కమ్యూనిజం - మార్క్సిజం అంటే ఏమిటి ?

  • " కమ్యూనిజం గురించి సవ్యంగా చర్చిద్దాం-1 " అనే అంశాన్ని ఇదే బ్లాగులో ఇంతక్రితం రాసిన దానికి కొనసాగింపుగా ఇపుడు కమ్యూనిజం-మార్క్సిజం అనే పదాలను గురించి క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను.
  • మనం మామూలుగా స్వర్గం - నరకం అనే పదాలు  వాడుతుంటాము. పుణ్యం చేసినవాడు స్వర్గానికి, పాపం చేసిన వాడు నరకానికి పోతాడంటారు. ఇది ఒక రకంగా పాప భీతితో కొంతైనా తప్పులు చేయకుండా ఉండడానికి ఉపయోగ పడుతున్దనుకుందాం. 
  • మనం చిన్నప్పట్నుండి అసలు స్వర్గానికి పొతే ఏమి జరుగుతుంది , నరకానికి పొతే ఏమి జరుగుతుంది. ఏది పాపం? ఏది పుణ్యం ? స్వర్గం-నరకం ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలు ఉదయించని మనసు ఉండదు అనడంలో అతిశయోక్తి లేదనుకుంటా!
  • కొంతసేపు స్వర్గం-నరకం, పాపం-పుణ్యం ఉన్నాయనీ అనుకుందాం. ఉంటే   అవి ఎలా ఉంటాయి? 
  • స్వర్గం అంటే ఏ స్వార్ధం , దోపిడీ , అవినీతి , అకృత్యాలూ,  మనిషిని మనిషి హింసించడం ఉండవనీ అంతా కలసి ఆనందంగా ఉంటారనీ అనుకుందాం! నరకం అంటే మనిషిని మనిషి హిమ్సిస్తాడనీ, స్వార్ధం, దోపిడీ, అవినీతి , అకృత్యాలూ మొదలైనవన్నీ ఉంటాయనీ అనుకుందాం!
  • మరి ఎవరైనా స్వర్గానికే పోవాలని కోరుకుంటారు కదా? ఎందుకు పాపాలు చేస్తున్నారు? అంటే గత జన్మకారణం అంటారు. గత జన్మలో పాపాలు చేస్తే నరకానికి గదా పోవలసిందీ మళ్ళీ భూమి మీద ఎందుకు పుట్టాలి. గత జన్మలో పుణ్యం చేస్తే స్వర్గానికి కదా పోవలసిందీ మళ్ళీ భూమి మీద పుట్టి రాజభోగాలు ఎందుకు అనుభవించాలీ?
  • కొందరు ఇలా రాజభోగాలు అనుభవించడానికీ అంతంత ఆస్తులు కూడబెట్టుకోవడానికీ, మరికొందరు ఆకలితో అలమటించడానికీ ఇదేనా కారణం?  ఇది కాక పొతే మరేదీ కారణం?
  • స్వర్గం-నరకం, పాపం-పుణ్యం లతో సంబంధం లేకుండా ఈ భూమి మీద ఉన్న మానవ జాతి సమైక్యంగా వసుధైక కుటుంబం లాగా ఉండలేరా ? ఒక వేళ  ఉంటే అది ఎలా ఉంటుందీ ? అదెలా సాధ్యమవుతుందీ? 
  • ఇలాంటి ప్రశ్నలు చాలామంది మదిలో మెదలాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా చిన్నతనంలో, యుక్తవయసులో ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. తరువాత సంసారం, బాదరబందీలు , సంపాదన వంటి వాటితో మరచిపోతుంటారు.
  • అయితే స్వర్గం-నరకం అనేవి ఉన్నాయా? లేవా? అనేవి పక్కన పెడితే,ఈ భూమి మీద వున్న మానవాళి మొత్తం కలసిమెలసి వసుధైక కుటుంబంలా అంటే మనం అనుకున్న స్వర్గం లా వుంటే ఎలా వుంటుందీ?
  • స్వార్ధం, దోపిడీ, హింస, యుద్ధాలూ, అకృత్యాలూ, పీడన, మనిషిని మనిషి కుల, మత, లింగ,  వర్ణ  ...  ఇలా అనేక రకాల విచక్షనలతో, వివేకం కోల్పోయి,నరకం లా తయారవుతున్న భూగోళాన్ని విముక్తి చేస్తే ఎలా వుంటుందీ?
  • ఇలా చేయడం సాధ్యమా?  అయితే మార్గం ఏమిటి?
  • అలా వుండే , మానవ జీవితం లో అత్యున్నత జీవన విధానం యొక్క రూపమే "కమ్యూనిజం". సమాజం నిరంతరం మారుతూ వుంటుంది. ప్రతి మార్పు పురోగమనం వైపే వుంటుంది. పాత దానికంటే కొత్తది మెరుగ్గా వుంటుంది. 
  • అలా పెట్టుబడిదారీ విధానం అంతరించి, సోషలిజం, తరువాత అది అంతరించి కమ్యూనిజమూ వస్తాయనీ ఇది మానవ సమూహము తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాల్సిన, ఏర్పాటు చేసుకునే ఇలలోని స్వర్గమనీ కారల్ మార్క్స్ కలలు కన్న అత్యున్నత మానవ జీవన విధానమే " కమ్యూనిజం".
  • అంతకు మించి ఇందులో గందరగోళ పడవలసిందీ , ఆందోళన చెందవలసిందీ ఏమీలేదు. ఇది ఎవరికీ ఇబ్బంది కూడా కాదు. కాక పొతే ఇబ్బంది పడేవారు వుంటారు. అలా ఉండకూడదనీ ఇబ్బందులు పెట్టేవారు, ఆటంకాలు కల్పించేవారూ  వుంటారు.  
  • ఈ ఆటంకాలు వారు ఎలా ఎందుకు కల్పిస్తారూ, చరిత్రలో ఇప్పటి వరకూ ఏమి జరిగింది , అసలు మానవాళి కలసి ఉండకుండా , తమ అత్యంత సహజ గుణమైన మానవత్వాన్ని కోల్పోతున్డడానికి కారణాలేమిటి? అనేవి చరిత్ర పరిణామా క్రమాన్ని సశాస్త్రీయంగా విశ్లేసించినదీ, ఈ ఆటంకాలను అధిగమించేందుకు ఎలా కృషి చేయాలో సూచిన్చినదే "మార్క్సిజం". 
  • ఈ సూత్రాలను గత అనుభావాలనుండీ , గత జ్ఞానం నుండీ జీవితాంతం కృషి చేసి ఒక మార్గం చూపాడు కనుక మార్క్స్ పేరుతొ ఈ సిద్ధాంతాన్ని పిలుస్తున్నారు. 
  • మార్క్స్ చెప్పిన లేదా కనిపెట్టిన సూత్రాలు వాస్తవానికి తేలికగా అర్ధమయ్యే విషయాలే అయినప్పటికీ వాటిని పడికట్టు పదాలుగా మార్చింది , వాటిని వివరించలేనిదీ ఉద్యమకారులమని చెప్పుకుని వాటిని సరిగా అర్ధం చేసుకోలేనివారే ననేది నా అభిప్రాయం. అత్యదికులకూ నాయకత్వ స్తానాలలో ఊన్నవారికీ మార్క్స్ సిద్దాంతం తెలియదు. ఊక దంపుడు ఉపన్యాసాలతో , పడికట్టు పదాలుగా పదే పదే గొప్ప పదాలను వాడుతున్నామనీ, తాము గొప్ప నాయకులమనీ డప్పాలు పోతుంటారు. అవి గొప్ప పదాలే . అందులో సందేహం లేదు. కానీ వాటిని  ఎవరికైతే అర్ధం కావాల్నొ వారికి అర్ధమయ్యేలా వారి ఉపన్యాసాలు-ఆచరణ ఉండదు. 
  • అసలు వారికి తెలిస్తే కదా ఆచరించడానికీ. ఎంతసేపూ నాయకుడిగా ఎదుగుదాము, ఎం.ఎల్.ఎ లు అవుదామనుకునే బాపతే ఎక్కువ. 
  • "మార్క్సిజం అవగతమైతే ఒక  శాస్త్రీయ సిద్ధాంతం . లేకుంటే పెద్ద తప్పిదం అవుతుంది "
  • కమ్యూనిస్ట్ ఆశయం మహోన్నతమైనది అనడంలో అనువంతైనా అనుమాన పడాల్సిన పని లేదు. కానీ అంత ఉత్తమమైన ఆశయం, సిద్ధాంతం పెట్టుకునీ ఏ మాత్రం ఆచరణ లేకపోతే దానిని సరిగా అర్ధం చేసుకుని ఆచరణలో అన్వయించి సమన్వయము చేయకపోతే ఉపయోగమేముంది. విమర్సలకు లోను కావడం తప్ప. 
  • కమ్యూనిస్ట్ సిద్ధాంతం మొత్తం చెప్పేంత పండితుడను కాను నేను. కానీ దీనిని సామాన్యులకు అర్ధం అయ్యేలా చెప్పాలనే ప్రయత్నం లో నాకు తెలిసిన మేరకు పోస్టులు వ్రాస్తాను. ఒక్కో అంశం పై చర్చలలో నేర్చుకున్నదానినీ సవరించుకుంటూ తెలియనిదానిని , తెలిసిన వారి వద్ద నుండి తెలుసుకుని కమ్యూనిస్ట్ ఆశయం గురించి , ఆకాశ మార్గం లో ఊన్న సిద్ధాంతాన్ని కొంచమైనా భూమార్గం పట్టించేందుకూ, అదీ ఎవరికైతే ఈ సిద్ధాంతం అందాల్నో వారికి ఇది అందేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను.
  • దీని తరువాత పోస్టు లింక్ :  http://www.janavijayam.com/2012/02/blog-post_7553.html

