‘ఇద్దరం కలిసి ఉండాలని కోరుకోవడం నేను చేసిన తప్పా? హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం నా తప్పా? హామీలు అమలు చేయాలని కోరడం తప్పా? పార్టీ ఆవిర్భావం నుంచి బడుగు బలహీనవర్గాలకు వెన్నంటి ఉండి తెలుగు ప్రజలు అందరూ బాగుండాలని కోరుకోవడం తప్పా? తెలంగాణలో తెదేపా ఉండటానికి కేసీఆర్ మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు?’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. గురువారం తిరుపతిలో షియామీ సంస్థ ప్రతినిధులతో సమావేశమై ఆ సంస్థ ఉత్పత్తి చేసిన ఎంఐ టీవీ, స్మార్ట్‌ఫోన్లను సీఎం ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. తనపై కేసీఆర్ వ్యాఖ్యలపై భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్‌ను తాను అభివృద్ధి చేసినట్లు కేసీఆర్‌తోపాటు పలుమార్లు ఆయన కుటుంబసభ్యులు చెప్పారని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగానూ తెలుగువారు ఉన్నారని, తనను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. బహిరంగ సభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు సరికావని, ఇష్టానుసారం మాట్లాడితే మంచిది కాదని హితవు పలికారు. ‘నా మీదికి ఒంటికాలిపై వస్తున్నారు. నాపైనే యుద్ధం చేస్తారా?’ అని ప్రశ్నించారు. ‘మీరు ప్రధాని మోదీ దర్శకత్వంలో నాపై దాడి చేయడం సరికాదు’ అని పేర్కొన్నారు. ‘నేను ఎప్పుడూ పరుష పదజాలంతో, వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదు. సిద్ధాంతపరంగానే విభేదిస్తూ మాట్లాడుతుంటా. కొందరిలా దిగజారి మాట్లాడటం నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేదు. హైదరాబాద్ వదిలి వెళ్లాలని అన్నప్పుడు అందరికంటే ఎక్కువగా బాధపడ్డా. వాళ్లూ నా తెలుగువాళ్లే అన్న కారణంతో అన్నీ వదిలి వచ్చేశా. ఇప్పుడు నన్ను గెలిపించిన ప్రజల కోసం మరో నగరాన్ని నిర్మించుకుంటుంటే కేంద్రం అణచివేస్తోంది. పక్క రాష్ట్రంకూడా భాజపా ఆదేశాలతో నాపైనే దాడికి దిగుతోంది. పవన్, జగన్, కేసీఆర్‌లు ముగ్గురూ ఏకమై దాడి చేస్తున్నారు. మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడే.. భాజపా తెలంగాణలో మాతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. సిద్ధాంతపరంగానే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని అక్కడ పోటీ చేస్తున్నాం’ అని వివరించారు.
కనుసన్నల్లో దర్యాప్తు సంస్థలు
‘రాష్ట్రంలో భాజపా వైకాపాతో కలిసి నడుస్తోంది. జగన్‌పై ఉన్న కేసుల దర్యాప్తు ఏడాదిలోగా పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ పురోగతి లేదు. దర్యాప్తు సంస్థలను మోదీ ఎలా అంటే అలా వాడుకుంటున్నారు. ఉత్తర తెలంగాణ ఎడారి కాకూడదని పోరాడితే ఎనిమిదేళ్ల తర్వాత నాపై కేసులు తిరగదోడుతున్నారు. సీమకు ఏం చేయని భాజపా ప్రత్యేక రాయలసీమ డిక్లరేషన్ చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రం జరిగిందని రమణదీక్షితులుతో కలిసి అసత్య ప్రచారం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పిల్ వేశారు. తితిదేను అంతకుముందు కేంద్ర పురావస్తుశాఖ పరిధిలోకి తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ఇదీకాకుండా పీడీ ఖాతాలపైనా రాద్ధాంతం చేస్తున్నారు. నాపైకి అన్ని దర్యాప్తు సంస్థలను పురిగొల్పుతున్నారు. నాడు ఇందిరాగాంధీతోనే పోరాడా. రాజీవ్‌గాంధీబోఫోర్స్ కేసుపైనా పోరాడాం. ఈ రోజు మోదీ చేస్తున్నది ఏదీ సరైంది కాదు. మీకు అనుకూలంగాలేని నేతలు అందరిపైనా బురదజల్లి ఇబ్బంది పెడుతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి’ అనిచంద్రబాబు పేర్కొన్నారు.
