అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ( 21 జూన్ 2015 ) బోనకల్ లో 'పల్లె ప్రపంచం ఫౌండేషన్ ' తరపున 'యోగాడే' నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ' భారతీయ సంస్కృతి - యోగా - శాస్త్రీయత ' అనే అంశంపై సభ మరియు యోగాసనాల ప్రదర్శన జరిగింది.

ఈ సందర్భంగా నిర్వహించిన సభకు రిటైర్డ్ తెలుగు పండిట్ వజ్రాల పరబ్రహ్మం గారు అధ్యక్షత వహించారు. 

సభలో పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు ప్రసంగిస్తూ బోనకల్ తో పాటు మొత్తం 110 గ్రామాలలో భారతీయ సంస్కృతి - యోగా - ప్రక్రుతి జీవన విధానం లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రకృతి జీవన విధానం , ఆక్యుపంచర్ వైద్య విధానం వంటి అంశాలపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. యువతకు మార్కెటింగ్ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రకృతి జీవన విధానం - యోగా - ఆక్యుపంచర్ లలో శిక్షణా కార్యక్రమాల ద్వారా ఆరోగ్యాన్ని, ప్రతి ఆదివారం మనో వైజ్ఞానికి శిక్షణల ద్వారా ఆనందాన్ని , మార్కెటింగ్ రంగం ద్వారా ఉపాధి కల్పించడం ద్వారా ఆర్ధిక అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.

బోనకల్ జెడ్.పి.టి.సి సభ్యులు బానోతు కొండా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్యంపై చైతన్యం పెంచాల్సి ఉన్నదన్నారు. మనం తినే ఆహారం, పీల్చే గాలి , త్రాగే నీరు కలుషితం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వీటినుండి మనలను మనం కాపాడుకోవడానికి యోగను అవసరమైనమేరకు ఉపయోగించుకుంటే మంచిదన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సేవాకార్యక్రమాలు చేస్తున్న పల్లె ప్రపంచం కు అన్నివిధాలా సహకారం అందిస్తామన్నారు. 

బి.జి.పి నాయకులు దొంతు జ్వాలా నరసింహా రావు మాట్లాడుతూ ప్రపంచానికే ఆదర్శంగా యోగాను తీర్చి దిద్దుతున్న ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలొ సి.పి.ఎం నాయకులు, మాజీ సర్పంచ్ పోటు వెంకటేశ్వర్లు, గ్రామ సి.పి.ఎం నాయకుడు తెల్లాకుల శ్రీనివాస రావు, బోనకల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాలి దుర్గా రావు,  స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు తోటకూర రామకృష్ణ, మరో ఉపాద్యాయులు తెలకపల్లి రవి,  బి.జె.పి మండల నాయకులు మందపల్లి పాపారావు, గ్రామ బి.జె.పి అధ్యక్షులు నాగయ్య,  నమస్తే తెలంగాణ పత్రిక స్థానిక రిపోర్టర్ తమ్మారపు బ్రహ్మం, ఫౌండేషన్ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య తదితరులు ప్రసంగించారు. 

సభాననతరం మధిర టి.ఆర్.టి.సి ఉద్యోగి గంగుల పిచ్చేశ్వర రావు, బోయనపల్లి అంజయ్యలు యోగా ప్రాణాయామం లపై ఆసనాల ప్రదర్శన ఇచ్చారు. సభకు హాజరైనవారిలో ప్రముఖుల చేత కొద్ది నిమిషాలు యోగా ప్రాక్టిస్ చేయించారు.

ఫౌండేషన్ కు జెడ్.పి.టి.సి సభ్యులు బాణోతు కొండల రావు రు.1000/- , బి.జె.పి మందల నాయకులు మందపల్లి పాపారావు రు.1000/-, విశ్రాంత తెలుగు ఉపాద్యాయులు వజ్రాల పరబ్రహ్మం రు.500/-, బోనకల్ మాజీ సర్పంచ్ పోటు వెంకటేశ్వర్లు రు.500/- , ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తెలకపల్లి రవి రు.500/-లు ఆర్ధిక సహకారం అందించారు. ఆర్ధిక సహకారం అందించిన వారికి పల్లె ప్రపంచం తరపున అధ్యక్షులు పల్లా కొండల రావు ధన్యవాదములు తెలిపారు.

కార్యక్రమం వివరాలను తెలియజేస్తున్న కార్యదర్శి బోయనపల్లి అంజయ్య
సభకు అధ్యక్షత వహించిన రిటైర్డ్ తెలుగు పండిట్ వజ్రాల పరబ్రహ్మం గారు.
పల్లె ప్రపంచం విజన్ వివరిస్తున్న అధ్యక్షులు పల్లా కొండల రావు
ప్రసంగిస్తున్న బోనకల్ జెడ్.పి.టి.సి బాణోతు కొండలరావు
ప్రసంగిస్తున్న బోనకల్ మాజీ సర్పంచ్ , సి.పి.ఎం నాయకుడు పోటు వెంకటేశ్వర్లు.
ప్రసంగిస్తున్న బి.జె.పి గీత సంఘం రాష్ట్ర నాయకుడు దొంతు జ్వాలా నరసింహ రావు.
ప్రసంగిస్తున్న బోనకల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాలి దుర్గారావు
ప్రసంగిస్తున్న నమస్తే తెలంగాణా స్థానిక విలేఖరి తమ్మారపు బ్రహ్మం
ప్రసంగిస్తున్న ప్రభుత్వ ఉపాద్యాయులు తెలకపల్లి రవి
ప్రసంగిస్తున్న బోనకల్ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు తోటకూర రామకృష్ణ 
ప్రసంగిస్తున్న మండల బి.జె.పి నాయకులు మందపల్లి పాపారావు
ప్రసంగిస్తున్న స్థానిక సి.పి.ఎం నాయకులు తెల్లాకుల శ్రీనివాస రావు
ప్రసంగిస్తున్నగ్రామ బి.జె.పి అధ్యక్షులు నాగయ్య
ఫౌండేషన్ కు రు.1000/- ఆర్ధిక సహాయం అందజేస్తున్న బోనకల్ జెడ్.పి.టి.సి బాణోతు కొండల రావు.
ఫౌండేషన్ కు రు.1000/- ఆర్ధిక సహాయం అందజేస్తున్న బోనకల్ మండల బి.జె.పి నాయకుడు మందపల్లి పాపారావు.
ఫౌండేషన్ కు రు.500/- ఆర్ధిక సహాయం అందజేస్తున్న రిటైర్డ్ తెలుగు పండిట్ వజ్రాల పరబ్రహ్మం గారు.
ఫౌండేషన్ కు రు.500/- ఆర్ధిక సహాయం అందజేస్తున్న బోనకల్ మాజీ సర్పంచ్ పోటు వెంకటేశ్వర్లు
ఫౌండేషన్ కు రు.500/- ఆర్ధిక సహాయం అందజేస్తున్న ఉపాధ్యాయులు తెలకపల్లి రవి
యోగా ప్రదర్శిస్తున్న ఆర్.టి.సి మధిర డిపో ఉద్యోగి గంగుల పిచ్చేశ్వర రావు.
యోగాసనాలపై వివరణ ఇస్తున్న సంస్థ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య
యోగా చేస్తున్న బోనకల్ గ్రామ ప్రముఖులు
- పల్లా కొండల రావు
News Clippings

22-6-2015 andhrajyothy news

22-6-2015 namaste telangana news

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top