• భర్తకు ఉదాహరణగా తీసుకుంటే చిన్న పిల్లలకు కూడా ఉంచుతుంటాం కదా?
  • అదే విధంగా భార్య చనిపోతే పురుషునికి మొలతాడు తీసేస్తారు. 
  • వీటిలో శాస్త్రీయంగా ఆలోచిన్చాల్సినది ఎలా?
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. మొలతాడు సంగతి నాకు తెలీదు. ఇహపోతే బొట్టు. ఇది శాస్త్రీయతకు సంబంధించిన విషయం కాదు. ఒక అలంకారానికీ, ఒక సెంటిమెంటుకూ, ఒక భౌతిక ఆదర్శానికీ, దాని బహిరంగ/ సాంఘిక వ్యక్తీకరణకూ సంబంధించినది. బొట్టు ఒక ముఖ్యమైన అలంకారం. భర్తను పోగొట్టుకున్న సాంప్రదాయిక పతివ్రతకి శారీరిక కోరికలు కూడా అతనితోనే వెళ్లిపోతాయి. అనంతరం ఆమె అతని స్మృతుల్లో ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతుంది. కనుక ఆమెకి బొట్టులాంటి అలంకరణలతో అవసరం లేదు. అలంకరించుకోవాలనే కోరిక ఆపోజిట్ సెక్సుని ఆకర్షించాలనే కోరికను, ఇహలోక ఆసక్తుల్నీ సూచిస్తుంది. పూర్వకాలంలో అగ్రకులస్త్రీలు జీవితంలో ఒక్కసారే పెళ్ళిచేసుకునేవారు. కనుక వారు భర్త మరణానంతరం అలంకరణలన్నీ పరిత్యజించేవారు. వాటితో పాటే పసుపు, పారాణి, బొట్టు, నగలు కూడా. అయితే కాలక్రమంలో ఈ సెంటిమెంటూ ఆదర్శాలూ లేనివాళ్లక్కూడా పెద్దలు ఈ అలంకార పరిత్యాగాన్ని తప్పనిసరి చేశారు. ప్చ్, Social pressure. అందరూ ఒకే తాత్త్విక స్థాయిలో ఉండరనీ, ఉండాల్సిన అవసరం లేదనీ, ఎవరి అవసరాలకనుగుణంగా వారు తమ నీతిసూత్రాల్ని తామే ఏర్పరచుకోవాల్సి ఉంటుందనీ పూర్వీకులు గుర్తించలేకపోయారు. వాస్తవానికి మన సమాజంలో వ్యక్తుల పట్ల ఇప్పటికీ అదే నిరంకుశ ధోరణి. కాకపోతే లౌకిక విషయాల్లో!

    ReplyDelete
  2. హిందూ మతంలో భర్త చనిపోయిన స్త్రీలకి బొట్టూ, గాజులూ తొలిగించే ఆచారం మొదట్లో లేదు. కౌటిల్యుడు, పరాశరుడు వ్రాసిన స్మృతుల్లో భర్త చనిపోయిన స్త్రీ తన మరిదిని పెళ్ళి చేసుకోవచ్చనీ, మరిది లేకపోతే వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకోవచ్చనీ వ్రాసి ఉంది. ఆ రెండు స్మృతులూ బ్రాహ్మి లిపి పుట్టిన కాలంలో (2300 సంవత్సరాల క్రితం) వ్రాయబడ్డాయనుకుంటే అప్పట్లో భర్త చనిపోయిన స్త్రీ రెండో పెళ్ళి చేసుకునే ఆచారం ఉండేది అనుకోవాలి.

    ReplyDelete
    Replies
    1. @ ماو تسي تونغ ... నాకు తెలిసి కౌటిల్యుడు స్మృతులేమీ రాయలేదు. అర్థశాస్త్రం ఒకటే రాశాడు. అందులో తన కాలపు పునర్వివాహ ఆచారాలనే రిపీట్ చేశాడు. అయితే "అది అగ్రకులస్త్రీల గురించి కూడా" అనడానికి ఆధారాలు లేవు. పరాశరస్మృతి నేను చదివాను. అక్కడ అది పెళ్లి గుఱించి చెప్పిన మాట కాదు. పరాశరుడు నియోగం గురించి చెప్పాడు. నియోగమంటే, భర్త చనిపోతే అతనికి సద్గతులు కలిగించడం కోసం సంతానం కలిగే వరకూ పెద్దల అనుమతితో మరిదితో గడపవచ్చునని రాశాడు. కానీ నియోగ పద్ధతి కలియుగానికి నిషిద్ధమని పెద్దలన్నారు. ఎందుకంటే కలియుగంలో దత్తపుత్రుడూ, ఔరసుడూ (కన్నకొడుకూ) ఈ ఇద్దరే వారసులుగా పరిగణించబడతారట,

      ఇహపోతే ఒక ఆచారం మొదట్నుంచీ ఉందా ? లేదా ? అనే విచికిత్స. పెళ్లితో సహా అన్ని ఆచారాలూ పరిణామక్రమంలో ఏర్పడ్డవే. ఏదీ మొదట్నుంచీ ఉండదు. ఉన్నది అనంతకాలం పాటు కొనసాగదు.

      Delete
    2. భర్త చనిపోయినా, అతను పిచ్చివాడైనా, అతను దేశం వదిలి వెళ్ళిపోయినా స్త్రీ రెండో పెళ్ళి చేసుకోవచ్చు అని పరాశరుడు వ్రాసాడు.

