చాలా మంది ఆయుర్వేదాన్ని నాటు వైద్యం అనుకుంటారు. కానీ ఆయుర్వేద మందులన్నీ నాటు మందులు కావు. ఆయుర్వేద మందుల్ని మొక్కల నుంచి తీసిన పదార్థాలతో తయారు చేస్తే అల్లోపతి మందుల్ని వివిధ పద్దతుల్లో సేకరించిన రసాయనాలతో తయారు చేస్తారు. ఆయుర్వేదం, అల్లోపతి రెండూ శాస్త్రీయమే కానీ హోమియోపతి మీదే అనేక అనుమానాలు ఉన్నాయి. హోమియో మందులు తయారు చేసేవాళ్ళు నిజమైన మందులనే నీళ్ళలోనో, ఆల్కహాల్లోనో dilute చేసి వాటి మోతాదు తగ్గిస్తారు. మందు యొక్క మోతాదు తగ్గడం వల్ల రోగం ఆలస్యంగా తగ్గుతుంది. రోగం ఆలస్యంగానైనా తగ్గుతుందని చెప్పి హోమియో వైద్యులు రోగుల్ని ఎటూ వెళ్ళిపోకుండా చేస్తారు. అల్లోపతి, ఆయుర్వేద మందుల వల్ల రోగం తొందరగా తగ్గుతుంది. అటువంటప్పుడు హోమియోపతిని నమ్ముకోవడం అవసరమా? హోమియోపతి వల్ల side effects ఉండవని అంటారు. హోమియో మందులోనే మందు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది కనుక దాని వల్ల రోగం తగ్గడమే కష్టం. రోగం తగ్గించలేనిది side effectని కూడా కలిగించలేదు. హోమియో మందులు ఎంత వరకు పని చేస్తాయో తెలియాలంటే ఈ లింక్ చదవండి
http://www.quackwatch.com/01QuackeryRelatedTopics/homeo.html
- Praveen Kumar
*Republished
------------------------------------
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
------------------------------------
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
మీ దృష్టిలో నాటు వైద్యం అంటే ఏమిటి? హోమియోపతి నాటు వైద్యం ఎలా అవుతుంది?
ReplyDeleteరోగ నిరోధక శక్తిని కొంచెం పెంచితే రోగం తగ్గుతుందని హోమియోపతిని కనిపెట్టినవాడే అన్నాడు. రోగ నిరోధకశక్తి అందరిలో ఒకేలా ఉండదు. అది ఆహారపు అలవాట్లు & వాతావరణం బట్టి ఉంటుంది. కేవలం రోగ నిరోధక శక్తిని పెంచడం వల్ల రోగం తగ్గుతుందని చెపితే అల్లోపతి & ఆయుర్వేద వైద్యులు ఎవరూ నమ్మరు. ఒక నాటువైద్యుడు 26 రోగాలకి ఒకే మందు ఇస్తే అతన్ని నమ్మరు కానీ ల్యాబ్ పరీక్షల్లో మందే దొరకని రకం మందుని హోమియో వైద్యుడు ఇస్తే మాత్రం అది తీసుకుంటారు.
ReplyDeleteప్రవీణ్ గారు,
Deleteఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు మన పెద్దలు. రోగం ఎందుకు వస్తుంది? రోగానికి ఏ వైద్యం చేయాలి? రోగి శరీర తత్వం ఎలాంటిది? ఏ రోగానికి ఏ వైద్యం చేయాలి? ఇలాంటివి లోతైన అంశాలు. అందరికీ అవగాహన కల్పించాల్సిన అంశాలు. ఎవరు పడితే వారు , ఏది పడితే అది వ్రాసి, వాదిస్తే అంతగా ఫలితం ఉండదు. జనాలను కంఫ్యూజ్ చేయడానికి పనికి వస్తాయీ వాదనలు తప్ప ఏ వైద్యం ఎలా మంచిదో చెప్పాల్సినది సమాజ హితం లక్ష్యంగా ఉన్న నిపుణులు మాత్రమే. నేనిక్కడ సమాజ హితం కలిగిన అని ఎందుకు అన్నానంటే ప్రతి వైద్య విధానమూ మంచిదే. ఇతర వైద్య విధానాలలో ఉన్న మంచిని అంగీకరించే బుద్ధి ,ధైర్యం డాక్టర్లకు అందరికీ ఉండదు.
