ఈ రోజు నేను ' పనిలేక ' అనే ఒక బ్లాగులో ' కమ్యూనిస్టు కాకి జ్ఞానోదయం '  అనే పోస్టు చదివి నా అభిప్రాయం వ్రాస్తే అదో కాకిగోల గా మారింది. 

దురదృష్టం ఏమిటంటే పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకతతో వాళ్ళు వాడే భాష ఇబ్బంది కరంగా వుంటోంది. పోనీ వాదనలో పస వుందా అంటే అదీ లేదు. 

అందులో వాదనలు చూసిన శ్రేయోభిలాషి ఒకరు ఇలాంటి వారితో వాదించకండి అని ఒక సలహాను మెయిల్ చేసారు. మెయిల్ కు కృతజ్ఞతలు పంపాను. 

అయితే వారు కించపరిస్తే మన గౌరవం పోదనే నా అభిప్రాయం. ఎవరి వాదన ఏమిటో చదువరులకు తెలుస్తుంది కదా? ఇలాంటి వాదనలు బ్లాగులలోనే కాదు . బయటా ఎదుర్కుంటూనే వుంటాము. 

ఈ మిత్రులకు కృతజ్ఞతలు. ఎందుకంటే వీళ్ళ వల్ల నేను నా బ్లాగులో కమ్యూనిజం గురించి నాకు తెలిసిన మేరకు ఈజీ లాంగ్వేజ్ లో వ్రాయాలనే నిర్ణయానికి వచ్చాను. దీని వల్ల తెలియని చాలా విషయాలు తెలుసుకునే అవకాశం నాకు కూడా కలుగుతుందని ఆశిస్తున్నాను.

ఈ చర్యకు కారకులయినందుకు వారిని మితృలు అంటున్నాను. పైగా వారిపై నాకు వ్యక్తిగత శతృత్వం లేదు. ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు కనుక. 

మొదట సుజాత గారు అడిగిన మేరకు మాత్రం పోస్టు వ్రాద్దామనుకున్నాను. కానీ ఈ విషయాలపై వీలైనపుడల్లా  వ్రాయాలనే నిర్ణయానికి వచ్చాను. నాకు తెలిసింది వ్రాస్తాను . చర్చలలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.

కమ్యూనిస్టు వ్యతిరేకుల విమర్శలైనా, సపోర్టు విమర్శలైనా పద్ధతి ప్రకారం ఇతరులను కించపరచే విధంగా లేని చర్చలను ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు 'పనిలేక' బ్లాగులో నా కామెంట్లు, ప్రతి కామెంట్ లను ఇక్కడ వుంచుతున్నాను. గమనించగలరు.

