. నువ్వు ఎంత నాసిరకం ఇంజనీరింగ్ కాలేజ్‌లో చదివినా నీకు IT కంపెనీలో ఉద్యోగం వస్తుంది. సాఫ్త్‌వేర్ ఇంజనీర్లలో చాలా మందికి ఈ విషయాలు తెలుసు కాబట్టే సౌకర్యాలు లేని ఇంజనీరింగ్ కాలేజ్‌లకి అనుమతి ఇస్తోన్న ప్రభుత్వంపై వాళ్ళకి వ్యతిరేకత లేదు.
ఇలా నిజాలన్నీ వ్రాసినందుకే కదా నాకు వ్యతిరేకంగా NRIలందరూ ఒకటై కెలుకుడు బేచ్ పెట్టారు.
ప్రవీణ్ సుభాషితం> నువ్వు ఎంత నాసిరకం ఇంజనీరింగ్ కాలేజ్‌లో చదివినా నీకు IT కంపెనీలో ఉద్యోగం వస్తుంది.
Deleteఓహో అలాగా. నాసిరకం చదువు - నాసిరకం పరిజ్ఞానంతో ఉన్న ఇంజనీరుకు సాఫ్ట్-వేర్ కంపెనీ ఇంటర్వ్యూ చేసి పరీక్షించకుండా ఉద్యోగం ఇచ్చేస్తుందన్న మాట. కొత్తగా వింటున్నాను!
ప్రవీణ్ సుభాషితం:నీకు certificate ఉన్నా, నీకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ తమకి తెలిసిన తెక్నాలజీలో నీకు మళ్ళీ training ఇస్తుంది.
ఏ కంపెనీ కూడా అలా ఇవ్వదు. ఉదాహరణకు జావా ప్రోగ్రామర్ కోసం పిలిచి ఒకరిని సెలక్ట్ చేసుకొని ఏ కంపెనీకూడా జావాలో మళ్ళా ట్రైనింగ్ ఇవ్వదు. ఐతే ఒక ప్రోగ్రామర్ ఏకంపెనీలో ఐనా చేరితే ఆ కంపెనీ తాలూకు సాఫ్ట్-వేర్ ప్రోడక్టులపైన ముఖ్యంగా తనపనికి సంబంధించిన వాటిపైన అవసరమైనతగా ట్రైనింగ్ ఇస్తుంది సహజంగా. ఇందులో విశేషం లేదు.
సి లాంగ్విజ్‌తో ఒక ఆపరేతింగ్ సిస్తం తయారు చెయ్యొచ్చు కానీ సి లాంగ్విజ్ తెలిసినవాళ్ళందరికీ ఆపరేతింగ్ సిస్తం ఎలా తయారు చెయ్యాలో తెలియకపోవచ్చు. జావాతో ఒక వెబ్‌బ్రౌజర్ తయారు చెయ్యొచ్చు కానీ జావా తెలిసిన ప్రతివాడూ ఒక వెబ్ బ్రౌజర్ తయారు చెయ్యలేకపోవచ్చు. కెనదాలో ఉండే నా స్నేహితురాలి భర్త కూడా సాఫ్త్‌వేర్ ఇంజనీరే. ఆయన ఇప్పుడు కూడా జావా నేర్చుకుంటున్నాడు.
Deleteనాకు లినక్స్ ఇన్స్తాల్ చెయ్యడం నేర్పించినవాడు చదివినది మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్‌కి సాఫ్త్‌వేర్‌తో సంబంధం లేదు కానీ ఆయన చెన్నైలో ఒక సాఫ్త్‌వేర్ కంపెనీ పెట్టుకుని బతుకుతున్నాడు. ఆయన తన ఆస్తులు అమ్ముకోవడానికి శ్రీకాకుళం వచ్చాడు. నేను నా ఇంతర్నెత్ కెఫెలో నేను గోర్లు గిల్లుకోవడం చూసిన ఆయన నాకు లినక్స్ ISO ఫైల్స్ బర్న్ చెయ్యడం నేర్పించి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచే నేను రకరకాల యూనిక్స్, లినక్స్‌లు ఉపయోగించడంలో అనేక ప్రయోగాలు చేసాను.
