• దేశమంటే మట్టికాదోయ్ ! దేశమంటే మనుషులోయ్ !! అన్నాడు గురజాడ. మంచి మనుషులుంటే మంచి సమాజం ఉంటుంది. మనిషిలో మనసుని కదిలించేది, కరిగించేది కథ కూడా!
    • మనం చిన్నప్పుడు అమ్మమ్మలు-తాతయ్యల దగ్గరా ఇంకా పెద్దల వద్దా కథలు నేర్చుకున్నాం. బొమ్మరిల్లు-చందమామల వంటి కథల పుస్తకాల కోసం తాపత్రయపడే వాళ్లం. పాఠశాల పుస్తకాలలోనూ నీతి కథలుండేవి. 
    • నేను ఇటీవల  ప్రజ లో  "చందమామ కథలకంటే, మన పెద్దలు చెప్పే నీతి-పురాణ కథల కంటే ఎక్కువ నీతి-వ్యక్తిత్వం నేర్పే శక్తి నేటి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్లకు ఉన్నదంటారా!?" అనే ప్రశ్న ఉంచాను. కథలను ప్రోత్సహించాలనే ఆ పోస్టు ఉద్దేశం. 
    • కథలను ప్రోత్సహిస్తున్నవారు నేటికీ ఇంకా మిగిలే ఉండడం ఆహ్వానించదగ్గ, అభినందించ దగ్గ పరిణామం. వారికి పల్లె ప్రపంచం ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది. 
    • తెలుగు సాహిత్యంలో కథల ప్రాభవం పెరగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీరంతా కథల ను ప్రోత్సహించాలని కోరుతూ కథలను ప్రోత్సహించేవారిని మనసారా అభినందిద్దామని విజ్ఞప్తి.
    • తెలుగు సాహిత్యంలో కథకి మంచి స్థానం ఉంది. మంచి కథలని ఎంపిక చేసి పాఠకులకి అందించడానికి 'కథా నిలయం', 'కథా కేళి' లాంటివి కంకణం కట్టుకుని మంచి కథలని సంచికల  వెలువరిస్తున్నాయి . 
    • మన తెలుగునాట మరో సాహిత్య వేదిక మంచి కథలని ఎంపిక చేసి కథా సంకలనంగా అందించడానికి  2012 లో  "ప్రాతినిధ్య" ఉద్భవించింది .    
    • ప్రాతినిధ్య  పౌండేషన్ ని  ప్రముఖ కథా రచయిత్రి  శ్రీమతి గండవరపు సామాన్య కిరణ్  స్థాపించారు 
    • గత సంవత్సరం మొదటి సంచికని విడుదల చేసి అందరి ఆదరణ చూరగొంది. మరలా  ఇప్పుడు 2013 ప్రాతినిధ్య కథ వెలువడనుంది. 
    • ప్రింట్ మీడియా నుండి వెలువడిన కథలనే కాకుండా వెబ్ పత్రికల నుండి వెలువడిన మంచి కథలని తీసుకుని కొత్తతరం రచయితలని పరిచయం చేయనుంది . 
    • ప్రాథినిధ్య కు ఎంపికైన కథా రచయితలకు పల్లె ప్రపంచం అభినందనలు తెలియజేస్తుంది. మంచి మనసులను తయారు చేసే మరిన్ని కథలు వీరంతా వ్రాయాలని అభిలసిస్తోంది.

    ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక , ఆనాటి కార్యక్రమ వివరాలు ఈక్రింది ఆహ్వాన పత్రిక  లో ఉన్నాయి . అందరూ ఆహ్వానితులే !

    (30-11-2014)









    Post a Comment

    1. 2013 ప్రాతినిధ్యకు ఎంపికైన వారిలో నాకు తెలిసిన వారిలో మన వనజ గారు, బెడదకోట సుజాత గారు ఉన్నారు. వీరితో పాటు మిగతా 14 మంది రచయితలకు అభినందనలు. వీరి కలం నుండి మరిన్ని మంచి కథలు రావాలని కోరుకుందాం.

      ReplyDelete
    2. అభినందనం!
      కవివందనం?
      హరిచందనం!

      ReplyDelete

    * మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
    * పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
    * నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
    * పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
    * ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
    * అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

    అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
     
    Top