తెలుగు బ్లాగులను శక్తివంతంగా తయారు చేయడానికి, తెలుగు బ్లాగర్లను ప్రోత్సహించడానికి పల్లెప్రపంచం తరపున తన వంతు ప్రయత్నం చేయాలని నిర్ణయించాము. దీనిలో తెలుగు బ్లాగర్లలో మంచిగా వ్రాస్తున్నవారిని ప్రోత్సహించేందుకు వారి బ్లాగులను సమీక్షిస్తూ ఇంటర్వ్యూ చేయడం వల్ల వారిని ప్రోత్సహించినట్లవుతుందని భావిస్తున్నాము. వారి అనుభవాలను పదిమందికీ పంచడం ద్వారా సమాజానికి మంచి భావాలను అందించినవారమవుతాము.
'పల్లెప్రపంచం'లో 'ఇంటర్వ్యూలు' విభాగం ద్వారా తెలుగు బ్లాగర్లలో పదిమందికీ ఉపయోగపడే సమాచారాన్ని, భావాలను అందించే వారి బ్లాగులను సమీక్షించాలని నిర్ణయించడం జరిగింది. అలాంటి బ్లాగులలో మా దృష్టికి వచ్చిన బ్లాగులతో పాటు మీకు కూడా మంచి బ్లాగులనిపించినవాటిని సమీక్షిస్తూ మాకు వ్రాస్తే ఇక్కడ పబ్లిష్ చేస్తాము. తద్వారా అలాంటి బ్లాగర్లు మరిన్ని మంచి టపాలు, సేవలు ఆన్‌లైన్ తెలుగు పాఠకులకు అందించేందుకు ఉత్సాహం పెంచినవారమవుతాము. ఇతరులకూ స్పూర్తిగా ఉంటుందని భావిస్తున్నాము. సహజంగా పల్లెటూరిపై ప్రేమ ఉండే నాకు పల్లెను ప్రేమించే బ్లాగర్లెవరా? అని ఆలోచిస్తున్న సమయంలో కనపడినది చైతన్య కుమార్ గారి నవచైతన్య కాంపిటీషన్స్ బ్లాగు. ముందుగా చైతన్య గారికి అభినందనలు తెలుపుతున్నాను.

బ్లాగు వివరాలు :
బ్లాగు పేరు - నవచైతన్య కాంపిటీషన్స్
ప్రారంభించిన తేదీ - జూన్ 12, 2011
ఇప్పటివరకూ పోస్ట్‌ల సంఖ్య - 481 (బ్లాగిల్లు బ్లాగు సమాచారం మేరకు, 19-11-2014 11.06 a.m వరకు)
ప్రధాన లక్ష్యం - "పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు ఉపయోగపడే అన్ని రకాలు మెటీరియల్స్ ఉచితంగా అందించేందుకు ఒక వేదికను ఏర్పాటు చేయడం"
బ్లాగరు వివరాలు :
పేరు : చైతన్య కుమార్ సత్యవాడ.
గ్రామం: పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామం చింతలపూడి.