Post a Comment

  1. "...పెట్టుబడిదారీ
    విధానం అంతరించి , సోషలిజం , తరువాత అది అంతరించి కమ్యూనిజమూ వస్తాయనీ ఇది
    మానవ సమూహము తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాల్సిన, ఏర్పాటు చేసుకునే ఇలలోని
    స్వర్గమనీ కారల్ మార్క్స్ కలలు కన్న అత్యున్నత మానవ జీవన విధానమే
    కమ్యూనిజం......"

    ఈ "తప్పనిసరి" అన్న మాటతోనే సమస్య వస్తుంది. ఒకళ్ళకి తప్పనిసరి మరొకళ్ళకి అనవసరం అనిపించవచ్చుకదా. ఠాట్ వీల్లేదు తప్పనిసరే అని గుడ్లురిమి, అనవసరం అన్నవాళ్ళను సామాజిక ద్రోహులు, ఇంకా ఇలాంటివే మన భాషలో తిట్లు చాలనట్టు అదేదో తిట్టు మాటయ్యినట్టు ఒక ప్రెంచి మాట (బూర్జువా) ఆ మనిషి మీదకు ప్రయోగించి వాడు భయపడేట్టు చేసేవాడిని ఏమనాలి? కమ్యూనిజానికి అపకీర్తి తీసుకొచ్చేవాళ్ళు ఈ పిడివాదులే. వాళ్ళకు నచ్చితే, వాళ్ళ అవసరానికి అప్పటికి సరిపోతే ఇక ప్రపంచం మొత్తం అదే అనుసరించాలి అనుకునే నియంతలు. నియంతల మాటలు ప్రపంచంలో ఎక్కడా చెల్లుబాటు కాలేదు. చెల్లుబాటు అయినా కొద్దికాలం మాత్రమే.

    ఒకే ఆ మార్క్స్ ఏదో చెప్పాడు. అదే వేదమని నమ్మేయ్యటానికి ఎవరు సిధ్ధంగా ఉన్నారు. ఎంతో పవిత్రం గా భావిచే వేదాలనే మనం ఇవ్వాళ పట్టించుకోవటం లేదే! జన జీవన విధానం తనంతట తానుగా కాలక్రమేణా మారుతుంది అన్నది శతాబ్దాలుగా చూస్తున్నదే. ఒక వ్యక్తి ఇలా ఉండండి అంటే వెంటనే గొర్రెల్లాగ ప్రజలు అటు వెళ్ళరు. ఆ విషయన్ని తమకు ఎంతవరకూ అవసరం, లాభం అన్న విషయాల మీదనే ఆలోచించి బాగున్నది అంటే తమకు బాగున్నంతవరకు, అది తమకు చెడు చెయ్యనంతవరకు ఆ పధ్ధతిని అనుసరిస్తారు. ఎప్పుడైతే ఆ అవసరం తీరిందో వెంటనే విసర్జిస్తారు. ఇది మానవ సహజమైన ప్రవర్తన, దీనికి ఎవ్వరూ అతీతులు కారు.

    సరే మార్క్సిజం మానవ జీవిన విధానంలో ఎట్టాగో వచ్చేదే అది ఎంతో REFINED జీవన పధ్ధతి ఆ స్థితికి సమాజం చేరుకోగలిగితే (అదేదో మోక్షం లాగ) ఇక అంతా భూలోక స్వర్గమే అనుకుంటె, అలా దానంతట అది వచ్చేవరకూ ఆగాలి. తొందరపడి ఇప్పుడే కావాలి అనుకుంటే జరిగేదానా!! తొమ్మిది నెలల తరువాత పుట్టే పిల్ల గురించి కలలు కని రెండో నెలలో బలవంతాన డెలివరీ చేయిస్తే, జరిగేది ఏమిటి గర్భ విచ్చితి తప్ప సమాజంలో ఏదీ కూడా బలవంతాన కొద్దిమంది తుపాకులు పట్టుకుని, వాళ్ళ వాళ్ళ వాదలు తెగ వినిపించీ అచరణలోకి తీసుకు రాలేరు. తీసుకొచ్చిన చోట విఫలమయ్యింది.

    ReplyDelete
    Replies
    1. @ SIVARAMAPRASAD KAPPAGANTU గారూ !
      "తప్పనిసరి" అనే దానిలొ అసలు సమస్యే లేదు. "తప్పనిసరి" దేనికి అనేదానిని అర్ధం చేసుకొవడం లో, అర్ధం అయ్యేలా చెప్పడం లో వుంది సమస్య. బూర్జువా అనేది తిట్టు కాదు. మీరన్నట్టు ఫ్రెంచి పదాలనే మక్కీకి మక్కీగా వాడడం వల్ల ఈ ఇబ్బంది వస్తుందనుకుంటా ! బూర్జువా అంటే మనిషి కాదనీ దుర్మార్గుడు అనీ , అసలు బూర్జువా అంటేనే కాదు పెట్టుబడిదారుడిని కూడా దుర్మార్గుడిగా చిత్రీకరించడం కూడా మార్క్సిజాన్ని సరిగా అర్ధం చేసుకోక పోవడమే అని నా అభిప్రాయం.

      బూర్జువా విధానం వేరు. బూర్జువా వేరు. పెట్టుబడిదారుడు వేరు. పెట్టుబడిదారీ విధానం వేరు. కమ్మ్యూనిస్టులలో అందరూ పుచ్చలపల్లి సుందరయ్యలు ఉండరు.కమ్యూనిస్టు కానంత మాత్రాన మోహన్‌దాస్ కరం చంద్ గాంధీ "మహాత్ముడు" "జాతిపిత" కాకుండాపోడు.

      రాజు వేరు రాజరికం వేరు. ఒక రాజు మంచివాడు అయినంత కాలం రాజరికం పై ప్రజలలో తిరుగుబాటు రాదు. మనకు చరిత్ర తెలుసు. కానీ రాజరికం కంటే ప్రజాస్వామ్యం మెరుగైనది కాబట్టి "తప్పనిసరి"గా రావలసిందే. వచ్చింది కూడా. ఇక్కడ మంచి రాజా? చెడ్డరాజా అన్నది సమస్య కాదు. రాజరికం లోనే సమస్య. శ్రీకృష్ణదేవరాయల కీర్తి ని మనం 400 ఏళ్ళు దాటినా కీర్తించడం లేదా? అశోకుడు, చంద్రగుప్తుడు, శివాజీ ఇలా ఎందరు లేరు. రాజరికం కంటే ప్రజాస్వామ్యం మంచిది కనుక వాళ్ళను మనం దుర్మార్గులు దుష్టులు అనడం ఎంత తప్పో , పెట్టుబడిదారీ వ్యవస్థలో బూర్జువాలనీ వ్యక్తిగతంగా విమర్శించడం అంతే తప్పు.