కేంద్ర బాధ్యత లేదా?
‘రాష్ట్రాన్ని విభజించి నాడు కాంగ్రెస్ నష్టపరిస్తే.. విభజన హామీలను అమలు చేయకుండా భాజపా మరింత నష్టం చేసింది. దేశంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం వస్తేనే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరుగుతుంది. ఒకవేళ భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే మరింత అన్యాయం జరుగుతుంది. నేను ఎప్పుడూ యూ-టర్న్ తీసుకోలేదు. పవన్, జగన్‌లే ఇలా చేశారు. నేను ఎన్డీయేలో ఉన్నంతవరకూ ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిన వ్యక్తులు.. ఇప్పుడు కేంద్రం నుంచి నేను బయటకు వచ్చాక ఒక్క మాటా మాట్లాడట్లేదు. పవన్, జగన్‌లే ఈ విషయంలో యూ-టర్న్ తీసుకున్నారు. నాది రాజకీయం కాదు, మీది రాజకీయ’మని వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
(from ఈనాడు డిజిటల్)
- పల్లా కొండలరావు
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
జగన్ కూడా తన కేసుల గురించి ఇదే అన్నాడు. ఇప్పుడు డీకే శివకుమార్, రేవంతు & నారాయణ లాంటి తన మనుషుల మీద దాడులు జరిగితే చంద్రబాబుకు దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అనిపిస్తుంది.
ReplyDeleteదర్యాప్తు సంస్థలు ఎంత వెతికినా తప్పు పట్టలేనంత నిజాయితీగా ఉంటే ఈ అనవసర ప్రసంగాలు అవసరం లేదేమో.
ReplyDeleteఅంతా అంత perfect గా ఉంటే అది utopia యే అవుతుంది కదా.
ReplyDeleteCBI cannot register a case without government notification. Only civil police can do so. CID investigates the cases transferred by the civil police to them. But CBI cannot investigate any case without government notification.
ReplyDelete>>దర్యాప్తు సంస్థలు ఎంత వెతికినా తప్పు పట్టలేనంత నిజాయితీగా ఉంటే ఈ అనవసర ప్రసంగాలు అవసరం లేదేమో >>>
ReplyDeleteఇక్కడ ప్రవీణ్ చెప్పింది ఒకటే నిజం. నిన్న నోటా అనే సినిమాలో నటించిన విజయ దేవరకొండ మాట్లాడుతూ 2 జీ, బొగ్గు కుంభకోణం వంటివి చూసినపుడు ఆవేశం వచ్చేది అని చెప్పారు. చంద్రబాబు గారు హైదరాబాద్ కి బాగా సేవ చేసారని కూడా చెప్పారు.ఇదే మాట కేటీఆర్ గారు కూడా చాలాసార్లు అన్నారు.ఇపుడు ఎన్నికలు వచ్చాక తెలుగుదేశం పోటీ చేయకూడదనటం ఏం న్యాయం ?
సీ బీ ఐ కి బొగ్గు కుంభకోణం గానీ, 2 జీ కానీ ఈ నాలుగేళ్ళలో గుర్తు రాలేదా ? రాఖీ కా స్వయంవర్ టీవీ లో చూపిస్తే నిజమని నమ్మేసే వెర్రి జనాలున్నంత కాలం రాజకీయాలు ఇలాగే ఉంటాయి. నిజమేదో భ్రమ ఏదో తెలియని వాళ్ళకి "నారాయణా" అన్నా బూతులాగే కనిపిస్తుంది.
సి.బి.ఐ. అనేది అవసరమా, కాదా అనేదే నా సందేహం. ప్రభుత్వ నోటిఫికేషన్ లేకుండా నేర పరిశోధన చేసే అధికారం సి.బి.ఐ.కి లేదు. ఆ అధికారం జిల్లా పోలీసులకీ, రైల్వే పోలీసులకీ మాత్రమే ఉంది. సి.బి.ఐ. అనేది ప్రభుత్వం ఉపయోగించుకుంటున్న తోలు బొమ్మ అనే నా అనుమానం.
ReplyDelete