జీవన విధానం వేరు. వైద్య విధానం వేరు. జీవన విధానం సరిగా ఉండే సంస్కృతీ-సాంప్రదాయాలను మనం ప్రోత్సహిస్తే 99% రోగాలు దరి చేరవు. ప్రతి వైద్య విధానం ఓ సూత్రం పై ఆధారపడి ఉంటుంది. అన్నింటికంటే అల్లోపతి ఎక్కువగా జనానికి ఉపయోగపడుతున్నప్పటికీ అవసరానికి మించి ఇంకా చెప్పాలంటే వ్యాపారంగా సాగుతున్న మందుల వాడకం వల్ల అల్లోపతి వైద్యంపై అపనమ్మకం ఏర్పడుతున్నది. దీనిని ఆసరాగా చేసుకుని మిగతా వైద్య విధానాలను ప్రచారం చేసుకుంటూ వారు సైతం సొమ్ము చేసుకుంటున్న మాటా వాస్తవం. ఇంకో కోణంలో ఒకరిపై మరొకరు దుష్ప్రచారం చేసుకుంటున్నారు అంటే బాగుంటుందేమో!
మన సంస్కృతిలో యోగాకు ప్రాధాన్యం ఉన్నది. దీనివల్ల ఫలితం లేదంటూ ఎద్దేవా చేస్తూ మన బ్లాగర్లలో ఆర్టికల్స్ వ్రాసిన వారిని చూశాను. అల్లోపతి వైద్యుడికి వారి పాఠ్యగ్రంధాలలో వ్రాసినది లేదా బట్టీ పట్టింది మాత్రమే తెలుస్తుంది. వారి రంగానికి సంబంధంలేనివాటిపై పిచ్చి కామెంట్లు చేయడం మంచిదా? అది శాస్త్రీయమా? కానే కాదు. అతివాదం వేరు శాస్త్రీయ వాదన వేరు.
అన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేయగలిగితే మంచిది. కానీ సైంటిఫిక్ గా ప్రూవ్ చేయలేనంత మాత్రాన ఆచరణలో ఫలితం వస్తున్న అంశాలను గుడ్డిగా త్రోసిపుచ్చడమూ సరి కాదు. ఆ ఫలితాలు ఎలా వస్తున్నాయో తేల్చగలిగే కెపాసిటీ సైన్స్ కు అందలేదని చెప్పాలి. మూఢనమ్మకం వేరు ఆచరణలో ఫలితాలు రావడం వేరు. ఉదాహరణకు మన యోగాకు ఈమధ్యనే ఐక్యరాజ్యసమితి గుర్తింపు వచ్చింది. చైనా సాంప్రదాయ వైద్య విధానం అయిన ఆక్యుపంచర్ కొన్ని రోగాలు అద్భుతంగా పని చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ తెరపీ గా గుర్తించినా మన దేశంలో సరైన ఆదరణ లేదు. మన వైద్య విధానం అయిన ఆయుర్వేదం కు కూడా మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి.
హోమియోపతిపై భిన్నాభిప్రాయాలున్నమాట ఎంత నిజమో చాలా రోగాలకు మంచి ఫలితాలుంటున్నమాటా అంతే నిజం. ప్రతి వైద్య విధానంలోని మంచిని సమాజపరం చేసే వ్యవస్థ ఏర్పడేవరకూ కార్పొరేట్ హాస్పిటళ్ల మాయలో జనానికి ఏది నిజమో, ఏది అబద్దమో అనే సంశయం తప్పదు. ప్రభుత్వ పరంగా వీటిపై సరయిన అవగాహనా కార్యక్రమాలు కలిపించాలి.
అల్లోపతి ఎలా పని చేస్తుందో, ఆయుర్వేదం కూడా అలాగే పని చేస్తుంది. మందుల తయారీ పద్దతిలోనే ఆ రెంటి మధ్య తేడా ఉంటుంది. హోమియోపతి మాత్రం నాటువైద్యంతో సమానమే. మందుని నీళ్ళు, ఆల్కహాల్, చక్కెర మిశ్రమాల్లో dilute చెయ్యడం ఇంటిలో కూడా చేసుకోవచ్చు. అది పుస్తకాలు చదివి నేర్చుకున్న చిట్కా వైద్యంతో సమానం.