      రాజరికం కంటే ప్రజాస్వామ్యం ఎలా బెటరో , ప్రజాస్వామ్యం కంటే సోషలిజం అలాగే బెటరు. సోషలిజం తరువాత అత్యుత్తమ దశ అయిన కమ్యూనిజమూ బెటరే . ఇది ఇందుకని తప్పనిసరి అవుతుంది. తప్ప మార్క్స్ చెప్పాడు కాబట్టి కాదు. ఆయన చెప్పకపోయినా వస్తుందని ఆ మహామేధావే చెప్పాడు.

      ప్రసాద్ గారూ ! చరిత్రలో ఏదీ తనంతట తనుగా రాలేదు-రాదని మనవి. అలాగే తొందరపడి ఇప్పుడే రమ్మంటే రాదనీ మీరు అభిప్రాయపడినట్లే మార్క్స్ అభిప్రాయం కూడా! ఏ వ్యవస్త అయినా ఆ వ్యవస్త వల్ల లాభం పొందేవాళ్ళు దానిని కొనసాగించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తారు. ఆ వ్యవస్త వల్ల ఇబ్బందులు పదుతున్న వాళ్ళు పోరాడి ఉన్న వ్యవస్త కంటే ఉన్నత వ్యవస్తను సాధించుకుంటారు. దీనికి ప్రజలు వాళ్లంతట వాళ్ళు నాయకత్వం లేకుండా చరిత్రలో ఎక్కడా సమీకృతులు కాలేదు. వ్యవస్థలు మారలేదు.

      ఇక్కడ కూడా ముందు సోషలిజాన్నీ తరువాత కమ్యూనిజాన్నీ సాధించేందుకు వ్యక్తులుగా కాకుండా కమ్యూనిస్టు పార్టీ ఉంటుందని ఆయన ప్రణాళిక రచించాడు. అదేమీ ఆచరణకు సాధ్యంగాని విధానమేమీ కాదు. ఎక్కువమంది ప్రజలు ఇబ్బందులు పదుతూ , వాల్ల ఆమోదం లేకుండా విప్లవం రాదు. వచ్చినా అది నిలవదు.

      మీరన్నట్లు ఠాట్ వీల్లేదు తప్పనిసరే అని గుడ్లురిమి, అనవసరం అన్నవాళ్ళను సామాజిక ద్రోహులు, ఇంకా ఇలాంటివే మన భాషలో తిట్లు చాలనట్టు అదేదో తిట్టు మాటయ్యినట్టు ఒక ప్రెంచి మాట (బూర్జువా) ఆ మనిషి మీదకు ప్రయోగించి వాడు భయపడేట్టు చేసేవాడిని ఏమనాలి? కమ్యూనిజానికి అపకీర్తితీసుకొచ్చేవాళ్ళు ఈపిడివాదులే.

      చక్రవర్తి, రాజు, భూస్వామి,జమీందారు,కామందు,పాలేరు,కూలివాడు లాగే బూర్జువా కూడా అతను బ్రతికే ఆధారం గురించి తెలిపే పదం. అంతే. దానికి మీరన్నట్లు తెలుగు లేదా మనకు అర్ధమయ్యె విధంగా పదాలు పెడితే ఇంకా మంచిది. ఈ పదాలు వేరు ఇజాలు అయిన రాజరికం, భూస్వామ్యం, కెపటిలిజం, సో్షలిజం, కమ్యూనిజం లాంటివి వేరు.

      Delete
    2. @ SIVARAMAPRASAD KAPPAGANTU గారూ !
      వేదాల గురించి నాకు పూర్తి అవగాహన లేదు. వేదాలు భారతీయ జీవన విధానం అని విన్నాను. అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా నాకు తెలుసు.తేలికగా అర్ధం అయ్యే బుక్స్ ఏమైనా వుంటే సూచించండి. కానీ , ఆయుర్వేదం చాలా గొప్పదనీ మనిషి ఆయుస్షు కు సంబంధించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికీ ఇందులో చాలా మంచి సూత్రాలుంటాయనీ , నేటికీ అది తిరుగులేని వైద్యశాస్త్రమని తెలుసు. అటువంటి ఆయుర్వేదాన్ని బాబారాందేవా లాంటి సన్యాసులమని చెప్పుకునే వాళ్ళు ఆయుర్వేదం లో చెప్పినట్లు గాక పనికిరాని వాటిని కలిపి వేల కోట్ల రూపాయలతో సౌందర్య వ్యాపారంగా మారుస్తున్నారంటే బ్రహ్మంగారు కాలజ్నానం లో చెప్పినట్లుగా పెట్టుబడిదారీ సమాజం లో ప్రతీదీ అనివార్యం గా 'సరుకు'గా మారుతుందనీ , మానవత్వపు విలువలన్నీ పతనమవుతాయానీ కాపిటల్ లో మార్క్స్ ఏనాడో చెప్పాడు. ప్రపంచం లోనే అత్యంత ఉన్నతమైన సంస్కృతి - జీవన విధానం - జీవన విలువలు కలిగిన పవిత్ర భారతదేశం లో విలువలు ఎందుకు పతనమవుతున్నాయి? ఈ పాపం పండక తప్పదు ? ఈ దుష్ట వ్యవస్థ పతనం కాక తప్పదు. నాస్తికులైనా , ఆస్తికులైనా మన భారతీయ విలువలను కాపాడుకోవడమ్లో సైద్ధాంతిక విభేదాలు పక్కన బెట్టాలి. కలసికట్టుగా పోరాడాలి. దేవుడి పేరుతో చెప్పినా , భౌతికవాదులు చెప్పినా తల్లిదండ్రులను గౌరవించడం నేర్పాలంటే సిధాంత రాధాంతాలు అవసరమా?

      Delete
  2. >>>>>
    ఒకళ్ళకి తప్పనిసరి మరొకళ్ళకి అనవసరం అనిపించవచ్చుకదా.
    >>>>>
    లాభాలూ, భోగ విలాసాలూ పెట్టుబడిదారునికే అవసరం కానీ కార్మికునికి అవసరం లేదు అని అంటే దాన్ని కార్మిక వర్గంవాళ్ళు నమ్మాలా?

    >>>>>
    ఎంతో పవిత్రం గా భావిచే వేదాలనే మనం ఇవ్వాళ పట్టించుకోవటం లేదే! జన జీవన విధానం తనంతట తానుగా కాలక్రమేణా మారుతుంది అన్నది శతాబ్దాలుగా చూస్తున్నదే.
    >>>>>
    పూర్వం కూడా వేదాలని పట్టించుకున్నవాళ్ళు చాలా తక్కువ. వేదాలే కాదు, ఏ మత గ్రంథాలైనా ఎక్కువగా స్వర్గం-నరకం, ఆత్మ లాంటి భౌతికతకి అందని విషయాలనే బోధిస్తాయి. భౌతిక లోకంలో జీవించేవాళ్ళు భౌతికతకి అందని విశ్వాసాల గురించి ఎంత వరకు పట్టించుకుంటారు. మనిషిని భావం కంటే భౌతికతే ఎక్కువగా ప్రభావితం చేస్తుందనేది మార్క్సిస్ట్‌లందరికీ తెలిసిన విషయమే. మార్క్సిజం పుట్టకముందు కూడా ఫ్రెంచ్ భౌతికవాదులు ఈ విషయాన్ని బలంగానే వాదించారు.

