Name: | Marxist-Leninist |
E-Mail: | deleted |
Subject: | నిర్భయ ఘటన చిన్న విషయమా? |
Message: | https://www.youtube.com/watch? నిర్భయ ఘటనపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. నిర్భయ ఘటన ఒక చిన్న విషయం అని ఆయన అన్నారు. నిర్భయ ఘటనకి పబ్లిసితీ ఇవ్వడం వల్ల దేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిపోయిందని ఆయన అనడం తప్పే. విదేశీ పర్యాటకులపై అత్యాచారాలు జరిగిన ఘటనలు కూడా మన దేశంలో ఉన్నాయి. విదేశీ పర్యాటకులు వ్యక్తిగత రిస్క్ తీసుకుని మన దేశానికి రావాలా? అలా రావాలని అరుణ్ జైట్లీ అనడం అతని బాధ్యతా రాహిత్యమే. ఇక్కడ మనం ఆలోచించాల్సిన నిజం ఇంకొకటి ఉంది. పల్లెటూరిలో చేతబడి చేస్తోందనే అనుమానంతో ఒక మహిళని రేప్ చేసి వెయ్యి మంది చూస్తుండగా ఊరేగించినపుడు అది ఇంత పెద్ద వార్త కాదు కానీ నిర్భయ ఘటనే ఇంత పెద్ద వార్త ఎందుకు అయ్యింది? తెలుగు రాష్ట్రాలలో చేతబడి నెపంతో దళితులని సజీవ దహనం చేసినట్టు హిందీ రాష్ట్రాలలో ఆ నెపంతో మహిళల్ని రేప్ చేస్తారు. ఒక పల్లెటూరి స్త్రీపై రేప్ జరిగితే అది పెద్ద వార్త కాదు కానీ ఒక వైద్య విద్యార్థినిపై రేప్ జరిగితే మాత్రం అది పెద్ద వార్తా? ఒకేసారి ఇద్దరుముగ్గురు మైనర్‌లని రేప్ చేసి, ఆధారం మాయం చెయ్యడానికి హత్య చేసిన ఘటనల సంగతి ఏమిటి? అవి నిర్భయ ఘటన కంటే చిన్నవా? రేప్ ఎవరిపై జరిగినా అది రేపే. పల్లెటూరి స్త్రీపై జరిగితే అది చిన్న రేప్ అనీ, వైద్య విద్యార్థినిపై జరిగితే అది పెద్ద రేప్ అనీ అనుకోవడం సరైనది కాదు. |
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు. kondalarao.palla@gmail.com
నిజమే, రేప్ అనేది ఎక్కడయినా భయంకరమే.కాని వేమన పుత్తడి గలవాని పుష్టంబు పుండయినవసుధలోన వార్త కెక్కు పేదవాని ఇంట పెండ్లయిన ఊసు రాదు - అన్నాడు.
ReplyDeleteనిర్భయ పేరుతో కన్ను చెదిరే అందమయిన ఫొటొ కనబడగానే మన మగతనానికి కన్ను చెదిరింది, తెగ జాలి పడ్డాం , అదే ఫిగరు ఏడ్చినట్టు వుంటే పట్టించుకోం.
ఒకప్పుడు రూప కన్వర్ సతి గురించి యెంత ఆందోళన జరిగింది/అప్పటి కదే మొదటిదా, కాదే? అంతకు ముందువన్నీ ముసలి మొహాలు. ఇంత అందమయిన అమ్మాయికి జరిగిందా? అనే అలోచన అలా స్పందింపజేసింది.
తమాషాకి చెప్పట్తం లేదు.మీలోకి మీరు చూసుకుని నిజాయితీగా ఆలోచించి చూదండి దేనికి మీరు యెక్కువగా స్పందిస్తున్నారు అనేది.
ప్రస్తుతం ఉన్న భారతీయ చట్టాల ప్రకారం నిర్భయ ఎవరో తెలీకుండా జాగ్రత్త పడ్డారు. ఫేసుబుక్కుల్లో, మరికొన్ని బాధ్యతలేని మీడియాల్లో వచ్చినవి ఆమె ఫోటోలు కావనుకుంటా..! నిర్భయ పైనే అంత చర్చ ఆందోళన జరగడానికి కారణం అది జరిగింది ఢిళ్ళీలొ అవ్వడం, అప్పటికే ఢిళ్ళీ స్త్రీలకు క్షేమం కాదని స్త్రీవాదులు విస్తృత ప్రచారం చేసి ఉండడం. సోషల్ మీడియా ప్రభావం, చివరగా కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఏ అవకాశం దొరికినా వదిలేందుకు సిద్దంగాలేని ప్రతిపక్షం ఉండడం.