      Delete
    3. కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, సత్‌యుగం అనేవి లేవు. భూమి మీద బానిస-యజమాని వ్యవస్థ 12,000 సంవత్సరాల క్రితం పుట్టింది. రామాయణం, మహాభారతంలలో చూపించినది చతుర్వర్ణ వ్యవస్థ. ఇందియాలో మౌర్యుల కాలం వరకు బానిస-యజమాని వ్యవస్థ కొనసాగింది. బానిస-యజమాని వ్యవస్థ అంతరించిన తరువాత వర్ణ వ్యవస్థ పుట్టిందనుకుంటే అది మౌర్యుల కాలంలో పుట్టిందనుకోవాలి. రామాయణం, మహాభారతం అనేవి మౌర్యుల కాలంలోనే వ్రాయబడి ఉంటాయి. నాలుగు యుగాలు అనేవి నిజంగా లేవు కనుక ఆ కథని ఆధారం చేసుకోకుండా వాస్తవికత ఆధారంగా ఆలోచించాలి.

      Delete
    4. భౌతిక ధర్మానికి కాలంతో సంబంధం ఉండదు. ఏ కాలంలోనైనా పెళ్ళి చేసుకునేది సుఖంగా కాపురం చెయ్యడానికే. భర్త చనిపోయిన తరువాత రెండో పెళ్ళి చేసుకున్నవాళ్ళైనా, భర్త దేశం విడిచిపోవడం వల్ల రెండో పెళ్ళి చేసుకున్నవాళ్ళైనా కాలానికి అతీతంగా సుఖంగా కాపురం చేసుకోగలరు.

      Delete
    5. This comment has been removed by the author.

      Delete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. సామాజికంగా ప్రగతి నిరోధకమైన ఆచారాలని పాటించడాన్ని ఒక వ్యక్తిగత విషయంగా కొట్టి పారెయ్యలేము.

      Delete
    2. మనుషులు ఎవరి కోసం వారు బతుకుతారు. సమాజం కోసం ఎవరూ బతకరు. దాన్ని సంప్రదించి ఎవరూ ఏమీ చెయ్యరు. దాని ప్రగతీ, భవిష్యత్తూ ఆలోచిస్తూ ఎవరూ నిద్రలు మానుకోరు. నాకొక పని నచ్చిందనుకో. నేనది చేసేస్తాను. అదే పని వందమందికి నచ్చి వాళ్ళది చేస్తే నువ్వు దానికి ఆచారమని పేరు పెడతావు. అయితే వాళ్ళూ నాలాగే అది ఆచారమనుకుని చేయకపోవచ్చు. వాళ్ళ వ్యక్తిగత కెపాసిటీలో వాళ్ళకా జీవనవిధానం నచ్చి వాళ్ళు దాన్ని అవలంబిస్తూండొచ్చు. ఇందులో నీకూ నాకూ అభిప్రాయాలు ఉండాల్సిన అవసరమేమిటి. మన అభిప్రాయాలు ఎవరిక్కావాలి.

      Delete
    3. బొట్టూ, గాజులూ విషయంలో అర్థం లేని నియమాలు పెట్టేవాళ్ళని ప్రగతి నిరోధకులు అనకపోతే ఏమనాలి? వ్యక్తి స్వేచ్ఛ పేరు చెప్పుకునే పెట్టుబడిదారీ సమాజంలో బతుకుతూ "భర్త ఉన్న స్త్రీ ఇవి పెట్టుకోవాలి", "భర్త లేని స్త్రీ ఇవి పెట్టుకోకూడదు" అని నియమాలు పెట్టడం అవసరమా?

      Delete
    4. నీ దృష్టిలో ప్రగతి అంటే ఎమిటి ప్రవీణ్?

      Delete
    5. పెళ్ళికాని స్త్రీ బొట్టు పెట్టుకుంటున్నప్పుడు భర్త చనిపోయిన స్త్రీ బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు? బోడి గుండికి మోకాలితో ముడి పెట్టినట్టు బొట్టు పెట్టుకోవడానికి భర్త ఉండడంతో ముడి పెట్టడం అవసరమా? ప్రగతి అంటే ముందడుగు. కారాణాలు అడక్కుండా పెద్దలు ఏదో చెప్పారని గుడ్దిగా నమ్మేస్తే అది వెనకడుగు అవుతుంది.

      Delete
    6. ప్రవీణూ ! నీ ప్రశ్నకి సమాధానం నేనాల్రెడీ చెప్పాను. "ఆ సెంటిమెంట్ ఉన్నవాళ్ళకి ఆ ఆచారం" అని చెప్పాను. ఆ సెంటిమెంటు లేనివాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు. ఉంటారు కూడా. ఇందులో మనకి హేతువాదం దేనికి?

      Delete
    7. మూఢ నమ్మకాలకి సెంతిమెంత్‌లని పేరు పెట్టినా, ఇంకో పేరు పెట్టినా తేడా రాదు శ్రీకాంత్.

      Delete
    8. మూఢనమ్మకాలూ, శాస్త్రీయ నమ్మకాలూ అని రెండురకాలు ఉండవు. నమ్మకాలన్నీ మూఢంగా నమ్మేవే. అవి లౌకిక విషయాల్లో అయినా! ఈ బ్లాగులో వేసిన ప్రశ్న కన్నా ముందు వేసి ఉండాల్సిన ప్రశ్నలు రెండున్నాయి. అవేంటంటే-

      1. ఒకటి నమ్మకమైనా, మూఢనమ్మకమైనా, సెంటిమెంట్ అయినా మరొకటైనా దాన్ని మనసులో ఉంచుకోవడానికీ, ఇతరులకు హాని లేనంతవరకూ దానికనుగుణంగా ప్రవర్తించడానికీ మనుషులకు సహజమైన వ్యక్తిగత/ మానవీయ హక్కు ఉందా? లేదా?

      2. ప్రతివాళ్లూ తమ ప్రవర్తనకి గల హేతువాద మూలాల్ని ఇతరులకి ప్రతిసారీ వివరించి తీరాల్సిన/ నిరూపించి చూపాల్సిన అవసరం ఉందా? లేదా? అనేది.

      ఈ ప్రశ్నలు ఈ చర్చ పరిధిలోకి రాకపోతే క్షమించండి.