శ్రీకాకుళంలో Tata Docomo షోరూమ్‌వాడు ప్రతివాడికీ కార్బీ స్మార్త్‌ఫోన్ అమ్మడం వల్ల నా ఇంతర్నెత్ కెఫెకి వచ్చేవాళ్ళ సంఖ్య తగ్గి నేను ఆ వ్యాపారం మూసేసి వైజాగ్ వచ్చేసాను. వైజాగ్‌లో కూడా నా ఇంటిలో కొంత కాలం Ubuntuనే వాడాను. మా మామయ్య తన కొడుక్కి కంప్యూతర్ కావాలని చెపితే అతనికి అది ఇచ్చేసి నేను Galaxy Tab కొనుక్కున్నాను. నేను ఇప్పుడు మూడు వేరువేరు ఫోన్‌లు వాడుతున్నాను.
This comment has been removed by the author.
Delete>>> కొంత కాలం Ubuntuనే వాడాను. మా మామయ్య తన కొడుక్కి కంప్యూతర్ కావాలని చెపితే అతనికి అది ఇచ్చేసి నేను Galaxy Tab కొనుక్కున్నాను.
Delete"చికెన్ తినడం మానేసి కోడి మాంసం మాత్రమే తింటున్నా" అన్నట్టుంది మీ వాదన! మీరు కొన్న గెలాక్సీ టాబ్ లో ఉన్న టెక్నాలజీ గురించి తెలుసా?
అండ్రాయిడ్ - ఓపెన్ సోర్స్
జావా - ఓపెన్ సోర్స్
లినక్స్ కెర్నెల్/ డ్రైవర్స్ - ఓపెన్ సోర్స్
(GNU) C/C++ - ఓపెన్ సోర్స్
మీరు Galaxy Tab తో చేయగలిగిన పనులు:
ఫ్లిప్‌కార్ట్/అమెజాన్‌లలో షాపింగ్ - Online బ్యాంకింగ్ (ఆర్థిక లావాదేవీ)
బ్యాంకు అప్ప్లికేషన్స్, బ్రౌజర్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరపడం.
ఓపెన్ ఆఫీసులో ఎడిటింగ్
వైఫై ద్వారా డాక్యుమెంట్ ప్రింటింగ్
కెమెరా ద్వారా ఫోటోలు తీయడం.
మ్యూజిక్ వినడం
వీడియోలు తీయడం, చూడడం.
ఈ బ్లాగు చదవడం.
ఇవన్నీ డ్రైవర్లు పనిచేయకుండానే చేయగలుగుతున్నారా? మీరు ఓపెన్ సోర్సుకోసం శ్రమించకున్నా ఫరవా లేదు, వాడుతున్నందుకు కృతఙ్ఞతగా వుండడం కనీస సంస్కారం. ఇక కించపరచడాన్ని ఏవిధంగా తీసుకోవాలో మీరే నిర్ణయించుకోండి.
Galaxy Tab recognises only Samsung printer as Macintosh recognises only Apple printer.
Delete>>> Galaxy Tab recognises only Samsung
DeleteAnd Praveen recognizes only windows.. but uses all kind of opensorce for free!
LoL!
I don't have any Windows PC at my home. I have only Samsung and BlackBerry devices.
Delete@Praveen,
ReplyDeleteలిబర్టేరియనిజం అంటే సాధ్యమైనంత తక్కువ స్థాయిలో ప్రభుత్వాన్ని కలిగి ఉండడం. కోర్టులు, పోలీస్ స్టేషన్లూ అనేవి కేవలం ఉదాహరణలు మాత్రమే. అంతే కాని, ఖచ్ఛితంగా ఇవి మాత్రమే ప్రభుత్వ ఆధీనములో ఉండాలి అని చెప్పినట్టు వినలేదు. అలా చెప్పినా కూడా, భాజపా ప్రస్తుతం "నిజమైన లిబర్టేరియన్" సమాజానికి తీసుకెల్లడానికి కొంత సమయం పడుతుంది. ఏమో ఎవరికి తెలుసు, సంస్కరణలు పెరిగే కొద్దీ.. భవిశ్యత్తులో అది కూడా జరగొచ్చు. వచ్చిన చిక్కేమిటంటే .. భారత దేశములో ఉన్న కమ్యూనిష్టు ఇంఫ్లూయెన్స్. వారు ప్రతీ రోజు సంస్కరణలకి అడ్డుతగులుతూ ... ఏదీ సక్రమంగా జరగనివ్వకుండా సగం సగం మాత్రమే అమలయ్యేలా కృషి చేస్తూ ఉంటారు. దాని వలన లాభాల కన్నా నష్టాలే ఎక్కువ ఉంటాయ్.
