పొందు పరచిన ఆధారాలతో సరియైన పదాలు జత చేయండి. ప్రతి జవాబులోనూ 3 అక్షరాలే ఉంటాయి. చివరి అక్షరం ...తి అయి ఉండాలి.
1. పుకారు ..........తి
2. సంతానం .........తి
3. సౌకర్యం .........తి
4. ఆకారం .........తి
5. విషయం ..........తి
6. హీనస్ధితి ..........తి
7. స్త్రీ .........తి
8. విధానం. ..........తి
9. భవనం. ..........తి
10. విజ్ఞాపన. ..........తి
11. చట్రం. ......... తి
12. ఆజ్ఞ. .........తి
13. వేగం. ........తి
14. బొబ్బ. ........ తి
15. ఆశ్చర్యం. .........తి
16. హనుమంతుడు ........తి
17. చుట్టం. ........తి
18. పుష్పము. ........తి
19. ప్రవాహం. ........తి
20. జన్మదినం. .........తి
21. వ్యతిరేకం. .........తి
22. దిక్కు. ........తి
23. వాతావరణం. ........తి
24. నాల్గవది. .......తి
25. మేలుకొలుపు. .......తి
26. సంవత్సరీకం. .........తి
27. కలప దుకాణం. .........తి
28. యుక్తవయస్కురాలు. ........ తి
29. లోటు / తక్కువ. ........తి
30. పురోగమనం. ........తి
- Thanks to Neeharika garu.
1-వదంతి
ReplyDelete2-సంతతి
3-వసతి
4-ఆకృతి
5-సంగతి
6-దుర్గతి
7-సుదతి
8-
9-భవంతి
10-వినతి
11-
12-ఆనతి
పన్నెండు వరకు ఆలోచించాను. 9 సమాధానాలు వచ్చాయి.
1-వదంతి
Delete2-సంతతి
3-వసతి
4-ఆకృతి
5-సంగతి
6-దుర్గతి
7-సుదతి
8-
9-భవంతి
10-వినతి
11-
12-ఆనతి
13-
14-
15-
16-మారుతి
17-
18-మాలతి
19-ఉధృతి
20-జయంతి
21-వికృతి
22-
23-
24-
25-హారతి
26-వర్ధంతి
27-అడితి
28-యువతి
29-వెలితి
30-ప్రగతి
నాకు 17 మాత్రమే తెలియలేదు.
ReplyDelete25. మేలుకొలుపు. జాగృతి
ReplyDeletes
Delete8. విధానం: పద్దతి
ReplyDelete17. చుట్టం: సోపతి
24. నాల్గవది: చతుర్తి
8 ok
Delete8 correct sir
Delete21 correctenaaa
ReplyDelete24 చతుర్ధి ఉంటుంది చతుర్తి ఉండదు. అలా అయినా చివర తి రావాలి.
ReplyDeleteసోపతి అంటే కానుక కదా?
ReplyDelete21 correct
ReplyDelete24. చవితి
ఇవన్నీ నోట్లో ఆడుతూ బయటకు రావట్లా.....:)
Deleteనోట్లో ఉంది బయటికి రాని పదం ఒక్కటున్నా కష్టమేనండి. వేరే ధ్యాస రాదు, నిద్ర పట్టదు, తిండి సయించదు.
Delete24. నాల్గవది గురించి నేను ఎంత బుర్ర కొట్టుకున్నా చతుర్తి యాదికి వచ్చిందే తప్ప చవితి తట్టలేదు. అనుమానపడుతూనే రాసా కానీ మనసు కుదురుగా లేదు. నీహారిక గారు సరి చేసాక ఇప్పుడు ప్రసన్న పడ్డా, థాంక్సు మేడం.
PS: నాకు తెలిసి సోపతి అంటే సహవాసం, స్నేహం, బంధుత్వం అన్నీ అర్ధాలు వస్తాయి కాంటెక్స్టును బట్టి.
చవితి, పద్ధతి తెలిసినవే..... సోపతి ఇప్పుడు తెలుసుకున్నాను.