      Delete
    9. వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ అభివృద్ధి నిరోధకంగా ఉన్న నియమాలని వ్యతిరేకించాల్సిందే. మా నమ్మకం వల్ల ఇతరులకి హాని లేదు అని చెప్పి దాన్ని సమర్థించుకోవడానికి అవ్వదు.

      Delete
    10. @Marripoodi MahojasAugust 4, 2 014 at 2:40 PMగారు, ఇప్పుడు మీరు చెప్పినవి ప్రశ్నలుగా కంటే ఈ ప్రశ్నకు సమాధానంగా చెపితే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఇతరులకు హాని కలిగించని లేదా తనకు హాని కలిగించని ఓ నమ్మకం వ్యక్తి కలిగి ఉండడం ఆ వ్యక్తి హక్కుగా ఉండాలి. దీనిని కాదనడానికి ఎవరికీ హక్కు లేదు. ఏ వ్యక్తి తన ప్రవర్తనకు హేతువాద మూలాల్ని ఇతరులకు చూపాల్సిన అవసరం లేదు. కానీ ఓ వ్యక్తిని కించపరచకుండా సమాజంలో మూఢనమ్మకాలపై జనరలైజ్ చేసి చర్చించడం తప్పు కానేరదు.

      ఈ ప్రశ్న ఉంచడానికి కారణం తాము మాత్రమే కమ్యూనిస్టులమనుకునే అతివాదులు కొందరు సెకండరీ విషయాలపట్ల మితిమీరిన రాద్ధాంతం చేయడమే. ఉదాహరణకు బృందాకరత్ పెద్ద బొట్టు ( దానికి పోలేరమ్మ బొట్టు అని కూడా ఓ వ్యక్తి పేరు పెట్టాడు ) పెట్టుకోవడాన్ని విమర్శించాడు. నేను దానిని అలంకరణగా తీసుకోవాలంటే వినలేదు. భర్త చనిపోతే బొట్టు తీసేయాల్నా? ఉంచాల్నా? అది వ్యక్తిగత విషయం. ఓ ఉద్యమకారిణి మాత్రం బొట్టు తీసేయాలని అనుకుంటుందని నేను అనుకోను. అయినా ఇలాంటి వ్యక్తిగత విషయాలను అతిగా రాధాంతం చేసేవారున్నప్పుడు చర్చలూ ప్రశ్నలూ ఉంటాయి. ఇంకో ఉదాహరణ చెప్తాను దివంగత సీ.పీ.ఎం కార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్ సిక్కుల ఆచారాం ప్రకారమే గెడ్డం ఉంచడంపై చర్చ జరిగినప్పుడు ఆయన సమాధానం ఇది : నేను పెరిగిన వాతావరణంలో అలవాటయిన అంశమిది. అసలు పుట్టుకతో వచ్చే గడ్డాన్ని మీరెందుకు తీస్తున్నారని అడిగితే ఏమి చెప్తారు. జనం లో ఉండేవారు ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారలను గౌరవిస్తారు. ఆచరిస్తారు. అవి కాలక్రమంలో సమాజ చైతన్యం పెరుగుతున్నకొద్దీ ఒకే రకమైన ఇంకా అభివృద్ధి కరమైన అలవాట్లుగా రూపాంతరం చెందుతాయి. ఈ లోగా అలనక్రణలను మరీ అతిగా రాద్ధాంతం చేయకూడదనేది నా అభిప్రాయం. ఇక భర్తకు చిహ్నంగా బొట్టూ కాటుకలు లేదా ఇతర ఆచారాలు బలవంతంగా ఉండకూడదు. వ్యక్తిగతంగా ఎవరి ఇష్టం వారిది. దానిపై జనర చర్చ చేస్తే అది వేరు. కానీ కావాలని వ్యక్తిగతంగా కామెంట్ చేయడం మూర్ఖత్వమవుతుందని నా అభిప్రాయం.

      Delete
    11. @ కొండలరావుగారు...

      "....కానీ ఓ వ్యక్తిని కించపరచకుండా సమాజంలో మూఢనమ్మకాలపై జనరలైజ్ చేసి చర్చించడం తప్పు కానేరదు..."

      మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నానండీ. మూఢవిశ్వాసాలకు నేనూ వ్యతిరేకినే. నేను కూడా వాటిని సమర్థించను. అయితే నా తంటా కేవలం వాటిని అవలంబించేవాళ్ళతోనే కాదు. వాటిని వ్యతిరేకిస్తున్నామని చెబుతూ యావత్తు సైన్సుకీ తామే సోల్ ట్రస్టీలమని ఫీలైపోయే ఒకనానొక సైద్ధాంతిక వర్గంతో కూడా! మన సమాజంలో మూఢనమ్మకాలు social values గా మారి జనాన్ని వ్యక్తిగతంగా పీడిస్తున్న మాట వాస్తవం. వ్యక్తిస్వేచ్ఛని హరించే అలాంటి పాత social values జాబితాలో నవీనంగా సైన్సూ, హేతువాదమూ కూడా చేరడం నాకు అభిమతం కాదు. కనుకనే "మూఢమైనా, రూఢమైనా ఎవరి వ్యక్తిగత ఎంపిక వారిది. అది హేతువాదంలో ఇమిడినా ఇమిడకపోయినా వదిలెయ్య" మంటున్నాను. After all, unreason has as much a role in human life as reason.

