• ఎప్పటికప్పుడు సినిమాలలో పాతవే బాగుంటాయి. పాటలూ పాతవే బాగుంటాయి.
  • అందుకే అవి ఆపాతమధురాలు గా ఉంటున్నాయి.
  • కొత్త సినిమాలలో , పాటలలో నూటికో కోటికో ఒక్కటి తప్ప అన్నీ వ్యాపారాత్మకమే. విలువల విధ్వంసమే. 
  • ఈ ధోరణికి కారణమేమిటి ? ఈ పరిస్థితి మారేదెప్పుడు?
Palla Kondala Rao
-----------------------------

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. ఏమో నండీ. గతకాలము మేలు వచ్చు కాలము కంటేన్ కావచ్చును. ఐనా యధాస్మై రోచతే విశ్వమ్‌ తదే దం పరి వర్తతే అన్నట్లుగా చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుందేమో. పాతసినిమాల్నీ వాటి పాటల్నీ మా చెల్లెలు ఒకామె పాతచింతకాయలు అనేది. ఇప్పుడు వాటికోసం వీడీయోలు అమ్మే షాపుళూ ఇంటర్నెట్టూ గాలిస్తోందనుకోండి తనపిల్లలకు చూపించటానికి. విషయానికి వస్తే ఒకప్పుడు నిబద్దతతో‌ సినిమాలు తీసే వారు. ఇప్పుడు కేవలం డబ్బుకోసం తీస్తున్నారు. అప్పట్లో జనం ఎలా ఆదరించారూ అన్నది ఆలోచించేవారు. ఇప్పుడు ఎలా జనాన్ని బురిడి కొట్టించైనా తొందరగా వసూలు చేసేసుకోవాలీ‌ అని చూస్తున్నారు. అప్పట్లో కథకు తగ్గ కథనం, కథకు తగ్గ పాత్రధారులూ అన్నది పధ్దతి. ఇప్పుడు హీరోలకోసం కథలను వండటం అవికాస్తా పండకం సినిమా ఎండటంగా ఉంది. ఒకప్పుడు ఒకే సీనులో కనిపించి ఒక అరనిముషం పాటే‌ ఉండి మాయమయ్యే పాత్రకూడా హావభావాలూ సంభాషణా వైఖరీ కూడా చాలా హృద్యంగా ఉండేవి, ఇప్పుడు హీరోలనే తెరమీద చూడలేని పరిస్థితి. ఒక్క ముఖంలో కళాకాంతీ ఉండవు. ఒక్కరి తెలుగువాచికం కూడా కనీసం తెలుగులా కూడా ఉండదు. ఇంకా ఏమి చెప్పమంటారు? సినీపెద్దల కొంపల్లోంచే సమస్తమైన కళా ప్రపంచమూ‌ పుడుతోందన్న నూతనవాదం వాళ్ళకు బాగున్నా జనానికి బాగుండదు కదా? అదే దైన్యానికి కారణ.

    ReplyDelete

  2. పాతవి మాత్రమే బాగుండటానికి‌ కారణ మేమిటి ?/


    మనము ఓల్డీస్ అయిపోయామని ఒప్పుకోటానికి మనసొప్పక పోవటమే :)



    జిలేబి

    ReplyDelete
  3. సంవత్సరాల క్రిందట కమ్యూనికేషన్ చాలావరకు వాక్ (నోటి) ద్వారానే ఉండేది. నోటికీ మనసుకీ గుర్తు పెట్టుకునే విధంగా ఉండటానికి ఛందో నియమాలు సృష్టించారు అలాగే పాటలకు సంగీత నియమాలు (carnatic ) సృష్టించారు. ఈ నియమ బద్దంగా రచించిన పాటలూ పద్యాలు మనసుకి నోటికీ గుర్తుపెట్టుకోటానికి వీలుగా ఉండి ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. ఉదా : వేమన పద్యాలూ, త్యాగరాయ కీర్తనలూ).  చాలా వరకు మన పాత పాటలు ఆ నియమాలని పాటించటము మూలంగా పాడుటకు వినుటకు గుర్తు పెట్టుకోటానికి తేలికగా ఉండి ఇప్పటికీ ప్రాచుర్యములో ఉన్నాయి.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top