వృత్తి: ఉపాధ్యాయుడు. (2010 సంవత్సరం అక్టోబర్ నెలలో ఉద్యోగం వచ్చింది)
ఈ బ్లాగు ప్రారంభం వెనుక ఉన్న ఆసక్తికర విషయాలు చైతన్యకుమార్ మాటల్లో:
ల్యాప్‌టాప్, నెట్ కనెక్షన్ సౌకర్యం ఉండడంతో ఖాళీ సమయాల్లో కంప్యూటర్ ముందు గడపడం అలవాటు. 2010 సంవత్సరానికి ముందు నేను బియిడి పూర్తి చేసి డియస్సీకు ప్రిపేర్ అయ్యే సమయంలో నేను కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతూ ఉన్న సమయంలో రోజూ మొబైల్‌కు వచ్చే నిరుపయోగ సందేశాలను చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే ఉపయోగపడని మెసేజ్‌లను మిత్రులతో పంచుకోవడం కంటే సందేశంలో ఉపయోగపడే సమాచారాన్ని పంపుతూ ఉంటే బావుంటుందనిపించింది. వెంటనే నవచైతన్య పేరుతో మా బియిడి క్లాస్‌మెట్స్ ఒక ఇరవై మందికి రోజూ కరెంట్స్ అఫైర్స్ ప్రశ్నలను పంపే ప్రయత్నం ప్రారంభించాను. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నా అదృష్టవశాత్తూ ఒకనాడు ఈనాడు దినపత్రికలో www.smsgupshup.com (ఇప్పుడది gupshup.meగా మారినది) గురించి వ్రాసారు. ఈ సైట్‌లో ఒక గ్రూప్‌ను రూపొందించుకుని మనం ఒక మెసేజ్ ఖర్చుతో వీరి నెంబర్‌కు పంపితే వెబ్‌సైట్‌నుంచి మన మిత్రులు అందరికి ఆ మెసేజ్ ఫార్వార్డ్ అవుతుంది. నాకు తెలియకుండానే మిత్రులు ఎవ్వరైనా వెబ్‌సైట్‌లో నా సందేశాలు చూసి ఈ గ్రూప్‌లో చేరే అవకాశం ఉంది. వెంటనే అదే నవచైతన్య పేరుతో గ్రూప్‌ను క్రియేట్ చేసి దానిద్వారా రోజుకు నాలుగు సంక్షిప్త సందేశాలను సుమారు పాతిక కరెంట్‌అఫైర్స్ ప్రశ్నలతో పంపేవాడిని. కొదికాలంలోనే ఈ గ్రూప్‌లోని సభ్యుల సంఖ్య వెయ్యికి చేరడంతో ఇది ఒక అలవాటుగా మారిపోయింది. డియస్సీ అనంతరం కూడా ఈ గ్రూప్ సందేశాలను కొనసాగించాను. దృరదృష్టవశాత్తూ ట్రాయ్ నిబంధనల అడ్డంకితో ఈ వెబ్‌సైట్ ఈ గ్రూప్‌సందేశాలను నిలిపివేసినది. అలా ఆగిపోయింది నా మెసేజ్ సర్వీస్. ఈ సమయంలోనే నేను ఖాళీ సమయాలలో ఇంటర్‌నెట్ ముందు కూర్చుని ఇలా మంచి స్టడీమెటీరియల్స్ అందించే వెబ్‌సైట్‌లను గురించి వెతకడం ప్రారంభించాను. అయితే ఇలా పక్కాగా స్టడీమెటీరియల్స్ అందించడానికి ఒక సైట్ లేకపోవడం నాకు బాధను కలిగించింది. నాకున్న కొద్దిపాటి పరిఙ్ఞానంతో నవచైతన్య కాంపిటీషన్స్ బ్లాగును (ప్రారంభంలో మీ నవచైతన్యం గా వ్యవహారంలోకి తీసుకొచ్చి తరువాత నవచైతన్య కాంపిటీషన్స్‌గా మార్చుకున్నాను) 2011 జూన్ 12 వ తేదీన ప్రారంభించాను. ప్రారంభంలో చాలా తక్కువగా మెటీరియల్స్ పొందుపరిచేవాడి. అప్పట్లో వీక్షకుల సంఖ్య కూడా తక్కువగానే ఉండేది. దాదాపు తొలి సంవత్సరం వీక్షకులు పదివేలు మించలేదు. అప్పుడే నాకు కూడలి, బ్లాగిల్లు, మాలిక వంటి అగ్రిగేటర్స్‌లో సభ్యత్వం లభించింది. అలాగే నాకు ఖాళీ సమయం ఎక్కువగా లబించడం, చింతలపూడిలోనే శ్రీ సాయి ఆర్.