ఒక విషయంపై ఎక్కువ అవగాహన పొందాలన్నా, ఎక్కువ ప్రయోజనం పొందాలన్నా మనం చేయాలసిన పనిని మెరుగుపరచే టెక్నిక్ ఇది. 'పిన్నీసు సూత్రం' అనేది నేను పెట్టిన పేరు. మీ ఇష్టమొచ్చిన పేరుతో ఈ సూత్రాన్ని ఉపయోగించండి. అందరికీ తెలిసిందే. ఆచరణలో పెట్టడానికి మరోసారి గుర్తు (రివిజన్) చేసేందుకు ఈ టపా ఉపయోగపడుతుందంతే.
మనం 20 మందిని ఒకచోట ఉంచి వారందరికీ పేపర్, పెన్ ఇచ్చి ఒక పిన్నీసు వలన ఎన్ని ఉపయోగాలున్నాయో వ్రాయమన్నామనుకుందాం. ఒక్కొక్కరు వారికి తెలిసిన ప్రయోజనాలు వ్రాస్తారు. ఇందులో వారు పిన్నీసుని ఉపయోగించినవి, చూసినవి, వారి ఊహకు వచ్చినవి వ్రాస్తారు. ఇలా వ్రాసినవాటిని అన్నింటినీ తీసుకుని ఎవరు ఎన్ని ఉపయోగాలు వ్రాశారన్నది లెక్క తీద్దాం. పిన్నీసుతో చేసే పనులను సగటున ఒక్కొక్కరు 15 పనులను వ్రాశారనుకుందాం. 20 మంది సమూహం కలిపి మొత్తం 300 ప్రయోజనాలను వ్రాస్తారు కదా!
ఒకే పనిని పలువురు వ్రాసే అవకాశం ఉంటుంది. పిన్నీసుతో కాలిలో గుచ్చుకున్న ముల్లును తీయవచ్చు, చొక్కా గుండీ ఊడినపుడు దానికి బదులుగా పిన్నీసును వాడవచ్చు..... ఇలా కొద్దిమంది కామన్ గా వ్రాసే ప్రయోజనాలు ఉంటాయి. ఒకరి కంటే ఎక్కువ వ్రాసినవి, రిపీటెడ్ గా వచ్చినవి తీసేద్దాం. 20 మంది వ్రాసిన పిన్నీసు ప్రయోజనాల లిస్టులో కామన్ గా వ్రాయబడిన ప్రయోజనాలని లెక్కించి వాటిని ఒకే ప్రయోజనం గా లెక్కగడదాం. విడిగా ఉన్నవి, కామన్ గా ఉన్నవి కలిపితే ఆ సంఖ్య 300 కంటే తక్కువగానూ, 15 కంటే ఎక్కువగానూ ఉంటుంది.
మనం నేర్చుకునే అంశమేమిటంటే ఓ విషయం పై నలుగురి అభిప్రాయాలు, అనుభవాలను క్రోడీకరించి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఒక్కరిగా తీసుకున్నదానికంటే ఖచ్చితంగా శక్తి పెరుగుతుంది. అంటే పిన్నీసు ప్రయోజనాలు వ్రాసిన లిస్టులో మనం ఉన్నామనుకుందాం, మనం వ్రాసిన సంఖ్య 12 అనుకుంటే, అందరినుండి వచ్చిన ఫలితం 50 అనుకుంటే మనకు అదనంగా 38 ప్రయోజనాల సంఖ్య తెలిసే అవకాశం కలుగుతుంది. ఒక విషయం లేదా పని ప్రారంభించేముందు మనకు సర్వంబొచ్చనే సహజధోరణిని కాస్త పక్కకు బెట్టి ఆ విషయంపై అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకోవడం వల్ల మనం చేపట్టబోయే పనికి ఎక్కువ ఫలితం ఉంటుంది. పని చేయాల్సిన వారు సలహాల సారాన్ని బట్టి నిర్ణయం తీసుకునే శక్తిని కోల్పోకూడదు. తర్కం, పాటిటివ్ చర్చల ద్వారా మనశక్తి పెరుగుతుందనడంలో సందేహం లేదు. చర్చలలో పాల్గొనేవారికి ఆ అంశం లేదా పనిలో అవగాహన, అనుభవం ఉన్నవారై ఉండాలి. అన్నింటికే ఒకే గుంపు పనికి రాదు.
- పల్లా కొండలరావు,
30-07-2019,
చొప్పకట్లపాలెం.