    ReplyDelete
  3. అందరికీ నమస్కారం..!
    పైన అచంగగారు చెప్పిన భావాలే ఇంచుమించు నాక్కూడా ఉన్నాయి. కమ్యూనిజం గురించి నాకు తెలిసింది తక్కువే. కమ్యూనిజం పూర్తిగా అంగీకారంకాకపోయినా అయినా కమ్యూనిస్టుల మీద ఏదో ఒక మూల గౌరవం ఉంది .. నా మట్టుక్కి..! పుచ్చలపల్లి సుందరయ్యగారి "వీర తెలంగాణ విప్లవ పోరాటం", నా అభిమాన పుస్తకాలలో ఒక్కటి.
    ఇప్పటి కమ్యూనిస్టులు జనాన్ని అర్థం చేసుకుని మసులుకోవట్లేదని నా అభిప్రాయం.
    ఒకప్పుడు విద్యార్థుల్లో వామపక్షభావాలు అధికంగా ఉండేవని విన్నాను. ఇప్పుడు అలా కాదు, విద్యార్థుల్లో కనీస అవగాహన కూడా లేదు. (తప్పా రైటా అని తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. ) నా దృష్టిలో ఇది ముమ్మాటికీ కమ్యూనిస్టులు (లేదా కమ్యూనిస్టులమని చెప్పుకునేవారి) స్వయంకృతమే..! పి.వీ గారి "లోపలి మనిషి"లో కమ్యూనిస్టులు జనం నుండి ఎలా దూరమయ్యారో వివరించారు.

    నాకు తోచిన చిన్న ఉదాహరణ.. రాముడు లేడని, పూజలూ, గుళ్లూ మానెయ్యమనీ వాదిస్తారు ఇప్పటి కమ్యూనిస్టుల్లో(?) చాలామంది. పాతతరం కమ్యూనిస్టు రచనల్లో రాముడు కూడా కమ్యూనిస్టే అని ఉండేదట. ఏది జనానికి నచ్చుతుంది..? రెండోదా..? మొదటిదా..?
    ఏ కొత్త సిద్ధాంతం అయినా, ఏ విశ్వాసం అయినా ఒక ప్రదేశంలోకి వ్యాపించాలి అంటే అది నేటివిటీ తగినట్టు మారాలి. అక్కడెక్కడినుంచో పట్టుకొచ్చి ఇక్కడ రుద్దుదామనుకుంటే స్థానికుల వ్యతిరేకతకి గురుకాక తప్పదు. నాకు తెలిసున్నంతవరకూ ఈ దేశంలో ఆ వ్యతిరేకతని ఇస్లాం, అనుభవించింది. బ్రిటీషువారు అనుభవించారు. బహుశా, ఇప్పుడు కమ్యూనిస్టుల వంతు..!
    (మీ బ్లాగులో కామెంటడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. దయచేసి స్పాం ఫిల్టర్ తొలగించగలరు)

    ReplyDelete
  4. @ వామనగీత గారికి ,
    నమస్కారం! కమ్యూనిస్టుల మీద గౌరవం ఉన్నందుకు, కామెంట్ కు ధన్యవాదాలు.

    'కమ్యూనిస్టు గాంధీ' గా పేరుగాంచిన పుచ్చలపల్లి సుందరయ్య గారంటే వ్యక్తిగతంగా అభిమానించని వారు అరుదు. కమ్యూనిస్టుగా ఆయన నిబద్ధత, కార్యాచరణే అందుకు కారణం. వ్యక్తిగతంగా ప్రగతిశీల భావాలున్న సుందరయ్యను మార్క్సిజం మరింత మెరుగుదిద్ది మహూన్నతుడిగా ఎదగడానికి దోహదం చేసింది.

    విద్యార్ధులతో పాటు కమ్యూనిస్టులు జనానికి దూరం కావడానికి గల అనేక కారణాలలో మీరు చెప్పినది (ఏ కొత్త సిద్ధాంతం అయినా, ఏ విశ్వాసం అయినా ఒక ప్రదేశంలోకి వ్యాపించాలి అంటే అది నేటివిటీ తగినట్టు మారాలి)కూడా కారణమే అనేది నూటికి నూరు శాతమూ నిజమే. అది చేయడం చేతకాకే భారత కమ్యూనిస్టులు చతికలబడుతున్నారు.

    కమ్యూనిస్టులు భౌతికవాదులు. అంటే ఈ విశ్వం ఏర్పడడానికి , నడవడానికీ గల కారణాలను వారు భౌతికవాద ధ్రుక్పథంతో చూస్తారు. అలా చూడడం శాస్త్రీయం.వాస్తవిక వాదం.

    రాముడైనా , అల్లా అయినా , జీసస్ అయినా దేవుడు లేడు అనీ , పూజలు,గుళ్ళూ మానేయాలని వాదించడం కమ్యూనిస్టు అనేవాడు చేయకూడని పని. అలా చేసేవాడు కమ్యూనిస్టు కానేకాదు. కమ్యూనిస్టు కార్యకర్త వేరు.సామాన్య ప్రజలు వేరు.

    ప్రజల సాంప్రదాయాలను,సంస్కృతిని,నమ్మకాలాను,విశ్వాసాలను అవి ఉన్మాదంగా మారి ప్రజలకి కీడు చేసే విధంగా మారితే తప్ప ఒక కమ్యూనిస్టుగా వాటిని గౌరవించడంలో అందరికంటే ముందుండాలి.

    రాముడు భారతీయ జీవన విధానంలో ఆదర్శ జీవనానికి ఒక సంకేతం. రాముడికి పూజ చేసి దోపిడీని వ్యతిరేకించడం , సమసమాజాన్ని కోరుకోవడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం కమ్యూనిస్టులకు లేదు.

    మార్క్స్ 'మతం మత్తు మందులాంటిది' అన్నదానిని కూడా చాలామంది తప్ప్పుగా అన్వయిస్తుంటారు. వైద్యంలో మత్తు మందు నొప్పి లేకుండా చేయగలుగుతుంది. దిక్కులేని పరిస్తితులలో బాధలనుండి స్వాంతన పొందడానికి దేవుడిని ఆశ్రయిస్తే తప్పు పట్టాల్సిన పని లేదు. నాకు తెలిసి ప్రస్తుతం పనిచేస్తున్న వామపక్ష ఎం.ఎల్.సీ లలో ఒక ప్రముఖ నేత సరస్వతీదేవి భక్తుడు అని విన్నాను. పూర్తిగా తెలియదు.

    కానీ బాధలు తీరాలంటే దేవుడిని ఆశ్రయిస్తే మాత్రమే సరిపోదు. అందుకు కారణాలయిన వాటిపై సంఘటిత పోరాటం చేయాలి. దీనికి కమ్యూనిస్టులు కాకపోయినా, ప్రతి భావవాది ఆచరణ లో భౌతికవాది గానే ప్రవర్తిస్తాడు కూడా.

    అక్కడెక్కడనుంచో... అనేది సంకుచితత్వం కిందికి వస్తుందని నా అభిప్రాయం. అక్కడెక్కడనుంచో వచ్చిందని మనం పాంట్ వేసుకోవడం లేదా? టీ త్రాగడం లేదా?ఇంటర్నెట్ - కంప్యూటర్, వైద్యవిదానాలు ఇతర అనేకం వాడడం లేదా? మంచి ఎక్కడున్నా గ్రహించాలి.

    ప్రపంచం లోనే అత్యున్నతమైన జీవనవిధానం-సంస్కృతి కలిగిన మన దేశంలో నేడు ఆ విలువలు పతనం కావడానికీ కారణం ఏమిటి? అవి కాపాడుకోవాలంటే ఏమి చేయాలి? ఎవరు భారతీయ విలువలను కాపాడగలరు? అది అలోచించాలని మనవి.

    ఇస్లాం పూర్తిగా భారతీయ జీవన విధానానికి సరిపడేది కాదు. అది ఒక మతం . బ్రిటీష్ వాడు మన దేశాన్ని ఆక్రమించి దోచుకున్న దొంగ.

    మార్క్సిజం పిడివాదం కాదు. ఒక దేశానికి లేదా సంస్కృతికి మాత్రమే పరిమితమైనది కాదు.అది అంతర్జాతీయమైన-మహూన్నత మానవాతా విలువలు కోరుకునే ఒక సమైఖ్య జీవనవిధానం.మార్క్సిజం అనేది మన దేశంలో, మన జీవనవిధానంతో, మన ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ దోపిడీ లేని సమసమాజాన్ని మనమే కలసికట్టుగా నిర్మించుకునేందుకు సహకరించే ఒక వజ్రాయుధం.

