మతం వల్ల మనిషికి జరిగే/జరిగిన 
మేలు/ కీడు ఏమిటి?

- Palla Kondala Rao,
-------------------------------------------------------- 

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. నిజానికి మతం వల్ల కీడు జరగదు . మతతత్వం నింపుకున్న మనిషి వల్ల కీడు జరుగుతుంది .

    ReplyDelete
  2. మతం వల్ల ప్రజలుకు మేలు జరగదు కాని మత పెద్దలకు రాజీకీయనయకులకు మేలు జరుగుతుంది

    ReplyDelete
    Replies
    1. మతం అనేది ఒక మోసం. మోసగాడికి ఎన్నడూ కీడు జరగదు. మోసగాణ్ణి నమ్మేవాడికే కీడు జరుగుతుంది.

      Delete
    2. మతం మోసం కాదు. మతం ఓ నమ్మకం. మతంను మోసం చేయడానికి ఉపయోగించడం వేరు. మతం పట్ల నమ్మకం కలిగి ఉండడం వేరు.

      Delete
    3. కరోనాని అంతం చెయ్యడానికి ప్రార్ధనలు చేసిన ఒక చర్చ్ పాస్టర్ కరోనా వచ్చి చనిపోయాడు. లేనిదాన్ని ఉన్నట్టు నమ్మితే జరిగేది కీడే కదా.

      Delete
    4. మావోయిస్టు రాజ్యాన్ని తెస్తామని చెప్పిన నక్సలైట్లు కాల్పుల్లో చనిపోతున్నారు. పసలేని సిద్ధాంతాలని నమ్మి చెడిపోతే చివరికి మిగిలేది కీడే కదా.

      Delete
    5. ఆ చర్చ్ పాస్టర్ తాను ప్రాణ త్యాగం చేస్తానని చెప్పుకోలేదు. తనకి చావు నిజంగా రాదనుకున్నాడు.

      Delete
    6. ఆ నక్సలైట్ కూడా తాను చనిపోతానని చెప్పలేదు. చనిపోతానని అనుకోనూ లేదు.

      Delete
    7. బతకడానికి గ్యారంటీ ఇస్తే దాన్ని యుద్ధం అనరు. పాకిస్తాన్ బోర్డర్‌లో కాపలా కాసే సైనికుడు కూడా తనకి చావు రాదని చెప్పుకోడు.

      Delete
    8. మతం మనిషిని మోసం చేస్తుందని మార్క్స్ చెప్పలేదు ప్రవీణ్ గారూ. మార్క్స్ చెపితే చెప్పాలని కాదు గానీ, మీరు మార్క్సిష్టునంటుంటారు కదా? అందుకు చెపుతున్నాను.మతం మనిషికి ఓదార్పునిస్తుందని మార్క్స్ చెప్పాడు అని నాకు తెలిసిన సమాచారం.

      మతం అంటే మీరిచ్చే నిర్వచనం ఏమిటి? అనవసర ఉదాహరణలు గాకుండా సూటిగా చెప్పగలరా?

      నిజమైన మానవత్వం విలసిల్లినపుడు మతం దానంతట అదే రద్దవుతుంది. మతంతో పోరాడడం మూర్ఖత్వంతో సమానమేనని నా అభిప్రాయం. మతోన్మాదంతో పోరాడడంలో, మతంలోని దురాచారాలతో పోరాడడంలో మతస్తులు అందులోని ఉదారవాదులు కూడా అంగీకరిస్తారు. అసలు మతాన్నే తప్పు అనడం తప్పు. మతం అంటే జీవన విధానం అనవచ్చు సింపుల్ గా. మతం అవసరం లేని జీవన విధానం ఏర్పడినపడు, మానవ చైతన్యం అంతగా అభివద్ధి చెందినపుడు అంటే మనిషి మనిషిని సంపూర్ణంగా నమ్మగలిగిన పరిస్థితులు ఏర్పడినపుడు తప్ప మనిషికి మతం అవసరం ఉంటూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో.

