‘‘విజ్ఞానాన్ని పెంచే చదువు జ్ఞానాన్ని సూన్యం చేస్తోంది’’. ప్రస్తుత చదువుల పరిస్థితికి ఈ వాక్యం సరిపోతుంది. నాకు వాట్సాప్ లో ఓ మిత్రుడు పంపించిన మెసేజ్ ఇది. మంచి నీతి కధలా అనిపించింది. అందరికీ ఉపయోగపడుతుందని ఇక్కడ ఉంచుతున్నాను.
ఒక మెకానికల్ ఇంజనీర్ కారు డ్రైవ్ చేస్తూ వెళుతున్నాడు. ఇంతలో ఉన్నట్లుండి కారు టైరు పంచరు అయింది. అటుగా ఎక్కడా రాకపోకలు లేవు. ఎలాగోలా స్టెప్ని టైరు మార్చడానికి తానే స్వయంగా సిద్దమయ్యాడు.
బోల్టులన్నీ తీసి టైరు మారుస్తుండగా చెయ్యి జారీ బోల్టులన్నీ పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయాయి. ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తుండగా మురికి బట్టలు అందులోనూ అక్కడక్కడా చిరిగిపోయిన బట్టలు ధరించిన వ్యక్తి ఒకతను అటుగా వచ్చాడు.
ఇంజనీర్ ను చూసి, అయ్యా! ఏమైంది? అని అడిగాడు.
అప్పుడు ఆ ఇంజనీరు కు ఆ కాలువలోకి దిగి బోల్టులు తీసి ఇవ్వడానికి సరైన వ్యక్తి దొరికాడు అని తలచి అతనికి జరిగినదంతా చెప్పి ఆ కాలువలో నుండి బోల్టులు తీసిస్తే ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పాడు...
అప్పుడు ఆ వ్యక్తి, అయ్యా!..
కాలువలోకి దిగడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అంతకంటే సులభమైన మార్గం ఉంది. మిగతా మూడు టైర్లలో నుండి ఒక్కో బోల్టు తీసి ఈ టైరు కు వేయండి. తరువాత వచ్చే మెకానిక్ షాప్ లో నాలుగు బోల్టులు తీసి ఒక్కొక్కటిగా అన్నీటికి వేసుకుంటే సరిపోతుంది అన్నాడు ఆ వ్యక్తి ఇంజనీరు తో......
ఇంత చదువుకున్న నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదా అని ఆశ్చర్యపోయాడు ఇంజనీరు..
అందుకే....!!!
మనిషిని చూసి తక్కువ అంచనా వేసి చిన్న చూపు చూడకూడదు....
ఇప్పుడు ఉన్న చదువులు విజ్ఞానాన్ని పెంచుతున్నాయి. కానీ జ్ఞానాన్ని సూన్యం చేస్తున్నాయి.
అన్ని తెలివితేటలు ఉన్నా ఏ సమయంలో ఏది ఎప్పుడు ఎక్కడ వాడాలో తెలియడం లేదు...
ప్రాణాలతో ఉన్న పక్షికి చీమలు ఆహారం అవుతాయి అదే చీమలకు చచ్చిన పక్షి ఆహారం అవుతుంది.
పరిస్థితులు ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా మారవచ్చు.......
అందుకే ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు....
Ippudunna paristitulanu mee post lo prastavincharu. Ippatikante mundu mundu Maree goramaina prastitilu raabotunnayanipistundi. Bavishyat ante bayamestundi sumandi.
ReplyDelete