    బ్లాగులో కామెంట్లు వ్రాయడానికి మీరు చెప్పిన ఇబ్బంది అర్ధం కాలేదు . నాకు టెక్నికల్ గా అంత జ్నానం కూడా లేదు. వీలైతే మార్పిస్తానని మనవి.

    ReplyDelete
  5. పల్లాకొండలరావుగారు..!
    //రాముడికి పూజ చేసి దోపిడీని వ్యతిరేకించడం , సమసమాజాన్ని కోరుకోవడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం కమ్యూనిస్టులకు లేదు//
    అర్థం కాలేదు. ఇది వాక్య నిర్మాణంలోని దోషం కాకపోతే, కొంచెం వివరించగలరు.
    //అక్కడెక్కడనుంచో... అనేది సంకుచితత్వం కిందికి వస్తుందని నా అభిప్రాయం. అక్కడెక్కడనుంచో వచ్చిందని మనం పాంట్ వేసుకోవడం లేదా? టీ త్రాగడం లేదా?ఇంటర్నెట్ - కంప్యూటర్, వైద్యవిదానాలు ఇతర అనేకం వాడడం లేదా? మంచి ఎక్కడున్నా గ్రహించాలి.//
    అక్కడెక్కడినుంచో.. అనడం సంకుచితత్వం అన్నారు. మంచి ఎక్కడున్నా సరే గ్రహించాలి. కాదనను.
    ఒకసారి మీ బ్లాగులోని ఈ టపానొకసారి పరిశీలించండి.
    http://www.janavijayam.com/2012/02/blog-post_168.html
    రాసింది చెకుముకి సంపాదకులు.. ప్రచురంచింది ఒక కమ్యూనిస్టు పత్రిక.
    //ప్రస్తుతం రామేశ్వరం, శ్రీలంక మధ్య సముద్రపు పీఠంపై ఉండే 'ఆడమ్స్‌ బ్రిడ్జి'ని రామసేతుగా కొందరు విశ్వసిస్తున్నారు.//
    ఈ వాక్యాన్ని ఇంకొక్కసారి పరిశీలించండి..
    రామేశ్వరం, శ్రీలంకల మధ్య ఉన్నది ఆడమ్స్ బ్రిడ్జి.? దానినే రామసేతు అని విశ్వసిస్తున్నారా..? దీనికి రివర్స్‌లో కదా రాయాల్సింది. భారతీయుడై ఉండి భారతీయుల విశ్వాసానికి రెండో స్థానం ఇస్తారా.? ఎవరైనా..? దానికి ఆడమ్స్ బ్రిడ్జి అని నామకరణం చేసింది భారతీయులు కాదు. వాళ్ళు అలా పిలుచుకున్నా నష్టం లేదు. భారతీయులే స్థానికుల విశ్వాసానికి విలువ ఇవ్వకపోతేనే గొడవంతా వచ్చేది.
    కమ్యూనిస్టు నాయకులు మావో, క్యాస్ట్రో, చేగువేరాలాంటి వారు భారతీయులకి తెల్సు. అలాగ మనవారు ఎంతమంది విదేశీయులకి తెలుసు.? ఒక భగత్ సింగ్ తెలుసా..? ఒక అల్లూరి తెలుసా..?
    అంతెందుకు పురాణాల్లోని పరశురాముడు కూడా విప్లవకారుడే..! ఎంతమంది కమ్యూనిస్టులు పరశురాముణ్ని విప్లవకారుడుగా ఒప్పుకోగలరు..? "ఇదంతా విదేశీయిజం వలన వచ్చిన ఉత్పాతాలు"
    అందువలన విదేశీ ఎప్పుడూ విదేశీయే. అది మనల్ని ఎప్పటికీ గౌరవించదు.
    అదలా ఉంచండి.. మన రాష్ట్రంలో కులాల కుమ్ములాటలు కమ్యూనిస్టు సాహిత్యాల వల్లనే వచ్చాయి అని నా అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీలో బ్రాహ్మణుల, రెడ్ల పలుకుబడికి ఒక కులం అసంతృప్తికిలోనైంది (1940-50 మధ్యలో). ఆ అసంతృప్తిని తీర్చుకోడానికి, తొలగించుకోడానికీ వాళ్ళు సరైన దారిలో వెళ్ళకుండా, తప్పుదారి పట్టేలా చేసింది కమ్యూనిస్టు సాహిత్యమే. వాళ్లందరూ కమ్యూనిస్టు పార్టిలో చేరి కమ్యూనిస్టుల పేరుతో కులపిచ్చిని ఎగదోసారు. అది కాస్త మిగిలిన కులాలకి కూడా అంటుకుంది. విజయవాడ పరిసర ప్రాంతాలలోని కులపిచ్చి కమ్యూనిస్ట్ సాహిత్యం ("వర్గపోరాటం" సాహిత్యం) చలవే..!
    కమ్యూనిస్తుల "వర్గ పోరాటం" కాస్తా మన రాష్ట్రంలో "కులాల పోరాటం" అయింది.
    ఇక్కడింతకీ చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఈ మధ్య క్యూబా మాజీ అధ్యక్షుడు, ఫిడేల్ క్యాస్ట్రో "కమ్యూనిజం ఒక తప్పుడు సిద్ధాంతం", అని అర్థం వచ్చేలా ప్రకటన ఇచ్చాడు. దీనికి అంత ప్రచారం రాలేదు. మరి ఎందుకో..?

    ReplyDelete
  6. వామన గారు, సమాజం గురించి ఆలోచించేటప్పుడు భౌతిక ప్రపంచం గురించే ఆలోచించాలి. అందుకే మార్క్సిస్ట్‌లు భౌతికతకి దూరమైన దేవుడు-ఆత్మ లాంటి వ్యక్తిగత విశ్వాసాలకి దూరంగా ఉంటారు. మార్క్సిస్ట్‌ల సంగతి సరే. ఇప్పుడు ఉన్న పాలక వర్గంవాళ్ళైనా అన్ని సందర్భాలలోనూ విశ్వాసాల పేరు చెప్పుకోలేరు. ఒక ఉదాహరణకి మీరు ఒక పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఫలానా వ్యక్తి చనిపోయాడనీ, అతన్ని దెయ్యం చంపిందనీ కంప్లెయింట్ ఇచ్చారనుకోండి. దెయ్యం మనిషిని చంపిందనే కథని పోలీసులు నమ్మరు. ఎందుకంటే వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా కేస్‌లు వ్రాయడానికి రూల్స్ ఒప్పుకోవు. ఒక గ్రామంలో మంత్రగాడు ప్రజలని భయపెట్టి డబ్బులు లాగడానికి ఆ గ్రామంలో దెయ్యం తిరుగుతోందని వదంతి సృష్టించాడనుకోండి, అప్పుడు ఆ వదంతులని నమ్మొద్దు అని చెప్పడానికి పోలీసులు గ్రామానికి వెళ్తారు కానీ మనిషిని దెయ్యం చంపిందనో, చేతబడి చేసి చంపారనో చెపితే ఆ కథలు ఆధారంగా కేస్‌లు వ్రాయడానికి పోలీసుల రూల్స్ ఒప్పుకోవు. ఒక డాక్టర్ వ్యక్తిగతంగా ఆత్మల మీద విశ్వాసం ఉన్నవాడైనా పోస్ట్-మోర్టెమ్ చేసేటప్పుడు శవంలోని ఆత్మ క్షోభిస్తుందనే వాదనని నమ్మడు. కేవలం మార్క్సిజంలోనే కాదు, ఎందులోనైనా పని జరగాలంటే వ్యక్తిగత విశ్వాసాలని కొంచెం అయినా పక్కన పెట్టాల్సి వస్తుంది. అందుకే చాలా మంది మత విశ్వాసులు కూడా నిజ జీవితంలో చాలా విషయాలలో వ్యక్తిగత విశ్వాసాలని కొంచెం పక్కన పెట్టి పని చేస్తుంటారు.

