ప్రశ్న:అమృత - ప్రణయ్ ప్రేమ కథ  విషాదం ఎందుకు అయ్యింది?
ప్రశిస్తున్నవారు : హరిబాబు సూరానేని

విశ్లేషణ: మిర్యాలగూడ ప్రేమకధ మొదట కులాధిపత్యంతో చేసిన పరువుహత్య అని మొదలై పోను పోను COMPLICATED అయ్యింది.

మొదట్లో పవిత్ర ప్రేమికుడని అనుకున ప్రణయ్ విచారణలోనూ సోషల్ మీడియాలోనూ బయటపడుతున్న అతని కుటుంబ చరిత్ర తెలిశాక కొత్తగా కనబడుతున్నాడు! ఆస్తి కోసం ప్లాను వేశాడు. ఇంకో నలుగురికి కూడా లైను వేసాడు అని ఒక వాదన వినిపిస్తున్నది! కానీ,సాక్షాత్తూ అసలు మనిషి అమృత కూడా తెలివైన దానిలాగే కనిపిస్తుది.కానీ అంత గారాబంగా  పెరిగిన తెలివైన పిల్ల 9వ తరగతికే తండ్రికి కోపం వచ్చినా లెక్క చెయ్యకుండా మొండిగా తండ్రికి నచ్చని వాడితో తిరగడం ఎట్లా సాధ్యం? ప్రణయ్ విషయంలో తండ్రి తనని కొట్టాడని కూడా చెప్తున్నది - నెత్తి మీద పెట్టుకుని పెంచిన తండ్రి చేత తన్నులు కూడా తినాల్సినంత గొప్పతనం ప్రణయ్ దగ్గిర ఉందా? తర్వాత చదువులో దూడలు వెయ్యటం వల్ల మొదట్నుంచీ "వీడు తేడా!" అని తెలియటం లేదా?

ప్రణయ్ కుటుంబం గురించి ఒకరు ఒక యూట్యూబ్ వీడియో దగ్గిర ఈ కామెంటు వేశారు:
"ఇది ప్రణయ్ కుటుంబ చరిత్ర.
☝🏻ఒక్కసారి గమనించండి...🙏🏻🙏🏻 అల్లారుముద్దుగా పెంచిన తన కూతురుని ఇలాంటి చదువురాని మొద్దుతో 23 backlogs అదీ 2 years కే detained అయ్యాడు collage నుండి ...ఇలాంటి వాడితో..పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు ... చదువు లేదు , మతం కాదు, కులం కాదు,... పోనీ వాళ్ళ కుటుంబం గురించి చెప్పాలంటే ఒక పుస్తకం వ్రాయొచ్చు....
ఉన్న ఊర్లో వాళ్ళకి తెలుసు ఆ కుటుంబ చరిత్ర అత్తకి పదిమంది తో తిరిగే అలవాటుంది, అలా జరిగిన గొడవల వలన విడాకులు తీసుకొని అత్త పై portion లో మామ కింది portion లో విడిపోయి వుంటున్నారు..ఈ పిల్లల పెళ్లి అయ్యాక కిందనే కలిసి వుంటున్నారు ...ఆ అబ్బాయి పోయాక ఇప్పుడు పరిస్థితి ఎంటో ఎవరెక్కడ వుంటారో ?? తెలీదు 
ఇక అబ్బాయి ,
అతడికి లేని అలవాట్లు లేవు... ఈ అమ్మాయి తో పాటు మరో ముగ్గురిని ట్రాప్ చేస్తే ఈ అమ్మాయి పడ్డది ట్రాప్ లో కావాలంటే enquiery చేయండి ..
..అదీ విషయం
మరి ఏముందని వీళ్ళని ఆ తండ్రి accept చేయాలి? ..పెళ్లి చేసుకున్నా కనీసం ఈ ఊర్లో వుండకండి ,మీకేం హెల్ప్ కావాలన్నా చేస్తా...అంటే వినలేదు...ఊర్లో ప్రతిరోజు ఏదో ఒక పని పెట్టుకొని షాపింగ్ అని తిరిగితే 
అందరి దృష్టిలో రోజూ పడాలని అది మా డాడీ దృష్టికి వెళ్లాలని ఆ అమ్మాయి చేస్తే...పుండు మీద కారం చల్లినట్లు ...చేస్తే మంచిదా....చూస్తూ చూస్తూ ఎలా ఊరుకుంటారు ....
పైగా వద్దంటే రిసెప్షన్ చేసుకున్నారు , ఊరంతా పిలిచి చేస్తే ఇక మండదా ఎవరికైనా.. ..ఈ మాత్రం అల్లుడు అతనికి దొరకడా...
మనిషిని చంపడం తప్పే.... కానీ ఇదంతా అర్థం చేసుకొని ఇలాంటి తండ్రులకి మనం సపోర్ట్ చేయకపోతే ...మన ఆడపిల్లలకు రక్షణ ఉండదు...
మనo అనుకుంటాం ఏదైనా అన్యాయం జరిగితే కారకుడిని నరికేయాలని అనుకుంటాం....ఆదేగా ఆ తండ్రి చేసింది... "

ఇది యెంతవరకు నిజం?ఈ విషయాలన్నీ నిజమే అయితే మారుతీరావు చేసింది తప్పు కాదనే చెప్పాలి.బుద్ధిగా చదువుకుని మంచి వుద్యోగం తెచ్చుకుని చేసుకున్న దాన్ని తన కష్టార్జితంతో పోషించి సుఖపెట్టగలిగే బుద్ధిమంతుడిలా కాకుండా అందంతోనూ,మాటకారితనంతోనూ డబ్బున్న అమ్మాయిలకి వలేసి బాగుపడదామనుకునేవాళ్ళకి ఎవడో ఒకడు గుణపాఠం చెప్పాలిగా!

ఈ విషయానికి సంబంధించి మరొక వీడియో దగ్గరి ఆసక్తికరమయినన కామెంటు:
(I will say situation in my locality, c b pur district of Karnataka) meem evaraki chappokovali bayya , useless fellows they won't go to clg ... Always they will be in back Girls , endukante 40% scores chesina yavadu oka job thorukuttidile ane dairyam , dinemma bathuku mem General merit seat kodate Gani job ledu , 
Ahh Ammai Ane Kadu sir ... If boy tries to attract a girl 2 or 3 months padipotharu sir Adhi age problem and Biological problem .. maa cousin kuda vellipoyindi sir oka pokari poramboku tho .kani emm cheyali mana ammayi bagundaliga vadelesam 
Kani andaru alage undaru ... They are like virus ante ...

నాదీ ప్రణయిదీ నిజమైన ప్రేమ,మా నాన్నదీ బాబాయిదీ కులపిచ్చి అంటున్న అమృత మాటలు మాత్రమే వింటే మారుతీరావు నిజంగా దుర్మార్గుడనే అనిపిస్తాడు.కానీ మారుతీరావు వైపు నుంచి చూస్తే ప్రణయ్ దుర్మార్గుడు అనిపిస్తాడు.

బాబాయి కుడుకే తనతో గ్గ్ చేశాడంటుంది అమృత.కానీ ఇదే అమృత పెళ్ళి రిసెప్షన్ వీడియోలతో తండ్రిని కావాలని రెచ్చగొట్టింది.మొత్తం మీద ఇది పిల్లల పెంపకాలకి సంబంధించిన వ్యవహారం అని నాకు అనిపిస్తున్నది.పెద్దల్లో అటూ ఇటూ కూడా నైతికత విషయంలో ఎవరికీ దృఢమయిన అభిప్రాయాలు లేని విచ్చలవిడితనం కనిపిస్తున్నది.ఈ రకమైన వాతావరణం ఏ కులంలో ఏ మతంలో ఉన్నా తప్పే కదా!

Post a Comment

  1. సోషల్ మీడియాలో వచ్చిన అంశాలు నిజమో, అబద్దమో తెలియకుండా ఎలా నిర్దారించగలం. ఒక విషయమైతే చెప్పగలం. ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నం కావడం, ప్రపంచీకరణ వలన యువతలో బాధ్యతా రాహిత్యం పెరిగింది. తల్లిదండ్రులు పిల్లల పెంపకం కంటే డబ్బు సంపాదనకే ఎక్కువ సమయం ఇవ్వడం తప్పు. ప్రేమ విషయంలో అసలు ఏది నిజమైన ప్రేమ? అనేది ఎలా తేల్చాలి?...... ప్రస్తుత పరిస్తితులలో కోటి డాలర్ల ప్రశ్న. కానీ హత్యలు చేయడం, హత్యలు చేసి దేనినో ఆపాలనుకోవడం ప్రోత్సహించరాని అంశం. ప్రణయ్ ని హత్య చేయించిన మారుతీ రావు పరువు పెరిగిందా? తగ్గిందా? ఆటను ఏమి సాధించాడు? చారి కూడా..... ఈ అంశం అనుబంధాలు, ఆత్మీయతలతో పాటు పిల్లల పెంపకం, ప్రేమ అంటే ఏమిటి? కులం వంటి దురాచారాల విషయంలో ఎలా వ్యవహరించాలి? అనే సున్నితమైన.... దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకుని తీసుకురావాల్సిన సామాజిక మార్పులకు సంబంధించి విస్తృతమైన చర్చ జరగాల్సి ఉన్నది. కానీ ఇపుడు సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా చీలి చేస్తున్న కామెంట్ల పద్ధతిలో మాత్రం కాదు.

    ReplyDelete
  2. మన బంగారం మంచిదైతే .... అనే సామెత ఎప్పటి నుండో ఉన్నదేగా. చాలా కేసులలో అదే నిజమవుతోంది కదా.

    ReplyDelete
  3. ఇక్కడ హత్య జరిగింది. ఒక వ్యక్తి హత్య చేయబడడానికి సరిపడా నేరం ఏమి చేశాడు అని మాట్లాడాల్సింది పోనిచ్చి.. అతని అత్త అలాంటిది, ఇలాంటిది అని ప్రచారం చేస్తున్న హరిబాబు లాంటి సోషియో పాత్ (Sociopath) లను, దాన్ని వ్యతిరేకించకుండా .. వేడుక చూస్తున్న వారిని చూస్తోంటే.. మాట్లాడ్డానికి మాటలు రావడం లేదు.

    ReplyDelete
  4. విశ్వవీక్షణం గారు,
    మీరు కూడా ఫెమినిష్టుల్లాగా అత్యాచారం చేసారు అనగానే ఉరితీసేయాలి అన్నట్లు మాట్లాడుతున్నారే ? ఒక హత్యకు గల పూర్వాపరాలు విశ్లేషించకుండ నేరము శిక్ష ఎలా నిర్ధారిస్తారు ? ఒక హత్యతో తన జీవితం కూడా పాడయిపోయింది కదా ? వ్యక్తిగత ద్వేషాన్ని రాజకీయం చేస్తున్నారు కాబట్టే చర్చిస్తున్నారు.కులహత్యలు ఇదే మొదటిసారా ? ఇదే చివరిదా ? ప్రేమిస్తే సినిమాలో చితకబాదితే పిచ్చోడు అయిపోయాడు....ఇక్కడ చంపేసారు. అందరూ శాంతంగా తీర్పులు ఇవ్వరు కదా ?

    బుద్ధిగా చదువుకుని మంచి వుద్యోగం తెచ్చుకుని చేసుకున్న దాన్ని తన కష్టార్జితంతో పోషించి సుఖపెట్టగలిగే బుద్ధిమంతుడిలా కాకుండ అందంతోనూ,మాటకారితనంతోనూ డబ్బున్న అమ్మాయిలకి వలేసి బాగుపడదామనుకునేవాళ్ళకి ఎవడో ఒకడు గుణపాఠం చెప్పాలిగా!

    ReplyDelete
  5. ఆహ్.. కూల్, మొదట ఈ ఆర్టికల్ చదవగానే కాస్త గట్టిగా రిప్లై ఇద్దామనుకున్నా ! గట్టిగానే రిప్లై ఇవ్వాలి కానీ, ఇచ్చే విధానం మాత్రం వేరుగా ఉండాలి. హరి బాబులాంటి వాల్లు ఇలా చెత్తగా వాగుతున్నారంటే దానికి కారణం ఏమిటి ? దళితుడంటే ..చదవడు, వాడికి పెద్దగా టాలెంటు ఉండదు అన్న అపవాదే కదా ! రిజర్వేషన్లతో దళితులంతా ఈ అభినవ ఐన్-స్టీన్లను తొక్కేస్తున్నారు అన్న బిల్డప్పే కదా ఇదంతా ! ఇలాంటి చెత్త బిల్డప్పులకు కామెంట్లతో కొట్టుకునే కన్నా .. దళితులు, తాము చేస్తున్న పని బాగా చేస్తూ .. తాము సమర్ధులం అని నిరూపించుకొని చూపిస్తే వీరి నోర్లు శాశ్వతంగా మూత పడతాయి కదా !

