జై గారు అనారోగ్యంతో అకాల మరణం పొందారని శ్యామలరావు గారి ద్వారా తెలుసుకున్నాను. చాలా బాధపడ్డాను. ఆయనతో ముఖాముఖి పరిచయం లేకున్నప్పటికీ బ్లాగు పరంగా మంచి మిత్రుడు. ఎన్నో విషయాలలో ఆయన వాదనలతో విభేదాలున్నప్పటికీ ఆయననుండి చాలా నేర్చుకున్నాను. బ్లాగు విషయంలో ఎప్పుడు ఆయన ప్రోత్సాహం అందించేవారు. తెలియని విషయాలు అడిగితే ఆయనకు తెలిసినవి మాత్రం చెప్పేవారు. జై గారి పూర్తి పేరు, ఫోటో ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఇవ్వడానికి ఇష్టపడలేదు. తరువాత చాలా సందర్భాలలో మెయిల్ ద్వారా విషయాలు పంచుకున్నప్పటికీ ఆయన పూర్తి పేరేమిటో, ఎలా ఉంటారో కూడా తెలియదు. శ్యామలరావుగారి ద్వారా ఆయన ఫోటో, పూర్తి పేరు వివరాలు తెలిశాయి. శ్యామలీయం సర్ కు ధన్యవాదములు. జై గారికి జోహార్లు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. శ్యామలీయం సర్ సూచన మేరకు ఈ ఇంటర్వ్యూను రీ పబ్లిష్ చేస్తున్నాను.
- పల్లా కొండల రావు
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ =================================
 
జై లేదా జై గొట్టిముక్కల. ఈ పేరు తెలుగు బ్లాగర్లకు పెద్దగా పరిచయం అవసరం లేనిది. తెలంగాణా తరపున బ్లాగు ప్రపంచంలో ముందు వరుసన ఉండే గొంతు. తెలుగు బ్లాగర్లను ఇంటర్వ్యూ చేయాలన్న 'పల్లెప్రపంచం' ప్రయత్నంలో భాగంగా 'జై' గారిని ఇంటర్వ్యూ చేయడానికి నిర్ణయించుకున్నాక ఆయనిచ్చిన సమాధానం నాకు తెలుగు బ్లాగు లేదు తెలుగు బ్లాగర్ని కాదు కదా? అని. అప్పటిదాకా ఆయనకు తెలుగులో బ్లాగు లేదనే విషయం నాకు జ్ఞప్తికి రాలేదు.  'జై' కి తెలుగు బ్లాగు లేకున్నా మీరు తెలుగు బ్లాగు ప్రపంచానికి కామెంట్ల ద్వారా సుపరిచితులు కనుక ఇంటర్వ్యు కొనసాగిద్దామంటే సరేనని ఓపికగా పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 'తెలంగాణా పక్షపాతి' అయిన 'జై' అనేక విషయాలపై అవగాహన ఉన్నవారు. తనదైన శైలిలో తాను చెప్పదలచుకున్నదానిని ఎక్కడైనా వాదించగలిగేలా రాటుదేలిన ఆయన వాదన విషయంలో ఇతరులెవరైనా కించపరచినా ముందుకే సాగాలంటారు. ఆ మేరకు ఈ వెబ్ పోర్టల్ నడవడానికి కూడా ప్రోత్సహించి కారకులయినందుకు ఈ సందర్భంగా పల్లెప్రపంచం తరపున మరోసారి కృతజ్ఞతలు. 'జై'  తో పలు అంశాలపై పల్లెప్రపంచం నిర్వహించిన ఇంటర్వ్యూ దిగువన ఇస్తున్నాము. పాఠకుల నుండి ప్రశ్నలను ఆహ్వానించగా కేవలం నీహారిక గారు మాత్రమే ప్రశ్నలు పంపారు. నీహారిక గారు అడిగిన ప్రశ్నలకు బ్రాకెట్లో పేరు ఇవ్వడం జరిగింది.



ప్ర - మీ పేరు?
.  జై గొట్టిముక్కల. పూర్తి పేరు పాస్‍పోర్ట్ లాంటి వాటికి మాత్రమే వాడుతాను.

ప్ర - మీ తల్లిదండ్రుల వివరాలు?
. మా నాయన మెడికల్ సేల్సుమాన్, చాలా ఏళ్ల కిందటే పోయారు. అమ్మ గృహిణి.

ప్ర - మీ జన్మస్థలం?
. హైదరాబాద్.

ప్ర - ప్రస్తుత నివాసం?
. హైదరాబాద్

ప్ర - విద్యార్హతలు - విద్యాభ్యాసం వివరాలు?
జ. బీటెక్ (ఎలక్ట్రానిక్స్), ఎంబీయే

ప్ర - మీ వివాహం, ఇతర కుటుంబ వివరాలు?
జ. నా భార్య గృహిణి. ఒకే కూతురు, పదోతరగతి చదువుతున్నది.

ప్ర - మీ ఉద్యోగ వివరాలు?
జ. నేను మార్కెటింగ్, పర్చేస్ & క్వాలిటీ రంగాలలో పనిచేసాను. ప్రస్తుతం ఒక మధ్యతరహా ఐ.టీ కంపనీలోఉన్నాను.

ప్ర - మీ హాబీస్  ?
జ. కాలేజీ రోజులలో క్రికెట్, షటిల్ & టేబుల్ టెన్నిస్ ఆడేవాడిని (ఒక మోస్తారుగానే లెండి). ఇప్పుడు టేబుల్ టెన్నిస్ మాత్రమే. అదీ అప్పుడప్పుడు ఆడడానికి మాత్రమే సమయం దొరుకుతుంది.

కాలేజీలో క్విజ్ & డిబెటులలో చురుగ్గా ఉండేవాడిని. ఇప్పుడు కుదరడంలేదు.

ఆసక్తి కలిగిన విషయం ఏదయినా లోతుగా అధ్యయనం చేయడం నాకు ఇష్టం. ఒకప్పుడు బాగా చదివేవాడిని, ఈమధ్య అంతర్జాలంలో తప్ప పుస్తకాలు చదవడం కుదరడం లేదు.

కొత్త ప్రదేశాలు చూడడం అక్కడి సంస్కృతి / మానవసంబంధాలు తెలుసుకోవడం కూడా ఇష్టమే. ఉద్యోగరీత్యా అనేక రాష్ట్రాలు & దేశాలు వెళ్ళే అదృష్టం కలిగింది కనుక ఇది కొంతవరకు సాదించగలిగాను. గత 8-9 సంవత్సరాలలో కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్ళడం అలవాటు అయ్యింది.

భాషలు నేర్చుకోవడమూ సరదాయే. కన్నడ, ఫ్రెంచ్ & తమిళం కొంతవరకు నేర్వగలిగాను కానీ ప్రావీణ్యం రాలేదు.

డ్రైవింగ్ & కారు సంబంధ విషయాలన్నాఆసక్తి ఎక్కువే. భారతదేశంలో లాంగ్ డ్రైవ్‍లకు అవకాశం అంతగా రాకపోయినా, విదేశాలకు వెళ్ళినప్పుడు తనివి తీరా వందలాది మైళ్ళు బండి తోలుతాను.

ప్ర - మీకు ఇష్టమైన ఆహారం?
జ. వెజిటేరియన్ ఏదయినా ఇష్టమే. శాకాలకంటే పప్పు/చారు ఎక్కువగా తింటాను. పాలు/పెరుగు నచ్చవు. స్వీట్లు కూడా నచ్చవు. కానీ చాకలేటు / ఐస్క్రీం & కరకరగా ఉండే స్నాక్స్ ఇష్టం. ఇటాలియన్, మెక్సికన్ & అరబ్బీ వంటలు కూడా సంతోషంగా తింటాను.

ప్ర - జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనది ఏది?
జ. సంతృప్తి

ప్ర - మీ జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనదేది అంటే ఏమి చెప్తారు?
జ. పరిశోధన,  జ్ఞానార్జన,  హేతుబద్ద ఆలోచనా విధానం.

ప్ర - మీకు ఇతరులలో నచ్చేవి ఏవి? నచ్చనివి ఏవి?
జ. తమ పనిపై మరియు తమ రంగంలో ఆసక్తి చూపుతూ నేర్చుకునే ప్రతి అవకాశాన్ని సద్వినియోగంచేసుకునేవారంటే నాకు అభిమానం.

మూర్ఖంగా వాదించేవారు నచ్చరు. కొందరు ప్రతిదాన్నిఅతి చేస్తారు. ఉ. మా బాసు అంత వెధవలు ఎవరికీ ఉండరు అంటారు. వీరిది అజ్ఞానం ( వీరు చూసిందే ఒకరిద్దరు బాసులను అనగా కూపస్తమండూకాలు), ఆత్మవంచన లేదా అతిశయోక్తి అయి ఉండాలి. ఇటువంటి వారికి సానుభూతి చూపడం నాకు చేతకాదు.

ప్ర - మీలో మీకు నచ్చేవి ఏవి? నచ్చనవి ఏవి?
జ. నాకు నేర్చుకోవాలనే జిజ్ఞాస & పట్టుదల ఉండడం మరియు సంబంధాలు మెయింటైన్ చేయడం నా అదృష్టంగా భావిస్తాను.

సోమరితనం & కోపిష్టితనం నాలో నాకు నచ్చని అతి పెద్ద విషయాలు.

మతిమరుపు (ఉ. స్నేహితుల పుట్టిన రోజులు గుర్తుండకపోవడం) పెద్ద డ్రా బాక్. ప్రతి విషయాన్ని సక్రమంగా ఉంచుకోవడం ద్వారా కొంతవరకు దీన్నిఅదుపు చేయగలిగాను.

నేను భయంకర సుత్తిగాడినని కొందరు మిత్రుల అభిప్రాయం. నిజమేనేమోనని నాకూ అప్పుడప్పుడు అనిపిస్తుంది.

ప్ర - మీ రోల్ మోడల్ ఎవరు?
జ. రోల్ మోడల్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఆల్బర్ట్ఐన్స్టీన్, బెర్ట్రాండ్రసెల్, ఎడ్వార్డ్డెమ్మింగ్, జోసెఫ్జూరాన్, ఫిలిప్కోట్లర్, పీటర్డ్రక్కర్, అబ్రహాంలింకన్, బాబాసాహెబ్అంబేడ్కర్, లోక్‍నాయక్ జయ ప్రకాశ్‍నారాయణ్, ఎం.ఎస్.స్వామినాధన్, వర్గీస్ కురియన్, బాబాఆంటే, సుందర్ లాల్ బహుగుణ్ , లీఐకోకా, రాల్ఫ్నేడర్, కాళోజీ నారారాయణరావు, నెల్సన్మండేలా, భాగ్యరెడ్డివర్మ, ప్రొఫసర్జయశంకర్, ఎన్నార్నారాయణమూర్తి, నానీపాల్కీవాలా, కత్తిపద్మారావు లాంటి మహనీయులు అంటే ఎంతో గౌరవం ఉన్నావారు నడిచిన బాట నేను ఎంచుకో(లే)ను. కనుక వారు నాకు రోల్మాడల్ అనలేను.

ప్ర - మీకు నచ్చే వృత్తి?
జ. యాదృచ్చికంగా అవకాశం దొరికిన క్వాలిటీ రంగంలో పనిచేయడం చాలా సంతృప్తినిచ్చింది. ప్రాసెస్ అంటే ఏమిటి? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రతి విషయంలోనూ ప్రాసెస్ ఎలా లాభిస్తుంది?లాంటి ఎన్నో విషయాలు నేర్చుకోగలిగాను. నేను గతంలో చదువు & అనుభవం ద్వారా తెలుసుకున్న మేనేజెమెంట్, మార్కెటింగ్ వగైరా సూత్రాలు నేను అనుకున్నట్టుగా వేర్వేరు కావని, అన్నిటినీ ఒక ప్రాసెస్ నమూనాలో (మాడల్) ఇమడ్చవచ్చని నాకు క్వాలిటీ రంగమే నేర్పింది. అలాగే ఒక విషయాన్ని అధ్యయనం ఎలా చేయాలో & నిర్ణయాలు ఎలా తీసుకోవాలో ఇక్కడికి వచ్చాకే తెలిసాయి.

ప్ర - మీరు డిప్రెషన్ కు గురైనప్పుడు రీచార్జ్ కావడానికేమి చేస్తారు?
జ. నాది థిక్ స్కిన్.  డిప్రెషన్ నా జోలికి వచ్చే ధైర్యం చేస్తుందా?

నాకు కోపం ఎక్కువ. కానీ, కాస్సేపటికే తగ్గిపోతుంది. అయితే నా కోపం ఎక్కువ సార్లు నా మీదే. కోపంగా ఉన్నప్పుడు ఇతరులను అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తాను.

ప్ర - మీ అభిమాన నాయకుడు?
జ. పైన రోల్ మోడల్ ప్రశ్నకు జవాబులో పేర్కొన్నవారందరూ & అక్కడ స్థలాభావంతో రాయనివారందరూ!

ప్ర - మీకు నచ్చిన సినిమా  ?
జ. సాంకేతిక విలువతో & చక్కని స్పీడుతో సాగే సినిమాలన్నీఇష్టమే. అధిక నాంచుడు, అనవసర పిడకల వేటలు లేదా ఓవరాక్షన్ ఉన్న సినిమాలు నచ్చవు. ఇటీవలి కాలంలో సినిమాలు చూడడం చాలా తక్కువయింది. మొన్నీమధ్య చాలా రోజుల తరువాత దియెటరుకు వెళ్లి చూసిన 'జురాసిక్ వరల్డ్'  బాగానే ఉందని అనిపించింది.

ప్ర - మీ అభిమాన నటీ నటులు ఎవరు?
జ. పాతవారిలో అమితాబ్ బచ్చన్, ఇప్పటి వారిలో ఖాన్త్రయం. తెలుగులో ఎస్వీరంగారావు, ఇప్పటి వారిలో మహేష్ బాబు.

ప్ర - మీ అభిమాన రచయిత ?
జ.  చాలామందే ఉన్నారు. కనుక చాంతాడంత సూచీ ఎందుకులెండి:)

ప్ర - మీకు నచ్చే రచనలు?
జ. హాబీ ప్రశ్నలో చెప్పినట్టు "ఆసక్తి కలిగిన విషయం ఏదయినా లోతుగా అధ్యయనం చేయడం నాకు ఇష్టం. ఒకప్పుడు బాగా చదివేవాడిని, ఈ మధ్య అంతర్జాలంలో తప్ప పుస్తకాలు చదవడం కుదరడం లేదు"

ప్ర -.మీరు సమాజసేవకు సమయం ఇవ్వగలరా? (నీహారిక)
జ నాకు సమాజసేవ అంటే ఏమిటో కూడా పెద్దగా తెలీదు:) కుటుంబ & ఉద్యోగ బాధ్యతల మూలాన ఇతర వ్యాపకాలు ఏవయినా ప్రస్తుతానికి కష్టమండీ.

ఈరోజు పెద్ద పెద్ద ప్రైవేటు బడులలో కూడా స్కూల్ బస్ డ్రైవర్ కంటే ప్రాధమిక టీచర్ల జీతం తక్కువ ఉండడం మన దౌర్భాగ్యం. ఎందరో ఉపాధ్యాయులు ఉన్న కుటుంబంలో పుట్టిన నాకు ఈ దారుణాన్ని ఎలా మార్చాలో అనిపిస్తూ ఉంటుంది. కుదిరితే భవిష్యత్తులో ఈ దిశగా పని చేస్తాను.

బాలల హక్కులు (ఉ. తలతిక్క పోటీ చదువులు) & భావి తరాల హక్కులు (ఉ. పర్యావరణ రక్షణ) కూడా నాకు నచ్చే విషయాలు. ఏమయినా టైము దొరకాలి!

ప్ర -. తెలంగాణా విభజన తరువాత మీరు సంతోషంగా ఉన్నారా? (నీహారిక)
 తెలంగాణా ఆవిర్భావం (విభజన కాదండోయ్!) అనే ఒక చారిత్రిక ఘట్టానికి ప్రత్యక్షసాక్షిని కావడం నా అదృష్టం. ఇక సంతోషం అనేది రిలేటివ్, సంపూర్ణ తెలంగాణా రానందుకు పూర్తి సంతోషం అయితే లేదు.

ప్ర - జై వాదించారు అంటే ఖచ్చితంగా ఆంధ్రాకు వ్యతిరేకంగా మాట్లాడుతారు...... అంటే మీరేమి చెపుతారు?
జ. ఇతర రాష్ట్రాల ప్రయోజనం కంటే నాకు తెలంగాణా ముఖ్యం. నాకు మిగిలిన 27 రాష్ట్రాలెంతో ఆంధ్రా అంతే, ప్రత్యేక ప్రేమ / ద్వేషం రెండూ లేవు. అన్యాయం జరగనంత వరకు నేను తెలంగాణా ప్రయోజనానికి అనుకూలం. ఉ. ఆల్మాటీ వివాదంలో కర్నాటక వైపు న్యాయం ఉంది కనుక నేను తెలంగాణా వైపు నిలబడలేదు.

మరో రెండు ముఖ్య విషయాలు గమనించాలి :

1. అనేక విషయాలలో నేను సంబందిత అంశం (ఉ. సాగునీరు) పరిశోదించాకే స్టాండ్ తీసుకున్నాను. ఇలాంటి కేసులలో నా వాదన వెనుక ఉన్న విషయాలన్నీ ముందు పెడ్తాను. వాటిని విమర్శించలేని వారు నన్ను టార్గెట్ చేస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తాను.

2. నాకు బొత్తిగా తెలియని విషయాలు (ఉ. గిర్గ్లానీ) జోలికి నేనెప్పుడూ పోలేదు, మున్ముందు పోను కూడా.