కె. స్టడీ సర్కిల్ పేరుతో మా మిత్రుడు ఒక కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించడం నా బ్లాగు అభివృద్ధికి మరింత సహకరించాయి. ప్రతిరోజు స్టడీమెటరియల్స్ రూపొందించి పబ్లిష్ చేయడం ప్రారంభించాను. ఇలా మంచి మెటీరియల్‌ను పబ్లిష్ చేయడంతో 'సూర్య' దినపత్రిక వారి బుధవారం అనుబంధం ప్రఙ్ఞలో నాకు మెటిరియల్ రూపొందించే అవకాశం లభించింది. వారికోసం, నా బ్లాగు కోసం మంచి మంచి మెటీరియల్స్ రూపొందిస్తూ అభివృద్ధి వైపుకు నడుపుతున్నాను. స్వతహాగా నా సబ్జక్టు భౌతిక రసాయన శాస్ర్తం. చిన్నప్పటి ఉపాధ్యాయులు ఇచ్చిన పునాదితో నాకు నా సబ్జక్టుతో పాటు మరికొన్ని సబ్జక్టుల మీద కూడా పట్టు ఉండడం, శ్రీ సాయి ఆర్.కె. స్టడీ సర్కిల్‌లో విద్యాదృక్ఫధాలు (డియస్సీ), విపత్తుల నిర్వహణ (జనరల్ స్టడీస్) వంటి సబ్జక్టులలో అవకాశం లభించడంతో ఈ సబ్జక్టులకు సంబంధించిన మెటీరియల్స్ కూడా నా బ్లాగులో కనిపిస్తాయి. ఉన్న ఒకే ఒక మైనస్ నా బ్లాగుకు మంచి రచయితల బృందం లభించలేదు. ఎందరో మిత్రులను ఇప్పటికే అడిగాను. తమ తమ సబ్జక్టులలో కూడా మంచి మెటీరియల్స అందించమని. బ్లాగులో కొన్ని సబ్జక్టులే కాక, అన్ని సబ్జక్టులకు సంబంధించిన మెటీరియల్స్ అందించాలని నా కోరిక.
గ్రామం: పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామం చింతలపూడి.
వృత్తి: ఉపాధ్యాయుడు. (2010 సంవత్సరం అక్టోబర్ నెలలో ఉద్యోగం వచ్చింది)
ఈ బ్లాగులోకి ఎంటర్ కాగానే ఓ మంచి కొటేషన్ కనపడుతుంది మనకు.
అది : మీ లక్ష్యం + మా విధానం = మన విజయం అని.

జీవిత లక్ష్యం :
చింతలపూడి , మెట్టప్రాంతంగా (భౌగోళికంగానే కాదు, మెదడుల పరంగా కూడా) పేర్గాంచిన ప్రాంతం. అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతం. జిల్లాకు ఒక చివరగా విసిరివేయబడిన ప్రాంతం. బాహ్య ప్రపంచం అంతా విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికి జూనియర్, డిగ్రీ కాలేజిల స్థాయిని మించని ప్రాంతం కనుకనే చింతలపూడి పేరు నలుగురికి తెలియచెప్పాలన్న తపన నాకు చాలా ఎక్కువ. చింతలపూడి కేంద్రంగా హైదరాబాద్ లాంటి ప్రాంతం వారుకూడా బాగుంది అనిపించే ఒక విద్యా సంస్థను ప్రారంభించాలన్నది నా జీవిత లక్ష్యం. కానీ దురదృష్టవశాత్తూ నాకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆ లక్ష్యం దాదాపు ముప్పైఐదు సంవత్సరాలు వాయిదా వేయబడినది. అదేనండీ నా రిటైర్‌మెంట్ వరకూ. రిటైర్ అయ్యిన తరువాత ఆ లక్ష్యసాధనపై దృష్టిపెట్టాలి అనుకుంటుంన్నాను. ప్రస్తుతం నా మిత్రుడిది అని చెప్పాను కదా కోచింగ్ సెంటర్. దాన్ని మా జిల్లా స్థాయిలో పేరు సాధించేలా నిలపబడానికి కృషి చేస్తున్నాను. నాణ్యమైన కోచింగ్, డైలీ, వీక్లీ, గ్రాండ్ టెస్ట్‌లను అందిస్తూ, అతి తక్కువ ఫీజులు తీసుకుంటూ జిల్లా స్థాయిలో మంచి కోచింగ్ సెంటర్‌గా దాన్ని నిలపడంలో విజయం సాధించే ప్రయాణంలో ఒక యాభై శాతం ప్రయాణాన్ని చేసామనే చెప్పాలి.
బ్లాగు సేవతో ఆనందం !