      Delete
    12. మూఢనమ్మకాలని నమ్మేవాళ్ళు పైకి అవి తమ వ్యక్తిగత విశ్వాసాలు అని చెప్పుకుంటారు. కానీ వాస్తవికంగా వాళ్ళు తమ నమ్మకాలనే ఇతరుల మీదకి రుద్దుతారు, హేతువాదులు తమ నమ్మకాలని కించపరుస్తున్నారని ఏడుస్తారు. ఉద్యోగం చేసే స్త్రీ తెల్లచీర కట్టుకుని ఆఫీస్‌కి వెళ్ళడం సాధ్యం కాదు. ఈ విషయం తెలిసి కూడా ఇద్దరు స్త్రీలు మా అమ్మకి తెల్లచీర ఇచ్చి అవమానించారు. వాళ్ళ స్వభావం అర్థమైన మా అమ్మగారు అవి తీసుకోలేదు కానీ అలాంటివాళ్ళని చూస్తే మెడపట్టుకుని ఇంటి నుంచి బయటకి గెంటెయ్యాలనిపించేంత కోపం రాదా? వాళ్ళ అమ్మలక్కలందరూ భర్త చనిపోయిన తరువాత తెల్లచీర కట్టుకుని మూలన కూర్చున్నారని మా అమ్మకి కూడా అలాగే కూర్చోమని సలహా ఇస్తే, ఒక కొడుకుగా నాకు ఒళ్ళు మండదా? మూఢనమ్మకాలని నమ్మేవాళ్ళు తమ నమ్మకాలని కేవలం వ్యక్తిగతమైనవిగా పరిగణించరు. తాము బాగుపడలేదు కాబట్టి వేరేవాళ్ళు కూడా బాగుపడకూడదు అనుకుంటారు. అలాంటి నమ్మకాలు ఉండకూడదని చెపితే మాత్రం అవి తమ వ్యక్తిగతం అని చెప్పి తప్పించుకుంటారు.

      Delete
    13. సమాజానికి అతీతంగా వ్యక్తుల హక్కులు ఉండవు. ఉండవంటే ఎలాంటి భావాలనైనా వ్యక్తి సమాజానికి అతీతంగా నేర్చుకోలేడు.ఏ అడవిలోనో తపస్సు చేసుకొనె బాబాలు కూడా సమాజానికి అతీతంగా ఉండరు. ఎందుకంటె వాళ్లు అడవి లో పుట్టి మనుషులుగా పెరగలేరు. ఏ జంతువులుగానో తప్ప. ఈ తపస్సు చేసుకొనే బాబాలుకూడా సమాజం నుండి ఏవో భావాలు నేర్చుకొని ఒక స్తాయి తరువాతే ఆ పని చేస్తారు. కట్టు బొట్టు అలంకరణలో భాగం. అంటే ఈ సంస్కృతిలో భాగం.అవి ధరించటంలో ఏతప్పు లేదు. అయితే ఈ సంస్కృతి మానవ మనుగడకు అడ్డంకిగా, పరిణమించినపుడు, ఇ సమాజిక ప్రగతికి నిరోదకంగా పరిణమించినపుడు మాత్రమే అందులొ వైరుధ్యాలు ఏర్పడతాయి. వైరుధ్యాల ఘర్షణ ఎర్పడుతుంది. అపుడు మాత్రమే వాటిని వ్యతిరేకించ వలసి వస్తుంది. మనం ధరించిన దుస్తులు మనకు అసౌర్యకంగా ఉంటే, చర్మానికి ఏ దురదో కలిగిస్తుంటే, ఆ దుస్తులను మార్చుకోక తప్పదు. లేక పోతే శరీరానికి మరీ హాని కలిగిస్తాయి. కట్టు బొట్టును కొన్ని ఆచారారాలకు ఉపయోగించినపుడు మాత్రమే వైరుధ్యం వస్తుంది.

      Delete
    14. This comment has been removed by the author.

      Delete
    15. తమ కుటుంబానికి చెందిన స్త్రీకి భర్త చనిపోయిన తరువాత పసుపుకుంకుమలు తొలిగించేవాళ్ళు వేరే కుటుంబాలకి చెందిన స్త్రీలు భర్త చనిపోయిన తరువాత పసుపుకుంకుమలు పెట్టుకుంటే చూడలేరు. వాళ్ళకి రెండే ఆప్షన్స్ ఉంటాయి. 1) భర్త చనిపోయిన తరువాత పసుపుకుంకుమలు పెట్టుకున్న స్త్రీలని చూసి ఏడవడం. 2) మార్పుని అంగీకరించి తమ కుటుంబాలకి చెందిన స్త్రీలకి భర్త చనిపోయిన తరువాత పసుపుకుంకుమలు పెట్టుకోవడానికి అనుమతించడం.

      నమ్మకం అనేది కుటుంబానికి ఒకలాగ, సమాజానికి ఒకలాగ వర్తిస్తుందని ఎవరూ అనుకోరు. అందుకే అభివృద్ధి నిరోధక నమ్మకాలని నమ్మేవాళ్ళు అలాంటి నమ్మకాలు లేనివాళ్ళని చూసి అసూయపడతారు.

      Delete
    16. సమాజం కోసం ఎవరూ బతకరు. తమ కోసమే తాము బతుకుతారు. తమ అభిప్రాయాల ప్రకారం తాము బతుకుతారు. అంతే తప్ప ప్రతిదాని మీదా సమాజం అభిప్రాయమేంటో కనుక్కుని బతకరు. సమాజాన్ని మనిషి ఉపయోగించుకుంటాడు తప్ప అతనికి తనకంటే సమాజం పెద్ద ముఖ్యమేమీ కాదు. ఈ సంగతి అర్థం చేసుకుంటే వ్యక్తిగత విశ్వాసాల్ని ఎలా చూడాలో కూడా అర్థమవుతుంది.

      Delete
    17. సమాజం కోసం ఎవరూ బతకరనుకున్నప్పుడు సమాజంలో స్త్రీలు ఇలా ఉండాలని రూల్స్ పెట్టడం ఎందుకు?

      ఆడది కూడా తన భర్త కోసం బతకదు. ఆమె భర్త చనిపోయిన తరువాత రెండో పెళ్ళి చేసుకున్నా ఎవరికీ అభ్యంతరం చెప్పే హక్కు లేదు.

