అలవాటు యొక్క శక్తి ఏమిటి?
మనిషికీ అలవాటుకూ ఉండాల్సిన సంబంధం ఏమిటి?
'అలవాటు' - ఇది చాలా సందర్భాలలో వాడే మాట.
ఈ పదంకు మనిషికి ఉండాల్సిన సంబంధం కీలకమైనది. దీనిని వివరించాలంటే 'అలవాటు' గురించి విస్తృతంగా చర్చించడం మంచిదని అభిప్రాయపడుతున్నాను. ఆ దిశగా మీనుండి వచ్చే సూచనలు నాకు చాలా ఉపయోగపడతాయి.
మనిషి మారడంలో లేదా మరకపోవడానికి కారణాలలో అత్యంత కీలకమైనది. మనిషిని ఋషిని చేసినా, సామాన్యుడిని మహాత్ముడిగా మార్చినా అలవాటు పాత్ర అద్భుతమైనది. ఇది తెలిసిందే. అయితే అలవాటు యొక్క శక్తిని వివరంగా చెప్పగలిగితే మానవ వనరులను అద్భుతంగా తీర్చి దిద్దవచ్చనడంలో ఎలాంటి సందేహం లేదు.
అలవాటు శక్తిని మనిషి ఉపయోగించుకోవడానికి ఉపయుక్తంగా, ప్రేరణ పెంచేలా ఉదాహరణలు లేదా వివరాలు తెలియజేయగలరని విజ్ఞప్తి. మీ అభిప్రాయాలు చాలామంది యువకులకు లేదా మారాల్సిన అవసరం ఉన్నవారికి ఉపయోగపడతాయని గుర్తించండి. ఇది మీ బాధ్యతగా భావించాలని మనవి.
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.