>>>చర్చలలో పాల్గొనేవారికి ఆ అంశం లేదా పనిలో అవగాహన, అనుభవం ఉన్నవారై ఉండాలి. అన్నింటికే ఒకే గుంపు పనికి రాదు.>>>
ReplyDeleteఇంకా నయం పిన్నీసులు ఆడవాళ్ళే పెట్టుకుంటారు కాబట్టి చర్చలో పాల్గొనే వారు స్త్రీలే అయి ఉండాలి అని అన్నారు కాదు !
ఒక అంశంపై అవగాహన,ఆసక్తి లేకుండా చర్చలో ఎవరు పాల్గొంటారండీ ? రాజకీయాలగురించి బ్లాగుల్లో నేను తప్ప ఎవరూ పాల్గొనరు. చర్చలో ఎవరైనా పాల్గొనవచ్చు. తెలియకపోతే తెలుసుకునే వీలు కలుగుతుంది.
నీహారిక గారూ! ఇక్కడ మనం ఒక విషయం పై నిర్ణయం తీసుకోవడానికి సలహాలు అడగడం కాబట్టి ఆ విషయం పై అవగాహన ఉన్నవారినే ఎంచుకోవాలన్నది నేను చెప్పదలచుకున్న విషయం. వ్యవసాయం గురించి పట్నంలో పుట్టి పెరిగి సాఫ్ట్వేర్ జాబ్ చేసేవారిని సలహా అడగడం కంటే వ్యవసాయంలో అనుభవం ఉన్నవారితో చర్చించడమే మంచిది కదా? పిన్నీసులు మగవాళ్లకి కూడా ఉపయోగపడతాయి కదండీ. జనరల్ చర్చలు గురించి అయితే మీ అభిప్రాయం తప్పు అనను.
Deleteఒక అంశంపై అవగాహన,ఆసక్తి లేకుండా చర్చలో ఎవరు పాల్గొంటారండీ ? -
Deleteఇక్కడే మీరు పాపం కొండలరావు గారు పడే నరకయాతనను అర్ధం చేసుకోవాలని విన్నపం. ఆసక్తి మాత్రమే ఉండి అవగాహన లేని వారు చర్చలో పాల్గొనే వారి విషయంలో వారి వేదనను పై విధంగా తెలియజేసుకుంటున్నారన్న మాట! ఈ విషయంలో వారిని ఎవరో పిన్నీసుతో పొడుస్తున్నట్లే ఉండి. పాపం చెప్పుకోలేక ఇలా --------
రాజకీయాలగురించి బ్లాగుల్లో నేను తప్ప ఎవరూ పాల్గొనరు. చర్చలో ఎవరైనా పాల్గొనవచ్చు. - కారణమిది అయ్యుండొచ్చు. మీ లెవెల్లో, మీ స్థాయిలో, మీతో తలపడి గెలిచే సత్తా లేక కావచ్చు!
తెలియకపోతే తెలుసుకునే వీలు కలుగుతుంది. - గతంలో చంద్రబాబు గారు, ఇప్పుడు జగన్ పెడుతున్నట్లుగా మీరు కూడా సహచర బ్లాగర్లకు అప్పుడప్పుడు అవగాహనా సదస్సులు పెడితే బాగుంటుందని నా సదభిప్రాయం. దీంతో ఎత్తిపొడుపులేదు. దయచేసి ఆలో చించండి.
రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటే వెంటనే వెళ్ళాలి. ఇలా చర్చల్లో మునిగితేలుతుంటే ఇక్కడే బ్లాగుల్లో ఉండిపోతాం. బ్లాగుల్లో నోరేసుకుని ఎలా వ్రాస్తున్నామో మీడియా ఎదుట కూడా నోరు పారేసుకోవాలి. కత్తి మహేష్ గారు బ్లాగుల్లో ఓడిపోయేవారు. మీడియాలో క్రేజ్ సంపాదించుకున్నారు. ఆయనకు వచ్చిన క్రేజ్ ని ఆయనే చెడగొట్టుకున్నారు. వ్యక్తులను ఎపుడూ టార్గెట్ చేయకూడదు. వ్యవస్థని టార్గెట్ చేయాలి. చాలామంది వ్యవస్థని టార్గెట్ చేసి గెలుపొందారు. బీజేపీ, ఎన్ టీ ఆర్ అలాగే ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ లోని వ్యక్తులకంటే కాంగ్రెస్ పార్టీలోని అవినీతిని టార్గెట్ చేసారు. మన బలమేమిటో మనకే తెలిసిఉండాలి. జిలేబీ గారిలాగా పద్యాలు నేను వ్రాయలేను. చంధస్సుపై అవగాహనా సదస్సులు నేను పెట్టలేను. జీవితసత్యాలెపుడూ ఓడిపోయినవారే బాగా చెప్పగలరు. ఒక్కో క్వొటేషన్ ఒక జీవితం. జీవితసత్యాలను చదవడం అంటే ఒకరి జీవితం తెలుసుకోవడమే !