    అఫ్ కోర్స్, ఇప్పుడు చాలా మంది దళితులు అలానే చేస్తున్నారు కూడా. ఒకప్పుడు అంటే రిజర్వేషన్లతో ప్రభుత్వ ఉద్యోగాలు .. కానీ, ఇప్పుడంతా సాఫ్టు వేరు జాబులు, ప్రైవేటు జాబులే. అక్కడంతా కేవలం సమర్ధతే పనిచేస్తుంది. అలాంటి చోట్ల దళితులు బ్రహ్మాండంగా పని చేసి తమ సత్తా చాటుకుంటూనే ఉన్నారు.

    దళితులు మంచి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి. దళితుల నుండి ఒక అంబానీ లాంటి వాడు ఎవరో ఒకరు రావాలి. అఫ్ కోర్స్, కొద్దిగా టైం పట్టొచ్చు కానీ, జరగడం మాత్రం పక్కా అని చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు దళితులంతా .. సమర్ధత మీదనే బ్రతుకుతున్నారు. ఎవరెంతగా దళితుల రిజర్వేషన్ల మీద పడి ఏడ్చినా .. అది మహా అయితే మరికొంత కాలం మాత్రమే అని నా గట్టి నమ్మకం.

    అంతవరకూ హరిబాబులాంటి వారు రాసే ఇలాంటి కామెడీ రాతలను చూసి కాస్త ఎంజాయ్ చేయడం ఒక్కటే దళితులు ఇప్పుడు చేయాల్సింది

    ఇక ప్రణయ్ హత్య విషయానికి వస్తే ... "చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది". ఇలాంటి చెత్తను చట్టం పట్టించుకోదు. కోర్టులో జడ్జీలు ఇలాంటీ చెత్త ఒపీనియన్లతో ఉండరు. "హత్యనో, అత్యాచారమో" జరిగితే .. వారు దాన్ని సమర్ధించరు. అది చాలు దళితులకి.

    ReplyDelete
    Replies
    1. @నీహారికSeptember 23, 2018 at 12:40:00 PM GMT+5:30
      ఒక హత్యకు గల పూర్వాపరాలు విశ్లేషించకుండ నేరము శిక్ష ఎలా నిర్ధారిస్తారు ? ఒక హత్యతో తన జీవితం కూడా పాడయిపోయింది కదా ? వ్యక్తిగత ద్వేషాన్ని రాజకీయం చేస్తున్నారు కాబట్టే చర్చిస్తున్నారు.

      hari.S.babu
      విశ్వవీక్షణం గారూ!
      నావి క్యామెడీ రాతలా?నీహారిక గారు మీకన్నా చలా నయమే - పై కామెంటులోని ఆఖరి ప్రశ్నని గమనించారా?"వ్యక్తిగత ద్వేషాన్ని రాజకీయం చేస్తున్నారు కాబట్టే" నేను ఇక్కడ ప్రశ్న వెయ్యాల్సి వచ్చింది.మీరే కాదు,నీహారిక తప్ప ఇంకెవరూ ఆ కోణాన్ని స్పృశించలేదు.కారణం ఏమిటో?


      మరొకసారి పునరాలోచన చేసుకుని కొన్ని కొత్త విషయాలను చర్చలోకి తీసుకు వస్తారని ఆశిస్తున్నాను.ప్రస్తుతానికైతే మీ వాదన నేను ఆశించిన దారిలో నడవటం లేదు.

      Delete
    2. హరిబాబుగారు,

      ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఎలా అవుతుంది ? అతడు నరికేశాను అంటున్నది "కులం" కారణం. కులోన్మాధం అది.

      Delete
    3. "కానీ ఇదంతా అర్థం చేసుకొని ఇలాంటి తండ్రులకి మనం సపోర్ట్ చేయకపోతే ...మన ఆడపిల్లలకు రక్షణ ఉండదు...
      మనo అనుకుంటాం ఏదైనా అన్యాయం జరిగితే కారకుడిని నరికేయాలని అనుకుంటాం....ఆదేగా ఆ తండ్రి చేసింది... " "

      ఇది మీ మూర్ఖత్వానికి పరాకాష్ట.
      "ఆడపిల్లను రక్షించడం" అనే ఒక ట్యాగ్ తగిలించేసి.. ఎలాంటి రాక్షస కృత్యాలు చేసినా సరిపోతుంది అనే మనస్తత్వానికి ఇదో ఉదాహరణ. కామెడీ ఏమిటంటే .. అక్కడ ఆడపిల్లను రక్షించడం అనే కాన్సెప్టు కూడా లేదు. ఆమె అతన్ని ప్రేమించి, పెల్లిచేసుకుంది. ఆ వయసులో ఆమెకు తప్పొప్పుల విచక్షణ అయితే ఉంది. ఆమె తండ్రికి ఆమె భవిశ్యత్తును కాలరాసే హక్కు లేదు.

      Delete
    4. < అఫ్ కోర్స్, ఇప్పుడు చాలా మంది దళితులు అలానే చేస్తున్నారు కూడా. ఒకప్పుడు అంటే రిజర్వేషన్లతో ప్రభుత్వ ఉద్యోగాలు .. కానీ, ఇప్పుడంతా సాఫ్టు వేరు జాబులు, ప్రైవేటు జాబులే. అక్కడంతా కేవలం సమర్ధతే పనిచేస్తుంది. అలాంటి చోట్ల దళితులు బ్రహ్మాండంగా పని చేసి తమ సత్తా చాటుకుంటూనే ఉన్నారు.

      దళితులు మంచి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి. దళితుల నుండి ఒక అంబానీ లాంటి వాడు ఎవరో ఒకరు రావాలి. అఫ్ కోర్స్, కొద్దిగా టైం పట్టొచ్చు కానీ, జరగడం మాత్రం పక్కా అని చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు దళితులంతా .. సమర్ధత మీదనే బ్రతుకుతున్నారు. ఎవరెంతగా దళితుల రిజర్వేషన్ల మీద పడి ఏడ్చినా .. అది మహా అయితే మరికొంత కాలం మాత్రమే అని నా గట్టి నమ్మకం. >

      exactly. ఎవరెన్ని చెప్పినా... చివరకు జరిగేది..... ప్రస్తుతం జరగాల్సింది.... ఇదే. దళితుల ఆత్మాభిమానం, ఆత్మా విశ్వాసం పెరిగేది రిజర్వేషన్లతోనో.....అగ్రవర్ణాలకు పదవులకోసం ఊడిగం చేసే కుల సంఘాలవల్లనో కాదు. ఈ చైతన్యం పెరగాలి. పెంచాలి.

      Delete
    5. < ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఎలా అవుతుంది ? అతడు నరికేశాను అంటున్నది "కులం" కారణం. కులోన్మాధం అది. >
      ఖచ్చితంగా ఇక్కడ కులం సమస్య ఉన్నది. జరిగిన సంఘటనపరంగా చూస్తే, అమృత-ప్రణయ్ ల ప్రవర్తన కూడా కారణం అనే చెప్పాలి. ప్రేమించడమే కాదు ప్రేమను గెలిపించడం తెలియాలి. అది విశృంఖలంగా కాకుండా హుందాగా..... బాధ్యతగా ఉండాలి. అలా ఉన్నపుడే కులం సమస్య తగ్గి తీరుతుంది. లేదంటే కులోన్మాదులు దానిని మరింత పెంచి పోషిస్తారు. ఇక్కడ కులం మాత్రమే కాకుండా ఓ వ్యక్తీ ఈగో ను కెలకడం ..... అదీ పరిస్తితులు ఈ విధంగా పురికోల్పడానికి కారణం అయింది. దీనిని కూడా బాధ్యతగానే పరిశీలించాలి. అమ్రుతకు ఎం.ఎల్.ఎ టికెట్లు..... వాళ్ళ పేరుతొ కొత్త చట్టాలు.....లాంటి ఓటు బ్యాంకు సొల్లుతొ ఒరిగేదేమీ లేదు. నిర్భయ చట్టం వస్తే అత్యాచారాలు తగ్గాయా? కులం సమస్య ఒక్క రోజులో సమసి పోదు. మరోవైపు బాధ్యత కలిగిన ప్రేమలు..... కులాంతర వివాహాలు చక్కగా సక్సెస్ అవుతూనే ఉన్నాయి. సమాజం గతం కంటే పాజిటివ్ గా స్వీకరిస్తూనే ఉన్నది. భవిష్యత్తులో దీని శాతం పెరిగి తీరుతుంది. ఎవ్వడూ సమాజ పురోగమనాన్ని అడ్డుకోలేదు. కాకుంటే పురోగమనం సరళ రేఖలా ఉండదు. జిగ్ జాగ్ గా ఒక అడుగు వెనుకకు.... రెండడుగులు ముందుకు ..... మొత్తంగా ముందుకు అన్నట్లుగానే ఉంటుందనేది సత్యం.

      Delete
    6. < "ఆడపిల్లను రక్షించడం" అనే ఒక ట్యాగ్ తగిలించేసి.. ఎలాంటి రాక్షస కృత్యాలు చేసినా సరిపోతుంది అనే మనస్తత్వానికి ఇదో ఉదాహరణ. కామెడీ ఏమిటంటే .. అక్కడ ఆడపిల్లను రక్షించడం అనే కాన్సెప్టు కూడా లేదు. ఆమె అతన్ని ప్రేమించి, పెల్లిచేసుకుంది. ఆ వయసులో ఆమెకు తప్పొప్పుల విచక్షణ అయితే ఉంది. ఆమె తండ్రికి ఆమె భవిశ్యత్తును కాలరాసే హక్కు లేదు. >

      ఎస్. ఆడపిల్లను రక్షించుకోవడానికి ఆడపిల్లల్లోనే చైతన్యం నింపాలి తప్ప, ఎల్లవేళలా పురుషుల సాయంతో కాదు. ఆడది అబల గా మాత్రమే కాదు సబలగా ఎదగాలి. ఎదుగుతూనే ఉన్నది. ఒకే కులంలో నమ్మి పెద్దల సమక్షంలో జరిగే పెళ్ళిళ్ళలో ఘోరాలు జరుగుతుంటే ఏమి చేస్తున్నాం? అక్కడ ఆడపిల్లల రక్షణ కు గ్యారంటీ ఉందా? ఇది అనవసరమైన సమర్ధన. సంబంధంలేని చర్చ అవుతుంది.

      Delete
  6. ప్రేమ విషయంలో అసలు ఏది నిజమైన ప్రేమ? అనేది ఎలా తేల్చాలి? ప్రస్తుత పరిస్తితులలో కోటి డాలర్ల ప్రశ్న.

    This is the real question.

    ReplyDelete
  7. కులం వంటి దురాచారాల విషయంలో ఎలా వ్యవహరించాలి? అనే సున్నితమైన.... దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకుని తీసుకురావాల్సిన సామాజిక మార్పులకు సంబంధించి విస్తృతమైన చర్చ జరగాల్సి ఉన్నది.

    ReplyDelete
  8. నీహారిక గారూ,

    నా కామెంటు మీకు ఫెమినిస్టు కామెంటులాగా అనిపించిందా ? అయ్యో ! నేను అలాంటి వాటిని పొరపాటున కూడా ఎంకరేజ్ చేయనండీ బాబూ. పూర్వాపరాలు చర్చించకుండా .. ఆడపిల్లకు అన్యాయం జరిగింది అనగానే ఉరేసేయండి, అవి నరికేయండి, ఇవి నరికేయండి అని ఆవేశ పూరితంగా కామెంట్లు రాయడం నా స్వభావానికే విరుద్దం. ఇక్కడ నేను మాట్లాడింది హరి బాబు రాసిన రాతలలోని దిక్కు మాలిన లాజిక్కుల గురించి మాత్రమే.

    ఇంకో విషయం .. మీ కామెంటేమిటండీ బాబూ.. అబ్బాయిలు వల వేస్తారా? అమాయకమైన అమ్మాయిలి పడిపోతారా ? ఆడ పిల్లలేమన్నా చిన్న పిల్లలాండీ ? అబ్బాయిలందరూ ఐదేళ్ళూ, ఆరేళ్ళూ నిండని చిన్న పిల్లలని ప్రేమిస్తున్నారా ? అసలు అమ్మాయి అనగానే .. grown up child అన్నట్లుగా ఉంది మీరు రాసిన కామెంటు.

