ఈ దమ్మున్న సమాజం కావాలి !

మీలో ఈ దమ్ముందా !? ఇది చదివి నిజాయితీగా చెప్పండి !

బాల్యం - వృద్ధాప్యం ఇవి రెండూ సక్రమంగా భద్రతగా - బాధ్యతగా మనగలిగితే మొత్తం సమాజం బాగుంటుంది. అందరం నీతులు చెప్పి అసలు విషయం మరచిపోతే భావి సమాజం అశాంతితో, అలజడులతో నిండి ఉంటుంది. సమాజ నిర్మాణంలో కుటుంబం పాత్ర , పిల్లల పెంపకం పాత్ర కీలకమైనది. 

బాల్యం ఆనందంగా గడవాలి. వృద్ధాప్యం భద్రతగా ఉండాలి. మొత్తం సమాజానికి ఆ దమ్ము పెరగాలి. పిల్లలకి పెద్దరికం కథల రూపం లో , అనుభవాలు పాఠాలుగా చెప్పే రూపంలో చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. అసలు పిల్లలు నిర్భయంగా పెరిగేదానిలో వృద్ధుల పాత్ర ప్రస్తుతం పక్కదోవపడుతున్నది. 

ఉమ్మడి కుటుంబాలు లేకుండడం , కెరీరిజం - డబ్బు యావతో వృద్ధాప్యం శాపంగా మారడం, వృద్ధాశ్రమాలు పెరగడం సమాజానికి సవాల్ అనే చెప్పాలి. మానవతావాదులకి ఇది ప్రమాదకరమైన సంకేతమే. పిల్లలూ, వృద్ధులూ హాయిగా ఉండే దమ్మున్న సమాజంగా మన సమాజాన్ని మార్చేందుకు కృషి చేద్దాం. దానికి ఏ కొంతైనా ఆలోచన రేకెత్తించేందుకు ఈ పోస్టు ఉపయోగపడగలదని ఆశిస్తున్నాను. 

మనిషికీ జంతువుకీ ఉన్న తేడాలలో ఆలోచన అనేది కీలకమైనది. మనిషి మాత్రమే ఆలోచనతో నాగరికతని ఏర్పరచుకున్నాడు. నిత్యం దానిని మార్చుకుంటూ , నేర్చుకుంటూ పురోగమిస్తుంటాడు. వీటిలో కుటుంబం - మానవ సంబంధాలు - అనుబంధాలనేవి ముఖ్యమయినవి. 

వీటిని ఎలా చూడాలి? అనేదానిలో డబ్బు అనేది ఆటంకంగా ఉంటోంది. ముఖ్యంగా వృద్ధాప్యం శాపమవుతోంది. ఓ తండ్రి ఆవేదన ఇక్కడ చూడండి. ప్లస్ లో రాచపూడి రమణి గారి ప్రొఫైల్ ఉన్న ఈ ఇమేజ్ సేకరించి ఈ బ్లాగులో ఉంచాను. ఒరిజినల్గా ఇది ఎవరు తయారు చేశారో తెలీదు. అందరినీ ఆలోచింపజేసేదిగా ఉందనిపించింది. 


పెద్దగా కనిపించడానికి ఇమేజ్ మీద క్లిక్ చేసి జూం చేయండి. 

 రాచపూడి రమణి గారికి అభినందనలతో ......

- పల్లా కొండలరావు
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. దమ్ము, ధైర్యం, అణుకువ, అభిమానం నిజంగా ఉన్నవాళ్ళు నిండుకుండలు... తొణకరు బెణకరు.. కొండల్ రావు గారు.. అవన్నీ మాకున్నాయి అని అనుకుంటూ చూశామంటే చూశాము అనుకునేవాళ్ళు ఇదిగో ఇలా ఆవేదనని చెప్పించుకునేవాళ్ళు... అదే కదా బాధ. మొన్నామధ్యే పేపర్ లో చదివాను ఎవరో సినిమా హీరో(ఓ మాదిరి పేరున్న హీరోనే) తల్లి తండ్రిని చూసుకోలేనంటూ కొట్టి మరీ బయటకి పంపించాడుట.. పాపం ఆ ముసలి వాళ్ళు కోర్టు గుమ్మాలు ఎక్కలేక దిగలేక అవస్థ పడుతున్నారు.. వాళ్ళు మటుకు ఎవరికి ఎప్పుకోగలరు? :(

    ReplyDelete
  2. అవును రమణి గారు.నిండుకుండ తొణకదంటారు.లేని వాళ్ల కంటే డబ్బు జబ్బు పట్టుకున్నవారిలో, చదువుండీ సంస్కారం కొరవడిన వారిలోనే ఈ రోగం(తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం) ఎక్కువ.మరోసారి ధన్యవాదాలు మీకు.

