----------------------------------------
ప్రశ్నిస్తున్నవారు -  viswaroop telangaaNa
అంశం : ప్రముఖులు, భారతరత్న 
----------------------------------------


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ, తెలుగుదేశం పార్టీ ఎన్‌టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్తించగా తెలంగాణ ప్రభుత్వం పీవీని భారతరత్నకోసం శిఫార్సు చేసింది. ఈఇద్దరిలో ఎవరు ఎక్కువ అర్హులు? 
--------------------------------------------------
*Republished

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com
 

Post a Comment

  1. పి.వి.నరసింహారావు.

    14 భాషల్లో పండితుడు, గొప్ప ఆలోచనా పరుడు.
    సొంత ఆస్తులకోసం, సంతానం కోసం సమాజాన్ని దోయకుండా ఆయనకున్న పరిధిలో చక్కగా పరిపాలించినవాడు.
    తన నోటితో ఎవ్వరినీ తూలనాడని మంచి రాజకీయనాయకుడు.
    ఆర్ధిక దురవస్త లో కొట్టుమిట్టాడుతూ బంగారాన్ని అమ్ముకునే దుస్తితిలో వున్న దేశాన్ని తన సంస్కరణలతో అభివృద్దిపధంలోకి తెచ్చినవాడు.

    యన్.టి.రామారావు.

    తెలుగువారంటే మద్రాశీలా అని అడిగే నార్త్ వారికి తెలుగువారంటే ఎవరో తెలియచెప్పిన మహానుభావుడు.
    పురాణ పాత్రలలో తన అభినయం తో తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు.
    ఆరుకోట్ల మంది ఆంధ్రులతో అన్నా అని పిలిపించుకున్నవాడు.
    పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ప్రపంచం నివ్వెరపోయేలా చేసినవాడు.
    తను ప్రాంతీయనాయకుడైనా, జాతీయనాయకులు తన చుట్టూ చేతులు కట్టుకుని తిరిగేలా చేసేంత చరిష్మా వున్నవాడు.
    పెదప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యం, తనను ఆదరించిన ఆడబిడ్డలకు చట్టపరంగా ఆస్తిలో సమానవాటా హక్కు ఇచ్చినవాడు.
    పేదవారిలోవున్న ఎంతోమంది సమర్ధులను రాజకీయరంగం లోకి తెచ్చి ఆ వర్గాల ఆశలకు ఊపిరి పోసిన మహనీయుడు.
    ప్రాంతబేధాలు లేకుండా అదిలాబాద్ నుండి తిరుపతి వరకు, అటు శ్రీకాకుళం వరకు అందరినీ సమానంగా చూసినవాడు.


    ఈ ఇద్దరిలో ఒక తెలుగువాడిగా నా ఓటు అన్న యన్.టి.రామారావు కే. కానీ ఒక భారతీయుడుగా ఆలోచిస్తే, ఆర్ధిక కష్టాల్లో వున్న దేశాన్ని ఒక దరికి తెచ్చిన వాడిగా పి.వి.నరసింహారావు భారతరత్నకు అర్హుడు. చివరకు ఒక తెలుగువాడిగా,భారతీయుడు గా నేను ఇద్దరు మహానుభావులకూ భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. కరెక్ట్, నా అభిప్రాయమూ అదే!ఇద్దరూ సమవుజ్జీలే అయినప్పుడు వలపక్షం దేనికీ?ఇద్దరికీ రావాలని కోరుకోవటం యెల్లరకూ హితమే కదా?!

      Delete
  2. భారత రత్న పదవి (?) కి ఇద్దరూ అర్హులు కారని నా అభిప్రాయం. అయితే రాజకీయ ఒత్తిడే ఆయుధంగా వాడి ఇలాంటి పదవులు తెచ్చుకోవడం ఇటీవలి సంప్రదాయం అయింది కనుక ఎవరికీ వస్తుందో రాదో చెప్పలేము.

    ReplyDelete
    Replies
    1. జయ్‌గారూ

      ఇక్కడ ప్రశ్న "ఎవరు అర్హులు" అని కాదు. "ఎవరు ఎక్కువ అర్హులు" అని కొండలరావుగారడిగారు. ఎవరు అర్హులు అంటే ఇద్దరూ కాక పోవచ్చు. ఎవరు ఎక్కువ అర్హులంటే ఆ ఇద్దరిలో ఒకరిని (లేదా ఇద్దరినీ) తప్పనిసరిగా ఎన్నుకోవాలి. NOTA ఆప్షన్ లేదిక్కడ. గమనించగలరు. నావరకైతే ఎన్.టి.ఆర్. కన్నా పీ.వీ.యే ఎక్కువ అర్హుడు.