    అయినా ఇదే మాటా, ఒక సారి రోల్స్ రివర్స్ చేసినప్పుడు అనగలరా ? అదే .. కాస్త డబ్బున్న అబ్బాయి, పేదింటి లేదా .. కాస్త స్థాయి తక్కువ (ఆర్థికంగా) అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటే అనగలరా ? అసలు అమ్మాయి అనగానే కుటుంబ గౌరవమనో లేకపోతే .. "ఆడపిల్ల జీవితం" అనో విపరీతమైన సెంటి మెంటు డయిలాగులు ఏమిటండీ ? అదేదో పితృస్వామ్య భావజాలములా ?? ఏం పరువు అమ్మాయి విషయములోనేనా .. అబ్బాయి విషయములో ఉండదా ? ఆ విధంగా చూసుకుంటే .. ఖాప్ పంచాయత్ లు ఇచ్చే తీర్పులన్నింటినీ సమర్ధించేయాలి కదా ?

    ReplyDelete
    Replies
    1. డబ్బు ఉన్నా లేకపోయినా ప్రేమ విషయంలో నాది ఒకటే మాట ...అది దేవుడిని కనుగొనడమంత గొప్ప సత్యం! మేం ప్రేమించుకున్నాం అని ఎవరైనా అంటే నాకు నవ్వు వస్తుంది. మేమిద్దరం ఇష్టపడ్డాం అని అనాలి.

      Delete
    2. < అసలు అమ్మాయి అనగానే కుటుంబ గౌరవమనో లేకపోతే .. "ఆడపిల్ల జీవితం" అనో విపరీతమైన సెంటి మెంటు డయిలాగులు ఏమిటండీ ? అదేదో పితృస్వామ్య భావజాలములా ?? ఏం పరువు అమ్మాయి విషయములోనేనా .. అబ్బాయి విషయములో ఉండదా ? ఆ విధంగా చూసుకుంటే .. ఖాప్ పంచాయత్ లు ఇచ్చే తీర్పులన్నింటినీ సమర్ధించేయాలి కదా ? >

      (h)

      Delete
    3. < మేం ప్రేమించుకున్నాం అని ఎవరైనా అంటే నాకు నవ్వు వస్తుంది. మేమిద్దరం ఇష్టపడ్డాం అని అనాలి. >

      ఇప్పటి ప్రేమలను చూస్తె అలా చెప్పడమే మంచిది. ఇష్టపడడం కూడా తప్పు కాదు. కానీ పెళ్లి... సమాజం..... పెద్దలతో సంబంధం వంటి విషయాలను కూడా జాగ్రత్తగా.... బాధ్యతగా ఆలోచించడం కూడా ఉంటేనే.... వాళ్ళ ఆలోచనలు పరిపూర్ణంగా ఉన్నట్లు. ఆ ప్రయత్నాలు హుందాగా చేసినా కులం గోడలు దాటి పెద్దలు రాకుంటే..... వారికి సమాజంలో ఖచ్చితంగా సపోర్ట్ దొరుకుతుంది. అలా కాక విచ్చలవిడిగా, విశృంఖలంగా, సినిమా పక్కీలో చేసి ఇదే ప్రేమ అనో.... ఇది కాదా ప్రేమ అంటే మాత్రం సపోర్ట్ దొరకదు. అలా చేసేది ప్రేమతో కాదు ఎదో ఒక కుయుక్తితోనే.

      Delete
  9. నీహారిక గారూ,
    "ప్రేమ విషయంలో అసలు ఏది నిజమైన ప్రేమ? అనేది ఎలా తేల్చాలి? ప్రస్తుత పరిస్తితులలో కోటి డాలర్ల ప్రశ్న. "

    నిజమైన ప్రేమ .. అలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం .. దేవుడున్నాడా లేడా అన్నదాన్ని చర్చించుకోవడం .. ఇలాంటి వన్నీ బొత్తిగా పనీపాట లేనప్పుడు చర్చించుకోవాల్సిన విషయాలండీ. వదిలేద్దాం.

    ReplyDelete
  10. I guess there is a difference between educated decision and impulsive decision on choosing love marriage. Understanding that thin line is difficult for parents as well as kids!

    ReplyDelete

  11. నిజమైన ప్రేమ .. అలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం .. దేవుడున్నాడా లేడా అన్నదాన్ని చర్చించుకోవడం .. ఇలాంటి వన్నీ బొత్తిగా పనీపాట లేనప్పుడు చర్చించుకోవాల్సిన విషయాలండీ. వదిలేద్దాం."
    I agree :)

    ReplyDelete
  12. రేప్ చెయ్యడం నేరమైనప్పుడు ఒక వేశ్యని రేప్ చేసే అధికారం కూడా ఎవరికీ ఉండదు. అలాగే మర్డర్ చెయ్యడం నేరమైనప్పుడు బిహేవియర్ బాగాలేనివాణ్ణి మర్డర్ చేసే అధికారం కూడా ఎవరికీ ఉండదు.

    ReplyDelete
    Replies
    1. వేశ్యని రేప్ చేస్తే సదరు మహిళ హత్య చేస్తే అది స్వీయ రక్షణ పరిధిలోకి వస్తుంది.అది నేరం కాదు.ఇక్కడ తన స్వార్జితాన్ని దోచుకెళుతున్నాడని హత్య చేస్తే నేరం అనే అంటారు. స్త్రీకి శీలం ఎంతో పురుషుడికి తన స్వార్జితం కూడా అంతే అని ఏ జడ్జ్ కూడా తీర్పు చెప్పలేడు.

      Delete
    2. "రేప్ చెయ్యడం నేరమైనప్పుడు ఒక వేశ్యని రేప్ చేసే అధికారం కూడా ఎవరికీ ఉండదు. అలాగే మర్డర్ చెయ్యడం నేరమైనప్పుడు బిహేవియర్ బాగాలేనివాణ్ణి మర్డర్ చేసే అధికారం కూడా ఎవరికీ ఉండదు. "

      చట్టం కూడా అదే చెబుతుంది. రేప్ జరిగినప్పుడు .. బాదితురాలి పూర్వ ప్రవర్తన, ఆమె వృత్తి వంటివి పరిగణలోనికి తీసుకోకూడదు అని. ఆ సంఘఠన జరిగినప్పుడు ..దానికి ఆమె అంగీకారం ఉందా లేక బలవంతంగా జరిగిందా లేదా అన్నది మాత్రమే పరిగణలోనికి తీసుకోవాలి అని చెబుతుంది. హత్య అయితే ఇక చెప్పనవసరం లేదు. అది ఆత్మ రక్షణ కోసం జరిగితే తప్ప (కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో) .. మరే విధంగానూ అది సమర్ధనీయం కాదు, అది నేరంగానే పరిగణించ బడుతుంది. ఈ "పరువులు","రిజర్వేషన్లతో చదివిన బడుద్దాయిలూ (కొంత మంది ఐన్-స్టీన్ల దృష్టిలో) ) ఇవేవీ హత్యను సమర్ధించడానికి ఉపయోగించలేం.

      Delete
    3. ఒక బాపన కులంలో పుట్టిన అమ్మాయిని, కోమటి అబ్బాయి లేపుకెలితే... ఆ ఆబ్బాయిని.. అమ్మాయి తండ్రి చంపితే.. అప్పుడు కూడా "సోషల్ మీడియాలో అలా రాశారూ.. మా ఆవిడతో పనావిడ ఇలా చెప్పిందీ.." అంటూ పోష్టులు పెట్టగలరా? ఏమైందో ఏమోగానీ ఈ మధ్య హరిబాబుగారు తత్తరపడడం, తొందరపడడం ఎక్కువైంది.. కారణమేమిటో ఎవరికైనా తెలుసా??

      Delete
    4. < రేప్ చెయ్యడం నేరమైనప్పుడు ఒక వేశ్యని రేప్ చేసే అధికారం కూడా ఎవరికీ ఉండదు. అలాగే మర్డర్ చెయ్యడం నేరమైనప్పుడు బిహేవియర్ బాగాలేనివాణ్ణి మర్డర్ చేసే అధికారం కూడా ఎవరికీ ఉండదు. >
      (h)

      Delete
  13. ఫేస్‌బుక్‌లో చర్చలు జరుగుతోన్నప్పుడు నేను అందులో దూరలేదు. ఆ అమ్మాయి తండ్రి డబ్బున్నవాడే, ఆ అబ్బాయి తల్లితండ్రులు కూడా డబ్బున్నవాళ్ళే. ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే ఆమె లైఫ్ స్టైల్ మారదు కనుకనే ఆమె అతనితో వెళ్ళింది. ఆమె నిజంగా మాల వీధిలో నివసించినవాణ్ణి పెళ్ళి చేసుకోలేదు. పల్లెటూరి సంతలో కూరగాయలు అమ్ముకునేవాడు కోమటోడైనా ఆమె తన కులంవాడే కదా అని అతని వలలో పడిపోదు. ఏమైనప్పటికీ ఒక మనిషిని హత్య చెయ్యడాన్ని సమర్థించేవాళ్ళని చూస్తే రోత పుడుతుంది. అందుకే నేను ప్రణయ్‌కి సపోర్ట్‌గా చర్చల్లోకి దిగాను.

    ReplyDelete
  14. @నీహారికSeptember 23, 2018 at 12:40:00 PM GMT+5:30
    ఒక హత్యకు గల పూర్వాపరాలు విశ్లేషించకుండ నేరము శిక్ష ఎలా నిర్ధారిస్తారు ? ఒక హత్యతో తన జీవితం కూడా పాడయిపోయింది కదా ? వ్యక్తిగత ద్వేషాన్ని రాజకీయం చేస్తున్నారు కాబట్టే చర్చిస్తున్నారు.

    hari.S.babu
    పై కామెంటులోని ఆఖరి ప్రశ్నని గమనించారా?"వ్యక్తిగత ద్వేషాన్ని రాజకీయం చేస్తున్నారు కాబట్టే" నేను ఇక్కడ ప్రశ్న వెయ్యాల్సి వచ్చింది.మీరే కాదు,నీహారిక తప్ప ఇంకెవరూ ఆ కోణాన్ని స్పృశించలేదు.కారణం ఏమిటో?

    మరొకసారి చర్చ పట్ల ఆసక్తి ఉన్నవారు అందరూ పునరాలోచన చేసుకుని కొన్ని కొత్త విషయాలను చర్చలోకి తీసుకు వస్తారని ఆశిస్తున్నాను.ప్రస్తుతానికైతే చర్చ నేను ఆశించిన దారిలో నడవటం లేదు.

    ReplyDelete
    Replies
    1. వ్యక్తిగత ద్వేషం ఉన్నమాట వాస్తవం. దానికి ప్రణయ్ అమృతల ప్రవర్తన కారణమే. అయితే మర్డర్ చేస్తే పరువు వలన బరువెక్కిన గుండెకు స్వాంతన లభిస్తుందా? అది పరిష్కారమా? సమర్ధనీయమా? అభినందనీయమా? కనీసామ్ సానుభూతి కనబరచే అంశమా? వ్యక్తీ ద్వేషం పెరగడం సెకండరీ మాత్రమే. కులం ప్రధాన సమస్య. కులం సమస్యగా ఉన్నపుడు బాధ్యత కలిగిన ప్రేమికులు ప్రవర్తించాల్సిన తీరు పట్ల ఏమన్నా ఆలోచిన్చావచ్చేమోగానీ.... హత్యను సమర్దిన్చాలేము. హత్యతో అతను బజారు పాలయ్యాడు. పరువు పెరిగిందా? గుండె బరువు తగ్గిందా? తీరికగా ఆలోచించుకుంటే ఇపుదేమి ప్రయోజనం? ఆవేశం అనర్ధాలకు మాత్రమే దారి తీస్తుంది.

      Delete
  15. ముప్పాళ రంగనాయకమ్మ గారు నిన్నటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక వ్యాసం రాశారు ఈ విషయం గురించే.అందులో ఆమె మొదటి నుంచీ మీడియా ద్వారా బయటపడుతున్న విషయాల నుంచే కొన్ని ముఖ్యమైన విషయాల్ని తీసుకుని చాలా మంచి విశ్లేషణ చేశారు.అందులో అమృత వ్యక్తిత్వం,మనస్తత్వం గురించి కొన్ని వాస్తవికమైన విశ్లేషణలు చేశారు.నాకు విశ్వవీక్షణం పట్ల గానీ రంగనాయకమ్మ పట్ల గానీ కంచె అయిలయ్య పట్ల గానీ ప్రవీణ్ పట్ల గానీ చిరంజీవి వై పట్ల గానీ వ్యక్తీగ్తమయిన ద్వేషం లేదు - పైగా వాళ్ళు తెలివితక్కువ వాళ్ళనో క్యామెడీ రాతలు రాస్తున్నారనో అనుకోను.మరి వాళ్ళెందుకు నన్నలా అనుకుంటున్నారో నాకు తెలియదు.నా గురించి ఇటువంటి కామెంట్లు చూసినప్పుడు కోపం కన్న నాకు నవ్వే ఎక్కువ వస్తుంది.

