అంశం : దేవుడు
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
-----------------------------------------------
ఆంధ్రజ్యోతి లో వచ్చిన క్రింది వార్తను చూడండి. దేవుడున్నాడనే భావన వలన ప్రజలకు కలిగే ఉపయోగంపై ఓ సర్వే రిపోర్ట్ ఇది. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయాలని వినతి.
(from ఆంధ్రజ్యోతి digital edition) |
----------------------------
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
అన్ని రోగాలకీ ఒకటే మందు పని చెయ్యదు. దేవుణ్ణి నమ్మకపోయినా పని జరుగుతుందనిపిస్తే దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం ఏముంటుంది?
ReplyDeleteధైర్యమా! దాన్ని బలుపనాలి. అందుగ్గాదూ వీళ్ళు హత్యలూ, మానభంగాలూ, ఆత్మాహుతి దాడులూ చేస్తుండేది!
ReplyDeleteసర్వేలు ఎంత వరకూ నమ్మదగినవి అన్నదొకవిషయమైతే, దేవుడి పేరున్నందుకు వీక్షించినందుకే దాన్ని ఇలా చెప్పడం కొంచెం అతికాదూ! మరి అందులో sex గురించిన ప్రస్తావన ఉంటే మరింతమంది చూసుండేవారేమో! అందుగ్గాదూ మన తెలుగు పేపర్లు "ఆమెకు అదంటే ఇష్టం" అంటూ నానా చెత్త హెడ్లైన్లు పెట్టి చంపేది.
అయినా తెలుగులో పేపర్లేమున్నాయండీ? అన్నీ కరపత్రాలేకదా! వాటినికూడా పట్టించుకోవాలా?
దేవుడున్నాడనే భావన చాలా ధైర్యాన్ని ఇస్తుంది.
ReplyDeleteఆత్మహత్యలు చేసుకునేవాళ్ళలో పూజారులు లేరా ముఅజ్జీన్‌లు లేరా? మతం ఇచ్చే ధైర్యం పూజారి పైనో, ముఅజ్జీన్ పైనో పని చెయ్యదు కానీ విశ్వాసిపై మాత్రం పని చేస్తుందా?
ReplyDeleteపనిచేస్తుంది. కనుకనే దానిని ‘భ్రమాత్మక ఆనందం’ అన్నారు. మతం వల్ల, మత నమ్మకాల వల్ల మనుషులకు మానసిక ప్రయోజనాలున్నాయి కనుకనే అవి వర్ధిల్లుతున్నాయి. సరైన,సక్రమమైన,నమ్మకమైన,అర్ధవంతమైన ప్రత్యామ్నయం లేనంత వరకూ మతం వల్ల మనిషికి ప్రయోజనం ఉంటుంది.
Deleteప్రయోజనం వేరు, ఆశ వేరు. యాంటీ డిప్రెషన్ డ్రగ్స్ ఉన్నా సైకియాట్రిస్టుల్లో కూడా ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు ఉన్నారు. ఆశ పుట్టించి మోసం చేసేది ఎల్లప్పుడూ ఇలాగే వర్ధిల్లుతుందని నిర్ణయించడం కర్మవాదం అవుతుంది.
ReplyDeleteఆశ పుట్టించి ప్రయోజనం పొందడానికి, మంచి జరుగుతుందేమోనని ఆశించడానికీ తేడా ఉంది.
Deleteదేవుణ్ణి ఎంత నమ్ముకుని పని చేసినా వర్షా కాలంలో మాగాణిలో పొద్దుతిరుగుడు వేస్తే అక్కడ నీరు ఊటెక్కి పొద్దుతిరుగుడు మొక్కలు చస్తాయి.
Deleteదేవుడ్ని నమ్ముకుని పని చేయకుండా ఉండడు. శ్రమంతా అతనే చేస్తాడు తన శ్రమకు దెయ్యాలు నష్టం చేయకుండా దేవుడు కాపాడాలని కోరుతూ మొక్కుకుని సంత్రుప్తి పడతాడు. అలా సంత్రుప్తి పడనవసరం లేని వాడు కూడా ఇతను చేసిన శ్రమనే చేస్తాడు. ఫలితం ఇద్దరికి శ్రమ ఆధారంగానే వస్తుంది. మానసిక సంత్రుప్తి, చైతన్యం నిర్ణయించడంలో నమ్మకాల పాత్ర వహిస్తాయి.