Deletehttp://naprapamcham.blogspot.in/2009/04/blog-post.html?m=1
ReplyDelete> రోగ నిరోధకశక్తి అందరిలో ఒకేలా ఉండదు. అది ఆహారపు అలవాట్లు & వాతావరణం బట్టి ఉంటుంది
ReplyDeleteనిజం. అందుకే హోమియోలో ఫలానిరోగానికి ఫలాని మందు అంటూ సాధారణంగా బండగా ఇవ్వరు. రోగి శరీరతత్త్వమూ, జీవనవిధానమూ వగైరావన్నీ బాగాపరిశీలించి రోగికి వ్యక్తిగతంగా సందర్బానుకూలంగా సూచితమైన మందునే ఇస్తారు.
మీకు వైద్యవిధానాలమీద జనరల్ అవగాహన ఉంటే ఉండవచ్చు కొద్దిగా. ఆ మాత్రానికే లోతుపాతులు తెలియని విషయాలమీద అతిసాహసంగా మాట్లాడటం వలన ప్రయోజనం లేదు.
పదేపదే ఇదేవేదిక మీద వెలిబుచ్చిన అభిప్రాయం ఒకటి మళ్ళా చెప్పక తప్పదు. విషయచర్చలు చేసేవారికి సదరువిషయం మీద తగినంత పట్టూ అధికారమూ ఉందకపోతే ఆ చర్చల వలన ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ మాటలు కొందరికి రుచించకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు.
ఇక ఈచర్చలో నేను వ్రాయవలసింది ఏమీ లేదు.
హోమియోపతి వల్ల రోగం ఆలస్యంగా తగ్గుతుందని ఆ మందులు వాడినవాళ్ళందరికీ తెలుసు. రోగం ఆలస్యంగానైనా తగ్గుతుందని చెప్పి రోగులు ఎటూ పోకుండా చూస్తారు హోమియో వైద్యులు. మందుని నీళ్ళు లేదా ఆల్కహాల్‌లో కలిపితే దాని ప్రభావం పెరగడం అసంభవం అని ఫిజిక్స్ చదివిన ప్రతి విద్యార్థికీ తెలుసు. ఆ లెక్కన హోమియో వైద్యులకి కూడా ఈ నిజం తెలిసే ఉంటుంది. లక్షలు ఖర్చుపెట్టి హోమియోపతి చదివిన తరువాత ఆ నిజం ఒప్పుకుని వైద్యం మానేస్తే, కొత్తగా మళ్ళీ అల్లోపతి చదవడానికి డబ్బులు ఉండవు.
ReplyDeleteమార్కిష్ హెగెలిన్ బయ్యా. ఎందుకు వితండ వాదన చేస్తావు.హోమోపతి మందులు సరైన మందు ఇస్తే బ్రహ్మాన్ధంగా పనిచేస్తాయి. అయితే అవసరాన్ని బట్టి ఎదో ఒక పతి వాడుకుంటే మంచిది. అల్లోపతి ప్రధానమైనది.
ReplyDeleteWhole Foods Market | America's Healthiest Grocery Store లో హోమియోపతి మందులు అమ్ముతారు. క్రిందటి సంవత్సరం Amazon వీటిని కొన్నది. ఆ మందులు పనిచేస్తాయని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ReplyDeleteDilution increases ionization. Ions are very powerful and participate in all chemical reactions.I think this is the basis for homeopathy. At onetime I wanted to work on this using electron Paramagnetic Spectroscopy but did not get into this because of lack of sponsorship.
ReplyDeleteఒక ప్రభుత్వ PHCలో ఇచ్చిన అల్లోపతి మందులు వాడితే నాకు మూడు రోజుల్లో జలుబు, దగ్గు తగ్గిపోయాయి. ఇంత తొందరగా రోగం తగ్గించగలమని హోమియో వైద్యుడు గ్యారంటీ ఇవ్వగలడా? పచ్చ కామెర్ల వ్యాధి పసరు మందులకి కూడా తగ్గుతుంది. అలాగని ఒక ఎం.బి.బి.ఎస్. డాక్టర్ పసరు మందులు వేసుకోలేడు కదా.