    రంగనాయకమ్మ గారి పరిశీలన ప్రకారం అమృత ప్రవర్తనయే చాలా వింతగా ఉంది!ఇప్పుడు తన జీవిత లక్ష్యమని చెప్పుకుంటున్న ప్రణయ్ విగ్రహ స్థాపన గురించీ తను చెయ్యాలనుకుంటున్న ఉద్యమం గురించీ ఆమెయే వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు - అవన్నీ సమాజం యొక్క నిజమైన స్వభావం గురించి తెలియని అమాయకత్వపు కబుర్లని కొట్టి పారేశారు!

    ఆమె పట్టిన తపుల్లో కొన్ని ముఖ్యమైనవి:
    1.ప్రణయ్,అమృత ముద్దులు పెట్టుకుంటూనో వాటేసుకుని కెమెరాలోకి చూస్తూనో దిగిన ఫొటోలు ఎవరుతీశారు?ఎవరు తీసినా అప్పటికి ప్రేమికులైనా భార్యాభర్తలైనా వాళ్ళ ప్రైవేట్ రొమాన్సుని పబ్లిక్ చెయ్యటం అవసరమా?
    నామాట;ఇందులో ఇపటి తరం అమ్మాయిలకీ అబ్బాయిలకీ ఉన్న పబ్లిసిటీ దుగ్ధ కనిపిస్తున్నది.9వ క్లాసు నుంచీ తండ్రి అప్పటికే వ్యతిరేకిస్తున్నాదని తెలిసినప్పటికీ ఆ పిల్ల దృష్టిలో వాళ్ళిద్దరి ఫొటోల్నీ చూపించి లైకులూ షేర్లూరెచ్చుకోవాలనే పిచ్చి తప్ప ఆ అమ్మాయి ప్రవర్తనలో హిందాతనం కనపడటం లేదు.ఇక్కడ చిన్న వయస్సు కూడా సమస్య కాదు,అంతకన్న చిన్న వయస్సులో కూడా హుందాగా ప్రవర్తిస్తూ తెలివైన నిర్ణయాలు తీసుకోగలిగినవాళ్ళు కొన్ని కోట్లమంది ఉన్నారు.తనే చెబుతున్నది తన పెళ్ళి రెసెప్షన్ వీడియోకి వచ్చిన లైకుల్ని గురించి ప్రస్తావిస్తే తండ్రి ప్రణయ్ హత్య వీడియోకి ఇంకా ఎక్కువ లైకులే వస్తాయిలే అన్నాడని.

    తమ పెళ్ళి ఇష్టం లేని తండ్రికి పెళ్ళి/రిసెప్షన్ వీడియోకి వచ్చిన లైకుల్ని గురించి గొప్ప కబుర్లు చెప్పే కూతురూ కూతురుతో నేను నీ మొగుణ్ని చంపించే వీడియోకి ఇంకా ఎక్కువ లైకులే వస్తాయిలే అనే తండ్రీ ఒక కులానికే పరిమితమా?అటు ప్రణయ్ కుటుంబసభ్యులు దళితులే అయినా ఇతన్ని కూడా కిరసనాయిల్ అమ్ముకునేవాడు అని అంటున్నారు కదా!ఈ వ్యక్తిగతమైన సంస్కారాలు/అహంకారాలు ఒక కులానికి పరిమితమైనవి కావే!
    2.రిసెప్షన్ అదరగొట్టెయ్యాలనే అయిడియా అమృతదే అనీ అక్కడున్న వాళ్ళలో కొంత హిందాగా మాట్లాడుతున్న మామగారు "ఎందుకమ్మా!మీ నాన్నగారు అసలే కోపంగా ఉన్నరు,రెచ్చగొటినట్టు ఉంటుందేమో?" అని చెప్తే రెండు రోజులపాటు మాట్లాడకుండా అలిగి పోట్లాడి సాధించుకున్నదనీ తెలుస్తున్నది!
    నామాట:ఈ విషయం స్వయంగా అమృత నోటివెంట నేనూ విన్నాను.9త్ క్లాస్ నుంచీ తండ్రి ఇష్టాప్దటం లేదని తెలిసి కూడా ప్రణయ్ విషయంలో ముందుకే వెళ్ళడం నుంచీ ఈ మ్యారేజి రెసెప్షన్ వీడియో ప్రదర్శన వరకు జరిగిన విషయాల్లో జరిగిన తండ్రీ కూతుళ పోట్లాట ఆ ఒక్క కులంలోనో కేవలం అగ్ర కులాల్లో మాత్రమే జరుగుతాయనే గ్యారంటీ ఉందా?మాల మాదిగ కులాల్లో కూడా ఈ తేడాలు ఉన్నాయి కదా,అలాంటప్పుడు ఇది కేవలం అగ్రకులం కుర్రదీ నిమ్నకులం కుర్రాడూ ప్రేమించుకున్నందువల్లనే జరిగినట్టు తీర్మానించడం వల్ల సాధించేది యేమిటి?
    3.ముప్పాళ రంగనాయకమ గారు అబ్సర్వ్ చేసిన మరొక విషయం ఇప్పటికీ అమృత తనని ప్రేమించినందుకే ద్వేషించి తన భర్తని చంపించిన తండ్రిని ద్వేషించడం లేదు.అసహ్యంతో "ఆ దుర్మార్గుడు!" అని కూడా అనడం లేదు.అతని గురించి ప్రస్తావిస్తున్నప్పుడు "మా డాడీ!" అనే క్యాజువాలిటీయే కనపడుతున్నది - విచిత్రంగా లేదూ!
    4.ప్రణయ్ తరపువాళ్ళు బీదవాళ్ళు కాకపోగా మారుతీరావును ఆఫ్టరాల్ కిరసనాయిలు అమ్ముకునేవాడు అని అనగలిగిన స్థాయిలో ఉన్నారు.ఆ కుటుంబాల మధ్యనకులపరమయినవి మాత్రమే కాకుండా ఇతరమైన విభేదాలు ఉన్నటు తెలుస్తుంది!

    పైవాటిని గురించి ఎవరూ ఇక్కడ ప్రస్తావించడం లేదు.సోషల్ మీడియా వార్తల్ని పూర్తి సత్యాలుగా భావించాలని నేనూ అనటం లేదు.కాకపోతే ఆ సారాంశాన్ని అర్ధం చేసుకుని మనకు నిజమనిపించేవాటిని మన వాదనకి ఆధారం చేసుకోవచ్చు.కానీ మనం మిర్యాలగూడ వెళ్ళి తెలుసుకునే అవకాశం లేనప్పుడు సోషల్ మీడియాని వదిలేసి బాధయత గలిగిన పత్రికల టీవీల వార్తల నుంచి సన్నివేశాల్ని తీసుకోవడం కన్న చెయ్యగలిగింది లేదు కదా!రంగనాయకమ్మ గారు చేసింది కూడా అదే

    ReplyDelete
    Replies
    1. రంగనాయకమ్మ గారి వ్యాసంలో పనికి వచ్చే సూచనలను, పరిణితితో వ్యవహరించాల్సిన పరిశీలనను ఆహ్వానించాలి.

      Delete
    2. సోషల్ మీడియాలో వచ్చినవన్నీ ఆధారాలుగా తీసుకోలేము. ఇక్కడ కులం మొదటి సమస్య కాగా.... ప్రణయ్-అమ్రుతలూ మారుతీరావు ఈగొను రెచ్చగొట్టడం కూడా కీలక సమస్య. మర్డర్ జరిగేదాకా వెళ్ళడం ఈగొను రెచ్చగొట్టడమే కారణం అనుకుంటున్నాను. కేవలం కులాంతర వివాహం వల్లనే హత్య చేయించాడని నేను భావించడం లేదు. ఈ ఘటనలో ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రేమాయణాన్ని రామాయణమంతా ఘనంగా ఫేస్ బుక్ లో పోస్తిన్గులూ.... పంతంతో కూడిన రిశేప్షన్లు.... బాధ్యతాయుతం కాదు. సమర్ధనీయమూ కాదు. ప్రేమించడం తెలిసిన వాళ్ళు బాధ్యతగా జాగ్రత్తగా హుందాగా దాన్ని నేగ్గించుకోవడం కూడా తెలుసుకోవడం మంచిది. ఈ సంఘటనలో ఈ అంశం కూడా ఒక పాఠం గా మారాలనేది నా అభిప్రాయం.

      Delete
  16. మారుతీ రావు ఒక ఆడపిల్ల తండ్రి!నేను కూడా ఒక ఆడపిల్ల తండ్రినే!ఏ ఆడపిల్ల తండ్రయినా అల్లుడిలో ఏం చూస్తాడు?ప్రణయ్ పట్ల మారుతీరావు స్వయంగా కులం కారణాన్ని చెప్పినా మనం వాస్తవాన్ని జనరలైజ్ చేసి చూడాలంటే ప్రణయ్ వైపునుంచి ప్రతికూలతలు చాలా ఉన్నాయి.చదువులో వెనక పడ్డాడు - ఉద్యోగం చేసి భార్యని పోషించే సమర్ధత ఉందా?ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ చేసిన రొమాన్సుకి అయిన ఖర్చులో ఒక రూపాయి కూడా అతని సొంత సంపాదన కాదు,అవునా?మారుతీ రావు కానీ నేను కానీ చూసే సమర్ధత ప్రణయ్ దగ్గిర లేదే!ఆ అమ్మాయికేమో ఆ కుర్రాడి ప్రేమ కబుర్లూ తండ్రి చంపేస్తాడని తెలిసి కూడా తనని పెళ్ళి చేసుకోవటం అనే హీరోయిజమూ తప్ప ఇంకేమీ కనబడటం లేదు.ఇప్పటికీ నాకు మెమరీస్ ఎక్కువ లేవు అనే సినిమాటిక్ ఏడుపు తప్ప పుట్టబోయే బిడ్డని యెలా పోషించుకోవాలనే తెలివైన ఆలోచన చెయ్యటం లేదు!

    కేచలం ఒక వ్యక్తిగతమైన సారూప్యతకి సంబంధించిన భయం వ్యక్తపరిస్తే అది నా కులాధిపత్యం ఎట్లా అయిందో నాకు అర్ధం కావటం లేదు.చట్టప్రకారం ఖచ్చితంగా తప్పే గనక హత్య చేయించడాన్ని సమర్ధించకపోయినా మారుతీరావుని నైతికంగా సమర్ధిస్తున్నవాళ్ల వాదననే రిపీట్ చేశాను.నేను కూడా మారుతీరావులా ప్రవర్తిస్తాననీ నాకూ మారుతీరావుకీ జస్టిఫికేషన్ తెచ్చుకోవడం కోసమే ఈ పోష్టు వేశాననీ మీరు అనుకుంటే దానితో నాకు సంబంధం లేదు.ఆ పాయింటు వదిలేసి మంచి పాయింట్లతో ముందుకు రండి!

    రేపటి కాలంలో ఆర్ధికంగా ఎదిగి సామాజికంగా పై స్థాయికి వెళితే ఇవ్వాళ అణచివేతకి గురయ్యామని అంటున్న దళిత కుటుంబాలకి కూడా ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది!!

    ReplyDelete
  17. ఆడపిల్ల తండ్రి !

    ఆడపిల్ల తండ్రి కాబట్టి ఫలానా వారు ఫలానా నిర్ణయం తీసుకున్నారు అని చెప్పడం చూస్తే నాకు ఒకటి అడగాలని అనిపిస్తుంది. మరి మగ పిల్లాడి తండ్రి ఏమి చేయాలి ? వాల్లు కూడా మగపిల్లాడి తండ్రి లేదా తల్లి అనే "ట్యాగ్" ఒకటి తగిలించుకుని వాల్ల వాల్ల సంకుచిత భావజాలాన్ని రుద్దేసి .. ఘోరమైన అకృత్యాలు చేసేయొచ్చా ? ఆడపిల్లైనా మగ పిల్లైనా ఇద్దరూ సమాజములో సమానమే కదా , మరెందుకు ఇలా ??