      Delete
    9. పెయిన్ కిల్లర్స్ కూడా మనిషికి ఓదార్పుని ఇస్తాయి. కానీ అవి ఎక్కువ రోజులు వాడితే మనిషి చస్తాడు, పెయిన్ కిల్లర్‌ని ప్రిస్క్రైబ్ చేసే డాక్టర్ కూడా నొప్పి తగ్గిన తరువాత పెయిన్ కిల్లర్ మానెయ్యమంటాడు. మనిషి పుట్టించిన వ్యవస్థ మనిషికే ప్రమాదకరంగా మారకుండా చూసుకోవాలి.

      Delete
    10. @प्रवीणApril 27, 2020 at 4:04:00 AM GMT+5:30
      మనిషి పుట్టించిన వ్యవస్థ మనిషికే ప్రమాదకరంగా మారకుండా చూసుకోవాలి.

      hari.S.babu
      మార్క్సిజాన్ని నమ్మినవాడు ప్రాణం కోల్పోతున్నాడంటే అది కూడా తను నమ్మిన సిద్ధాంతం తనకి హాని చేస్తున్నట్టే కదా!తనకి ప్రమాదం తెచ్చిపెట్టే సిద్ధాంతాన్ని ఏ మనిషైనా ఎందుకు పాటించాలి?

      Delete
    11. < పెయిన్ కిల్లర్స్ కూడా మనిషికి ఓదార్పుని ఇస్తాయి. కానీ అవి ఎక్కువ రోజులు వాడితే మనిషి చస్తాడు, >

      పెయిన్ కిల్లర్స్ ని సృష్టించి సైన్సు తప్పు చేసిందందామా?

      < పెయిన్ కిల్లర్‌ని ప్రిస్క్రైబ్ చేసే డాక్టర్ కూడా నొప్పి తగ్గిన తరువాత పెయిన్ కిల్లర్ మానెయ్యమంటాడు. మనిషి పుట్టించిన వ్యవస్థ మనిషికే ప్రమాదకరంగా మారకుండా చూసుకోవాలి. >

      మతం పట్ల చేయవలసింది కూడా అదే. మానవచైతన్యం కూడా పరిణామాత్మకమూ మరియూ సాపేక్షమూ అని గుర్తుంచుకోవాలని నా అభిప్రాయం.

      Delete
    12. @hari.S.babu
      War is a policy under capitalism but capitalists wish to continue war despite loss of lives.

      Delete
    13. కొండలరావు గారు, మతం పేరుతో చందాలు వసూలు చేసుకుని బతికే పాస్టర్‌లు కూడా మతంలో మంచి ఉందా, లేదా అని చర్చించడానికి ఇంత ఆరాటపడరు. దేవుడు అనేవాడు లేనప్పుడు మతంలో మంచి ఉందా లేదా చెడు ఉందా అనేది దేవుణ్ణి నమ్మేవాళ్ళు కూడా పట్టించుకోరు. అందుకే నీలి చిత్రాలు ఆడే థియేటర్లకి సీతారాముల పేర్లు, శివపార్వతుల పేర్లు పెడుతుంటారు.

      Delete
    14. ప్రవీణ్ గారూ!