    ReplyDelete
  3. @ramani rachapudi:Plz reveal that hero's identity
    Regards

    ReplyDelete
  4. That "Hero" is Sivaji Raja.

    ReplyDelete
  5. దొమ్ము, రొమాలు, కాళ్ళు, చేతులూ, ఇంకా అన్ని అవయవాలూ, వుంటాయి అవి లేని మనిషి వికలాంగుడవుటాడు. అందురూ చదవాలని ఇలాంటి చెత్త పేర్లు పెట్టవద్దు. మీరు ప్రచురించే విషయానికి తగట్టు పేర్లు పెడితే భాగుంటుంది.

    ReplyDelete
  6. @ Anonymous గారికి ,

    ఇంకా మంచి పేరు పెట్టడానికి నాకభ్యంతరం లేదు. దీని వల్ల ఇబ్బందేమిటో చెప్పగలరా?

    ఏ.బీ.ఎన్ ఆంధ్రజ్యోతి దమ్మున్న చానల్ అని పెట్టుకుంది. ఇంకా చాలా చోట్ల ఒక చాలెంజ్ ని తెలిపే పదం గా దమ్ము ను వాడుతుంటాం. సినిమా పేరు కూడా దమ్ము అని ఉంది. చాలా మీటింగులలో ఓ మాస్ వర్డ్ గా దీనిని వాడడం వరకు నాకు తెలుసు .

    ఈ పదం అభ్యంతరకరమైనదైతే తప్పనిసరిగా వాడకుండా ఉండడమే మంచిది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే నేను ఈ పదం రెండు పోస్టులకు వాడాను. ఆ పోస్టులే పాపులర్ అయ్యాయి. ఆయా పోస్టులకు నాలో కలిగిన భావోద్వేగం మేరకే ఈ పదం వాడాను. ఆ పోస్టులు నాకు కూడా బాగా నచ్చాయి.

    మీరు ఎవరో పేరు చెప్పకుండా కామెంట్ లు పెడుతున్నారు. పోనీ ఆ పదం వల్ల ఇబ్బంది ఏమిటో వివరించగలరు. అసభ్యకరమైన పదమైతే ఖచ్చితంగా మారుద్దాం.

    కానీ మాకు కూడా తెలియాలి గదా? ఎందుకో అనేది. మీకు తెలిసుంటే వివరించగలరు. ప్రత్యామ్నయంగా అదే మాస్ గా జనాల్ని చేరే పదం కావాలి.

    ReplyDelete
  7. Inthaki dhammu ante arthamu enti..
    Maa telanganalaa dammu.. ubbasamu ani rogalaki ee dammu ni use chesthaamu.

    "Dammu vachhindhi oriki oriki" ante mee bashalo aayasamu.

    Mari dammu ani ala ela use chesthunnaru. dammu unte chaduvandi.. ante ubbasamu unte chaduvandi ana.. LOL

    ReplyDelete
    Replies
    1. అబిజ్ఞాత గారూ ! కామెంట్ కు ధన్యవాదములు. మాదీ తెలంగాణానేనండీ.

      దమ్ముతోటి దగ్గుతోటి చలిజ్వరమొచ్చిన అత్తో అత్తో పోదాం రావే మనవూరి దవఖానకూ.... ' నేటి భారతం ' సినిమాలో పాట ఉంది.

      దమ్ము అనేది ఓ రోగానికి పేరు గా కూడా వాడతారని తెలుసు. అయితే ఇది కేవలం కొన్ని ప్రాంతాలకు పరిమితై ఉండవచ్చు.

      ఎక్కువ భాగం మాస్ గా ఓ మనిషిలో పౌరుషం గా ఓ విషయం పై నిలబడే దానికి ప్రతీకగా వాడుతుంటారు. నాకు తెలిసినమేరకు ఇదే.

      మిగతా పూర్తి వివరణ ఎవరైనా తెలిసినవారు చెప్పాల్సిందే. నేనూ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను.

      మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదములు.

      Delete
  8. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసిన మీరు చెప్పిన విషయం అమ్మానాన్నలను సరిగా చూడని వారు ఆలోచించేలా వుంది . చాల బాగా వ్రాసారు . ముక్యంగా ప్రతి ఒక్కరు కొంత సమయం అమ్మానాన్నలకోసం కేటాయించి వారి బాగోగులు చూడాలి.

    ReplyDelete
  9. మీకు బుద్ధి వుందా? :) ఆ పెట్టిన టైటిల్ చూసి, అడగాలనిపించింది.

    దమ్మారో దం
    మిఠ్ జాయే హం
    బోలో సుభో షాం
    హరే కృష్ణ హరే రాం

    ReplyDelete
  10. @Anonymous
    నా బుద్ధి మేరకు పెట్టాను.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top