      Delete
    18. భర్త చనిపోతే తెల్ల చీర ధరించాలనే రూల్ ఎక్కడుంది ప్రవీణ్ గారు. అది రూల్ కాదు. ఒక మతానికి సంబంధించిన విశ్వాసం లేదా ఆచారం. అలాగే మీ అమ్మగారిని అలా అన్నప్పుడు మీకు ఒళ్ళు మండడమెంత నిజమో ఫలానా వ్యాక్తి అలా బొట్టు పెట్టుకుందంటూ నువ్వు మాట్లాడినా అవతలివారికీ అంతే ఒళ్ళు మండుతుంది. మనిషి సమాజం కోసం బ్రతకడు తను బ్రతకడం కోసం సమాజాన్ని ఉపయోగించుకుంటాడు. అందులో భాగంగానే సమాజంలోని ఇతరులు బ్రతకడానికీ తను కొంతమేరకు ఉపయోగపడతాడు. ఇది వ్యక్తిగతం. మొత్తం సమాజంలోని అనేక అంశాలు అందరినీ సమానంగా ప్రభావితం చేయకపోవచ్చు.

      Delete
    19. ఉద్యోగం చేసే స్త్రీ తెల్ల చీర కట్టుకుని ఆఫీస్‌కి వెళ్ళడం సాధ్యం కాదని తెలియని పల్లెటూరివాళ్ళు ఉంటారనుకోను. వాళ్ళ అమ్మలక్కలందరూ భర్త చనిపోయిన తరువాత తెల్ల చీర కట్టుకుని మూలన కూర్చున్నారని వాళ్ళు మా అమ్మకి కూడా అలాంటి సలహా ఇస్తే ఒక కొడుకుగా నేను ఎలా ఊరుకుంటాను?

      బృందా కారత్ నాస్తికురాలు కనుక ఆమె పోలేరమ్మ బొట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టే స్త్రీని పోలేరమ్మ బొట్లు పెట్టుకోవద్దని చెపితే అది విచిత్రం అవుతుంది.

      Delete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by a blog administrator.

      Delete
  5. మర్రి పూడి మహాజషు గారు,
    మీరన్న ది నిజ మైతే మీరు రాసిన ఈ అక్షరాలు ఎక్కదనుండి నెర్చు కున్నారు? తల్లి కడుపు లో నుండే నేర్చుకొచ్చారా? అలా అయితే గదా మీరు సమాజం నుండివ్యక్తిగా వేరు పడెది? మీరు ఈ అక్షరాలాను బడి నుండి నేర్చుకుంటే బడి ఎవరి దండి? సమాజం ఏర్పరిచినది కాదూ? బడిలో టీచర్‌ ఎక్కడ నుండి వచ్చాడు? ఆ టిచర్‌ కు చదువు చెప్పినా గురువు ఎక్కడ నుండి వచ్చాడు? ఇంకా అలా అలా వెనక్కు పోతే ఆ గురువులకు గురువులు ఎక్క డ నుండి వచ్చారు? ఆ అక్షరాలు పుట్టించిన గురువులు వీళ్లంతా ఎవరు? వాళొలంతా సమాజం కాదా?

    ReplyDelete
    Replies
    1. వెనకబాటు నమ్మకాలకి వ్యక్తివాదం రంగు పులమడం ఇందియాలో మాత్రమే చూసాను. ఆ నమ్మకాలు మన తాతలు నమ్మడం వల్ల వచ్చాయని నేరుగా చెప్పొచ్చు కానీ అలా చెప్పకుండా దానికి వ్యక్తివాదం రంగు పులిమితే ఏమి అర్థమవుతుంది? వ్యక్తిగత చైతన్యం ఉన్నవాడు వెనుకబాటు నమ్మకాలని నమ్మడని ఒక మార్క్సిస్త్‌గా నేను ఖచ్చితంగానే చెప్పగలను. స్త్రీ తన కోసమే తాను బతుకుతుంది కానీ భర్త కోసం బతకదు. ఈ నిజం ఒప్పుకుంటే చనిపోయిన భర్త కోసం పసుపుకుంకుమలు తొలిగించాల్సిన అవసరం లేదనే అర్థమవుతుంది.

      Delete
  6. సమాజంలో కొన్ని ఈవెంట్స్ జరగడానికి సూచికగా కొన్ని ఆచారాలు మొదలవుతాయి. ఇవి దాదాపు అన్ని మతాల్లోనూ, దేశాల్లోనూ ఏదో ఒక రూపంలో చూస్తుంటాము. చివరికి కమ్యూనిస్టు చైనా కూడా వీటికి అతీతం కాదు. అక్కడ జరిగే కొన్ని పండుగలు ఉత్సవాలు మనం టివిలో చూస్తూనే వుంటాం.

    ఒలింపిక్ జ్యోతిని ప్రజ్వలించడం ద్వారా ఒలింపిక్స్ ని ప్రారంభించడం గ్రీకులనుండి అనావాయితీగా వస్తున్న ఒక ఆచారం. బీజింగ్ ఒలింపిక్స్ లో కూడా అదే పాటించారు. అలాగే ఎందుకు చేయాలి? మేం ఇంకోవిధంగా చేయొచ్చుకదా అని చైనా అనుకోలేదు. ఎవరికీ ఇబ్బంది లేనప్పుడు సదరు ఆచారాన్ని పాటిస్తే తప్పుకాదు అనుకుంది.

    చాలా మంది హేతువాదులు కూడా అలాగే పాటిస్తుంటారు. ఉదా: బృందా కారత్, హరికిషన్ సింగ్ సుర్జిత్.

    అయితే వ్యక్తిగత ఇష్టాయిష్టాల ముసుగులో ప్రారంభమైన ఈ ఆచారాలు సమాజం యొక్క పూర్తి ఆమోదం పొందిన తర్వాత మరో రూపం సంతరించు కుంటాయి. అప్పుడు వాటిని పాటించడం పాటించక పోవడం అనేది స్వంత ఇష్టాయిష్టాలపై ఆధారపడి కాక, సమాజం వత్తిడి వల్ల జరుగుతుంటుంది.