Deleteఅంటే, నిర్భయ సంఘఠన చిన్నదా? కాదు..! చాలా దారుణమైన సంఘఠన అది. కానీ, అలాంటి సంఘఠనలు ఇదివరకు కూడా జరిగాయి. అత్యాచారం తరువాత కోమాలోకి వెల్లిన సంఘఠనలున్నాయి. పసికందులపై కౄరంగా అత్యాచారం జరిపితే, వారు మరణించిన సందర్భాలూ ఉన్నాయి. అప్పుడు ఇంత ప్రతిఘఠన ఎదురవ్వలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ... ఇలాంటి సంఘఠనలు చూసి, చూసి .. విసిగెత్తి ఉన్న ప్రజలకు మిగిలిన అంశాలు (నేను పైన చెప్పినవి) కూడా తోడవ్వడముతో వచ్చిన Momentum ..వలన నిర్భయ ఘఠన అంత పెద్ద అంశమయ్యింది అనుకుంటున్నాను.
స్పందనలో తేదాలు వుందతం సరే గానీ అసలు రేప్ అనేదాని విషయంలోనే చాలా మెలిక లున్నాయి.అక్కదక్కడా కామెంట్లుగా వేస్తున్నప్పుడే - ఇది కామెంట్లతో సరిపెట్టేది కాదు, పెద్ద టపాకి సరిపడే విషయం వుంది అనిపించింది.కానీ టపా రాయదానికి టైం పడుతుంది గాబట్టి క్లుప్తంగా పాయింట్ల వారీగా చెప్తాను.
Delete1.అక్కద నేరం లో ఒక మగవాడు ఒక ఆడదాని మీద అత్యాచారం చెయ్యదం అనగానే మనం లైంగిక కోణంలో చూస్తున్నాం.
2.కేవలం లైంగిక వాంచను తీర్చుకోవడమే అయితే రేప్ తర్వాత నిర్భయ మర్మాంగాలని గాయ పర్చటం, నిర్దాక్షిణ్యంగా అంత చలిలో రోడ్డు మీదాకి విసిరెయ్యటం యెందుకు చేసారు వాళ్ళు?
3.మామూలు నేరస్తుల్ని పోలీసులు ముందుగానే గుర్తు పట్టగలరు, ఆపగలరు, యెలాగంటే కన్నాలు వేసేవాళ్ల దగ్గిర్నుంచే జనం తిరిగే చోట బాబులు పెట్టే టెర్రరిష్టుల వరకూ ముందుగా ప్లాన్ చేసుకుని చేస్తారు.ఆయా నేర స్థలాల్లో అనుమానాస్పదంగా తిరిగే సమయంలోనే పట్టుకోవచ్చు.కానీ రేప్ అనే ఈ నేరాలన్నీ హఠాత్తుగా అప్పటికప్పుడు జరీగే ఇంపల్సివ్ క్రైం అనే కాటగిరీ కి చెందుతాయి.అంటే ఒక ఆదపిల్ల వొంటరిగా దాడి చేసి లోబర్చుకోవడానికి వీలుగా వున్న పరిస్థితుల్లో ఆ రేపిష్టుకి దొరికితే ఆ అవకాశాన్ని వుపయోగించుకోవటమే యెక్కువగా జరుగుతున్నది, అవునా? ఇలాంటి ఇంపల్సివ్ క్రైం ని ముదుగా ఆపలేరు యెవ్వరూ!
4.సరిగా అదే సన్నివేశంలో సంస్కారవంతుడయిన మగవాడు అక్కడ వుంటే ఆ రేపిష్తులాగా అవకాశాన్ని వుపయోగించుకుని నేరం చేస్తాడా?చెయ్యడు!అంటే యెంత ఇంపల్సివ్ క్రైం అయినా ఆ కుసంస్కారం పెరగటానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు.ఆడది వొంటరిగా కనబదగానే అత్యాచారం చేసి తీరాలనే కుసంస్కారం అనేది పెంపకం వల్ల వస్తుంది, అవునా?
5.కానీ కోర్టులూ చట్టాలూ నేరము, దోషి, బాధితుడు అనే ముగ్గురినే పట్తించుకుని చూస్తాయి, నేరస్తుదు నేరం చేసాడు అనేది తేల్చుకుని ఆ వొక్కడికి శిక్ష వేసి తప్పుకుంటాయి. ముందెప్పుదఓ జరగబోయే పెంపకాలకి సంబంధించిన నేరాల్ని కోర్టులు పట్టించుకోవు.మరి పిల్లి మెదలో గంట కట్టే దెవరు?