ఇక అయాన్ రాండ్ థియరీ అనేది తూ.చా తప్పకుండా పాటించాలని రూలేం లేదు. లిబర్టేరియన్స్ కొన్ని ఒబ్జెక్టివిజం ప్రిన్సిపుల్స్ ఫాలో అవుతారు అంతే, అది కూడా అమెరికన్ లిబర్టేరియన్లలో కొంత మంది. పూర్తిగా ఓబ్జెక్టివిజాన్ని ఫాలో అవ్వాల్సిన పనిలేదు.
నెహ్రూ గారు భారతీయ రైల్వేలని జాతీయీకరించింది లిబర్తేరియనిజం తెలియక కాదు. రైల్వేవాళ్ళు పల్లెటూర్లలోని కొన్ని రైల్వే స్తేషన్‌లని agentsకి అప్పగించి ticket అమ్మకానికి ఇంత అని కమిషన్ ఇస్తారు. ఆ స్తేషన్‌లకి పెద్ద ఆదాయం రాకపోయినా రైల్వేలకి పెద్ద నష్టం రాదు. హైదరాబాద్ MMTS లేదా బొంబాయి లోకల్ విషయానికి వద్దాం. మలక్‌పేట లాంటి రైల్వే స్తేషన్ ఒకటి నడపాలంటే ఇద్దరు ticket clerks, ఒక signal operator, ఒక రైల్వే పోలీస్, ఒక toilet cleaner cum sweeper ఉండాలి. ఆ స్తేషన్‌లో toilet cleaner cum sweeper తప్ప మిగితావాళ్ళందరూ white collar ఉద్యోగులు. ఒక white collar ఉద్యోగి జీతం నెలకి పదిహేను వేలు అనుకుందాం. నలుగురు white collar ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికే రైల్వేవాళ్ళకి నెలకి అరవై వేలు ఖర్చైపోతుంది. Tickets అమ్మడం వల్ల అంత ఆదాయం రాకపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వం భరించగలదు కానీ ప్రైవేత్‌వాడు భరించలేడు. ప్రైవేత్‌వాడు లాభం చూసుకునే దేన్నైనా నడుపుతాడు కాబట్టే నెహ్రూ & ఇందిర జాతీయీకరణ విధానాన్ని పాటించారు. అంతే కానీ వాళ్ళేమీ లిబర్తేరియనిజం గురించి తెలియనివాళ్ళు కాదు. కొరియా యుద్ధం సమయంలో నెహ్రూ అమెరికానే సమర్థించాడు. ఇందియాలో చక్కెర కర్మాగారాలు పెట్టడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అమెరికా అందించలేదు అనే కారణంతో నెహ్రూ రష్యాకి దగ్గర అయ్యాడు. అంతే కానీ చాలా మంది అనుకుంటున్నట్టు నెహ్రూ ఫేబియన్ కాదు. నెహ్రూ జార్జ్ బెర్నార్ద్ షా, హె.జి.వెల్స్‌ల అభిమానే కావచ్చు కానీ అతను ప్రాథమికంగా పెట్టుబడిదారీ వ్యవస్థనే నమ్మినవాడు.
Deleteచరిత్రని చరిత్రలా కాకుండా పురాణంలా చదివితే ఇలాంటి పులుముడు ధియరీలే వస్తాయి!శశి ధరూర్ బ్రిటిషు వాళ్ళని ఫైను కట్టాలి అని గర్జించగానే మోదీ దగ్గిర్నుంచి అందరూ చప్పట్లు కొట్టారు!అసలు బ్రిటిషు వాళ్ళు అడిగారా?మీరు మా తరపున యుధ్ధం చెయ్యాలి అని వాళ్ళ మీద యుధ్ధం చేస్తున్న భారతీయుల్ని అడగడానికి వాళ్ళకేమైనా పిచ్చా?
