కార్యకర్తల నుంచి ఏటా రూ.250 వసూలుకు కాంగ్రెస్ ఆలోచన



న్యూ ఢిల్లీ, జులై 05: ఆర్థిక పరిపుష్టి సాధించడంపై జాతీయ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే విరాళాల సేకరణ బాట పట్టింది. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పార్టీ కార్యకర్తల నుంచి ప్రతీ సంవత్సరం రూ. 250 వసూలు చేయాలని భావిస్తున్నట్లు ఏఐసీసీ కోశాధికారి మోతీలాల్ వోరా తెలిపారు. ఈ అంశమై ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుతం పార్టీ ఆర్థిక సమస్యల్లో ఉందని, ఈ సమస్య నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే విరాళాల సేకరణ చేపట్టాలని భావిస్తున్నామని తెలిపారు. దేశ వ్యాప్తంగా వచ్చిన విరాళాల మొత్తంలో 25 శాతం రాష్ర్ట పీసీసీలకు కేటాయించగా, 75 శాతం ఏఐసీసీకి కేటాయించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం పార్టీకి చెందిన ప్రతీ ఎంపీ, ఎమ్మెల్యే సంవత్సరానికి ఒక నెల జీతం పార్టీకి ఫండ్‌గా ఇస్తున్నారని, అదేవిధంగా ఏఐసీసీ సభ్యులు ఏటా రూ.600, రాష్ర్టాల పీసీసీ సభ్యులు రూ.300 ఇస్తున్నారన్నారు. అదేవిధంగా ప్రస్తుత నిర్ణయం ప్రకారం.. రాష్ర్ట యూనిట్ పరిధిలో వచ్చిన విరాళాల్లో 50 శాతం నిధులను జిల్లా యూనిట్‌కు ఇవ్వనున్నట్లు చెప్పారు. కాగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు 12 సంవత్సరాల క్రితం.. పార్టీ అధినేత సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో పార్టీ ఆర్థిక శాఖను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచీ పార్టీ ఆర్థిక వ్యవహారాలను ఈ శాఖ ద్వారానే నిర్వర్తిస్తుంది.

---------------------------------------------------------------

వార్త - పై వార్త ఆంధ్రజ్యోతి లోనిది. కాంగ్రెస్ ఆర్ధిక వ్యవహారాల శాఖ ద్వారా కార్యకర్తల నుండి విరాళాలు సేకరిస్తుందన్నది ఈ వార్త సారాంశం.

వ్యాఖ్య -  కాస్త ఆశ్చర్యకరమైన వార్త ఇది. ఇలా చేస్తే మంచిదే. నాకు తెలిసి కమ్యూనిస్టు పార్టిలు మాత్రమే ప్రజల దగ్గర ప్రతి ఏటా చందాలు వసూలు చేసి పార్టీ కార్యక్రమాలు, పూర్తికాలం కార్యకర్తల అలవెన్సులు కు ఖర్చు చెస్తుంది. వీరికి కార్పొరేట్ శక్తుల నుండి చందాలు వసూలు చేయకూడదనే నియమం ఉన్నది. కాంగ్రెస్ లాంటి పార్టిలకు కార్పొరేట్ శక్తులే అన్ని అవసరాలను తీరుస్తాయి. ఇప్పటిదాకా కార్యక్రర్తల కు విరాళాలు పంపడమే గాని, వారినుండి సేకరించలేదు. ఇపుడు కొత్తగా కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీకి విరాళాలు ఇస్తారా? ఆ చైతన్యం కాంగ్రెస్ కార్యకర్తలకు పెంచగలదా? మీ వ్యాఖ్య ఏమిటి?
- పల్లా కొండల రావు. 
-----------------------------

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com


Post a Comment

  1. అధికారం లో లేరు కదా .
    అయినా , ఏదో ఒకటి దొరుకుతుంది అని పార్టీ లోకి జాయిన్ అవుతారు కాని ఇలా తిరిగి జేబు లో నుండి లాక్కుంటే ఎవడొస్తాడు .