    ఇవే మాటలు .. ఎవరైనా ఒక ఆడపిల్ల మీద యాసిడ్ దాడి చేసినప్పుడు మాట్లాడగలరా ? ఆ పిల్ల ఆ మగాడ్ని రెచ్చగొట్టింది, రెచ గొట్టకుండా ఉండాల్సింది అని ? కాస్త ఎదగండి బాబులు ! మీ మూర్ఖత్వాల నుండీ, మీ సంకుచిత "హీరోయిజాల" లుండి. ఆడపిల్ల తండ్రులైన మాత్రాన వీరికి వచ్చే ప్రత్యేక అధికారాలు ఏముంటాయి? ఒకవేల ఉంటే అలాంటివే .. మగపిల్లాడి తల్లికి లేదా తండ్రికీ ఉంటాయి కదా ? మరి భవిశ్యత్తులో మగపిల్లల తల్లిదండ్రులు ఒక "ఆడపిల్ల ను" ఇలానే హత్యలూ గట్రా చేస్తే ఊరుకుంటారా ?

    ఆడపిల్ల ఉండడం, ఆమె రక్షణ గురించి ఆలోచించడం తప్పు కాదు. కానీ, కామన్ సెన్సునూ, నతికి విలువలనూ, చట్టాలనూ వదిలేసి.. తిరగడం మంచిది కాదు. అలా తిరిగితే .. ఏదో ఒక రోజు.. "మగ పిల్లాడి తల్లో" లేక "మగపిల్లాడి తండ్రో" వీల్లకు ఎదురొచ్చి నిలబడి చేసే అకృత్యాలను వీరు ఎదుర్కోవాల్సి వస్తుందేమో !

    ReplyDelete
    Replies
    1. Have you read my answer carefully?Even though I started the comment with that sentence,I have ecplained the stand I took.Still you are arguing that I am highlighting this matter with personal sentiments and castiest mentality - how many times I need to repeat and educate you on such simple things?

      I have requested two times forba new perspective with unbiased outlook Is it all a waste of time?shall I request Mr.kondala rao to remove this post?

      Delete
    2. Fortunately, I am not in such a pathetic position to get "education" from a person like you. Anyway, It's your wish to ask to take this post down or keep it, it's not my concern. My only concern is, as far as this kind of posts and such kind of nonsensical comments exists, it's my responsibility to counter them and give rational argument. That I will do.

      Delete
  18. హత్య అనేది నేరమే కాదనడం లేదు.గృహహింస పేరుతో మగవాళ్ళు చేసే అరాచకాలను భరించలేక భర్తనే హత్యలు చేయడం మీరు చూడడం లేదా ? ఎవరైనా అటువంటి ఆడవాళ్ళను సమర్ధించడం మీరు చూసారా ? భర్తను చంపిన భార్య అని మెయిన్ పేజీలో వేస్తారు.ఇంకా ముందుకెళ్ళి అక్రమసంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను చంపేసిన భార్య అని కూడా వ్రాస్తారు.అక్రమ సంబంధం ఉన్నదని తెలిసినపుడు గౌరవంగా విడిపోతే హత్య జరిగేదే కాదు.
    భార్య అక్రమ సంబంధాన్ని భర్త సమర్ధతతో ఎందుకు ముడిపెడతారు ? వెధవ పనులు చేసేది భార్య అయితే వదిలించుకోవడం మంచిది కదా ? ఆర్ధిక కారణాలు, కక్షలూ హత్యకు దారితీస్తాయి.ఒక హత్యను సమర్ధించినంత మాత్రాన శిక్ష తప్పించుకోలేరు కదా ?

    కొండలరావు గారు అడిగినట్లు సమాజంలో ఎటువంటి మార్పు రావాలి అంటే చైనా వాళ్ళలాగా ప్రతి మనిషీ ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని నిరంతరాయంగా చేస్తూనే ఉండాలి.ఏదో ఒక పని అన్నాం కదా అని ప్లాస్టిక్ తయారుచేసి పర్యావరణాన్ని పాడుచేయకుండా చుట్టుప్రక్కల ప్రదేశాలను అందంగా తీర్చిదిద్దుకోవాలి.

    ఒక వ్యక్తి తన భార్యకు గుర్తుగా కొండనే తవ్వేసాడు.అలా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ పర్యావరణానికీ, కుటుంబానికీ హాని చేయకుండా మనుగడ సాగించాలి.

    ReplyDelete
    Replies
    1. < గౌరవంగా విడిపోతే హత్య జరిగేదే కాదు. >
      < ఒక వ్యక్తి తన భార్యకు గుర్తుగా కొండనే తవ్వేసాడు.అలా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ పర్యావరణానికీ, కుటుంబానికీ హాని చేయకుండా మనుగడ సాగించాలి. >
      yes these suggestions are useful to built a new way.

      Delete
    2. మన బ్లాగరే అయిన "రాజన్న" భార్యగారి పేరు మీద వాటర్ కూలర్ ఏర్పాటు చేసారు.ఇటువంటి వాళ్ళను గుర్తించి సత్కరించుకోవాలి.మీడియాలో ఎక్కడా మంచి పనుల గురించి చూపించరు.

      Delete
  19. వివాహేతర సంబంధం అనేది వ్యక్తిగత విషయం అనుకుని, ఆ సంబంధం పెట్టుకున్న స్త్రీ గురించి చెడుగా మాట్లాడుకోకూడదు అనే సెన్స్ జనానికి ఉంటే, వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతో హత్యలు చేసేవాళ్ళు ఉండరు కదా.

    ReplyDelete
  20. కారంచేడు దమనకాండ దరిమిలా నిందితుని అసమదీయులు ఫలానా నిమ్నజాతి అలగా వెధవలు కులీన స్త్రీలను సతాయించారంటూ "పరోక్ష సమర్థన ప్రచారం" చేపట్టారు ఇప్పుడూ అదే చరిత్ర పునరావృత్తం అవుతుంది.

    ఇంతకీ పాత సినిమాలో గుమ్మడి తరహాలో బిల్డప్పులు ఇవ్వబడుతున్న "అమాయక తండ్రి" వాస్తవ రూపం ఏమిటి? అతని మీద భూకబ్జాలు, సెటిల్మెంటు వ్యవహారాలు, నయీమ్ గాంగ్ సంబంధాలు ఒకటేమిటి ఎన్నెన్నో ఆరోపణలు ఉన్నాయి.

    ReplyDelete
    Replies
    1. >>>ఇంతకీ పాత సినిమాలో గుమ్మడి తరహాలో బిల్డప్పులు ఇవ్వబడుతున్న "అమాయక తండ్రి" వాస్తవ రూపం ఏమిటి? అతని మీద భూకబ్జాలు, సెటిల్మెంటు వ్యవహారాలు, నయీమ్ గాంగ్ సంబంధాలు ఒకటేమిటి ఎన్నెన్నో ఆరోపణలు ఉన్నాయి.>>>

      ఇవన్నీ చేస్తేనే 100 కోట్లు సంపాదించగలరు. ఇది ఒక తండ్రీ కూతుళ్ళ వ్యక్తిగత ద్వేషం అని మొదటినుండీ చెపుతున్నాను.కులం,మతం ఎపుడూ సమస్య అవదు. కూతురుని చంపలేక అల్లుడిని చంపేసారు.ఇపుడు ఆమెను తండ్రికంటే ప్రజలే ఎక్కువ టార్చర్ చేస్తున్నారు.ట్రోల్స్ తట్టుకుని నిలబడుతుందంటే తన బిడ్డకోసమే బ్రతుకుతోంది.

      మీరు అన్నట్లు ఆయనకు అడ్డగోలు సంపాదనే లేకపోతే ఈ గొడవే ఉండేది కాదు.ఆర్ధికంగా ఎదగడం కూడా ఒక్కోసారి సమస్యలను తెచ్చిపెడుతుంది.

      నేను అడిగేది ఏమిటంటే ఒక దళితుడు చనిపోయాడు కాబట్టి అమృతకి నజరానాలు ప్రకటిస్తున్నారు కదా ఒక బ్రాహ్మణుడు చనిపోయాడనుకోండి దళితురాలైన భార్యకు కూడా నజరానాలిస్తారా అని అడుగుతున్నాను అధ్యక్షా ?

      Delete
    2. నీహారిక గారూ, మీ ప్రశ్న అర్ధం కాలేదు. కొంపతీసి ఇది "లవ్ జీహాద్" తరహా కేసు అంటున్నారా?

      Delete
    3. దళితులు ఎక్కడున్నా అడుక్కునే వాళ్ళుగానే ఉండాలా ? ఇచ్చేవాళ్ళుగా ఎదగకూడదా ?

      Delete
    4. ఇక్కడ ఎవరు అడుక్కుంటున్నారు, పరిహారం బిచ్ఛం కాదు!

      Delete
    5. మీకొక 8లక్షలు ఇస్తాను పోయిన ప్రణయ్ ని తీసుకొస్తారా ?

      తండ్రీకూతుళ్ళ గొడవలో ప్రణయ్ చనిపోయాడు.పరిహారం ఎవరికి ఇవ్వాలి?

      కొండగట్టు రోడ్డు ప్రమాదంలో ఇచ్చేదీ వ్యక్తిగత తగాదాల్లో ఇచ్చేదీ ఒకటేనా ?

      ఇలాగే మీరో నేనూ చంపేసుకున్నాం అనుకోండి ప్రభుత్వం పరిహారం ఇస్తుందా ?

      Delete

    6. వచ్చిన కాడికి లాక్కోండి జై గొట్టి గారు ఆపై మళ్ళీ‌ డిమాండు మొదలెడదాం


      బిరాన ఎనిమిది లక్షలివ్వండీ


      Delete
    7. ఎవరు ఎవరిని ఏమి అడుక్కున్నారు? ఇది ముందు తేల్చండి, ఆ తరువాత వేరే ప్రశ్నలు చూద్దాం.

      Delete
  21. హరిబాబు గారు ఒక మాట అన్నారు.వీడియో తీసి తండ్రిని రెచ్చగొట్టింది అని.చిరంజీవి కూతురు ఆర్య సమాజ్ లో పెళ్ళిచేసుకుని మీడియాలో ప్రచారం కూడా చేసుకుంది.అదే చిరంజీవి కూతురికి మళ్ళీ అట్టహాసంగా పెళ్ళిచేసి జనానికి చూపించారు. ఆ వీడియోతోనే ఈ సంస్కృతి మొదలయ్యింది.చిరంజీవికి కోపం లేదా ? పరిస్థితులను అంగీకరించడం అందరూ చేయలేరు.ఆధ్యాత్మికత అంటే ఆగ్రహాన్ని నిగ్రహించుకోవడమే !
    అంబానీ కూతురు నిశ్చితార్ధం ఎక్కడో నిరాడంబరంగా జరుపుకోవలసిన అవసరం ఏమిటీ ? డబ్బుని ఎలా సంపాదించాలి ఎలా ఖర్చుపెట్టాలి అన్న విషయంలో ఒక క్లారిటీ ఉండబట్టే కదా ?

    ReplyDelete
  22. ఈ వీడియో చూస్తే మీ కన్నీళ్ళు ఆగవు,ఈ వీడియో చూస్తే మీకు మతిపోతుంది, ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అంటూ ఓం ఫట్,గరం చాయ్ అంటూ యూట్యూబ్ చానెల్స్ రకరకాల చెత్త తెచ్చి వదులుతారు.అటువంటి వాటిని చూసి వారికి ఆదాయాన్ని పెంచకండి.మనం ఎంతమంది చూస్తే వారికి అంత ఆదాయం వస్తుంది. చక్కటి ముగ్గులు, మెహందీ డిజైన్లు,పనికిరాని వస్తువులను అందంగా ఎలా తయారుచేయవచ్చు, బ్లౌజ్ కుట్టడం నేర్చుకోవడం, విద్యా సంబందమైన పెయింటింగులు, లెక్కలు, గ్రామర్ మొదలైన వాటిని చూసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.జపాన్ వాళ్ళు చూడండి పువ్వులతో కళాకృతులు చేస్తారు. మనచుట్టూ సమాజం నుండి మనమేమి నేర్చుకుంటున్నాం అనేది ఎవరికి వారు తెలుసుకోవాలి.

    ReplyDelete
  23. ఇక్కడ నీహారిక గారు ఒక్కరే కొంత అర్ధవంతమయిన వాదనల్ని వినిపిస్తున్నారు!జై గారు లేవనెత్తిన మారుతీరావుకి ఉన్న నయీం తరహా బ్యాగ్రౌండ్ కూడా వాస్తవమే!