Delete< పచ్చ కామెర్ల వ్యాధి పసరు మందులకి కూడా తగ్గుతుంది. >
Deleteఅలాంటపుడు ఆ పసరులో ఉన్న పవర్ ని అల్లోపతి అప్ డేట్ చేసుకోవాలి కదా? మా సిలబస్ లో లేదు కాబట్టి అశాస్త్రీయం అనడం సబబా?
ఒక మందులో ఏముందో తెలియకుండా ఏ డాక్టర్ దాన్ని రికమెండ్ చెయ్యగలడు? పసరు మందులు తయారు చేసేవాళ్ళు ఆ మందులో ఏముందో చెప్పరు. మనకి పచ్చ కామెర్లు వచ్చినప్పుడు మనం రిజిస్టర్డ్ డాక్టర్ దగ్గరకి వెళ్ళాలనుకున్నా, మనకి తెలిసినవాళ్ళు వద్దని చెప్పి మనల్ని పసరు మందులోడి దగ్గరకే పంపిస్తారు. మన ఇండియాలో నమ్మకాల ప్రభావం అంత ఉంది
Deleteరోగికి అవసరం అయిన మందులు మాత్రమే తయారుచేస్తే ఈ సమస్య రాదు. పసరు మందు తయారుచేసేవాళ్ళు అందులో ఏముందో చెప్పని పరిస్థితిలో ఉంటే అలాంటి వాడడంలో ఆయా రోగులు తగు జాగ్రత్తలు పాటించాలి. ఫార్మా కంపెనీల కోసం విదేశాలలో నిషేధించిన ఔషధాలను చాలావరకు పేద దేశాలలో డాక్టర్లు రోగులకు రికమండ్ చేస్తున్నారు. దీనికి పరిష్కారం పూర్తిగా ప్రజావైద్యవిధానం అమలు చేయడమే.
Deleteచట్ట ప్రకారం ఒక మందులో ఏముందో దాని పాకెట్ మీదే ప్రింట్ చెయ్యాలి. అలా ప్రింట్ చెయ్యని మందులు అమ్మితే అలా అమ్మినవాళ్ళని అరెస్ట్ చేసే అధికారం డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌కి ఉంటుంది. బత్తిన సోదరులు తమ చేప మందులో ఏముందో చెప్పకపోవడం వల్లే కదా ఇంత గొడవ జరిగింది. చివరికి వాళ్ళు కోర్టులో తమది ప్రసాదం మాత్రమే కానీ మందు కాదని చెప్పుకున్నారు. అది "ప్రసాదం మాత్రమే" అని బోర్డ్ పెట్టి అమ్మాలని కోర్ట్ తీర్పు చెప్పింది. అది ప్రసాదం మాత్రమే అని తెలిస్తే ఎక్కువ మంది రారు. చివరికి అలా ఏడ్చింది బత్తిన సోదరుల వ్యవహారం.
Deleteఒక దేశంలో నిషేధించినది మరోచోట చట్టబద్దం కావడం అంటేనే ఆ చట్టాలు ఎవడి పక్షాన ఉన్నాయో అర్ధం అవుతోంది. ఫార్మా కంపెనీలు తమ లాభం కోసం వైద్యవ్యవస్ధని భ్రష్టు పట్టిస్తున్నాయి. ఆసుపత్రులు, వైద్యుల సంఖ్య పెరుగుతోంది. అంతే రేటులో రోగాలు, రోగుల సంఖ్యా పెరుగుతోంది. ఎందుకు?
Deleteచట్టాలు, సైన్సుని అతిగా నమ్ముకోవడమూ అశాస్త్రీయమూ, అతివాదానికి దారి తీసే అవకాశాలున్నాయి. ప్రక్రుతికి మించిన సత్తా సైన్సుకి లేదు. సైన్సు ప్రక్రుతిలో ఒక భాగం మాత్రమే. నిజానికి సైన్సుని శాసించే సత్తా పెట్టుబడికి ఉంటుందేమో గానీ ప్రక్రుతిని శాసించే సత్తా పెట్టుబడికిగానీ, ఏ ఇజానికి గానీ ఉండదు. ఉండబోదు కూడా.
DeleteScience has precise but blind faith is not so. However, science and law are different matters. అమెరికా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశం. అయినా అమెరికాలో చదివిన ఎం.బి.బి.ఎస్. ఇండియాలో చెల్లదు కానీ ఇండియాలో చదివిన ఎం.బి.బి.ఎస్. అమెరికాలో చెల్లుతుంది. మందుల్లో కూడా అలాగే. ఇండియాలో నిషేధించబడిన మందులు శ్రీలంకలో లీగల్‌గా అమ్ముడుపోతాయి.