    రాముడు విప్లవకారుడా, కాదా అని ప్రశ్న అడిగితే నేను ఇలా సమాధానం చెపుతాను. "కొన్ని క్రైస్తవ, ఇస్లామిక్ దేశాలలో మత నాయకుల నాయకత్వంలో విప్లవాలు వచ్చాయి. ప్రైవేట్ ఆస్తి సంబంధాల గురించి మతం ఏమీ చెప్పలేదు కాబట్టి ఆ దేశాలలో కూడా ఒక దోపిడీ వర్గం పోయి ఇంకో దోపిడీ వర్గం అధికారంలోకి రావడం జరిగింది. ఇండియాలో సాధారణ ప్రజలు రాముణ్ణి ఎలా హీరో అనుకుంటారో, ఇజ్రాయెల్‌లో సాధారణ ప్రజలు మోజెస్ (మోషే)ని అలాగే హీరో అనుకుంటారు. కానీ విప్లవ తత్వశాస్త్రం తెలిసిన మార్క్సిస్ట్‌లు అలా అనుకోరు".

    ReplyDelete
  7. ప్రవీణ్ గారూ..!
    విప్లవం విష్యయంలో నేననేది "పరశురాముడి" గురించి... రాముని గురించి కాదు. మీరు వ్యత్యాసం ఎరుగుదురని భావిస్తున్నాను.
    రాముడు సామ్యవాది. అందరూ సమానమే అని చాటినవాడు.
    మీరన్నట్టు, భౌతిక విషయాలకి విశ్వాసం ముడివేయకూడదు, ప్రభుత్వ పరిపాలనలో అస్సలు వేయరు. (ఇప్పుడే కాదు పూర్వకాలంలో కూడా). అయితే, దీనికీ మినహాయింపులు ఉంటాయి. దాన్ని అపార్థం చేసుకునేవారే ఎక్కువమంది.
    పైన రామచంద్రయ్యగారి వ్యాసంలో "ఆడమ్స్ బ్రిడ్జి", సైన్సుగానూ, "రామసేతు"అనేది విశ్వాసంగానూ చెప్పబడింది. నిజానికి రెండూ విశ్వాసాలే, ఒకటి క్రైస్తవుల (అబ్రహామిక మతాలు కూడా) విశ్వాసంకాగా, రెండోది స్థానికులైన భారతీయుల విశ్వాసం.
    వారి వాదన ప్రకారం సహజసిద్ధంగా ఏర్పడిందనే అనుకున్నా, "ఆడ మ్స్ బ్రిడ్జి" అని పేరు పెట్టడం విశ్వాసం కిందకే కదా వస్తుంది. విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకున్నపుడు, స్థానికుల విశ్వాసాలని పరిగణలోకి తీసుకోవడంలో వచ్చిన నష్టం ఏమిటీ అనేది సోకాల్డ్ "విజ్ఞాన"వేత్తలు చెప్పాలి. అది ప్రచురించిన పత్రికవాళ్లు చెప్పాలి.
    "అతి సర్వత్ర వర్జయేత్" అనేది భారతీయ సూక్తి. సామ్యవాదమైనా, కేపిటలిజం ఐనా, ప్రజాస్వామ్యం అయినా కూడా.! (ఆదర్శ వ్యవస్థ అనేది ఏదీ లేదని అనుభవజ్ఞుల ఉవాచ.)
    దానికి వ్యతిరేకంగా "అతి" ఎవరు చేసినా గర్హనీయమే.. ఎవరూ హర్షించరు.

    ReplyDelete
  8. @ వామనగీత గారూ !
    ఒక వ్యక్తి నాస్తికుడా? ఆస్తికుడా? అనేదానికంటే దోపిడీని వ్యతిరేకిస్తున్నాడా? లేదా ? అనేదే ముఖ్యం. రాముడ్ని పూజించేవాడు దోపిడీ వ్యతిరేకంగా పోరాడ్డానికి కలసి వస్తానంటే , "నువ్వు రాముడిని పూజిస్తున్నావు కాబట్టి మేము నీ పోరాటాన్ని అంగీకరించం" అని అనాల్సిన అవసరం కమ్యూనిస్టులకు లేదు అని నేను చెప్పదలచుకున్నది.

    మన విప్లవకారులలో అల్లూరి సీతారామరాజు భక్తుడు . భగత్ సింగ్ నాస్తికుడు . వీల్లిద్దరి దేశభక్తిని శంకించగలమా ? చెప్పండి. విప్లవకారుడిగా వుండడానికీ దేవుడిని నమ్మడానికీ పెద్దగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. కానీ కమ్యూనిస్టుగా ఈ భౌతికప్రపంచాన్ని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలనుకునే వాడు దేవుడి మీద కంటే ప్రజలమీద, ప్రకృతిమీద ఎక్కువ విశ్వాసం ఉంచుతాడు.

    కమ్యూనిస్టు పత్రికలో చెకుముకి సంపాదకులు రామసేతు గురించి చక్కగానే వివరించారు. రామచంద్రయ్యగారు చెప్పిన విజ్నాన విషయాన్ని మాత్రమే చూడగలరు. పేరు ఎదైతే ఏమిటి?మీరు అడిగినట్లు ముందూ .. వెనుక ...పద్ధతి కరెక్టు కాదు. ముందు భూమి బల్లపరుపుగా వుందని బైబిల్ లో చెప్పారు. తరువాత భూమి గుండ్రంగా వుందని శాస్త్రీయంగా ఋజువయింది. మరి ముందు బైబిల్ లో చెప్పారు కాబట్టి బల్లపరుపుగా వుందని మేము నమ్ముతాము అంటే అది నమ్మేవాల్ల ఇష్టమే తప్ప అది నిజం కాదు. హిందూ మతం లో భూమిని గోళం గానే భావిస్తారు. హిందూ మతం లో వుంది కాబట్టి కరెక్టూ కాదు. అలా అని ఫలానా మతం లో వున్నవన్నీ లేదా మతగ్రంధాలు చెప్పేవన్నీ తప్పూ అని కాదు. ఈ మత విశ్వాసాలను ఎపుడైతే , దేనికైతే శాస్త్రీయ ఆధారం చూపగలుగుతారో వాటినే ఎవరైనా విశ్వసిస్తారు. దీనికి కమ్యూనిస్టే కావలసిన అవసరం లేదు.అసలు ప్రతి భావవాది కూడా ఆచరణలో భౌతికవాదిగా వుండక తప్పదు.ఈ విషయం లో ప్రవీణ్ గారి వివరణ తో నేను ఏకీభవిస్తున్నాను.

    మన దేశానికి చెందిన గాంధీ, స్వామీ వివేకానంద వంటి వారు విదేశాలలో కూడా తెలుసు. అయితే ఇక్కడ మీ వాదన లేదా ప్రశ్నలో మీరు సూచించిన వారు ప్రపంచమంతటా తెలవడానికీ , మనవారు ఇతరులకు తెలవక పోవడానికీ కారణం విదేశీయిజం వల్ల వచ్చిన ఉత్పాతం కాదు. మనదైన భారతీయత ఇంకా మనదేశం లో మిగిలిలేదు. భారతీయ విలువలు పడిపోవడానికి ,మహాత్ముడు నిర్వచించిన స్వయం సంపూర్ణ గ్రామీణ వికాసం నాశనం కావడానికీ పెట్టుబడిదారీ సంస్కృతే కారణం . భారతీయ విలువలు కాపాడబడాలన్నా కమ్యూనిజమే దోహదం చేస్తుంది తప్ప పెట్టుబడిదారీ విధానం కాదు. ఏదీ స్వదేశీ విదేశీ అని నిలవదు. ఏది మంచిదో , ఏది మెరుగైనదో అదే నిలుస్తుంది. ఇది ఏ దేశంలో నైనా ఒకటే .

    పురాణాలనే విశ్వసించని కమ్యూనిస్టులని ... అందులో ఫలానా వ్యక్తిని ఫలానా విధంగా చూడండి .. ఎందుకు చూడరు ..ఎంతమంది ఒప్పుకోగలరు ? అని అడిగితే ఎలాగండీ ? కాకుంటే పురాణాలలో చెప్పే శాస్త్రీయమైన భౌద్ధిక విలువలను,మానవతా విలువలను ఆచరణలొ పాటించడం లో వాటిని చెప్పినవారికంటే ముందుండాలని " మంచి కమ్యూనిస్టు ఎలా వుండాలీ ? " అనే పుస్తకం లో కామ్రేడ్ లీషావ్ చీ వివరిస్తారు.