      మతం గురించి ఆలోచించడమంటే మనుషుల గురించి ఆలోచించడమే. మనిషి అంటేనే మనసు ప్రధానమైన జీవి. మనిషి యొక్క ఆలోచనా విధానమే మనసు. మనిషి చింతనకు ఆఖరి అనుమానం వరకు సంతృప్తి పరచగలిగిన సమాధంనం చెప్పినపుడే సైన్సు విలువ పెరుగుతుంది. పలితం ఉంటుంది. అంతవరకూ విపరీత వాదనలు, మూఢ వాదనలు చేయడం వేరు. మతాన్ని అడ్డు పెట్టుకుని బ్రతకడం, మోసం చేయడం, ఆధిపత్యం ప్రదర్శించడం వేరు. మతాన్ని అర్ధం చేసుకోవడం వేరు.ఆధిపత్య ధోరణులు, కుట్రలు, కుతంత్రాలు, కెరీరిజం వంటి దుర్మార్గాలు ఇజాల నీడలో పెత్తనం చెలాయించే నాయకులలోనూ ఉంటుంది. దానిని బూచిగా చూపి ఇజాన్ని విమర్శించడం సరైనదంటారా? ఒక ఇజాన్ని తెలుసుకుని అంగీకరించపోవడం వేరు. తెలియకుండా విమర్శించడం వేరు కదా. అలాగే మతాన్ని మనం అర్ధం చేసుకోవడానికి ఆరాటపడడం కాదు. మతం అవసరం మనిషికి ఏముంది? దానికంటే ఎక్కువ ప్రయోజనం సైన్సు ఇవ్వగలిగితే ఆలోమేటిక్ గా మతం అవసరం తీరితే మతమౌఢ్యం ఎగిరిపోతుంది. మానవత్వమనే మతం మిగులుతుంది. సైన్సుని సామాన్యులకు సైతం అర్ధం అయ్యేలా చెప్పగలిగే బోధకుల సంఖ్య పెరగాలి. విప్పిచెప్పడం , కప్పిచెప్పడం అని రెండు రకాలు. నాకు జ్ఞానం ఉంది కదా అని పాండిత్యంతో, పామరులకు అర్ధం కాని రీతిలో చెప్పడం వల్ల ఆ స్థాయిలో కొందరికే యూజ్ అవుతుంది. ఇది కప్పిచెప్పడం. అదో పైత్యం అని నా భావన. మంచి ఉదాహరణతో వేమన లా ప్రజాభాషలో చెప్పగలిగితే సామాన్యులకు సైతం అర్ధం అవుతుంది. అది విప్పిచెప్పడం. దానివల్ల ఫలితం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఉత్పత్తి చేసేది సామాన్యులే తప్ప మేధావులు కాదు. చైతన్యం పెంచాల్సినది ఎక్కువగా శ్రమజీవులకే నని నా అభిప్రాయం.

      Delete
    15. https://palakmathur.wordpress.com/2009/05/27/everyone-has-the-right-to-be-ignorant-by-sri-sri-ravi-shankar/.

      ఆర్ట్ అఫ్ లివింగ్ శ్రీ శ్రీ గారు చెప్పిన మాట 'everyone-has-the-right-to-be-ignorant ' లింకు ఇస్తున్నాను. @ ప్రవీణ్ గారు.

      కొండలరావు గారి వ్యాఖ్యలు చాలా అర్థవంతం గా ఉన్నాయి. అభిప్రాయ భేదాన్ని ఇంత బాగా వ్యక్తపరచవచ్చు అనేది ఆయన వ్యాఖ్యలలో తెలుస్తుంది.

      Delete
    16. రాముడు ఏకపత్నీకుడు అని నమ్ముతూ బ్లూ ఫిల్మ్‌స్ ప్రదర్శించే థియేటర్‌లకి సీతారాముల పేర్లు పెట్టేవాళ్ళకి మతంలో మంచి ఉందా, లేదా అనేది కూడా అనవసరమే కదా. అజ్ఞానంలో బతకాలనుకునేవాళ్ళు అలా బతకొచ్చు. దానికి మంచి/చెడు లాంటి పేర్లు అనవసరం.

      Delete
    17. @praveen
      War is a policy under capitalism but capitalists wish to continue war despite loss of lives.

      har.S.babu
      You are not catching my point.I know bankers need war for getting profits from both sides!What profit will marxism will give to me if I follow it?as you are finding error with religion saying, "మనిషి పుట్టించిన వ్యవస్థ మనిషికే ప్రమాదకరంగా మారకుండా చూసుకోవాలి." - how could you justify dying in the war(dying in a war is also dangerous to the marxist, just as you suggest following a religion with ignorance) , which "is a policy under capitalism but capitalists wish to continue war despite loss of lives."

      Delete
    18. సంఘర్షణ లేకుండా మార్పు రాదని మార్క్సిస్ట్‌లందరికీ తెలుసు. ఎవరూ పోలీస్ ఫైరింగ్‌లో చావకుండా కొత్త సమాజాన్ని స్థాపిస్తాం అని విప్లవకారులు ఎవరైనా చెప్పుకున్నారా?

