Do you think that fake encounters can reduce rapes?
ఎన్ కౌంటర్ల వల్ల రేప్‌లు తగ్గుతాయనుకునేవాళ్ళు ఇది తప్పకుండా చదవండి. ఈ మధ్య నేను ఒక పాత వారెంట్ కేస్ మీద రెండు రోజులు జైల్‌లో ఉన్నాను. అక్కడ నా సెల్‌లో ఉన్న ఒక కైదీ 18 ఏళ్ళ కుర్రాడు. అతను 19 ఏళ్ళ అమ్మాయితో సంభోగం చేస్తుండగా ఆమె తల్లితండ్రులు చూసారు. వాళ్ళు ఆమె చేత అతని మీద రేప్ కేస్ పెట్టించారు. వాళ్ళిద్దరూ తమ ఇష్ట ప్రకారమే ఆ పని చేసారని తెలిస్తే ఆ అబ్బాయిని మాత్రమే ఎంకౌంటర్ చెయ్యాలని డిమాండ్ చేస్తారా? ఆమె వయసు 19 అయినా 16 అని అబద్దం చెప్పి ఆమె తల్లితండ్రులు అతన్ని పాస్కొ కేస్‌లో కూడా ఇరికించగలరు. విచారణ లేకుండా నిందితుల్ని చంపడం తాలిబాన్ లాంటి ఆటవిక రాజ్యానికి సరిపడతుంది. మనం కూడా తాలిబాన్‌తో సమానులమని నిరూపించుకుందామా?
- Praveen Kumar
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
జైలులో నేరస్తులకి బిర్యానీలు మేపుతారు అనేది పత్రికల్లో చేసే ప్రచారం తప్ప వాస్తవం కాదు. ఒరిస్సాలోని జైల్‌లలో కైదీలకి అన్నం, బంగాళ దుంపలు లేదా కేబేజ్ లేదా పుట్టగొడుగులుతో చేసిన కూర ఇస్తారు. ఉదయం పూట చాయ్, ఉప్మా కూడా ఇస్తారు. జైల్‌లోకి పొగాకు ఉత్పత్తుల్ని అనుమతిస్తారు తప్ప మద్యం అనుమతించరు. జైల్‌లలో ఇలాంటి రూల్స్ ఉన్నప్పుడు బిర్యానీలు మేపే ప్రశ్న అనవసరం. దిశ నిందితుల్ని ఎంకౌంటర్ చెయ్యకపోయి ఉంటే వాళ్ళు జైల్‌లో బిర్యానీలు తినేవాళ్ళు అని ఫేస్‌బుక్‌లో వ్రాసినవాళ్ళని ఉద్దేశించి ఇది చెపుతున్నాను.
ReplyDeleteకేసు వేరు, నిరూపణ వేరు. మా పక్క గ్రామంలో ఒకడు పదిహేనేళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళాడు. ఆ అమ్మాయి తండ్రి అతని మీద కిడ్నాప్ కేసు కాకుండా రేప్ కేసు, పాక్సో కేసు పెట్టాడు. మైనర్‌ని ఆమె అంగీకారంతో తీసుకెళ్ళినా అది కిడ్నాప్ కిందకే వస్తుంది. రేప్ కేసుల్లో అయినా, కిడ్నాప్ కేసుల్లో అయినా బూటకపు ఎంకౌంటర్ల వల్ల నేరాలు తగ్గవు.
ReplyDelete