ప్ర - మీకు NTR అన్నా, తెలుగుదేశం అన్నా బద్ధ వ్యతిరేకమా? ఆంధ్రా ప్రాంతం అంటేనే జై కు గిట్టదు అనే విమర్శకు మీ సమాధానం?
జ.  కారంచేడు దమనకాండ & బషీర్బాగ్ కాల్పులు, టీ.డీ.పీ కి మాయని మచ్చలు. ఎన్టీఆర్ / చంద్రబాబు / టీడీపీ భజనపరులు చేసే హైపు చూస్తే అప్పుడప్పుడూ కాస్త విసుగేస్తుంది. పార్టీవారు చెప్పుకోవడం వేరేకానీ తటస్తులమనేవారు కూడా వంత పాడడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఇవి మినహా నాకు ఎన్టీఆర్ / చంద్రబాబు / టీడీపీ అంటే ప్రత్యేకమయిన ద్వేషం లేదు. నేను ఆంధ్రకు వ్యతిరేకం కాదని పైనే చెప్పాను,మళ్ళీ విపులీకరణ అవసరం లేదు.

ప్ర - మీ లక్ష్యం ఏమిటి?
జ. నిరంతరాన్వేషణ నా మార్గం అనుకుంటాను. కనుక లక్ష్యమంటూ లేదు. నా వల్ల కొంత నేర్చుకున్నామని దానితో తమకు కొద్దో గొప్పో ప్రయోజనం కలిగిందని కొందరయినా అనుకోవాలనే కోరిక మాత్రం ఉంది.

ప్ర – మీకు తెలుగులో బ్లాగు లేకపోవడానికి కారణం?
జ. నాకు తెలుగు రాయడం అంత బాగా రాదు. తొలుత కామెంట్లు కూడా ఇంగ్లీషులో రాసేవాడిని. శ్యామలీయం మాస్టారు లాంటి పెద్దల ప్రోత్సాహంతో నెమ్మదిగా తెలుగులోవ్యాఖ్యలు రాసే సాహసం చేసాను.

పైగా నా బ్లాగులలో అభిప్రాయం తక్కువ (లేదా సున్నా) & అధ్యయన ఫలితాలు ఎక్కువ (లేదా దాదాపుగా మొత్తం) ఉండాలని అని నా తపన. అధ్యయనం చేసే ఇంగ్లీషులోనే బ్లాగు రాస్తే నాకూ సులువు. మీ ప్రోద్బలంతో ఒకసారి ఆంగ్ల టపాను అనువాదం చేసాను. కానీ సోమరితనం చేత మళ్ళీ చేయలేదు.

ఒకవేళ భవిష్యత్తులో తెలుగులో రాసినా సెపరేట్ బ్లాగు పెట్టకపోవచ్చు.

ప్ర - మీ బ్లాగుల పేర్లు?
జ. Jai's blog -  jaigottimukkala.blogspot.in

ప్ర - మీ బ్లాగుల లక్ష్యం ఏమిటి?
జ. ఏముందండీ! 'తెలిసింది పంచుకోవడం', 'అవతలివారి దగ్గర తెలుసుకోవడం' - ఈరెండే.

ప్ర - మీకు బ్లాగు వ్రాయాలని కోరిక ఎలా కలిగింది?
జ. నేను సోషల్మీడియాలో లేను. అప్పుడప్పుడు బ్లాగులు చదివేవాడిని. కామెంట్లు పెట్టడం మొదలుపెట్టాక అవేవో బానే ఉన్నట్టున్నాయి కనుక నేనే టపాలు రాస్తే పోలా అనిపించింది. అప్పటిలో వ్యాఖ్యలకు టపాలకు ఉన్న భూమ్యాకాశాల తేడా తెలీక ఇరుక్కున్నాను :)

తెలంగాణా నదీ జలాలు & సాగునీటి వాటా అంశాలపై నేను సుదీర్ఘ అధ్యయనం చేసాను. అది ముందు పుస్తకంగా వేద్దామనుకున్నాను. ఆ ప్రక్రియ కొంచం కొలిక్కి వచ్చేసరికి బ్లాగులతో పరిచయం ఏర్పడింది కనుక ఈ మాధ్యమం బాగుందనిపించింది. నేను పుస్తకం రాస్తే ఎందరు చదువుతారు? అంతకంటే ఎక్కువ మందే టపాల ద్వారా రీచ్ అవుతారనుకున్నా.

ప్ర -  మీ బ్లాగు అనుభవాలు?
జ. పెద్దగా ఏమీ లేవండీ. అనుకున్నంత నేర్చుకోలేకపోయానని మాత్రం అనిపిస్తుంది. తెలంగాణా నదీ జలాలు & సాగునీటిమీద మొదలుపెట్టిన సిరీస్ మారిన  పరిస్తితుల దృష్ట్యా మధ్యంతరంగా ఆపేయడం బాధ కలిగించింది. మంచి మిత్రులు పరిచయం అవడం అనే పాజిటివ్ విషయం చాలా ఆనందాన్నిఇచ్చింది.

ప్ర - తెలుగు బ్లాగర్లకు మీరిచ్చే సలహాలు ఏమిటి?
జ. మీరు నమ్మిన విషయాన్ని అయినంత బలంగా స్పష్టమయిన వాదనతో చెప్పండి. ఇతరుల స్పందనను నిశితంగా పరిశీలించి వాటిలోమంచిని తీసుకోండి. అయితే ఈ క్రమంలో వ్యక్తిగత నిందలకు&దిగజారుడు భాషకు తావు ఇవ్వకండి.

ప్ర - మీ బ్లాగు పోస్టులలో మీకు నచ్చినవి?
జ. దాదాపు అన్నీ ఇష్టమే. ఎంతో పరిశ్రమ చేసి రాసిన తెలంగాణా నదీ జలాలు & సాగునీరు సిరీస్ టపాలంటే ప్రత్యెక అభిమానం. అలాగే మా తాతాజీ గురించి రాసిన టపా అన్నాఇష్టం.

ప్ర - ఇతర బ్లాగులలో మీకు నచ్చినవి?
జ. మన బ్లాగర్లలో నిజాయితీ, పరిశ్రమ, చక్కని శిల్పం, వాదనా పటిమ ఉన్నవారే అత్యధికం. విషయాల ఎంపికలో కూడా మాంచి రేంజు కనిపిస్తుంది. కొందరు బ్లాగర్లు దాదాపు సెలబ్రిటీలు స్థాయికి ఎదిగారన్న వాస్తవం మనకు గర్వకారణం. డజన్ల కొద్దీ బ్లాగర్ల వందలాది టపాలు ఉన్నాయి. కనుక అన్నిటినీ చెప్పడం కష్టం.

ప్ర - సోషల్ మీడియాలో బ్లాగులు ,ఫేస్ బుక్ వంటి వాటిలో భావప్రసారానికి ఏ వేదిక బాగుంటుంది?
జ. ఫేస్‍బుక్ లాంటి వాటిలో నేను లేను కనుక బ్లాగులే బెస్ట్ అంటా.

ప్ర - బ్లాగుల వల్ల ఉపయోగాలేమని మీరు అనుకుంటున్నారు?
జ. జ్ఞానార్జన, కొత్త స్నేహితులు & శ్రేయోభిలాషులు

ప్ర - నేటి మీడియాలో రావలసిన మార్పులు ఏమిటి?
జ. ముందే అన్నట్టు మీడియా ఒక అద్దం, అంచేత ముఖాన్ని తుడవడం ముఖ్యం. వినియోగదారుల అవసరాలు మారితే దుకాణాలు వాటంతటికి అవే మారుతాయి.

ప్ర - ఇతరులను నొప్పించకుండా మాట్లాడాలంటే ఏమి చేయాలి?
జ. సాధ్యమయినంత వరకు లేదా కావాలని ఇతరుల మనసు నొప్పించకూడదు. కానీ ఎవరు నొచ్చుకుంటారో అని ఆలోచిస్తూ మాత్రం కట్టడి చేసుకోవద్దు. 'Do unto others what you wish them to do for you'. దీన్నే సల్మాన్ ఖాన్ సినిమాలో उतनाही मारो जितना खुद खासकते हो డయలాగ్ అనువాదం 'ఎదుటివారు మనతో ఎలా ఉండాలనుకుంటామో, మనమూ అలాగే ఉండాలి' అనే సూత్రం పాటిస్తే బాగుంటుంది.

ప్ర వ్యంగ్యానికి, కించపరచడానికి తేడా ఏమిటి?
జ. సరదాకి ఆంటే వ్యంగ్యం అవతలి వారు నోచ్చుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆంటే కించ పరచడం. అయితే సల్మాన్ ఖాన్ సూత్రం మరిచిపోకండి!

ప్ర - నేటి యువతకు మీరిచ్చే సలహాలు ఏమిటి?
జ. గతమెంతో ఘనకీర్తి కలిగినదని భవిష్యత్ అంధకారమని అనుకునే ఆలోచనా సరళిని నేను సమర్ధించను. ప్రతి తరం (సగటుగా) ముందటి తరం కంటే ముందంజలో ఉంటుందని, అలా ఉండడం వల్లే సమాజ పురోగమనం సాధ్యం అయిందని నా ప్రగాఢ విశ్వాసం.

నా కంటే అన్నివిధాలుగా ముందుకు వెళ్ళే యువతకు నేను సలహా ఇచ్చేంత గొప్పవాడినా? ఒకవేళ ఇవ్వాల్సి వస్తే "నువ్వు నువ్వుగా ఉండు. ఇతరులను సలహాలు అడగొద్దు, ముఖ్యంగా నిన్నటి మనుషుల మాటలతో నీ స్వప్నాలకు కళ్ళెం వేసుకోకు" అనే చెప్తా!

ప్ర - ప్రస్తుత రాజకీయాలపై మీ అభిప్రాయం?
జ. రాజకీయం, సినిమా, సాహిత్యం & ప్రచార ప్రసార మాధ్యమాలు అన్నీ కూడా అద్దాలే. ఘాలిబ్ "జీవితమంతా ఒకే తప్పు చేస్తూ వచ్చావు, ధూళి ముఖంపై ఉండగా అద్దాన్నితుడుస్తూ వచ్చావు" అన్నట్టు వీటిని నిందిస్తే ప్రయోజనం ఏమిటి?

ప్రస్తుత రాజకీయం మరీ ఘోరం అన్న దురభిప్రాయం లేదు. ఇంతక ముందు చెప్పినట్టు మంచంతా గతంలోనే ఉండిందన్నసూక్తిముక్తావళి నేను ఒప్పుకోను.

రాజకీయాలు మెరుగుపరచాలంటే "మంచివారు" రంగంలో దిగాలన్న సిద్దాంతం తప్పు. జీవితంలో రాజ్య ప్రమేయ ప్రభావాలు తగ్గడమే సరయిన మార్గం.

రాజకీయాలంటే పార్టీలు & ఎన్నికలు అని కొందరి భ్రమ. పట్టణ ప్రాంత "అక్షరాస్య", ఎగువ మధ్య తరగతి మగ అగ్రవర్ణ ఆలోచనా విధానమే ఈ భ్రమకు కారణం. దీన్నించి బయటికి వస్తే తప్ప రాజకీయ నిజ స్వభావం అర్ధం కాదు. అర్ధమే కానిదాన్నిశాసించడం లేదా మార్చుకోవడం ఎలా కుదురుతుంది?

ప్ర - తె.రా.స లోకి వస్తున్న కప్పగంతులపై మీ కామెంట్?
జ.  కుటుంబ పాలన, నిరంకుశ ధోరణి, కులతత్వం, బంధుప్రీతి, ఫిరాయింపులు వగైరాలు అన్నిచోట్లా అన్నిపార్టీలలోనూ ఉండేవే కనుక అతి కానంతవరకు పట్టించుకోను. 1953లో టంగుటూరి ప్రకాశంతో మొదలయిన ఫిరాయింపులు ఇప్పుడూ తలసాని / ఎస్పీవై /సురేష్ప్రభు వగైరాలు కొనసాగిస్తున్నారు.

ప్ర - కె.సి.ఆర్ ని విమర్శిస్తే తెలంగాణాను విమర్శించినట్లా?
. కాదు. అయితే తెలంగాణాను నేరుగా ఎదురించలేని వారు కెసిఆర్ / తెరాసలను అప్పుడప్పుడూ టార్గెట్ చేస్తారు. నిజానికి కె.సి.ఆర్ వల్లే ఉద్యమం / రాష్ట్రం వచ్చిందని నమ్మే (చెప్పే) వారిలోఅత్యధికులు తెలంగాణా వ్యతిరేకులే.

ప్ర - తెలంగాణా వల్ల కె.సి.ఆర్ లాభపడ్డాడా? కె.సి.ఆర్ వల్ల తెలంగాణా ఉద్యమానికి లభ్ది జరిగిందా?
జ. కె.సి.ఆర్ / తె.రా.స వల్ల తెలంగాణా ఉద్యమానికి జరిగిన లాభం కంటే ఎన్నోరెట్లు ఉద్యమం వల్ల కె.సి.ఆర్ /తె.రా.స లబ్ది పొందారు.

ప్ర - కె.సి.ఆర్ పాలన ఎలా సాగుతున్నది?
జ. బీజీపీ ప్రభుత్వానికి మల్లేనే వీరేదో పొడిచేస్తారని నాకు పేద్ద అపోహలు ఎప్పుడూ లేవు కనుక ఊహించినట్టే ఉందని చెప్పక తప్పదు.

చెరువుల పునరుద్దీకరణ, తాగునీటి ప్రాజెక్టు, విద్యుత్ రంగం ఓ మోస్తరుగా (కనీసం ఆరంభంలో) బానే ఉన్నట్టున్నాయి.

ప్రాధమిక విద్య, నదీ జలాల వాటా విషయాలు మొదలు కూడా పెట్టక పోవడం బాలేదు. మానిఫెస్టోలో వాగ్దానం చేసిన రాష్ట్రస్థాయి సలహా దారుల మండలి అమలు చేయకపోవడం దారుణం.

ప్ర - కె.సి.ఆర్ కుటుంబ పాలనకు , చంద్రబాబు కుటుంబ పాలనకు తేడా ఉన్నదంటారా?
జ. "కప్పగంతుల" ప్రశ్నలో జవాబు చెప్పాను.

ప్ర -.తెలంగాణా ఇవ్వకముందు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో వారినే తిరిగి తెలంగాణాఎమెల్యే లుగా ఎంపిక చేసారు, ఎవరి నియోజక వర్గ అభివృద్ధి వారే చేసుకోవాలి. కానీ, తెలంగాణా అభివృద్ధికి ఆంధ్రులు ఎలా బాధ్యులవుతారు? ఎందుకు? (నీహారిక)
 మూడో వంతు కంటే తక్కువ మంది మాత్రమె సిట్టింగులని దాదాపు సగం మంది మొట్ట మొదటిసారి గెలిచారని నా అంచనా. అంచేత ఎం.ఎల్.ఏగా ఉన్నవారే మళ్ళీ గెలిచారని అనడం సరికాదు. తెలంగాణా అభివృద్ధి బాధ్యత ఆంధ్రులది అని నేను ఎప్పుడూ అనలేదు. ఇకపోతే ఒక నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి /ప్రధాన బాధ్యత ఎం.ఎల్.ఏ అనే వాదన మింగుడుపడడంలేదు.

ప్ర - ప్రాంతీయ పార్టీలవల్ల దేశ సమగ్రతకు భంగం వాటిల్ల్లుతుందనే ఆరోపణలపై మీ అభిప్రాయం?
జ. అన్నాదురై, ఎమ్జీఆర్, ఎన్టీఆర్, ములాయం, మమత వగైరాలు రంగంలో దిగినప్పుడు ఇవే విమర్శలు వచ్చాయి. అవి నిజం కాదని ఇప్పుడు తేలిపోయింది కదా.

ప్ర ఆంధ్ర ప్రదేశ్ విభజన సక్రమమైన పద్ధతిలో జరిగిందని మీరు భావిస్తున్నారా? (నీహారిక)
జ.  ఆంద్రప్రదేశ్ ఏర్పాటే తప్పుడు కారణాలతో అన్యాయాన్ని రుద్దడడం కోసం జరిగింది. ఇటీవలి తెలంగాణా ఆవిర్భావం గత అన్యాయాన్ని పూడ్చలేదు పైగా ఆంధ్రా లాబీయిస్తుల పుణ్యమా అంటూ ఇంకా పూర్తి రాష్ట్రదర్జా ఇవ్వలేదు. ఉదాహరణకు సెక్షన్ 8. తత్తిమ్మా విషయాలలో ఆక్షేపించాల్సిన పనిలేదు.

ప్ర కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చి ఉండకపోతే బీ జే పీ తెలంగాణా ఇచ్చేదా? (నీహారిక)
జ. తెలంగాణా ఆవిర్భావం చారిత్రిక అనివార్యం అయ్యాక  కాంగ్రస్, బి.జె.పి ఎవరైనా తలదించక తప్పదు.

ప్ర విభజన అనివార్యం అని తెలిసినపుడు ఎటువంటి పద్ధతిలో విభజించి ఉండవలసినది అని మీరు భావిస్తున్నారు? (నీహారిక)
జ. మీరు అడుగుతున్నది కేంద్రం గురించా? ఆంద్ర పార్టీలు గురించా?

కేంద్రం అవసరానికి మించి నాంచారని & ఇంకా అణిచివేసే / దారి మళ్ళించే ప్రయత్నం చేసారని నా అభిప్రాయం. ఆంద్ర పార్టీలు అగ్గికి ఆజ్యం పోసి పబ్బం గడుపుకుందామనే విఫల ప్రయత్నం చేయడం బాధాకరం.

తెలంగాణా ఏర్పాటు అనివార్యం అని ప్రజలను సంసిద్ధులు చేసే బాధ్యత ఆంద్ర పార్టీలు తీసుకోవని డిసెంబర్ 9 తెలిసిపోయింది.

తెలంగాణా ఇవ్వాలన్న మానిఫెస్టో ఆధారంగా పోటీచేసి తీరా ఇచ్చాక యూ-టర్న్తెసుకోవడం/రెండు నాలుకలతో మాట్లాడడం దివాలాకోరుతనానికి నిదర్శనం.

