మనం పుట్టి పెరిగిన దానిని బట్టి మన మనసులో కొన్ని అభిప్రాయాలు, భావనలు ఏర్పడతాయి.
కొంత అలోచించి ఓ నిర్ధారణ కు వస్తాం. కొన్నింటి పట్ల నమ్మకాలూ ఏర్పరచుకుంటాం.
మన నిర్ధారణలు లేదా నమ్మకాలూ నిజం కావచ్చు. కాక పొవచ్చు.
వాదనకు లేదా చర్చకు దిగిన వ్యక్తి ఈ రెండు ధోరణులకు గురయ్యే అవకాశం ఉంది.
1) స్వీయ మానసిక ధోరణి 2) వస్తుగత విధానం
ఇందులో మొదటిది మన నమ్మకాలూ విశ్వాసాలు ఆధారంగా వాదించడం. కాగా రెండోది కార్య కారణ సంబంధాలను ఆలోచిస్తూ భౌతిక పరిస్తితులను బట్టి వాదించేది.
మొదటి రకం వారు నేను నమ్ముతున్నాను కాబట్టి అదే రైటంటారు. రెండో రకం వారు నేను రైట్ అని నిర్ధారించుకున్నాను కాబట్టి వాదిస్తున్నానంటారు.
ఈ రెండింటిలో ఏ వాదన పధ్ధతి సరయినది ?
- Palla Kondala Rao
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
>>నేను రైట్ అని నిర్ధారించుకున్నాను కాబట్టి వాదిస్తున్నానంటారు.
ReplyDeleteనేను ఆ రకం .
అవును. మీరు ఆ రకమే :))
Delete:))
Deleteఎవరైనా తమకి తెలిసినదే చెపుతారు. కొంత మందికి నిజం తెలిసిన తరువాత కూడా ఏవో కారణాల వల్ల అది ఒప్పుకోరు. ఉదాహరణకి భారతీయ జ్యోతిషులు ఇప్పటికీ భూకేంద్రక సిద్ధాంతాన్నే నమ్ముతారు. వాళ్ళకి సూర్యకేంద్రక సిద్ధాంతం తెలిసినా వాళ్ళు తమ శాస్త్రంలో మార్పులు చేసుకోలేక అడ్డమైన వాదనలు చేస్తారు. ఒక టివి చానెల్‌లో ఒక జ్యోతిషుడు ఇలాగే వాదించాడు "భూమి సూర్యుని చుట్టు తిరుగుతోందని మాకు తెలుసు, మేము నమూనా కోసమే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని చెపుతున్నాం" అని. ఆ జ్యోతిషుణ్ణి ఇన్నయ్య గారు ఎంత అడిగినా అతను ఇదే సమాధానం చెప్పాడు.
ReplyDeleteపాములు సూర్యుడ్ని చంద్రుడ్ని పరపరా నమిలేశాయని, ఎంత చదివినా నమ్మేవాళ్ళున్నారు. దేవుడు అనే అజ్ఞానానికి.. విజ్ఞానులు ఎంతభయపడుతున్నారో(భయపెట్టారో) కదా!
Deleteసూర్యగ్రహణం గురించి సంచలన విషయాలు|| Solar Eclipse || Teenmar Mallanna ||Qnews
ReplyDeletehttps://youtu.be/YfiVgXDV77o