ఆసుపత్రుల సంఖ్య పెరగడమంటే అనాగరికత పెరగడమే
ఆసుపత్రుల సంఖ్య పెరగడమంటే అనాగరికత పెరగడమేనని పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు తెలిపారు. ఆధివారం బోనకల్ లోని పల్లె ప్రపంచం ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల సంఖ్య, స్పెషలిస్టుల సంఖ్య పెరుగుతున్నా రోగాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఆసుపత్రుల సంఖ్య పెరగడమంటే అనాగరికత పెరగడమేనని మహాత్మాగాంధి అన్నారని నేడు మన సమాజంలో ఆసుపత్రుల సంఖ్య డాక్టర్ల సంఖ్యా పెరుగుతున్నా డాక్టర్ల శరీరాలకు సైతం రోగాలు వస్తున్నాయంటే కారణాలు అన్వేషించాలన్నారు. ప్రక్రుతి జీవన విధానమే ఆరోగ్యపరిరక్షణకు ఏకైక మార్గమన్నారు. మన సాంప్రదాయాలలో ఉన్న మంచి అలవాట్లను కొనసాగించడం ద్వారా అందరూ తిరిగి ఆరోగ్యవంతులు కావచ్చన్నారు. భారతీయ సంస్కృతిలో శాస్త్రీయ అంశాలను, యోగాసనాలు, ధ్యానం వంటి మంచి సంస్కృతీ సాంప్రదాయాలను ప్రచారం చేసేందుకు పల్లె ప్రపంచం ప్రయత్నిస్తున్నదని తెలిపారు. గ్రామాలలో ఉండే మూఢాచారాలను అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు. చలమల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సంస్థ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, సభ్యులు బలగాని నాగరాజు, మరీదు కిషోర్, సురభి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. సంస్థ మార్కెటింగ్ ప్లాన్ ద్వారా ఆదాయం పొందిన ఏజెంట్లకు 52వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో మార్కెటింగ్ ప్లాన్ ని పల్లా కొండల రావు వివరించగా, యోగాసనాల డెమోను బోయనపల్లి అంజయ్య చేశారు.
News clippings
ఈ బ్లాగులో గత టపాకోసం ఇక్కడ నొక్కండి
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.