పల్లా కొండల రావు said...
యరమన గారూ ! ఖాళీ మైండ్ అత్యంత ప్రమాదకరమైనది అని ఒక సైక్రియాటిస్ట్ గా మీకు ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం వుంటుందా ? 'పనిలేక' అని మీరు హెడింగ్ పెట్టినా పనిగట్టుకునే రాస్తున్నారు. అదేదో సరదాగా కాకుండా సీరియస్ గా రాయండి. మీరు అందరి మీదా రాస్తున్నారనేది నిజమే అయినా పైపైన కాకుండా ('పనిలేక') కాకుండా ఇదో పనిగా రాయండి. మీ లో రచనా శక్తి వుందని మీ రాతలను బట్టి తెలుస్తోంది. మీ ఖాళీ సమయాన్ని ఇందుకు ఉపయోగిస్తే బ్లాగు లోకానికి మరింత ఉపయోగంగా ఉంటుందని మనవి. ఇక కమ్యూనిస్టుల పై విమర్శలు అత్యంత సహజం. ఎందుకంటే పెట్టుబదిదారీ సమాజపు కుళ్ళును అంతా అంగీకరిస్తారు. కానీ దానిని రూపు మాపడానికీ మూల సూత్రాలు చెప్పే కమ్యూనిజం ఒక నిజం. కాకపోతే కమ్యూనిస్టుల ప్రవర్తన , వారి విభేదాలు నిజంగానే అలాంటి విమర్శకులకు అవకాశం ఇస్తున్నాయి. ఎంతమంది కి కమ్యూనిజం తెలిసి నాయకులుగా వుంటున్నారు. అందుకే చారిత్రక తప్పిదాలు. వాటిని అంగీకరించే సత్తా వారికే వుంది. వుంటుంది కూడా . కమ్యూనిస్ట్ ల వల్ల ప్రపంచ వ్యాపితంగా చాలా మేలు జరిగింది . భారతదేశం లో కూడా జరిగింది. ఇప్పటికీ సాపేక్షంగా చూస్తే మంచి నాయకులు , అవినీతికి దూరంగా వున్నదీ ప్రజల తరపున నికరంగా పోరాడుతున్నదీ కమ్యూనిస్టులే . మరి ప్రజలెందుకు కమ్యూనిస్టులను అనుసరించడం లేదు. చాలా తేలికగా చెప్పగలిగే కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఆకాశమార్గం లో గందరగోళం గా చెప్పడం, అర్ధం లేని విధంగా ప్రజలకు ఆటంకం కలిగించే విధంగా పోరాటమార్గాలు వుండడం , సిధాంతాన్ని రాద్ధాంతం చేయడం , తప్పుగా అన్వయించడం , వ్యక్తి పూజ , కెరీరిజం లాంటి భయంకరమైన లోపాలు కమ్యూనిస్టు ఉద్యమానికి అసలైన ఆటంకాలు తప్ప నిజంగా కమ్యూనిస్టులు సరిగా వుంటే పెట్టుబడిదారుల ఎత్తులు చిత్తు కావడం పెద్ద లెక్కే కాదు. సీట్ల కోసం బూర్జువా పార్టీల కంటే ఎక్కువ కాట్లాడుకోవడం లాంటి వెకిలి చేస్టలు మానుకోవాలి. కెరీరిజం లో నియంత్రుత్వం పెరిగితే భ్రమే అయినా పెట్టుబడిదారీ సమాజపు స్వేచ్చే ఉపశమనం ఇస్తుంది. కమ్యూనిస్టులపై అకారణంగా ఉక్రోషంతో చేసే విమర్శలు చూసినపుడు బిజినెస్ మెన్‌ సినిమాలో పులి ని గురించి మహేష్ చెప్పిన డైలాగ్ గుర్తుకు వస్తుంది. సకారణంగా విమర్శలు చూసినపుడు వీళ్ళెప్పుడు (కమ్యూనిస్టులు) భూమార్గం పడతారు అనిపిస్తుంది.ఒక్కటి మాత్రం నిజం. మనిషిని - మనసును అల్లకల్లోలం చేసే , అభద్రతా భావం పెంచే పెట్టుబడిదారీ వ్యవస్త కొనసాగింపు కమ్యూనిస్టుల మూర్ఖపు చేష్టలవల్లే తప్ప కమ్యూనిజం వల్ల , మార్క్షిజం వల్లా మాత్రం కాదు. సింపుల్ గా చెప్పాలంటే కమ్యూనిస్టు అంటే కలసివుండేవాడు , కలుపుకు పోయేవాడు . విప్లవం అంటే మౌలికమైన మార్పు. అదేదో అరుపులతో కేకలతో అనర్ధం తెచ్చేది కాదు. ఎన్ని వాదనలు చేసినా ఎన్ని ఏళ్ళు గడచినా మానవత్వాన్ని నిలిపే కమ్యూనిజం నిజం. భ్రమ కాదు.
SNKR said...
/సింపుల్ గా చెప్పాలంటే కమ్యూనిస్టు అంటే కలసివుండేవాడు , కలుపుకు పోయేవాడు . విప్లవం అంటే మౌలికమైన మార్పు. అదేదో అరుపులతో కేకలతో అనర్ధం తెచ్చేది కాదు. ఎన్ని వాదనలు చేసినా ఎన్ని ఏళ్ళు గడచినా మానవత్వాన్ని నిలిపే కమ్యూనిజం నిజం. భ్రమ కాదు./ "భలే భలే! బాగా చెప్పావ్. కాని అందుకు మనమేం చేయాలో అది కూడా నీవే చెప్పూ.." :D
SNKR said...
/ ఎన్ని ఏళ్ళు గడచినా మానవత్వాన్ని నిలిపే కమ్యూనిజం నిజం. / ఇండియాలో 6దశాబ్దాలు దాటాయి, ఇంకా ఎన్ని దశాబ్దాలు కాలేంటి ఒట్టి మానవత్వం నిలపడానికి?! మరి ప్రభుత్వానికి, పాలనకి ఎంకెన్ని శతాబ్దాలు కావాలో! అందుకేనేమో చైనాలో అడ్డదారుల్లో పెట్టుబడిదారీ విధానాలని అడ్డగోలుగా అనుసరిస్తున్నారు. చికెన్ నారాయణ ఓ నిష్టాగరిష్టుడైన కమ్యూనిష్టేనా? :D
పల్లా కొండల రావు said...
@SNKR! వ్యంగ్యం ఒక మానసిక రోగం. విపరీత లక్షణం . ఇంకా చెప్పాలా ? చెప్పింది చాలదా ? అయినా చెపితే వినే రకం కాదని అర్ధం అవుతూనే వుంది. సో ! నిరర్ధక వాదన తో ఎందుకు టైం వృధా చేయాలి.
karthik said...
>>ఇప్పటికీ సాపేక్షంగా చూస్తే మంచి నాయకులు , అవినీతికి దూరంగా వున్నదీ ప్రజల తరపున నికరంగా పోరాడుతున్నదీ కమ్యూనిస్టులే . మరి అంత పోరాడేవాళ్ళు ఇప్పటిదాకా ఒక్క అవినీతి పరుడిని కూడా ఎందుకు బోనెక్కించలేకపోయారు?? ఎందుకంటే కమ్యూనిష్టులకు అంత గుండె ధైర్యం, పోరాట పటిమ లేవు కనుక. they are the sore losers of life.. >>నిజంగా కమ్యూనిస్టులు సరిగా వుంటే పెట్టుబడిదారుల ఎత్తులు చిత్తు కావడం పెద్ద లెక్కే కాదు. మరి అంతమంది దగుల్బాచీ మొహాలు ఒకే థియరీని నమ్ముతున్నారంటే దానికి కారణం ఆ థియరీ కాక ఇంకేమిటి?? >>పెట్టుబడిదారీ వ్యవస్త కొనసాగింపు కమ్యూనిస్టుల మూర్ఖపు చేష్టలవల్లే తప్ప కమ్యూనిజం వల్ల , మార్క్షిజం వల్లా మాత్రం కాదు. agreed, as its kind of a zero sum game.. people move away from communism and land up supporting free market theory. >>విప్లవం అంటే మౌలికమైన మార్పు. అదేదో అరుపులతో కేకలతో అనర్ధం తెచ్చేది కాదు. కమ్యూనిజం లాంటి ఫాసిస్ట్ సిద్దాంతాలతో అది ఎప్పటికీ రాదు. >>మానవత్వాన్ని నిలిపే కమ్యూనిజం నిజం మమతా బెనర్జీకి ఓట్లు వేస్తామంటే చేతులు తీసేశారు.. అది మానవత్వం!! ఇంఫార్మర్ల పేరిట వేలమందిని చంపేశారు.. అదీ మానవత్వమే!! బలవంతపు వసూళ్ళూ, మాఫియా చేష్టలు.. అదీ మానవత్వమే!!