    ఒక విశేషాన్ని గమనించాలి - అమృత హత్య జరిగిన తొలినాళ్ళలో ఇచ్చిన సుదీర్ఘమయిన ఇంటర్వ్యూలో తనకీ మొదటినుంచీ అవన్నీ తెలుసునన్నట్టు మాట్లాడింది.ఆ వీడియోలో నేను గమనించిన ఒక విచిత్రం ఏమిటంటే మటిమాటికీ ఒక వైపుకే ఏదో ఆరా తీస్తున్నట్టు కాసేపు చూడటం మళ్ళీ తెర వైపుకి చూడటం చేసింది.ఎందుకలాచేస్తున్నదో నాకు అర్ధం కాలెదు.కానీ ఆ దైవర్షన్ ప్రత్యేకించి out of focus persons తనకి ఏదో సైగలు చేస్తున్నపుడు చూసేలా చూసింది - చాలాసార్లు!ఇలాంటి విషయాలు అనత్ క్రిటికల్ సిచుయేషన్లో చెప్పకూడదని ఏవరయినా వారిస్తుంటే తనకి అర్ధం కాలేదా?ఒక కొత్త ఇంటర్వ్యూ వీడియోలో ఆ background ఉన్నట్టు అప్పట్లో తెలియదనీ విడదీస్తాడే తప్ప చంపేస్తాడని అనుకోలేదనీ మాట్లాడింది!"బయట జరిగే వ్యవహారాలు కదా,ఇంట్లోవాళ్ళకి ఎలా తెలుస్తాయండీ!" అని ఎదురు ప్రశ్న కూడా వేసింది.

    ఇంకొక ముఖ్యమైన మార్పు ఏమిటంటే,ట్రామా అనేది ఎదురైన వెంటనే ఇచ్చిన పాత ఇంటర్వూలో మాట్లాడిన ప్రతి మాటా తదబాటు లేకుండా స్పష్టంగా చెప్పిన మనిషి ఇప్పటి ఇంటర్వూలో నత్తితో సహా తడబాటునూ కంగారునూ చూపిస్తున్నది.మళ్ళీ మళ్ళీ "ముందుముంచీ చంపెయ్యడం ఖాయం అని తెలిసినప్పుడు ఎందుకుతగిన జాగ్రతలు తీసుకోలేదు?" అనే ప్రశ్న వస్తుండటం వల్ల మాట మార్చినట్టు లేదూ?


    ఇదంతా అమాయకత్వమేనా?అమాయకత్వమే అయితే జాలిపడాలి.అమాయకత్వం కాకపోతే అతి తెలివి అవుతుంది - దానికి కూడా జాలిపడాలా?పెంపకం అనే పాయింటు మీద అమృత అతి తెలివికి కూడా తలిదండ్రులే కారణం అనుకున్నప్పటికీ అమృత మూర్ఖత్వం ఏమీ లేదా?రంగనాయకమ్మ గారు కూడా ఆఖర్లో మారుతీరావుకి త్వరగా శిక్ష పడాలని అంటూనే ఒక తండ్రి కూతురు పట్ల చూపించిన మూర్ఖత్వానికీ ఒక కూతురు తండ్రి పట్ల చూపించిన మొండితనానికీ ముడిపెట్టి ప్రణయ్ కుటుంబం మీద జాలిపడ్డారు!

    ReplyDelete
  24. So,my conclusion is:
    నీహారిక గారు ఇచ్చిన గృహాహింసకి తట్టుకోలేక మొగుణ్ణి హత్య చేసిన భార్య వార్త కూడా మారుతీరావుకి చాలా దగ్గిర పోలికే!ఇక్కడ మనం వ్హట్టం గురించి మాట్లాడటం లేదని గుర్తుంచుకోండి!

    మనం చూడాల్సింది ఆ తరహా వ్యవహారాల్లో మన పిల్లలు గానీ మనకి తెలిసినవాళ్ళ పిల్లలు గానీ ఇరుక్కుంటే ఏం చెయ్యాలి అనేది!

    నిజమైన ప్రేమ,అబద్ధపు ప్రేమ లాంటి వేదాంతం వేస్ట్.అచ్చు గుద్దినట్టు అదే వాతావరణం ఇంకొక చోట రిపీట్ కాదు.కొన్ని తేడాలు ఉంటాయి.

    ఇక అమృత-ప్రణయ్ ఉదంతంలోని కొన్ని సంగతుల్ని తీసుకుని నేను చెప్పేది యేమిటంటే మనం పిల్లల పెంపకంలో కొన్ని వింత ధోరణుల్ని చూపిస్తున్నాం.

    మగపిల్లాడి పెంపకం విషయంలో "వాడికేం!మగాడు(మగమహారాజు!) - ఎట్లాగైనా బతికేస్తాడు" అనే మాట వినబడుతుంది.పైకి అలాంటి మాట ఏదీ రాకపోయినా రేపు వాడు పెళ్ళి చేసుకుని భార్యాబిడ్డల్ని పోషించాలంటే వాడికి బాధ్యత తెలిసి ఉండాలి అనేది తెలియటం లేదు - రేపిస్టులుగానూ ఈవ్ టీజర్లుగానూ పట్టుబడి మొహాలు వేళ్ళాడేసుకుని కనపడుతున్న వాళ్ళలో ఈ రకమైన లోపాన్ని గమనించవచ్చు!ఇది ప్రణయ్ ప్రవర్తనలో కూడా కనిపిస్తున్నదా లేదా?నలుగురమ్మాయిలకి లైన్లెయ్యడం నిజమో కాదో తెలియదు , అందమైన అమ్మాయి కనబడితే కరెంటుతీగ లాంటి కుర్రాడు"లైనేసి,లాగేసి,పట్టేసి ఒళ్ళోకి తెచ్చుకోవడం" లాంటి చరిష్మా చూపించడమూ తప్పు కాదు.కానీ అన్ని సబ్జెక్టులు ఫెయిలయ్యి ఏ ఉద్యోగమూ లేకుండా జీవితాంతం అమృతని ఎలా పోషిద్దామ్నుకున్నాడు?

    ఈ రకమైన ప్రాక్టికాలిటీ ఆడపిల్లకే ఎక్కువ ఉండాలి - అది నేర్పకపోవటం అమృత తల్లిదండ్రుల తప్పే!

    9వ అతర్గతి కాదు చదువుతున్నది పీజీ అయినా సరే,ఒక కుర్రాడు ఐ లవ్యూ చెప్పగానే ఢమాల్మని పడిపోవటం కాదు,కుర్రాడి సమర్ధత గురించి లెక్కలు వెయ్యాలి.తల్లిదండ్రులు ఆడపిల్ల వేరే ఇంట్లో ఓక్ జీవితకాలం పాటు నిష్పూచీగా అబ్తకటానికి కావలసీన్ తెలివీ ధైర్యమూ ఇవ్వాలి - నా లెక్క ప్రకారం అమృతకి పెళ్ళి అంటే ఏమిటో ఇప్పటికీ తెలియడం లేదు.అలా పెరిగిన ఆడపిల్లలే కష్టాలు పడుతున్నారు.

    ఆడపిల్లకి సంస్కృతి రూపంలో చెప్పాల్సింది మనీ మేనేజిమెంటు - అది అమృతలో కనపడటం లేదు!వస్తువుల్లో వెనకటి కాలపు ఆడపిల్ల తలిదండ్రులు "పట్టెమంచం" ఇవ్వడం చూస్తాం - ఎంత శోభనమైన ఏర్పాటు!

    మగపిల్లాడికి తలిదండ్రులు సంస్కృతి రూపంలో చెప్పాల్సింది భార్యనీ పిల్లల్నీ పోషించాల్సిన బాధ్యత గురించి -అది ప్రణయ్ విషయంలోనూ లేదు!వస్తు రూపంలో ఇవ్వాల్సింది కుదిరితే సొంత ఇల్లు,లేదంటే ఇంట్లోనే ఒక హక్కుగా ఉన ప్రైవేట్ భాగం.మగపిల్లవాడికి పెళ్ళి చెయ్యటాన్ని ఇంటివాణ్ణి చెయ్యటం ఆంటారు కదా!ఆ ఏర్పాటు అటువైపు వాళ్ళు ఇస్తున్న పట్టెమంచానికి తగ్గట్టు ఉండాలి - ఎంత శోభనమైన ఏర్పాటు?

    P.S:నేను పైన చెప్పిన వాటిలో హిందువులకి మాత్రమే చెప్పింది ఏదీ లేదు.అగ్ర,నిమ్న కులాలకీ,దళిత,పీడిత,తాడిత,మార్క్సీయ భావజాలాలకి అతీతమైన సలహాలు ఇవి.పిల్లకి ఇవన్నీ చెప్పాలంటే ముందు పెద్దల్లో ఉండాలి కదా!

    దీనిమీద ప్రశ్నలు ఏమయినా ఉంటే చర్చని పొడిగించటం,లేదంటే ముగించడం మంచిదని అనుకుంటున్నాను.మీరేమంటారు?

    ReplyDelete
    Replies
    1. "వాడికి బాధ్యత తెలిసి ఉండాలి అనేది తెలియటం లేదు"

      "ఈ రకమైన ప్రాక్టికాలిటీ ఆడపిల్లకే ఎక్కువ ఉండాలి - అది నేర్పకపోవటం అమృత తల్లిదండ్రుల తప్పే!"

      పిల్లలు, విద్యార్థులు లేదా సహోద్యోగులు ఎవరినయినా కానీ క్షణక్షణం నియంత్రించడం (backseat driving) కుదరదు. ఒకరి దీర్ఘకాలిక ప్రభావం చూపాలంటే విలువలు నేర్పించాలి, అది కూడా "నేను చెప్తున్నాను కనుక పాటించాలి" ధోరణిలో కాక అవి ఎందుకు మంచివో చెప్పాలి. ఉ. శివాజీ తల్లి జీజాభాయి చిన్నప్పుడు దేశభక్తి కథలు చెప్పడం.

      బాధ్యతలు ఎప్పటికయినా తప్పవు. పిల్లలను అందుకు చిన్నప్పటి నుంచే క్రమక్రంగా తయారు చేయడం ఉత్తమం.

      "మగపిల్లాడి పెంపకం విషయంలో "వాడికేం!మగాడు(మగమహారాజు!) - ఎట్లాగైనా బతికేస్తాడు" అనే మాట వినబడుతుంది"

      మగపిల్లలో ఇటువంటి భావన తల్లితండ్రులతో పాటు సమాజం, మీడియా & సినిమాలు పెంపొందించడం వల్లనే అనేక అనర్ధాలు జరుగుతున్నాయి. బేటీ బచావో నినాదం ఇందుకే వచ్చింది.

      "పిల్లకి ఇవన్నీ చెప్పాలంటే ముందు పెద్దల్లో ఉండాలి కదా"

      100% correct. ప్రస్తుత ఉదంతంలో ఇదే పెద్ద చిక్కు అనుకుంటా. తనకే ఎటువంటి విలువలు లేనట్టుంది, అటువంటి తండ్రి కూతురికి ఏమి నేర్పిస్తాడు!

      Delete
    2. మంచి పాయింటు గుర్తు చేశారు. గృహహింస అన్నది నిజం. కానీ చేసింది "మారుతీ రావు". కూతురి ఇష్టముతో సంబందం లేకుండా .. ఆమె మీద తన అభిప్రాయాలను రుద్దాలనుకోవడం గృహహింస కిందకే వస్తుంది. ఆరకంగా చూసుకున్నా .. కూతురుని గృహహింస తో హింసించిన వ్యక్తి కూతురు పట్ల ప్రేమతో హత్య చేశాడు అనడం అవివేకం (ఏ కారణముతో చేసినా హత్య చేయడం తప్పు అన్న విషయాన్ని పక్కన పెడితేనే ఇదంతా).

      //ప్రణయ్ ఈవ్ టీజింగులు చేశాడా ? రేపిస్టా ?అనేవాటి గురించి ...
      ప్రణయ్ మీద ఈవ్ టీజింగ్ కేసులు ఉన్నట్టుగానీ, రేప్ కేసులు ఉన్నట్టుగానీ ఏవైనా అధారాలు .. పక్కాగా నిరూపితమైనవి ఉన్నాయా ? అంటే ..ఇప్పుడు ఫేసుబుక్కులలో తగలడే.. ఫోటో షాపింగులు, విడియో మార్ఫింగులు లాంటీ చెత్తా చెదారం కాదు. డీల్లీ కి రేప్ క్యాపిటల్ అన్న పేరు రావడానికి కారణమైన "తప్పుడు కేసులు" వంటివి కాకుండా.. ఏవన్నా ఉన్నాయా ? మరెందుకు ఇల పిచ్చిగా మాట్లాడుతున్నారు ?? మీకు ఈవ్ టీజింగుకు, సెక్సువల్ హరాస్‌మెంటుకూ, కౌర్ట్‌షిప్ కీ తేడా తెలుసా అసలు ? తెలీక పోతే, తెలుసుకుని రండి.