      Delete
    19. సంఘర్షణ అంటే చంపడం,చావడం కాదు.

      Delete
    20. ఏకూర చెయ్యాలో మీ ఆవిడతో సంఘర్షణ పడి, చివరికి ఆమెకిష్టమైనదే చెయ్యడానికి ప్రాణనష్టమవసరంలేదు.😊

      Delete
    21. ఒక సిధ్ధాంతమో, మతమో బహుళజాతిపై మోపాలంటే ప్రాణనష్టం తప్పని సరి.

      Delete
    22. కొండలరావు గారు, అమెరికన్ విప్లవం ఎవరూ చావకుండా వచ్చిందా, ఫ్రెంచ్ విప్లవం ఎవరూ చావకుండా వచ్చిందా? చరిత్రని పూర్తిగా మరిచినట్టు ఉన్నారు!

      Delete
    23. విప్లవం అంటే చంపడం, చావడం కాదు. మౌలికమైన మార్పు.

      Delete
    24. కొండలరావు గారు, రాయలసీమ ఫాక్షన్ లీడర్ అనుచరుడు ఐదు వేలు కిరాయికి హత్య చేస్తాడు తప్ప చంపడమో, చావడమో అతనికి కూడా సరదా కాదు. కాన్‌ఫరెన్స్ హాల్‌లో విప్లవం గురించి ఉపన్యాసాలూ దంచితే విప్లవం రాదు. చావుకి తెగించి పోరాడితేనే విప్లవం వస్తుంది.

      Delete
    25. < చావుకి తెగించి పోరాడితేనే విప్లవం వస్తుంది. >

      ఇది మాత్రం కరెక్టుగా చెప్పారు. పోరాడేవానికి ఈ లక్షణం ఉండి తీరాలి. కానీ చావడానికో, చంపడానికో మాత్రమే గాక విప్లవంలో పాల్గొనాలనుకునేవారు దీనికి సైతం సిద్ధపడి ఉండాలి. పిరికితనంతో ఉంటేనో, ఉపన్యాసాలు దంచి అవసరమైనపుడు జారుకుంటేనో విప్లవకారుడు కాలేడు.

      Delete
    26. "చావుకి తెగించి పోరాడితేనే విప్లవం వస్తుంది"

      3 సవరణలు/వ్యాఖ్యలు (for your comments please):

      1. తప్పకుండా వస్తుంది అనలేము, ఇతర పారామీటర్లు అనుకూలిస్తే రావచ్చును.

      2. గ్లామర్ కోసమో, ఆశయాల కోసమో కొట్లాడే వాళ్ళు సఫలం కావడం అరుదు. కొట్లాటకు స్ఫూర్తి అనివార్యత అయితేనే ఫలితం సిద్దించే అవకాశాలు మెండు.

      3. కింది మూడింట కనీసం రెండు ఉంటేనే తెగించే ప్రోద్బలం జాస్తి:

      Loss of keeping quiet = high or very high
      Probability of success = medium or high
      Benefit if successful= high or very high

      Delete
    27. చావుకి తెగించి పోరాడితేనే విప్లవం వస్తుంది.
      Eg : KCR

      Delete
    28. Watch Chandrayya's murder scene and subsequent scenes in Kubusam movie.