      Delete
    2. జయ్‌గారూ

      ఇక్కడ ప్రశ్న "ఎవరు అర్హులు" అని కాదు. "ఎవరు ఎక్కువ అర్హులు" అని. ఎవరు అర్హులు అంటే ఇద్దరూ కాక పోవచ్చు. ఎవరు ఎక్కువ అర్హులంటే ఆ ఇద్దరిలో ఒకరిని (లేదా ఇద్దరినీ - ఇద్దరూ సమ ఉజ్జీలైతే) తప్పనిసరిగా ఎన్నుకోవాలి. NOTA ఆప్షన్ లేదిక్కడ. గమనించగలరు. నావరకైతే ఎన్.టి.ఆర్. కన్నా పీ.వీ.యే ఎక్కువ అర్హుడు.

      Delete
  3. భారత రత్నకు అర్హతలేమిటి?

    ReplyDelete
    Replies
    1. Performance of highest order in any field of human endeavor

      దీన్ని తెలుగులో ఎలా చెప్పాలో నాకు తెలీదు

      Delete
    2. అయితే వీరిద్దరూ భారతరత్నలు కావడానికి పూర్తి అర్హత లేదేమోననిపిస్తోంది.

      Delete
  4. P.V. Narasimha Rao's Achievements
    https://www.youtube.com/watch?v=YXYhLj3X2mA

    ReplyDelete
  5. >Performance of highest order in any field of human endeavor

    జైగారూ, ఈ రోజున సోనియా అధికారంలో ఉండి ఉంటే ఆవిడకో ఆవిడకూ రాహుల్‌కూ కూడానో భారతరత్న పురస్కారాలు అందించాలని గహనతవహించిన భారతప్రభుత్వం వారు నిర్ణయం తీసుకొని ఉంటే దేశంలో భారతరత్నకు వీరు అర్హులా వారు అర్హులా అసలు అర్హతలకు కొలబద్దలు ఏమిటి నిబంధనలు ఏమిటీ అంటూ‌ అసలు ఏ చర్చలు జరిగేవే కాదు కదా అనిపిస్తోంది.

    ReplyDelete
    Replies
    1. కాంగ్రెస్ పార్టీ (లేదా అధికారంలో ఉన్న వారు) భారత రత్నతో సహా మిగిలిన పురస్కారాలను విచ్చలవిడిగా దుర్వినియోగం చేసారు అనడంలో ఎటువంటి సంకోచం అక్కరలేదు. సోనియా (లేదా ఆవిడ వందిమాగధులు) ఈ తడవ కూడా నెగ్గి ఉంటె రాహుల్/ప్రియాంకా/రాబర్ట్ లాంటి వారికే కాక వారి పిల్లలకు & పెంపుడు కుక్కలకు కూడా ఏదో ఒక పురస్కారం ఇచ్చే వారు అనుకుంటా. అందుకే కాబోలు మొరార్జీ ప్రభుత్వం పురస్కారాలు రద్దు చేసింది, మళ్ళీ ఇందిరమ్మ వాటిని పునరుద్దరించింది.

      ఎలా ఇస్తే బాగుంటుందో అన్న విషయంలో నా ఒపీనియన్ కింద వీకే బాబు గారికి జవాబుగా రాస్తున్నాను. మీరూ అక్కడే స్పందించ మనవి.

      Delete
  6. జై గొట్టిముక్కల గారు,

    తెలుగులో ఎలా చెప్పాలో మీకు తెలీదని అన్నారు. సరే మాకొచ్చిన కొద్ది ఇంగ్లీషు ప్రకారం " ఏదైనా ఒక రంగంలో అద్భుత ప్రావీణ్యం " కలవాడు అనుకుంటున్నాను. సచిన్ టెండుల్కర్ కు కూడా అలాగే ఇచ్చి వుండచ్చు. యన్.టి.రామారావు కళా రంగంలో అద్భుత ప్రావీణ్యం కలవాడు కాదు అని మీరు అనుకుంటున్నారా? పౌరాణిక పాత్రల్లో ఆయన లాంటి నటన ప్రపంచం మొత్తంమ్మీద ఇంతకుముందుకాని, ఇకముందుకానీ ఎవరైనా చేశారా? చెయ్యగలరా? భారత రత్న ఇస్తే ఇవ్వనీ లేకపోతే పోనీ, కానీ అర్హత లేదని మాత్రం అనకండి. ఒకవేళ అంటే అర్హత వున్నవారి పేర్లు ముందు చెప్పి తరువాత ఆనండి. మేము కూడా యన్.టి.రామారావు ఏ విధంగా అర్హుడు కాడో తెలుసుకుంటాం.