కనీసం అప్పటినుండయినా ఆపనిని (కొందరు మినహా) ఆంద్ర మేధావులు & బుద్దిజీవులు చేయకపోవడం ఆంద్ర రాష్ట్ర భవిష్యత్తు పయనంపై ప్రశ్నార్ధకాలు రేపుతుంది.

ప్ర -.మళయాళీలు, తమిళులు అని సంబోధిస్తాం అలాగే ఆంధ్రులు,తెలగాణ్యులు అంటున్నారు ఇది మీకు ఎలా ఉంది? (నీహారిక)
జ. నేను మామూలుగా ఆంధ్రోళ్లు / తెలంగానోళ్ళు అంటాను. మీరు చెప్పినట్టు పిలిచినా పెద్దగా అభ్యంతరం లేదు.

ప్ర తెలంగాణా సమస్యని సోనియా పరిష్కరించినట్లు బీజేపీ పరిష్కరించేదని మీరుభావిస్తున్నారా? (నీహారిక)
జ ముందే చెప్పినట్టు తెలంగాణా ఆవిర్భావం చారిత్రిక అనివార్యం కనుక కాంగెస్, బి.జె.పి ఎవరయినా తలదించక తప్పేది కాదు. కాంగ్రెస్ వారు మాజీ రాష్ట్ర అవశేషంగా మిగిల్చిన సెక్షన్-8 లాంటి వాటిని తీసేసి సంపూర్ణ తెలంగాణా తెచ్చేవారా? అనే ఊహాగానం ఇప్పుడు అవసరం కాదేమో?

ప్ర -.భారత దేశంలో ఆర్టికిల్ 370 వంటి ఎన్నో సమస్యలు ఉండగా మేము అధికారంలోకి వస్తే తెలంగాణా ఇచ్చి తీరతాము అని బీజేపీ ఎందుకు ప్రకటించింది? (నీహారిక)
జ ఆర్టికల్ 370 దేశంలో అతి పెద్ద సమస్యా?నిజాం భారతదేశంతో కాలు దువ్వకుండా ఉంటె కాశ్మీరుకు చిక్కిన ప్రత్యెక హోదా & సొంత సంవిధానం మాకూ దొరికేవని అనుకుంటా:)

ప్ర -.అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ పనితీరు ఎలా ఉంది? (నీహారిక)
జ వీరేదో పొడిచేస్తారని నాకు పేద్ద అపోహలు ఎప్పుడూ లేవు కనుక ఊహించినట్టే ఉందని చెప్పక తప్పదు. నిజానికి బీజేపీ మానిఫెస్టో అంటూ ఏమీ లేదు. నరేంద్రమోడీ గుజరాత్ నమూనాయే దేశమంతా అమలు చేస్తామనే వారు చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో ప్రత్యెక కారణాల వల్ల చెల్లుబాటు అయిన నమూనా దేశం మొత్తానికి వ్యాపింప చేయడం సులభం కాదనే వాస్తవాన్నిఇప్పటికయినా గుర్తిస్తే మంచిది.


ప్ర - స్వచ్చ భారత్ అమలుతీరుపై మీ అభిప్రాయం? (నీహారిక)
జ అమలు గురించి తెలీదండీ. చేస్తున్నంత హడావుడి అవసరమా? అని డౌట్లు మాత్రం పోవడం లేదు.

ప్ర -.ముఖ్యమంత్రి గానీ ప్రధాన మంత్రి కానీ 10 సంవత్సరాలకు మించి పనిచేయకూడదన్నఅభిప్రాయం సరయినదేనా? (నీహారిక)
జ ముందే చెప్పినట్టు రాజకీయం సమాజాన్ని శాసించేవారికి అద్దం పడుతుంది తప్ప తానే శాసించదు. రష్యాలో పుట్టిన వహారం ఏమయింది?

ప్ర - ప్రధాని,రాష్ట్రపతి పదవులకు ఉన్నత విధ్యాభ్యాసం,వయోపరిమితి ఉండనవసరం లేదా? (నీహారిక)
జ ప్రజా ప్రతినిధులకు విద్యాభ్యాస అర్హతలు లేదా గరిష్ట వయోపరిమితి విధించడం అసంవిదానికమే కాక ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.రాష్ట్రపతి అంటారా రబ్బర్ స్టాంపే కదండీ. :)

ప్ర -.అభివృద్ధివాదం ఉంటే సామ్రాజ్యవాదం ఉండకూడదా? (నీహారిక)
జ. ఇంతకముందు చెప్పినట్టు ప్రతి తరం (సగటుగా) ముందటి తరం కంటే ముందంజలో ఉంటుంది, అలా ఉండడం వల్లే సమాజ పురోగమనం సాధ్యం. అభివృద్ధి మానవ నైజంలో అంతర్భాగం కనుక ఎటువంటి వ్యవస్తలో అయినా అభివృద్ధి తప్పనిసరి. కాకపొతే ఎంచుకున్న వ్యవస్థ అభివృద్ధి గతిని, దిశను & ఫలితాల పంపకాన్ని నిర్దేశిస్తుంది. సామ్రాజ్యవాదం ప్రధాన పాత్ర పోషిస్తే అభివృద్ధి సదరు సామ్రాజ్యవాదుల ప్రయోజనాల తరువాతే మనకు లాభం చేస్తుంది.

ప్ర -.సామ్యవాదం అంటే ఏమిటి? (నీహారిక)
జ. సామ్యవాదం అంటే ఏమిటో సామ్యవాదులకే సరిగ్గా తెలీదు :)
లక్ష్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి మార్గాన్ని విస్మరించడం సోషలిజం స్వభావం. అంచేత నేను సోషలిస్టుని కాను.

ప్ర -.సామ్యవాదం ఇండియాకి సరిపడుతుందా? (నీహారిక)
జ సరిపోదు, ముందే చెప్పినట్టు సామ్యవాదం లక్షాన్ని వివరించినంతగా అక్కడికి ఎలా చేరాలో చెప్పదు. ప్రతి నమూనా వాస్తవాన్ని సరళం చేసే ప్రయత్నంలో కొద్దోగొప్పో వక్రీకృతం అవుతుంది. నిజానికి ఏ విధానం కూడా ఎక్కడా యధాతధంగా సరిపోదు. No model is correct, some are useful at times. లేబుళ్ళకు బందీ కాకుండా మన ఆర్ధిక సాంఘిక నైసర్గిక పరిస్తితుల బట్టి ఎటువంటి నమూనా కోరుకున్న ఫలితాలకు చేరువగా తీసుకెళ్ళుతుందో దాన్ని ఎంచుకోవాలి. ఇది కూడా మారుతున్న కాలంతో మారకపోతే నిన్నటి లక్ష్యాలను సాదించినా ఆట్టే ప్రయోజనం ఉండదు.

ప్ర -.కమ్యూనిజం లో ప్రధానమైన లోపాలేమిటి? (నీహారిక)
జ సోషలిజం లాగే కమ్యూనిజం కూడా పాటిస్తామని చెప్పుకునే వారికే సరిగ్గా తెలీదు:) కమ్యూనిజం రాజకీయ విధానం కాదు. హెగెల్ గతితార్కికాన్ని రికార్డో శ్రమ-విలువ-పెట్టుబడి అనుబంధాన్ని రెంటినీ కలబోసి ఆర్ధిక సూత్రాల ఆధారంగా చరిత్ర దశను ప్రెడిక్ట్ చేసే ఒక థియరీ. రాజకీయాన్ని ఆర్ధిక రంగం శాసిస్తుందని చెప్పడం, అలాగే ఆర్ధిక వ్యవస్తలో నాలుగు ప్రధాన ఉత్పత్తి / విలువ ఫాక్తర్లను సరిగ్గా గుర్తించడం కమ్యూనిజంలోని గొప్ప విషయాలు. అయితే ప్రకృతి (land),  శ్రమ (labor), పెట్టుబడి (capital), సమన్వయం (organization, నిజానికి management ఆంటే బెటర్) అన్న ఫాక్తర్లలో ఆధిపత్యాలు ఎలా మారుతాయో అంచనా వేయడంలో మార్క్స్ ఘోరంగా విఫలం చెందాడు. ఆయన అంచనా వేసినట్టు పెట్టుబడి స్థానం శ్రమ తీసుకోలేదు సరికదా అనూహ్యంగా ఆర్గనైజేషన్ పైకి ఎదిగింది. మార్క్స్ తన కాలంలో అంచనా వేయడానికి ముఖ్య కారణం అప్పటిలో యజమానులే మేనేజర్లుగా ఉండడం, అంచేత మేనేజ్‍మెంట్ ప్రభావాన్ని ఆయన అర్ధం చేసుకోలేకపోవడం. ఆ తరువాత వచ్చిన మార్క్సిస్టు మేధావులు డాస్ కేపిటల్ పరిధిని దాటి ఆలోచించలేక పోయారు.

ప్ర -.అధ్యక్షతరహా పాలనపై మీ అభిప్రాయం? (నీహారిక)
  మంచి అభిప్రాయం లేదు. రష్యా, శ్రీలంక, టర్కీ వగైరాలు చూసాము కదా. ప్రస్తుత పార్లమెంటరీ వ్యవస్థ రాజ్యాంగంలో మార్చలేని బేసిక్ స్ట్రక్చరులో భాగం కనుక ఇది జరగని విషయం.

ప్ర - పెట్టుబడిదారీ వ్యవస్థను మీరు సమర్ధిస్తారా?
. ఏదో ఒక ఇజం తొడుక్కోవాల్సిందే అంటే నేను స్వేచ్చావాదిని. (libertarian). నేను పెట్టుబడిదారీ వ్యవస్థ మూల సూత్రాలను ఖచ్చితంగా సమర్తిస్తాను. అయితే కొద్దో గొప్పో లెవల్ ప్లేయింత్ ఫీల్ లేకుండా ఫలితాలు రావు. వ్యవస్తీకృత అసమానతలు ఉన్నంత వరకు ఇది కుదరదు. మన గొడవంతా దీని కోసమే!

ప్ర -విదేశీయులు ఇండియాని పరిపాలించకూడదు అనేటట్లయితే జిందాల్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడం సరి అయినదేనా? (నీహారిక)
జ  బాబీ జిందాల్ అమెరికాలోనే పుట్టాడు కనుక ఆయనకు సోనియాకు పోలిక లేదు.

ప్ర - 'సాహిత్యం' అనే పదానికి నిర్వచనం చెప్పగలరా?
జ. మీరు నా పరిధికి మించిన ప్రశ్నఅడుగుతున్నారు. అల్పుడిని వదిలేయండి మిత్రమా!

ప్ర - 'సాహిత్యం' ద్వారా మనిషి ప్రవర్తనలో వచ్చే మార్పు ఏమిటి?
జ. సాహిత్యం వల్ల ప్రవర్తనలో ఎటువంటి మార్పూ రాదు. ఏదయినా ఆలోచన వల్లే వస్తుంది. పున్నమికో అమావాస్యకో ఒక్కోసారి సాహిత్యం వల్ల కొంచం ఆలోచన లేవనెత్తే అవకాశం రావొచ్చు అంతే.

ప్ర – కులం - మతం పై మీ అభిప్రాయం?
జ. ఆస్తికత్వం ప్రశ్నతో కలిపి జవాబిస్తాను

ప్ర - ఆధ్యాత్మికతకు మీరిచ్చే నిర్వచనం?
జ. ఆస్తికత్వం ప్రశ్నతో కలిపి జవాబిస్తాను

ప్ర - మీరు ఆస్థికులా?నాస్తికులా? దేవుడు లేదా దైవత్వం అనే అంశానికి మీరిచ్చే నిర్వచనం?
జ. నేను నాస్తికుడిని. ఒకప్పుడు కాస్త అమాయకంగా "నమ్మడం నమ్మకపోవడం వ్యక్తిగతం. రెండిటి వల్లా లాభం నష్టం ఏమీలేవు" అనుకునేవాడిని. అది సరయిన అప్రోచ్ కాదనీ, ఆస్తికత్వం అన్నది మానవాళికి & మనుష్య స్వేచ్చకు ప్రమాదకరమని, అలాగే చర్య-పర్యవసానం (cause & effect) సంబందాలను కాలరాచే (దురదృష్టం కొద్ది సఫలం అవుతున్న) భయంకర ప్రయత్నమని కాలక్రమంలోఅర్ధం చేసుకున్నాను.

మానవుడి మనసులో తెలియని విషయాల పట్ల భయభ్రమల కలయికే దేవుడు. వాటిని కేష్ చేసుకొని బలవంతులకు ప్రయోజనం చేకూర్చే వ్యవస్తీకృత విధానమే మతం.

అటువంటి బలవంతుల ఆలోచనలకు, వారు కోరుకున్న ఆచార వ్యవహారాలకు హేతువుకు ఇమిడినా ఇమడకపోయినా "సంఘం" పేరుతో వేసే ఆమోదముద్ర పేరే ధర్మం.

ప్ర - కులం పై మీ అభిప్రాయం చెప్పలేదు. ప్రస్తుతం మన దేశంలో కుల పరమైన ఉద్యమాలు నిర్వహిస్తున్నవారు నిజంగా కుల నిర్మూలనకు ప్రయత్నిస్తున్నారా? వాటిని అడ్డం పెట్టుకుని వారు నేతలుగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారా? కుల సమస్య పరిష్కారానికి మీరు చెప్పే సూచనలు ఏమిటి?
జ.  ఆస్తికత్వం ప్రశ్నతో ఇతర సంబందిత అంశాలను చేర్చడం వలన మిస్ అయ్యాను ఉద్దేశ్యపూర్వకంగా కాదండీ. కులం ఇతర మతాలకు / దేశాలకు లేని ప్రత్యేక వ్యవస్థ. సమాజంలో ఆధిపత్య వర్గాలకు పెద్దపీట వేయడం తప్ప మరోటి కాదు. కొందరు అన్నట్టు కులం మూలాలు ఒకవేళ శ్రమ విభజన అయినా కూడా (నాకు ఈ వాదన పెద్దగా నమ్మబుద్ధి కాదు) శాశ్వత జన్మాధార విభజన అన్యాయం.

ఉద్యమకారులు కూడా సమాజంలో భాగమే, అందరిలాగే వారికీ మంచి-చెడులు ఉంటాయి. చిత్తశుద్ధి ముఖ్యమే అయినా ఆశయ పరిమాణం మరిచిపోలేము. ఎవరి కడుపూ నింపని ఆశయం కోసం పూర్తి పట్టుదల & చిత్తశుద్ధితో చేసే ఉద్యమం కన్నా జనహితం కోసం సగం సగంగా చేసే ఉద్యమం మెరుగయిన ఫలితం ఇస్తుంది.

కులం పేరుతొ ఉద్యమాలు చేస్తున్న వారందరికీ చిత్తశుద్ధి ఉందా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం అవసరమా? కొందరయినా, కొంతయినా పోరాటం చేస్తే పురోగతి ఉంటుంది కదా?

ప్ర - ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ సరయినదేనా? 
జ. కాదు, రాజ్యాంగ విరుద్దం కూడా.

ప్ర - రిజర్వేషన్ల విధానంలో రావలసిన మార్పులున్నాయా? రిజర్వేషన్లు ఇంకా ఎంత కాలం కొనసాగించాలి?
జ.  ఎటువంటి కారణాల వల్ల రిజర్వేషన్లు ప్రవేశపెట్టారో అవి పూర్తిగా నెరవేరలేదన్నది వాస్తవం. ఇలాగే కొనసాగితే కోరుకున్న పరిమాణాలు జరుగుతాయని చెప్పలేము. పైపెచ్చు ముందు చెప్పినట్టు ప్రస్తుత పరిస్తితిలో ఆధిపత్య వర్గాలు గతంలో కులం పేరుతో పొందిన 'అక్రమ లబ్ది' ఈరోజున రిజర్వేషన్ల ద్వారా పొందుతున్నారని అనిపిస్తుంది. ప్రస్తుత "తరుగుతున్నకేకులోప్రాముఖ్యత" పరిస్తితికి పరిష్కారం ఆలోచించాల్సిందే. రిజర్వేషన్లు ఇంకా అవసరమా? ప్రత్యామ్నాయం ఏమిటి? ఈ ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు లేవు! కోరుకున్న ఆశయం నెరవేరలేదని, కనీసం నెరవేరుతుందనే నమ్మకం కూడా లేదని మాత్రం అనిపిస్తుంది.

ప్ర -.కుల,మత రిజర్వేషన్లు అవసరమా? (నీహారిక)
జ.  మతం లాగే రిజర్వేషన్ల గురించి కూడా ఒకప్పటి నా అమాయక వైఖరి మార్చుకోక తప్పడం లేదు. తరతరాల నుండి మతపరంగా కొద్ది మందికి మాత్రమే అన్ని పదవులు ఇచ్చే రిజర్వేషన్ల అన్యాయాన్ని తిరగతోడానికి అదే ఆయుధం సరిపోతుందని ఒకప్పుడు భావించేవాడిని. బహుజనులను రిజర్వేషన్ల ముసుగులో ఎందుకూ పనికిరాకుండా పోతున్న రంగాలకు పరిమతం చేసి దూసుకెళ్ళుతున్న రంగాలలో తమకు పోటీ లేకుండా చేసుకునే ప్రక్రియ ఇప్పుడు చూస్తున్నాను. ప్రస్తుత పద్దతి లేవనెత్తుతున్న "తరుగుతున్న కేకులో ప్రాముఖ్యత" పరిస్థితికి పరిష్కారం ఎలా వస్తుందో ఆలోచించాల్సిందే.

ప్ర - పేదరికం నిర్మూలన జరగడానికి వ్యవస్థలో రావలసిన మార్పులు ఏమిటి?
జ. పేదరికం నిర్మూలనే ఏకైకధ్యేయంగా పెట్టుకుంటే కుదరదు. సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి నమూనా (progress with distributive justice) అవసరం.

ఇంకోరకంగా చెప్పాలంటే అసమానత మార్కెట్ సైజు తగ్గిస్తుంది. దాదాపు 80% ప్రజలు తగినంత కొనుగోలు శక్తి లేకుండా ఆర్ధిక రంగం అంచులలో ఉండడం అభివృద్ధికి హానికరం. హెన్రీఫోర్డ్ కారు ఫేక్టరీ కార్మికులకు అందుబాటులో కార్లు రావాలని ప్రయత్నించడం పరిష్కార మార్గాలకు ఒక మంచి ఉదాహరణ.

