పల్లెప్రపంచం బ్లాగులో పాత పోస్టులలో చెత్తను క్లీన్ చేద్దామనుకున్నాను. పని ఒత్తిడిలో అందుకు సమయం కేటాయించడం సాధ్యం కాదని కొన్ని టపాలు సరి చేశాక అర్ధం అయింది. అందుకని పాత పోస్టులన్నీ అక్కడే ఉంచి బ్లాగు యు.ఆర్.ఎల్ వరకు ఈ బ్లాగుకు షిఫ్ట్ చేశాను. అందుకు క్షమించాలని విజ్ఞప్తి. 

ఈ  బ్లాగులో ఏ శీర్షికలు ఉంటాయనేది ఎప్పటికపుడు  తెలియజేస్తాను. కామెంట్ మోడరేషన్ ఉంచదలచుకోలేదు. కామెంట్లలో డిలీట్ చేయాల్సినవి నా దృష్టికి తీసుకువస్తే సమయం ఉన్నపుడు పరిశీలించి తొలగిస్తాను. 

ప్రజ శీర్షికలో మర్పులుంటాయి. ఇప్పటిదాకా నాకు నచ్చినా నచ్చకపోయినా పబ్లిష్ చేశాను. వాటిలో నేను చర్చకు దూరంగా ఉన్నాను. కొన్ని అనుభవాల రీత్యా ఇకపై  నాకు నచ్చని ప్రశ్నలను పబ్లిష్ చేయదలచుకోలేదు. 

ఎప్పటిలాగే సహకరించండి. మీ అభిప్రాయలు, సలహాలు, సూచనలకు ఎప్పటిలాగే ఆహ్వానం పలుకుతున్నాను.

- పల్లా కొండల రావు.



Post a Comment

  1. . . . కామెంట్లలో డిలీట్ చేయాల్సినవి నా దృష్టికి తీసుకువస్తే సమయం ఉన్నపుడు పరిశీలించి తొలగిస్తాను. . . .

    ఈ విధానం సరికాదని ఇప్పటికే మీకు బహుపర్యాయాలు సూచించానని అనుకుంటున్నాను. బ్లాగునిర్వాహకులకు బ్లాగుటపాల విషయంపైననే కాక ఆ బ్లాగులో ప్రచురించబడిన వ్యాఖ్యలలోని విషయంపైన కూడా పూర్తిబాధ్యత ఉంటుంది. ఏదైనా అభ్యంతరకరమైన వ్యాఖ్య వచ్చినపక్షంలో దానిని మీరు దయచేసి తొలగించటం కోసం జనం మొత్తుకోవాలని మీరు చెప్పటం బాగాలేదు. మీరు తొలగించినా అటువంటి వ్యాఖ్య మరికొన్ని రోజులు అగ్రిగేటర్లలో కనిపిస్తుంది. అప్పటికే అనేకులకు చేరవలసిన తప్పుడు వ్యాఖ్య చేరి మరికొన్నాళ్ళూ అందుబాటులో ఉంటుంది. అందువలన అనవసరమైన్ చిక్కులు రావచ్చును. సూటిగా చెప్పాలంటే చట్టవ్యతిరేకమైన వ్యాఖ్యను మీరు తాపీగా తొలగించి శిక్షనుండి తప్పుకోలేరు. బాధ్యతగా వ్యవహరించేపక్షంలో తప్పక మోడరేషన్ చేయవలసిందే! మీకు అందుకు సమయం లేకపోవటం మిగతాప్రపంచం తప్పుకాదు. అంతగా అలా కుదరదు అనుకుంటే ఈ వ్యాసంగం నుండి దూరంగా ఉండటం శ్రేయస్కరం కాని చర్చావేదికపేరిట ఒక యుధ్ధాంగణం తెరిచాను కొట్టుకుచావండి అన్నట్లు రోజుకొకటో రెండో ఫైటింగ్ ఈవెంట్లు ఎనౌన్స్ చేసుకుంటూ పోతానంటే అది మంచి విధానం కాదు. బాగా అలోచించి ముందుకు పోవలసిందిగా విజ్ఞప్తి. నా అభిప్రాయం మీకు నచ్చకపోతే మన్నించండి.