పల్లా కొండల రావు said...
@karthik ! " మరి అంతమంది దగుల్బాచీ మొహాలు ఒకే థియరీని నమ్ముతున్నారంటే దానికి కారణం ఆ థియరీ కాక ఇంకేమిటి?? " చదువు సంస్కారాన్ని నేర్పక పోవడం వల్ల వచ్చే అనర్ధం ఇదే ! ఎదుటివ్యక్తిని కించపరుస్తూ విమర్శించడం అవసరమా ? అలా చేస్తే ఏమిటి ఉపయోగం? - "మమతా బెనర్జీకి ఓట్లు వేస్తామంటే చేతులు తీసేశారు.. అది మానవత్వం!! ఇంఫార్మర్ల పేరిట వేలమందిని చంపేశారు.. అదీ మానవత్వమే!! బలవంతపు వసూళ్ళూ, మాఫియా చేష్టలు.. అదీ మానవత్వమే!! " - ఇలా చేసి కమ్యూనిజాన్నో , మార్కిజాన్నో నిలబెట్టాల్సిన అగత్యం మార్క్సిజం కు లేదు. ఒక్క మార్క్కిజం కే కాదు ఏ ఇజామూ ఇలా చేయమని చెప్పదు. అలా ఎవరు చేసినా తప్పే.మార్క్సిజం ఒక శాస్త్రం . దానిని సరిగా చదువుకోకుండా ఇలాంటి చేస్టలు చేస్తే మీలాంటి వారినుండి ఇలాంటి విమర్శలను తప్పక ఎదుర్కోవలసిందే. అలాంటి తప్పులను సవరించుకోవలసిందే. కానీ మీరు చెప్పిన చేస్టలు చేయమని మార్క్సిజం లో ఏ పేజీ లోనూ వ్రాయలేదు. కనుక వాటిని మార్క్సిజానికి ఆపదించడం ధర్మం కాదు.
Anonymous said...
మార్క్సిజం యొక్క సిధ్ధాంతం గొప్పదని, అది ఆచరించేవాళ్ళకు సరి అయిన అవగాహన లేక పొయినంత మాత్రము సిధ్ధాంతమును తప్పబట్టగూడదు అని చెప్పారు, విమర్సించేవాళ్ళకు సరి అయిన విషయ పరిజ్ణానం లేదంటున్నరు. మరి అదే విధంగ బారతీయ హైందవ సంస్కృతి, సాంప్రదాయ, పురాణ ఇతిహాస, వేదాలను కూడా అదే విధముగ చూడకుండ అవన్నీ తప్పు అని అంటారేమిటి. అంటె మీరు చెప్పినట్లుగ వీటి మీద కూడా విమర్సించేవాళ్ళకు అవగాహన లేదనుకోవచ్చా?
సుజాత said...
కొండల రావు గారూ, యరమన గారినుద్దేశించిన రాసిన వ్యాఖ్య (ఆయన గురించిన పార్ట్ కాదు) చాలా అర్థ వంతంగా ఉంది. కమ్యూనిజం గురించి, మార్క్సిజం గురించి వివరించే ప్రయత్నం చేశారు. కమ్యూనిజంలో,మార్క్సిజంలో గొప్ప లక్షణాలుంటే ఉండొచ్చు. సమాజానికి అవసరం కావొచ్చు. ఇటువంటి ఇజాలను జనాల వద్దకు సరైన రీతిలో చేర్చడం లో కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు ఎందుకు విఫలమవుతున్నారన్నదే ప్రశ్న! ఏ ఇజాన్నైనా దాన్ని పాటించే వాళ్ళ మూలంగానే దాన్ని సామాన్యులు అర్థం చేసుకుంటారు. మరి కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు చేసే పనులకు వారి బాధ్యత ఎంత వరకు? కమ్యూనిజం బాధ్యత ఎంత వరకూ? ఆ ఇజాల బాధ్యత లేకపోతే, అటువంటి వారిని ఆయా పార్టీల నుంచి ఎందుకు బహిష్కరించరు? మన దేశానికి సంబంధించి కమ్యూనిస్టుల మీద మీ అభిప్రాయం ఏమిటి? కమ్యూనిస్టులు కనీసం సామాన్యులకు అర్థం కాని భాష వాడుతూ, పడి కట్టు పదాలు వల్లె వేస్తూ జనాలకు ఎందుకు దూరమైపోతుంటారు? వాళ్ళు వాడే భాష ఎవరికైనా ఏ విషయాన్నైనా సులభంగా బోధించగలుగుతుందా చెప్పండి? వీళ్ళ భాషే కొరుకుడు పడనిదిగా ఉంటుందని రంగనాయకమ్మ గారు "కుట్ర" అనే కథ రాశారు కూడా! మామూలు మనుషులకు భిన్నంగా మాట్లాడుతూ,వాళ్ళేదో ప్రత్యేక జాతిగా గురించేసుకుంటూ..ఎవరితోనూ కలవక ..విడిగా ఎందుకుంటారు కమ్యూనిస్టులు?వీళ్ల వల్ల కమ్యూనిజంలో మంచేమైనా ఉంటే అది జనాలకు అందదు అని నిజమైన కమ్యూనిస్టులు గ్రహించరా? దీనికేం చేస్తున్నారు? నిజమైన కమ్యూనిస్టు లక్షణాలేమిటి? కమ్యూనిస్టు బోధనల్లో ప్రాక్టికాలిటీ ఎంత వరకూ? కమ్యూనిజం చెప్పేదంతా ఉపన్యాసాలకు, పుస్తకాలకే పరిమితమా?మన దేశానికి సంబంధించి మానవత్వాన్ని నిలపడానికి ఇప్పుడు కమ్యూనిస్టుల మని చెప్పుకుంటున్న కమ్యూనిస్టులు చేస్తున్నదేమిటి? కమ్యూనిజం అనగానే జనం అదేదో బ్రహ్మ పదార్థమని భావించి దూరం కావడానికి కారణం ఏమిటి? కమ్యూనిస్టులు తప్పుడు వాళ్లైతే కమ్యూనిజంలో తప్పుందని అనుకోకూడదన్నారు! నేనూ అంగీకరిస్తాను. మరి ఈ తప్పుడు వాళ్ళని ఎలా వదిలించుకుంటాయి కమ్యూనిస్టు పార్టీలు? సాక్షాత్తూ ఆయా పార్టీల నాయకులే తప్పుడు వాళ్ళుగా ఉంటున్న సందర్భంలో కమ్యూనిజం,మార్క్సిజం మనుగడ ఏమిటి? ప్రశ్నార్థకం కాదా? (ఎక్కువమందికి (నాతో సహా) సో కాల్డ్ కమ్యూనిస్టులతోనే సమస్య కానీ కమ్యూనిజంతో కాదని నాకనిపిస్తుంది.). తెలుసుకోవాలనే ఆసక్తితో అడుగుతున్నాను, వివరించగలరు!
karthik said...
>>చదువు సంస్కారాన్ని నేర్పక పోవడం వల్ల వచ్చే అనర్ధం ఇదే ! ఎదుటివ్యక్తిని కించపరుస్తూ విమర్శించడం అవసరమా ? అలా చేస్తే ఏమిటి ఉపయోగం? నా సంస్కారం గురించి మాట్లడటానికి మీ అర్హత ఏమిటో చెబుతారా?? అలానే నేను రాసిన దానిలో వ్యక్తిగత విమర్శ ఏముందో కస్త చెప్పండి. నేను కించపరిచింది ఒక సమూహాన్ని. ఆ సమూహం సమాజానికి అత్యంత హానికరమని నా నమ్మకం. వ్యక్తిగతంగా ఆ సమూహం వల్ల నేను, నా కుటుంబం వ్యథను అనుభవించాం..కాబట్టి చదువు సంస్కారం అంటూ మాట్లాడే ముందు కొంచెం ఆలోచిస్తే మంచిది. >>ఇలా చేసి కమ్యూనిజాన్నో , మార్కిజాన్నో నిలబెట్టాల్సిన అగత్యం మార్క్సిజం కు లేదు. మరి కమ్యూనిష్టు అయిన ప్రతీవాడి అస్థిత్వం హింస మీద ఎందుకు ఆధారపడి ఉంటుంది?? అలా చేయకపోతే కమ్యూనిజం అనేదాన్ని ప్రజలు మర్చిపోయి కనీసం వందేళ్ళు అయ్యేది. హింస అనేది కమ్యూనిజం లో ఒక integral part. అది వదిలితే కమ్యూనిష్టులకు బ్రతుకేలేదు. ఒక తియెం మెన్ స్క్వేర్ అయినా లేక కంబోడియా అయినా కమ్యూనిష్టుల అస్థిత్వం ఫాసిజం+హింస అనే వాటి మీదనే ఆధారపడి ఉంది.