దేశ పురోగతికి ప్రాధమిక విద్య, తాగు/సాగు నీరు, చిన్న/మధ్య తరహా (ముఖ్యంగా మానుఫాక్చరింగ్) పరిశ్రమలు, స్వయం ఉపాధి, రోడ్డు/రైలు రవాణా, పర్యాటన రంగం, వ్యవసాయ ఎక్స్‍టెన్షన్ వంటి కొన్ని దీర్ఘకాలిక ఇనీషియేటివులు ముఖ్యమని నా భావన.

వివిధ ప్రణాళికల మధ్య సారూప్యత ఉండడం చాలా ముఖ్యం. ఉదాహరణకు విద్యా విధానంలో ప్రాధమిక విద్య & వృత్తి విద్యలకు ప్రాముఖ్యం ఇస్తే తప్ప పారిశ్రామిక విధానంలో కుటీర / చిన్న / మధ్య తరహా పరిశ్రమలకు చోటు కల్పించలేము.

ఇంతక ముందు చెప్పినట్టు లేబుళ్ళకు బందీ కాకుండా మన ఆర్ధిక, సాంఘిక, నైసర్గిక పరిస్తితుల బట్టి ఎటువంటి నమూనా కోరుకున్న ఫలితాలకు చేరువగా తీసుకెళ్ళుతుందో దాన్ని ఎంచుకోవాలి. ఇది కూడా మారుతున్న కాలంతో మారకపోతే నిన్నటి లక్ష్యాలను సాదించినా ఆట్టే ప్రయోజనం ఉండదు.

ఉదాహరణకు ఆంధ్రకు వందలాది కిమీ తీర ప్రాంతం, బ్రహ్మాండమయిన మత్స్య సంపద, బెంగుళూరు/చెన్నై సామీప్యం వంటి అడ్వాంటేజీలు ఉండగా హైదరాబాద్ మాదిరి పెద్ద నగరం నమూనా సరిపోదు. రేవులు, కోల్డ్ స్టోరేజి సదుపాయాలు, తమిళం / కన్నడ భాషలకు ప్రోత్సాహం లాంటివి చేబడితే ఎంతో ఉపాధి & ఆదాయం పెరుగుతాయి.

ప్ర - " భారత దేశం పేద ప్రజలున్న సంపన్న దేశం " - ఈ వాక్యం ఇంకా మనం ఎన్నాళ్లు చదువుకోవాలి?
జ. మన మనవళ్ళ మనవళ్ళు కూడా ఇదే చదువుతారేమో:)


ప్ర - ఇండియాలో గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి?
జ. పేదరికం నిర్మూలన ప్రశ్నలో చెప్పిన వాటిలో హెచ్చుభాగం గ్రామాల గురించే. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలంటూ కొందరు గగ్గోలు పెడ్తారు. ఇది పరిష్కారం కాదు. వ్యవసాయం లాభసాటి కావాలి, వ్యవసాయ రంగంలో కనిపించని నిరుద్యోగం (hidden unemployment) బయటికి రావాలి, ఆ శ్రమశక్తిని ఆదాయంగా మార్చ గలగాలి. గుజరాత్ నమూనా కొంతవరకు ఈ దిశలో సఫలీకృతం అయినా ఈ పథం కష్టాలతో కూడుకున్నదని ఒప్పుకోక తప్పదు. డా. అబ్దుల్ కలాం "పూరా" నమూనా విఫలం కావడం దీనికొక ఉదాహరణ.

ప్ర - అభివృద్ధి అంటే కేవలం ఆర్ధిక పరమైన అంశంగానే చూడాలా? అభివృద్ధి అంటే మీరిచ్చే నిర్వచనం?
జ. అభివృద్ధికి ఆర్ధిక రంగమే ముఖ్య కొలమానం. కానీ, ఇతర రంగాలలో పురోగమనం లేనిదే నిలకడ కల (sustainable) అభివృద్ధి సాధ్యం కాదు.

ప్ర - ఇండియాలో ఉద్యోగ భద్రత వల్ల అభివృద్ధి కుంటుపడుతున్నదా? ఉద్యోగ భద్రత - బాధ్యతల మధ్య సమన్వయం ఎలా ఉండాలి?
జ. మన దేశంలో ఉద్యోగ భద్రత నిజంగా ఉందా:)

ప్ర -.బ్రిటీష్ వారు మనదేశానికి వచ్చేనాటికి మనదేశం సంపన్న దేశమైతే ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండడానికి ప్రధాన కారణం ఏమిటి? (నీహారిక)
జ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల రాక పూర్వం మనం సంపన్నులమా? ఆశ్చర్యంగాఉంది:) గతమంతో ఘనకీర్తి అనడం పాటలలో ప్రాసకే తప్ప ఇంకెందుకూ పనికిరాదు.

ప్ర -.పేదలని గుర్తించాలంటే దేనిని ప్రాతిపదికగా తీసుకోవాలి? (నీహారిక)
జ. పేదరికానికి ముఖ్య కొలత తలసరి ఆదాయమే అనుకుంటా. వెనుకబడిన తరగతులను నిర్ణయించడం కష్టంతో కూడుకున్నదే అయినా అసాధ్యం కాదు.
 ప్ర - విద్య - వైద్య రంగాల అభివృద్ధికి మన ప్రభుత్వాలు ఎందుకు ప్రోత్శాహం చూపవు?
జ. ఎందుకు చేయవండీ చేస్తాయి, కాకపొతే ఒకటే తిరకాసు. ఇంజనీరింగ్ కాలేజీల (సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు) మీద ఉన్న మోజు ప్రాధమిక విద్య (ప్రాధమిక ఆరోగ్య కేంద్రం) మీద ఉండదు, దీనికి కారణం ఏమిటో ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటా:)
ప్ర -.సోలార్ విద్యుత్ ఏర్పాటుచేసుకోవాలంటే ఖరీదు ఎక్కువగా ఉంటుంది ఈ పరికరాల సమాచారం ఎక్కడ తెలుస్తుంది? ఎలా తెలుసుకోవాలి? (నీహారిక)
జ సంప్రదేయతర వనరుల వాడకం విరివి కావాలంటే అందుబాటులోకి రావాలి. విద్యుత్ నిలువుచేసే సామర్ధ్యం పెంచితే తప్ప ఇది కుదరదేమో? బాటరీ లాంటి ఇండక్టివ్ కాంపోనెంట్లు అంటే ఎవరికీ ఆసక్తి ఉన్నట్టు లేదు.

పరికరాల సమాచారం గురించి నాకు ఆట్టే తెలీదు. మీకు కావాల్సిన సమాచారం జవహర్ సోలార్ మిషన్ ఇవ్వగలరేమో అడగి చూడండి.

ప్ర -.గ్లోబల్ వార్మింగ్ పై మీ అభిప్రాయం? (నీహారిక)
జ.గ్లోబల్ వార్మింగ్ ఎలా ఆపాలి / తిప్పికొట్టాలి? అన్న విషయంపై ప్రస్తుతం పెద్ద పరిశోధన జరుగుతున్నట్టు అనిపించడంలేదు. ఒబామా మొదటిసారి గెలిచిన వెంటనే వస్తాయని అనుకున్నఇనీషియేటివులు రాలేదు. రానున్న కాలంలో ఏదో చేస్తారని నమ్మకం కూడా కుదరడంలేదు. అమెరికా, చైనా & భారత్ లాంటి పొల్యూటింగ్ దేశాలు బైండింగ్కట్స్ ఒప్పుకోకపోవడం దురదృష్టం.

ప్ర - నదుల అనుసంధానం పై మీ అభిప్రాయం? సాగు - త్రాగు నీటి సమస్యలు లేని గ్రామీణ భారతం రావాలంటే చేయాల్సిన మౌలిక మార్పులు ఏమిటి?
జ. పారివాహిక ప్రాంతాలు వేలాది సంవత్సారాలలో ఏర్పడ్డ నైసర్గిక వాస్తవాలు. నదుల అనుసంధానం ప్రస్తావన ప్రకృతితో చెలగాటమే కాక ఒక తెల్ల ఏనుగు కూడా. బేసిన్ నీటి తరలింపు భారతదేశానికి శాపం వంటిది. దాన్నే ఇప్పుడు ఆధిపత్య  ప్రాంతాల భూస్వాములు హక్కుగా భావించడం దివాలాకోరుతనం. పారే నీటి స్వభావాన్ని అర్ధం చేసుకోవాలంటే నాలుగు విభిన్న శాస్త్రాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దురద్రష్టవశాత్తు మనదేశంలో వీటిలో అన్నిటి కంటే తక్కువ ప్రాముఖ్యత కలిగిన ఇరిగేషన్ ఇంజనీరింగ్ మిగిలిన మూడు అంశాలపై రాజ్యం చేస్తుంది.

నీటి ఎద్దడి తగ్గాలంటే క్రాపింగ్‍ పేట్టర్న్, ఇన్పుట్ సెలెక్షన్, ఆహార వ్యవహారాలు లాంటి అనేక అంశాలలో విప్లవాత్మక మార్పులు రావాలి. ఉదాహరణకు వ్యవసాయ ఎక్స్‍టెన్షన్ , ఆరుతడి పంటలు వేయడం, చౌక బియ్యం / గోధుమ ఆపేసి జొన్న/రాగిలకు ప్రోత్సాహకాలు మళ్లింపు, రొయ్యల పెంపకం బదులు సముద్ర మత్స్య ప్రోత్సాహం, చక్కెర దిగుమతి, కాలువల లైనింగ్, ప్రణాళికబద్దమయిన సాగు (synchronous farming), తక్కువ నీటి వినోయోగం పద్దతులు (water optimal farming) వగైరాలు.
---------------------------------------------------------------------------------

Post a Comment

  1. Excellent interview! Congratulations to Jai and Kondalarao and Niharika for their questions.

    ReplyDelete
  2. @ Jai గారు,
    ప్రస్థుత రాజకీయాలపై మీ అభిప్రాయం చాలా బాగుంది.రాజకీయమంటే అర్ధమే కాకుండా బాగుచేయాలనే ఆలోచనే రాదు.అందుకే రాజకీయాలను బాగుచేయాలని ఎవరూ ప్రయత్నించరు.లోక్ సత్తా కొంత ప్రయత్నించినా పేద ప్రజలను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నది.మనదేశంలో ఆర్ధికపరంగా ఉన్న పేదవారికంటే ఆలోచన(మేధో)పరంగా ఉన్న పేదవారి సంఖ్యే ఎక్కువ !
    ఆసక్తికరమైన విశేషాలు తెలిపినందుకు మీకూ,ఇంటర్వ్యూ నిర్వహించిన కొండలరావు గారికీ ధన్యవాదాలు. ప్రస్థుత రాజకీయాల్లో రావలిసిన మార్పులగురించి భండారు గారి నుండి కూడా సమాధానాలు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను.శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు !

    ReplyDelete
    Replies
    1. నీజారిక గారూ, మీ వ్యాఖ్యకు థాంక్సండీ

      సమాజం మారితే రాజకీయం దానంతట అదే తదనుగుణంగా మారుతుందని నా నమ్మకం. రాజకీయాన్నిమార్చడం ద్వారా సమాజాన్ని మెరుగు పరచాలని కోరుకోవడం tail wagging the dog లాంటిది.

      లోక్సత్తా గురించి నా నోరు తెరిపించకండి

      Delete
    2. నీహారిక గారు, శ్రీకాంత్ చారి గారు ధన్యవాదములు.

      Delete
    3. నీహారిక గారు, కూకట్ పల్లి నియోజక వర్గంలో ఏమి అధ్బుతాలు చేశారు జయ ప్రకాశ్ నారాయణ్? లేదా రాజకీయాలలో బాగుకోసం ఆయన చేసిందేమిటి? మీడియాలో హైప్ తప్ప గ్రామాలదాకా ఎక్కడకి వచ్చి, ఎవరిని చైతన్యం చేశారు?

      Delete
    4. మేధోపరమైన శ్రమకి జయప్రకాష్ నారాయణగారు ఒక మంచి ఉదాహరణ.ఆయన ఆలోచనలు రాజకీయల్లో పాలనాపరంగా అనుసరిణీయమే కానీ ఆచరణలో విఫలమవుతున్నారు.స్వచ్చభారత్ నినాదం కూడా అంతే శ్రామికుడికే స్వచ్చ భారత్ సాధ్యపడుతుంది.మోడీ శ్రామికుడూ కాడు,మేధావీ కాదు.సన్నీలియోన్ ని అడ్డుపెట్టుకుని ఆమె భర్త సంపాదించుకున్నట్లే మోడీని అడ్డుపెట్టుకుని బీ జే పీ అధికారం చెలాయిస్తుంది.


      Delete
    5. లోక్సత్తా ఒక పార్టీ కాదు, రాజకీయాలపై వీసమెత్తు అవగాహన లేని & ప్రజాజీవితం గురించి ఏమీ తెలియని కొందరు బ్యూరోక్రాట్ల గుంపు. తామే మేధావులమని సొంతడబ్బా కొట్టుకోవడం & ఘంటల కొద్దీ శుష్క ఉపన్యాసాలు దంచడం తప్ప వీళ్ళు ఎందుకూ పనికిరారు.

      Delete
    6. లోక్ సత్తా 'సత్తా' అదన్నమాట - మీ మాట బాగుంది జై గారు.

      Delete
  3. సమాజం మారకుండా పాలకవర్గం జాగ్రత్తపడుతుంది. ఉదాహరణకి జనం కమ్యూనిజం వైపు వెళ్ళకుండా ఉండేందుకు ప్రభుత్వం భూసంస్కరణలు అమలు చేస్తుంది. అప్పుడు భూముల యజమానులు మారుతారు కానీ ప్రైవేత్ ఆస్తి మాత్రం పోదు. రిజర్వేషన్ వల్ల గుడిసెల్లోని కొంత మంది దళితులు apartmentsలోకి వస్తారు కానీ గుడిసెలు మాత్రం పోవు.


    ReplyDelete
    Replies
    1. కమ్యూనిజానికి కాలం చెల్లిపోయిందని నా విశ్వాసం. ఇకపోతే మార్పులు అనేవి ఎప్పుడూ ఉంటాయి: ఉ. కమ్యూనిజం సిద్దాంతం రావడానికి వందలాది ఏళ్ల ముందే మాగ్నా కార్టా వచ్చింది.

      Delete
    2. కమ్యూనిజానికి కాలం చెల్లడం అనే వాక్యమే తప్పు. అసలింతవరకు సోషలిజానికే సరైన లేదా ఖచ్చితమైన నమూనా లేదు. అంటే సోషలిజమే నమూనాగా నిర్మింపబడలేదు. ఇక కమ్యూనిజం వస్తే కదా దానికి కాలం చెల్లడం జరిగేది. జై గారు చెప్పదలచుకున్నది కమ్యూనిజం రాదని, సోషలిజం ఆచరణలో ఫెయిలందని అనుకుంటాను.

      Delete
    3. "సంప్రదాయ కమ్యూనిస్ట్ నమూనా" సోవియట్ యూనియన్లో కుప్ప కూలింది. ఫాబియన్ సోషలిజం నమూనా మనదేశంలో విఫలం అయింది. ఇంకా నమూనాలు రావాలంటే డాస్ కాపిటల్ పరిధి నుండి దాటాల్సిందే.

      కమ్యూనిజం జోస్యం ప్రకారం ఆధిపత్యం పెట్టుబడి నుండి శ్రమశక్తికి మారుతుంది. ఇలా జరగడానికి కూలిపోతున్న (పెట్టుబడిదారీ) వ్యవస్తలో వచ్చే వ్యవస్థ బీజాలు ఉండడం, ఆ వ్యవస్తను శాసించే శక్తి (శ్రమ) వ్యవస్తను కూల్చేంత బలవంతం కావడం కారణం అని మార్క్స్ అంచనా. అందుకు విరుద్దంగా శ్రామిక బలం పెట్టుబడికి పోలిస్తే ఎన్నో రెట్లు పడిపోవడమే కాదు కోలుకోలేనంత స్థాయికి దిగజారింది. అనూహ్యంగా మానేజేమెంటు బలపడడం నూతన (లేదా రాబోయే) వ్యవస్థ దశకు సంకేతం.

      Delete
    4. సోషలిస్టు నమూనాయే పూర్తి కాలేదు. కమ్యూనిస్టు నమూనా అనే ప్రశ్నే లేదు. సోషలిస్టు నమూనాలో పెట్టుబడి ఆధిపత్యాన్ని శ్రామికవర్గం ఆక్రమించడం పూర్తయితే సమాజం మొత్తం సహజ చైతన్యంతో అందరికీ పని అందరికీ విశ్రాంతి దశ సహజ సిధ్హంగా స్వేచ్చగా అవలంబించడం జరిగితే ప్రజలంతా స్వానుమతంగా వ్యక్తిగత ఆస్తిని వదులుకుంటే రాజ్యం అనేది పూర్తిగా రూపుమాసి పోతే కేవలం సాంఘిక ఏజెన్సీలతో సైన్స్ సమాజంగా కమ్యూనిజం ఏర్పడవచ్చని మార్క్స్ అభిలషించాడు. మీరన్నట్లు కమ్యూనిస్టు నమూనా అన్న ప్రశ్నే లేదు. అది వస్తుందా? రాదా? అన్నది వేరు విషయం.

      Delete
    5. జై గారూ,

      ఫలానా నమూనా ఫలానా దేశంలో కూలింది కాబట్టి ఇక్కడ కూడా ఫెయిల్ అవుతుంది అని చెపుతున్నారు.బెర్లిన్ లో ప్రజలందరూ గోడ కూల్చినట్లే ఇండియాలోనూ వాఘా బోర్డర్ కూల్చవచ్చునేమో కదా ? మీరు పెట్టుబడి దారీ వర్గాన్ని సమర్ధించాలని గానీ,ఉద్ధరంచాలని గానీ ప్రయత్నించకపోవడమే మర్యాద.అన్ని ఇజాలూ కలిసేది ఒక్క కమ్యూనిజంలోనే !

