నిందితుడు హత్య చేసినా ఏళ్ళ తరబడి కేసులు పెండింగ్ లో ఉంటాయి. సత్వర న్యాయం/తీర్పులు దొరకకపోవడం వల్లనే బహిరంగ హత్యలకు దారితీస్తున్నాయని అభిప్రాయపడుతున్నాను. మీరేమంటారు?

ప్రశ్నిస్తున్నవారు : నీహారిక
‌‌--------------------------------
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com
 


Post a Comment

  1. అది ఒక కారణం మాత్రమే !

    ఇలాంటిదే ఇదివరకు "కాఱంచేడు"లో సో-కాల్డు అగ్రవర్ణానికి చెందిన వారు దళితులను ఊచకోత కోయడం జరిగింది 1985లో. దేశం విస్తుపోయిన సంఘఠన అది. అది ఎంతటికీ తేలలేదు. నిందితులు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వారికి బాగా కావలసిన వారు అవ్వడం వలన .. ఎంతకీ దళితులకి న్యాయం జరగలేదు.

    దానితో ఆ ఊచకోతకు కారణమైన వారిలో ప్రధాన నిందితున్ని .. "మావోయిస్టులు" కాల్చి చంపారు. నేను మావోఇస్టుల సానుభూతిపరున్ని కాదు. కానీ, ఈ స్థాయిలో ఒక ఘోరం జరిగిన తరువాత కూడా చట్టం, వ్యవస్థ నిందితుల్ని శిక్షించలేకపోతే, ఏదో ఒక విధంగా ఆదుర్మార్గులకి శిక్షపడింది అని నిట్టూర్చిన వాన్ని మాత్రమే.

    ఆపని మావోయిష్టులు చేయకముందే చట్టం చేసుంటే బావుండేది. చట్టం మీద గౌరవం పెరిగుండేది.

    ఈ కాఱంచేడు ఘఠనపై నేను ఇది వరకూ రాసిన పోస్ట్..
    బ్లాక్ డే ! దళితులపై నరమేధానికి 30 యేల్లు !
    https://vishwaveekshanam.wordpress.com/2016/07/17/%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D-%E0%B0%A1%E0%B1%87-%E0%B0%A6%E0%B0%B3%E0%B0%BF%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%A8%E0%B0%B0%E0%B0%AE%E0%B1%87%E0%B0%A7/

    ReplyDelete
  2. అత్తాపూర్ ఘటన గురించి చదివాను. హంతకులు అక్కడ ఉన్న జనాన్ని గొడ్డలితో బెదిరించారు, సరే. మరి ప్రభుత్వ ఉద్యోగి అయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఎందుకు భయపడ్డాడు?

    ReplyDelete
    Replies
    1. అతను మనిషి కాదా? అతనికి కూడ ప్రాణభయం ఉంటుంది.
      బహుశా డిపార్ట్‌మెంట్ అతనికి తుపాకి ఇచ్చి ఉంటే హంతకుడిని భయపెట్టి పారిపోయేలా చేయ్యడానికి అవకాశం ఉండేది.

      Delete
    2. ఎంతో ధైర్యం సాహసం ఉన్న విప్లవకారులు అడవుల్లో ఎందుకు దాక్కుంటున్నారు?

      Delete
    3. నేను ఇక్కడ చర్చించినది విప్లవకారుల గురించి కాదు. ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ప్రభుత్వ ఉద్యోగే. తన ఎదురుగా నేరం జరుగుతున్నప్పుడు అడ్డుకోవాల్సిన బాధ్యత అతనికి లేదా అని అడిగాను. నీకు విప్లవకారుల మీద ద్వేషం ఉంటే ఇలాంటి వ్రాతలు ఇంకెక్కడో వ్రాసుకో. కామెడీ కోసం సీరియస్ టాపిక్‌లకి డైవర్ట్ చెయ్యడం పాత టెక్నికే. అది నేను ఎన్ని సార్లు బ్లాగుల్లో చూడలేదు?

      Delete
    4. ఓసారి మీకామెంట్ సరిగా చదువుకోండి. టాపిక్ డైవర్ట్ చేసింది ఎవరూ?

      Delete
    5. రమేశ్‌ని చంపినది సత్వర న్యాయం కోసం. అయినా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడాన్ని ఎక్కడా అనుమతించరు కదా. అక్కడ ఆ పని జరుగుతోంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి చూస్తూ ఎలా ఊరుకున్నాడు అని అడిగాను. నేను మార్క్సిస్ట్‌నా, కాదా అనేది మాత్రం ఇక్కడ పూర్తిగా అనవసరమే.

      Delete
    6. ఇంక చాలు.కుక్కతోక వంకర. దాన్నెవరూ సరిచెయ్యలేరు. నేను వదిలేస్తున్నా.

      Delete
  3. సత్వర న్యాయం జరగపోవడమే కాదు, సాక్ష్యాలు సరిగా లేక, న్యాయ పోరాటం చేసే స్తోమత లేక, అసలు న్యాయం జరగదన్న అనుమానం కూడ కారణం. వీటన్నిటికీ మించి క్షణికావేశమే ఇలాంటి నేరాలకి కారణం.

    ReplyDelete
  4. ఆంధ్రా వాళ్ళు ద్వేషంతో గొడవలకి దిగుతారు అని ఊహించుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసు వ్యవస్థని పటిష్టంగా తయారుచేసారు.జులాయి సినిమాలో బ్రహ్మానందం దొరికిపోయినట్లు నేరస్థులందరూ సీసీ టీవీల్లో దొరికిపోతున్నారు. ఇంత పటిష్టమైన వ్యవస్థ ఉన్నపుడు తెలంగాణా పౌరులే ఇలా బహిరంగంగా హత్యలు చేయడం చూస్తూ కేసీఆర్ గారు పట్టించుకోవడం లేదేమిటీ ?

    ReplyDelete
  5. నేరనిర్ధారణ కి తగిన ఆధారాలు ఉన్న కేసుల్లోనూ తీర్పులకి ఏళ్ళు పట్టడం న్యాయవ్యవస్థ వైఫల్యమే.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top