ReplyDeleteపరమ అహింసావాదీ యిన గాంధీకి యుధ్ధం అంటే మాత్రం మహా ఇష్టం,యెందుకో నాకు అర్ధం కాలేదు!.మీరు తెలుసుకుని చెప్పగలిగీతే నా సందేహమొకటి తీరుతుంది.ఈ పెద్దమనిషే ఇండియన్లని పనిగట్టుకుని యెక్కేసి మరీ పంపిస్తే వెళ్ళి యుధ్ధలో పాల్గొన్న పిచ్చిమూక అక్కడ చచ్చినవాళ్ళు?!గట్టిగా ఫైను కట్టాల్సిందే అంటే ఆ గాంధీ యే పార్టీ వాడో ఆ పార్టీ తల తాకట్ట్టు పెట్టి నిధులు పోగేసి చచ్చిపోయిన పిచ్చివాళ్ళ కుటుంబాలకి కట్టాలి.
ఆయనగారి శుషుడి దగ్గిర్నుంచి ఇప్పటి భాజపా వరకూ అందరికీ లిబర్తేనియన్ ఐడియాలజీ అంట్గడుత్న్న ప్రవీణ్ ఉరఫ్ మార్క్సిస్టు లెనినిస్టు ఉరఫ్ ఇన్సెస్ట్ ప్రేమికుడికి యెర్ర జోహార్లు?!
ముందు ఎకనమిక్సు అనే తండ్రి గురించి సరిగ్గా తెలుసుకుంటే ఆ తర్వాత దాన్నుంచి పుట్టిన బిడ్డ కమ్యునిజం గురించి తెఉస్తుంది!
పిన్నిని మాతరమె పెళ్ళాడాలని కలలుగన్న ఈ అర్ధపాండిత్యం పెద్దమనిషితో వాదించటానికి ఇంతమంది పన్లు మానుకుని మరీ వస్తున్నారా?
IT ఉద్యోగుల శ్రమను ఉపయోగించి వారి మీదే మీ అక్కసు వెళ్ళ గక్కుతున్నారు. ఏ prodution సర్వర్ డౌన్ అయిన, ఏదయినా అప్లికేషను పని చెయ్యకపోయినా, ఏ డేటాబేస్ corrupt అయిన AC లో కూడా చెమటలు పట్టే ఉద్యోగాలు మావి. ఏ ఉద్యోగానికి అవసరం లేనంతగా, నిత్య విద్యార్థుల్ల రోజుకు రోజుకు అప్డేట్ అయ్యే పరస్థితి మాది. ప్రాజెక్ట్ అయిపోగానే ఉద్యోగం ఉడుతుందో, ఉంటుందో తెలియని స్థితి మాది. ఎవడికి పట్టింది నీ కమ్యునిజం? విప్లవం? అది కాకుండా ఎంతో మంది మిత్రులు అడుగుతున్నట్లు, 1 లేదా 2 % లో ఉన్నా IT ఉద్యోగులే వ్యతిరేకిస్తున్నారు అని ఎందుకు భావిస్తున్నారు? మీ ఉద్దేశ్యంలో IT ఉద్యోగి కాని ప్రతి వాడిలో భావ జాలం ఉంటే, ఎందుకు కమ్యూనిజం ఈ దేశంలో నిలబడలేదు? వీటికి సూటిగా సమాధానాలు చెప్పండి. అంతే కాని మీకు తెలిసిన ఎన్నో విషయాలు, అప్రస్తుతంగా వివరించి, విషయాన్నీ పక్క తోవ పట్టించకండి. ఇంకో విషయం, వేరే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరూ పని వెళ్ళల్లొ ఎ మాత్రం సమయం వృధా చెయ్యటం లేదా? పగలు, రాత్రి, శని, అది వారాలు తేడా లేకుండా గొడ్డు చాకిరీ చేసేది IT ఉద్యోగులు. అందుకే వారికి అంతేసి జీతం. ఏ రంగం లో అయిన శారీరక శ్రమ చేసే వాడి కంటే, మానసిక శ్రమ చేసే వాడికే పైకం ఎక్కువ. అలా అని నేను శ్రామికులను కించ పరచటం లేదు. కాని IT ఉద్యోగుల కష్టాలు వేరు. బంగారు పంజరంలో చిలకను పెట్టి, బాగా సుఖ పడి పోతోంది అన్నట్లు ఉంది మీలో కొందరి వాదన.