Deleteనిర్ధారణ, నిరూపణ అనేవి అవసరం.
Deleteప్రకృతి మనకి ఎన్నో ఇచ్చింది కాని వాటి ఉపయోగాలు మరియు ప్రమాదాలు తెలుసుకోవడం ముఖ్యం కదండి.
SCIENCE అన్ని DOCUMENT చేసి ఉంచుతుంది కావున నమ్మకం కన్నా నిజం, నిరూపణ ప్రాదాణ్యత గా ఉంటుంది.
ప్రకృతి ఇచ్చిన చాలా మంచిని కూడా SCIENCE గుర్తించింది, మిగిలిన వాటిని గుర్తించేటట్లు ఋజువులు చూపించాల్సిన భాద్యత, వాటిని నమ్మేవాల్లదే.
more over business is mother of acceptance (just like necessity is mother of invention
Now a days all products are coming with taglines like organic, herbal and natural
Wherever we need proofs, Science take an edge but when its belief NATURE is the MOTHER
కొండలరావు గారు ఈసారి మీరు కొత్త పోస్ట్ కి ఎందుకు బాగా సమయం తీసుకున్నారు?
Have a nice evening!!
ప్రక్రుతిలో సైన్సు ఓ భాగం మాత్రమే. సైన్సు తప్పులు చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఆ తప్పులను సరిదిద్దుకునే ధైర్యం కూడా సైన్సుకు ఉంటుంది.
Deleteపదే పదే ఒకే ఫలితం రావడం నిర్ధారణ క్రిందకే అంటే పరిశీలన, అనుభవం ఆధారంగా నమ్మకం కూడా సైన్సు ప్రాసెస్ లో భాగమే.
పెట్టుబడికి కట్టుబడే అవకాశం, దుర్గతి సైన్సుకు ఉండే అవకాశం ఉంటుంది కానీ ప్రక్రుతికి లేదు.
< మిగిలిన వాటిని గుర్తించేటట్లు ఋజువులు చూపించాల్సిన భాద్యత, వాటిని నమ్మేవాల్లదే. >
- exactly.
< కొండలరావు గారు ఈసారి మీరు కొత్త పోస్ట్ కి ఎందుకు బాగా సమయం తీసుకున్నారు? >
బిజీగా ఉన్నపుడు లేదా అలసటగా ఉన్నపుడు నా పనులలో మొదటిగా అన్యాయం జరిగేది పల్లెప్రపంచం బ్లాగుకు విసు గారు :) . ఇపుడైతే బిజినెస్ పనులతో బిజీగా ఉండడం వల్ల లేట్ అవుతోంది.
---- ఇండియాలో నిషేధించబడిన మందులు శ్రీలంకలో లీగల్‌గా అమ్ముడుపోతాయి. ---
Deleteఎందుకని? ఇక్కడో సైన్సు, అక్కడో సైన్సు ఉండదు కదా? సైన్సుని లాభాల కోసం పెట్టుబడి కట్టడి చేస్తోంది. ఇది సైన్సు తప్పు కాదు. మనిషి బుద్ధి తప్పు. వ్యవస్థ తప్పు.
సైన్సు అంతా ఒకటే అయినపుడు చట్టాలు కూడా ఒకే సైన్సుని ప్రోత్సహించాలి. కానీ చట్టం అలా ఉండడం లేదు. ఉండేలా చేయాల్సి ఉంది.
డాక్టర్ చర్మం మీద మచ్చలు చూసి అది బాక్టీరియల్ ఇన్‌ఫెక్షనా, వైరల్ ఇన్‌ఫెక్షనా అనేది చెప్పెయ్యగలడు. పసరు మందులు అమ్మేవాడు అది చెప్పలేడు. వాళ్ళ తాత పసరు మందులు అమ్మాడు కాబట్టి అతను కూడా అదే వ్యాపారం చేస్తాడు తప్ప అతనికి మైక్రొబయాలజీ తెలియదు. డాక్టర్‌కైతే మైక్రోబయాలజీ గురించి ప్రాథమిక అవగాహన ఉంటుంది. వ్యవసాయంలో కూడా కలుపు మొక్కల్ని చంపే మందులు వాడడం రిస్కీ పని. అవి ఎక్కువగా వాడితే భూసారం తగ్గిపోతుంది. అలాగని కలుపు మొక్కల్ని చంపకపోతే పంట సరిగా పండదు. మనం నోట్లో వేసుకునే మందులు కూడా కెమికల్సే. అవి వేసుకోవడం ఎప్పుడూ రిస్కే. అందులో ఎన్నిటిని పక్క దేశంలో నిషేధించారు అనే దానితో ఇక్కడ సంబంధం లేదు.