      Delete
    6. జ్యోతిష్యం వేరు, మార్క్సిజం వేరు. దానికీ, దీనికీ మధ్య పోలికే లేదు. గ్రహాల ప్రభావం భూమి మీద పడే అవకాశమే చాలా తక్కువ, ఇక అది మనిషి మీద ఎలా పడుతుంది? అందుకే జ్యోతిష్యులు చెప్పేవి నిజం అవ్వవు.

      ఇప్పుడు పెట్టుబడిదారులు మేనేజ్మెంత్ పని కూడా చెయ్యకుండా మేనేజర్లని నియోగిస్తున్నారంటే దాని అర్థం పెట్టుబడిదారులు నామమాత్రపు శ్రమ కూడా చెయ్యడం లేదనే కదా. ఆ నిజం మీరు చెపితే కమ్యూనిస్త్‌లకి నష్టం లేదు. నాకు తెలిసిన కాలేజ్‌లలో కూడా committeeవాళ్ళు ఏ పనీ చెయ్యరు, మేనేజ్మెంత్ అంతా ప్రిన్సిపల్‌లే చూసుకుంటారు. ప్రిన్సిపల్‌లూ, గుమాస్తాలూ వ్రాసిన ఆదాయపు లెక్కలు చదవడం, ఆ ఆదాయాన్ని పంచుకోవడం ఒక్కటే committeeవాళ్ళు చేసేది.

      రష్యా, చైనాలలో ఎర్ర ప్రభుత్వాలు లేకపోయి ఉంటే, ఇందియాలో సోషలిస్త్ విప్లవం వస్తుందని భయపడి మన పాలకులు భూసంస్కరణలు అమలు చేసేవాళ్ళు కాదు. భూసంస్కరణలు లేకపోయి ఉంటే మీరు చదువుకుని IT ఉద్యోగాలు చెయ్యకుండా దొరల పొలాల్లో పాలేర్లుగా పని చేసేవాళ్ళు. పూర్వం గ్రామస్తులు చదువుకోకుండా కరణం-మునసబ్‌లు ఎలా అడ్డుకునేవాళ్ళో నేను నా పాత బ్లాగ్‌లో వ్రాసాను.

      Delete
    7. మేనేజర్లు కూడా దోపిడీకి గురవుతారు. లేదా తమ మేధస్సుని ఉపయోగించి యజమానులకు అధిక దోపిడీని ప్రోది చేసి ఇన్సెంటివ్ ల రూపంలో అదనపు విలువలో తామూ కొంత వాటాను కొట్టేస్తారు. ఇదంతా వారు తెలిసి చేయకపోయినా, సహజం అనుకునే చేస్తారు. అయినా అది తప్పే కదా?

      Delete
    8. ఇండియన్ గవర్నమెంట్ సహకారం లేకుండానే వీర తెలంగాణా పోరాటం జరిగింది కదా ప్రవీణ్ గారు. పాలేర్లుగా ఉంటారని ఎలా చెప్తారు? పోరాడేవారనుకోవచ్చు కదా? ఇపుడు పోరాడే కదా తెలంగాణా సాధించుకున్నది?

      Delete
    9. It is painful to type Telugu on your website on mobile because of slow loading.

      My above comment is also about the erstwhile karanam-munasab system of Andhra.

      Delete
  4. పెట్టుబడిదారీ వ్యవస్థ బలపడిందే 1750 తరువాత, అది కూడా ఆవిరి యంత్రాలు కనిపెట్టడం వల్ల. కమ్యూనిజం అంత కంటే కొత్తది. మరి కమ్యూనిజం ఎలా కాలం చెల్లిపోతుంది? పెట్టుబడిదారుడు యువకుడైతే కమ్యూనిజం బాలుడు. కమ్యూనిజం ఇంకా బలపడలేదు కానీ దాన్ని కాలం చెల్లడం అనరు.

    మీ కొత్త రాష్ట్ర ముఖ్య మంత్రి కూడా జనం భావజాలం మారకుండా జాగ్రత్త పడుతున్నాడు. పుష్కరాల్లో స్నానాలు చేసి పుణ్యం దక్కించుకోమంటున్నాడు, పాపపుణ్యాలు నిజంగా objectives (వస్తుగతాలు) అయినట్టు!

    ReplyDelete
    Replies
    1. నేను పైన చెప్పిన విషయం చూడండి:

      "అయితే ప్రకృతి (land), శ్రమ (labor), పెట్టుబడి (capital), సమన్వయం (organization, నిజానికి management ఆంటే బెటర్) అన్న ఫాక్తర్లలో ఆధిపత్యాలు ఎలా మారుతాయో అంచనా వేయడంలో మార్క్స్ ఘోరంగా విఫలం చెందాడు. ఆయన అంచనా వేసినట్టు పెట్టుబడి స్థానం శ్రమ తీసుకోలేదు సరికదా అనూహ్యంగా ఆర్గనైజేషన్ పైకి ఎదిగింది. మార్క్స్ తన కాలంలో అంచనా వేయడానికి ముఖ్య కారణం అప్పటిలో యజమానులే మేనేజర్లుగా ఉండడం, అంచేత మేనేజ్‍మెంట్ ప్రభావాన్ని ఆయన అర్ధం చేసుకోలేకపోవడం. ఆ తరువాత వచ్చిన మార్క్సిస్టు మేధావులు డాస్ కేపిటల్ పరిధిని దాటి ఆలోచించలేక పోయారు"

      Delete
    2. ప్రపంచ కార్మికులారా ఏకంకండి అన్న పిలుపు పిలుపుగానే ఉండిపోయింది.శ్రామికులు ఏకం అయితే పెట్టుబడిదారులు దిగిరాకతప్పదు.మేధోపరమైన పనికి కోట్లు డిమాండ్ చేస్తున్నట్లే శ్రామికులూ డిమాండ్ చేసే రోజులు రావాలి.మేధోపరంగా బలంగా ఉన్నవారు శ్రామికులుగా ఉండలేరు,శ్రామికులు మేధోపరంగా ఆలోచించలేరు.కమ్యూనిజం అయినా సోషలిజం అయినా లక్ష్యాన్ని ఏర్పరుచుకోవడం సులభమే కానీ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో చెప్పేందుకు గూగుల్ మాప్,GPS లాంటివేమీ ఉండవు ఎవరికి వాళ్ళు సోధించి సాధిస్తూ పోవడమే !

      Delete
    3. మేధో శ్రమా శ్రమే నీహారిక గారు, డాస్ కేపిటల్ పరిధిలోనే శ్రామిక వర్గం ఆలోచించి,కమ్యూనిస్టు ప్రణాళిక ప్రకారమే సమ సమాజాన్ని నిర్మించాలనేం లేదు. అదో ప్రణాళిక మాత్రమే అని నా అభిప్రాయం. ప్రత్యామ్నయం చెప్పడానికి అసలు డాస్ కేపిటల్ కమ్యూనిస్టులమని చెప్పుకుంటున్నవారు ఎందరు చదువుతున్నారు?

      Delete
    4. మేధోశ్రమా శ్రమే అని ఒప్పుకునే కోట్లాది వేతనాన్ని ఇస్తున్నారు.దీనిని నేను కాదనడం లేదు.శారీరిరిక శ్రమని శ్రమగా గుర్తించడం లేదు.మేధావుల ఆలోచనతోనే పనులు జరుగవు.శారీరిక శ్రమతోనే పనులు జరుగుతాయి.మొన్న ఒక కళాకారుడు తను గీసిన చిత్రాన్ని కోట్లల్లో అమ్ముకోవాలని ఒక ప్రదర్సన ఏర్పాటు చేసాడు.ఆ కళాఖండాన్ని ఒక పది అడుగుల దూరం మోయడానికి పదివేల కూలీ అడిగాడని తన కళాఖండాన్ని తానే ద్వంశం చేసుకున్నాడు తప్ప తన కళాఖండాన్ని తాను మోసుకోలేకపోయాడు,ఇతరుల శ్రమకి విలువ కట్టలేకపోయాడు.కార్మికులకు తమ శ్రమకి ఎంత విలువ కట్టుకోవాలో తెలియదు.విలువ తెలిసినవారు శ్రామికులుగా ఉండలేరు.

      Delete
    5. మేధో శ్రమకే ఎక్కువ విలువ ఉండాలి. శారీరక శ్రమకు , మేధో శ్రమకు అంతులేని వ్యత్యాసాలు ఉండకూడదు. మీరు చెప్పిన ఉదాహరణలు లాంటివి నిత్యం ఎన్ని చూడడం లేదు. అవేకాదు రక రకాల బలుపు ప్రదర్శనలు ఇంకా చాలాకాలం చూడాలి నీహారిక గారు.

      Delete
    6. @నీహారిక:

      మార్క్స్ ప్రకారం సొంత మార్కెట్టులో పోటీ తీవ్రతరం కావడంతో లాభాలు పడిపోయి పెట్టుబడి బలహీనం అవుతుంది. అప్పటికే పుంజుకున్న శ్రమ ఆర్ధిక వ్యవస్థ శిఖరాలను ఆక్రమిస్తుంది. ఇందులో భావుకతకు తావు లేదు.

      @Kondala Rao Palla:

      గుమాస్తాలు (వేతన శర్మలు) వదిలేస్తే అప్పట్లో మేధో శ్రమ అంటూ లేదు. మార్క్స్ వీరి గురించి అందుకే ఏమీ చెప్పలేదు.

      Delete
    7. మీరు డాస్ కేపిటల్ చదివారా? మార్క్స్ మేధో శ్రమ గురించి వ్రాశారు.

      Delete
    8. కొండలరావు గారూ, దాస్ కాపిటల్ చాలారోజుల కింద చదివాను. ఈ అంశం గురించి ఉన్నట్టు గుర్తు లేదు.

      Delete
    9. Engels worked as a manager of a factory in which his father had share. Even the work done by Engels was abstract labour (manasika srama).

      Delete
    10. జై గారు మేధో శ్రమతో పాటు అనుత్పాదక శ్రమ గురించి అనుత్పాదక శ్రమ గురించి కూడా మార్క్స్ చెప్పాడు. ఉదాహరణకు ఇంట్లో వంట చేసే మహిళకు వేతనం లెక్క గట్టాలంటే హోటల్ కుక్ జీతంతో పోల్చి చూడాలి............ అయినా కేపిటల్ ను మనం ఇక్కడ చిన్న చిన్న కామెంట్లతో చర్చించడం సాధ్యం కాదు. మీరు కేపిటల్ చదివానంటున్నారు కనుక మరోసారి వీలయినపుడు మార్క్శ్ మేధో శ్రమను గురించి ఏమి చెప్పాడో పరిశీలించండి.

      Delete
    11. నా ఉద్దేశం లో మార్కిజం ఫెయిల్ కావడానికి ముఖ్య కారణం శ్రమను లెక్కించే సాధనం లేక పోవడమే. పెట్టుబడి దారీ వ్యవస్థలో ఆ సాధనాన్ని సప్లై-డిమాండు భర్తీ చేస్తుంది.

      ఉదాహరణకి అమెరికాలో ప్లంబరు వేతనం సాఫ్ట్‌వేరు ఇంజనీరు కన్నా ఎక్కువ. హైదరాబాదులో చూసినా ప్లంబరు గంట పనికి 500 తీసుకుంటాడు. అదే చిన్న కంపెనీలో కొత్తగా చేరిన SWEకి నెలకు 10000 కూడా రావు.

      వీరిద్దరికి సోషలిజం ప్రకారం ఎలా వేతనం నిర్ణయించాలో చెప్పగలరా?

      >>> ఉదాహరణకు ఇంట్లో వంట చేసే మహిళకు వేతనం లెక్క గట్టాలంటే హోటల్ కుక్ జీతంతో పోల్చి చూడాలి.

      ఈ ఉదాహరణ తీసుకున్నా కూడా అనేకమైన ప్రశ్నలు ఉదయిస్తాయి.
      హోటల్‌లో వంటవాడు రోజుకి కనీసం 400 మందికి వంట చేస్తాడు.
      అదే గృహిణి నలుగురికే వంట చేస్తుంది.
      వీధిపక్క మిలట్రీ హోటల్ వంటవాడికి 10000 మించి వేతనం వుండదు.
      అదే 5 స్టార్ హోటల్లో నెలకు 50000 పైనే వేతనం వుంటుంది.
      మొదటి వంట వాడికన్నా రెండో వంట వాడి నైపుణ్యత ఎక్కువ కావడం దీనికి కారణం.

      అదే సోషలిజంలో పై వంట వాళ్ళకి ఎలా జీతాలు నిర్ణయిస్తారో తెలుసుకోవాలని వుంది. ముఖ్యంగా నైపుణ్యాన్ని ఎలా కొలుస్తారు? కొలబద్దలేమిటి?

      ఇటువంటి అనేక నిర్ణయాలు తీసుకోవడం కోసం ప్రభుత్వంలోని పెద్దల విచక్షణాధికారాలు ఇతోధికంగా పెరిగే అవకాశం లేదా? ఎప్పుడైతే ప్రభుత్వానికి ప్రశ్నించలేనన్ని నిర్ణయాధికారాలు ఇస్తామో అప్పుడే నియంతృత్వానికి దారులు తెరవ బడే అవకాశం లేదా? బహుశా శ్రామిక నియంతృత్వమంటే అదేనేమో కదా!

      Delete
    12. వీలు చూసుకొని మళ్ళీ చదువుతానండీ, బహుశా ఇది పెద్ద ప్రభావం కాకపోవోచ్చు. ఇదెలాగు ముఖ్యాంశం కాదు కనుక ఇతర అంశాల పట్ల ఏమయినా అభ్యంతరం ఉంటె మాట్లాడుదాం.

      Delete
    13. @Chari, In terms of capitalism, demand means will and ability to buy. Diamonds have high demand but no use value for domestic purpose. Tea and coffee have same use value but their prices are different. Capitalists rely on demand because they want profits. Demand is merely psychological. I think you have not read capitalist economics. If so, you might be aware about cross elasticity of demand and income elasticity of demand etc. It is difficult to type Telugu on Micromax mobile. I will write later on Samsung tablet about elasticity of demand (dharala vyakochatvam).

      Delete
    14. #Jai, the decision of a capitalist whether to work as the manager of his factory or not, is related to opportunity cost. It is just like the decision of "employing a chauffeur for your car or driving the car by yourself" and "employing a cook in your home or cooking by yourself".

      Delete
    15. శ్రీకాంత్ చారి గారు,
      మార్క్సిజం ప్రకారం శ్రమ విలువ ను లెక్కించే సాధనం - " సామాజిక సగటు శ్రమ కాలం ". ప్లాన్‍డ్ ఎకానమీలో ప్రజలకు ఉపయోగపు విలువనిచ్చే ఉత్పత్తులు , ఆ ఉత్పాదకతకు అవసరమైన చదువులు, ఉద్యోగాల ఏర్పాటు , పిల్లలు - వృద్ధులు - వికలాంగులు వంటి వారికివ్వాల్సిన విశ్రాంతి వంటివి ప్లాన్ చేసుకోవచ్చు. రోడ్లు , విద్య , వైద్యం వంటివి ప్లాన్ చేసుకోవచ్చు. పర్యావరణం దెబ్బ తినకుండా ప్రక్రుతి వనరులను ఉపయోగించేలా సైన్స్ ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇప్పటి ప్రభుత్వ యంత్రాంగాల లెక్కల ప్రకారం అయినా చిత్తశుద్ధితో చేస్తే మళ్ళీ మళ్ళీ ఎన్నికల పథకాల పునరుద్ధరణలు అవసరం లేకుండా చేసుకోవచ్చు. కానీ అది భ్రమ మాత్రమే అవుతుందని ఆచరణ్ తేల్చింది.

      సప్లై - డిమాండ్ ఏ వ్యవస్థకైనా పనికి వచ్చే ఒక సూత్రం తప్ప అది పెట్టుబడిదారీ వ్యవస్థ సూత్రం మాత్రమే కాదు. పెట్టుబడి దారులు తమకు లాభాలు వస్తాయనుకుంటేనే ఉత్పత్తులు కొనసాగిస్తారు తప్ప, ప్రజలకు ఏది అవసరమో ఎంత సప్లై కావాలని చూడరు. థమ్సప్ కు సూపర్‍స్టార్స్ ప్రచారం చేస్తారీ వ్యవస్థలో! కొబ్బరి నీళ్ళను ప్రమోట్ చేసే దమ్ము సెలబ్రిటీలకు లేకనా? యాడ్ ప్రమోషన్ కు వచ్చే సొమ్మును బట్టి ప్రచారం ఉంటుంది.

      ఈ వ్యవస్థ అవస్థ ప్రకారం సపై అంటే అమ్మడానికి సిద్ధంగా ఉన్న సరుకుల సంఖ్య. డిమాండ్ అంటే వినియోగదారులు కొనడానికి సిద్ధంగా ఉన్న సరుకుల సంఖ్య. మరి ఇక్కడ ఆ సరుకులు కొనలేని తప్పనిసరి ఉపయోగం ఉన్న అభాగ్యుల సంఖ్యని ఏమనాలి? వైద్యం ఖరీదైన సరుకు అయినపుడు దానిని కొనలేని అభాగ్యుల గతి ఏమిటి? ఆ రోగం రావడానికి ఒకవేళ పెట్టుబడిదారులు సృష్టిస్తున్న పొల్యూషన్ కారణమయితే సొల్యూషన్ ఏమిటి?