      Delete
  3. ఫేస్‌బుక్‌లో కొత్త రకం వితండవాదం ఉంది. "మారెమ్మ అనేది దళిత దేవత అట, మహమ్మారి అనే పదం దళితుల్నీ & స్త్రీలనీ కించపరిచే విధంగా ఉందట!". మహమ్మారి అనే పదం ఉపయోగించి పాట వ్రాసినందుకు సుద్దాల అశోక్ తేజ అనే బి.సి. రచయితనే తిట్టి అతను ఆ పాటని ఉపసంహరించుకునేలా చేసారు. సంస్కృతంలో మహామారీ అంటే ఎక్కువ మందిని చంపేది. దానికి మారెమ్మతో సంబంధం లేదు. మతాన్ని నమ్మడం బానిస సంస్కృతి అని భావించే మార్క్సిస్ట్‌లు కూడా ఈ ఫాల్స్ ఎటిమాలజీస్‌ని సమర్థించడం చూసాను. శివారెడ్డి సరస్వతీ దేవి పేరుతో వచ్చిన అవార్డ్‌ని తీసుకున్నప్పుడు విమర్శించినవాళ్ళలో నేను కూడా ఉన్నాను. "సరస్వతీ దేవి నిజంగా లేదు కానీ ఎల్లమ్మ, మారెమ్మ లాంటి గ్రామ దేవతలు మాత్రం ఉన్నారు" అని వాదిస్తే అదేదో సినిమాలోని బ్రహ్మానందంలాగ పిచ్చెక్కి బట్టలు చింపుకోవాలి.

    ReplyDelete
    Replies
    1. @ pravin,
      మతం అంటే మీరిచ్చే నిర్వచనం ఏమిటి? అనవసర ఉదాహరణలు గాకుండా సూటిగా చెప్పగలరా?

      Delete
    2. Religion is a primitive belief which is not fit for advanced civilisation. If you want my definition in one sentence, I quote this one.

      Delete
    3. Agree with you. Religion is essential for civilization and not for advanced civilization.

      Delete
    4. మతం అంటే కొన్ని నమ్మకాలతోపాటు, కొన్ని అవసరాలతో కూడిన జీవన విధానం. దేవుడిని నమ్మని మతాలు కూడా ఉన్నాయి.

      Delete
    5. దేవుణ్ణి నమ్మని మతాలు ఎక్కడున్నాయి? సాంఖ్యులు దేవుడు లేడని మొదట్లో వాదించి తరువాత హిందు మతంలో కలిసిపోయారు. బౌద్ధులు దేవుడు లేడని వాదించి చివరికి బుద్ధుడినే దేవుణ్ణి చేసారు.

      Delete
  4. >>మతం పట్ల చేయవలసింది కూడా అదే. మానవచైతన్యం కూడా పరిణామాత్మకమూ మరియూ సాపేక్షమూ అని గుర్తుంచుకోవాలని నా అభిప్రాయం.>>>

    మతం పట్ల చేయవలసినది చేయలేదు కాబట్టే సంఘర్షణ జరుగుతోంది. మానవ చైతన్యం పెరిగి దైవాన్ని ప్రశ్నిస్తున్నారు.ఇది ఒక పరిణామం. మతం వల్ల సమిష్టితత్వం ఏర్పడుతుంది.అది అత్యంత అవసరం. సమిష్టితత్వమంటే నక్సలైట్ చనిపోయినా పర్వాలేదు కానీ సాధువులు చనిపోతే ఘోరం అని మొత్తుకోవడం మాత్రం కాదు.

    ReplyDelete
  5. హిందు మతంలో కుల వ్యవస్థ ఉంది. నీతి విరుద్ధమైన కుల వ్యవస్థని నమ్ముతూ దొంగతనాలు చెయ్యకూడదు, అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు లాంటి కొన్ని నీతుల్నే బోధిస్తే ఏమి లాభం? అందాల పోటీల్లో ఆడవాళ్ళని బికినీల్లో చూపించేవాళ్ళు "బేటీ బచాఓ, బేటీ పఢాఓ" అంటే ఎంత మంది అర్థం చేసుకుంటారు? విశాఖపట్నంలో అందాల పోటీలు నిర్వహించేవాళ్ళు ఇలాగే "బేటీ బచాఓ" అని బేనర్లు పెడితే "అందాల పోటీలు బేటీ బచాఓ నినాదానికి వ్యతిరేకం" అని ఒక మహిళా సంఘంవాళ్ళు గొడవ చేసారు. ఇంద్రుడు ఋషిపత్నులని చెరిచే కథల్ని హిందు పురాణాల నుంచి తొలిగించకుండా "వ్యభిచారం మహా పాపం" అని ఎలా ప్రబోధిస్తారు?

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top