Deleteసోపతి. ఫ్రెండ్
ReplyDeleteచుట్టం...సోపతి
ReplyDelete11 ,13
ReplyDeleteవేగం అంటే ఉధృతి కూడా వస్తుంది .....
Deleteప్రవాహం కి ఉధృతి
Deletes
Delete22 easy sir try it.
ReplyDeleteగతి అంటే రెండు అక్షరాలే వస్తున్నాయి. దీనికేమన్నా తగిలించాలా?
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteనైరుతి
ReplyDeleteoka dikku maatrame kadaa?
Delete22.నైరుతి
ReplyDeleteoka dikku maatrame kadaa?
Deleteఅష్ట దిక్పాలకులు అన్నారు కదా ?
Deletes but....?
Deleteవిన్నకోట వారి కోసమే 11, 13
ReplyDeleteపొగడ్తా? అయినచో నాకేల ఆ “అగ్రపూజ”, ఇక్కడ సభలో రాజారావు మాస్టారు లాంటి ఉద్దండులుండగా? 🙂
Deleteసార్,సార్,
Deleteపెద్దలు శ్రీనరసింహరావుగారు మాకు సదా పూజనీయులు,
నేను అతిసామాన్యుణ్ణి.మన్నించండి.
23 is also very easy one.
ReplyDelete7.పడతి
ReplyDeletes
Deleteసుగతి అంటే......?
ReplyDeleteవాతావరణం ప్రకృతి
Deleteకొండలరావు గారు 15 మీరు చెప్పగలరు.try
ReplyDeleteఆవృతి
Deleteఆయతి
ప్రకృతి
విభ్రాంతి
Deleteదిగ్భ్రాంతి
Delete11.ఫ్రేమ్ అనే అర్థంలో ఆకృతి
ReplyDeleteవలయం అనే అర్థంలో ఆవృతి
చట్రం = frame = ఆకృతి
Delete19.స్రవంతి
ReplyDeleteoh sssss
Deleteవిన్నకోట వారు డిటెక్టివ్ కదా ! మాకు తెలియనివి మీరు కూపీ లాగుతారు అనీ భోగట్టా !
ReplyDelete13.ఉధృతి
ReplyDelete14.కణితి
పదంలో 3 అక్షరములే ఉంటాయి.చివరి అక్షరం ...తి
ReplyDelete1పుకారు.... వదంతి
2సంతానం ... సంతతి
3సౌకర్యం... విశ్రాంతి
4ఆకారం.. ఆవృతి
5విషయం....సంగతి
6హీనస్థితి....దుర్గతి
7స్త్రీ.........పడతి
8విధానం.......పద్ధతి
9భవనం........భవంతి
10విజ్ఞాపన....వినతి
11చట్రం...... ఆకృతి
12ఆజ్ఞ........ఆనతి
13వేగం......గచ్ఛతి
14.బొబ్బ..... కణితి
15.ఆశ్చర్యం...దిగ్భ్రాంతి
16హనుమాన్...మారుతి
17చుట్టం... సోపతి
18పుష్పము.... చేమంతి
19ప్రవాహం.....ఉదృతి
20జన్మదినం....జయంతి
21వ్యతిరేకం....వికృతి
22దిక్కు........నైరుతి
23 వాతావరణం... ప్రకృతి
24నాల్గవది..... చవితి
25మేలుకొలుపు...జాగృతి
26సంవత్సరీకం ...వర్ధంతి
27కలప దుకాణం... అడితి
28యుక్తవయస్సురాలు...యువతి
29. లోటు / తక్కువ. ....వెలితి
30. పురోగమనం....ప్రగతి
13 doubt
ReplyDeleteఅవును డౌటే 🙂.
Deleteవేగము అనే అర్థంలో “జడితి” అని ఒక పదం ఉంది. ఆ పదంతో ఏమన్నా సరిపెట్చుకోవచ్చేమో ఇక్కడ?
బాగుంది 👌.
ReplyDelete(3). సౌకర్యం అంటే “విశ్రాంతి” అన్నారు మీరు. వసతి సరైనది.
అవును వసతి సరైనది.
ReplyDelete