    ReplyDelete
    Replies
    1. బాబు గారూ, ఏడాదికి ఒక ఇద్దరికీ (ఇంకా ఎక్కువ మందికో) ఇవ్వాలి కాబట్టి అన్న చందాన ఇస్తూ పొతే అత్యుత్తమ పురస్కారాల ప్రాముఖ్యత తగ్గే అవకాశం ఉంటుంది. అంచేత (నా ఉద్దేశ్యంలో) భారత రత్నను (పరమ వీర చక్రకు మల్లె) rarest of the rare (aka highest) cases లో మాత్రమె ఇస్తే ఆ పురస్కారానికి అది పుచ్చుకున్న మహనీయులకు తగు విలువ ఉంటుంది.

      భారత రత్న రానంత మాత్రాన ఎవరినీ తక్కువ చేసినట్టు కాదు, అవమానం అంతకన్నా కాదు.

      ఎన్టీఆర్ తెలుగు పౌరాణిక చిత్రాలలో (మిగిలిన భాషలలో పౌరాణిక సినిమాల గురించి నాకు తెలీదు) అగ్రనటుడే. అయితే భారత దేశంలోని అన్ని భాషలలో (తెలుగు ఒక్కటే కాదు) అన్ని తరహాల (పౌరాణికాలు మాత్రమె కాదు) చలన చిత్రాలలో అన్ని కళలలో (నటన మాత్రమె కాదు) తోలి వరసలో ఉండే వారిలో ఆయనకు స్థానం లేదన్న అభిప్రాయంతో మీరూ ఏకీభవిస్తారని నా నమ్మకం.

      జరిగేది జరక్క మానదు. ఇవ్వాళ లేక మర్నాడు వాజపేయీ గారికి ఈ పురస్కారం భాజపా ప్రభుత్వం ఇస్తుంది (మాస్టారు పైన చెప్పినట్టు రాహుల్ బాబాకు రాకపోవడం మన అదృష్టం). చంద్రబాబు ఒత్తిడి గట్టిగా ఉంటె (లేదా మోడీ ప్రభుత్వానికి టీడీపీ అవసరం మరీ ఎక్కువయితే) ఎన్టీఆర్ కూడా వస్తుంది. రేప్పొద్దున అంచనాలు తారుమారయి మహారాష్ట్రలో భాజపా ఎన్సీపీలు కలవాల్సి వస్తే వసంతదాదా పాటిల్ గారికీ ఇస్తారు. వారికి ఇచ్చారు కాబట్టి మాకూ ఇవ్వాలని గోలా తప్పదు.

      Delete
    2. ప్రజల మనస్సులలో కలకాలం నిలచి పోవటమే అత్యున్నతమైన పురస్కారం.
      అటువంటిది తూనికలు కొలతల సహాయంతో నిర్థారణ చేసి ఇవ్వటం కుదరదు.
      అట్లా కొందరు వ్యక్తులు లేదా కొన్ని సంస్థలు లేదా ప్రభుత్వాలు హుకుం జారీ చేసి వీరు గొప్పవారు అని పురస్కరించటం కీర్తిని కట్ట బెట్టటమే అయ్యే ప్రమాదం హెచ్చు కాబట్టి అటువంటివీ పొసగవు.
      నిస్వార్థతకు పురస్కారం కీర్తి, ఆ కీర్తి యొక్క స్థాయికి కొలబద్ద కాలం. కాలం ఎలా మారుతున్నా, ఎలా మారినా జనం గుండెల్లో కలకాలం నిలవగలిగే కీర్తి సంపదగలవాడే ధన్యుడు. ఆ ధన్యత్వసిధ్ది కలగటం అనే పురస్కారాన్ని నిర్థారించేది కేవలం కాలమే.

      Delete
    3. జై గొట్టిముక్కల గారు,

      మీరిచ్చిన వివరణ బేలన్సుడుగా వుంది. బాగుంది.

      Delete
    4. @శ్యామలీయం: ప్రజాదరణ గొప్పదనం రెండూ వేర్వేరు. పైగా అభిమానం శాశ్వతం కాదు.

