ప్రకృతి జీవన విధానం ద్వారా గ్రామీణాభివృద్ధి సాధన : జాగ్రత్తగా గమనిస్తే మనిషికి రెండే రెండు సంబంధాలున్నట్లు తెలుస్తాయి. 1) ప్రకృతితో సంబంధం 2) సాటి మనుషులతోటి సంబంధం. మనిషి ప్రక్రుతికి దగ్గరగా, ప్రక్రుతిని సంరక్షించేలా తన జీవన విధానంను అలవాట్లను మార్చుకునేలా పల్లెప్రపంచం కృషి చేస్తుంది. ప్రపంచ వ్యాపితంగా గ్రామాల కూడలి ద్వారా భారతీయ నినాదం వసుధైక కుటుంబం లా పల్లెప్రపంచం ఏర్పాటుకు కృషి చేద్దాం. వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ఆరంభం అవుతుంది కదా. ప్రకృతి జీవన విధానం, ప్రకృతి వ్యవసాయం కొరకు మావంతు ప్రయత్నాలు చేస్తూ గ్రామాల అభివృద్ధికి తోడ్పడతాం.
ముద్రణ అంతర్జాల పత్రికల ద్వారా వ్యక్తిగత చైతన్యం : మనిషికి తెలుసుకోవాలన్న ఆసక్తి అత్యంత సహజమైనది. మనిషి చైతన్యాన్ని పెంచుకోవడానికి క్యూరియాసిటీ ఓ కారణం. మనిషి మెదడుపై మంచి భావాల ప్రభావం పడితే మరింత మెరుగైన మానవవనరులు ఏర్పడతాయి. ఆ దిశగా సమాజంలో మంచి భావాలను పెంపొందించేందుకు ఆన్లైన్ మేగజైన నిర్వహించాలనేది మా సంకల్పం. ఈ బ్లాగు కూడా దానిలో భాగంగానే వాడుతున్నాము.
శిక్షణలు, అధ్యయనం, స్టడీ సర్కిల్స్ ద్వారా వ్యక్తి చైతన్యం : మనిషిలోని మనీషిని వెలికి తీయడానికి ఈ మూడు కార్యక్రమాలు ఉపయోగపడతాయి. ప్రతి ఆదివారం చొప్పకట్లపాలెంలో స్టడీసర్కిల్ కార్యక్రమం నడుపుతున్నాము. దీనిని బ్లాగు ద్వార కూడా విస్తృత పరచాలని భావిస్తున్నాము. ఇప్పటిదాక నడుస్తున్న ఈ కార్యక్రమం స్థాయిని పెంచేందుకు ఒక ‘అధ్యయన కేంద్రం’ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. మనిషికి, ప్రకృతికి ఉపయోగపడే వివిధ అంశాలపై ప్రొజెక్టర్ ద్వార శిక్షణా కార్యక్రమాలను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. యూట్యూబ్ చానల్ ని కూడా ఇందుకు ఉపయోగించాలని భావిస్తున్నాము.
సాంప్రదాయ వైద్య విధానాలపై అవగాహన, చికిత్సా కార్యక్రమాలు : తరతరాలుగా అనేక విధాలుగా ఉపయోగ పడుతున్న ప్రకృతి జీవన విధానం, యోగా, ధ్యానం, మూలికా వైద్యం, ఆక్యుపంచర్, ఆయుర్వేదం, నాడీ చికిత్స వంటి సాంప్రదాయ వైద్య విధానాలలోని అద్భుత విషయాలపై ఆయా రంగాలలో అనుభవజ్ఞుల చేత అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా మనిషి శరీరానికి ఉన్న సహజమైన రోగనిరోధక శక్తిని పెంచడానికి కృషి చేయాలనేది ఓ లక్ష్యం. పెట్టుబడిదారీ విధానంలో వైద్యం ఖరీదైన సరుకుగా మారిన నేపధ్యంలో నేటి అల్లోపతి డామినేటెడ్ సొసైటీలో ఈ రంగాలు కనుమరుగు కాకుండా కాపాడుకోవలసిన అవసరం మనందరిపైనా ఉన్నది. అల్లోపతి విదానాన్ని అత్యవసరాలకు వాడుకుంటూ ప్రతి దానికి మందులపైననే ఆధారపడకుండా అన్ని వైద్య విధానాలలోని మంచిని కాపాడుకుందాం.
పేదరికం, మహిళాభ్యుదయంపై అవగాహన, సహాయ కార్యక్రమాలు : వనరులను పాజిటివ్ గా వినియోగించుకుంటూ పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేయడం ఓ కర్తవ్యంగా పెట్టుకున్నాము. దీనికి సంబంధించిన వివిధ అవకాశాలను తెలియజేయడం, మహిళా శక్తిని సమాజ నిర్మాణంలో ఉపయోగపెట్టేందుకు కృషి చేయడం మరో కర్తవ్యం. టాలెంట్ ఉండి ఆర్దిక స్తోమత లేని వారికి శక్తిమేరకు ఆర్ధిక సహకారం అందిండం ద్వారా ప్రోత్సాహం అందించవచ్చు.
ఉత్పాదక, మార్కెటింగ్ రంగాల ద్వారా ఉపాధి కల్పన : చక్కని ఆలోచనలు ఉన్నా ఆర్ధికవనరులు లేక అనేక మంచి ఆలోచనలు ఆచరణలోకి రావడం లేదు. ఏ పని చేయాలన్నా వ్యక్తుల సమూహం, సహకారం ఉంటే ప్రగతి ఉంటుంది. ప్రార్ధించే పెదవుల కన్నా, నీతులు చెప్పే నోటి కన్నా, సహకరించే చేతులే ఎప్పుడూ మిన్నా. సహకారం అందించాలంటే మనం ఆర్ధికంగా నిలదొక్కుకుని ఉంటేనే సాధ్యం. అందుకే మార్కెటింగ్ రంగం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది ఓ లక్ష్యంగా పెట్టుకున్నాము.
పల్లెప్రపంచం ఫౌండేషన్ కార్యక్రమాలు అన్నీ ఈ బ్లాగులో ఉంచేందుకు ప్రయత్నిస్తాము. మా కార్యక్రమాలకు ఆర్ధిక, హార్ధిక సహకారం అందించాలని విజ్ఞప్తి. ఆర్ధిక సహకారం అందించాలనుకునే వారు ఏడాదికి ఒక్క రూపాయికి పైన మీ శక్తి మేరకు డొనేట్ చేయగలరు. మరింతమంది చేత డొనేట్ చేయించగలరు. ప్రతి చిన్న సహాయం మాకు చాలా విలువైనది. డొనేషన్ వివరాల లిస్ట్ కోసం ఇక్కడ నొక్కండి.
- పల్లా కొండలరావు, అధ్యక్షులు
పల్లెప్రపచం ఫౌండేషన్
*Republished post
bagundi mee vision ...nenu elanti project prepare chestunna...mee list lo vunna anni naa list lo vunanduku naku chala santosham ga vundi....updates regular ga post cheyagalaru....
ReplyDeleteThank You Sampath Kumar garu.
Deleteచాలా బాగుంధి
ReplyDeleteధన్యవాదములు vj గారు.
Delete