DeleteKondalaRao Garu,
Deleteఎవరో ఒక మహాకవి చెప్పినట్లు,
మనుష్యులందరు సమానమె,
కాని కొందరు ఎక్కువ సమానం :)
మందులువలన దుష్ప్రబావం ఉన్నప్పుడు ప్రపంచం అంతా నిశేదించాలి.
కాని ఎక్కువ సమానం ఉన్న (ఫాశ్చ్యాత్త/ధనిక) దేశాలలో మాత్రమే నిశేదించారు!!
అన్నిటికన్న ప్రమాదకరం DRUG MAFIA అన్నది నిజం!!
ఒక మందుని నిషేధించినా, నిషేధించకపోయినా దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉంటాయి. గవర్నమెంట్ డాక్టర్ పొరపాటున కూడా ఓవర్ ప్రిస్క్రిప్షన్ (అవసరం లేని మందులు) ఇవ్వడు. గవర్నమెంట్ హాస్పిటల్‌లో రోగులకి ఇచ్చిన మందులకి రికార్డులు మెయింటెయిన్ చేస్తారు. నేను గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే వైద్యం చెయ్యించుకుంటాను కనుక నాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం తక్కువ. అల్లోపతి వల్ల నాకు పెద్ద ప్రమాదం లేదు. హోమియోపతి వల్ల రోగం ఆలస్యంగా తగ్గుతుందని కొందరు హోమియో వైద్యులే చెప్పుకుంటున్నారు కనుక హోమియోపతిని నమ్ముకుని రిస్క్ తీసుకునే ధైర్యం నాకు లేదు.
Deletehttp://naprapamcham.blogspot.com/2009/04/blog-post.html?m=1
DeletePraveen garu I liked this line :) as it is TRUE :)
Deleteఒక మందుని నిషేధించినా, నిషేధించకపోయినా దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉంటాయి.
As per my close friend, working with The European Medicines Agency -->
Due to regular evolution and based on multiple studies, The European Medicines Agency with the consent of Medicines Evaluation Board and FDA continuously review the effect (might be adverse) of the medicine and sometimes when an alternate combination suits better then existing combination, bans the drug.
simply, when the effect is less than the adverse/side effect, then the drug will be banned :)
worth reading :)
https://www.rd.com/advice/travel/common-medications-banned-in-other-countries/
నేను చిన్నప్పుడు హోమియోపతి డాక్టర్లు వ్రాసే వ్యాసాలు పత్రికల్లో చదివేవాణ్ణి. హోమియోపతి వల్ల రోగం ఆలస్యంగా తగ్గుతుందని కొందరు హోమియోపతి వైద్యులే చెప్పుకున్నారు. వ్యవసాయం చేసేవాళ్ళలో మెరక భూమి ఉన్నవాళ్ళకి పని తక్కువ ఉంటుంది కానీ మాగాణి ఉన్నవాళ్ళకి పని ఎక్కువ ఉంటుంది. పని ఎక్కువ ఉన్నవాడైనా, తక్కువ ఉన్నవాడైనా రోగం తొందరగా తగ్గాలనుకుంటాడు, ఎక్కువ రోజులు మంచం మీద మందులు వాడుతూ ఉండి సమయం వృథా చేసుకోవాలనుకోడు.
Delete(Un)fortunately Banned in many Europe countries including UK..
ReplyDeleteThe Royal London Hospital for Integrated Medicine - formerly the Royal London Homeopathic Hospital - will stop providing NHS-funded homeopathic remedies in April.
Homeopathy is based on the idea that "like cures like", but scientists says patients are getting nothing but sugar.
Campaigners said the move was "hugely significant and long overdue".