బ్లాగు విషయానికి వస్తే, ఎక్కడి నుంచి అయినా సమాచారాన్ని అందుకోవడం సాధ్యం అవుతుంది. అయితే చాలా బ్లాగులు ఊసుపోక చెప్పే కబుర్లతో కాలక్షేపం చేస్తున్నాయి. అఫ్‌కోర్స్ మనిషికి అదికూడా అవసరమే అనుకోండి. కొన్ని బ్లాగులు మాత్రం అర్ధవంతం అయిన సమాచారానికి వేదికలుగా నిలుస్తున్నాయి. అలాంటి బ్లాగుల్లో మరొకదాన్ని చేర్చాలన్న తపనే 'నవచైతన్య కాంపిటీషన్స్'ను నడిపిస్తున్నది. రోజూ కనీసం ఒక గంట అయినా నా బ్లాగును చూస్తూ మంచి సమాచారాన్ని చేర్చందే నాకు హాయి అనిపించదు. నాకున్న ప్రధానమైన మైనస్ నేను స్వతహాగా భౌతిక, రసాయన శాస్ర్తాలు నా సబ్జక్టులు. అలాగే డియస్సీకు సంబంధించిన విద్యాదృక్ఫధాలు, విపత్తుల నిర్వహణ వంటి కొన్ని అంశాలలో కూడా ప్రావీణ్యత ఉంది. ఈ సబ్జక్టులలో మంచి మెటీరియల్స్‌ను రూపొందించి నా బ్లాగులో అప్‌డేట్ చేస్తున్నాను. మిగిలిన సబ్జక్టుల మెటీరియల్ను అందించడానికి నా బ్లాగును చూసి ఎవరైనా ఆసక్తికలవారు కలుస్తారేమో అని అనుకున్నాను. కానీ ఇప్పటివరకూ అలాంటి మంచి మిత్రులెవరూ కలవలేదు. వారికోసం ఎదురు చూస్తున్నాను. అలాంటి మిత్రులు కలిస్తే అన్ని సబ్జక్టులలోనూ ఉచితంగా మెటీరియల్స్ అందించాలన్నది నాకోరిక.
అందరి బ్లాగుల మాదిరిగానే నా బ్లాగును కూడా విదేశాలలో ఎందరో చూస్తుంటారు. ఆ విషయమై నాకు ఆనందాన్ని కలిగించిన ఒకసందర్భాన్ని మీతో పంచుకుంటాను. ఒకసారి దుబాయి నుంచి ఒకరు ఫోన్ చేశారు. వారు పనికోసం వలస వెళ్లారట. వారు బియిడి చేసారట. దుబాయిలో తెలుగు పుస్తకాలు లభ్యం కావనుకుంటా. . నేను బ్లాగులో ఉంచిన డియస్సీ మెటీరియల్స్‌ను వారు ఒకసారి చూశారట. చాలా బాగున్నాయి అంటూ ఫోన్ చేశారు. అప్పటికే మా కోచింగ్ సెంటర్‌లో డియస్సీ డివిజినల్ టెస్ట్‌లు రూపొందించడం వలన వారి ఈమెయిల్ ఐడి అడిగి వారికి టెస్ట్‌లు మెయిల్ చేశాను. (ఒక్క విషయం కోచింగ్ సెంటర్ మిత్రునిది అయినప్పటికీ, బ్లాగు చూసి మెటీరియల్ కోరిన వారికి నామమాత్రపు రుసుముతో మెటీరియల్ పంపుతుంటాము. అయితే అది మార్కెట్లో దొరికే మెటీరియల్ లాంటి ధర అయితే కాదు. జస్ట్ ప్రింటింగ్ మరియు పోస్టల్ చార్జీలు) దురదృష్టవశాత్తూ వారికి డియస్సీలో ఉద్యోగం రానప్పటికీ నా బ్లాగులోని మెటీరియల్స్ వారికి చాలా ఉపయోగపడ్డాయంటూ తెలిపారు. అలాగే వృత్తిరీత్యా మహారాష్ట్రనో లేక గుజరాతో అనుకుంటా ఒకరు వారి భార్యకోసం మెటీరియల్ను మెయిల్ ద్వారా అందుకున్నారు. ఇక రాష్ట్రంలో అయితే ఎందరో నేను పబ్లిష్ చేస్తున్న మెటీరియల్ బావుందంటూ ప్రశంసిస్తుంటారు. ముందుగానే చెప్పాను కదా నేను సూర్య దినపత్రిక వారికి స్టడీమెటీరియల్స్ పంపుతానని, వారు ఆ ప్రచురణలో నా బ్లాగు చిరునామా కూడా ప్రతివారం పబ్లిష్ చేస్తుంటారు. దీనితో హైదరాబాద్ వంటి నగరాలలోవారు ఆ పత్రికద్వారా నా బ్లాగు చూసి ఫోన్స్ చేసి చింతలపూడి ఎక్కడ అండీ అని తెలుసుకుంటుంటే నాకు, నేను చేపట్టిన పని విజయం వైపు సాగుతోందని ఆనందం కలుగుతుంది. వారి ప్రోత్సాహమే నా బ్లాగును మరింత అందంగా తీర్చిదిద్దాలన్న తపనను రెట్టింపు చేస్తున్నది.