SNKR said...
/వ్యంగ్యం ఒక మానసిక రోగం. విపరీత లక్షణం . / అలా అని మార్క్స్ దాస్ కేపిటల్ లో చెప్పారాండి పల్లా కొండల రావు గారు?!! /ఇంకా చెప్పాలా ? చెప్పింది చాలదా ? అయినా చెపితే వినే రకం కాదని అర్ధం అవుతూనే వుంది./ సిద్ధాంతాలు చెప్పకండి, వినివినీ విసుగొచ్చింది. ఆ థియరీ ఈ భూప్రపంచంలో ఏ దేశంలో సమర్థవంతంగా అమలు చేయబడ్డది. ఆదేశపు పురోగతి ఎట్టిది? వివరింపుడు. క్యూబా, ఉత్తర కొరియా, చైనా, రష్యా, వియత్నాం. కోప్పడకండి, కొడలరావు గారు. కమ్యూనిస్టులకు ఆవేశమే కాని ఆలోచన తక్కువ అని మా బామ్మ చెప్పేవారు. నేను మా బామ్మతో అప్పట్లో ఏకీభవించలేదు. కమ్యూనిజాల్లో ఏ కమ్యూనిజము మంచిది/గొప్పది? మార్కిస్టులా, లెనినిస్టులా, మావోఇస్టులా, లేదా వాటి చౌచౌ కాంబినేషన్స్ మార్క్స్-లెనిన్, లెనిన్- మావో, మావో-స్టాలిన్, ... /సో ! నిరర్ధక వాదన తో ఎందుకు టైం వృధా చేయాలి. / మీకున్నదే అది, దాచుకుని ఏంజేస్తారు?! అందరికీ సామ్యవాదంగా పంచి ఇవ్వండి. 60ఏళ్ళకు పైగా అరుస్తున్నారు, ఇంకో 10మార్లు అరిస్తే ....పోయేదేముంది? ఏమో విప్లవం వచ్చి మేమంతా తిరగబడి, పులుసు చచ్చి ' హా! ఎర్రజెండెర్రజెండెన్నియల్లో ఎర్రెర్రనిదీ జెండెన్నియల్లో అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ... చైనా పీపులుసు కమ్యూనిస్టు పార్టీకి జైకొడతామేమో! ఏమో! ఆలోచించుడీ.
SNKR said...
వ్యంగమంటే భయపడుతున్నారంటే ఇంకా మీరు ముదురు కమ్యూనిస్ట్ కాదనే అనుకోవాలి. పోనీ సుజాత గారు సూటిగా అడిగారు కదా, ప్రశ్నలకు జవాబివ్వండి. కార్తీక్ చెప్పింది ఆలోచనీయంగా వుంది. మీరు పార్టీ పరంగా చూపించే ఆవేశం కొంచెం తగ్గించి, కొద్దిగా ఆలోచించగలరు.
పల్లా కొండల రావు said...
@ Anonymous, దేనిని విమర్శించే వారైనా సరే, దానిని ఎందుకు విమర్శిస్తున్నారో చెప్పగలగాలి. విమర్శించడం అనేది కోపంతోనో, ద్వేషంతోనో ఉండకూడదు. భారతీయ, హైందవ, సంస్కృతి , సాంప్రదాయ , పురాణ, ఇతిహాస,వేదాలను కూడా వాటిని గురించి తెలుసుకోకుండా విమర్శిస్తే తప్పే. ఇవన్నీ లేదా ఏవైనా సరే చారిత్రక పరిణామ క్రమం లో మనిషి తన అవసరాల రీత్యా యేర్పాటు చేసుకున్నవే. వీటిలో మంచివాటిని కొనసాగించాలి. హిందూ సంస్కృతిలో బోలెడన్ని మంచి విషయాలు, జీవన విధానాలు, సాంస్కృతిక విషయాలు ఉన్నయి. వాటినన్నింటినీ గుడ్డిగా వ్యతిరేకించడం మంచిది కాదు. కానీ 'సతి' పేరులో స్త్రీలను సతీసహగమనం చేయించడం , కులం పేరుతో మనిషినీ-మనిషినీ వేరు చేసే అంశాలు, మనిషి - విశ్వం పుట్టుకకు సంబందించడం వైజ్ఞానిక విషయాలలో హిందూమతం చెపుతుంది కాబట్టి దానినే సరి అయింది అనలేము. అలాగే ముస్లీం మతములో తలాక్ నో, మతోన్మద ' జీహాద్ ' నో మనం సమర్దించలేము. ఏ మతమైనా, సిద్దాంతమైనా వాటిలో మంచి చెడులను శాస్త్రీయంగా విమర్శించాలే తప్ప వారి విశ్వాసాలను కించపరిచే విధంగా, గాయపరిచే విధంగా విమర్శించకూడదు. కమ్యూనిజం లేదా మార్క్సిజం కూడా పరిపూర్ణ సిధ్ధాంతాలు అని చెప్పలేము. అప్పటిదాకా ఉన్న ప్రపంచాన్ని పరిశీలించి కారల్ మార్క్స్ మానవాళి జీవన విధానానికి ఒక అధ్బుత శాస్త్రాలను సశాస్త్రీయంగా వివరించారు. అందుకొక మార్గాన్ని సూచించారు. ఆ మార్గాన్ని ఆయా దే్శాలకు అనుకూలంగా మెరుగుపరచుకుంటూ ప్రణాళికతో కమ్యూనిస్టు పార్టీలు పని చేయాలి. అలా చేస్తున్నాయా ? లేదా ? అనేది ఎప్పటికప్పుడు వారు సమీక్షించుకోవాలి. ప్రజలు వారికి మద్దతునిస్తున్నారా ? లేదా ? అనేది కూడా వారి ఆచరణ మీదనే ఆధారపడి ఉంటుంది.
Anonymous said...
@పల్లా కొండల రావు, మీరు అంటున్నారు, కమ్యూనిస్టులు సరిగా ఉంటే పెట్టుబడి దారులు ఎప్పుడో చిత్తై ఉండేవారన్నారు. వారు సరిగా ఉండొద్దు అని ఎవరైనా బలవంతం చేశారా? పోనీ ప్రపంచములో ఫలానా చోట కమ్యూనిస్టులు సరిగా ఉండి పెట్టుబడి దారి విధానాలను ఎదుర్కొన్నారని ఖచ్ఛితంగా చెప్పగలరా? నేనే కనుగ సరిగా చదువుంటే స్టేట్ ఫస్ట్ వచ్చేవాడిని అన్నట్టుగా లేదా ఇది. కాదు అనుకుంటే, నేనూ అదే లైనులో చెబుతాను వినండి. పెట్టుబడి దారులు సరిగా ఉన్న చోట కమ్యూనిజానికి నిలువ నీడకూడా ఉండదు. ఎందుకంటే, ప్రజలు వాస్తవికతను నమ్ముతారు కానీ, అరచేతిలో వైకుంఠం చూపే వారిని కాదు (Read as marxists). దీనికి నేను చాలా ఉదాహరణలు చూపించగలను. తప్పులు చేసి, వాటిని అంగీకరించే సత్తా వారికే ఉంది అన్నారు. తమ తప్పును ఒక చారిత్రాత్మిక తప్పిదం అని కప్పిపుచ్చుకోవడం మాత్రమే వారు చేస్తున్నారు. అంటే తాము చేస్తున్నది ఒక గొప్ప పని, దానిలో అప్పుడప్పుడు ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటాయి కాబట్టి పట్టించుకోకండి అని చెప్పడముతో సమానం. అది. కానీ, వారు అలాంటి చారిత్రాత్మిక తప్పిదాలను (కనీసం ఇదివరకూ చేసిన తప్పిదాల వంటివే) తిరిగి చేయకుండా వారు ఎలాంటి చర్యలు తీసుకోరు. నేను ఒక వ్యక్తి ని నరికి చంపి, ఇది కేవలం నేను నాజీవితములో చేసిన చారిత్రాత్మిక తప్పిదం మాత్రమే అంటే సరిపోతుందా? అప్పుడు నేను తప్పులు ఒప్పుకునే సత్తా ఉన్న వాన్ని, గొప్పవాన్ని అవుతానా? Srikanth.M