Deleteపాపం కొండల రావు గారు. గుంపు అని కసురుకునే దాకా ఎందుకు వచ్చారో ఇప్పుడు అర్ధం అయ్యింది. బండ పిన్నీసుతో మీరు బరా బరా బరా బుర్ర గీరుకోవడం బ్లాగ్లోకంలో మార్మోగిపోతోంది. పరిస్థితుల బట్టి చూస్తే ఇప్పట్లో మీకు మంచి రోజులు కనబట్టం లేదు. మీ నిర్వేదం అర్ధం చేసుకోదగినదే. మీకు నా సానుభూతి.
Delete>>>>వ్యవసాయం గురించి పట్నంలో పుట్టి పెరిగి సాఫ్ట్వేర్ జాబ్ చేసేవారిని సలహా అడగడం కంటే వ్యవసాయంలో అనుభవం ఉన్నవారితో చర్చించడమే మంచిది కదా? >>>>
Deleteవ్యవసాయం చేసేవాళ్ళు "రచ్చబండ"పై కూర్చుని అనామకుల నుండి మొదలుపెట్టి అమెరికా దాకా అనేక విషయాలు చర్చిస్తుంటారు. వాళ్ళకు ఏమి తెలుసని చర్చిస్తుంటారు ?
పెళ్ళయ్యాక కూడా "సమంత" అలా ముద్దులుపెట్టేస్తుందేమిటీ అని చెవులు కొరుక్కుంటారు. అవన్నీ సమంత పెట్టిన ముద్దులు కావు "కెమెరా ట్రిక్కులు" అని చెప్పి వివరించాలంటే చర్చలు పనికివస్తాయి కదా ? ముద్దులగురించి తెలుసుకోవాలంటే ఆలియా బట్ లేదా ఇమ్రాన్ హష్మీ మాత్రమే చర్చల్లో పాల్గొనాలి అంటే పూర్ణశుంఠలే మిగులుతారు.
రాజకీయాల్లో ఆసక్తి కల పాఠకులకు ఒక ప్రశ్న !
ReplyDeleteకిషన్ రెడ్డి ని హోం శాఖ సహాయ మంత్రిగా వేయడం, కాశ్మిర్ లో బలగాలను
మోహరించడం , చంద్రబాబు గారి రక్షణ తగ్గించడం పై అమిత్ షా మందలించడం
వీటన్నిటిని చుస్తుంటే మీకేమనిపిస్తోంది?
రకరకాలుగా అనిపిస్తోంది☺️
Deleteపిన్నీసు సూత్రం ఫాలో అవడం లేదు మీరు.
Deleteచేతిలో పిన్నిసు ఉంది. చెయ్యాల్సిన పని ఎదురుగా ఉంది. అది వదిలేసి "ఈ పిన్నిసు వల్ల ఉపయోగాలు, అనర్ధాలు వివరింపుము" అని 50 మందికి పేపర్లు పంచి అభిప్రాయాలు తెలుసుకుని ఏం చెయ్యాలని? ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా చేతిలో ఉన్న పిన్నిసు తో మనం ఏం చెయ్యలనుకుంటున్నామో అదే ముఖ్యం. మిగతా విషయాలు అనవసరం! అలా అభిప్రాయాలు కలెక్ట్ చేసి చేసి ఉన్న ఒక్క పిన్నిసునీ ఆ పేపర్లు గుచ్చడానికి వాడేస్తే మన అవసరం అలాగే ఉండిపోతుంది.