ReplyDelete100% నిజం
DeleteIT ఉద్యోగం కొందరికి ఈజీ మనీ ఇస్తుంది. నాకు తెలిసిన ఒక వైశ్య కులస్తుడు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగుస్తుడైనా అతనికి పెళ్ళి సంబంధం దొరకలేదు. అతని కులానికి చెందిన అమ్మాయిలందరికీ IT ఉద్యోగులే కావాలట!, IT లేకపోయే ప్రభుత్వ ఉద్యోగస్తుడు అయ్యి ఉండాలట! నాకు ఆశ్చర్యం కలిగింది. కోమటోడు వ్యాపారం చేసుకునైనా బతకగలడు, అతనికి కూడా ప్రభుత్వ లేదా IT ఉద్యోగం ఉండాలనే sentiment ఏమిటి అని! IT ఉద్యోగులు కోటి రూపాయలు కట్నం ఎందుకు అడగగలుగుతున్నారో నాకు అప్పుడు అర్థమైపోయింది. IT ఉద్యోగులు జనాభాలో 1% మాత్రమే ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా జనాభాలో 1% ఉంటారు. కానీ పట్టణ ప్రాంత జనాభా (దేశంలో 30%)లో ప్రతివాడు తన కూతురిని ప్రభుత్వ లేదా IT ఉద్యోగికే ఇచ్చి పెళ్ళి చెయ్యాలనుకుంటాడు. పల్లెటూర్లలో చాలా మందికి IT గురించి తెలియదు కాబట్టి వాళ్ళు సాధారణ ప్రైవేత్ ఉద్యోగికైనా తమ కూతురిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఆ కోమటోడు చేసేది white collar ఉద్యోగం. అతను పల్లెటూరి స్త్రీని పెళ్ళి చేసుకోలేడు. కానీ అది ప్రైవేత్ ఉద్యోగం కావడం వల్ల పట్టణ ప్రాంత స్త్రీలు అతన్ని నపుంసకుణ్ణి చూసినట్టు చూస్తున్నారు. అదీ మన దేశంలో ప్రభుత్వ & IT ఉద్యోగాల మీద ఉన్న మోజు.
Deleteఐ.టీ ఉద్యోగులకు మాత్రమే ఈజీ మనీ లభిస్తున్నదా? వారూ దోపిడీకి గురవుతూనే ఉన్నారు కదా?
Deleteఈజీ మని అంటే? ఎవడబ్బా సోమ్మయిన దోచుకున్నమా? పనిలో ఒత్తిడి తట్టుకోలేక ముప్పయెళ్ళకె గుండె జబ్బులు, రక్త పోటు, షుగర్ లాంటి జబ్బుల పాలవుతున్నాం. అందుకే మాకు ఆ మూల్యం. మిగత వారికీ పెళ్ళిళ్ళు కావటం లేదా? లేక IT వాళ్ళు ఎమన్నా పక్కోడి సంబంధాన్ని చెడగొట్టి చేసుకుంటున్నారా? వరకట్నం అనేది చేసుకొనే వాడి హోదాను బట్టి, ఇచ్చే వాడి తాహతు ను బట్టి ఉంటుంది. ప్రతి IT ఉద్యోగి కోట్లు కట్నం తీసుకోవటం లేదు, ఎవడు ఇవ్వటం లేదు. గవర్నమెంట్ ఉద్యోగానికి ఉన్నా క్రేజ్ ఇప్పటికి దేనికి లేదు. అయినా విషయం ఒక్కటి రాసి, అడిగినా వాటికి సూటిగా సమాధానం చెప్పలేని, మీలాంటి వారితో వాదన శుద్ధ దండుగ.
Deleteకొండలరావు గారు, ఇందియా ఆర్థికంగా ఎంత వెనుకబడి ఉంటే సామ్రాజ్యవాదులకి ఇందియాలో అంత చీప్ లేబర్ దొరుకుతుంది. ఇందియా ఆర్థికంగా వెనుకబడి ఉంటేనే ఇక్కడి IT కంపెనీలకి off-shore projects వస్తాయి. IT ఉద్యోగులు after all ఆర్థిక అసమానతల వల్ల అవకాశాలు అందుకున్నవాళ్ళు. వాళ్ళు తమకి ఉన్న అవకాశాల్ని ఎలా వదులుకుంటారు? "మనిషి తనకి ఏమి కావాలో తెలియనంత అవచేతనావస్థలో ఉండడు. అలాగైతే మనిషికీ, రైలు పట్టాల మీద ఎదురుగా వస్తోన్న రైలుకి అడ్డంగా నిలిచి ఉన్న బర్రెకీ మధ్య తేడా ఉండదు" అంటుంది Ayn Rand. వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళు ఆలోచించుకుంటేనే మనిషి ప్రాథమికంగా భౌతికవాది అనే నిజం తెలుస్తుంది. అందుకే ఆ సాఫ్త్‌వేర్ ఇంజనీర్లని చూస్తే నాకు భయం వెయ్యదు.