      సహజంగా సప్లై - డిమాండ్ సూత్రం సమాజానికు ఉపయోగపడాల్సిన తీరు - సమాజానికి ఉపయోగపు విలువనిచ్చే వస్తువులు (సరుకులు కాదు) ఏవి? ఎన్ని ? అనేది లెక్క ఉంటే ( ప్రభుత్వ యంత్రాంగ ఈ డిమాండ్ అంచనా కట్టగలదు), వాటిని అంత మేరకు సప్లై చేయడానికి ప్లాన్ చేసుకుని ఉత్పత్తిని నిర్వహించడం. ఉత్పత్తి అనేది ఇలా పథకం ప్రకారం జరగాలంటే ప్రతీదానిని ఆఖరకు మానవ సంబంధాలను సైతం లాభం తెచ్చే సరుకుగా ప్రమోట్ చేసే విక్రుత పెట్టుబడి దారీ వ్యవస్థ దుంప నాశనం కావాలి.

      మీరు చెప్పిన వేతనాల అసమానతలు లోపాలు అన్నీ ఈ వ్యవస్థలోని అవస్థలు. సామాజిక సగటు శ్రమ కాలం + ప్లానుడ్ ఎకానమీ అనేది శ్రామిక వర్గ (సంపదను సృష్టించే, కాపాడే ప్రజల) ధృక్పథంలో అమలు చేయగలిగితే అసాధ్యం కాదు. మేధో శ్రమ వల్లనే ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. సేవలు జరుగుతాయి కనుక వారికి శారీరక శ్రమ చేసేవారికన్నా ఎక్కువ విలువ దక్కాలి. కానీ ఇప్పటిలా అంతులేని అంతరాలు మేధో, శారీరక శ్రమలకు చెల్లించే విలువలు లేదా వేతనాల మధ్య ఉండకూడదు.

      మార్క్సిజం పేరుతో, శ్రామిక వర్గ నియంతృత్వం పేరుతో అరాచకాలు జరిగాయి. వాటిని అంగీకరించకుండా శత్రువుల, సామ్రాజ్యవాదుల కుట్రలంటూ కామన్ డైలాగులు చెప్పుకోవడం అనవసరం. అవెలాగూ ఉంటాయి. పెట్టుబడిదారీ వ్యవస్థను కూకటివేళ్లతో సహా కూల్చేస్తే తప్ప మానవత్వం - మనిషి తత్త్వం మిగలదు. ప్రతీ అంశాన్ని మానవ సంబంధాలను సైతం అనివార్యంగా దెబ్బతీసే ఈ దుర్మార్గపు వ్యవస్థను కూల్చాల్సిందే. అది మార్క్సిజపు కాగడాతోనా? మరో వినూత్న ఆయుధంతోనా? అన్న సమస్య వేరు విషయం.

      మార్క్సిజం ప్రతిపాదించే శ్రామిక వర్గపు నియంతృత్వం అంటే అసలైన ప్రజాస్వామ్యం. ప్రజలకు ప్రశ్నించే తత్త్వాన్ని, చైతన్యాన్ని పెంచేలా రాజ్యాంగ యంత్రాన్ని వినియోగించడం. క్రమంగా రాజ్యాంగ యంత్రం అనేదాని అవసరం లేకుండా కేవలం కుటుంబం వంటి కొన్ని సాంఘిక ఏజెన్సీలు మాత్రమే మిగలడం. రాజ్యం రద్దు కావడం. ఇపుడు చట్టం, న్యాయం వంటి రాజ్యాంగ వ్యవస్థలు డబ్బున్నోడి పక్షాన ఉన్నట్లు సమాజంలో దుష్టశక్తులు అంతమయ్యేవరకూ అదే రాజ్యాంగ యంత్రాన్ని ప్రజల పక్షాన పని చేసేలా ఉదాహరణకు పోలీసులు అపుడపుడు మన సినిమాలలో చూపించేలా నిజమైన రక్షక భటులుగా పని చేసేలా చేయడమన్న మాట శ్రామిక వర్గ నియంతృత్వం అంటే. కానీ ఆచరణలో కమ్యునిస్టు అధినేతలు కొందరు రాచరికానికి మించిన విధంగా నియంతృత్వపు పోకడలు పోబట్టే ప్రజలలో తిరుగుబాటు వచ్చింది. ఆ తప్పిదాలను కప్పి పుచ్చుకుని ఉపయోగం లేదు. కమ్యునిస్టులకంటే దోపిడీకి గురయినా సరే ఎంతో కొంత స్వేచ్చని అనుభవించగలిగే పెట్టుబడిదారీ వ్యవస్టే బెటర్ అనుకుంటున్న మాట వాస్తవం. అందరూ లెనిన్ లా సిద్ధాంతాన్ని ఆచరణలో నిరూపించడానికి, సిధ్దాంతాన్ని తేలికగా ప్రజల భాషలో చెప్పి వారిని ఓపికగా ఒప్పించడం వంటివి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే మార్క్సిజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా తేవాల్సిన మార్పులు తెలుస్తాయి. అలా కాకుండా మార్క్సిజాన్ని గుదిబండగా మార్చడం, సిద్దాంతాన్ని, చరిత్రను బట్టీ పట్టి గొంతెత్తి అరిస్తే లోకకళ్యాణం జరుగదు.

      Delete
    16. జై గారు, అలాగే చదవండి. మార్క్సిజంలో లోపాలు లేవని కానీ, మార్క్సిజమే పెట్టుబడిని అంతం చేస్తుందని గానీ , మరో ప్రత్యామ్నయం అవసరం లేదని గానీ నేను వాదించడం లేదు. మార్క్స్ మేధో శ్రమ గురించి కూడా వ్రాశాడని మాత్రమే గుర్తు చేశాను.

      Delete
    17. కొండలరావు గారు,

      పెట్టుబడిదారీ వ్యవస్థని కూల్చితే మేధావులకూ,శ్రామికులకూ జీతాలెలా వస్తాయి ?

      Delete
    18. సామాజిక శ్రమ , సామాజిక ఉత్పత్తి ఉండే సోషలిస్టు వ్యవస్థలో ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుంది. అందరికీ పని , అందరికీ విశ్రాంతి ఉంటుంది. మా తాతలు సంపాదించారు కనుక నేను జల్సా చేస్తాననడం మాత్రం కుదరదు. మిగతా అందరికీ ఎవరికి ఏ టేలెంట్ మెరుగ్గా ఉంటుందో వారికి ఆ పని కేటాయింపు జరిగి తీరాలి. ఈ పనులు శారీరక , మేధో ( టీచర్లు , డాక్టర్లు లాంటివి) శ్రమలు ప్రకారం ఇపుడున్నంతటి విచ్చలవిడి అంతరాలు కాకుండా న్యాయమైన చెల్లింపులు ఉంటాయి. మిగులు వ్యక్తులకు గాక సామాజిక అవసరాలకు ( విద్య, వైద్యం, రోడ్లు, రీసెర్చ్ మొదలగు ఉమ్మడి అవసరాలకు) వినియోగం చేయడం ఉంటుంది. ఆ దశ దాటి సమాజం ఇంకా బాగా చైతన్యం అయితే అవసరం మేరకు వినియోగం, ఇష్టం మేరకు పని చేసే కమ్యూనిజం వస్తుందని మార్క్స్ అభిప్రాయపడ్డాడు.

      Delete
    19. Money is a media but not a source. It is possible to establish moneyless economy. Driver and guard are necessary to run the train but ticket clerks and ticket collectors are needed only for subsistence of the railroad company.

      Delete
    20. డబ్బుతో ఏ అవసరమూ తీరదు. కానీ ఈ వ్యవస్థలో ఏ అవసరం తీర్చాల్సిన ఉపయోగాన్నైనా డబ్బుతోటే కొనాలి. డబ్బు కూడా ఒక సరుకే. మారకాలు ఉపయోగపు విలువ ఆధారంగా జరిగే సామాజిక చైతన్యం వెల్లివిరిసినపుడు మాత్రమే డబ్బు రద్దవుతుంది. అపుడు మాత్రమే డబ్బు లెక్కలు కూడా రద్దవుతాయి.

      Delete
    21. ఒక మనిషి జీవితాంతం కష్టపడితే కొంత ఆస్థి సంపాదిస్తాడు.దానిని తన సంతానానికి వారసత్వంగా అందిస్తాడు.తాతల ఆస్థి వారసులకి దక్కకూడదు అంటే దానం చేసెయ్యాలి.దానం ఎవరికి చేయాలి ? సోమరిపోతులయిన బాధ్యతలేని ప్రభుత్వాలకా ? ప్రజలకా ?

      Delete
    22. మంచి ప్రశ్న ఒక మనిషి తన అవసరానికి మించి ఎందుకు కష్టపడాలి? మనిషిలో ఇతర సహజత్వాలను పట్టించుకుని ఆనందించకుండా అభద్రతతో ఎందుకు పని చేయాలి? మనిషి ఆనందాల్ని ఎందుకు కోల్పోవాలి?

      ఇక సోమరులు అనేవారు ఉంటే (ఉండనిస్తే) కదా? పంచడానికి. 'మిగులు' అనేది సమాజానికి ఉపయోగపడుతుంది - ఉపయోగపడాలి నీహారిక గారు. అదే ప్రకృతి సహజ సూత్రం కూడా.

      ఒక స్కూలు ఉంది? ఒక రోడ్డు ఉంది? ఇలా (అందరికీ) సమాజానికి ఉపయోగపడేవి ఉంటాయి, ఉండాలి కదా? వాటిని బాగు చేయడానికి మాత్రమే మిగులుని ఉపయోగించాలి. అపుడే అంతా బాగుంటుంది. అందరూ బాగుంటారు. లేకుంటే కొందరి ఇళ్ళు ఆకాశ హార్మ్యాలుగాను ఎందరివో ఆ పక్కనే గుడిసెలో లేక అవి కూడా లేకనో ఉంటాయి.

      Delete
    23. మనుషులలో లాభం మీద ఆసక్తి వల్లే అభివృద్ధి జరుగుతుంది. దీన్ని గుర్తించాకే చైనా పెరుగుదల మొదలయింది.

      Delete
    24. నాకు చిన్న పూరిళ్ళు కూడా శుభ్రంగా ఉంటే చాలు నచ్చుతాయి.నా తోడబుట్టిన మా అక్కకి కళాత్మకంగా ఉన్న ఆకాశహార్మ్యాలే నచ్చుతాయి.తన ఇష్టానికి వ్యతిరేకంగా జీవించమని చెప్పకూడదు కదా ? మా అభిరుచికి తగిన భాగస్వాములను మేము ఎంచుకున్నాము.ఒకే తల్లి పిల్లలమైన మేమే భిన్నంగా ఆలోచిస్తుంటే దేశంలోని అందరూ ఒకేలా ఎలా ఉండగలరు ?
      సోమరులను వారి స్థాయిలోనే బ్రతకమని చెప్పాలి కానీ అందరితో సమానంగా బ్రతుకుతానంటే ఎలా కుదురుతుంది ?

      Delete
    25. భిన్న ఆలోచనలు అత్యంత సహజం. మనుషులంతా ఎప్పటికి సమానం అసాధ్యం. అందరికీ సమాన అవకాశాలు మాత్రం ఉండాలి. అందరూ సమానం ఎప్పటికీ కాలేరు. అందరికీ పని కల్పిస్తే సోమరులు ఉండరు. ఉండనివ్వకూడదు.అసలు సోమరులు ఉండకూడదు అని కదా అంటున్నది. మనుషులంతా ఎప్పటికీ ఒక్కటి కాలేరు. కానీ ఎవరు ఎవరిని దోపిడీ చేయకుండా, ఎవరి అవకాశాలను ఇంకొకరు అడ్డుకోని వ్యవస్థ ఉండాలి. అభిరుచులు అంటే పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది. చుట్టూ డబ్బుకు, ఫలానా నగలు ఉంటే , ఫలానా మేడలుంటే.... ఇలాంటి ఆధిపత్య ప్రదర్శనలను గొప్పగా చూస్తున్నపుడు అవే కోరికలు కలుగుతాయి. అలా ఉంటేనే గొప్ప అనుకుంటారు. వేటిని ప్రచారం చేస్తే ఆ గొప్పదనంలొ బ్రతకదానికి ఇష్టపడతారు. అందుకే ప్రజలలో ఆ చైతన్యం తీసుకు రాకుండా ఒకేసారి మార్పు రాదు. బలవంతంగా తెచ్చినా ఫలవంతం కాకుండా కూలిపోతాయి. అయితే మనిషి స్వతహాగా మంచివాడు. ఆకాశ హార్మ్యాలు లేనపుడు ఆ కోరిక ఉన్నదా? అదే కరెక్టనుకుంటే బలవంతుడు బలహీనుడిని లొంగదీసుకుని బ్రతకడాన్ని కూడా సమర్ధించుకుంటాడు. దానిని అంగీకరించాలా? నలుగురితో కలసి నలుగురి కోసం అన్నదే మనిషి తత్వం. దానిని చెడగొట్టకుండా ఉంటే చాలు. ఎవడిష్టం వచ్చినట్లు వాడు అన్నది సరికాదు. ఎవరి శక్తిమేరకు వారు అన్నది సరయినది.

      Delete
    26. < మనుషులలో లాభం మీద ఆసక్తి వల్లే అభివృద్ధి జరుగుతుంది. దీన్ని గుర్తించాకే చైనా పెరుగుదల మొదలయింది. >
      జై గారు లాభం అభివృద్ధి అనిపించుకోదు. ఒకరికి లాభం అంటే అది ఇంకొకరికి నష్టం అయ్యేలా ఉండనిది అభివృద్ది. లాభాపేక్ష మనిషి సహజ లక్షణం కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థలో మనిషి అలా పరాయీకరణ చెందుతాడు తప్ప మనిషి స్వతహాగా మంచివాడు. మనిషికి ఏవి అలవాటుగా నేర్ప్తితే అవే లక్షణాలను ఆలవాటు చేసుకుంటాడు. బిడ్డ నుండి ఏ లాభం ఆశించి తల్లి పెంచుతుంది. ఇలాంటి సహజాతమైన మానవీయ సహజ లక్షణాలును మనిషి కోల్పోయేది ఈ లాభాపేక్ష వల్లనే. ఉత్పత్తి పెంపు అనేది లాభం కోసమే అయితే ఇపుడు లాభాలు ఎవరికి వస్తున్నాయి? ఎవరు పని చేస్తున్నారు? శ్రమ చేసేది శ్రామికులు - లాభాలు కొట్టేస్తున్నది పెట్టుబడి దారులు. అలాంటపుడు శ్రామికులు లాభాల కోసం పని చేస్తున్నట్లు కాదు కదా? లాభాలు పెట్టుబడిదారుడికి వస్తున్నాయని శ్రామికులు పని చేయకుండా ఉండడం లేదు కదా?

      Delete
    27. కొండలరావు గారూ, నేను లాభాపేక్ష మనుషుల సహజ గుణమంటే మీరు మనిషి స్వతహాగా మంచివాడు అన్నారు. మంచివారు లాభాలను కోరుకోరా?

      శ్రామికులు కష్టపడి పనిచేస్తున్నారు నిజమే కానీ ప్రతిఫలం ఆశించకుండానే కాదు. తక్కువ జీతం ఇస్తే ఎవరూ పని చేయరు, మరీ ఎక్కువ అడిగితె ఇచ్చే వారు తగ్గుతారు.

      ఈ డిమాండ్-సప్లై మెకానిజం తోటే ధరలు (& తద్వారా లాభం) నిర్ణయించబడతాయి. విలువ మార్కెట్ నుండి వస్తుంది తప్ప భావుకతతో కాదు.

      Delete
    28. జై గారు, భావుకత తో విలువ నిర్ణయించకూడదు. శ్రమను బట్టే విలువను నిర్ణయించాలి. సప్లై - డిమాండ్ లను బట్టి ధరలలో మార్పులు రావచ్చు. విలువ వేరు ధర వేరు.

      అలాగే లాభం వేరు ప్రతిఫలం వేరు శ్రమ చేసి ఫలితం ఆశించడం కరెక్టు. ఏ శ్రమా లేకుండా ఆశించే లాభం దోపిడి గుణం. అది మనిషి సహజ గుణం కాదు.

      Delete
    29. కొండలరావు గారూ, శ్రమ ఖర్చు వంటిది. విలువ రెండు రకాలు: అంతర్గత విలువ (intrinsic value) & మార్పుడు విలువ (exchange value).

      శ్రమ కొండొంత ఉన్నా కొనేవాడు లేకపోతె విలువ సున్నా. శ్రమకు (ఖర్చుకు) తగినంత విలువ రానప్పుడు చేసే (అమ్మే)వాడు మార్కెట్ బయటికి వెళ్తాడు, తద్వారా సప్లై తగ్గి విలువ పెరుగుతుంది.

      Delete
    30. శ్రామికులే ప్రస్థుతం పనిచేయడం లేదు.రోజంతా శ్రమ చేస్తేనే రోజు గడిచే పేదలున్నారు.ఇదివరకు వేతనానికీ జీవనానికీ సరిపోయేది.ఇపుడు శ్రామికుల వేతనానికీ జీవనానికీ సరిపోవడం లేదు.నిరాసక్తత అనండి, బద్దకం అనండి,పరిసరాల శుభ్రత అసలు లేదు.ఇదివరకు చిన్న ఇళ్ళు అయినా నీట్ గా ఉంచుకునేవారు.ఇపుడు చేతిలో కాస్త డబ్బు ఉంటే సెల్ ఫోన్ కీ,మల్టీప్లెక్స్ లో సినిమాలు చూడడానికి,తాగడానికే ఉపయోగిస్తున్నారు.గుజరాత్ లోనూ,డిల్లీ లోని రేస్ కోర్స్ రోడ్లల్లో ఉన్నవాళ్ళు ఎలాగూ రోడ్లు,పరిసరాలూ శుభ్రంగా ఉంచుకుంటారు.శ్రామికులుండే రోడ్లు,పరిసరాలు అసలు శుభ్రంగా ఉండవు.మంత్రులూ ఎం పీలు ఉన్న చోట్ల ప్రభుత్వాలే పనిచేసిపెడ్తున్నాయి.పేదలుండే చోట ప్రభుత్వాలు చేయకపోతే వారు శ్రమ జీవులే కదా వారే ఎందుకు శుభ్రం చేసుకోరు అనేదే నాకు అర్ధం కాని ప్రశ్న !