    ReplyDelete
    Replies
    1. మీ సూచనను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాను మాష్టారు. కామెంటు మోడరేషన్ గురించి ఓ నిర్ణయం తీసుకుంటాను."కొట్టుకు చావండి" అని నేను చెప్పడం లేదు. చెప్పలేదు. అన్ని వాదనలు అందరికీ నచ్చవు. నచ్చకపోవడం వేరు, ఎదుటి వారిని నోరు మూపించడానికి, బూతులతో ఎగబడడం వేరు. మనకు నచ్చని లేదా ఆసక్తి లేని చర్చలకు దూరంగా ఉండాలి. నాకు నచ్చనవి చర్చిస్తారా? అన్న అహంకారమూ సరయినది కాదు కదా? కొద్దిమంది తప్ప బ్లాగు ప్రపంచం లో అంతగా కామెంట్లు డిలీట్ చేయాల్సిన పరిస్తితి లేదు. అలాంటి వారికి మీలాంటి వారు కూడా మద్దతు ఇవ్వకుండా కట్టడి చేస్తే బాగుంటుంది. నా దృష్టికి తీసుకు వస్తే తప్పేముంది? అందరి బ్లాగుల్లోకి దూరి బూతులు తిట్టేవారికి కూడా దయచేసి మీవంటి పెద్దలు నీతులు చెప్పాలి. మీరు చేపితేనైనా వింటారేమోనని చిన్న ఆశ సర్.

      Delete
    2. 'కొట్టుకుచావండి' అన్నట్లుగా మీ ధోరణి ఉందని అనటం కొంచెం దురుసుమాటయే - మన్నించాలి. తొలగించదగిన వ్యాఖ్యలను ప్రపంచం మీ దృష్టికి తీసుకొని రావటం అన్నది మీరు ఆధారపడదగినది కాదు.

      ప్రశ్న. ఫలనా కామెంట్ ఎలా ప్రచురించారు?
      జవాబు. ముందు ప్రచురిస్తాను ఏకామెంట్ ఐనా. తరువాత దానిపైన అభ్యంతరం వస్తే తొలగిస్తాను. అది నా పోలసీ.
      ప్రశ్న. అలా ఎందుకు తొలగించలేదు.
      జవాబు. ఎవరూ అభ్యంతరం చెప్పినట్లు నా దృష్టికి రాలేదు

      ఇలా నా దృష్టికి రాలేదు అంటే, "ఓకే కొండలరావు గారూ, మీ పొరపాటేం లేదు" అని చట్టం అనదండి! ప్రచురించబడిన ప్రతిదాని పైన మీదే పూర్తిబాధ్యత.

      Delete
    3. శ్యామలీయం మాస్టారు పొరబడుతున్నారు. సదరు సెక్షన్ 66-ఏ సుప్రీం కోర్టు మూడేళ్ళ కిందటే కొట్టేసింది.

      ఎవరో చేసిన నేరాలకు బ్లాగు యజమానికి శిక్ష పడదు, ఎక్కువెక్కువ వెబ్ సైట్ నిషేధం/blacklisting మాత్రమే.

      అయితే కొండలరావు గారు సివిల్ లా (కామం లా) ప్రకారం ఉన్న duty of care బాధ్యత ఇంకా మిగిలే ఉందని గుర్తు పెట్టుకోవాలి. మీరు & మీరు అనుమతించిన వ్యక్తుల ప్రవర్తన & చేష్టల (ఉద్దేశ్యపూర్వకం అయినా కాకపోయినా కూడా) వలన ఎవరికయినా హాని జరిగితే వారు కోర్టుల ద్వారా నష్ట పరిహారం కోరవచ్చు, అందుట్లో మీకు కూడా వాటా ఉండవచ్చు. అంచేత బ్లాగు యజమాని అత్యంత ప్రాక్టికల్ (కనీసం తాను సాధారణంగా ఇతర సొంత వ్యవహారాలలో తీసుకునేటంత) జాగ్రత్త తీసుకోవాలి.

