అందరికీ నాణ్యమైన విద్యని ప్రభుత్వమే అందించాలి!
సమాజంలో నాణ్యమైన విద్యను అందరికీ సమానంగా అందించేందుకు ప్రభుత్వమే కృషి చేయాలని పల్లె ప్రపంచం అధ్యక్షుడు పల్లా కొండల రావు తెలిపారు. ఆదివారం బోనకల్ లో జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యాయులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపితే మాత్రమే ఈ సమస్య పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళకు పంపకుండా ఉండడం మంచిదేనని కాని కేవలం వారు ప్రభుత్వపాఠశాలలో పిల్లలను చదివించినంత మాత్రాన ప్రభుత్వ విద్య బాగుపడుతుందనుకుంటే పొరపాటన్నారు. చదువుకున్న వారే కాక చదువురాని వారు సైతం ఇంగ్లీషుపై అవసరానికి మించిన మోజు పెంచుకుంటున్న నేపథయంలో ప్రభుత్వ పాఠశాలలో కల్పించాల్సిన వస్తులను, మారిన పరిస్తితులలో సిలబస్ లో తీసుకురావలసిన మార్పులను శాస్త్రీయధృక్పథంతో పరిశీలించి ప్రభుత్వమే ప్రభుత్వ విద్యను కాపాడేందుకు కృషిచేయాలని కోరారు. ప్రైవేటు స్కూళ్ళలో కుడా పేద విద్యార్ధులకు అవకాశం కల్పించేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కేవలం ధనికుల పిల్లలే విద్యకు దగ్గరగా ఉండి మిగతావాళ్ళకు నాణ్యమైన విద్య అందకపోవడం దారుణమన్నారు. ఈ అంతరాలు సమాజానికి మంచిది కాదన్నారు. పల్లె ప్రపంచం అధ్యయన కేంద్రం కన్వీనర్ చలమల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశ్రాంత అధ్యాపకుడు వజ్రాల పరబ్రహ్మం న్యాయ వ్యవస్థ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, సభ్యులు రామన అప్పారావు, సురభి వెంకటేశ్వర రావు, మరీదు రోషయ్య , బంధం శివ ప్రసాద్, సి.పి.ఎం స్టడీ సర్కిల్ కన్వీనర్ బోయనపల్లి కొండా తదితరులు పాల్గొన్నారు.
News Clippings
ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.