      ఎందరో ఈనాడు పేర్లు కూడా తెలీని మహనీయుల ఆశయ ఫలమే మన జీవితాలపై ప్రభావం చూపుతుంది.

      గొప్పవారు ఎవరూ తమను భావి తరాలు మెచ్చుకుంటాయని జీవితాన్ని గడపరు. తమకు తోచిన మంచేదో చేస్తారు. వారు కోరుకున్న ఆశయాలు నేరవేరడమే వారికి నిజమయిన నివాళి, కీర్తి ప్రతిష్టలు ఒకవేళ వచ్చినా కాకతాళీయం మాత్రమె.

      ఉ. సతీ సహగమనం సమిసి పోవడమే రాజా రామమోహన్ రాయ్ గారి కృషికి పరాకాష్ట. ఆయనను ఎవరు గుర్తించినా మానినా అది ముఖ్యం కాదు.

      Delete
    5. ఎవరిదో మెప్పును ఆశించె చేసేవారు తెలుగుబ్లాగర్లౌతారేతప్ప, మహనీయులవ్వరు :-) ఒక వ్యక్తి ప్రవేశపెట్టిన ఒరవడిని ఇతరులూ అనుసరించడమే ఆ వ్యక్తికి tribute తప్ప, ఆవ్యక్తి పేరుతో భజన మండళ్ళుచేసే అతికాదు.

      రామారావు గారు కమర్షియల్ నటుడు. గొప్ప నాయకుడు లేదా ముఖ్యమంత్రి కాదు. ఏదో ఒక రాజకీయ కారణాలతో ఇలాంటివారికి అవార్డులిస్తూ పోవడమే భారతరత్న గౌరవం చెడడానికి కారణం.

      Delete
    6. ఐకోనోమహాశయా,

      తెలుగుబ్లాగర్లు మెప్పును ఆశించి వ్రాసే బాపతు అని మీరు లెక్కగట్టటం మీ సంస్కార ఘనతావిశేషం. అంతే. ఇలాంటి గొప్ప గొప్ప ఉవాచలు విసరటానికి తయారుగా ఉండేందుకు ఎవరికీ ఏ అర్హతలూ అక్కరలేదన్న సంగతి అందరికీ తెలుసు. కాస్త వ్యాఖ్యానకండూతి ఉంటే చాలన్న మాట. మాటకు మాట తెలుగుబ్లాగర్లూ విసరగలరు కదా - "ఊరూపేరూ పనీపాటూ లేని వాళ్ళు తెలుగు బ్లాగుల్లో ఉవాచలు చేస్తూ ఉంటారని" ? కాబట్టి సరదాగా రాళ్ళు విసరటం అంత మంచి లక్షణం కాదని గ్రహించుకోండి.

      "రామారావు గారు ....... ఇలాంటివారికి అవార్డులిస్తూ పోవడమే భారతరత్న గౌరవం చెడడానికి కారణం." అన్నారు కాని పాపం రామారావుగారికి ఆ భారతరత్నో రాయో ఇవ్వనే లేదు కదండీ ఆ గుంపులో మీరు ఆయన్ను కలిపివేయటానికి. ఘనతకట్టబెట్టబడిన భారతరత్నాలు కొన్ని రామారావుపాటికూడా చచ్చినా చేయనివారే నన్నది మీకు తెలియదని అనుకోను. నిజంగా మీకు తెలియకపోయినా ఆశ్చర్యపోను.

      Delete
    7. "ఘనతకట్టబెట్టబడిన భారతరత్నాలు కొన్ని రామారావుపాటికూడా చచ్చినా చేయనివారే నన్నది మీకు తెలియదని అనుకోను"

      పై వ్యాఖ్యాత చేసిన తప్పును "సరిదిద్దే" క్రమంలో మీరూ తొందర పడ్డారేమో కొంచం ఆలోచించండి.

      భారత రత్న గ్రహీతలలో కొందరి కంటే ఎన్టీఆర్ గొప్పవారని అనుకోవడం వరకూ మీ ఇష్టం. ఆయనను ఎక్కువ చేయడానికి వారిని తక్కువ చేసినట్టు మీ వాక్యం చదివితే అనిపించవచ్చు. ఇది మీ ఉద్దేశ్యం కాదని ఆశిస్తాను.

      అలాగే భారత రత్నతో బాటు రాయిని జమచేయడం అవసరం కాదేమో?

      Delete
    8. జైగారూ మీరన్నది నిజమే.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top