Anonymous said...
@పల్లా కొండల రావు, అసలు కమ్యూనిస్టులో ఉన్న సమస్య .. ఆత్మ స్తుతి, పరనిందా. వారికున్న ఈ జబ్బు ఈనాటిది కాదు, ఇప్పటితో పోయేది కాదు. అక్కడికి తాము, తమ సిద్దాంతాలు మత్రమే గొప్పవి అయినట్టు, మిగిలిన వారు కేవలం అఙ్ఞానముతో బాడపడుతున్నట్టు .. పడికట్టు పదాలతో జనాల్ని విసిగించే అలవాటు బహుషా కమ్యూనిస్టులకు ఉన్నంతా.. మత ప్రచారాలు చేసే వారికి కూడా ఉండదనుకుంటా. కమ్యూనిస్టులు మానవ హక్కుల గురించి మాట్లాడడం మాత్రం, ఒక పెద్ద జోక్. మానవ హక్కుల హణణం విషయములో కమ్యూనిస్టులు, వారి రాజ్యాలు ఎప్పుడూ మొదటి స్థానములోనే ఉన్నాయి. అప్పటి సోవియట్ యూనియన్ మొదలుకొని, ఇప్పుడు చైనా వరకూ అన్నీ ఆకోవలోనివే. అయినా కమ్యూనిస్టుల దృష్టిలో మానవ హక్కులు అంటే మావోల హక్కులైనా అయ్యుండాలి, లేదా తాడిత పీడిత జనం అని వారిచేత ముద్ర వేయించుకున్న జనాలైనా అయ్యుండాలి. ఆ తాడిత పీడిత జనములో సైతం ... ప్రజలు మావోయిస్టుల ద్వారా బాధలు పడుంటే మాత్రం అవి మన కమ్యూనిస్టు మాన హక్కుల పోరాటదారులకు అస్సలు కనిపించవు. కదండీ... !! Srikanth.M
Anonymous said...
@@పల్లా కొండల రావు, ఇక, హింస అనేది కమ్యూనిజములో లేదు, మార్క్సిజములో లేదు కావాలంటే మేము రాసిన/ రాసుకున్న పుస్తకాలు చూడండీ అంటారు అంతేనా? ఇది ఇంకో జోక్ మాత్రమే. పుస్తకాలు అందరూ గొప్పగానే రాసుకుంటారు. మీరు ఇంతగా తిడుతున్న పెట్టుబడిదారులు, మీచేత బూర్జువాలు అనిపించుకుంటున్న వారు, దేశాలు మాత్రం వారి వారి రాజ్యాంగాలలో దోపిడీ చేయుము, పక్కవారిని హింసించుము అని రాసుకున్నారా చెప్పండి? అమెరికా వాడు, ఇరాక్ మీద దాడిచేశారాని అమెరికాను తిడుతున్నారు కమ్యూనిస్టులు. అమెరికా విదేశాంగ విధానం చెడ్డది అని చెబుతున్నారు. మరి అమెరికా రాజ్యాంగములో ఇరాకుమీద, దాడిచేయుము అని రాసుకుని చేసారా చెప్పండి. అంతెందుకు మన రాజ్యాంగాన్నే తీసుకోండి, మనది సామ్యవాద దేశం అని రాజ్యాంగములో రాశుంటుంది. మరి ఇక్కడ దోపిడి జరుగుతోందని కమ్యూనిస్టులు ఎలా అనగలుగుతున్నారు చెప్పండి? పుస్తకాలలో అలా రాసి లేదు కదా? మరి అక్కడ జరుగుతున్న వాటిని ఆయా దేశాలకు కానీ, పెట్టుబడి దారి విధానానికి మాత్రం మీరు ఎలా అంటగడుతున్నారో కాస్త వివరిస్తారా? Last but not least, కమ్యూనిజం మానవత్వానికి దరిదాపుల్లో కూడా ఎప్పుడూ రాలేదు. రష్యాలోనూ, చైనాలోనూ, క్యూబాలలోనూ.. ఆమాటకొస్తే అన్ని కమ్యూనిస్టు రాజ్యాలలోనూ, రెఫ్యూజీ క్యాంపులలో అతి హీనగా, ఘోరంగా మరణించిన సామాన్యులే వాటికి సాక్షం. Srikanth.M
పల్లా కొండల రావు said...
@SNKR, సిద్ధాంతాలకు విసుగొచ్చినపుడు వాటిని వదిలేయవచ్చు. వ్యంగ్యం ఒక మానసిక రోగం అనేది కేపిటల్ లో మార్క్స్ చెప్పాలా? ఎదుటి మనిషిని గాయపరచేది ఏదైనా మంచిది కాదు. వ్యంగ్యానికి దూరంగా వుండడం అంటే దానికి భయపడడం కాదు మిత్రమా ! బురదకు దూరంగా , కంపుకు దూరంగా జరగడం భయపడడమా ? చెప్పండి. ఈ మాటలు ఖచ్చితంగా మిమ్ములను కించపరచాడానికి కాదని మనవి. మీరు ఇపుడు చేసిన వ్యాఖ్యలలో కమ్యూనిస్టులు ఆచరణలొ విఫల అంశాలు ,ఏ కమ్యూనిజం గొప్పది ? అని అడిగారు. ఖచ్చితంగా మీ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అపుడు కమ్యూనిస్టులకు వుంటుంది. అలా ప్రశ్నించాలి. నిలదీయాలి కూడా ? అలా మీరు ఎంతైనా విమర్శించొచ్చు కదా ? అనేదే నేను మీకు సూచించదలచుకున్నాను. సుజాత గారికి, కార్తీక్ గారికి కూడా నాకు తెలిసినమేరకు జవాబు ఇస్తాను. మీరైనా విషయం పై చర్చిస్తానంటే తప్పులేదు. కమ్యూనిస్టులేమీ ఆకాశంలో నుండి దిగిరాలేదు తప్పులు చేయకుండా గొప్పవారిగా వుండడానికి ? సిద్ధాంతం ఉండేది కమ్యూనిస్టులకేనా ఏమిటి ? అసలు సిద్ధాంతాలకే భయపదితే ఎలా ? ఆచరణలో నిరూపించబడింది ఏదైనా సిద్ధాంతమే. భూమి గుండ్రంగా ఉంది . ఇదో సిద్ధాంతం.అలాగే కమ్యూనిస్టు సిద్ధాంతం. మీరు అంగికరించాల్సిన అవసరం ఉన్నా లేకున్నా , మీరు దానికి భయపడాల్సిన అవసరం లేదు. దానిలో తప్పులను ఎంచి ఇదిగో , ఇందుకు నేను దీనిని వ్యతిరేకిస్తున్నాను అని చెపితే మీ వాదనలో బలముంటే దానినే నమ్ముతారు. ఎన్నేళ్ళు అరవాలనేది పరిస్తితులను బట్టి , సిద్ధాంతం చెప్పేవాళ్ళ ఆచరణ బట్టి వుంటుంది. ఒక వేళ సిద్ధాంతమే తప్పు అయితే దానికి మించిన సిద్ధాంతం వచ్చి తీరుతుంది. అంతే తప్ప మనిషిని-మనిషి పీడించే దోచుకునే ఈ పెట్టుబడిదారీ సిద్ధాంతం మాత్రం అంతం కావాల్సిందే . అందులో అణువంతైనా సందేహం నాకు లేదు.
పల్లా కొండల రావు said...