FYI:
https://en.wikipedia.org/wiki/Regulation_and_prevalence_of_homeopathy
1. "అయినా అమెరికాలో చదివిన ఎం.బి.బి.ఎస్. ఇండియాలో చెల్లదు కానీ ఇండియాలో చదివిన ఎం.బి.బి.ఎస్. అమెరికాలో చెల్లుతుంది."
ReplyDeleteప్రవీణ్ : చెల్లదు. వరుసగా పరీక్షలు పాస్ అయితే కనీసం అయిదారేళ్ళు పడుతుంది డాక్టరుగా ప్రాక్టీస్ చెయ్యటానికి.
2. బుచికి చెప్పినట్లు: ఎవరికి ఇష్టమయిన మందులు వాళ్ళు వాడటం మంచిది.
మార్కిష్ హెగెలిన్ బయ్యా. ఎందుకు వితండ వాదన చేస్తావు.హోమోపతి మందులు సరైన మందు ఇస్తే బ్రహ్మాన్ధంగా పనిచేస్తాయి. అయితే అవసరాన్ని బట్టి ఎదో ఒక పతి వాడుకుంటే మంచిది.
3.హోమియోపతి మందుల వాడకానికి రీసెర్చ్ చేసిన ఫలితాల డేటాబేస్ ఇక్కడ ఉంది:
హోమియో రీసెర్చ్
http://www.greenmedinfo.com/blog/250-examples-natural-remedies-beating-pharmaceuticals?mc_cid=a69be4d1f6&mc_eid=3378281bac
ఉదాహరణలు:
http://www.greenmedinfo.com/therapeutic-action/homeopathic-treatment#
79 Diseases Researched for Homeopathic Treatment
Allergic Rhinitis
Diarrhea
Diarrhea: in Children
Vertigo
Breast Cancer: Recovery
Fibromyalgia
Hayfever
Influenza
Pain
Pollinosis
Postoperative Ileus
Psoriasis
Radiation Induced Illness
Sinusitis
Upper Respiratory Infections
Anxiety Disorders
Adenotonsillectomy
Aging
Aphthous Ulcer
Atopic Dermatitis
Atopic Dermatitis: Infant & Childhood
Breast Cancer
Bruising
Bug Bite
Bunion
Cancers: All
Carpal Tunnel Syndrome
Chemotherapy-Induced Toxicity
Chronic Fatigue Syndrome
Depression
Dysmenorrhea
హోమియోపతి మందులు కొన్ని రకాల జబ్బులకు లేదా వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తాయి. ఫార్మ కంపెనీలు స్రష్టించే మాఫియాలో అల్లోపతి సైన్సునే తారుమారు చేస్తున్న సందర్భంలో ఎవరి రిపోర్టులు నమ్మాలో, ఎలా నమ్మాలో సామాన్యులకు గందరగోళంగా ఉంటుంది. అల్లోపతిలో చాలా ప్రమాదాలున్నాయి. అయినా దాని ప్రయోజనాలను కాదనలేము. ఏ వైద్య విధానమైనా అంతే. ప్రపంచవ్యాపితంగా వైద్యం, మందుల తయారీ అనేది పెట్టుబడి చేతులలో లేకుండా ఉన్నపుడు మాత్రమే వైద్యంలో నిజానిజాలు నిక్కచ్చిగా బయటకు రావు.
ReplyDeleteఅల్లోపతి మందు పరిమాణం తగ్గించేసి దాన్ని హోమియోపతి మందు అని చెప్పి అమ్మితే ఆ మందు వల్ల ఏ రోగం తగ్గుతుంది? జలుబు అల్లోపతి మందులతో మూడు రోజుల్లో తగ్గుతుంది. జలుబు వచ్చినప్పుడు ఎవడైనా దగ్గరలోని అల్లోపతి డాక్టర్ దగ్గరకే వెళ్తాడు. బి.పి., సుగర్ లాంటి దీర్ఘ కాలిక రోగాలు ఏ మందులకీ తొందరగా తగ్గవు. వాటికి అల్లోపతి మందులు పని చెయ్యవని చెప్పి హోమియో వైద్యులు తమ దగ్గరకి జనాన్ని రాబట్టుకుంటారు. పచ్చ కామెర్లకి పసరు మందులు అమ్మేవాళ్ళ modus operandi కూడా ఇదే.
ReplyDelete