    ReplyDelete
    Replies
    1. kasi గారు, పార్టీ కార్యక్రమాలు ఎలా నడవాలి? ప్రజల ఆలోచనాధోరణిలో మార్పు రావాలంటే కాంగ్రెస్ పాత పద్ధతులను మార్చుకోవాలి. కమ్యూనిస్టులకు సాధ్యమయినపని - ఇప్పటికీ సాధ్యమవుతున్న పని కాంగ్రెస్ కు ఎందుకు కాదు? దీనికంటే ముఖ్యంగా ఆలోచించాల్సింది ప్రతీది డబ్బుతో ముడిపడి ఉన్న ఈ వ్యవస్థలో నిజాయితీగా పని చేయాలంటే ఆ పార్టీ లేదా సంస్థకు నిధులు ఎక్కడనుండి రావాలి? కార్పొరేట్ శక్తుల నుండి రాబట్టుకుంటే తిరిగి వారికే సేవ చేసి తరించాలి కదా? అది అవినీతిని పెంచడానికే కదా దోహదం చేసేది?

      Delete
  2. కాంగ్రెస్ లాంటి పార్టిలకు కార్పొరేట్ శక్తులే అన్ని అవసరాలను తీరుస్తాయి. ఇప్పటిదాకా కార్యక్రర్తల కు విరాళాలు పంపడమే గాని, వారినుండి సేకరించలేదు
    కాంగ్రెస్ లాటి పార్టిలకు కార్పొరేట్లు విరాళాలు ఇవ్వడం మానేసారు,ఎవరైనా గెలుపు గుర్రాలమీదే పందెం కాస్తారు కానీ కుంభకోణాలతో ప్రతిష్ట మసకబారితే దరిచేరరు కదా ?

    ఎన్నికలలో డబ్బు తీసుకోవడమే ప్రజలకు తెలుసు,విరాళాలివ్వడం అనేది మార్కిస్టు పార్టీ,లోక్ సత్తా,ఆప్ లు మొదలుపెట్టారు.ఆప్ లాగా ఎవరూ చేయలేక నిందలు వేయడం మొదలుపెట్టారు.

    నాయకుడి మీద నమ్మకం ఏర్పడితే (కేసీఆర్)విరాళాలు ధారాళంగా వస్తాయి.రాహుల్ గాంధీ కి విరాళాలు రావాలంటే బీజేపీ రాజకీయంగా ఫెయిల్ అవ్వాలి.బీజేపీ ఫెయిల్ అవ్వాలంటే గ్రీస్ సంక్షోభం లాంటిది వస్తే సరిపోతుంది.ప్రధాని ఇలాగే దేశాలు పట్టి తిరుగుతుంటే అప్పులు పెరిగిపోతే ప్రపంచ బ్యాంక్ భారతీయులను వదిలేస్తుందా ?

    ReplyDelete
    Replies
    1. నాయకుడి మీద నమ్మకం ఏర్పడితే విరాళాలు రావు. కె.సి.ఆర్ పార్టీ నడిచేది, నడుస్తున్నది, కె.సి.ఆర్ పార్టిలొకి ఇతర పార్టీల నేతలు నడుస్తున్నది స్వంత విరాళాల పెంపకానికే. చాలా పార్టిల నాయకులపై చాలామందికి నమ్మకం ఉన్నది ఈ దేశంలో. అది నాయకుల కోసం ప్రాణాలు బలి తీసుకునేంత. నాయకులను ధోషులై అరెస్ట్ చేసినా వారిని విడుదల చేయాలని ప్రాణాలు బలిచ్చే బక్క గొర్రెలు చాలా ఉన్నాయి.. విరాళాలు రావాలంటే సైద్ధాంతిక + కార్యాచరణ లపై నమ్మకం కలిగిన పటిష్టమైన కేడర్ ఉండాలి. ఆ కేడర్ ప్రజలలోకి వెళితే డెఫినెట్ గా ప్రజలు ఆదరిస్తారు. కమ్యూనిస్టులు, లోక్ సత్తా , ఆప్ లకు సాధ్యమైనది కూడా నేతలపై నమ్మకాలతో కాదు ఓ భావజాలం లేదా సిద్ధాంతంపై నమ్మకంతోటి + ఆ పార్టీ కార్యకర్తల ప్రయత్నం తోటి. అలా చేస్తే ఖచ్చితంగా ప్రజల ఆదరణ ఉంటుంది. ఇది మంచి మార్గం. ఇటువంటి వాటిని అన్ని పార్టీలు ప్రయత్నించడం మొదలెట్టాలి. నిజానికి ఈ రోజు తెలంగాణలో కె.సి.ఆర్ పై ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ ఆ పార్టీ విరాళాలను సేకరించడం అనే ప్రయత్నం చేసి , కార్యకర్తలలో ఆ దిశగా చైతన్యం నింపే ప్రయత్నాలు చేయడం లేదు. ఫక్తు పవర్ పాలిట్రిక్స్ అదీ తెలుగుదేశం బాణీలోనే చంద్రబాబులా భయపడకుండా మరింత ధైర్యంగా కె.సి.ఆర్ చేస్తుండు. ఇది ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గ పరిణామమని నేననుకోవడం లేదు. ఒక్క కె.సి.ఆర్ మారినా ఫలితం ఉండదు. కేడర్ కూడా మారాలి. అలా ఉండాలంటే సద్ధాంతిక నిబద్ధత , కార్యాచరణ ఉండాలి. అలా ఉంటే ప్రజల ఆదరణ ఉంటుంది. మారాల్సింది పార్టిలు తప్ప ఈ విషయంలో ప్రజలను నిందించాల్సిన పనిలేదని నా అభిప్రాయం నీహారిక గారు.

