'ఇజం' గొప్పదా? 'నిజం' గొప్పదా?
నా దృష్టిలో ఇది చాలా ముఖ్యమైన అంశం. మనిషి స్వేచ్చగా ఆలోచించడానికీ, ఓ భావజాలం ప్రభావితంతో ఆలోచించేదానికీ తేడా ఉంటుంది. వాస్తవాన్ని అంగీకరించడానికి ఇది ఆటంకంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. ఇజాలలో కొన్ని నిజాలు ఉంటాయి.
కేపిటలిజం, సోషలిజం, మార్క్షిజం, గాంధీగిరి, హిందూయిజం, క్రిష్టియానిటి, ఇస్లాం, బుద్ధిజం, స్త్రీవాదం, హేతువాదం.... ఇలా చాలా రకాల ఇజాలు ఉన్నాయి. అందులో అందరికీ అంగీకారం అయ్యే నిజాలూ ఉంటాయి. విభేదించే అంశాలూ ఉంటాయి. కొన్ని ఇజాలు మనిషిని ఉన్మాదిగా మార్చేలా కూడా చేస్తున్న సందర్భాలున్నాయనడంలో అతిశయోక్తి లేదు.
నిజం కూడా ఎపుడూ సాపేక్షమే అయినప్పుడు ఇజం శాశ్వతంగా ఉంటుందా? ఇజం, నిజం లలో ఏది గొప్పది? ఇజానికి, నిజానికీ ఉన్న తేడా ఏమిటి? సంబంధం ఏమిటి?
----------------------------------------
(Tags : ఇజం, భావజాలం, ఆలోచన, మనం మారగలం, మార్క్సిజం, రాజకీయం)
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
నిజాన్ని అర్ధం చేసుకునేందుకు మనుషులు ఇజం అనే కృత్రిమ పరికరం వాడతారు.
ReplyDeleteఏ కృత్రిమ పరికరం(ఇజం) లేకుండా నిజాన్ని నిజంలా కనుగొనలేమా జై గారూ?
Delete
ReplyDeleteరెండూ కాదు.
గో ఈజీ టేక్ ఇట్ ఈజీ గొప్పది :)
జిలేబి
అంత స్తితప్రజ్ఞత వీజీ కాదనుకుంఠానండీ....:)
Deleteఏ ఇజం కూడ నిజం కన్నా గొప్పది కాదు.
ReplyDeleteexactly.... bonagiri garu.
Deletewe can find Truth, but not create.
Deleteబోనగిరి గారి అభిప్రాయంతో 100% ఏకీభవిస్తాను.
Delete