*ఒక నాన్న కు తన కూతురే బంగారం...*
తప్పక చదవండి
అలాంటి నాన్న తన కూతురు ను గుండెళ్ళే పెట్టుకుంటాడు
భుజాలపై ఎక్కించుకుంటాడు
తన హృదయం పైన నడిపించుకుంటూ తన పాదాలకు చెప్పులౌతాడు
తన బంగారు భవిష్యత్తు గురించి ఎవరూ కనని కలలు కంటాడు
కంటికి రెప్పలా కాపాడుకుంటాడు
అలాంటి తండ్రి
ఒకటి అడిగితే రెండు కొనిస్తాడు
రెండు అడిగితే నాలుగు కొనిస్తాడు
యుక్త వయసుకు రాగానే
తన ఉన్నత చదివుల కొరకు రాత్రింబవళ్ళు కష్టపడుతాడు
తన బాధ కష్టం కనబడకుండా గుండె లోనే దాచుకుంటాడు..
ఒక మంచి జీవిత భాగస్వామికొరకు వెతుకుతునే ఉంటాడు
కూతురు సుఖం సంతోషం కొరకు దేనికైనా సిద్దపడుతాడు...
తను కోరుకున్నది జరిగితే ఈ ప్రపంచాన్నే జయించినంతగా సంబరపడుతాడు
కాని ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఉన్న యువత స్వేచ్చ స్వతంత్ర్యం పేరు సొంత నిర్ణయాలతో తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారు...
తమ తల్లిదండ్రులకు ఏమీ తెలియదని కించపరుస్తున్నారు..
పెళ్ళి వయస్సు కు రాగానే ఎవరో ముక్కు మొఖం తెలియని వారికి కట్టబెడుతున్నారని అంటున్నారు...
నిజంగా ఏ తల్లిదండ్రులు అంత నీచంగా ఆలోచించరు ..పెళ్ళంటే నూరేళ్ళ పంటగా భావిస్తారు.. అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలను తల్లిదండ్రులు పరిశీలిస్తారు..
అప్పుడైనా నచ్చితేనే ఆ అమ్మాయికి కూడా నచ్చితే ఒప్పుకుంటారు...
ఏ తండ్రి కూడా తన కూతురు ఏమైనా ఫర్వాలేదని అనుకోడు
తన కూతురు ఏలాంటి కష్టాలు పడకూడదని కోరుకుంటాడు..
*కాని నేటి అమ్మాయి లు అలా ఆలోచించడం లేదు*
*పెళ్ళి వయస్సు వచ్చే వరకు తన తల్లిదండ్రులను విలన్లు గా చూస్తున్నారు*
ప్రేమ అనే మత్తులో పడి మోసమేదో.. మోదమేదో తెలియని వయస్సులో
మేము ఒకరినొకరం అర్థం చేసుకున్నాం మాది నిజమైన ప్రేమ అనే మైకంలో తల్లిదండ్రులను ఎదురిస్తున్నారు... ఐతే మీరు లేదా తల్లిదండ్రులను బలి చేస్తున్నారు..
నిజంగా మీకు అర్థం చేసుకోనే శక్తి ఉంటే నీకు జన్మనిచ్చిన నాటి నుండి నీ కోసం తన తపన అర్థమయ్యేది .. నీ గురించి కన్న కలలు అర్థం అయ్యేది.. నీ కోసం పడ్డ కష్టం అర్థం అయ్యేది..
నీ చిన్ని కాళ్ళ సరిపడే సైజు కోసం పది షాపులు తిరిగింది....
నీ పుట్టిన రోజుకి నీ సరిపడే డ్రస్ కోసం తిరిగిన ఇరవై షాపులు తిరిగింది...
నా కూతురు అందరికంటే ముందుండాలనే ఉబలాటం..
నీవు బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చేవరకు తపించే హృదయం.. అర్థం అయ్యేది
నీ బంగారు భవిష్యత్తు కొరకు ఇరవై ఏళ్ళు గా తపించే నీ తండ్రి నే అర్థం చేసుకోలేని నీవు
గతమేంటో భవిష్యత్తు ఏమిటో తెలియని ఒక వ్యక్తి గురించి ఎలా అర్థం చేసుకుంటావు...??
నాలుగు రోజులు ఉండే నీ పాదరక్షల కొరకే పది షాపులు తిరిగిన నాన్న
నిండు నూరేళ్ళు జీవించే నీకు తగిన జీవిత భాగస్వామిని ఇవ్వడని ఎలా అనుకొంటారు..
తన కొడుకులను ఒక డాక్టర్... ఇంజినీరింగ్..IAS, IPS చేస్తాడో లేదో కాని...
తన కూతురికి మాత్రం అలాంటి భాగస్వామిని తేగలడు...
కూతురు ఉన్న ఏ తండ్రి యైనా ఎక్కువ గా ఆలోచించేది తన కూతురు గురించే
అంగ రంగ వైభవంగా కూతురు వివాహం చేయాలని
ఎన్నో కలలు కంటాడు...
ఆ కలలను సాకారం చేసుకోని గర్వంగా చెప్పుకోవాలనుకుంటాడు..
అలాంటి తండ్రి యొక్క కలలను భగ్నం చేయకండి
*ప్రేమను గెలవండి*
*నాన్న ను గెలిపించండి*
🌹🌹🌹🌹🌹🌹
*****************
- పల్లా కొండలరావు
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
కొండలరావు గారూ, కులహంకారమదం నెత్తికెక్కి పరువు పేరుతో చేసిన దారుణ హత్యకు సెంటిమెంట్ ముసుగు కప్పడం బాలేదు
ReplyDeleteతండ్రి ఆస్థులు పేదల సేవకు ఉపయోగించాలి.