      Delete

    2. కాలం మారి పోయిందేమో :)

      భవతి విరాళం దేహీ కార్య కర్తా :)

      జిలేబి
      (జిలేబి కామింట్లు అడిగినట్టు అన్న మాట :)


      జిలేబి

      Delete
  3. కేసీఆర్ గారికి విరాళం ఇచ్చి తెరాస పార్టీలోకి డీ ఏస్ లాంటివాళ్ళు చేరుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.నేను దీనిని నమ్మను, పార్టీ పెట్టిన కొత్తల్లో అలా చేసి ఉండవచ్చు కానీ ఇపుడు కేసీఆర్ గారికి ఆ అవసరం లేదు, రాజకీయంగా ఏ దారీ లేనివాళ్ళకి కేసీఆర్ గారే దిక్కు !

    ReplyDelete
    Replies
    1. అసలు రాజకీయం ఏ దారికోసమని మీ ఉద్దేశం?

      Delete
    2. మంచి ప్రశ్న వేసారు. రాజకీయం గురించి అర్ధమైతే రామాయణం అర్ధం అయినట్లే ! రాజకీయాలు మొదలైంది త్రేతాయుగంలోనే ! కమెంట్ లాగా చెప్పడం కుదరదు.ఒక పోస్ట్ వ్రాస్తాను.

      Delete
  4. మీరు ఒక విషయం గమనించారో లేదో తెలియదు,చంద్రబాబు నాయుడు తప్పు చేసాడు అని సంబరపడిపోయి కుప్పిగంతులువేసిన వాళ్ళల్లో అటు తెలంగాణా లో గానీ ఇటు ఆంధ్రాలో గానీ నోరెత్తి రాజయ్య తప్పు చేసాడని గొడవ చేయలేదు.కిక్కురుమనకుండా నోరుమూసుకున్నారు.విరాళాలకంటే కులమత రిజర్వేషన్లు పోవాలి.కులమత రాజకీయాలు పోవాలని కృషి చేసిన రాజకీయనాయకుడు ఇంతవరకూ రాజకీయాల్లోకి రాలేదు,ఒకవేళ అలా వస్తే విరాళాలేం ఖర్మ నల్లధనం మొత్తం ప్రజాసంక్షేమం కోసం ధారపోసే ప్రజలున్నారు.నాయకుల కొరతే ప్రస్థుత సమస్య !

    ReplyDelete
    Replies
    1. రాజయ్య కూడా గొడవ చేయలేదు. కె.సి.ఆర్ పై కోపంతో రాజయ్యకు మద్దతుగా తెలుగుదేశం దానికి మద్దతిచ్చే (?) ఎం.ఆర్.పి.ఎస్ వంటి వారు కొంత గొడవ చేసినా ఫలితం లేదు. కులం పేరుతో నాయకులుగా ఎదుగుదామనుకునేవారు ఆ తరువాత వారి కులం గురించి పట్టించుకుంటారన్న గేరంటీ లేదు. కులం పేరుతో నాయకులు పెరిగితే కులం సమస్య పరిష్కారం కాదు. కులం మూలాలయిన భూస్వామ్య విధానం , భూ పంపిణీ , భావజాలంలో మార్పుకోసం చైతన్యవంతం కావడం అనే చర్యలుండాలి. నేటి పవర్ పాలిటిక్స్ లో రాజకీయంగా ఎదగడానికి కులాన్ని వాడుకుంటున్నారు.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top