    ఉదాహరణకు ఒక వ్యక్తి చనిపోయాడనుకోండి. పదో రోజున సామాజిక వర్గం మొత్తం చేరి అందరి ముందూ ఆ వ్యక్తి భార్య బొట్టూ తదితర అలంకారాలు తొలగించే కార్యక్రమం నిర్వహిస్తారు. ఒకోసారి ఆ కార్యక్రమం రక్త సంబంధీకులకు నచ్చక పోయినా ప్రయోజనం వుండదు. సమాజం వత్తిడిని కుటుంబం తట్టుకొని నిలబడ గలగడం కష్టం.

    సరిగ్గా అటువంటి సందర్భాలలోనే సెక్యులర్ ప్రభుత్వం బాధ్యత వహించ వలసి వుంటుంది. కాట్టాల ద్వారా అటువంటి కార్యక్రమాలు దురాచారాలుగా ప్రకటించి శిక్షలు అమలు చేయవలసి వుంటుంది. వరకట్న దురాచారం, సతీ సహగమనం అలాంటివే.

    ReplyDelete
    Replies
    1. ఉద్యోగం చేసే స్త్రీ తెల్ల చీర కట్టుకుని ఆఫీస్‌కి వెళ్ళడం సాధ్యం కాదు. ఉద్యోగం చేసే స్త్రీని ఆమె కుటుంబ సభ్యులు గానీ, బంధువులు గానీ ఉద్యోగం మానేసి తెల్ల చీర కట్టుకొని కూర్చోమమని బలవంతం చేస్తే ఆమె పోలీస్ స్తేషన్‌ని వెళ్ళొచ్చు.

      మూఢ నమ్మకాలనేవి సమాజం నుంచి పుడతాయి కానీ శూన్యం నుంచి పుట్టవు. సమాజం కోసం ఎవరూ బతకరు అనుకున్నప్పుడు సమాజం నిర్దేశించిన ఆచారాలని ఎందుకు పాటించాలి అనే సందేహం ఎందుకు రాదు?

      Delete
    2. "ఉద్యోగం చేసుకునే స్త్రీ తెల్లచీరకట్టుకుని ఆఫీసుకి వెళ్లడం సాధ్యం కాదు" - ఎందుకు కాదనుకుంటున్నారు మీరు? ఆఫీసుకు తెల్లచీర కట్టుకుని రావద్దని రూల్ ఉందా?

      తెల్ల చీరకట్టుకోమని బలవంతం చేస్తే పోలీసు స్టేషన్‌కు వెళ్ళవచ్చు. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడంత సీన్ లేదు. ఈ సీన్ రివర్స్ కూడా అవుతుంది. అయితే పోలీసు జోక్యంతో కాదు. పోలీసులవల్ల నేరాలే తగ్గడం లేదు. సామాజిక చైతన్యం వారివల్ల రాదు. సంఘ్తటిత పోరాటాలు - చైతన్యం పెంచే డిబేట్ లు - ఈతర కార్యక్రమాలు - ఆర్ధిక అవసరాలు .... ఇలాంటి సామాజిక అంశాలే ఈ విషయంలో వ్యక్తి చైతన్యం పెంచేందుకు దోహదపడతాయి. ప్రభుత్వాల వల్ల కూడా ఇది పొర్తిగా అయితే సాధ్యం కాదు. నిజానికి కొన్ని ప్రోత్సహాకాలు ప్రభుత్వాలు చేసేటప్పుడు కొంత అభివృద్ధి ఇలాంటివాటిలో కలుగుతుంది.

      Delete
    3. ఎంత శ్రీవైష్ణవుడైనా పంచె కట్టుకుని, పిలక వేసుకుని ఆఫీస్‌కి వెళ్ళడు. పంచె కట్టుకుని ఆఫీస్‌కి వెళ్ళాకూడదని రూల్ ఉందా, లేదా అని కాదు. ఒక వ్యక్తిని పంచె కట్టుకోమని బలవంతం చేసే అధికారం ఎవరికీ లేదు, అలాగే ఒక స్త్రీని తెల్ల చీర కట్టుకోమని బలవంతం చేసే అధికారం ఎవరికీ లేదు. పోలీస్ స్తేషన్‌లూ, కోర్త్‌లూ ప్రాథమిక హక్కుల ప్రకారమే పని చేస్తాయి కానీ నమ్మకాల ప్రకారం పని చెయ్యవు కనుక ఒక వైష్ణవుణ్ణి పంచె కట్టుకోమని అతని కులంవాళ్ళు బలవంతం చేసినా, ఒక భర్త చనిపోయిన స్త్రీని తెల్ల చీర కట్టుకోమని ఆమె కుటుంబ సభ్యులు బలవంతం చేసినా నిర్భయంగా పోలీస్ స్తేషన్‌కి వెళ్ళొచ్చు.



      Delete
    4. ఇప్పుడు నాలాంటి వాళ్లకి అర్ధమయ్యేలా కామెంట్ వ్రాశారు ప్రవీణ్ గారు. ధన్యవాదములు.