@ సుజాత గారికి, " ఏ ఇజాన్నైనా దాన్ని పాటించే వాళ్ళ మూలంగానే దానిని సామాన్యులు చేసుకుంటారు " అనేది నూటికి నూరు శాతం నిజం. అసలు సమస్య ఇక్కడే ఉంది. మొత్తం కమ్యూనిజం గురించి కామెంటుగా సమాధానం చెప్పడం సాధ్యం కాదు. నేను అంతటి సమర్ధుడను కూడా కాదు. మీరు రంగనాయకమ్మ గారిని ప్రస్తావించారు గనుక మీకో సూచన. ఆమె వ్రాసిన 'కాపిటల్' పరిచయం 2 భాగాలుగా ఉంది. ఓపికగా చదివితే తేలికగా అర్ధం అవుతుంది. మీరు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం అది. మీ ప్రశ్నలన్నీటికీ సమాధానాన్ని అందులో ఆమె అందరికీ అర్దమయ్యే రీతిలో వివరించింది. కారల్ మార్క్స్ తన జీవిత కాలం మొత్తం వెచ్చించి మానవ జాతి మనుగడకోసం అద్బుతమైన ఒక సిధ్ధాంతాన్ని , మార్గాన్ని రూపొందిస్తే దానిని మన భాషలో లేదా ఇతర భాషలలో అనువదించడానికి, ఆచరించడానికి ఘర్షణలు పడుతూ, తప్పులు చేస్తూ ప్రజలకు చేరువ కాలేకపొతున్నారు. ఇందులో ఎక్కువ శాతం సిధ్ధాంతాన్ని సక్రమంగా అర్ధం చేసుకోలేకపోవడం ఆచరణలో తప్పుడు మార్గాలు అనుసరించడమే కారణం అని నా అభిప్రాయం. కమ్యూనిజం బ్రహ్మ పదార్దం ఎంత మాత్రమూ కాదు. పుస్తకాలకీ, ఉపన్యాసాలకీ పరిమితమయ్యేది కూడా కాదు. ప్రస్తుతం మీరన్నట్లే ఉన్నా దానిని గురించి తెలుసుకుంటే లోపం యెక్కడుందో తెలుస్తుంది. కమ్యూనిస్టులలో తప్పుడు వాళ్ళనీ ఆ పార్టీలు అంతర్గత నిర్మాణ పధ్ధతుల్లో వదిలించుకుంటూనే వుంటారు. మనిషికి 2 సంబంధాలుంటాయి. ఒకటి ప్రకృతితోటి, రెండోది తోటి మనిషితోటి. ప్రకృతిలోని వనరులను ఉపయోగించుకుంటూ శ్రమ + ఆలోచన అనే ఆయుధాలతో మనుషులంతా కలసి జీవించడమే కమ్యూనిస్టు ఆశయం. దీనిని సాధించడానికి అడ్డువచ్చే దోపిడీదారులపై పోరాటమే కమ్యూనిస్టు పార్టీ పొరాటం. మీరడిగిన ప్రశ్నలకు కామెంట్ రూపంలో సమాధానం చెప్పడం సాధ్యం కాదు కనుక నేను నడిపే " జనవిజయం " వెబ్సైటు ద్వారా సమాధానం వ్రాయగలనని విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదములు.
పల్లా కొండల రావు said...
@ కార్తిక్ గారికి, మీకూ , నాకూ వ్యక్తిగత వ్యక్తిగత పరిచయం గానీ, ద్వేషం గానీ లేవు. " నా సంస్కారం గురించి మాట్లాడడానికి మీ అర్హత యేమిటో చెబుతారా ? " అని అడిగారు. ఒక్కసారి మీరు నేను రాసిన కామెంట్ ను, మీ కామెంట్ ను పరిశీలించి చూడగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను యెవరినైనా కించపరచినట్లు నిరూపిస్తే క్షమించమని కోరతాను. మీరు వ్యక్తులనైనా, సమూహాన్నైనా దగుల్బాజీ మొహాలు అనడం పధ్ధతికాదు అని చెప్పదలచుకున్నాను. మీరే కాదు ఇలా ఎవరు వాడినా నా సమాధానం అదే. అంతే తప్ప కార్తీక్ గారిని ప్రత్యేకంగా నేను కించపరచదలచుకోలేదు. ఆ అవసరం కూడా లేదు. కమ్యూనిస్టు అయిన ప్రతీ వాడికి అస్తిత్వం హింస మీదనే ఆధారపడి ఉంటుందనే అరోపణ మీ అభిప్రాయం మాత్రమే. వాటిని మీ అభిప్రాయంగా స్వేచ్చగా ప్రకటించుకునే హక్కు మీకు సంపూర్ణంగా ఉంది. కానీ దానిలో వాస్తవం లేదు అని మీతో పాటు ఇది చదివే వారందరికీ విన్నవించదలచుకున్నాను. వ్యక్తిగతంగా ఆ సమూహం వల్ల మీరు, మీ కుటుంబం వ్యథ అనుభవిచారనడమూ చాలా తప్పు. మీకు జరిగిన నష్టం నాకు తెలియదు. కానీ అది 'సమూహం' వల్ల ఎలా జరుగుతుంది? నేను కూడా ఆ సమూహంలో ఒకడిని. మీ బాధకు నేనెలా బధ్యుడను చెప్పండి. ఒకసారి ఆలోచించండి. మీకు కలిగిన బాధకు బాధ్యులైన వారు కమ్యూనిస్టులమని చెప్పుకోవచ్చు. అంత మాత్రాన మీరు 'కమ్యూనిజం' పైననే కక్ష కట్టడం సబబు కాదు. పైగా అది మీలో ఆక్రోషాన్ని పెంచుతున్నట్లుంది. అది కూడా మీకు కూడా వ్యక్తిగతంగా కూడా మంచి పరిణామం కాదు. కమ్యూనిస్టులమని చెప్పుకుంటూ ఒవర్ యాక్షన్ చేసే వారిలో బాధపడ్డవాళ్ళలో 'నేనూ' ఉన్నాను. నేను చెప్పేది అక్షరాలా నిజం. ఇలా చాలా మంది ఉంటారు కూడా. ఇది ఆచరణలో ఆ సిధ్ధాంతాన్ని అమలు పరిచే నిర్మాణంలో జరిగే వ్యక్తుల క్షమించరాని నేరాలు. దానికీ, కమ్యూనిస్టు సూత్రాలకి సంబంధం అంటగట్టడం. ఏకంగా ఒక సమూహాన్నే విమర్శించడం, శత్రుత్వం పెంచుకోవడం మంచిది కాదు.
SHANKAR.S said...
"వ్యంగ్యం ఒక మానసిక రోగం" క్షమించాలి కొండలరావు గారూ. ఈ తొక్కలో సామాన్యుడికి పనికిరాని కమ్యూనిజం గురించి నేను మీతో చర్చించదలచు కోలేదు. కమ్యూనిస్ట్ తో చర్చిండడం కన్నా కుక్కతో కరిపించుకోడం మేలు అని నా ఫీలింగ్. ఇకపొతే సాహిత్య పరంగా వ్యంగ్యం అనేది పేరడీల ముఖ్య లక్షణం. మీరు రోగం గట్రా అంటే పేరడీ రచయితలకి ఓ రేంజ్ లో కాలుద్ది మరి.భావ వ్యక్తీకరణలో అనేక శైలులు ఉంటాయి. అందులో వ్యంగ్యం ఒకటి. వ్యంగం మానసిక రోగం అనుకుంటే కార్టూనిష్టులని, పేరడీ రచయితలని అవమానిస్తున్నట్టే.
పల్లా కొండల రావు said...
నా వ్యాఖ్యలపై ప్రతివ్యాఖ్యలు చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు . వీటన్నింటికీ సమాధానంగా నేను నా బ్లాగు "జనవిజయం" లో ఒక పోస్టు వుంచుతానని మనవి . మీరు చెప్పిన విషయాలలో నాకు తెలియని విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తానని కూడా మనవి.
పల్లా కొండల రావు said...
@ SHANKAR.S గారూ ! "వ్యంగ్యం ఒక మానసిక రోగం " ఈ విషయం లో మీ సూచనతో నేను ఏకీభవిస్తున్నాను. వ్యక్తిగతంగా కించపరుస్తూ వ్రాయడాన్నే నేను తప్పు పట్టదలచుకున్నాను. సాహిత్య పరంగా శైలిని కాదు. ఈ విషయం లో నేను మీ సూచన మేరకు సవరణ చేసుకుంటున్నాను. ధన్యవాదాలు .
సుజాత said...
కొండల రావు గారూ, మీరు వివరించే శైలి బాగుంది. మీ బ్లాగులో వ్యాసాల కోసం చూస్తాను
నాకు వచ్చిన శ్రేయోభిలాషి మెయిల్ ఇది :
కొండల రావు గారు,
మీరు చెస్తున్న వాదన సరీయినదే కానీ ..కమ్యూనిష్టుల పేర్లు చెబితే మీతో వాదించే వాళ్ళు అడ్డం గా వాదిస్తారు. కాబట్టి  ఎవరైనా కమ్యూనిష్టు నేతలు తెలిసిన వారు ఉండి ఉంటే ..వారికి ఈ వాదనలు వినిపించండి. ప్రజాభిప్రాయాలను వారు కూడా తెలుసుకోవడం అవసరం. మీరు వారితో వాదన పెట్టుకోకండి. అనవసరంగా మీరు మాట పడవలసి వస్తుంది. ధన్యవాదాలు.


