ఈ రోజు మా అమ్మాయి చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఒక వేప మొక్కను నాటడం జరిగింది. ఎటువంటి ఫంక్షన్ చేయలేదు. తనకి ఇష్టం ఉండదు కనుక. ఈ మొక్కను ఉన్నం వెంకటేశ్వర్లు గారి పొలం నుండి తీసుకొచ్చాను. మొక్కను శ్రద్ధగా తవ్వి ఇచ్చిన ఉన్నం గారికి ధన్యవాదములు.
- పల్లా కొండల రావు
Many Many Happy Returns Of The Day Chaitanya !
ReplyDeleteSharing birthday with Modiji.
వేప మొక్క నాటడం లేటయ్యింది. మీరు ఊరిలో నాటానని చెప్పినట్లు గుర్తు.
ధన్యవాదములు. ఎపుడూ నాటుతూనే ఉంటామండీ.
Deleteఈ రోజు మోడీ బర్థ్‌డే కదా . వీరతెలంగాణా తెలంగాణా విమోచన దినం కూడా.
చి.చైతన్యకు జన్మదిన శుభాకాంక్షలు 💐.
ReplyDeleteMany Happy Returns of the Day.
గుర్తుగా మొక్క నాటటం ఉత్తమమైన పని 👌.
ధన్యవాదములు సర్.
Deleteమొక్కనాటిన చి.చైతన్యకు బంగారు భవిష్యత్తు
ReplyDeleteకలగాలని ఆశీర్వదిస్తూ , జన్మదినశుభాకాంక్షలు.
ఈ యనంతసృష్టి నెక్కడా కనరాదు
మొక్క , జీవమేది? పుడమి దక్క,
ఎంతదయ హరికి తనంత మనకొసగె
నంతటి యపురూప మైన కాన్క .
మొక్క లేని నాడు పుడమియు వ్యర్ధమే
మట్టి రాళ్ళతో సమాన మగుచు
కోట్ల కొలది విశ్వగోళాల విధమౌను
జీవ మంతరించి చేవ తొలుగు .
మొక్క నాటు మొకటి ముందుచూపు గలిగి
భూమి తరతరాలు క్షేమ మగును
పచ్చని తరు లమృత మిచ్చి పుడమి శాశ్వ
తముగ జీవములను దాల్చు కొఱకు .
ధన్యవాదములు రాజారావు సర్. మొక్కపై పద్యాలు బాగున్నాయి.
Deleteమొక్కలు నాటడం చాలా మంచి అలవాటు ఇలా బర్త్ డే లకు అందరూ మొక్కలు నాటే అలవాటు చూసుకుంటే ప్రకృతి చాలా బాగుపడుతుంది.మనం సమాజానికి మేలు చిసినవారం అవుతాము
ReplyDeleteధన్యవాదములు అంజయ్య గారు.
Delete