      Delete
    4. శ్యామలీయం గారు,

      చట్టం తప్పు చేసినవాడిని వదిలేస్తుందా? నేను సూటిగా మిమ్ములను అడిగేది ఒకవైపు ధర్మం గురించి నీతులు చెపుతూ మరోవైపు అమ్మ నా బూతులు తిడుతుంటే అటువంటి వ్యక్తులనేమీ చేయదా?

      మీ వంటి పెద్దలు అటువంటి వ్యక్తులకు మాత్రం బుద్ధి చెప్పరా? ఒకవేళ మీరు చెప్పినా కొనసాగిస్తున్నారా? అటువంటి వ్యక్తులు మాట్లాడే బూతులు మాత్రం చట్టపరిధిలోకి రాదనుకుంటున్నారా?

      నా బాధ్యతగా కామెంటు చేసేవారికి సూచనలు ఇచ్చాను. కామెంట్ మోడరేషన్ గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయినా అలాంటి వ్యక్తులు పదే పదే మీవంటి పెద్దలు చెప్పినా చెవికెక్కించుకోక ఉన్మాదంతో పేట్రేగి పోతుంటే వాటిని నేను గమనించకపోతే దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా వీలుచూసుకుని తొలగిస్తాను అని చెప్పాను.

      ఇక మీరు చర్చల విషయంలో చెప్పే సూచనలు గతంలో చెప్పినపుడే తప్పని చెప్పాను. ఇప్పుడు కూడా ఆ విషయమై మీ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నాను.

      చట్టాలు కూడా చర్చల అనంతరమే చేస్తారు. వాటిని మార్చాలన్నా ఆ చట్టాలు చేసే సభలలో తిరిగి చర్చించాల్సిందే. పెప్పర్ గ్యాస్ వాడుతున్నారని, కారం పొడులు చల్లుకుంటున్నారని, అన్ పార్లమెంటరీ వర్డ్స్ వాడుతున్నారని చర్చించడాన్నే గొంతు నొక్కేద్దామనుకోవడం శుద్ధ తప్పు. మరో రకంగా మీరు చెప్పే మేధావులు మాత్రమే చర్చించాలనుకోవడం కూడా నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. పుస్తక జ్ఞానమూ, అనుభవ జ్ఞానమూ రెండింటి కలియకగా నిరంతర తర్కం ద్వారానే ధర్మాన్ని కాపాడగలం తప్ప గ్రంధాలలో వ్రాసుకున్నదే ధర్మం లేదా న్యాయం వాటిని ఎవరూ ప్రశ్నించనే కూడదనుకోవడాన్ని నేను అంగీకరించలేను.

      ఏ రకమైన నియంతృత్వాలకన్నా అయినా.... తప్పులున్నా, తప్పుడు వాదనలు ఉంటున్నా ప్రజాస్వామ్యమే బెటర్. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడం అనేది చర్చల ద్వారానే ఎప్పటికపుడు సాపేక్షంగా మాత్రమే సాధ్యం.

      ఇక చట్టపరమైన అంశాలలో భావప్రకటనా స్వేచ్చకు సంబంధించి ఇటీవల సుప్రీం తీర్పులు, వ్యాఖ్యలు, సూచనలు మరోసారి మీరు గమనించాలని విజ్ఞప్తి.