Edge said...
కొండలరావు గారు, "భూమి గుండ్రంగా ఉంది . ఇదో సిద్ధాంతం." భూమి గుండ్రంగా ఉంది అనేది ఒక నిరూపితమైన సత్యం, సిద్ధాంతం కాదు. మీ పొరపాటు గ్రహించగలరు.
Malakpet Rowdy said...
కొండలరావుగారూ, కమ్యూనిష్టులని generalize చేసినందుకు మీకు కోపం వచ్చింది. మరి మిరు చేస్తున్న పనేమిటి? మరి మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్తనే generalize చెయ్యట్లేదా? మీకొక నీతి, పక్కవాడికి మరొకనీతా?
SNKR said...
/ఒక వేళ సిద్ధాంతమే తప్పు అయితే దానికి మించిన సిద్ధాంతం వచ్చి తీరుతుంది./ It may, but communism has failed in the countries I cited. No practical way of implementing it in as it is. It is unwise to still believe, even after the proof! / అంతే తప్ప మనిషిని-మనిషి పీడించే దోచుకునే ఈ పెట్టుబడిదారీ సిద్ధాంతం మాత్రం అంతం కావాల్సిందే . అందులో అణువంతైనా సందేహం నాకు లేదు./ Till you prove communism as an alternative & superior to capitalism, you can only day dream for decades! That's what precisely I said.
పల్లా కొండల రావు said...
@ Edge గారూ ! మీరు చెప్పిన విషయం గురించి నేను తప్పకుండా ఆలోచిస్తాను. లోపం ఉంటే వెనుకకు తీసుకుంటాను.
పల్లా కొండల రావు said...
@ Malakpet Rowdy గారూ! కమ్యూనిస్టులని జనరలైజ్ చేసినందుకు నాకు కోపం వచ్చిందా ? అలా వస్తే వాదనకు భయపడ్డట్లు అవుతుంది. వ్యంగ్యంగా వ్యక్తిగతం గా సరైన భాష వాడనందుకు మాత్రమే నేను అభ్యంతరం వ్యక్తం చేశాను. వ్యంగ్యం గురించి నేను ఇంత క్రితం చేసిన కామెంట్ లో పొరపాటును సవరించుకున్నాను. కోపం తెచ్చుకోవడానికి మనమేమైనా శతృవులమా ? కమ్యూనిజం గురించి అయినా , కాపిటలిజం గురించి అయినా మనం ఒక సిద్ధాంతం గా చర్చిస్తిన్నాము అంతే. కమ్యూనిస్టులలో వెధవలు ,కేపటిస్టులలో ఉత్తములు ఉండవచ్చు. వ్యక్తుల బలహీనతలు - గుణగణాలు వేరు. మొత్తం సామాజిక వ్యవస్థ , సిద్ధాంతం వేరు . ఏ సిద్ధాంతాన్నైనా ఎంత జనరలైజ్ చేసైనా విమర్శించొచ్చు .ఆ సందర్భం లో వ్యక్తిగత విషయాలు-దూషణలు , ఈర్ష్యాద్వేషాలు ఉండకూడదు. ఉంటే అది వారి వ్యక్తిగత లోపం అవుతుంది.వీటిని చదివే వారు అవి గమనిస్తూనే వుంటారు. ఏ సిద్ధాంతమైనా ఇదీ,ఇందుకూ,ఇలా ... అనే పద్ధతిలో సమాజానికి మేలు చేసేదై ఉండాలి. మీ పేరు ఏంటీ అలా పెట్టారు ? తెలుసుకోవచ్చా ?
పల్లా కొండల రావు said...
@ SNKR గారూ ! మీరు చెప్పినట్లు చాలా దేశాలలో ఈ సిద్ధాంతం ఎందుకు ఫెయిల్ అయిందో కమ్యూనిస్టులు మధనం చేసుకోవాలి. సిద్ధాంతమే సరి అయినది కాదా ? దాని అమలులో లోపాలు ఉన్నాయా ? ప్రశ్నించుకోవాలి. సిద్ధాంతమే సరి అయినది కాదు అని తేలితే దానిని మించిన సిద్ధాంతం రావాలి. దీనికి కేపిటలిజం ఎంత మాత్రమూ ప్రత్యామ్నయం కాదు అని నేను విశ్వసిస్తున్నాను.
Next
Newer Post
Previous
This is the last post.