@Hari Babu Suraneni
Deleteఅత్యాచారానికి కారణాలు అనే అంశం మీద ఒక టపా రాద్దామనే అనుకున్నాను. దీనితో నేను రాద్దామనుకున్న వాటిలో ఇది 3 వది. కానీ ఇది ఎప్పటినుండో పెండింగులో ఉన్న టపా. చాలా కాలం సరైన సమాచారం లేక రాయలేదు. ప్రస్తుతం నాకు సమయం లేక రాయలేక పోతున్నాను. కానీ ఏదో ఒక విధంగా నా లిస్టులో ఉన్న మరికొన్ని అంశాల మీద పోస్టు తప్పకుండా రాస్తాను. ప్రస్తుతానికి, అత్యాచారం అనేది అనేక కారణాల వల్ల జరుగుతుంది. సెక్స్ అనేది అందులో ఒక అంశం మాత్రమే, అన్ని సార్లూ అదే కారణం కాదు.
సెక్స్ విషయాన్ని అంత తేలికగా తీసిపారెయ్యకూడదు. చేతబడి నెపంతో రేప్ చేసేవాడు నిజంగా చేతబడి జరగలేదని తెలిసినా, కోరిక తీర్చుకునే అవకాశం కోసం ఆ నెపంతో రేప్ చెయ్యగలడు.
Delete6.నేను మొదటి నుంచీ ఈ వార్తల్ని కొంచెం పరిశీలనగా చూస్తే కొన్ని అంశాలు అన్ని కేసుల్లోనూ సామాన్యంగా వున్నాయని నాకు అర్ధమయినాయి.పరిశీలనకి నాకు వార్త చుట్టూ వచ్చే విశ్లేషణలూ నేరస్తుల పరిచయాలూ మాత్రమే దొరికాయి.
Delete7.వీళ్లందరూ ఆర్ధికంగా, సామాజికంగా ముఖ్యంగా సాంస్కృతికంగా అధ్వాన్న స్థితిలో వున్నవాళ్ళు.వయస్సు అన్ని చోట్లా ఒక్కలా లేకపోయినా చాలా మటుకు యవ్వనంలో వున్నవాళ్ళే యెక్కువ.
8.నా అతి ముఖ్యమయిన అబ్సర్వేషన్ - కుటుంబంలో తండ్రి డామినేటింగ్ చేస్తూ తల్లి హవుస్ వైఫ్ గానో మరో విధంగానో వీక్ గా వుండటం కనబడుతుంది.
9. వీటన్నిటి వల్లా రేపిష్టు గానీ ఈవ్ టీజింగ్ చేసే వాడు గానీ ఇవ్వాళ రోడ్దు మీద స్వేచ్చగా తిరిగే ఆదవాళ్లని చూసి ద్వేషించడం మొదలు పెదతాడు.ఒకటి ఆ అమ్మాయి తనని రెచ్చగొట్టినా తను ఆ అమ్మాయిని ఇంప్రెస్ చెయ్యలేకపోవడం వల్ల అయినా కావచ్చు,లేదా తన తండ్రి పెత్తనానికి లొంగిపోయి బుధ్ధిగా వున్న తల్లిలాగా కాకుండా బరితెగించి రెచ్చిపోతున్నారనే కారణం వల్ల కూడా కావచ్చు - ఆ ఆడవాళ్ళని భయ పెట్టడం, శిక్షించడం తప్పు కాదనే దోరణిలో వుంటాడు.సాధారణంగా పోలీసులు ఆధార పదేది నేరస్తుడు తనలో వున్న గిల్ట్ ప్రభావం వల్ల నేరం జరిగిన స్థలంలో వొదిలే క్లూల మీదనే, అయితే వీళ్ళు ఆ గిల్ట్ అనేది లెకపోవడం వల్ల అలాంటి క్లూలని వదలరు.అదే ఈ ఇంపల్సివ్ క్రైం లో వున్న ఇబ్బంది.నేరం చేస్తున్న సమయంలో వాళ్ళ ప్రవర్తన యెలా వుంటుందో కొన్నిసార్లు విస్తారంగా మీరూ చదివే వుంటారు, యెదటివాళ్ళు తప్పు చేస్తుంటే దండించే వాళ్ళలో వుండే ధీమా తప్ప తాము తప్పు చేస్తున్నామనే గిల్ట్ వాళ్లలో వుందకపోవటానికి కూడా కారణం ఇదే!
10.ఈ కుటుంబ వాతవరణం గురించి మరింత లోతుగా నాకూ తెలియదు, యెందువల్లనంటే ఆ సమాచారం రాబట్టాల్సింది అక్కడ కేసుని పరిశోధిస్తున్న పోలీసులు.ఇప్పటి వరకూ సాంకేతికంగా పోలీసుల పరిధి నేను పైన చెప్పిన మూడు అంశాలకు మాత్రమే పరిమిత మయింది.