      Delete
    31. పని చేయని వారిని శ్రామికులు అని ఎలా అంటారు నీహారిక గారు? వాళ్లు లంపెన్ బేచ్ అవుతారు. శ్రామికులకి ఒక చేత్తో జీతాలు ఇచ్చి రెండో చేత్తో లాక్కోవడానికి పెట్టుబడి ఎపుడూ ప్రయత్నం చేస్తుంది. అదే మార్కెట్ మాయాజాలం. అభిమాన హీరో థమ్సప్ త్రాగాడని లెట్రిన్ లు కడుక్కోవడానికి మాత్రమే ఉపయోగపడే వాటిని త్రాగే అమాయకులుండబట్టే హీరోలకు యాడ్ రెమ్యునరేషన్ కంపెనీలకు లాభాలు శ్రామికులనబడే అమాయకులకు రోగాలు వస్తాయి. ఒకప్పుడు మన సంస్కృతి కొంతవరకు కాపాడి మంచి అలవాట్లతో కొంత మీరన్న పరిశుభ్రత ఉండేది. ఇపుడు గ్లోబలైజేషన్ కు బార్లా తలుపులు తెరిచాక మార్కెట్ దోపిడీ దారులు ఎవడు ఎక్కడైకైనా వెళ్లి ఎంత మాయ చేసైనా ఎంత మత్తులో దింపైనా తమ సరుకులు అమ్ముకోవడానికి పోటీపడతారు. ఈ పోటివల్ల ప్రజలు కూడా మనుషులుగా మాయమైపోతారు. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. మనుషులు కేవలం వినియోగదారులుగా దారుణంగా అనివార్యంగా మారతారు. మార్చబడతారు. ప్రతీ రోజుకు ఒక ప్రత్యేకతను సృష్టించి ఆ రోజు శుభాకాంక్షలకు కంపెనీల ప్రొడక్టులను గిఫ్టులుగా ఇవ్వకపోతే వాడు చేతకాని భర్తగానో , ప్రేమికుడిగానో, తండ్రగానో , ...... ఇలా మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాలుగా మారతాయి. ఒకప్పుడు గ్రామంలో పెళ్ళి జరిగితే బంధువులు స్నేహితులు అంతా కలసి తలా ఒక పని చేసి కలసి కట్టుగా అన్న్ని పనులు చేసేవారు. ఇపుడు ఒక పెళ్ళిలో ఎన్ని కొత్త సరుకులు చేరాయో లెక్కవేయండి. ఇదంతా మార్కెట్ మాయాజాలం. పేద ప్రజలకు ప్రభుత్వాలు సేవలు చెయ్యవు. చైతన్యమూ పెంచవు. ఓట్లపుడు మందిచ్చో, నోటిచ్చో , కులం , మతం కార్డు ఉపయోగించో తాత్కాలిక తాయిలాలతో వాడుకోవచ్చు కనుక వారిని త్రాగుబోతులుగా, జులాయిలుగానే ఉంచుతారు. వారి సంపాదనే కాక పెళ్ల్లాలను హింసించి కూడా త్రాగేస్తుంటారు. ఇదంతా పెట్టుబడిదారీ సంస్కృతే తప్ప భారతీయ సంస్కృతి కాదు.

      Delete
    32. < కొండలరావు గారూ, శ్రమ ఖర్చు వంటిది. విలువ రెండు రకాలు: అంతర్గత విలువ (intrinsic value) & మార్పుడు విలువ (exchange value).

      శ్రమ కొండొంత ఉన్నా కొనేవాడు లేకపోతె విలువ సున్నా. శ్రమకు (ఖర్చుకు) తగినంత విలువ రానప్పుడు చేసే (అమ్మే)వాడు మార్కెట్ బయటికి వెళ్తాడు, తద్వారా సప్లై తగ్గి విలువ పెరుగుతుంది. >

      జై గారు, మార్క్సిజమూ, కేపిటలిజమూ వదిలేసి ప్రకృతి సిద్దంగా ఆలోచిద్దాం. ఏ వస్తువైనా తయారు కావాలంటే అందులో ప్రకృతి పదార్ధమూ + మానవ శ్రమ మాత్రమే ఉంటాయి. ఇంకేమీ అవసరం లేదు. ప్రతీదానిలో ఉపయోగపు విలువ , మారకపు విలువా ఉంటాయి.

      ఉపయోగపు విలువ అది మనిషికి తీర్చే అవసరాన్ని బట్టి నిర్ణయమవుతుంది. ఇక మారకపు విలువ అనేది అందులో ఉన్న సామాజిక సగటు శ్రమ కాలం ను బట్టి ఏర్పడుతుంది. ఒక కుండ తయారు చేయడానికి మొత్తం ఒక రోజు శ్రమకాలం పడితే , చెప్పుల జత తయారు చేయడానికి ఐదు రోజుల సమయం పడితే ఒక చెప్పుల జత = ఐదు కుండలు అవుతాయి. అంటే ఐదు కుండలు ఇస్తేనే చెప్పులు జత ఇస్తాడు. ఇదే మారక సాధనంగా ఉపయోగ పడే లెక్కలలో డబ్బుతో లెక్కించి చెపితే గంటకు ఒక రూపాయనుకుంటే ఐదు కుండలకు కలిపితే నూట ఇరవై రూపాయలు అవుతాయి. చెప్పుల జత విలువ కూడా నూట ఇరవై అవుతుంది కాబట్టి సామాజిక సగటు ప్రకారం చెప్పుల జత విలువ నూట ఇరవై అవుతుంది. సప్లై డిమాండ్ సూత్రం అప్లై అయినా , కృత్రిమ కొరత సృష్టించినా పెరిగేది ధర మాత్రమే. అది కార్మికునికి రాదు.

      < శ్రమ కొండంత ఉన్నా కొనేవాడు లేకపోతే విలువ సున్నా > అసలు కొనేవాడికోసం ఎందుకు తయారు చేయాలి. ఉపయోగించుకునేవారికోసం తయారు చేయాలి. కొనేవాడు లేనపుడు ఎందుకు తయారు చేయాలసలు? అంటే తయారీ అనేది దేనికోసం జరగాలి? దేనికోసం జరుగుతున్నది? ఈ ప్రశ్న కీలకంగా వేసుకుంటే సమాధానం స్పష్టంగా దొరుకుతుంది.

      సప్లై తగ్గితే ధర పెరుగుతుంది. విలువ పెరగదు. విలువ అంటే తయారీ అపుడే శ్రామికునికి జీతంగా ఇచ్చేస్తారు. అమ్మినపుడు సపై - డిమాండ్ ని బట్టి ధర పెరగడం లేదా తగ్గడం , ఒక్కోసారి కృత్రిమ కొరత సృష్టించి పెంచేవన్ని ధరలే. ఈ ధరల వల్ల వచ్చే లాభ, నష్టాలతో శ్రామికుడికి సంబంధం లేనపుడు అది విలువ ఎలా అవుతుంది? వినియోగదారుడు తన అవసరం కోసం సరుకును కొని వస్తువుగా ఉపయోగించుకుంటాడు.

      Delete
    33. కొండలరావు గారు,

      >>> జై గారు, భావుకత తో విలువ నిర్ణయించకూడదు. శ్రమను బట్టే విలువను నిర్ణయించాలి. సప్లై - డిమాండ్ లను బట్టి ధరలలో మార్పులు రావచ్చు.

      కమ్యూనిజం ఓపెన్ మార్కెట్ కాదు, కాబట్టి అక్కడ సప్లై, డిమాండ్ రెండూ అధికారం చేత కంట్రో చేయబడతాయి. అలాగే జరిగింది కూడా. దాన్ని "Controlled Economy" అంటారు.

      కేవలం పెట్టుబడి దారీ వ్యవస్థ వల్లే స్వేఛ్ఛా మార్కెట్‌కి ('Laissez Faire') అవకాశం వుంది.

      కంట్రోల్‌డ్ ఎకానమీలో కర్ర ఎవరిచేతిలో ఉంటే బర్రె వారిదైనట్టు కంట్రోల్ ఎవరిచేతిలో వుంటే వారి చేత ధరలు, సప్లై, డిమాండు అన్నీ నిర్ణయించ బడతాయి. వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం కంట్రోల్ చేస్తున్నారంటే అది ఆబ్జెక్టివిటీనుంచి సబ్జెక్టివిటీకి వెళ్ళినట్టే.

      మీరు కమ్యూనిజాన్ని చదివారు కదా - అలాగె AYN RANDని కూడా చదవండి. అప్పుడు మీకు వాదనకు రెండువైపులు కనబడతాయి.




      Delete
    34. కమ్యూనిజం, కేపిటలిజం, AYN RAND అన్నింటిలో ఉన్న మంచిని తీసుకుందాం తప్ప ఏదో ఒకటి చదివి ఎందుకు బట్టీ పట్టాలి శ్రీకాంత్ చారి గారు.

      కర్ర ఎవరి చేతిలో ఉంటే బర్రె వారి చేతిలో ఉంటుంది. కరెక్టే పెట్టుబడి దారుడి చేతిలో ఉండాలా? వినియోగదారుడి చేతిలో ఉండాలా? రైతుకు తన ఉత్పత్తికి ధర నిర్ణయించే అధికారం ఎవరి చేతిలో ఉంటున్న్దది? మార్కెట్లో పంటనమ్మాక , తన అవసరాలకోసం కొనే ఏ సరుకుకైనా ఎవడు రేటు నిర్ణయిస్తున్నాడు? మరి ఇక్కడ ఏ పరిస్తితిలో కర్ర ఎవడి చేతిలో ఉండాలి? ఎలా ఉంటున్నది? మీరు చెప్పండి.

      స్వేచ్చా మార్కెట్ ప్రమాదకరమైనది. పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. కనుక ప్లానుడ్ ఎకానమీ యే సరైనది. మార్క్సిజం ప్రకారమే కమ్యూనిస్టులే అమలు చేయాలని నేను చెప్పడం లేదు. కమ్య్ణునిస్టులు చెపుతున్నారు కాబట్టి మంచిని వ్యతిరేకించవద్దంటున్నాను. లేదా ఏది మంచిదో తేల్చుకుని అమలు చేయాలంటున్నాను.

      Delete
    35. >>> కమ్యూనిజం, కేపిటలిజం, AYN RAND అన్నింటిలో ఉన్న మంచిని తీసుకుందాం తప్ప ఏదో ఒకటి చదివి ఎందుకు బట్టీ పట్టాలి శ్రీకాంత్ చారి గారు.

      అల్లా అల్ని నేననలేదే! పైగా నేనే రెండువైపులా అధ్యయనం చేయాలి అని చెప్పాను.

      రెండు వైపుల మంచిని తీసుకుందాం అనే వారైతే "స్వేచ్చా మార్కెట్ ప్రమాదకరమైనది." అనేయరు. అది ఒక వైపు వాదన.

      "కంట్రోల్ ఎంత ఎక్కువ చేస్తే నియంతృత్వం అంత పెరుగుంది" అన్నది ఇంకోవైపు వాదన. సోషలిజం అమలు చేయడానికి అత్యంత భారీ స్థాయిలో అలాంటి నియంతృత్వం అవసరం.

      ప్రజలు ఆకలితో నైనా అలమటిస్తారు కాని నియంతృత్వం మాత్రం కోరుకోరు అన్నది చరిత్ర చెప్పిన వాస్తవం. ప్రపంచంలో 90%నికి పైగా దేశాలు పెట్టుబడిదారీ వ్యవస్థనే అమలు జరుపుతున్నాయి. జీవన ప్రమాణాలు చూసినా, అభివృద్ధి పరంగా చూసినా సోషలిస్టు దేశాలకంటే అవే మెరుగ్గా ఉన్నాయి.

      మార్క్సు వంద సంవత్సరాల కింద చెప్పినట్టుగా పెట్టుబడిదారీ వ్యవస్థ చితికి పోయి కమ్యూనిజం రాలేదు, పైగా అదే మరింత పరిణతి సాధించింది.

      విఙ్ఞానం అనేది నిరంతరం అభివృద్ధి చెందాలి. అటువంటిది ఇప్పటికీ మార్కిస్టులు మార్స్కు చెప్పినది పునఛ్ఛరణ చేయడం తప్ప దానికి కొత్త హంగులు దిద్దలేక పోతున్నారు. అర్థం అదీ ఇతర బైబిలు, కురాను వంటి పుస్తకాల్లాగే జడంగా పురోగమనం లేకుండా, నమ్మాల్సిందే తప్ప ప్రశ్నించ కూడదు అనే విధంగా మారింది.

      అలాగని కమ్యూనిజం చెప్పేదాంట్లో మంచి లేదని అనను. కాని మంచిగా కనపడేదంతా మంచి కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆచరణకు అది సాధ్యం కాదు.

      క్యాపిటలిజంలో లొసుగులు లేవనీ అనను. కాని రెండిటితో పోలిస్తే రెండోదే ఎక్కువ ప్రజాస్వామ్య యుతమైనది. కాబట్టి తక్కువ ప్రమాదకరమైనది.

      Delete
    36. శ్రీకాంత్ చారి గారు,
      బట్టీ పట్టడం అనేది జనరల్ గా ముఖ్యంగా కమ్యూనిస్టు మిత్రులను దృష్టిలో ఉంచుకుని చెప్పింది.

      రెండు వైపుల నుండి మంచిని తీసుకోవడం అంటే ప్రమాదాన్ని గమనించవద్దని కాదు కదా? ఇపుడున్న స్వేచ్చా మార్కెట్ ప్రమాదకరమైనది. పర్యావరణ పరంగా, మానవ విలువల విధ్వంసం పరంగా.

      కంట్రోల్ అనేది నియంతృత్వంగా మారకూడదు. స్వేచ్చ అనేది విచ్చలవిడిగా ఉండకూడదు. ప్రజలు స్వేఛ్చకు ఎక్కువ విలువ ఇస్తారనేది కమ్యూనిస్టులు తప్పని సరిగా నేర్చుకోవలసిన పాఠం. అయితే అది సిధ్ధాంత లోపం కన్నా, ఆచరణలోని అహంకారం, అతి మరియు ఇతర అనేక అవలక్షణాలు ముఖ్యంగా సిద్ధాంతాన్ని ప్రజలకు వివరించడంలో, సిద్ధాంతాన్ని బట్టీ పట్టినట్లు మొరటుగా, మొండిగా, గిడసబారినట్లుగా కాకుండా ప్రజల సాంస్కృతిక చైతన్యానికి దగ్గరగా కార్యక్రమాలు తీసుకోవాలి.

      పెట్టుబడిదారీ వ్యవస్థ దానంతటదే చితికిపోదు. దానిని చితక్కొట్టాలి. చితక్కొట్టాల్సిన వారి చైతన్యం ను బట్టి పెట్టుబడి జీవితకాలం ఆధారపడి ఉంటుంది. డెఫినెట్ గా అది శాశ్వతం మాత్రం కాదు. కాకూడదండి.

      మార్క్సిజాన్ని మత గ్రంధాల్లా వల్లె వేయడం కంటే అప్‍డేట్ చేసుకోవాలనే మీ అభిప్రాయంతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. మత ప్రచారకుల బోధనలు, కార్యక్రమాలు భక్తులకు అర్ధమయ్యేలా ఉంటాయి. మార్క్సిస్టుల బోధనలు , వాదనలు , కార్యక్రమాలు కార్మికులకే కాదు విజ్ఞానులకు సైతం అర్ధం కానట్లు ఉంటున్నాయనిపిస్తుంది నాకైతే.

      మార్క్స్ చెప్పిన శ్రామిక వర్గ నియంతృత్వం నిజానికి అసలైన ప్రజాస్వామ్యం గురించి. ఆ పదం అలా కాక శ్రామిక వర్గ ప్రజాస్వామ్యం అంటే బాగుంటుంది. ఇప్పటి ప్రజాస్వామ్యంలో కోర్టులు, చట్టాలు, న్యాయం, విద్య , వైద్యం , గౌరవం.... అన్నీ ఎవరికి అందుబాటులో ఉంటున్నాయో నిజాయితీగా ఆలోచించి అవి ప్రజలకు అందుబాటులోకి తేవడమే శ్రామిక వర్గ ప్రజాస్వామ్యం లక్ష్యం. ప్రజాస్వామ్య పద్ధతులను విస్మరించడం కాక అసలైన ప్రజాస్వామ్యాన్ని , ప్రజలకు ప్రశ్నించే లక్షణాలను నేర్పాల్సింది పోయి కమ్యూనిస్టు పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రశ్నిస్తేనే సహించలేని స్తితికి చేరుకోవడం దుర్మార్గం. ఇది సిద్దాంతం తప్పు కాదు కదా? ఆచరణలో లోపాలను సిద్ధాంతానికి అన్వయించడం సరయినది అవుతుందా? పరిష్కారానికి మార్గం చూపుతుందా?

      కేపిటలిజంలో అసలు మంచే ఉండదనుకోవడం మూర్ఖత్వమే. కేపిటలిస్టు అంటే దుర్మార్గుడు, శ్రామికుడు అంటే బుద్ధిమంతుడు అనుకోవడం ఎంత తప్పో కేపిటలిజం అంతా తప్పుల తడక అనుకోవడమూ అంతే తప్పని నా అభిప్రాయం. కులం, మతం , మూఢ నమ్మకాలు వంటి అనేక అవలక్షణాలను బద్ధలు కొట్టగల శక్తి కేపిటలిజానికి ఉన్నది. బూర్జువా సంస్కృతిని సంపూర్ణంగా ఆధ్యయనం చేయాలని లెనిన్ చెప్తాడు. సంపదను సృష్టించే స్పీడు కేపిటలిజంకు ఉన్నంతగా మరే వ్యవస్థకు ఉండదని నా అభిప్రాయం. అదే సందర్భంలో మనిషికీ మనిషికీ , మనిషికీ మనసుకూ మధ్య అంతరాలను సృష్టించేది కూడా కేపిటలిజమే. ప్రకృతి జీవన విధానాన్ని నాశనం చేసేది కేపిటలిజం.