    మార్క్సిజం ఒక శాస్త్రం . అంతర్జాతీయ మానవతా వాదం . దీనికి దేశం, ప్రాంతం, మతం వంటి అడ్డుగోడలు వుండవు. ప్రకృతికీ , మనిషికీ ఉన్న సంబంధాలను శాస్త్రీయంగా గమనిస్తూ ఎప్పటికపుడు మెరుగైన మానవ జీవితం అందించేందుకు ఉపయోగపడే సాధనం కనుక దీనికి ఆ శక్తి వుంది. అంతే తప్ప బలవంతంగా బుర్రకెక్కించేది అసలే కాదు. బలవంతంగా ఎక్కించినదేదీ నిలవదు కూడా!

    కులాల గురించి కమ్యూనిస్టులపై మీ వాదన పూర్తిగా తప్పు. ప్రపంచం లో ఎక్కడా లేని ఒక దుర్మార్గమైన అంశం కులం. మనిషిని మనిషి అణచివేయడానికి ప్రపంచమంతా దోపిడీదారులు ఉపయోగించినది ఒక రకమైన సాధనాలు కాగా మన దేశం లో కులం అనే దానిని ప్రయొగించారు. ప్రయోగిస్తున్నారు. కమ్యూనిస్టుల వర్గ పోరాటం కుల పోరాటం గా మారిందని అనడం అంటే వర్గపోరాటం పై పూర్తిగా అవగాహన లేకనే కావచ్చు.


    కాష్ట్రో ప్రకటన గురించి నాకు తెలియదు. కాష్ట్రోనా ? మరొకరా ? ఆఖరకు మార్క్సే దిగివచ్చి చెప్పినా కమ్యూనిస్టు సిద్ధాంతం సరిగా తెలిసిన వారు దానిని తప్పుడు సిద్ధాంతంగా అంగీకరించరు. ఎందుకంటే అది ఒక సత్యం కనుక. ఎన్ని సార్లు విఫలమైనా సిద్దాంతాన్ని ఆచరించడం లోనో , లేక నిర్మాణ సూత్రాలలోనో , కెరీరిజంతో కమ్యూనిస్టులు పెట్టుబడిదారుల కంటే నియంతృత్వగానో మారితే వాటికి ఏమి చేయాలనేది మళ్ళీ ఆలోచించుకోవాలే తప్ప కమ్యూనిస్టు మూల సూత్రాలనుండి ఎంత ఆలోచించినా తిరిగి తిరిగి మళ్ళీ అక్కడకు రావలసిందే.

    ReplyDelete
  9. నేను మార్క్సిస్ట్‌నే కానీ గతంలో మార్క్సిజాన్ని వ్యతిరేకించే రావిపూడి వెంకటాద్రి అనే నాస్తికుని రచనలు చదివేవాణ్ణి. అతను మార్క్సిస్ట్ గతితార్కిక-చారిత్రక భౌతికవాదాన్ని విమర్శిస్తూ రచనలు వ్రాసేవాడు. సమాజం మార్పుకి లొంగని కొన్ని సూత్రాల ఆధారంగా నడుస్తుందనీ, వాటిని మార్చడం సాధ్యం కాదనీ వాదించేవాడు. సమాజ పరిణామంలో కమ్యూనిజమే అంతిమ గమ్యం అనే చారిత్రక భౌతికవాద సూత్రాన్ని అంగీకరించేవాడు రామ భక్తుడైనా, ఏసుక్రీస్తు భక్తుడైనా అతనితో కలిసి పని చెయ్యడానికి కమ్యూనిస్ట్‌లకి అభ్యంతరం ఉండదు. చారిత్రక భౌతికవాదంలోని మౌలిక సూత్రాలని అంగీకరించనివాడు నాస్తికుడైనా కమ్యూనిస్ట్‌లు అతనితో కలిసి పని చెయ్యలేరు. మార్టిన్ హీడెగ్గర్ గొప్ప నాస్తికుడు కానీ అతను కమ్యూనిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించే జెర్మన్ నాజీ పార్టీలో చేరాడు. జీన్-పాల్ సార్ట్ర్ కూడా నాస్తికుడే. అతను మార్క్సిజం చదివాడు కానీ మార్క్సిజానికి దూరమైన థియరీలు ప్రతిపాదించేవాడు. అయినప్పటికీ అతను తాను మార్క్సిస్ట్‌ననే చెప్పుకునేవాడు. రెండో ప్రపంచ యుద్ధం & వియత్నాం యుద్ధాల విషయంలో అతను కమ్యూనిస్ట్‌ల వైపే ఉన్నాడు కానీ చాలా సందర్భాలలో అతను కమ్యూనిస్ట్‌లకి దూరంగా ఉండేవాడు. అయినా మతాన్ని విశ్వసించడం లేదా విశ్వసించకపోవడం అనేది పెద్ద విషయం కాదనే నేను నమ్ముతాను.

    ReplyDelete
  10. @ प्रवीण् शर्मा గారూ !
    సరిగా చెప్పారు. ప్రతి భౌతికవాదీ కమ్యూనిస్టు కాడు . కానీ ప్రతి కమ్యూనిస్టూ ఖచ్చితంగా భౌతికవాదిగా ఉంటాడు. అదే సందర్భమ్లో ప్రజల విశ్వాసాలను గౌరవించడంలో ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రజలను ప్రేమించడం లో కమ్యూనిస్టు అందరికంటే ముందుండాలి. కమ్యూనిస్టు సిద్ధాంతం వేరు . ప్రజా జీవితం వేరు. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ నీళ్ళల్లో చేప మాదిరిగా కమ్యూనిస్టు ప్రజలలో కలసి వుండలే తప్ప వారికీ దూరం కాకూడదు. అది సిద్ధాంత వాదన అయినా , కార్యాచరణ అయినా .

    ReplyDelete
  11. మార్క్సిజం భౌతికవాద శాస్త్రమే అయినా అది సామాజిక ప్రయోజనాలని కాంక్షించే భౌతికవాద శాస్త్రం. తన వ్యక్తిగత భౌతిక ప్రయోజనాలే ముఖ్యం అనుకునేవాడు కూడా లాజికల్‌గా భౌతికవాదే అవుతాడు. కానీ వ్యక్తికీ, సమాజానికీ మధ్య సమతుల్యత ఉండాలని అర్థం చేసుకుంటేనే అతను మార్క్సిస్ట్ అవ్వగలడు. వ్యక్తి వేరు, సమాజం వేరు అనుకుంటే అతను మార్క్సిస్ట్ అవ్వలేడు.

    ReplyDelete
  12. @ प्रवीण् शर्मा గారూ !
    మీరన్నట్లు వ్యక్తి వేరు-సమాజం వేరు కాదు.

    దీనికి కమ్యూనిస్టులపై విపరీతార్ధాలు తీస్తుంటారు. చాలా ఉన్నతమైన ఈ భావనని చాలా నీచంగా కూడా ఉదహరిస్తుంటారు.తెలిసి కొంత . విపరీతమైన కమ్యూనిస్టు ద్వేషం తో కొంత ఇలా చేస్తుంటారు.

    తెలియనివారికి నేను చెప్పదలచుకుంది. వ్యక్తి వేరు సమాజం వేరు అనుకోకూడదు అంటే అసలు వ్యక్తిగతమే ఉండదు అని కాదు.

    వ్యక్తిగతం వుంటుంది. కుటుంబం వుంటుంది. అది ఇప్పటి మాయదారి మనసులున్న కుటంబం కంటే అసలైన వ్యక్తిత్వానికి విలువలు ఇచ్చే పవిత్ర కుటుంబం ఉంటుంది. కొన్ని సామజిక వ్యవస్థలు కూడా ఉంటాయి.

    అంతకు మించి ఏ బంధనాలూ ఆఖరుకు కమ్యూనిస్టు పార్టీ బంధనం కూడా రద్ధయితేనే కమ్యూనిజం ఏర్పడుతుంది.