      Delete
    5. ( అధిక ప్రసంగం: మా మాతామహులు చెప్పిన ఒక ముచ్చట, మా అమ్మగారి నోట విన్నాను. బహుశః ఒక 70 లేదా మరికొన్ని సంవత్సరాల క్రిందటిది కావచ్చును. అప్పట్లో సాతాని జియ్యరులు ధనుర్మాసంలో రోజూ ఉదయం ఇంటింటికీ భిక్షాటన చేస్తూ వచ్చేవారు. ఒకరోజు అలాగే వచ్చిన ఒక జియ్యరుగారిని చూసి తాతగారు అమితంగా ఆశ్చర్యపోయారట. పోరా మరి? ఆ వేషంలో దర్శనం ఇచ్చింది తన పై అఫీసరైతే! ఇదేమిటి స్వామీ అంటే, అది ఉద్యోగవేషం, ఇది కులధార్మికవేషం అన్నాడట ఆ ఆఫీసరు/జియ్యరు గారు. )

      Delete
    6. మనిషి ప్రవర్తన అనేది అతని standard of livingని బట్టి ఉంటుంది. డబ్బున్నవాడు తోపుడు బండి దగ్గర భేల్‌పురీ తినడు. అలాగే ఒక ఉద్యోగం చేసే స్త్రీ తెల్ల చీర కట్టుకుని ఆఫీస్‌కి వెళ్ళదు.

      బొర్రా గుహలు రైల్వే స్తేషన్‌లో హిజబ్ వేసుకున్న కొందరు ముస్లిం స్త్రీలని చూసాను. వాళ్ళని చూసి ఒక యువకుడు ఓ సందేహం అడిగాడు "ఆఫీస్‌లో ముసుగులు వేసుకోవడానికి అవ్వదు కదా, మరి వాళ్ళు ఉద్యోగాలు ఎలా చేస్తారు?" అని. అమెరికాలో ఆంధ్రా సాఫ్త్‌వేర్ ఇంజినీర్‌లు అయ్యప్పస్వామి భక్తుల వేషం వేసుకోవాలంటే తమ బాస్‌ల దయ మీద ఆధారపడాలని విన్నాను. అమెరికా వరకు ఎందుకు, వైజాగ్‌లోనే ప్రైవేత్ ఉద్యోగి లేత నీలం రంగు చొక్కా వేసుకోకపోతే అతన్ని ఆఫీస్‌కి రానివ్వరు.

      Delete
  7. పాత ఆచారాల మీద, ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించినవాటి మీద విరుచుకుపడడం చాలా ఓల్డ్ స్కూల్. ఒకప్పుడు దాన్నిగొప్ప సంఘసంస్కరణగా, అభ్యుదయవాదంగా, భావవిప్లవంగా భావించేవారు. కానీ ఇప్పుడు... వాటి మీద విరుచుకు పడడమంటే చచ్చిన పాముని చంపడం కిందే లెక్క. ప్రధానాంశమేంటంటే ఆ ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ వాటికి ఒక శతాబ్దం కింద ఉన్న సామాజిక మద్దతూ, ఆమోదం ఇప్పుడు లేవు. ప్రవీణ్ నినసిస్తున్న శ్రీకాకుళంలో పరిస్థితేంటో నాకు తెలీదు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు పెద్దనగరాల్లో భర్తపోయినవాళ్ళు అన్నీ నిక్షేపంగా ధరించే తిరుగుతూ కనపడుతున్నారు. అలాంటివాళ్ళల్లో బ్రాహ్మణస్త్రీలు కూడా చాలా పెద్దయెత్తున కనిపిస్తున్నారు. కనుక అవి ఎక్కడైనా కొనసాగితే ఆయా వ్యక్తుల వ్యక్తిగత అభీష్టాల మేరకు కొనసాగుతున్నాయి తప్ప సామాజిక ఆచారాలుగా, తప్పనిసరి తద్దినాలుగా మాత్రం కొనసాగట్లేదని అర్థం చేసుకోవాలి. ఆ దృష్టితోనే నేను, వాటిని అవలంబిస్తున్నవాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకి అడ్డురావద్దని కోరాను.

    ఇహపోతే ఏనాడో చనిపోయిన గతం మీద ఎవరైనా విరుచుకు పడొచ్చు. జీవద్ వర్తమానం మీద విరుచుకుపడడమే చాలా కష్టమైన విషయం. అలా చెయ్యాలంటే చాలా రకాలుగా బలైపోవడానికి సిద్ధపడాల్సి ఉంటుంది. ఒకప్పటి సంస్కర్తలు కూడా తమ వర్తమానం మీద విరుచుకుపడ్డారు కనుకే వాళ్లిప్పుడు మనకు ఆరాధ్యులయ్యారు. మన వర్తమానంలో కూడా మన సమాజంలో అన్నీ లోపాలే. అయితే అవి పూర్వంలా ఆడవాళ్ళ జీవితాలకి సంబంధించిన లోపాలు కావు. అందరి జీవితాలకీ సంబంధించిన లోపాలు. అయితే వీటి మీద విరుచుకుపడేవాళ్లెవరూ మనకి కనిపించరు. కారణం- ఒకప్పటి లోపాలు మతానికీ, విశ్వాసాలకీ సంబంధించినవి కాగా ఇప్పటి లోపాల మూలాలు మన చట్టాల్లో ఉన్నాయి. వాటిని చేసిన పార్టీల్లో ఉన్నాయి. వాటికి భజన చేసే ప్రజాసంఘాల్లో ఉన్నాయి. కాబట్టి వీటి గురించి మాట్లాడితే మర్డర్లయిపోతాయి. అధమపక్షం కేసులూ, జైళ్లూను! ఆ కాలపు సంస్కర్తల పోరాటం ఏ విధమైన రాజకీయ పలుకుబడీ లేని పేద నిరాడంబర మతగురువుల మీద. కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు.

    ReplyDelete
    Replies
    1. పల్లెటూరిలో అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగం చేసే స్త్రీ కూడా భర్త చనిపోయిన తరువాత కుంకుమ, గాజులు పెట్టుకుంటుంది. విధవ వేషంలో పంచాయితీ ఆఫీస్‌కి వెళ్ళినా బాగుండదు. ఇక పెద్ద నగరాలలోని MNC కార్యాలయాలలోకి ఆ వేషంలో ఎవరు వెళ్తారు? తాము బాగుపడలేదు కాబట్టి వేరేవాళ్ళు బాగుపడితే తాము చూడలేము అనుకునేవాళ్ళు ప్రతి చోట ఉంటారు. అమెరికాలో స్థిరపడిన NRIలలో కూడా కొందరు హిందూ స్త్రీ భర్త చనిపోయిన తరువాత బొట్టు పెట్టుకుంటే చూడలేరు. అలాంటివాళ్ళ భావజాలాన్ని మార్చలేము. వాళ్ళు మనకి సలహాలిస్తే "మీ సలహాలు మాకు అక్కరలేదు" అని తిట్టడం ఒక్కటే మిగిలిన ఆప్షన్.