నేను బ్లాగులో స్టడీ మెటీరియల్స్‌తో పాటు ఉపాధ్యాయులకు ఉపయోగపడే వెబ్‌సైట్‌లు, వీడియోలు, విద్యా పరమైన ఫారమ్‌లు, ట్రైనింగ్‌లలో చెప్పిన అంశాలతో క్షుణ్ణంగా వివరాలను కూడా అప్‌డేట్ చేస్తుంటాను. మా ప్రాంత ఉపాధ్యాయులకు కూడా నా బ్లాగు సుపరిచితమే. ఇక భవిష్యత్ లక్ష్యమల్లా నా బ్లాగుకు ఒక డొమైన్ (వెబ్‌సైట్ ను అలానే పిలుస్తారనుకుంటా?) తీసుకుని బ్లాగును వెబ్‌సైట్‌గా మార్చాలి. దాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ప్రస్తుతం రోజుకు మూడు నుంచి నాలుగు వందల మంది ఉన్న వీక్షకుల సంఖ్యను మరింతగా పెంచాలి. ఏ పోటీ పరీక్ష అయినా స్టడీ మెటీరియల్స్ తో పాటు మార్కెట్‌లో ఎక్కడా లభించని డివిజినల్ టెస్ట్లు (పోటీ పరీక్ష సిలబస్‌ను భాగాలుగా విభజించి ప్రతీ విభాగానికి ప్రత్యేకంగా టెస్ట్ను రూపొందించి నామమాత్రము రుసుముతో అందిస్తుంటాను. దీన్ని అభ్యర్ధులు ఇంటిదగ్గర ఉంటూనే ప్రణాళికాబద్దంగా చదవడానికి ఉపయోగించుకోవచ్చు) పూర్తి ఉచితంగా లభించేలా నా బ్లాగును తీర్చిదిద్దాలి. అన్నింటినీ మించిన స్వార్ధం నా చింతలపూడికి గుర్తింపు తేవాలి.
బాధ్యత కలిగిన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ తోటివారికి తనకు తెలిసిన విద్యను పంచుతూ తన గ్రామంపై ఎనలేని మక్కువ కనపరస్తున్న చైతన్య కుమార్ ఎంతైనా అభినందనీయులు. మీరూ ఆయన బ్లాగును ఓ లుక్కేయండి. ఈ బ్లాగు గురించి పదిమందికీ తెలియజేయండి. తద్వారా మరింతమందికి ఈ బ్లాగు ఉపయోగాలను అందుకునే అవకాశం కల్పించండి. చిన్న పల్లెటూరినుండి వచ్చి విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు స్టడీ మెటీరియల్స్ అందిస్తున్న చైతన్యకుమార్ అభినందనీయులు. ప్రపంచవ్యాపితంగా ఉన్న తెలుగువారిలో మన చైతన్యకుమార్ మంచి గుర్తింపు పొందాలని "ప్రజ" ఆకాంక్షిస్తోంది. అదే విధంగా ఆయన గోల్ అయిన చింతలపూడికి ప్రత్యేక గుర్తింపుని తీసుకురావడంలో విజయవంతం కావాలని కోరుకుందాం.
బెస్ట్ ఆఫ్ లక్ చైతన్య గారు!
మీరు మీకు నచ్చిన బ్లాగరును ఇంటర్వ్యూ చేసి వారి బ్లాగును సమీక్షిస్తూ మాకు వ్రాసి పంపాలనుకుంటే వివరాలకోసం ఇక్కడ నొక్కండి.
- Palla Kondala Rao
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.