Deleteశ్రమ వల్లే లాభం జరిగితే ఇక దేవుడు ఎందుకు? నష్టం జరిగితే దేవుడు కరుణించలేదని బాధపడడానికా? సి.పి.ఐ. నాయకుల్లోనే ఒకడు సాయుధ పోరాటం ముగించిన తరువాత రోజుల్లో భక్తి చింతన వైపు వెళ్ళిపోయాడు. వీళ్ళే ఈ స్థాయిలో ఉంటే వీళ్ళని నమ్ముకునేవాళ్ళు ఏ స్థాయిలో ఉంటారో?
Deleteఅసలు దేవుడు ఉన్నాడనే భావన ధైర్యాన్ని ఇస్తుందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ నమ్మకాలు లేనివాళ్ళు ధైర్యాన్ని ఎట్లా పొందుతున్నారో తెలుసుకోవాలి.
Delete"శ్రమ వల్లే లాభం జరిగితే ఇక దేవుడు ఎందుకు? నష్టం జరిగితే దేవుడు కరుణించలేదని బాధపడడానికా?" అని ప్రవీణ్ గారు అడిగిన ప్రశ్న చాలా గొప్పది.
వ్యక్తిగతమైన రాగద్వేషాలతో సిద్ధాంతాలను అభిమానించి తమకు నచ్చిన సిద్ధాంతాలను పాటించని వారిని ట్రోలింగు చెయ్యడం గాక నిజాయితీతో కూడిన ఇటువంటి ప్రశ్నలు వెయ్యడం ప్రవీణ గారికే చెల్లింది.
అవును, నిజమే!ఒక పని చేసి లాభం పొందడానికి ముందే కొందరు అదే పని చేసి నేర్చుకుని మనకు ఇచ్చిన మెళకువల్ని మనకు అందించితే కదా మనం ఒక పనిని అతి తక్కువ శ్రమ చేసి అతి ఎక్కువ లాభం పొందుతున్నది.ఆ పని అలా చేస్తే ఆ లాభం వస్తుంది అన్న గ్యారెంటీ ఉన్నప్పుడు పని చేసి లాభం పొందితే సరిపోతుంది.నీకు కావలసింది లాభం కదా!పని చేశావు, లాభం వచ్చింది,అనుభవించు - ఇందులో భయం తెచ్చుకుని గజగజ లాడుతూ బతకాల్సిన ప్రమాదం ఏముంది?ఒక పనిని అందరూ ఒకేలా చేస్తే ఒకే ఫలితం వచ్చేలా ఉన్నప్పుడు ఆ పని చెయ్యడానికి ప్రత్యేకించి ధైర్యం తెచ్చుకోవడం కోసం దాన్ని మొదట ఎవడు కనిపెట్టాడు, ఎవడు వృద్ధి చేశాడు, మనకి ఎవడు ఇచ్చాడు అని వెతికి వెతికి కనుక్కుని వాణ్ణి పొగడ్డం అవసరమా? ఇదే కదా ప్రవీణ్ మరియు ఇతరుల వాదన!
అయితే, చెయ్యాల్సిన పనిలో సమస్యలు ఎదురైనప్పుడు ఏం చెయ్యాలి?అసలు, ఒక పనిని అందరూ ఒకేలా చేస్తే ఒకే ఫలితం వచ్చేలా ఉన్నప్పుడు దానినే అనుసరిస్తున్న కొంత కాలం తర్వాత ఇప్పుడు కొత్త సమస్య రావడం ఎలా సాధ్యం?ఎలా సాధ్యమో మనకు తెలియదు, మనం ఇంత కాలం చేసింది మనకన్న ముందు ఆ పని చేసిన వ్యక్తులు మనకు చెప్పిన పద్ధతిని అనుసరించడమే కాబట్టి ఇప్పుడు వచ్చిన సమస్యను వాళ్ళ ముందు పెట్టి సరి చేసి ఇమ్మని అడగాలి.అడిగి తెలుసుకోవాలి అంటే అవతలి వ్యక్తి పట్ల మనకు గౌరవం ఉండాలి, అది మనం అతని పట్ల చూపించే మర్యాదల వల్ల అతనికి తెలుస్తుంది.