Deleteప్రవీణ్,
Deleteమీ సిద్ధాంతం ప్రకారం... '
కమ్యూనిజం ఉంటే ఆర్థిక అసమానతలు ఉండవు.
అవి లేక పోతే IT అవుట్‌సోర్సింగ్ ఉండదు.
అవుట్‌సోర్సింగ్ ఉండక పోతే IT వారికి ఉద్యోగాలు ఉండవు.
అందుకనే IT వారు కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తారు.
అవునా?
క్యూబాలో 60 ఏళ్ళనుండి కమ్యూనిస్టు పరిపాలన వుంది.
అంటే అక్కడ ఆర్థిక అసమానతలు ఉండే అవకాశం లేదు.
కాని అక్కడ జోరుగా అవుట్‌సోర్సింగు నడుస్తోంది.
(See: Cuba fast becomes a hotbed for IT outsourcing).
ఇప్పటికైనా మూసుకుంటారా?
అది కాదండి బాబు అడిగినదానికి ఆన్సర్ చెప్పండి. మీరు ఏమి చేసారో ఎందుకు దివాలా తీసారో మాకెందుకు. వీటికి సూటిగా సమాధానాలు చెప్పండి.
Delete1 లేదా 2 % లో ఉన్నా IT ఉద్యోగులే వ్యతిరేకిస్తున్నారు అని ఎందుకు భావిస్తున్నారు? మీ ఉద్దేశ్యంలో IT ఉద్యోగి కాని ప్రతి వాడిలో భావ జాలం ఉంటే, ఎందుకు కమ్యూనిజం ఈ దేశంలో నిలబడలేదు?
పైన ప్రశ్నలు ప్రవీణ్ గారికి
Delete>>> Even China did foolish things like undervaluation of currency. Did I justify them? Why do I uphold Cuba for such decisions?
Deleteకాలినోడికి నొప్పి తెలుస్తుంది, మీక్కాదుగా? చైనా తగ్గించుకుంది అంటే దానికి కారణం కూడా వుంటుంది. అయినా ఇక్కడ ప్రశ్న అది కాదు.
కమ్యూనిస్టు దేశాల్లో కూడా IT అవుట్‌సోర్సింగ్ ఉన్నపుడు IT వారు "మాత్రమే" ఎందుకు కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తున్నారు? కమ్యూనిస్టు దేశంలో అవుట్‌సోర్సింగ్ ఉండదన్న మీ వాదనని ఇప్పటికైనా వెనక్కి తీసుకుంటారా?
This comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDelete@Chari, Even China did foolish things like undervaluation of currency. Did I justify them? Why do I uphold Cuba for such decisions?
ReplyDeleteకొండలరావు గారు, తెలంగాణా ఉద్యమం కేవలం ఒక అస్తిత్వవాదం. సమైక్యాంధ్రవాదులకి తెలంగాణాని వ్యతిరేకించడానికి హైదరాబాద్ తప్ప ఏ కారణం దొరకలేదు కనుకనే తెలంగాణావాదం గెలిచింది. ఆఫ్రికాలోనో, దక్షిణ అమెరికాలోనో కొంత మంది క్రైస్తవ లేదా ఇస్లామిక్ నాయకులు జాతి పేరుతో ప్రజలని ఏకం చేసి స్వాతంత్ర్య పోరాటం నడుపుతారు. వలసవాదులు దేశం వదిలి పారిపోయిన తరువాత ఆ మత నాయకులే కొత్త పాలక వర్గంగా మారి కొత్త రూపంలో దోపిడీ కొనసాగిస్తారు. తెలంగాణలో తెరాస చేసేది అదే.
ReplyDelete< తెలంగాణలో తెరాస చేసేది అదే > సరిగా చెప్పారు. తెలంగాణాలో కొత్త దోపిడీ మొదలయింది. అక్కడ చంద్రబాబు కుటుంబం ఇక్కడ కె.సి.ఆర్ కుటుంబం కనుసన్నలలో పాలన సాగుతుంది. వీరిద్దరి భక్తులు ఆయా ప్రభుత్వాల నిర్ణయాలకు అనుకూలంగా అభిప్రాయాలను వండివార్చుతుంటారు. పేరుకు ప్రజాస్వామ్యం పెత్తనం , దోపిడీని కూడబెట్టుకునేడి 2 కుటుంబాలు - వారి వంధి మాగధులు మాత్రమే.