Deleteపిన్నీసు ఎన్ని రకాలుగా వాడాలో తెలపండి అన్నారు కానీ పిన్నీసుని వాడేసుకోమని అనలేదు. మనిషి ఒకటే జన్మ. అందరూ ఒకేలా బ్రతకడం లేదు కదా ? ఎన్నిరకాలుగా బ్రతకవచ్చో మనం నిరూపిస్తున్నాం కదా ? విద్యావంతుడై ఉండీ అప్రయోజకుడిగా ఎలా బ్రతకవచ్చో, పూర్ణశుంఠలు జ్ఞానిలాగా ఎలా నీతులు చెప్పవచ్చో చూస్తున్నారు కదా ? పిన్నీసుని బరబరా బుర్ర గీక్కుంటానికి కూడా వాడుకోవచ్చని కొత్తగా తెలిసింది కదా ? పిన్నీసు వాడకం గురించి అడిగితే వాడకం గురించి చెప్పాలి. పిన్నీసుని ఫ్రీగా వాడేసుకుంటారా ?
Deleteనీకు తెలిసింది ఫ్రీగా చెప్పకు, నీకు తెలియని దానిని ట్రై చేయకు...ఏ సినిమా డైలాగో గుర్తులేదు.
రచ్చబండ చర్చలు వేరు. అక్కడ ఏదైనా ఎవరైనా చర్చించవచ్చు. ఇక్కడ మనకు అవసరమైన విషయం (ఎజెండా) తెలుసు కనుక ఆ విషయంపై అవగాహన ఉన్నవారినే ఎంచుకుని సలహాలు అడగడం, చర్చలు జరపడం చేయాలి. అలా కాకుంటే ప్రయోజనం కూడా రచ్చబండ చర్చలు లాగే ఉంటుంది.
Deleteరచ్చబండ చర్చలు వేరు, సాఫ్ట్ వేర్ పోరగాళ్ళ గ్రూప్ డిస్కషన్స్ వేరు, ఇవేవీ కాకుండా అనామక బాపతు వేరు. మీరు ఫలానా అని చెప్పనపుడు అందరూ వస్తారు. ఫేస్ బుక్ లోనూ ఇన్స్టాగ్రాం లోనూ ఉండేవాళ్ళందరూ మేధావులేనంటారా ? ఇంతకు ముందు నేను ఆర్ధిక నేరాలకు శిక్షలు లేవా అని అడిగితే ఎంతమంది సలహాలు వ్రాసారో గుర్తుకుతెచ్చుకోండి. ఎందుకంటే ఆర్ధిక విషయాలు తెలిసినవాళ్ళు తక్కువ కాబట్టి ఎవరూ చర్చకు రాలేదు. ఆర్ధిక విషయాలు తెలిసి ఉంటే సిద్ధార్ధ గారు చనిపోయి ఉండేవారు కారు. మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాలే అని అందరికీ తెలుసు.
Deleteమీ బ్లాగులో ఎన్నో చర్చలు చేసాం ..అవి ఎందుకూ పనికి రానపుడు వాటిని డెలిట్ చేసేయవచ్చు కదా ? వాటిని పున:ప్రచురించారు. ఎందుకూ ? వాటివల్ల ఉపయోగం ఉంటుందనేగా ? మీరు వేసే ప్రశ్న అర్ధవంతమైతే చర్చ జరుగుతుంది. బాహుబలి సినిమాకి బోలెడు చర్చలు జరిగాయి. అవతార్ సినిమాకి చర్చ జరిగిందా ? గ్రూప్ డిస్కషన్స్ లో పట్టభధ్రులనే పిలుస్తారు. వ్యవసాయ దారుడిని పిలవరు.
చివరిగా నేను చెప్పొచ్చేదేమంటే చర్చలకి అందరూ రారు. కొందరే వస్తారు. వారు ఆ చర్చకి అర్హులా కాదా అన్నది చర్చలోనే బయటిపడిపోతుంది. ఎవరు బాగా వాదించారో వారికే ఉద్యోగమిస్తారు. ఉద్యోగం రానివాళ్ళందరూ
అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి
పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !!
అని పద్యాలు పాడుకుంటారు.
''ఇక్కడే మీరు పాపం కొండలరావు గారు పడే నరకయాతనను అర్ధం చేసుకోవాలని విన్నపం. ఆసక్తి మాత్రమే ఉండి అవగాహన లేని వారు చర్చలో పాల్గొనే వారి విషయంలో వారి వేదనను పై విధంగా తెలియజేసుకుంటున్నారన్న మాట! ఈ విషయంలో వారిని ఎవరో పిన్నీసుతో పొడుస్తున్నట్లే ఉండి. పాపం చెప్పుకోలేక ఇలా --------''
ReplyDeleteElephantine memory :)ఇంత యాదుంచి దెప్పాల్నా?
:)
DeleteMay god bless his soul/sole!
DeleteThank me God, I have decided not to participate in these P.P discussions!