Post a Comment

  1. కొండల రావు గారూ,
    మొత్తానికి కమ్యూనిజాన్ని పక్కన పెడితే కమ్యూనిస్టులవల్ల ఒఱిగిందేమీ లేదని అంగీకరిస్తున్నారా?

    ReplyDelete
    Replies
    1. అచంగ గారూ!
      కమ్యూనిజాన్ని పక్కన పెట్టలేదు.చర్చలను లేదా నా అభిప్రాయాలను.ఇదే బ్లాగులో కొనసాగిస్తాను.

      Delete
    2. నాకు కమ్యూనిజం, దాని లోతుపాతులూ తెలిసింది తక్కువే. కాకపోతే నేను చదివిన ఎఱ్ఱ సాహిత్యం ఎఱ్ఱ బ్లాగులూ (ఎఱ్ఱ అని ఎక్కడ వచ్చినా కమ్యూనిస్టు అని చదువుకోవలసింది) అసలు కమ్యూనిజం అంటేనే నాకు మొహమ్మొత్తేలా చేసేశాయి. మరీ ఇంట్లో కోడి గుడ్డు పెట్టకపోయినా దోపిడీనే, దానికీ పెట్టుబడిదారీ వ్యవస్థే కారణం అనేలా కాకుండా కాస్త విషయాలు అర్థమయ్యేలా చెబుతారని ఆశిస్తున్నాను.

      Delete
  2. కొండల రావుగారూ,

    ఎప్పుడైనా సరే మానవుని జీవన విధానం కొందరు గుమికూడి నిర్ణయించలేదు. స్వతహాగా మానవులు తాము ఒక బృందంగా జీవించటం ఎలా జీవించాలి అన్నది కాలక్రమేణా అలా కలిసి మెలిసి జీవిస్తుండగా జరిగింది కాని ఏ ఒక్క వ్యక్తో, లేదా కొందరు కలిసో నిర్ణయించలేదు. దానికి కొంతమంది "కాపిటలిజం" అని పేరు పెట్టి దుయ్యబట్టటం మొదలు పెట్టారు. ఇదొక ముఖ్య కారణం, కమ్యూనిజం మీద సామాన్య ప్రజలకు వైముఖ్యం కలగటానికి.

    జన జీవన విధానాలు పార్టీ సభల్లోనూ, పోలిట్బ్యూరోల్లూనూ, విదేశీయులు వ్రాసే థియరీల ప్రకారం పరిణామం చెందవు. జన జీవన విధానం ఎప్పటికప్పుడు అప్పటి పరిస్థితులను బట్టి ప్రతిరోజూ పరిణామం చెందుతూనే ఉంటుంది. ప్రపంచం ఎప్పుడూ రెండు వర్గాలుగా అంటే పెట్టుబడీదారులు, పీడిత వర్గం అంటూ లేవు. అందరూ అన్ని పాత్రలను వాళ్ళకు కుదిరినప్పుడు, వీలైనప్పుడు పోషిస్తూనే ఉంటారు.

    ఇక బ్లాగుల్లో కమ్యూనిజం గురించిన చర్చ మీ దృష్టిలో ఎందుకు జరగటం లేదు అనుకుంటున్నారోకాని, నా దృష్టిలో ఒక ఇజం "ప్రచారానికి" ప్రత్యేక బ్లాగులు పెట్టి, ప్రతి విషయం ఎర్ర కళ్ళద్దాల్లోంచి చూపించటమే కాక, అక్కడ వాడబడే భాష, విపరీత మైన స్వోత్కర్ష, అసలు ఈ ఇజం ముందు మరేదీ నిలవదు, సంబంధం లేని విషయాలు కూడా ఈ ఇజానికి ముడేసి తీవ్రమైన విమర్శలు చెయ్యటం మిగిలిన వాళ్ళకు చీదర పుట్టించి చర్చ చేసే బదులు ఎదురు దాడికి దిగేట్టుగా చేశాయి. ఈ కమ్యూనిస్టులు అలవాటుపడిన "చారిత్రిక తప్పిదమే" బ్లాగుల్లోనూ చేశారు. విపరీతమైన " Holier than thou" attitude చూపించటం వల్ల అందరికీ దూరం అయ్యారు. ఎవరకి కమ్యూనిజం అనే విషయం తేట తెల్లమయ్యేట్టుగా చెప్పటం చాతకాదో, ఎవరి మీద ఐతే బ్లాగు ప్రపంచంలో చులకన భావం ఉన్నదో అటువంటి వాళ్ళను కూడా ఈ ఇజాన్ని పెంచి పోషించే ప్రయత్నం చెయ్యనియ్యటం కూడ మరొక ముఖ్య కారణం.

    వీళ్ళ "హాండ్లర్లకు" ఈ విషయం తెలీయపోవటం వల్ల జరిగిన దిద్దుకోలేని పొరబాటు.

    మీ శ్రేయోభిలాషి ఎవరోగాని బాగా చెప్పారు.

    ReplyDelete
  3. SIVARAMAPRASAD KAPPAGANTU గారికి !
    "ఎప్పుడైనా సరే మానవుని జీవన విధానం కొందరు గుమికూడి నిర్ణయించలేదు. స్వతహాగా మానవులు తాము ఒక బృందంగా జీవించటం ఎలా జీవించాలి అన్నది కాలక్రమేణా అలా కలిసి మెలిసి జీవిస్తుండగా జరిగింది కాని ఏ ఒక్క వ్యక్తో, లేదా కొందరు కలిసో నిర్ణయించలేదు"
    ఇది నిజం.ప్రజలే చరిత్ర నిర్మాతలు. మార్క్స్ చెప్పిందీ అదే. మార్క్స్ కూడా కాలక్రమేణా జరిగిన దానినే విశ్లేషించి భవిష్యత్ కాలం లో ఒక మంచి సమాజం ఇలా వుండాలీ, అందుకు ఇలా చేస్తే బాగుంటుందీ అని ఒక సిద్ధాంతం ప్రతిపాదించాడు. మక్కీకి మక్కి కాపీ కొట్టమనీ ఆయన చెప్పలేదు. మీ కామెంట్ లో చాలా వాస్తవాలున్నాయి. కమ్యూనిస్టులమని చెప్పుకునేవాళ్ళు వాదనల విషయం లో మార్చుకోవాల్సిన సూచనలూ ఉన్నాయి.మీ కామెంటు కు ధన్య వాదములు.
    నాకు తెలిసిన కమ్యూనిజాన్ని , నేను నేర్చుకున్న దానినీ "జనవిజయం" బ్లాగు ద్వారా సీరియల్ గా వీలు దొరికినపుడల్లా వ్రాయాలనుకుంటున్నాను.

    ReplyDelete
  4. OK GO AHEAD. ALL THE BEST.

    ReplyDelete
  5. kondala rao garu, first remove the add on your blog. It stands for capitalism.

    ReplyDelete
    Replies
    1. మిత్రమా !
      ప్రస్తుతానికి మనమంతా కేపిటలిజం లోనే ఉన్నాము.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top