Deleteజాతి నాయకుని మనవడైన రాజీవ్ గాంధీ ప్రపంచ బ్యాంక్‌కి అప్పులు అడగగా లేనిది అలాంటి పనే కె.సి.ఆర్. చెయ్యడం కూడా విచిత్రం కాదు. మతం, జాతి, ప్రాంతం కేవలం ఉపరితల అంశాలు. ముస్లిం దేశాలన్నిటిలోనూ అల్-ఖైదా అధికారంలోకి వచ్చినా ఆ దేశాల్లో అమెరికన్ కంపెనీలు స్వేచ్ఛగా చమురు తవ్వుకుంటాయి.
Deleteతెలంగాణావాదానికీ, కమ్యూనిజంకీ మధ్య చాలా తేడా ఉంది. తెలంగాణా నిజంగా రాదనుకుని తెరాసలో పని చేసిన విజయశాంతి, జగ్గారెడ్డి లాంటి సమైక్యవాదులు ఉన్నారు కానీ కార్మిక వర్గ విప్లవం నిజంగా రాదనుకుని మావోయిస్త్ పార్తీలో చేరే విప్లవ విరోధులు ఉండరు. వర్గం విషయంలో ఎవడూ అంత రిస్క్ తీసుకోడు.
ఇంకో మాట, ఒక ఆంధ్రా నాయకుని కొడుకుని తెలంగాణాకి ముఖ్యమంత్రిని చెయ్యాలనుకున్నవారిలో ఒకరైన సండ్ర వెంకటవీరయ్య కూడా ఒకప్పుడు తెరాసలో చేరాలనుకున్నాడు. పిడమర్తి రవి సొంత ఊరు కూడా సత్తుపల్లే. పిడమర్తి రవి ఉంటే తెరాస తనకి ప్రాధాన్యత ఇవ్వదని భావించి అతను తెలుగు దేశంలో ఉండిపోయాడు.
DeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteఈ వ్యాఖ్య ఎందుకు తొలిగించారు? రాష్ట్రం విడిపోతుందని తనకి ముందే తెలుసనీ, ఆంధ్రాకి నిధులు అడుగుదాం అని చెపితే కిరణ్ కుమార్ రెడ్డి వినలేదనీ బొత్స సత్యనారాయణ కూడా చెప్పుకున్నాడు. నేను అతని కంటే స్పష్టంగా మాట్లాడాను, అదే తేడా. ఆంధ్రా కోసం నిధులు అడుగుదాం అని బొత్స చెప్పినప్పుడు కూడా ఒక్కడైనా విన్నాడా?
ReplyDelete< ఈ వ్యాఖ్య ఎందుకు తొలిగించారు? > మీరు ఐ.టి ఉద్యోగులకే కమ్యూనిజంపై ఎందుకు వ్యతిరేకత ఉందో శ్రీకాంత్ చారి గారు అడిగినదానికి సూటిగా సమాధానం ఇవ్వకుండా టాపిక్ డైవర్ట్ చేస్తున్నందున అనవసర వ్యాఖ్యలు తొలగించేక్రమంలో మీ వ్యాఖ్య తొలగించాను. శ్రీకాంత్ చారిగారు % ల గురించి చెప్తుంటే నేను తెలగాణా ఓటింగ్ విషయం ఉదాహరణగా చెప్పాను. అలా కాకున్నా దేవుడిని నమ్మని వారి శాతం చాలా తక్కువ. అంత మాత్రాన మెజారిటీ ఒప్పుకుంటున్నారు కనుక దేవుడున్నాడనేది నిజమని శ్రీకంత్ చారి గారు నమ్ముతారా? ఇక్కడ ఓ సిద్ధాంతాన్ని చర్చించేటపుడు ఎంతమంది నమ్ముతున్నారనేది ముఖ్యం కాదని చెప్పడమే నా ఉద్దేశం. మీరు అసలు విషయం వదిలేసి దానికి శ్రీకంత్ చారి గారి లాజిక్ కి సమాధానం చెప్పకుండా తెలంగాణా పైకి వాదనను నడిపితే ఈ పోస్టుకు సంబంధం లేని చర్చ కాదా?
