జ్ఞానం మానవ అభివృద్ధికి దోహదం చేయాలి
జ్ఞానం అనేది మానవాళి వినాశనానికి కాక మానవ అభివృద్ధికి ఉపయోగపడాలని పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు అన్నారు. ఆదివారం బోనకల్ లోని పల్లె ప్రపంచం ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ మనిషికి మెదడు పెరగుతున్నకొద్దీ హృదయం తరిగిపోతుండడం దారునమ్మన్నారు. అడవులను దారునంగా నరికివేయడం వల్ల అనేక విపరినామాలు ఎదురవుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలను పెంచడమనేది అలవాటుగా మార్చుకోవాలని, అదో సంస్కృతిగా వర్ధిల్లాలని కోరారు. మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు ప్రతి ఒక్కరూ ఆదాయం పెంచుకోవడానికి కృషి చేయాలన్నారు. ఎక్కడ ఖాళీ స్తలమున్నా మొక్కలు పెంచడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచుకోవాలని తెలిపారు. సురభి వెంకటేశ్వర రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలె ప్రపంచం ఫౌండేషన్ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, గుత్తా శివ శంకర ప్రసాద్, వింజం సుధీర్, మేడి రమేష్, మరీదు రోషయ్య, బోయనపల్లి శ్రీనివాసరావు,వేల్పుల రమేష్, కిషొర్ తదితరులు పాల్గొన్నారు.
News clippings
News clippings
visaalaandhra |
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.