      Delete
    2. You see. In our society, the very idea of announcing themselves as "the ones without any male escort" frightens women to death. So, no woman dares not disclose that fact to strangers. So, more than an urge to be progressive, they prefer to appear like married so that they won't be exposed to the potential risks of unsolicited male attention. Therefore, they keep the outward trappings of marriage even after their husbands' demise.

      There is a background to this phenomenon. The psychological problem with the Indian males is - that, even as they pretend to be loving women, they strongly refuse to respect their free will at every step of their life. Here, being able to control a few women around is considered as the chief token of manhood. So, in India, men are mostly feared but NEVER loved by women.

      Delete
    3. This comment has been removed by the author.

      Delete

  8. బొట్టూ కాటుక
    పసుపూ పారాణి
    ఇవన్నీ సినిమా పేర్లాండి :)

    భలేవారే! యెవరండీ ఈ కాలం లో పెట్టుకునే జిలేబులు ?

    పెట్టుకుంటే గింటే అలంకరణ మాత్రమే గావున
    ఆలమ్, కారం వదలాల్సిన అవసరమే లేదు !

    జిలేబి

    ReplyDelete
  9. ఆచార వ్యవహారాలు సార్వజనీయక విషయాలు గా ఎపుడూ ఉండలేదు. ఇకమీదట ఉంటాయా అన్నది కూడా ప్రశ్నార్ధకమే ?
    మా ఆచార వ్యవహారాన్ని బట్టి నాకు అర్ధం అయినది ఏమిటంటే భార్య చనిపోతే భర్త ఆమెకు తలకొరివి పెట్టకూడదు. తలకొరివి పెడితే అతను మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదు. కొడుకులు లేకపోతే అల్లుడు పెడతారు లేదా భర్త ఇష్టానుసారం తలకొరివి పెడతారు. అయితే మా బంధు వర్గ స్త్రీలు(కృష్ణా జిల్లా) మాత్రం భర్త తలకొరివి పెడతాడా పెట్టాడా అని ఆసక్తిగా చూస్తారు. ఎందుకంటే భార్య మీద ప్రేమ(అభిమానమో) ఉన్న వ్యక్తి మరల పెళ్ళి చేసుకోకూడదు అని నిర్ణయించుకుని భార్యకి తలకొరివి పెడితే అది ఆమెకు గౌరవంగా భావిస్తారు.
    కానీ గోదావరి జిల్లా వైపు స్త్రీలు భర్త చేత తలకొరివి పెట్టనీయరు. భార్య చనిపోయిన తరువాత అతనికి 80 సంవత్సరాలు వచ్చినా మళ్ళీ పెళ్ళి చేస్తారు కాబట్టి కొడుకు చేత పెట్టిస్తారు.

    ఇక భర్త చనిపోతే మా దగ్గర ఊరంతటినీ పిలిచి అందరి ముందూ బొట్టూ వగైరా తీసేస్తారు. ఆడవాళ్ళు భర్త లేకపోయినా బ్రతకగలరు కాబట్టి ఎటువంటి ఆంక్షలూ ఇపుడు లేవు. మా అక్క "అందరి ముందూ వద్దులే అమ్మా" అంటే మా అమ్మ గొడవచేసి మరీ బొట్టు తీయించుకుంది.

    నా అభిప్రాయం ఏమిటంటే సామూహిక అభిప్రాయం కన్నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం నడుచుకుంటే సరిపోతుంది.




    ReplyDelete
  10. ఈ చర్చ ఇరవై, ముఫ్ఫై సంవత్సరాల క్రితం జరిగితే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వుండేదనుకుంటా..? భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు కాలానికి అనుగుణంగా మంచి మార్పులకు ఆహ్వానం పలుకుతూ..అన్వయించుకోవడంలో ముందుంటూనే వుంటున్నాయి. ఏది ఏమైనా ఒక మంచి చర్చ జరిగింది. అదే విధంగా మహిళలను ఇంటా, బయటా కారు చీకట్ల బందీఖానాలలో మగ్గబెడుతున్న ఇతర మత సంప్రదాయాలపై కూడా ఇంతే అభ్యుదయ చర్చకు ఆహ్వానం పలుకుతారని ఆశించవచ్చా..! కేవలం ఇది భారతీయ, హిందూ ఆచారలకే పరిమితమా..?

    ReplyDelete
    Replies
    1. < అదే విధంగా మహిళలను ఇంటా, బయటా కారు చీకట్ల బందీఖానాలలో మగ్గబెడుతున్న ఇతర మత సంప్రదాయాలపై కూడా ఇంతే అభ్యుదయ చర్చకు ఆహ్వానం పలుకుతారని ఆశించవచ్చా.. >

      తప్పకుండా ఆశించవచ్చు. మీరూ ప్రశ్న పంపవచ్చు.

      Delete
  11. ఒకడు వేరే మతాన్ని విమర్శించడంలో భాగంగా బొట్టు వల్ల ఒచ్చే ఆరోగ్యం గురించి తెగ లెక్చర్లు దంచుతున్నాడు. మరి అదే మతం విధవరాలికి బొట్టు ఉండకూడదు అని ఎందుకు చెప్పింది అని అడిగా.. నన్ను పాకిస్థాన్ అభిమానిగా డిక్లేర్ చేసేశాడు

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top