      ప్రశ్నల విషయంలోనూ, కామెంట్ల విషయంలోనూ నేను ఇదివరకటికంటే ఇంకా ఎక్కువ బాధ్యతగానూ, కఠినంగానూ వ్యవహరిస్తానని హామీ ఇస్తున్నాను. గతంలో నేను కూడా ఇలాంటి వ్యక్తుల అసభ్యం చూసి తట్టుకోలేక బ్లాగు మూతేసుకుందామనుకునేవాడిని. కానీ అప్పట్లో జై గారి సూచనతో కాస్త రాటుదేలాను. వెధవలకు మనం ఎందుకు భయపడాలి? మీరు కూడా అలాంటి వెధవలకు కాస్త బుద్ధి చెప్పండి ప్లీజ్.

      Delete
    5. < కొండలరావు గారు సివిల్ లా (కామం లా) ప్రకారం ఉన్న duty of care బాధ్యత ఇంకా మిగిలే ఉందని గుర్తు పెట్టుకోవాలి. మీరు & మీరు అనుమతించిన వ్యక్తుల ప్రవర్తన & చేష్టల (ఉద్దేశ్యపూర్వకం అయినా కాకపోయినా కూడా) వలన ఎవరికయినా హాని జరిగితే వారు కోర్టుల ద్వారా నష్ట పరిహారం కోరవచ్చు, అందుట్లో మీకు కూడా వాటా ఉండవచ్చు. అంచేత బ్లాగు యజమాని అత్యంత ప్రాక్టికల్ (కనీసం తాను సాధారణంగా ఇతర సొంత వ్యవహారాలలో తీసుకునేటంత) జాగ్రత్త తీసుకోవాలి. >

      మీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను జై గారు. దానికోసం ఏమి చేయాలనేది ఆలోచిస్తున్నాను.

      Delete
  2. ఈ టపాలో అనవసర, విషయానికి సంబంధంలేని వ్యాఖ్యలను తొలగించడమైనదని గమనించగలరు.

    ReplyDelete
    Replies
    1. కొండలరావు గారూ, నాకు తెలిసినంత వరకు అడ్మిన్ కామెంట్లు తొలగించడానికి రెండు పద్ధతులు ఉన్నాయి.

      మీరు clean sweep తరహాలో మొత్తం ఛాయలతో సహా తీసేసారనుకుంటా. దీనికంటే బ్లాగర్ పేరు & టైం స్తాంప్ ఉండి వ్యాఖ్య మాత్రం తొలిగేటట్టు చేస్తే ("this comment has been removed by the administrator") మీరు మీ విచక్షణ వాడినట్టు స్పష్టం చేస్తూ బాగుందేమో.

      మాస్టారు చెప్పినట్టు prior moderation ఇంకా బెటర్ కానీ మీకు సమయం ఉంటుందో లేదో.

      Delete
    2. నాకు టెక్నికల్ విషయాలు బాగా తెలియవు జై గారు. మీరు చెప్పినవి మా అబ్బాయితో మాట్లాడి బహుశా ఈ వారంలో కమెంటు మోడరేషన్ కు ఒక పద్ధతిని ఫాలో అవుతాను. నేనొక అభిప్రాయానికి వచ్చాక ఫైనల్గా బ్లాగర్ల అభిప్రాయాలు తీసుకోవడానికి చర్చకు పెట్టి ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటాను. మీ సూచనకు ధన్యవాదములు. నేనూ remove forever అని ఉండేది వాడాను. మొత్తం పోతున్నది. అలా కాకుండా మనకు (నాకు) కనపడాలి. బ్లాగులో కనిపించకూడదు. అలా యేమైనా option ఉన్నదా?

      Delete
    3. నా బ్లాగులో రాయడమే తక్కువ, ఇంకా కామెంట్లు కొన్నే. అంచేత ఈ విషయం నాకూ అంత బాగా తెలీదండీ.

      మీ అబ్బాయి చేయగలరనుకుంటా. ఆయనకీ కుదరకపోతే ప్రఖ్యాత టెక్నాలజీ బ్లాగర్ నల్లమోతు శ్రీధర్ గారిని అడగవచ్చు.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top