- ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్‌రంగంలోవిస్తృత అవకాశాలున్నాయని వెల్లడి
- తొలి విదేశీ పర్యటనలో కేసీఆర్ బిజీ బిజీ
- సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రితో భేటీ
- గూగుల్ హెచ్‌ఆర్ హెడ్‌తో భేటీ
- నేడు ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సుకు
(హైదరాబాద్-ఆంధ్రజ్యోతి)
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాషా్ట్రన్ని అవినీతిరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఆయన గురువారం సింగపూర్‌లో పారిశ్రామికవేత్తల సదస్సులో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ఎలాంటి అవినీతి లేకుండా వేగంగా అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సింగపూర్‌లోని రిట్జ్ కార్ల్టన్ హోటల్‌లో బస చేసిన సీఎం కేసీఆర్‌ను గూగుల్ ఆసియా పసిఫిక్ దేశాల హెచ్‌ఆర్ ప్రధానాధికారి ఆదిత్య కె రాయ్ గురువారం కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పటిష్ఠమైన భద్రత, రక్షణ చర్యలు చేపట్టడంతోపాటు అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని... ముఖ్యంగా ఐటీ రంగంతోపాటు ఫార్మా, ఆహారశుద్ధి, ఆటోమొబైల్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పెట్టుబడిదారుల విషయంలో తమ ప్రభుత్వం వేగంగా స్పందిస్తుందని.. ఉన్నతాధికారులు కూడా అంతే వేగంగా పనిచేస్తారని అన్నారు. రాబోయే ఐదారేళ్లలో కొత్తగా 8000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని..దీని వల్ల విద్యుత్ సమస్య తీరిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 4000 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని... అయితే విద్యుత్ సరఫరాను మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. తెలంగాణ జెన్‌కోతోపాటు ఎన్‌టీపీసీ కూడా నూతన యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయని సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు వెల్లడించారు. కాగా..బుధవారం ఉదయం సింగపూర్ చేరుకున్న కేసీఆర్... పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కావటంతోపాటు సింగపూర్‌లో కొత్తగా అభివృద్ధి చేసిన స్పోర్ట్స్ సిటీ, మౌలికసదుపాయాల ప్రాజెక్టులను సందర్శించారు.
మరోవైపు.. సింగపూర్ విదే శీ వ్యవహారాల శాఖ మంత్రి షణ్ముగంతో సీఎం కేసీఆర్‌సమావే శం అయ్యారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అనంతరం ఆయన సింగపూర్ తెలంగాణ సాంస్కృతిక సంఘం ప్రతినిధి బృందంతో కూడా భేటీ అయ్యారు. అనంతరం ఆయన సింగపూర్ లో ఉంటున్న తెలంగాణ పౌరులతో కూడిన బృందంతో కలసి విందులో పాల్గొన్నారు. సింగపూర్‌లో శుక్రవారం జరిగే ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సు ఇంపాక్ట్ 2015లో సీఎం పాల్గొననున్నారు. దీనికి సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ కూడా హాజరుకానున్నారు. ఇందులో సుమారు వెయ్యి మంది ఐఐఎం పూర్వ విద్యార్ధులు పాల్గొననున్నారు. ఈ భేటీలో కెసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలపై వివరించే అవకాశం ఉంది. శనివారం సీఎం కేసీఆర్ స్టడీ టూర్ కోసం కౌలాలంపూర్‌తోపాటు రాజధాని పుత్రజయను సందర్శించనున్నారు. సింగపూర్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిచూపుతున్నారని ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి వెన్నం తెలిపారు. ఆయన కూడా తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు వెంట సింగపూర్ వెళ్ళిన బృందంలో సభ్యుడుగా ఉన్నారు.
(from andhrajyothy daily)
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
మోడీ: भाईयो, मैं न खाता हूँ, न खाने देता हूँ
ReplyDeleteకెసిఆర్: అవినీతిని నిర్మూలిస్తా
బాబు: అవినీతిని అంతం చేస్తా
ఇలా అందరూ మాట్లాడుతూనే వున్నారు. కాని ఆచరణ దిశగా ఎవరూ అడుగులు వేయడం లేదు. కేవలం నాయకుడు నీతివంతుడైతే చాలదు. వ్యవస్తను ప్రక్షాళనం చేసే దిశగా అడుగులు పడాలి. అందరికన్నా ముందు లోక్పాల్ బిల్లు బలోపేతం చేసి ప్రధానమంత్రి రాష్ట్రాలకు మార్గదర్శనం చేయవలసి వుంది. అది అసలే చేయడం లేదు. చట్టాలను బలోపేతం చేస్తే అవి వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. ఇక రెండు రాష్ట్రాలు కూడా కేవలం మాటలే కాని అవినీతి నిర్మూలనకోసం ఏ ప్రయత్నాలూ చేస్తున్నట్టు కనపడలేదు.
ప్రయత్నిస్తే అసాధ్యమేమీ వుండదు. పై వార్తలో అనుమతుల్లో అవినీతి గురించే కెసిఆర్ మాట్లాడారు. అవినీతి అంటే అదొక్కటే కాదు. దాని నిర్మూలన కోసం ఎంతో చేయాల్సి వుంది. దానికి కేంద్ర ప్రభుత్వం నాయకత్వం వహించి, రాష్ట్రాలన్నీ అనుసరించాలి.
ReplyDeleteసీమాంధ్ర పత్రికలు కె.సి.ఆర్.పై నిత్యం విషం చిమ్ముతూ ఉంటాయి కనుక కె.సి.ఆర్. తాను ఉన్నంత వరకు అవినీతి జరగకుండా జాగ్రత్తపడతాడు. కె.సి.ఆర్. మరీ ముసలైపోయి రాజకీయాల నుంచి తప్పుకుని ఏ మహమూద్ అలీ చేతికో పదవి అప్పగించి వెళ్ళిపోతే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము.
ReplyDeleteAsalu telanganalo avineethi ki maaruperu kcr kutumbame ani teliyani devariki.......inni maatalu avasarama ...
ReplyDelete