      //"మనం చూడాల్సింది ఆ తరహా వ్యవహారాల్లో మన పిల్లలు గానీ మనకి తెలిసినవాళ్ళ పిల్లలు గానీ ఇరుక్కుంటే ఏం చెయ్యాలి అనేది!"
      వాల్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. మన చుట్టు పక్కల ఉండి, నీ కులం ఏమిటి, నీ పరువేమిటి? నీ కూతురు కులం తక్కువ వాడి తిరుగుతుందేమిటి అని పిచ్చి మాటలు మాట్లాడే సన్నాసులను దూరంగా పెట్టాలి. అందరికంతే ముఖ్యంగా వాల్లను చంపేసి, కూతుర్ని రక్షించాం అనే మూర్ఖత్వానికి లోనవ్వకుండా ఏదన్నా సైకియాట్రిస్టు దగ్గర ట్రీట్‌మెంటు తీసుకోవాలి. అప్పటికి కూడా ఆ పిచ్చి కంట్రోల్ అవ్వక పోతే, తమను తాము ఒక రూములో పెట్టుకుని లాక్ చేసుకుని, సభ్య సమాజానికి దూరంగా, "ఆ పిచ్చి" అనిగే వరకూ ఉండాలి. అబ్బో లిస్టు రాసుకుంటూ పోతే చాలా ఉంది.

      వాడికేం మగాడు ఎలాగైనా బతికేస్తాడు అని మా "నాయనమ్మ కాలములో" ఎప్పుడో అనుకునే వారంటా. ఇప్పుడు "అబ్బాయిలను" నారాయణా, చైతన్యా లాంటి స్కూల్లలో పడేస్తున్నారు.. పెద్దైతే, వీడు ఎలా బతుకుతాడో ఏమో అని భయముతో. కాబట్టి,కాలం చెల్లిన కొటేషన్లను కాస్త పక్కన పెడదాం.

      Delete
    3. >>>>అందరికంటే ముఖ్యంగా వాళ్ళ్ని చంపేసి, కూతుర్ని రక్షించాం అనే మూర్ఖత్వానికి లోనవ్వకుండా ఏదన్నా సైకియాట్రిస్టు దగ్గర ట్రీట్‌మెంటు తీసుకోవాలి. అప్పటికి కూడా ఆ పిచ్చి కంట్రోల్ అవ్వక పోతే, తమను తాము ఒక రూములో పెట్టుకుని లాక్ చేసుకుని, సభ్య సమాజానికి దూరంగా, "ఆ పిచ్చి" అనణిగే వరకూ ఉండాలి. >>>>

      మారుతీరావు చేస్తున్నది అదేగా ?
      జైల్ లో లాక్ చేసుకున్నాడు.

      Delete
  25. కులాంతర వివాహం ఎందుకు అని డైరెక్ట్‌గా అడక్కుండా నైన్‌త్ క్లాస్‌కే లవ్వేమిటి అని అడిగేవాళ్ళకి నా ఉపదేశం: తాను వ్యాపారం చేస్తాననీ, దానికి చదువుతో పెద్ద పని లేదనీ ప్రణయ్ చెప్పుకుంటే ఏమి చేస్తారు? నాకు తెలిసిన ఒక రైల్వే ఉద్యోగి కొడుకే ఉద్యోగం దొరక్క కంప్యూటర్లు రిపెయిర్ చేసుకుని బతుకుతున్నాడు. అతనికి పెళ్ళయ్యింది, కాకపోతే పిల్లలు లేరు. అతని భార్య గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నదా లేదా అనేది నాకు తెలియదు కానీ గర్భ నిరోధక మాత్రలు కావాలనుకుంటే గవర్నమెంట్ నర్స్ అవి ఫ్రీగా ఇస్తుందని నాకు తెలుసు. మీరు చదువు గురించి ఎంఫసిస్ ఇవ్వాలనుకుంటే బతకడానికి గవర్నమెంట్ ఉద్యోగం ఒక్కటే మార్గమని నమ్మేవాళ్ళ దగ్గర ఆ ఎంఫసిస్ ఇవ్వొచ్చు.

    అమృత తండ్రి రియల్ ఎస్టేట్స్ వ్యాపారి. ఆమె పల్లెటూరి సంతలో వ్యాపారం చేసే కోమటివాణ్ణి తన కులంవాడే కదా అని పెళ్ళి చేసుకోదు. ప్రణయ్ కూడా ఆర్థికంగా ముందున్నవాడే. అతను కూడా మాల వీధిలో నివసించే అమ్మాయిని కులాన్ని చూసి పెళ్ళి చేసుకోలేడు. అమెరికాలో కులాలు లేవు. వాళ్ళు స్టేటస్‌ని చూసే పెళ్ళి చేసుకుంటారు. ఇక్కడ కులాలు ఉన్నా అమృత, ప్రణయ్‌లు కులాల గురించి పట్టించుకోలేదు. అంతే, ఆ నిజం ఒప్పుకోలేక వాళ్ళ చదువు గురించి మాట్లాడుతున్నారు.

    ReplyDelete
    Replies
    1. @प्रवीणSeptember 24, 2018 at 4:31:00 PM GMT+5:30
      కులాంతర వివాహం ఎందుకు అని డైరెక్ట్‌గా అడక్కుండా నైన్‌త్ క్లాస్‌కే లవ్వేమిటి అని అడిగేవాళ్ళకి నా ఉపదేశం: తాను వ్యాపారం చేస్తాననీ, దానికి చదువుతో పెద్ద పని లేదనీ ప్రణయ్ చెప్పుకుంటే ఏమి చేస్తారు?

      hari.S.babu
      వ్యాపారం చేసి పైకొచ్చే తెలివి ఉంటే సూపరే!కానీ దానికి 23 back logs వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు కదా!ఫంక్షను కోసమూ వీడియో కోసమూ 15 లక్షలు ఖర్చు పెట్టించినట్టున్నారు - పొలం ఏదో అమ్మాల్సి వచ్చిందని ఒకచోట చదివాను!ఆయన ఆ 15 లక్షలు సంపాదించటానికి ఎన్నేళ్ళు పట్టి ఉంటుంది?ఇప్పటి పరిస్థితిలో అమృత గానీ బతికి ఉండి ప్రణయ్ గానీ ఆ మొత్తం ఎంతకాలంలో సంపాదించి ఆయనకి బదులు ఇవ్వగలం అని ఆలోచించారా?అదేనా వ్యాపారం చేసి పైకొచ్చే లక్షణం!

      Delete
  26. ఒక వ్యక్తి బిహేవియర్ బాగాలేదని అతన్ని హత్య చేసే అధికారం ఎవరికీ లేదని నేను ఇది వరకే వ్రాసాను. అతను వ్యాపారం చేస్తాడా లేదా ఆస్తులు అమ్ముకుంటాడా అనేది చట్టానికి అనవసరం. అతన్ని మర్డర్ చేసే అధికారం ఎవరికీ లేదు కదా.

    ReplyDelete
  27. అమృత - ప్రణయ్ ప్రేమ కథ విషాదం ఎందుకు అయ్యింది?
    ________________________________________________________

    Because Pranay got murdered. That's it. THE ONLY SERIOUS THING IN THIS WHOLE STORY IS - An innocent man got killed - The killer should be punished and enough measures should be taken to prevent these incidents in the future.

    The rest of the stuff like Caste, Dad's love, Girl's freedom etc are just being hyped up for political reasons. NOBODY HAS A RIGHT TO KILL ANYBODY.

    ReplyDelete
  28. To be honest, what the Dad had for his daughter was NOT love. It was possessiveness and ego. If the girl had married a jerk/rogue/idiot/whatever, it was her decision. If Pranay was really a bad guy, the girl would have suffered, learnt her lesson and would have gone back to her dad in the due course of time. That would have been much simpler than killing a guy who committed no legal crime.

    ReplyDelete
  29. ప్రణయ్ చదువు గురించి చర్చ ఇక్కడ అనవసరం. ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగం కోసమో, మెడికల్ కాలేజ్ సీట్ కోసమో కష్టపడి చదివేవాళ్ళు ఎక్కువ, నిజంగా తెలివితేటలు కోసమైతే అంత కష్టపడి చదవరు. మారుతిరావు ఒక రియల్ ఎస్టేట్స్ వ్యాపారి. అతను ప్రభుత్వ ఉద్యోగుల కంటే చాలా ధనవంతుడు. అతనేమీ తన కూతురిని ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చి పెళ్ళి చెయ్యాలనే ప్రాస్పెక్ట్‌తో ఉండదు. అలాంటప్పుడు ప్రణయ్ చదువు గురించి మారుతిరావు ఎందుకు పట్టించుకుంటాడు?

    నేను అర్థవంతంగా వ్రాయడం అంటే నాకు జీవితానుభవం వల్ల తెలిసినవే వ్రాస్తున్నాను. ఎవడికైనా, ఏదైనా అనుభవం ద్వారానే తెలుస్తుంది. సాధారణంగా నేను ఇలాంటి చర్చల్లోకి దూరను. ఇది రెండు డబ్బున్న కుటుంబాల మధ్య సైకలాజికల్ గొడవ. నేను మార్క్సిస్ట్‌ని. వర్గ పోరాట పరధిలో లేని కులపరమైన అంశాల్లో దూరడం నా పని కాదు. అప్పు బాకీ వసూలు చెయ్యడానికి సివిల్ కోర్ట్‌కి వెళ్ళకుండా నయీం లాంటి గ్యాంగ్‌స్టర్స్ దగ్గరకి వెళ్ళేవాళ్ళు ఉన్నారని నాకు కూడా తెలుసు. అప్పు ఇచ్చినవాడూ ధనవంతుడే, బాకీ ఎగ్గొట్టినవాడూ ధనవంతుడే. వాళ్ళిద్దరిలో ఎవడు సివిల్ సెటిల్మెంట్లు చేసే ఒక ఇల్లీగల్ గ్యాంగ్‌స్టర్ దగ్గరకి వెళ్ళినా వాళ్ళ గొడవతో ఒక శ్రామికవర్గ విప్లవకారుడికి సంబంధం ఉండదు. కులం విషయంలో గొడవ జరిగినప్పుడు మాత్రం అలా గొడవపడినవాళ్ళు ఏ ఆర్థిక స్థాయివాళ్ళైనా దాని ఇంపాక్ట్ సమాజం మీద తప్పకుండా పడుతుందనిపిస్తే ఆ చర్చలో నేను జోక్యం చేసుకోగలను.

    ReplyDelete
  30. 1.కులాంతర వివాహం ఎందుకు అని డైరెక్ట్‌గా అడక్కుండా నైన్‌త్ క్లాస్‌కే లవ్వేమిటి అని అడిగేవాళ్ళకి నా ఉపదేశం: తాను వ్యాపారం చేస్తాననీ, దానికి చదువుతో పెద్ద పని లేదనీ ప్రణయ్ చెప్పుకుంటే ఏమి చేస్తారు?

    2.అమృత తండ్రి రియల్ ఎస్టేట్స్ వ్యాపారి. ఆమె పల్లెటూరి సంతలో వ్యాపారం చేసే కోమటివాణ్ణి తన కులంవాడే కదా అని పెళ్ళి చేసుకోదు. ప్రణయ్ కూడా ఆర్థికంగా ముందున్నవాడే. అతను కూడా మాల వీధిలో నివసించే అమ్మాయిని కులాన్ని చూసి పెళ్ళి చేసుకోలేడు.

    3.ఇక్కడ కులాలు ఉన్నా అమృత, ప్రణయ్‌లు కులాల గురించి పట్టించుకోలేదు. అంతే, ఆ నిజం ఒప్పుకోలేక వాళ్ళ చదువు గురించి మాట్లాడుతున్నారు.

    To be frank and smplistic ,ఈ మూడు పాయింట్లలో నేను ప్రణయ్ ప్రవర్తనలోని బాధ్యతారాహిత్యాన్ని గురించి చెప్పటానికి చదువులో ఫెయిలవడం గురించి చెప్పినదానికి నాకు వేసిన ప్రశ్న."ఆలూ లేదు చూలూ లేదు,కొడుకు పేరు సోమలింగం" అన్నట్టు అసలు ప్రణయ్ ఆలోచించాడో లేదో తెలియదు గానీ ప్రవీణ్ మాత్రం అతను బిజినెస్ చేసి కోట్లు గడిస్తే ఏం చేస్తావ్ అని బిల్డప్ ఇస్తున్నాడు:-)ప్రశ్న ఎంత సూటిగా ఉందో నా జవాబు కూడ ఆంతే సూటిగా ఉంది.ఇంతవరకు ఓకే!