Deleteసామ్రాజ్యవాద దేశాలు ఇతర దేశాలనుండి అప్పనంగా దోచుకున్న సొమ్ముతో డిమాండ్ కు మించి కూడా వారికి లాభాలు తెచ్చే వాటిలో జీతాలు ఇవ్వగలరు. ఆ దేశాలతో వర్ధమాన దేశాలు పోటీ పడడం అసాధ్యం. ఐ.టీ ఉద్యోగులంతా దేశభక్తిని కలిగి ఉంటారని కానీ లేదని కానీ మీరెలా జనరలైజ్ చేయగలరు? కార్మికులే కార్మికవర్గ పార్టీలకు దూరంగా ఎందుకుంటున్నారో ఆలోచించాలి. ఎవడి బాధ వాడిది - ఎవడి కష్టంవాడిది - ఎవడి గోల వాడిది - ఎవడి గోల్ వాడిది అయిన వ్యక్తివాద సమాజంలో సమిష్టి భావజాలాన్ని ఎక్కించడమంత తేలిక కాదు. పైగా మీరు వాదించేతీరు అసంబద్ధంగా ఉన్నది. ఐ.టీ ఉద్యోగులే బాగోలేనట్లు చెప్తున్నారు. ఐ.టి ఉద్యోగులు అనవసరంగా శరీరాన్ని మెదడుని అవసరానికి మించిన పని ఒత్తిడితో నష్టపరచుకుంటున్నారు. అందరికీ పని అందరికీ విశ్రాంతి అనేది ఇవ్వలేని మార్కెట్ వ్యవస్థ మనిషి మెదడుని సృజనాత్మకంగా కాక డబ్బుని సంపాదించే స్పీడ్ మిషన్ లా పని చేస్తుంది. ఆలోచనలన్నీ డబ్బు చుట్టూ తిరిగేలానే చేస్తాయి. దానికి ఐ.టీ ఉద్యోగులని ప్రత్యేకించి మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు అర్ధం కాలేదు. పోనీ మీరేమైనా వివరించగలిగారా? అదీ లేదనేదే నా అభిప్రాయం.
నాకు ముసుగులు ఏమీ లేవు. 1% జనాభా ఉన్న IT పరిశ్రమతో కూడిన తెలంగాణా మా రాష్ట్రం నుంచి విడిపోతే మా రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ లేదు. అందుకే సమైక్యాంధ్రవాదం వైపు పోవద్దని నాకు రైలులో పరిచయమైన సమైక్యవాదులకి చెపుతుండేవాణ్ణి.
Deleteఇతర దేశాలకి చవక సేవలు అందించడం compradorship (దళారీతనం) అవుతుంది కానీ అది పెట్టుబడి యొక్క అభివృద్ధి అవ్వదు. కేవలం మూడున్నర లక్షల మంది ఉన్న IT పరిశ్రమ కోసం ఐదు కోట్ల మంది ఆంధ్రులకి మూడున్నర కోట్ల మంది తెలంగాణా పౌరులపై విద్వేషం రెచ్చగొట్టగలిగారంటే దాని అర్థం జనంలో ఇంకా subjectivism (విషయగతవాదం) ప్రబలంగా ఉందనే కదా! ఆంధ్రాలో జై సమైక్యాంధ్ర పార్తీ గెలవలేదు. అదొక్కటే తెలంగాణావాదాన్ని సమర్థించిన ఆంధ్రునిగా నాకు సంతోషం కలిగించే విషయం.
IT ఉద్యోగుల సంఖ్య 1% కంటే తక్కువే. కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన లెక్క ప్రకారమే హైదరాబాద్, విశాఖపట్నంలలో మూడున్నర లక్షల మంది IT ఉద్యోగులు ఉన్నారు. వారిలో 95% మంది ఉండేది హైదరాబాద్‌లోనే. ఆ లెక్క ప్రకారం విశాఖపట్నంలో IT ఉద్యోగుల సంఖ్య పదిహేడున్నర వేలే. తెలంగాణలోనే IT ఉద్యోగుల సంఖ్య 1% కంటే తక్కువ అయితే ఆంధ్రాలో ఆ సంఖ్య 0.1% కంటే కూడా తక్కువే.
ReplyDelete