    నేను ఉంటుంది. కానీ అది ఎల్లవేళలా మనములో ఒదిగి ఉంటుంది. ప్రకృతితో , మనిషితో ఉండే రెండు సంబంధాలు మానవతా సహజ విలువలతో ఉన్నతంగా ఉంటాయి.

    ReplyDelete
  13. How can you allow joker like Praveen Sarma to enter into discussion if you want proper discussion.

    ReplyDelete
  14. కొండలరావుగారూ..!
    మీరంటున్న దాంట్లో పరస్పర విరుద్ధ భావాలు ఉన్నట్లు తోస్తున్నది. ఒకదగ్గర కమ్యూనిస్టులు పురాణాల్నే విశ్వసించరు అంటున్నారు, ఇంకోచోట వాటిని గౌరవించడంలో అందరికన్నా ముందు ఉంటారంటున్నారు. అలాగే, //అందులో ఫలానా వ్యక్తిని ఫలానా విధంగా చూడండి .. ఎందుకు చూడరు// అని నన్ను అనవద్దన్నారు. మీరు రామచంద్రయ్యగారి వైఖరిని సమర్థిస్తూ //రామచంద్రయ్యగారు చెప్పిన విజ్నాన విషయాన్ని మాత్రమే చూడగలరు. పేరు ఎదైతే ఏమిటి?// అన్నారు.
    ఫలానా మతంలో ఉన్నది కరెక్టు, ఇంకో మతంలో ఉన్నది తప్పు అని నేను అనడం లేదు. "నాసా"వారు ఆ నిర్మాణానికి (సహజసిద్ధమా, మానవనిర్మితమా అని పక్కనబెట్టండి) "ఆడమ్స్ బ్రిడ్జి" అని నామకరణం చేసింది క్రైస్తవుల విశ్వాసాన్ని అనుసరించే..! "floating rock bridge" అని కూడా నామకరణం చెయ్యొచ్చు. కానీ అలాగే ఎందుకు పేరు పెట్టుకున్నారు? వారి విశ్వాసానికి విలువనిచ్చి కాదా..! అదే విలువ భారతీయుల విశ్వాసానికి ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నాను.. అదీ భారతీయులై ఉండి..! రామచంద్రయ్యగారి వ్యాసాలన్నీ ఇలాగే ఉంటాయి, చీటికీమాటికీ భారతీయులు విశ్వాసాలని చులకనచేస్తూ..! ఇంతకీ విశేషం ఏంటంటే ఆయన చులకనచేసే విశ్వాసాల్లో కొన్ని శాస్త్రీయంగా నిరూపించబడినవి ఉండడం.
    శాస్త్రీయంగా నిరూపించాలి అన్నారుగా. ఏ శాస్త్రం ప్రకారం నిరూపించాలి.? సమగ్రమైన శాస్త్రం ఒక్కటీ లేదే..? అన్ని శాస్త్రాలూ మెలకెత్తే దశలోనే ఉన్నాయి. ఇప్పుడు తప్పన్నది రేపొద్దున్న కరెక్టు కాదని ఎవరు చెప్పగలరు.? ఇంతోటిదానికి తరతరాలుగా వస్తున్న విశ్వాసాలని అగౌరవపరచాల్సిన అవసరం లేదు.
    ఇంకో విషయం , //ఈ మత విశ్వాసాలను ఎపుడైతే , దేనికైతే శాస్త్రీయ ఆధారం చూపగలుగుతారో వాటినే ఎవరైనా విశ్వసిస్తారు// ఇది తప్పు, "Faith comes only, if logic fails".

    ReplyDelete
  15. @ వామనగీత గారూ !

    మరోసారి పరిశీలించండి . నేను పరస్పర విరుద్ధ అంశాలు చెప్పడం లేదు. ఒక అంశం పట్ల పరస్పరంగా ఎలా ఉండాలో చెప్పాను. నా భావాలు పరస్పరంగా విరుద్ధంగా లేవు. మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తాను.

    వ్యక్తిగత విశ్వాసం వేరు. ఎదుటివారి విశ్వాసాలను గౌరవించడం వేరు.ఉదాహరణకు నేను దేవుడిని నమ్మను. వామన గీత గారు దేవుడిని నమ్ముతారు అనుకుందాం. నేను దేవుడిని నమ్మను కాబట్టి మీరు పూజ చేసి,బొట్టు పెట్టుకుని వస్తే మిమ్ములను నేను కించపరచడమో - శతృవుగా చూడడమో చేస్తే అది తప్పు. ఇద్దరం కలసి ఏదైనా మంచిపని చేయవచ్చు. దీనికి మన విశ్వాసాలు అడ్డు రావు.

    ఆడంస్ బ్రిడ్జ్ అని రామచంద్రయ్య గారు పేరు పెట్టలేదు కదా ? ఆ పేరుతో ఇప్పటికే ఉన్నదానిని ఆయన అలానే వాడారు. అందులో తప్పేమీ లేదే . ఆయన వాదన పేరు గురించి కాదు కదా ? నీళ్ళపై రాళ్ళు ఎలా తేలియాడుతాయని . దానినే చూడండి అన్నాను.

    రామచంద్రయ్య గారూ పదే పదే ఒక మతం వారి విశ్వాసాలను కావాలని కించపరిస్తే అది తప్పే. మీరు అన్నది నిజమే అయితే , ఆధారాలతో ఆయనకు ఒక లేఖ వ్రాయండి తప్పక మార్చుకుంటారు.నాకు తెలిసినంత వరకూ ఒక మతం వాళ్ళనే పని గట్టుకుని విమర్శించే పని చేయాల్సిన అవసరం ఆయనకు లేదు.పాఠకులు అడిగిన ప్రశ్నలకు రామచంద్రయ్యగారు సమాధానాలు ఇస్తుంటారు.

    ఏ శాస్త్రం సరైంది కాదు అనే భావన తప్పు. సరి అయినదే శాస్త్రం అవుతుంది. మీరన్నదానిలో వాస్తవం ఏమిటంటే ఏదీ శాశ్వత సత్యం ఉండదు. కానీ అప్పటివరకూ నిరూపించబడినదానినే ప్రామాణికంగా తీసుకోవడం తప్పు కాదు. అలా చేయడమే చేయాల్సింది - అప్పటికీ చేయగలిగింది. అంతకు మించినది చేయగలిగేది అప్పటికి ఉండదు.కానీ అప్పటికి మించిన ఆలోచనలు ఉండి ఉండవచ్చు. వాటిని శాస్త్రీయంగా నిరూపించగలిగినప్పుడే దానికి ప్రామాణికంగా నిలబడే శక్తి వస్తుంది.

    "Faith comes only, if logic fails"
    దీనికి సంబందించి నాకు తెలిసింది: తర్కం వేరు - సత్యం వేరు. సత్యం అంటే ఉన్నది అని మాత్రమే. ఉన్నదానిని మాత్రమే నిరూపించగలం. లేని దానిని నిరూపించేందుకు చేసే తర్కం నిలబడదు. ఉన్నదానిని నిరూపించేందుకు చేసే తర్కం మనలను మరింత పదను పెట్టేందుకు ఉపయోగపడుతుంది. లేని దానిని మనం కేవలం విశ్వాసం ఆధారంగా చేసే తర్కం వల్ల ఉన్నదానిని నిరూపించగలిగే తర్కం ఎదురుపడినప్పుడు మనలో అజ్ఞానం మాసిపోయి జ్ఞానం ఇనుమడిస్తుంది. దీనికి తర్కించే సందర్భంలో తెలుసుకోవాలనే జిజ్ఞాశ ప్రధానం కావాలి తప్ప-పాండిత్యప్రతిభను ప్రదర్శించడం, నా వాదనే నెగ్గాలనే సంకుచితత్వం ఉండకూడదు.తర్కం వల్ల ఎపుడైనా తెలియంది తెలుసుకోగలగాలి.

    ReplyDelete
  16. @ Anonymous గారికి ,
    "How can you allow joker like Praveen Sarma to enter into discussion if you want proper discussion"

    ప్రవీణ్ గారిని నేను జోకర్ గా భావించడం లేదు. పేరు పెట్టకుండా ఇలా వ్యాఖ్యానించడమే జోకర్ లు చేసే పని.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top