బ్లాగర్ వేణు శ్రీకాంత్ ఇక లేరు.
ఫేస్‌బుక్ లో మొన్నటి దాకా పాజిటివిటీని నింపుతూ, అందరి కుశల సమాచారాలు అడిగి తెలుసుకునే బ్లాగ్ లోకపు మిత్రుణ్ణి కోల్పోయానంటే నాకింకా అంతా శూన్యమే కనిపిస్తోంది! ప్చ్.
ఆయన ఆఖరుగా పోస్ట్ చేసిన టపా : venusrikanth.blogspot.com/2021/04/blog-p
వేణూ శ్రీకాంత్ గారితో నాకు డైరెక్టుగా పరిచయం లేదు. జనవిజయం లో పవన్ కళ్యాణ్ గురించి ఓ వ్యాసం మంచిగా వ్రాసేవారు ఎవరని ఆరా తీసినపుడు ఈయన పేరు సూచించారు.
వేణూ మ్రుతికి సంతాపం. ఆయనకు జోహార్లు.
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
మిత్రులు వేణు శ్రీకాంత్ గారికి నివాళి
ReplyDeleteIt’s terrible. My sincere condolences to his family.
ReplyDeleteవాట్, వాట్, వాట్ 😳?!
ReplyDeleteఏది, నరసారావు పేట (అనుకుంటాను) వేణూశ్రీకాంతే?
ఏది, “సరగమలగలగలలు” అనే బ్లాగ్-స్పాట్ బ్లాగరే ?
నాకు కూడా ప్రత్యక్ష పరిచయం లేకపోయినా ఆత్మీయుడిలాగా అనిపించేవాడు. మాట (వ్రాత) చాలా మర్యాదపూర్వకంగా ఉండేది. అతని బ్లాగులు చదువుతుంటే ఆహ్లాదం కలుగుతుండేది.
ఎంత ఆకస్మికం? ఎంత దారుణం? పెద్ద వయసు కూడా కాదేమో? అప్పుడే దాటిపోవడం నిజంగా చాలా విచారకరం.
వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
వేణూశ్రీకాంత్ ఆత్మకు సద్గతి ప్రాప్తిరస్తు 🙏.
అయ్యో!ఆయన వ్రాతలు, కామెంట్లు చాలా హుందాగా ఉండేవి.వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి, ఏమిటి అసలు ఈ దారుణాలు సెకండ్ వేవులో?
ReplyDeleteపాటతో నేను అంటూ రోజూ ఒక పోస్టు వ్రాస్తూనే ఉన్నారు. ఆయన మరణం అంటే నమ్మలేకపోతున్నాను. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆశిస్తున్నాను.
ReplyDeleteMy deepest condolences.
ReplyDeleteదిగ్భ్రాంతి. ఏమి వ్రాయాలో తెలియటల్లేదు. స్వీయ పరిచయం లేకపోయినా అదేదో మిత్రత్వం. దగ్గరలో వాళ్ళు పోయినంత అనిపిస్తోంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం.
ReplyDeleteమాటలు వెతుక్కోవాల్సి వస్తోంది . ఇది అన్యాయం 😔 అంతే !
ReplyDelete"ఏది జీవితమేది మృత్యువు" అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అది గుర్తొస్తోంది. ఇవాళ శ్రీ శ్రీ గారి జయంతి కూడా (April 30th).
ReplyDeleteఏది జీవితమేది మృత్యువు" (శ్రీశ్రీ)
https://youtu.be/NeHX8wlDNeQ
Sppechless.... I always felt I know him dearly though through his writings only. Really very very sad, hope it is not true
ReplyDeleteమనసుకు నమ్మశక్యంగా అనిపించని, అగుపించని వార్త. మాలికలో ఇంకా ఆయన లేటెస్ట్ పోస్ట్ (26.04.21) డిస్ప్లేలోనే ఉంది. కేవలం 4 రోజుల్లో ...!! yesterday only i lost my brother in law to Carona and on heels yet another sad news. may God bless peace to their souls _/\_.
ReplyDeleteఅయ్యో, మీ బావగారు కూడా కరోనాకు బలయ్యారా, nmrao bandi గారూ? దారుణం. ఒకదాని పై ఒకటి వినాల్సొస్తోంది.
Deleteమీకందరకూ నా ప్రగాఢ సానుభూతి.
మీ బావగారి ఆత్మకు సద్గతి ప్రాప్తిరస్తు 🙏.
🙏🙏🙏 ...
Deleteదిగ్భ్రాంతి గొలిపే వార్త.వారితో నాకు ప్రత్యక్ష పరిచయం లేకపోయినా విన్నకోట నరసింహారావు గారన్నట్లు బ్లాగులు చదువుతున్నంతసేపు మనకు బాగా తెలిసిన వ్యక్తిగా, ఆత్మీయంగా అనిపించేది.విధి బలీయమంటే ఇదేనేమో.
ReplyDeleteవారి ఆత్మకు శాంతి చేకూరలని,వారి కుటుంబసభ్యులంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ..
వేణు గారి చివరి టపా http://sarigamalagalagalalu.blogspot.com/2021/04/blog-post_26.html?m=1
ReplyDeleteఏమిటో ఇంకా నాకు నమ్మబుధ్ధి కావటంలేదు. చాలా దిగులుగా ఉంది. ఇలాగే చెప్పాపెట్టకుండా జాన్ హైడ్ కూడా వెళ్ళిపోవటం జరిగింది లోగడ.
నాకు కొత్త జీవితాలు సినిమా లోని "తం తననం తం తననం" పాట అంటే చాలా ఇష్టం.ఎక్కడా దొరకదని నిరాశ పడుతూ ఉన్న సమయంలో ఆయన సేకరణలో ఉండడం చూసి అక్కడి నుంచి తీసుకున్నాను.చాలా చక్కని వ్యక్తిత్వం ఉన్న బ్లాగరు!
ReplyDelete