      జీవన ప్రమాణాలు చూసినా, అభివృద్ధి పరంగా చూసినా సోషలిస్టు దేశాలకంటే కేపిటలిస్టు దేశాలే మెరుగ్గా ఉన్నాయనేది తప్పు. కొన్ని దేశాలు మాత్రం బాగున్నమాట వాస్తవం.

      Delete
    37. పెట్టుబడిదారీ వర్గాన్ని చితక్కొట్టాలా ? ఎలా ? ఎందుకు ?

      ఆడవాళ్ళందరూ పెట్టుబడిదారీ వర్గాలే ! కట్నమో,ఆస్థో,అందమో ఏదో ఒక పెట్టుబడిపెట్టకుండా భాగస్వామి గా రారు. మేము పెట్టుబడి పెట్టాము కాబట్టే మీరు పనిచేయాలి.60 సంవత్సరాలు దాటాక మా స్వాతంత్ర్యం మాకు కావాలి అంటే కుదరదు.మీరు శ్రామికులు శ్రామికుల్లాగానే ఉండాలి.శ్రామిక నియంతృత్వం చెల్లదు.శ్రామిక ప్రజాస్వామ్యం కోసం పోరాడుకుని స్వతంత్రులవ్వండి.

      Delete
    38. @చారి, Ayn Rand వాదం కేవలం వ్యక్తి గురించి ఆలోచించాలని చెపుతుంది. జాతి లేదా ప్రాంతీయ అస్తిత్వవాదాలు ఆ వాదానికి సరిపడవు. అయినా ప్రజలు భావావేశాలకి అతీతులు కాదు కాబట్టి Ayn Randవాదులు కూడా తాము తెలంగాణావాదులమనో, సమైక్యవాదులమనో చెప్పుకుంటారు.

      Ayn Rand గురించి నన్ను అడిగితే అది వర్గ స్వభావం తెలియని ఒక రకపు వాదం అని నేను అంటాను. "మనిషి తన కోసమే బతుకుతాడు కానీ ఇంకొకడి కోసం బతకడు" అనే నిజం మార్క్సిస్త్‌లకి కూడా తెలుసు. అదేమీ Ayn Rand కనిపెట్టినది కాదు. అలాంటి నిజాలు జనానికి తెలియడానికి చంద్రబాబు, కె.సి.ఆర్. లాంటి పాలకవర్గంవాళ్ళు ఒప్పుకుంటారా? "నేను కమ్మోళ్ళూ, వెలమదొరల పెంపుడు బర్రెల్ని కడగడానికి పుట్టలేదు, నాకు వ్యక్తి స్వేచ్ఛ కావాలి" అని ఒక మాదిగోడు అంటే ఏమవుతుందో తెలియని అమాయకులు పాలకవర్గంలో లేరు.

      Delete
    39. @Praveen

      Note this point
      "పైగా నేనే రెండువైపులా అధ్యయనం చేయాలి అని చెప్పాను."

      AYN RAND చెప్పినా, KARL MARKS చెప్పినా నను మొత్తానికి మొత్తం స్వీకరించలేను. కాని రెండింటిలోనూ సరిగా అనిపించిన విషయాలను స్వీకరించడానికి వెనుకాడను.

      Delete
  5. FYI, some factories in China functioned without managers in Mao's era.

    పౌర స్మృతులు (civil laws) మాత్రమే సమాజాన్ని బట్టి ఉంటాయి. ఉదాహరణకి ఇస్లామిక్ దేశాల్లో cousin marriagesని నిషేధించడం సాధ్యం కాదు. Cousin marriage అనేది వాళ్ళ సంస్కృతిలో భాగం కాబట్టి దాన్ని చట్టాలతో మార్చలేరు. అలాగే క్యూబాలో రమ్ తాగడాన్ని నిషేధించడం సాధ్యం కాదు, రమ్ తాగడం వాళ్ళ సంస్కృతి కాబట్టి.

    కానీ పాలనకి సంబంధించిన నిర్ణయాలు ప్రజల ఇష్టం ఆధారంగా ఉండకపోవచ్చు. 1956లో తెలంగాణని ఆంధ్రలో కలిపింది ప్రజల ఇష్ట ప్రకారం కాదు కదా.

    ReplyDelete
    Replies
    1. @Praveen,

      >>> FYI, some factories in China functioned without managers in Mao's era.

      If they were being 'functioned', why they were closed?

      Delete
    2. I will discuss on Deng Xiaoping later on my blog.

      Delete
  6. కొండలరావు గారు, గ్రాఫిక్స్ వల్ల మీ వెబ్‌సైత్ మొబైల్‌లో చాలా నెమ్మదిగా లోద్ అవుతోంది, మొబైల్‌లో మీ వెబ్‌సైత్‌లో తెలుగు paste చెయ్యడం కూడా కష్టంగా ఉంది. కొంచెం చిన్న గ్రాఫిక్స్ పెట్టి చూడండి.

    ReplyDelete
    Replies
    1. ప్రవీణ్ గారు, మీరు ఇంతకు ముందు వెబ్ వర్షన్ ఓపెన్ చేసినట్లైతే, ఇపుడు సైట్ చివరిలో కనిపించే view mobile version సెలక్టు చేసుకోండి.

      Delete
    2. టాబ్ లో కూడా ప్రజ లోడింగ్ మరియు కమెంట్స్ వ్రాయడం కష్టంగా ఉంది.నాకు మాత్రమే ఇలా అవుతుందేవిటని అనుకున్నాను.ప్రవీణ్ కూడా అనడంతో తెలిసింది.ఆర్చీవ్స్ మాత్రమే ఉంచితే సరిపోతుందేమో ?

      Delete
    3. I use bo mobile and tab but this site loads slow on the both.

      Delete

    4. పోర్టల్ స్లో గా లోడ్ కావడానికి కారణం నీహారిక గారి ప్రశ్నల్ వేటు (అప్పు తచ్చు వైటు!) ఉంటుందను కుంటా :)

      జేకే !

      ముఖాముఖీ బాగుంది ! జై గొట్టి గారిని చాలా విధాలుగా (పరి పరివిధాలు గా) ప్రశ్నించి నా చాలా నిక్కచ్చి గా సమాధానం, నిబద్ధత గా సమాధానం ఇవ్వడం వారి కే చెల్లు !

      చీర్స్
      జిలేబి

      Delete
    5. @ ప్రవీణ్ గారు , నీహారిక గారు జై గారి ఇంటర్వ్యూ పోస్టు ఒక్కటేనా? మిగతా అన్ని పోస్టులు అంతే స్లోగా ఉన్నాయా? ఎక్కడెక్కడ స్లోగా ఉంది అబ్జర్వ్ చేసి చెప్పగలరా? ప్రాబ్లం ఎక్కడ ఏ విడ్జట్ వల్ల ఉందో దానిని తొలగిస్తే సరిపోతుంది.

      Delete
    6. Every page is slowed down by graphics and java script plugins.

      Delete
    7. sorry mr.praveen, i will try to solve the problem.

      Delete
    8. ప్రవీణ్ గారు, మొబైల్ వెర్షన్ వరకు త్వరగా లోడ్ అయ్యేలా టెంప్లేట్ మార్చాము. ఇపుడు ట్రై చేసి ఎలా ఉన్నది చెప్పగలరు.

      Delete
  7. జై గారు మీకు నా అభినందనలు. ప్రశ్నలు జవాబులు బాగున్నాయి. మీ ఇంటర్వ్యూ చూసి సంతోషించాను.

    ReplyDelete
    Replies
    1. గ్రీన్ స్టార్ గారు , మీ మెయిల్ ఐ.డీ నాకు మెయిల్ చేయగలరు.

      Delete
    2. చాలా థాంక్సండీ

      Delete
  8. పోర్టల్ స్లో గా లోడ్ కావడానికి కారణం నీహారిక గారి ప్రశ్నల్ వేటు (అప్పు తచ్చు వైటు!) ఉంటుందను కుంటా :)

    జేకే !

    ముఖాముఖీ బాగుంది ! జై గొట్టి గారిని చాలా విధాలుగా (పరి పరివిధాలు గా) ప్రశ్నించి నా చాలా నిక్కచ్చి గా సమాధానం, నిబద్ధత గా సమాధానం ఇవ్వడం వారి కే చెల్లు !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. చాలా థాంక్సండీ

      నా ఇంటర్వ్యూ ఇంత చక్కగా ఉండడానికి బ్లాగ్మాత జిలేబీ గారి ఆశీస్సులే కారణం. మీ కరుణా కటాక్షాలతో మున్ముందు కూడా బుల్లెట్టులా దూసుకు పోతాను. నా వెన్ను తట్టి ఆశీర్వదించిన మీకు శతకోటి వందనాలు.

      Delete

    2. జై గారు,

      ఇది చాలా అన్యాయం ! ప్రశ్నలు నావి,ఇంటర్వ్యూ కొండలరావు గారిది.ఆశీస్సులూ క్రెడిట్ మొత్తం బ్లాగ్మాతకా ? సోనియా గాంధీ తెలంగాణా ఇస్తే కె సీ ఆర్ ని గెలిపించి స్వామిభక్తిని చూపించుకున్న వెన్నుపోటుదారులనిపించారు.ఎంతైనా చంద్రబాబు సహచర్యం కదా ?

      Delete
    3. నిజమే నీహారిక గారు. ఇక్కడ మీకు జరిగిన అన్యాయంపై మీ పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను :) ఎంతమందిని ఒకేసారి భలేగా తిట్టారండి. నేను చేసిన ఇంటర్వ్యూ పోష్టులలో ఇన్ని కామెంట్లు వచ్చినది ఈ టపాకే అనుకుంటా. కామెంట్లని బట్టి చూస్టే ఆ క్రెడిట్ లో మీకు వాటా దక్కాల్సిందే. :)

      Delete
    4. సోనియా గాంధీ తెలంగాణా ఇస్తే కె సీ ఆర్ ని గెలిపించి స్వామిభక్తిని చూపించుకున్న వెన్నుపోటుదారులనిపించారు.//
      భలే జెల్ల కొట్టారు! కానీ యిది చాలా మంది వొప్పుకోరు. చాలామంది సంగతి పక్కన పెడితే జైగారే వోప్పుకోరేమో.

      Delete
    5. వాడు తెస్తడని వీడు తెస్తడని
      అవ్వ ఇస్తదని అయ్య తెస్తడని
      ఎవ్వడిచ్చేదేందిరా?
      ఇది ఎవ్వని జాగీరురా?

      Delete
    6. ఉన్న మాటంటే వులుకెందుకో?
      ఎవ్వడిచ్చేదేందిరా అనుకున్నపుడు అడగడం దేనికో?
      చిత్తం! ఇది ఎవ్వని జాగీరు కాదు. "ఎవ్వని" జాగీరు కాదు.

      Delete
    7. అది పాటండీ బాబూ, నా సొంత కవిత్వం కాదు :)

      Delete
  9. "ఇతరుల మనసు నొప్పించకూడదన్న నియమం అవసరమా?"
    "ఎంతయినా కొట్టు. కానీ, అంతే దెబ్బలు తినడానికి సిద్దంగా ఉండు"

    ఈ రెండు వాక్యాలలో నా ఉదేశ్యం స్పష్టం చేయలేకపోయానని & పదాల ఎంపిక బాలేదని అనిపిస్తుంది.

    1. సాధ్యమయినంత వరకు & కావాలని ఇతరుల మనసు నొప్పించకూడదు కానీ ఎవరు నొచ్చుకుంటారో అని ఆలోచిస్తూ కట్టడి చేసుకోవద్దని చెప్పాల్సింది.

    2. Do unto others what you wish them to do for you అన్నది చెప్పాలని అనుకున్నాను. దీన్నే సల్మాన్ ఖాన్ సినిమాలో उतनाही मारो जितना खुद खासकते हो డయలాగ్ కాస్త కలర్ఫుల్ అనువాదం అనుకున్నా. మళ్ళీ తెలుగు తర్జుమాలో ఇంకాస్త హింసాత్మకంగా మారడం అయాచితంగా జరిగింది. "ఎదుటివారు నాతొ ఎలా ఉండాలో నేనూ వారితో అలానే ఉండాలి" అని చెప్పి ఉండాల్సింది.

    ReplyDelete
    Replies
    1. అవును జై గారు. ఇపుడు మీరు చెప్పింది సరయినది. వీలయితే మార్చి జత చేస్తాను.

      Delete
  10. ముఖాముఖి బావుంది.
    జైగారి వ్యాఖ్యలు ఒక్కొక్కసారి బానే వుంటాయి. 'విషాంధ్ర', 'బోడి ఆంద్ర వుంటే యెంత పొతే యెంత' అని కూడా రాశారు. గుండువారిలాగే! గుండువారి తెలుగు పాండిత్యం అసామాన్యం. ఆ విషయంలో ఆయనని అభిమానించ వచ్చు కానీ ఆయన కురిపిస్తున్న ఆంద్ర ద్వేషం చూస్తుంటే కంపరం పుడుతుంది.
    స్వైరిణి కి పుంలింగం ఉందా? వుంటే ఆ పదాన్ని కృష్ణుడికి వాడవచ్చా? అని జైగారు ఒకచోట రాశారు. అదే చేత్తో ఇంకో చోట 'మనకి సంయమనం ఎక్కువే, శ్యామలీయం మాస్తారిలాగా' అని ఆయనని కలిపెసుకోవాలని చూసారు.
    ఇలాంటి వ్యాఖ్యల వలన అవతలవారు నోచ్చుకోవడం తప్పితే మనం నేర్చుకునేది ఏదీ లేదని జైగారు గ్రహించాలి.

    All the best Jai gaaru.

    ReplyDelete
    Replies
    1. జై గారు కొన్నిసార్లు తార్కికంగా ప్రశ్నలు వేస్తారు.సంయమనం కూడా ఎక్కువే ! శ్రీకాంత్ గారినీ,జై గారినీ అనామక వ్యాఖ్యాతలు ఎంతగా బూతులు తిడుతున్నా పోరాడుతూనే ఉన్నారు.ఈ విషయంలో ఆంధ్రావారి ప్రవర్తనని చూస్తూనే ఉన్నాం ! విభజన చేసినవారు బాగానే సఖ్యతగా ఉంటున్నారు,మనమే పోట్లాడుకుంటున్నాం !


      Delete
    2. @YJs:

      సలహాకు & ప్రోత్సాహానికి థాంక్సండీ.

      అవతలి వారిని నిందించడం లేదా వ్యక్తిగత దూషణకు దిగడానికి వారి పవిత్ర గోవులను విమర్శించడానికి తేడా ఉంది. ఎవరెవరికి ఏయే విషయాలు పవిత్రమో ఏమంటే మనోభావాలు దెబ్బ తింటాయో అనుకుంటే మనమేమీ చెప్పలేము.

      ఇకపోతే శ్యామలీయం మాస్తారితో పోల్చుకున్నది సరదాకేనండీ.

      @నీహారిక:

      ప్రవర్తనలో ఆంద్ర తెలంగాణా అంటూ ఉండదేమో? ఎవరి వాదన మీద వారికే నమ్మకం లేనప్పుడు లాజిక్ బదులు రిటోరిక్ వైపు వెళ్తారు.

      Delete
    3. @Chari, It is not true that people prefer starvation over dictatorship. Subsistence (batakaalanE kOrika) is the strongest objective than any other thing. It is ridiculous to say that people would prefer economic inequality over economic equality just because economic equality is implemented by force.

      Delete
    4. Praveen,

      Give me straight answer, no flop flops.

      If you are assured 3 times square meal, would you agree to forego your freedom?

      Delete
    5. Stalin's Russia had 100℅ employment rate in 1940. I don't hesitate to live in such state just because there is a single party led government.

      Delete
    6. Whether Stalin has given 100% employment or not is a different question.

      My question is very simple and straight forward.

      "If you are assured a square meal 3 times a day, are you willing to forego your freedom?"

      Please answer only to this question.

      Delete
  11. It is you who believe that there is no freedom under socialism and it's not I who believe that economic equality is a constraint to freedom. Your belief is not my cup of tea.

    ReplyDelete
  12. Stalin had abolished private property but he didn't abolish managerial system. It has led to Krushchevite-Brezhnevite revisionism in Russia. Socialism doesn't constrain individual freedom but Ramoji Rao or Lagadapati can't live in a socialist state even if they are employed as managers. Elite class are the real losers of freedom but not me.

    ReplyDelete
    Replies
    1. కమ్యూనిస్టు దేశాలలో తిరుగుబాటు వచ్చినది రామోజీ రావు, లగడపాటి లాంటి వాళ్ళవల్ల మాత్రమే కాదు కదా? ప్రజలే కదా? సోషలిజం వల్ల ప్రజల స్వేచ్చకు ఇబ్బంది లేకుండా వ్యవస్థ ను నడపడం అసాధ్యం కాదని లెనిన్, మావో వంటి వారు మరికొన్ని దేశాలు నిరూపించాయి. ఇపుడు కూలిన దేశాల తప్పులను సిద్దాంతానికి అంటగట్టడం ఎంత తప్పో , కూలడానికి పెట్టుబడి దారుల కుట్ర అంటూ శతృవుని కారణం చూపడమూ అంతే తప్పు కాదా ప్రవీణ్ గారు?

      మొబైల్ వెర్షన్ ను మీరు చెప్పినట్లే మార్చినందున ఇపు/డు మీరు తెలుగులో ఈజీగానే కామెంట్ చేయవచ్చు.

      Delete
  13. I am on the boat now and I can't type freely.

    If it is the fault of the capitalistic managerial system, how can you attribute it to socialism?

    ReplyDelete
  14. Deepest Condolences to His family. May his soul rest in Peace.

    ReplyDelete
  15. వరూధిని బ్లాగు నడుపుతున్న జిలేబీ సంగతి యేమీ తెలియదం లేదు.ఇక పూర్తి శెలవు తీసుకున్నట్టేనా!

    ReplyDelete
    Replies
    1. ఔను హరిబాబు గారూ! రెగ్యులర్ గా కమెంట్లతో హడావిడిగా కనిపించే జిలేబి గారి సందడి లేదు. ఎందుకో తెలియదు.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top