    కానీ రెండవ పాయింటుకీ మూడవ పాయింటుకీ మధ్యన ఒక వాక్యమే గ్యాప్ ఉంది.మొదటి కామెంటులో స్వయంగా తను ఏ పాయింటు మీద చర్చలో ప్రవేశించానని అంటున్నాడో ఆ పాయింటుకి వ్యతిరేకంగా అమృత తన కులంవాడే అయినా తట్టాయిబుట్టయిగాణ్ణి చేసుకుని ఉండేది కాదు,ప్రణయ్ తన కులపుదే అయిన బీదపిల్లకి లైనేసేవాడు కాదని అంటున్నాడు.మళ్ళీ అనే ఇక్కడ ఉన్న కులం ప్రసక్తిని నేను పట్టించుకోకుండా తప్పు దారి పట్టించడానికే నేను చదువు విషయం ఎత్తుకున్నానని నన్ను బ్లేం చేస్తున్నాడు.నేను కూడా స్పష్టంగానే చెప్పాను.సాక్షాత్తూ మారుతీరావే నేను వేరే కులంవాణ్ణి చేసుకున్నందుకే చంపించాను అని అన్నప్పటికీ మనం సమస్యని జనరలైజ్ చేసి అర్ధం చేసుకుంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జర్గకుండా బివారించడం సాధ్యపడుతుంది గనక ఆ దృష్టికోణం నుంచి చూద్దాం అని.నేను మారుతీరావుని సమర్ధిస్తున్నటు తనకి అర్ధమయితే దాన్ని నేను పట్టించుకోనని కూడా చెప్పాను.అయినా వివశవీక్షణం గారికి ప్రవీణ్ చాలా గొప్ప వాదన చేస్తున్నట్టు అనిపించింది.ఎందుకని?అతను హరిబాబుని విమర్శిస్తున్నాడు గనకనా!

    ఒకే పేరాలో కేవలం ఒక వాక్యం గ్యాపు ఇచ్చి తన మాటల్ని తనే ఖండించుకోవటం ఏ విధంగా శాస్త్రీయమైన వాదన అవుతుందో విశవవీక్షణం గారే చెప్పాలి!తన ఒక ప్రతిపాదనని తన మరొక ప్రతిపాదన ఇప్పటికే ఖండించుకుంటుంటే నేను ఈ రెండింటిలో దేన్ని వ్యతిరేకించాలి.తన్న్ని తనే వ్యతిరేకించేసుకున్నాక నేను ఇంకా తనని వ్యతిరేకిస్తూ వాదన పొడిగించటం సాధ్యమా?

    ప్రణయ్ అమృతలు తన కులంలోని బీదవాళ్ళని ప్రేనించి ఉండేవాళ్ళు కాదు అని తీర్మానాలూ తనే చేస్తాడు,మళ్ళీ నేను కులాన్ని పట్టించుకోవటం లేదని అంటాడు - ఇది విశ్వవీక్షణం గారికి గారికి నచ్చేసింది!

    కొండల రావు గారూ!ఒకే పాయంటుని పదే పదే మోతెక్కించడం తప్ప కొత్త వాదనలు ఏమీ చెయ్యడం లేదు.నాకు అసక్తి పోయింది.నేను ఇంక వాదనల్లోకి దిగను.చర్చ వ్యక్తిగతం అవుతున్నట్టు కూడా అనుమానం వస్తున్నది.కామెంట్లని డిజేబుల్ చేసి చర్చని నిలిపివెయ్యడం మీద దృష్టి పెడితే బాగుంటుంది!

    ReplyDelete
  31. నేను చెప్పినదాంట్లో కప్పదాటుతనం ఏమీ లేదు. ఆంధ్రావాళ్ళని బూతులు తిట్టిన కె.సి.ఆర్. తన మనవణ్ణి తన కులానికే చెందిన మైలవరం జమీందార్ మనవరాలికి ఇచ్చి పెళ్ళి చెయ్యగలడు, ప్రాంతాలు వేరైనా & హెజేమనీ వేరైనా కూడా. అతని తోడల్లుడిది కూడా విజయవాడే. కులం, మతం, నాయకత్వం వగైరా అంతా సబ్జెక్టివ్స్. డబ్బు కంటే గొప్ప ఆబ్జెక్టివ్ ఇంకొకటి ఉండదు.

    ReplyDelete
    Replies
    1. @ప్రవీణ్,

      >>>అతను ప్రభుత్వ ఉద్యోగుల కంటే చాలా ధనవంతుడు. అతనేమీ తన కూతురిని ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చి పెళ్ళి చెయ్యాలనే ప్రాస్పెక్ట్‌తో ఉండదు. >>>

      మా నాన్న ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చి పెళ్ళిచేయాలని ఉద్యోగం చూసి పెళ్ళిచేసారు.

      వ్యవసాయదారుడికి వ్యవసాయదారుడికి ఇచ్చి పెళ్ళిచేస్తే ఏమీ మిగలదు నెల జీతం అయితే జీవితం సాఫీగా సాగుతుంది అని ఆయన ఆలోచించారు.

      ప్రభుత్వ ఉద్యోగి అయిన నా ఆడపడుచు జీవితమంతా ఊడిగం చేసినా 10 కోట్లు వెనకేయగలిగాను కాబట్టి తన కూతురిని 100 కోట్లు ఉన్న (అనుకుని) తెలంగాణా రెడ్డి కులస్థులకిచ్చి కులాంతర వివాహం చేసింది.

      ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారో మీరెట్లా డిసైడ్ చేస్తారు? ఏదేదో ఊహించుకుని వాదన చేయకండి.జరగిపోయినవాటిపై ఏమీ చేయలేము జరగబోయే వాటిగురించి ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి చాలు.

      Delete
    2. మా బంధువుల్లో ఎక్కువ మంది బ్యాంక్ ఉద్యోగులు & రైల్వే ఉద్యోగులు. వాళ్ళెవరూ కోట్లు గడించలేదు. ఒకాయన అయితే సొంత ఫ్లాట్ కూడా కొనలేదు.

      Delete
  32. >>>ప్రణయ్ అమృతలు తన కులంలోని బీదవాళ్ళని ప్రేనించి ఉండేవాళ్ళు కాదు అని తీర్మానాలూ తనే చేస్తాడు,మళ్ళీ నేను కులాన్ని పట్టించుకోవటం లేదని అంటాడు >>>

    గురవారెడ్డిగారిని తన ఖర్చులతో చదివించి పెళ్ళిచేసుకుంది.పెళ్ళికి ముందు తనని పోషించే భార్య దొరకడం నా అదృష్టం అని ఆయన చెప్పారు.
    ఆయన ఈ మధ్యనే ఒక వీడియోతో హల్ చల్ కూడా చేసారు చూడండి.

    https://youtu.be/vjieodkaqfy


    ReplyDelete
  33. @Malak,
    //The rest of the stuff like Caste, Dad's love, Girl's freedom etc are just being hyped up for political reasons. NOBODY HAS A RIGHT TO KILL ANYBODY.

    Precisely. These politics blown out of proportion.

    @Haribabu
    Why? ChiranjIvi మీకు వ్యతిరేకంగానే రాశాడు. కానీ నేను ఆయన్ను సమర్ధించలేదు. దేవుడున్నాడా లేదా అన్న విషయములో సింపులుగా నా వాదనను మాత్రమే వినిపించాను. ఇప్పుడు ప్రవీన్ ని సమర్ధించింది అతను రాస్తున్న వాటిలో "విషయం" ఉంది అనే తప్ప అతను మీకు వ్యతిరేకంగా రాస్తున్నాడు అని కాదు.

    ఇంకో విషయం, ప్రవీన్ చేస్తున్న వాదనలో మొదటి పాయింటూకీ తరువాత చెప్పిన పాయింటుకీ వ్యత్యాసం ఉంది అని హర్రీ-బాబు గారు తొందర పడి నిర్ణయానికి వచ్చేశారు. కాస్త ఆలోచిస్తే అతను చెప్పేది ఏమిటో అర్థం అవుతుంది. ఇక మీరు రాసినవి మాత్రం గొప్పగా ఉన్నాయా ? ఒక సారి పోస్టు దగ్గర నుండి మీ కామెంట్లన్నీ మీరే చదువుకోండి .. మీ వాఖ్యల్లో ఎంత వ్యత్యాసం కనపడుతుందో !

    ReplyDelete
    Replies
    1. గర్భ నిరోధక మాత్రలు గవర్నమెంట్ హెల్త్ సెంటర్లలో ఫ్రీగా దొరుకుతోన్న ఈ రోజుల్లో ఇద్దరు నిరుద్యోగులు పెళ్ళి చేసుకుని పిల్లల్ని పెంచే బాధ లేకుండా బతకలేరా? 2015లో నాకు హైదరాబాద్ నుంచి ఒక పెళ్ళి సంబంధం వచ్చింది. ఆమెకి గర్భ సంచి లేదు, పిల్లలు పుట్టరు. పిల్లల్ని పెంచే ఖర్చు ఉండదని నేను మొదట్లో సంతోషించాను. కానీ హైదరాబాద్‌లోఅ ఇంటి అద్దె ఐదు వేలకి తక్కువ ఉండదు అనిపించి నేను వెళ్ళలేఫు. ప్రణయ్‌ది సొంత ఇల్లే. అతనికి అద్దె కట్టుకునే ఖర్చు కూడా ఉండదు.

      Delete
  34. డాక్టర్ సమరం గారు తీర్పు చెప్పేసారు ...
    ఇక ఈ పోస్టులో చర్చలు ఆపేయవచ్చు సర్ !

    https://youtu.be/y91d1LJIQ8Q

    ReplyDelete
  35. >>ChiranjIvi మీకు వ్యతిరేకంగానే రాశాడు.

    అది వ్యతిరేకమా? సొషల్ మీడియాలో చదివి హరిబాబు రాసిందాన్ని ఖండించకపోతే, కాష్మీర్లో అలాంటివే మెస్సేజ్లు చూపించుకోని పోలీసులపై రాల్లు విసిరడంకూడా కర్రక్టే అనిఒప్పుకోండి.

    ReplyDelete
  36. అన్ని వేదికల్లోలాగే ఇక్కడ కూడా చర్చ రకరకాలుగా సాగుతోంది!
    (1) మలక్ పేట్ రౌడీ సూటిగా సుత్తిలేకుండా చెప్పినట్లు ఈ వ్యవహారం లో మారుతీరావు ఖచ్చితంగా ముద్దాయే. హత్యానేరానికి అతను శిక్షార్హుడే.
    (2) హత్యానేరం తో పాటు ఖచ్చితమైన ఆధారాలుంటే కులపిచ్చికీ, సంఘ విద్రోహశక్తులని వాడుకున్నందుకు కూడా అతనికి శిక్షపడాలి.
    (3) మారుతీరావు నేరం వ్యక్తిగతమైనది. కులహంకారం గనక ఉంటే అదికూడా అతని వ్యక్తిగతమే. ఈ వ్యవహరాన్ని రెండుకులాల/వర్గాల పోరాటంగా చూడటానికి వీల్లేదు. ఎందుకంటే ఇలాంటి ఘటనలకంటే కులాంతర/మతాంతర వివాహాలని అంగీకరించిన సందర్భాలే నేటి సమాజం లో ఎక్కువ.
    (4) అమృత, ప్రణయ్ లు వ్యవహరించిన తీరులోగాని, నిర్ణయాల్లోగాని లోటుపాటులండవచ్చు. ఐతే వాటిని తప్పులుగానే చూడగలం కాని శిక్షార్హమైన నేరాలుగా పరిగణించలేం.
    (5) అదే సమయం లో ఇద్దరి లేతవయసు ప్రేమికుల మామూలు వ్యవహారానికి లేనిపోని గొప్పని ఆపాదించి హైప్ చెయ్యటం, అదేదో ఆదర్శనీయం అనుకోవటం తెలివిమాలిన పని. మీడియా ఇలాంటి పనులు చేయటానికి ఎప్పుడూ రడీగా ఉంటుంది. మా ఫ్రెండ్స్ లోనూ ప్రేమ వివాహాలు చేసుకున్నవాల్లు చాలామంది ఉన్నారు. కాని వాల్లందరూ జీవితం లో తమంతట తాము స్థిరపడి, సమాజం, బాధ్యతల గురించ్ అవగాహన చేసుకున్నాక పెళ్ళి చేసుకున్నవాల్లే గాని తొందరపడి దండలు మార్చుకోలేదు. అలాంటి పరిణతి తో కూడిన ప్రేమవివాహాలే కులరహిత సమాజాన్ని నిర్మించగలవని నా నమ్మకం!

    ReplyDelete
అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top