భౌతిక ప్రపంచంలో ఒక ఫోర్మెన్ తన సూపర్వైజరుతో ఎట్లాంటి సంబంధాలను కలిగి ఉంటే అతని పనితీరు ఎట్లా ఉంటుందో భక్తులు దైవంతో ఏర్పరచుకునే సంబంధాన్ని బట్టి వారి జీవితం ఉంటుంది.ప్రశ్నను ఇంతవరకు మాత్రమే పట్టించుకుని ఆలోచిస్తే నాస్తికులకూ ఆస్తికులకూ వాదోపవాదాలు చేసుకోవాల్సిన అవసరమే లేదు.మనకు ఫలితం గ్యారెంటీ అని తెలిసిన పనినే చేస్తూ సమస్యలు ఎదురైతే మన సమస్యల్ని మనమే పరిషక్రించుకోగలిగే జ్ఞానం ఉన్నప్పుడు ఇంకొకర్ని ఆశ్రయించడం అనవసరం అనే ప్రవీణ్ గారి వాదన ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే,కదా!
అయితే, మనుషులు అందరూ ఒకే రకమైన మనస్తత్వాలను కలిగి ఉండటం అనేది పిచ్చి వాళ్ళ స్వర్గంలో తప్ప నిజమైన ప్రపంచంలో కుదరదు.మనకు తెలిసిన జ్ఞానం సమస్తం కాలంతో ముడిపడి ఉంది.ప్రకృతిలోని అనివార్యమైన మార్పును కొలవడానికి ఉపయోగించే ప్రమాణమే కాలం. దీనిలోని అతి చిన్న అంశం పేరు లిప్త!
అయితే, మార్పుకు కారణమైనది చలనం.ఈ మార్పుకు కారణమౌతున్న చలనం ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతున్నది అనే ప్రశ్నకు ఆస్తికులు ఒక జవాబు చెప్తున్నారు నాస్తికులు మరొక జవాబు చెప్తున్నారు.
నేను ఆస్తికుణ్ణి గనక నా జవాబు ఇది:చలనానికి కారణం సృష్టికర్త.చలనం వల్ల కలిగిన మార్పును ఎలా తెలుసుకోవాలి అని తెలియజెప్పేది జ్ఞానం.చలనాన్నీ మార్పునీ సృష్టి నియమాలనీ ధిక్కరించలేని మనం ప్రకృతిలోని మార్పులకు అనుగుణమైన పద్ధతిలో కదలడం తప్ప మరొక దారి లేదు.
సకల జీవజాతులూ అనివార్యమైన మార్పుకు ఎలా ప్రతిస్పందించాలి అనే విషయానికి సంబంధించి మూడు గుణాలను ప్రదర్శిస్తాయి.అవే సత్వరజస్తమో గుణాలు.తమో గుణ సంపన్నులు అనుకూలమైన మార్పును కూడా వ్యతిరేకిస్తారు.రజో గుణ సంపన్నులు ప్రతికూలమైన మార్పును కూడా ఆహ్వానిస్తారు.సత్వ గుణ సంపన్నులు ప్రస్తుతం ఉన్న భద్రతను చెదరనివ్వక కొనసాగించే మార్పు వైపుకు నడుస్తారు. దీనికి చాలా ఎక్కువ స్థాయిలో జ్ఞానం అవసరం.దాన్ని అందించే ప్రతి ఒక్కరి పట్లా మర్యాదను చూపిస్తూ కొత్త సమస్యను పరిష్కరించే సమయంలో జ్ఞానాన్ని ఆశించడమూ సమస్య పరిష్కారం అయిన తర్వాత కృతజ్ఞతలు తెలపడమే ప్రార్ధన యొక్క ఉద్దేశం.
ప్రస్తుతం మనకు ఎదురైన సమస్యను మనకు ఉన్న జ్ఞానంతో పరిష్కరించుకోగలిగితే సలు భయమే ఉండదు.కానీ,మన ప్రస్తుత జ్ఞానానికి అతీతమైన సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపించగలిగినవాళ్ళు ఉన్నారని తెలిస్తే నాస్తికులకు ఎంత ధైర్యం వస్తుందో ఆస్తికులు తమ నమ్మకం వల్ల అంతే ధైర్యం పొందుతున్నారు.