Deleteఅమృతని శాసన సభకి పంపాలి.
అమృత రక్షణ చట్టం చేయాలి.
ప్రణయ్ విగ్రహాన్ని మిర్యాలగూడ లో స్థాపించాలి.
కన్నబిడ్డని విధవని చేసిన తండ్రిని ఎన్‌కౌంటర్ చేయాలి.
ఈ డిమాండ్స్ గురించి మీరేమంటారు జై గారూ ?
>>తండ్రి ఆస్థులు పేదల సేవకు ఉపయోగించాలి
Deleteతల్లిని వృద్దాశ్రమంలో చేరుద్దామా నీహారికగారూ?
>>ప్రణయ్ విగ్రహాన్ని మిర్యాలగూడ లో స్థాపించాలి
ఒక మూర్ఖుడు చేతిలో చావడంతప్ప ఇంకేమైనా కారణాల్లున్నాయా విగ్రహం పెట్టించుకోడానికి?
నీహారిక గారూ, ఎన్కౌంటర్ చట్ట విరుద్ధం. అమృత శాసన సభకు పోటీ చేయాలనుకుంటే అది ఆవిడ ఇష్టం. కొత్తగా రోహిత్ వేముల చట్టం, ప్రణయ్ చట్టం వగైరాలు అక్కరలేదు ఉన్నవాటినే అమలు చేస్తే చాలు.
DeleteThis comment has been removed by the author.
Delete>>కులహంకారమదం నెత్తికెక్కి పరువు పేరుతో చేసిన దారుణ హత్యకు>>>
Deleteఈ హత్య కులహంకారమా ? పరువు హత్యా ? వ్యక్తిగత ద్వేషమా ?
నీహారిక గారూ, తాను చిన్నచూపు చూసే "తక్కువ" కులానికి చెందిన వ్యక్తి తన కూతురిని పెళ్లి చేసుకోవడం వలన తన "పరువు" మంట కలిసిందన్న ఉక్రోషంతో అల్లుడి పై పెంచుకున్న ద్వేషం అనుకుంటే మీరు చెప్పిన మూడు అంశాలూ కలుస్తాయి.
Deleteప్రస్తుత టపా (వ్యాసం?) వీటన్నిటినీ వదిలేసి సెంటిమెంట్ పేరుతో నిందితునిపై సానుభూతి కూడగొట్టాలని చూడడం బాధాకరం.
Blood relation + Money relation =
DeleteFather relation
Father relation - Money relation =
Blood relation
Father relation - Blood relation =
Money relation
Blood relation + money relation + father relation = family relation
Family relation = sentiment
>>>సెంటిమెంట్ పేరుతో నిందితునిపై సానుభూతి కూడగొట్టాలని చూడడం బాధాకరం.>>>
ReplyDeleteసెంటిమెంట్ ని గౌరవించకపోతే కుటుంబాలు నిలవవు. కుటుంబాలు లేకపోతే సమాజం లేదు. సమాజం అంటూ ఉంటేనే హక్కులూ, డిమాండ్లూ....కుటుంబాన్ని గౌరవించని వారికి బ్రతికే హక్కులేదు.
అమృతమ్మ కి బ్రతికే హక్కే లేదు.
తండ్రి చంపవలసింది కన్నబిడ్డనే కానీ అల్లుడిని కాదు.ఈ విషయాన్ని అమృత కూడా ఒప్పుకుంది.
ఈ విధంగా తండ్రి ఒక నేరస్థుడు.
@నీహారిక:
Delete"కుటుంబాలు లేకపోతే సమాజం లేదు"
వ్యక్తులు లేకపోతె కుటుంబాలు లేవు, సమాజమూ లేదు.
సమూహాలు అనేవి మనుషులు స్వచ్చందంగా ఏర్పరుచుకున్నవి. బతికే హక్కును ఎవరూ ఎప్పుడూ సమూహాలకు ధారపోయలేరు. ఇది ఒక మనుష్య జన్మ వలన సంక్రమించి & ఇతరులకు వదిలేయలేని లేదా బదిలీ చేయలేని హక్కు (natural, innate, non-transferable & inalienable right)
Your children are not your children
They are the sons and daughters of Life's longing for itself
You may give them your love but not your thoughts
For they have their own thoughts
You may house their bodies but not their souls
For their souls dwell in the house of tomorrow
which you cannot visit, not even in your dreams
Kahlil Gibran
< సమూహాలు అనేవి మనుషులు స్వచ్చందంగా ఏర్పరుచుకున్నవి. బతికే హక్కును ఎవరూ ఎప్పుడూ సమూహాలకు ధారపోయలేరు. ఇది ఒక మనుష్య జన్మ వలన సంక్రమించి & ఇతరులకు వదిలేయలేని లేదా బదిలీ చేయలేని హక్కు >
Delete100% కరెక్ట్
ఈ విధంగా తండ్రి ఒక నేరస్థుడు.
Deleteనేరం చేసాడని ఒప్పుకుంటూనే సానుభూతి చూపిస్తున్నాం.
Deleteసైన్మ లల్ల చూపించే పనికిరాని ప్రేమ కథలు చూసి అమ్మాయిలు పనికిమాలిన వెధవల ఉచ్చులో పడుతున్నాయి.
ReplyDeleteపూర్తిగా ... “బుచికి” గారూ 👌.
Delete