'గోరింటాకు' సినిమాలోని హిట్ సాంగ్ ఇది . 

  • ఈ పాట లో నటీనటులు శోభన్ బాబు , సుజాత ఇరువురు మన మధ్య లేరు. 
  • కానీ ఇలాంటి మంచి పాటల ద్వారా వారు ఎల్లప్పుడు మన మధ్యనే ఉంటారు. 
  • ఈ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ను మీరూ మరోసారి వినండి.

1979లో విడుదలయిన 'గోరింటాకు' సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా, యువచిత్ర మురారి నిర్మించారు. ఈ సినిమాలోని పాటలన్ని హిట్ అయ్యాయి. ఈ పాటను వేటూరి వ్రాయగా బాలు-సుశీల గానం చేశారు. కె.వి.మహదేవన్ సంగీతం అందించారు. కథకు అనుగుణంగా హీరో-హీరోయిన్ల మనసులోని భావాలను పలికించిన తీరు, పాట చిత్రీకరణ , సాహిత్యం , శోభన్ బాబు-సుజాతల నటన హుందాగా ఉంటుంది. సినిమా చూస్తూ గమనిస్తే ఈ పాట నేపథ్యం ఏమిటో, ఎందుకంత హిట్ అయిందో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ గా ఉంటున్నదో ఇంకా బాగా అవగతమవుతుంది. ఇప్పట్లో ఎపుడో తప్ప ఇలాంటి ఆణిముత్యాలను నటన, చిత్రీకరణలను చూడలేకపోతున్నామనేది నా అభిప్రాయం.
కొమ్మకొమ్మకో సన్నాయి ....కోటి రాగాలు ఉన్నాయి.....
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం..........
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం...........
కొమ్మకొమ్మకో సన్నాయి..... కోటి రాగాలు ఉన్నాయి......
మనసులో ధ్యానం మాటలో మౌనం.....
మనసులో ధ్యానం మాటలో మౌనం......
మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పసితనాల తొలి వేకువలో ముసురుకున్న మబ్బులు చూడు
అందుకే ధ్యానం..... అందుకే మౌనం.....
కొమ్మకొమ్మకో సన్నాయీ......
కొంటే వయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
కొంటే వయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు
వురకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి వుండాలి
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి వుండాలి
ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి
అందుకే ధ్యానం అందుకే మౌనం
అందుకే ధ్యానం అందుకే మౌనం
కొమ్మకొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
మనసులో ధ్యానం మాటలో మౌనం
కొమ్మకొమ్మకో సన్నాయీ...
********************************
*Republished
నాకు నచ్చిన పాటలు

Post a Comment

  1. మంచి పాట పరిచయం చేసారు. జస్ట్ ఒక గంట క్రితం పవర్ కట్ అయినప్పుడు ఈ పాట ప్లే చేసుకుని విన్నానండీ!
    ఒడ్డుతోను,నీటి తోనూ పడవ ముడి పడి ఉండాలి..
    ఎప్పుడో ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి.. వింటూ.. ఆలోచించాను. గ్రేట్ లిరిక్స్.
    శోభన్ బాబు గారు..మా వూరి మనుమడు అండీ! (కుంటముక్కల)

    ReplyDelete
    Replies
    1. మీరీ సినిమాపై మంచి విశ్లేషణ రాశారు గతంలో. శోభన్ బాబు గారు మీ వూరి మనవడన్న విషయమీ సందర్భం గా తెలుసుకున్నాను. మంచి సాహిత్యం - నటీ నటుల హుందా అయిన హావ భావాలు - పాట చిత్రీకరించిన ప్రదేశం అన్నీ బాగుంటాయండీ. స్పందనకు ధన్యవాదాలు వనజ గారు.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top